08-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి అవినాశి వైద్యులు, ఒక్క మహామంత్రముతోనే మీ సర్వ దుఃఖాలను దూరము చేసేస్తారు ''
ప్రశ్న :- మాయ మీ మధ్యలో విఘ్నాలు ఎందుకు కలిగిస్తుంది? కారణాలు చెప్పండి ?
జవాబు :- ఎందుకంటే మీరు మాయకు గొప్ప గిరాకీలు (మాయ నుండి కొనుగోలు చేయువారు). దాని గిరాకి (వ్యాపారము) సమాప్తమైపోతుంది, అందువలన విఘ్నాలు కలుగజేస్తుంది. అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయ జబ్బు ఉప్పొంగుతుంది, పైకి వస్తుంది అందువలన విఘ్నాలకు భయపడరాదు. మన్మనాభవ మంత్రము ద్వారా మాయ పారిపోతుంది.
ఓంశాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మానవులు మన: శాంతి మన: శాంతి అంటూ వ్యాకులపడ్తున్నారు. ప్రతి రోజు ''ఓంశాంతి'' అని కూడా అంటారు. కానీ దీని అర్థము తెలియనందున శాంతి కావాలని వేడుకుంటూ ఉంటారు. ఐ యామ్ సోల్ (నేను ఒక ఆత్మ) అని కూడా అంటారు. అనగా అయామ్ సైలెన్స్ (నేను శాంతి స్వరూపమును). నా స్వధర్మము శాంతి అని అర్థము. స్వధర్మము శాంతి అయితే మళ్లీ శాంతి కొరకు వేడుకునేది ఎందుకు? అర్థము తెలియనందున వేడుకుంటూనే ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు. కానీ రావణుడు పూర్తి ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి శత్రువని, అందుకే రావణుని తగులబెట్తూ ఉంటారని అర్థం చేసుకోరు. ప్రతి సంవత్సరము కాల్చి వేయబడే మానవుడు ఎవరైనా ఉన్నాడా? ఇతడిని జన్మ-జన్మాంతరాల నుండి కల్ప-కల్పాంతరాల నుండి తగులబెట్తూ వచ్చారు. ఎందుకంటే ఇతను మీకు చాలా పెద్ద శత్రువు........... అందరూ 5 వికారాలలో చిక్కుకొని ఉన్నారు. జన్మయే భ్రష్టాచారము ద్వారా జరిగినందున ఇది రావణ రాజ్యంగా అయ్యింది. ఈ సమయములో అంతులేని దుఃఖముంది. దీనికి నిమిత్తమెవరు? రావణుడు. దుఃఖము ఎందువలన కలుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఈ రాజ్యమే రావణునిది. అందరికంటే పెద్ద శత్రువు ఇతడే. ప్రతి సంవత్సరము అతని బొమ్మ చేసి తగులబెట్తూ ఉంటారు, రోజురోజుకు సైజు(పరిమాణము) ఇంకా పెంచుతూ పోతున్నారు. దుఃఖము కూడా అలాగే పెరుగుతూ ఉంది. రావణుడు మనకు శత్రువని, అందుకే అతనిని ప్రతి సంవత్సరము తగులబెట్తున్నామని పెద్ద పెద్ద సాధువులకు, సన్యాసులకు కూడా తెలియదు. తగులబెట్టిన తర్వాత సంతోషముతో పండుగ చేసుకుంటారు. రావణుడు చనిపోయాడని మనము లంకకు అధికారులుగా అయ్యామని భావిస్తారు. కానీ అధికారులుగా అవ్వలేరు. ఎంతో ధనము ఖర్చు చేస్తారు. తండ్రి అంటున్నారు - మీకు లెక్కలేనంత ధనమునిచ్చాను. అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? దశరా పండుగను లక్షలు లక్షలు ఖర్చు చేసి జరుపుకుంటున్నారు. రావణుని చంపి మళ్లీ లంకను దోచుకున్నామని అంటారు. రావణుని తగులబెట్టేదెందుకో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అందరూ ఈ వికారాల జైలులో పడి ఉన్నారు. అర్ధకల్పము రావణుని తగులబెట్త్తారు. ఎందుకంటే దుఃఖములో ఉన్నారు. రావణ రాజ్యములో మేము చాలా దుఃఖములో ఉన్నామని అర్థము కూడా చేసుకుంటారు. సత్యయుగములో 5 వికారాలుండవని వారికి తెలియదు. రావణుని తగులబెట్టడం మొదలైనవేవీ అక్కడ ఉండవు......... ఇది ఎప్పటి నుండి చేస్తున్నారని అడిగితే అనాదిగా జరుగుతూ ఉందని అంటారు. రక్షాబంధనము ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది? అనాదిగా అంటారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు కదా. మానవుల బుద్ధి ఎలా తయారయిందో చూడండి. జంతువులూ కారు, మనుష్యులూ కారు. దేనికీ పనికిరారు. స్వర్గమంటే ఏమిటో తెలియనే తెలియదు. భగవంతుడు ప్రపంచాన్ని తయారు చేశారని భావిస్తారు. దుఃఖములో ''ఓ భగవంతుడా! ఈ దుఃఖము నుండి విడిపించు'' అని స్మృతి చేస్తారు. కానీ కలియుగములో సుఖము ఉండనే ఉండదు. దుఃఖము తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మెట్లు దిగి తీరాల్సిందే. నూతన ప్రపంచము నుండి పాత ప్రపంచము చివరివరకు గల రహస్యాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు దగ్గరకు వస్తూనే అన్ని దుఃఖాలకు ఒకే మందు అని చెప్తున్నారు. వారు అవినాశి వైద్యుడు కదా. 21 జన్మలకు అందరినీ దుఃఖముల నుండి విముక్తి చేస్తారు. ఆ వైద్యులైతే, వారే రోగగ్రస్తులుగా అవుతారు. వీరు అవినాశి వైద్యుడు. దుఃఖము కూడా అపారంగా ఉంటుంది, సుఖము కూడా అపారంగా ఉంటుందని మీకు తెలుసు. తండ్రి అపారమైన సుఖమునిస్తారు. అక్కడ దుఃఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. మందు సుఖీలుగా చేసేందుకే ఇస్తారు. కేవలం నన్ను స్మృతి చేస్తే పావనంగా, సతోప్రధానంగా అవుతారు. దుఃఖాలన్నీ దూరమైపోతాయి. ఆ తర్వాత సుఖమే సుఖముంటుంది. తండ్రి దుఃఖహర్త-సుఖకర్త అనే గాయనముంది. అర్ధకల్పము వరకు అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.
ఇది ఆత్మ మరియు శరీరము - రెండింటి ఆట. నిరాకార ఆత్మ అవినాశి. సాకార శరీరము వినాశి. ఇది ఈ రెండింటి ఆట. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహ సహితంగా, దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇప్పుడు మేము వాపస్ వెళ్లాలని భావించండి. పతితులు వెళ్లేందుకు వీలు లేదు. అందుకే మామేకమ్ యాద్‌కరో(నన్ను ఒక్కరినే స్మృతి చేయండి). మీరు సతోప్రధానంగా అవుతారు. తండ్రి వద్ద మందు ఉంది కదా. మాయ తప్పకుండా విఘ్నాలు కలిగిస్తుందని కూడా తెలుపుతున్నాను. మీరు రావణుని ఖాతాదారులు కదా. అతని గిరాకులు వెళ్లిపోతే తప్పకుండా ఇబ్బంది పెడ్తాడు. ఇది చదువు అని తండ్రి తెలిపిస్తున్నారు. ఏ మందూ లేదు. ఇది స్మృతియాత్ర అనే మందు. ఒకే మందు ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కానీ మీరు నన్ను నిరంతరము స్మృతి చేసే పురుషార్థము చేయాలి. భక్తిమార్గములో కొంతమంది నోరు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక మంత్రము, కొంతమంది రామ నామము జపిస్తూనే ఉంటారు. వారికి గురువిచ్చిన మంత్రము లభించి ఉంటుంది. ప్రతి రోజు ఇన్నిసార్లు జపము చేయాలని చెప్పి ఉంటారు. వారికి రామ నామమునే జపము చేయమని చెప్తారు. దీనినే రామనామాన్ని దానము చేయడమని అంటారు. ఇలాంటి సంస్థలు చాలా తయారై ఉన్నాయి. రామ-రామ అని జపము చేస్తూ ఉంటే ఏ జగడాలు చేయకుండా బిజీగా ఉంటారు. ఎవరైనా ఏమైనా అన్నా బదులు చెప్పరు. అయితే చాలా కొద్దిమంది ఇలా చేస్తారు. కానీ ఇక్కడ తండ్రి చెప్తున్నారు - నోటితో రామ-రామ అని చెప్పనవసరము లేదు. ఇది అజపాజపము. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. నేను ఏమీ రాముడిని కానని తండ్రి చెప్తున్నారు. రాముడు త్రేతా యుగానికి చెందినవాడు. అక్కడ అతని రాజ్యముండేది. కనుక ఆ రాముని జపించే పని లేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - భక్తిమార్గములో ఇలా స్మృతి చేస్తారు. పూజలు చేస్తూ మీరు మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారు. ఎందుకంటే అవన్నీ అధర్మయుక్తమైనవి. ధర్మయుక్తమైనవారు ఒక్క తండి మాతమ్రే. వారిప్పుడు కూర్చొని పిల్లలైన మీకు అన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇది మర్చిపోయే(భూల్ భులయ్యా కీ ఖేల్) ఆట. ఏ తండి నుండి ఇంత అనంతమైన వారసత్వము లభిస్తుందో, వారిని స్మృతి చేస్తే వారి ముఖము మెరిసిపోతూ ఉంటుంది. సంతోషముతో ముఖము వికసిస్తుంది, ముఖము పై చిరునవ్వు వచ్చేస్తుంది. ఆ తండ్రిని స్మృతి చేసినందున మనమిలా తయారవుతామని మీకు తెలుసు. అర్ధ కల్పము వరకు మన సర్వ దుఃఖాలు దూరమైపోతాయి. కానీ బాబా కొంచెము దయ చూపుతారని కాదు. అలా జరగదు. మనము తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత సతోప్రధానంగా అవుతామని అర్థం చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణులను చూడండి, విశ్వమంతటికీ అధికారులు(మాలికులు). వారి ముఖమెంత హర్షితంగా ఉంది! ఇలా తయారవ్వాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మళ్లీ మనము ఈ విశ్వానికి యజమానులుగా అవుతాము. ఆంతరికములో సంతోషము ఉంటుంది. ఈ సంతోషపు సంస్కారమే మళ్లీ మన(ఆత్మ) వెంట వస్తుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. ఈ సమయంలో మాయ మిమ్ములను చాలా ఇబ్బంది పెడ్తుంది కూడా. మీ స్మృతిని మరపింపజేసేందుకు చాలా ప్రయత్నిస్తుంది. సదా ఇలాంటి హర్షితముఖముతో ఉండలేరు. ఏదో ఒక సమయములో అడ్డగింపబడ్తారు. మనుష్యులు జబ్బు పడినప్పుడు వారికి శివబాబాను స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు కానీ శివబాబా ఎవరో ఎవ్వరికీ తెలియకుంటే ఏమని స్మృతి చేయాలి? ఎందుకు స్మృతి చేయాలో కూడా తెలియదు. ఆ తండ్రిని స్మృతి చేస్తే మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. దేవీ దేవతలు సతోప్రధానంగా ఉంటారు కదా. దానిని దైవీ ప్రపంచమని అంటారు. మానవ ప్రపంచమని అనరు. మనుష్యులనే పేరు ఉండదు. ఫలానా దేవత అని అంటారు. అది దైవీ ప్రపంచము, ఇది మానవ ప్రపంచము. ఇవన్నీ బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఆ తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. తండ్రి అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా చివరిలో సారమైన మహామంత్రమునిస్తారు. తండ్రిని స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు. అంతేకాక మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కల్పక్రితము కూడా మీరు దేవీ దేవతలుగా అయ్యి ఉండినారు. మీ వ్యక్తిత్వము, మీ గుణాలు దేవీ దేవతల వలె ఉండేవి. అక్కడ ఎవ్వరూ తప్పు మాటలు మాట్లాడేదే లేదు. అటువంటి పనులే జరగవు. అది దైవీ ప్రపంచము, ఇది మానవ ప్రపంచము. వ్యత్యాసముంది కదా. ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ దైవీ ప్రపంచము గడచిపోయి లక్షల సంవత్సరాలయిందని మనుష్యులు భావిస్తారు. ఇక్కడ ఉన్నవారెవరినీ దేవతలని అనలేరు. దేవతలు స్వచ్ఛంగా ఉండేవారు. దేవీ దేవతలను మహాత్మలని అంటారు. మనుష్యులను ఎప్పుడూ దేవీదేవతలని అనరు. ఇది రావణ ప్రపంచము, రావణుడు చాలా బలమైన శత్రువు. ఇటువంటి శత్రువు ఎవ్వరూ ఉండరు. ప్రతి సంవత్సరము మీరు రావణుని తగులబెట్తారు. రావణుడెవరో ఎవ్వరికీ తెలియదు, ఇతను మానవుడు కాదు. 5 వికారాలనే రావణుడని అంటారు. అందుకే దీనిని రావణ రాజ్యమని అంటారు. ఇప్పుడు రాజ్యము 5 వికారాలదే కదా. అందరిలోనూ 5 వికారాలున్నాయి. ఇది ముందే తయారైన దుర్గతి-సద్గతుల ఆట. సద్గతి జరిగే సమయము మొదలైన వాటిని గురించి తండ్రి ఇప్పుడు మీకు అర్థం చేయించారు. దుర్గతి గురించి కూడా అర్థం చేయించారు. మీరే ఉన్నతమౌతారు మళ్లీ మీరే క్రింద పడ్తారు. శివజయంతి కూడా భారతదేశములోనే జరుగుతుంది. రావణ జయంతి కూడా భారతదేశములోనే జరుగుతుంది. అర్ధకల్పము దైవీ ప్రపంచము లక్ష్మీనారాయణుల, సీతారాముల రాజ్యముంటుంది. పిల్లలైన మీకిప్పుడు అందరి జీవిత చరిత్రలు తెలుసు. మొత్తం మహిమ అంతా మీదే. నవరాత్రులలో పూజలు మొదలైనవన్నీ మీకే జరుగుతాయి. మీరే స్థాపన చేస్తారు. శ్రీమతముననుసరించి మీరు ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తారు. కనుక శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి కదా. పురుషార్థము నెంబరువారుగా చేస్తూ ఉంటారు. స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇందులో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. ఈ పురుషోత్తమ సంగమ యుగము పూర్తిగా భిన్నమైనదని ఇప్పుడు మీకు తెలుసు. ఇది పాత ప్రపంచ అంత్యము మరియు నూతన ప్రపంచ ఆది సమయము. పాత ప్రపంచము పరివర్తన చేసేందుకే తండ్రి వచ్చారు. మీకు ఎంతగానో వివరంగా అర్థం చేయిస్తున్నారు కానీ మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. ఉపన్యసించిన తర్వాత ఈ పాయింట్లు అర్థం చేయించి ఉండాలని గుర్తుకు వస్తుంది. కల్ప-కల్పము ఎలా స్థాపనయిందో అదే విధంగా ఉన్నదున్నట్లుగానే జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ పదవి పొందారో అదే పదవి పొందుతారు. అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు. ఉన్నతాతి ఉన్నతమైన పదవులు పొందేవారూ ఉన్నారు, అతి తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు. అనన్యమైన పిల్లలు పోను పోను ఫలానా వారు ధనవంతుల దాసీలుగా అవుతారని, వారు రాజ కుటుంబములో దాసీలుగా, వీరు చాలా ధనవంతులుగా అవుతారని అనుభవము చేస్తారు. వారిని అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. అందరినీ అహ్వానించరు. అందరి ముఖాలు చూడలేము.
తండ్రి కూడా బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. సన్ముఖములో అందరూ చూడలేరు. ఇప్పుడు మీరు సన్ముఖములోకి వచ్చి పవిత్రంగా అయ్యారు. ఇలా కూడా జరుగుతుంది - అపవిత్రులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, కొద్దిగానైనా వింటారు కనుక దేవతలుగా అవుతారు. కొద్దిగా విన్నా ప్రభావము పడ్తుంది. వినకుంటే స్వర్గములోకి రానే రారు. కనుక ముఖ్యమైన విషయము మన్మనాభవ అని తండ్రి చెప్తున్నారు. ఈ ఒక్క మంత్రము ద్వారానే మీ సర్వ దు:ఖాలు దూరమైపోతాయి. 'మన్మనాభవ' అని తండ్రి చెప్తున్నారు, తర్వాత టీచరుగా అయ్యి మధ్యాజీభవ అని చెప్తారు. వీరు తండ్రే కాక టీచరు, గురువు కూడా అయ్యారు. ఈ మూడు రూపాల స్మృతి ఉండినా చాలా హర్షితంగా ఉండు స్థితి ఉంటుంది. తండ్రి చదివిస్తారు, వారే జతలో తీసుకెళ్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! భక్తిమార్గములో అయితే తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం వారు భగవంతుడు, మనమంతా సోదరులము అని మాత్రమే తెలుసు. తండ్రి ద్వారా ఏం లభిస్తుందో వారికి ఏమీ తెలియదు. ఆ ఒక్క తండ్రికి మనమంతా పిల్లలమని, సోదరులమని మీకు తెలుసు. ఇది అనంతమైన విషయము కదా. పిల్లలందరికి టీచరుగా అయ్యి చదివిస్తున్నారు. అందరి లెక్కాచారాలు చుక్తా చేయించి వాపస్ తీసుకెళ్తారు. ఈ ఛీ-చీ ప్రపంచము నుండి వాపస్ వెళ్లాలి. నూతన ప్రపంచములోకి వచ్చేందుకు మిమ్ములను అర్హులుగా చేస్తున్నారు. అర్హులైన వారు సత్యయుగములోకి వస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
తండ్రి కూడా బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. సన్ముఖములో అందరూ చూడలేరు. ఇప్పుడు మీరు సన్ముఖములోకి వచ్చి పవిత్రంగా అయ్యారు. ఇలా కూడా జరుగుతుంది - అపవిత్రులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, కొద్దిగానైనా వింటారు కనుక దేవతలుగా అవుతారు. కొద్దిగా విన్నా ప్రభావము పడ్తుంది. వినకుంటే స్వర్గములోకి రానే రారు. కనుక ముఖ్యమైన విషయము మన్మనాభవ అని తండ్రి చెప్తున్నారు. ఈ ఒక్క మంత్రము ద్వారానే మీ సర్వ దు:ఖాలు దూరమైపోతాయి. 'మన్మనాభవ' అని తండ్రి చెప్తున్నారు, తర్వాత టీచరుగా అయ్యి మధ్యాజీభవ అని చెప్తారు. వీరు తండ్రే కాక టీచరు, గురువు కూడా అయ్యారు. ఈ మూడు రూపాల స్మృతి ఉండినా చాలా హర్షితంగా ఉండు స్థితి ఉంటుంది. తండ్రి చదివిస్తారు, వారే జతలో తీసుకెళ్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! భక్తిమార్గములో అయితే తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం వారు భగవంతుడు, మనమంతా సోదరులము అని మాత్రమే తెలుసు. తండ్రి ద్వారా ఏం లభిస్తుందో వారికి ఏమీ తెలియదు. ఆ ఒక్క తండ్రికి మనమంతా పిల్లలమని, సోదరులమని మీకు తెలుసు. ఇది అనంతమైన విషయము కదా. పిల్లలందరికి టీచరుగా అయ్యి చదివిస్తున్నారు. అందరి లెక్కాచారాలు చుక్తా చేయించి వాపస్ తీసుకెళ్తారు. ఈ ఛీ-చీ ప్రపంచము నుండి వాపస్ వెళ్లాలి. నూతన ప్రపంచములోకి వచ్చేందుకు మిమ్ములను అర్హులుగా చేస్తున్నారు. అర్హులైన వారు సత్యయుగములోకి వస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ స్థితిని సదా ఏకరసంగా, హర్షితంగా ఉంచుకునేందుకు తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని (మూడు రూపాలలో) స్మృతి చేయాలి. ఇక్కడ నుండే ఖుషీ సంస్కారాలను నింపుకోవాలి. వారసత్వాల స్మృతి ద్వారా ముఖము ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉండాలి.
2. శ్రీమతమును అనుసరించి మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేయు సేవ చేయాలి. 5 వికారాలలో చిక్కుకొనిపోయిన వారిని వెలికి తీయాలి. వారి స్వధర్మము గుర్తింపు(పరిచయము)ను ఇవ్వాలి.
వరదానము :- ''స్వ రాజ్యము ద్వారా మీ సాథీలను స్నేహీ, సహయోగులుగా చేసే మాస్టర్ దాతా భవ''
రాజు అనగా దాత. దాతను అడగాల్సిన పని గాని, వేడుకునే పని గాని ఉండదు. స్వయం ప్రతి ఒక్కరు రాజులకు తమ స్నేహమనే బహుమతిని ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయం పై రాజ్యం చేసే రాజులుగా అవుతే ప్రతి ఒక్కరు మీ ముందు సహయోగమనే బహుమతిని ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయం పై రాజ్యముంటుందో వారి ముందు లౌకిక, అలౌకిక సాథీలు(స్నేహితులు) ''హాజరుగా ఉన్నాము, అలాగే మీరు చెప్పినట్లే'' అంటూ స్నేహీ సహయోగులుగా అవుతారు. పరివారంలో ఎప్పుడూ ఆజ్ఞలు చలాయించరాదు. మీ కర్మేంద్రియాలను ఆర్డర్‌లో ఉంచుకుంటే మీ సర్వ సాథీలు మీ స్నేహీ సహయోగులుగా అవుతారు.
స్లోగన్ :- ''సర్వ ప్రాప్తుల సాధనాలున్నా వృత్తి ఉపరాంగా (అతీతంగా) ఉంటే, దానిని వైరాగ్య వృత్తి అని అంటారు.''
No comments:
Post a Comment