06-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - నేను ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉన్నాను ? అని మిమ్ములను మీరే చెక్ చేసుకోండి, ఎందుకంటే లాభము స్మృతిలోనే ఉంది. విస్మృతిలో నష్టముంది ''
ప్రశ్న :- ఈ పాపాత్మల ప్రపంచములో ఏ విషయము పూర్తిగా అసంభవము - ఎందుకు?
జవాబు :- ఈ ప్రపంచములో ఎవరైనా 'మేము పుణ్యాత్మలము' అని చెప్తే అది పూర్తిగా అసంభవము ఎందుకంటే ఈ ప్రపంచమంతా కలియుగములో తమోప్రధానంగా ఉంది. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్న కార్యాలన్నీ పాపాలుగా అయిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చేసే పత్రి కర్మ వికారాలకు వశమయ్యే చేస్తున్నారు.
ఓంశాంతి. ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలము, బ్రహ్మాకుమార-కుమారీలమని పిల్లలు అర్థం చేసుకున్నారు. తర్వాత దేవీ దేవతలుగా అవుతామని మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలైన మేము అనంతమైన(బేహద్) చదువు చదువుతున్నామని మీకు తెలుసు. 84 జన్మల చదువును కూడా చదువుకుంటున్నారు, సృష్టిచక్రపు చదువు కూడా చదువుకుంటున్నారు. అంతేకాక పవిత్రంగా అవ్వాలనే శిక్షణ కూడా మీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చొని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. మేము సత్య-సత్యంగా తండ్రి స్మృతిలో ఉన్నామా? లేక మాయా రావణుడు బుద్ధిని మరోవైపు తీసుకెళ్లాడా? అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. తండ్రి అంటున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే(మామేకమ్ యాద్ కరో) మీ పాపాలు నశిస్తాయి. '' మేము బాబా స్మృతిలో ఉన్నామా లేక నా బుద్ధి ఎక్కడకైనా వెళ్లిందా ? '' అని ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎంత సమయము మేము తండ్రి స్మృతిలో ఉన్నాము, ఎంత సమయము మా బుద్ధి పక్కకు పోయింది? అని మీకు గుర్తుండాలి. మీ స్థితిని గమనించండి. ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తారో, అంత మాత్రమే మీరు పావనమౌతారు. లాభ-నష్టాల లెక్కాచారము కూడా(చార్టు) ఉంచుకోవాలి. అలవాటైతే గుర్తు కూడా ఉంటుంది, వాస్త్రూ ఉంటారు. అందరి వద్ద(పాకెట్‌లో) డైరీ ఉండనే ఉంటుంది. వ్యాపారస్థుల డైరీ హద్దులోనిది. మీది బేహద్ డైరి. మీరు మీ చార్టు వ్రాస్తూ ఉండాలి. తండ్రి ఆదేశిస్తున్నారు - వృత్తి వ్యాపారాదులన్నీ చేసుకోండి కానీ కొంత సమయాన్ని కేటాయించి నన్ను స్మృతి చేయండి. మీ లెక్కాచారము(చార్టు) గమనిస్తూ లాభము పెంచుకుంటూ ఉండండి, నష్టపోకండి. మీది యుద్ధము కదా. ఒక్క క్షణములో లాభము, ఒక్క క్షణములో నష్టము కలుగుతూ ఉంటుంది. మేము లాభము పొందుకున్నామా? లేక నష్టపోయామా? అని వెంటనే తెలిసిపోతుంది. మీరు వ్యాపారస్థులు కదా. చాలా కొంతమందే ఈ వ్యాపారము చేస్తారు. స్మృతి వలన లాభము, విస్మృతి వలన నష్టము కలుగుతుంది. ''నేను ఎంత సమయము విస్మృతిలో ఉన్నాను?'' అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. గమనించుకునే తపన ఉన్నత పదవి పొందుకునే వారికి మాత్రమే ఉంటుంది. నాకు ఈ తపన ఉందా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఆత్మలైన మనందరి తండ్రి పతితపావనులని పిల్లలైన మీకు తెలుసు. మనమంతా నిజానికి ఆత్మలము. మన ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము. ఈ శరీరము ధరించి పాత్రను అభినయిస్తున్నాము. శరీరము వినాశనమవుతుంది. ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. బాబా అడుగుతున్నారు - '' ఓ ఆత్మలారా! స్మృతి చేయండి, ఈ జన్మలో బాల్యములో ఏవైనా వికర్మలు, చెడు పనులు చేయలేదు కదా? '' అని గుర్తుకు తెచ్చుకోండి - 3, 4 సంవత్సరాల వయస్సు నుండి జ్ఞాపకముంటుంది. బాల్యమును ఎలా గడిపాము? ఏమేమి చేశాము? ఏదైనా విషయము మనస్సును లోలోపల తినడం లేదు కదా? అని గుర్తు చేసుకోండి. సత్యయుగములో పాప కర్మలే ఉండవు. అడగవలసిన పనే ఉండదు. ఇక్కడ పాపాలు జరుగుతూనే ఉంటాయి. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్నవన్నీ పాపాలే. ఇది పాపాత్మల ప్రపంచము. మీరు ఇచ్చి-పుచ్చుకునేది కూడా పాపాత్మలతోనే. పుణ్యాత్మలు ఇక్కడ లేనే లేరు. పుణ్యాత్మల ప్రపంచములో ఒక్క పాపాత్మ కూడా ఉండరు. పాపాత్మల ప్రపంచములో ఒక్క పుణ్యాత్మ కూడా ఉండరు. ఏ గురువుల పాదాల పై పడ్తున్నారో, వారిలో ఒక్కరు కూడా పుణ్యాత్మలు లేరు. ఇది కలియుగము, తమోప్రధానమైనందు వలన ఇందులో ఒక్క పుణ్యాత్మ ఉండడం కూడా అసంభవము. పుణ్యాత్మలుగా అయ్యేందుకే ''మీరు వచ్చి మమ్ములను పావనాత్మలుగా చేయండి'' అని తండ్రిని పిలుస్తారు. అంతేకాని చాలా దాన-పుణ్యాలు చేసేవారు, ధర్మశాలలు మొదలైనవి కట్టించేవారు పుణ్యాత్మలని కాదు. వివాహాల కొరకు కళ్యాణమంటపాలు మొదలైనవి కట్టిస్తారు. వారు పుణ్యాత్మలు కాదు. ఇవి బాగా అర్థము చేసుకునే విషయాలు. ఇది రావణ రాజ్యము. పాపాత్మల ఆసురీ ప్రపంచము. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. భలే రావణుడు ఉన్నాడు కానీ అతడిని గుర్తించలేరు. శివుని చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారిని గుర్తించలేరు. పెద్ద పెద్ద శివలింగాలు మొదలైనవి నిర్మిస్తారు. అలా నిర్మిస్తారు అయినా నామ-రూపాలకు భిన్నమైనవారని, సర్వవ్యాపి అని అంటారు. అందుకే తండ్రి అంటున్నారు - యదా యదాహి............... భారతదేశములోనే శివబాబాను గ్లాని చేస్తారు. ఏ తండ్రి మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేస్తారో అటువంటి తండ్రిని మానవ మతాలను అనుసరించి ఎంతగానో నిందిస్తారు. మానవ మతము - ఈశ్వరీయ మతము అనే పుస్తకము కూడా ఉంది కదా. మానవులు శ్రీమతమును అనుసరించి దేవతలుగా అవుతారని మీకు మాత్రమే తెలుసు, మీరు మాత్రమే అర్థము చేయించగలరు. రావణ మతముననుసరించి మళ్లీ ఆసురీ మానవులుగా అవుతామని మీకు తెలుసు. మానవుల మతమును ఆసురీ మతమని అంటారు. ఆసురీ కర్తవ్యములే చేస్తూ ఉంటారు. ముఖ్యమైనది - ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు. మత్సావతారము, కూర్మావతారము........ అని అంటూ చాలా అసురులుగా, ఛీ-ఛీగా అయిపోయారు. ఆత్మలైన మీరు చేపలుగా, తాబేలుగా జన్మించరు, మానవ శరీరములోకే వస్తారు. ఇప్పుడు మనము చేపలుగా, తాబేలుగా అవ్వము, 84 లక్షల యోనులలోకి రామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా శ్రీమతము లభిస్తోంది - పిల్లలారా, మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84కు, 84 లక్షలకు ఎంత శాతమంటారు! అసత్యములో కూడా పూర్తిగా అసత్యము(శుద్ధ అబద్ధము). గురిగింజంత(రవ్వంత) సత్యము కూడా లేదు. దీని అర్థమును కూడా తెలుసుకోవాలి. భారతదేశ స్థితి ఎలా ఉందో గమనించండి! భారతదేశము ఒకప్పుడు సత్యమైన ఖండముగా ఉండేది, దానినే స్వర్గమనేవారు. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. రావణ రాజ్యమంటే ఆసురీ సంప్రదాయమని అంటారు. ఇది ఎంత కఠినమైన శబ్ధము! అర్ధకల్పము దేవతల రాజ్యము నడుస్తుంది. ఎలా ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకెండ్.............. అని అంటారో అలా అక్కడ లక్ష్మీనారాయణ ది ఫస్ట్, ది సెకెండ్, ది థర్డ్ అని అంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదటి తరము, తర్వాత రెండవ తరము, ఇలా నడుస్తూ ఉంటుంది. మీలో కూడా మొదట సూర్యవంశము తర్వాత చంద్రవంశము. తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా చాలా బాగా అర్థము చేయిస్తున్నారు. మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. కొన్ని కొన్ని శాస్త్రాలలో చాలా కొద్దిగా(ఒక గీత వలె) చూపించారు. కానీ ఆ సమయములో ఆ పుస్తకాలు వ్రాసినవారు కూడా ఏ మాత్రమూ అర్థము చేసుకోలేదు.
ఈ బాబా కూడా బెనారస్‌కు(కాశీకి) వెళ్లినప్పుడు, ఆ సమయములో ఈ ప్రపంచమే నచ్చలేదు అచ్చట కనబడిన గోడలన్నిటి పై గీతలు గీస్తూ ఉండేవాడు. ఇవన్నీ తండ్రి చేయించేవారు. కానీ ఆ సమయంలో నేను చిన్నబాలుడను కదా. పూర్తిగా అర్థమయ్యేది కాదు. కానీ ఎవరో నాతో చేయిస్తున్నారని మాత్రము అనిపించేది. కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. వినాశనము చూచినప్పుడు ఆంతరికములో సంతోషము కూడా ఉండేది. రాత్రుళ్లు నిదురించేటప్పుడు కూడా ఎగురుతున్నట్లుండేది. కానీ అర్థమయ్యేది కాదు. ఊరికే గీతలు గీస్తూ ఉండేవాడిని. ఏదో శక్తి ప్రవేశించిందనిపించేది, ఆశ్చర్యపడేవాడిని. మొదట్లో వ్యాపారము చేసేవాడిని. తర్వాత ఏమయిందో తెలియదు. ఎవరిని చూసినా వారు ట్రాన్స్(ధ్యానము)లోకి వెళ్లిపోయేవారు. ఏమౌతోంది? ఎవరిని చూచినా వారి కనులు మూతపడేవి. ఏమి చూచారు? అని వారిని అడిగితే వైకుంఠము చూచాము, కృష్ణుని చూచాము అని అనేవారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు కదా. అందుకే అంతా వదిలేసి, అర్థము చేసుకునేందుకు బనారస్ వెళ్లిపోయాను. రోజంతా కూర్చుని ఉండేవాడిని. పెన్సిలు, గోడ ఇవి తప్ప వేరే పనే లేదు. పసివాడిని(జ్ఞానములో) కదా. ఇవన్నీ చూచిన తర్వాత ఇంకేమీ చేయరాదని అనుకున్నాను. వ్యాపారము మొదలైనవి వదిలేయాల్సి వస్తుందని తలచాను. ఈ గాడిద బరువును వదిలేయాలంటే చాలా సంతోషంగా ఉండేది. ఇది రావణ రాజ్యము కదా. రావణునికి గాడిద తలను చూపిస్తారు కదా. అందువలన ఇది రాజ్యము కాదు, గాడిద బరువనిపించింది. గాడిద మాటిమాటికి మట్టిలో పొర్లాడి, ఉతికిన చాకలి బట్టలన్నీ పాడు చేస్తుంది. తండ్రి కూడా అంటున్నారు - మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు మీ స్థితి ఎలా పాడైపోయింది? ఇవన్నీ ఆ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇరువురిదీ నడుస్తూ ఉంటుంది. జ్ఞానము బాగా అర్థము చేసుకున్నవారిని చురుకైనవారని అంటారు. నంబరువారుగా ఉంటారు కదా. ఈ రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు. తప్పకుండా నెంబరువారుగా పదవి పొందుతారు. ఆత్మయే కల్ప-కల్పము తన పాత్రను అభినయిస్తూ ఉంటుంది. అందరూ ఒకే విధమైన జ్ఞానులుగా ఉండరు. ఈ స్థాపనా కార్యక్రమమే అద్భుతమైనది. ఈ స్థాపనా జ్ఞానమును మరెవ్వరూ ఇవ్వలేరు. సిక్కు ధర్మ స్థాపన జరిగిందనుకోండి, శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ప్రవేశించిన కొంత సమయము తర్వాత సిక్కు ధర్మ స్థాపన జరిగింది. వారి హెడ్(పెద్ద) ఎవరు? - గురునానక్. వారు వచ్చి జప్ సాహెబ్‌ను తయారు చేశారు. మొదట నూతన ఆత్మనే ఉంటుంది. ఎందుకంటే పవిత్ర ఆత్మగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నవారిని మహాత్ములని అంటారు. సుప్రీమ్(అత్యంత శ్రేష్ఠము) అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు కూడా ధర్మస్థాపన చేస్తారు కాబట్టి మహాన్ అని అంటారు. కానీ నంబరువారుగా క్రిందకు వస్తారు. 500 సంవత్సరాల క్రితము ఒక ఆత్మ వచ్చి సిక్కు ధర్మస్థాపన చేసింది. అప్పుడు గ్రంథము ఎక్కడి నుండి వస్తుంది! సుఖమణి, జప్ సాహ్‌బ్ మొదలైనవి ఆ తర్వాతనే తయారై ఉంటాయి కదా. ఎలాంటి శిక్షణ ఇస్తారు. ఉల్లాస-ఉత్సాహములున్నప్పుడు కూర్చొని తండ్రిని మహిమ చేస్తారు. పోతే ఈ పుస్తకాలు మొదలైనవన్నీ చాలామంది అయిన తర్వాత తయారవుతాయి. ఎందుకంటే చదివేవారు కూడా కావాలి కదా. అన్ని ధర్మశాస్త్రాలు తర్వాతనే తయారై ఉంటాయి. భక్తిమార్గము మొదలైనప్పుడే శాస్త్రాలు చదువుతారు. జ్ఞానము కూడా కావాలి కదా. మొదట సతోప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. చాలా వృద్ధి చెందినప్పుడు మహిమ ఉంటుంది. అప్పుడే శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవుతాయి. లేకుంటే వృద్ధి ఎవరు చేస్తారు? శిష్యులు తయారైతే కదా. సిక్కు ధర్మానికి చెందిన ఆత్మలు వచ్చి అనుసరిస్తారు. కానీ దానికి చాలా సమయము పడ్తుంది.
కొత్త ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి దుఃఖముండదు. ఆ నియమము లేదు. ఆత్మ సతోప్రధానము నుండి సతో, రజో, తమో గుణములోకి వచ్చినప్పుడు దుఃఖము కలుగుతుంది. ఇది కూడా చట్టమే కదా. ఇక్కడ మిక్స్(కల్తీ)గా ఉన్నారు. రావణ సంప్రదాయము, రామ సంప్రదాయము రెండూ ఉన్నాయి. ఇంకా సంపూర్ణమవ్వలేదు. సంపూర్ణమైతే శరీరము వదిలేస్తారు. కర్మాతీత స్థితిని పొందుకున్న వారెవ్వరికీ దుఃఖముండదు. వారు ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండరు. వారు వెళ్లిపోతారు. మిగిలినవారికి ఇంకా కర్మాతీత స్థితి తయారై ఉండదు. అందరికీ ఒకేసారి కర్మాతీత స్థితి రాదు. వినాశనము జరిగినా ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు. పళ్రయము జరగదు. రాముడూ పోయాడు, రావణుడూ పోయాడు....... అని పాడ్తారు కదా. రావణుని పరివారము చాలా పెద్దది. మన పరివారము చాలా చిన్నది. అక్కడ ధర్మాలు ఎన్ని ఉన్నాయి! వాస్తవానికి మన పరివారము చాలా పెద్దదిగా ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే మొదటి ధర్మము దేవీ దేవతా ధర్మము. ఇప్పుడైతే అంతా కలిసిపోయారు. క్రైస్తవులుగా చాలామంది అయ్యారు. సుఖమెక్కడ కనిపిస్తుందో, హోదా ఎక్కడ లభిస్తుందో ఆ ధర్మమువారిగా అయిపోతారు. పోప్ వస్తే చాలామంది క్రైస్తవులుగా అవుతారు. ఆ తర్వాత చాలా వృద్ధి కూడా జరుగుతుంది. సత్యయుగములో ఒక పుత్రుడు, ఒక పుత్రిక మాత్రమే ఉంటారు. ఇక ఏ ఇతర ధర్మమూ ఇలా వృద్ధి చెందదు. ఇప్పుడు చూస్తే అన్నిటికంటే క్రైస్తవ ధర్మము చాలా అధికంగా ఉంది. చాలామంది సంతానమున్న వారికి బహుమతులు లభిస్తాయి. ఎందుకంటే వారికి మనుష్యులు కావాలి కదా. వారు మిలిటరీలో, సైన్యములో ఉపయోగపడ్తారు. అందరూ క్రైస్తవులే. రష్యా, అమెరికా రెండింటిలో క్రిస్టియన్లే ఉన్నారు. రెండు కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వెన్న తిని పోయిందని ఒక కథ ఉంది కదా. ఇది కూడా డ్రామాలో తయరై ఉంది. ఇంతకుముందు హిందువులు, ముస్లింలు కలిసి ఉండేవారు. వేరైనప్పుడు పాకిస్థాన్ క్రొత్త దేశంగా నిలబడింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఇద్దరు కొట్లాడితే తుపాకులు, ఫిరంగులు తీసుకుంటారు. వ్యాపారము జరుగుతుంది. వారికిది అత్యంత గొప్ప వ్యాపారము. కానీ ఈ డ్రామాలో మీ విజయము నూటికి నూరు శాతము ఖచ్ఛితము. మిమ్ములను ఎవ్వరూ జయించలేరు. మిగిలినవారంతా సమాప్తమైపోతారు. నూతన ప్రపంచములో మన రాజ్యమే ఉంటుంది. అందుకే చదువుతున్నారు, అర్హులుగా అవుతారు. మీరు అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు అనర్హులుగా అయ్యారు మళ్లీ అర్హులుగా అవ్వాలి. పతితపావనా! రండి అని పాటలు పాడ్తారు. కానీ అర్థమే తెలియదు. ఇదంతా ఇప్పుడు ఒక అడవి. ఇప్డుడు తండ్రి వచ్చారు, వారు వచ్చి ముళ్ళ అడవిని పూలతోటగా చేస్తున్నారు. అది దైవీ(డైటీ) ప్రపంచము. ఇది భూతాల(డెవిల్) ప్రపంచము. ఈ మానవ సృష్టి రహస్యమంతటినీ ఆ తండ్రి అర్థం చేయించారు. తమ ధర్మమును మర్చిపోయి ధర్మ భ్రష్ఠులైపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందువలన మీరు చేసే కర్మలన్నీ వికర్మలుగానే ఉంటాయి. కర్మ-అకర్మ-వికర్మల గతిని తండ్రి మీకు అర్థం చేయించి వెళ్లిపోయారు. నిన్న మనము ఇలా ఉండేవారమని, ఈ రోజు మళ్లీ అలా అవుతున్నామని మీకు తెలుసు. సమీపములోనే ఉంది కదా. బాబా అంటున్నారు - నిన్న మిమ్ములను దేవతలుగా చేసి రాజ్యభాగ్యమును ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తిమార్గములో ఎంత ధనము పోగొట్టుకున్నారో మీకు గుర్తుకొచ్చిందా? ఇది నిన్నటి మాటే కదా. తండ్రి వచ్చి అరచేతిలో వైకుంఠము తెచ్చి ఇస్తున్నారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఈ కనులెంత మోసము చేస్తాయో కూడా తండ్రి మీకు అర్థం చేయించారు. వికారీ దృష్టిని జ్ఞానముతో పవిత్రంగా చేసుకోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ బేహద్ డైరీలో ''నేను స్మృతిలో ఉండి ఎంత లాభం పొందాను?'' అని చార్టు వ్రాసుకోవాలి. నష్టపోలేదు కదా? స్మృతి చేయు సమయములో బుద్ధియోగము ఎక్కడెక్కడకు పోయింది? అని నోట్ చేసుకోవాలి.
2. ఈ జన్మలో బాల్యము నుండి ఏ ఏ విరుద్ధ కర్మలు లేక పాప కర్మలు చేశానని నోట్ చేయాలి? ఏ విషయాలలో మీ మనసు తింటూ ఉంటుందో, దానిని తండ్రికి వినిపించి తేలికగా అవ్వాలి. ఇప్పుడు ఏ పాప కర్మా చేయరాదు.
వరదానము :- '' '' మంచి '' పై ప్రభావితమయ్యేందుకు బదులు ఆ మంచిని స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహీ భవ ''
పరమాత్మ స్నేహీలుగా అవ్వాలంటే దేహాభిమానము వలన కలిగే ఆటంకాలను చెక్ చేసుకోండి(ఆపేయండి). చాలామంది పిల్లలు వీరు చాలా మంచివారు, కనుక కొంచెం దయ కలుగుతుంది...... అని అంటారు. కొందరికి కొంతమంది శరీరాల పై ఆకర్షణ ఉంటుంది. కొంతమందికి కొందరి గుణాలు లేక విశేషతల పై ఆకర్షణ ఉంటుంది. కానీ ఆ విశేషతలు లేక గుణాలు ఇచ్చేవారెవరు? ఏదైనా మంచి ఉంటే, ఆ మంచిని భలే ధారణ చేయండి కానీ వారి పై ప్రభావితమవ్వకండి. అతీతంగా తండ్రికి ప్రియంగా అవ్వండి.
స్లోగన్ :- '' సైలెన్స్ శక్తిని ఎమర్జ్ (ఉత్పన్నం) చేసుకుంటే, సేవ వేగంగా జరుగుతుంది ''
No comments:
Post a Comment