04-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మొట్టమొదట అందరికీ అల్ఫ్(భగవంతుని) పాఠాన్ని పక్కా చేయించండి, మీరంతా ఆత్మలు పరస్పరములో సోదరులు(భాయి - భాయి). ''
ప్రశ్న :- ఏ విషయములో శ్రీమతము, మానవ మతము నుండి పూర్తి విపరీతంగా ఉంది ?
జవాబు :- '' మేము మోక్షములోకి వెళ్తాము '' అని మనుష్య మతము చెప్తుంది. ''ఈ డ్రామా అనాది, అవినాశి'' అని శ్రీమతము చెప్తుంది. మోక్షము ఎవ్వరికీ లభించదు. ఈ పాత్రను అభినయించేందుకు నాకు ఇష్టము లేదని ఎవరు చెప్పినా ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావలసిందే. శ్రీమతం ఒక్కటే మిమ్ములను శ్రేష్ఠంగా చేస్తుంది. మానవ మతాలైతే అనేక ప్రకారాలుగా ఉన్నాయి.
ఓంశాంతి. మేము బాబా ఎదురుగా కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చొని ఉన్నారని తండ్రికి కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారని, దానిని మనము ఇతరులకు ఇవ్వాలని కూడా పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని, వారిచ్చిన శిక్షణలను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి చదివించే చదువు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇతరులెవ్వరికీ లేనే లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము, ఆ తర్వాత ఇదంతా అర్థం చేయించాలి. మనమంతా సోదరులము. ప్రపంచములోని ఆత్మలంతా పరస్పరము సోదరులే. అందరూ వారికి లభించిన తమ-తమ పాత్రలను ఈ శరీరాల ద్వారా అభినయిస్తున్నారు. నూతన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దానిని స్వర్గమని అంటారు. అయితే ఇప్పుడు సోదరులమైన మనమంతా పతితులుగా ఉన్నాము. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. పతితులందరినీ పావనంగా చేయువారు ఆ తండ్రి ఒక్కరే. ఇది పతిత వికారీ రావణ ప్రపంచము. రావణుడంటే స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. తండ్రి చాలా సులభమైన(సింపుల్) పద్ధతిలో అర్థం చేయిస్తున్నారు, మీరు కూడా ఇతరులకు ఇలాగే అర్థం చేయించండి. మొట్టమొదట వారు ఆత్మలమైన మన తండ్రి అని, మనమంతా సోదరులమని అర్థం చేయించండి. ఇది సరియైనదేనా? అని అడగండి. మనమంతా సోదరులము (భాయి-భాయి) అని వ్రాయండి. మన అందరి తండ్రి కూడా ఒక్కరే. మనమంతా ఆత్మలము. వారు పరమ-ఆత్మ(సుప్రీమ్‌సోల్). వారిని అందరూ తండ్రి అని అంటారు. ఇది పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్తే సర్వవ్యాపి మొదలైన చెత్త, మురికి అంతా తొలగిపోతుంది. మొదట భగవంతుని(అల్ఫ్) గురించి చదివించాలి. ''మొదట సర్వవ్యాపి అని అంటూ ఉండేవాడిని, కానీ పరమాత్మ సర్వవ్యాపి కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నాను'' అని అర్థం చేయించిన తర్వాత వారితో వ్రాయించండి. మనమంతా సోదరులము. ఆత్మలంతా వారిని గాడ్‌ఫాదర్, పరమపిత పరమాత్మ, అల్లా అని అంటారు. మనమంతా ఆత్మలము, పరమాత్మ కాదు అని మొదట నిశ్చయము చేయించాలి. పరమాత్మ మాలో సర్వవ్యాపకంగా లేరు. అందరిలో ఆత్మ వ్యాపకంగా ఉంది. ఆత్మ శరీరము ఆధారముతో పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. ఆ తండ్రి వచ్చి ఈ సృష్టిచక్రము ఆదిమధ్యాంతాల జ్ఞానము వినిపిస్తున్నారు. ఆ తండ్రియే టీచరు రూపములో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ చక్రము అనాదిగా తయారై ఉంది. సమానంగా ఎట్లుందో కూడా తెలుసుకోవాలి. సత్య-త్రేతా యుగాలు గతించి పోయాయని నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము, సెమీ స్వర్గమని అంటారు. అక్కడ దేవీ దేవతల రాజ్యము నడుస్తుంది. సత్యయుగములో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. సత్యయుగ ప్రభావము చాలా గొప్పది. దాని పేరే స్వర్గము, హెవెన్. సత్యయుగమును నూతన ప్రపంచమని అంటారు. దానినే మహిమ చేయాలి. నూతన ప్రపంచములో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మముంటుంది. నిశ్చయము చేయించేందుకు మీ వద్ద చిత్ర్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టిచక్రము తిరుగుతూనే ఉంటుంది. కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశమంటే ఏమిటో, చంద్రవంశమంటే ఏమిటో బుద్ధిలో కూర్చుంది కదా. విష్ణుపురమే పరివర్తనై సీతా-రాముల పురంగా అవుతుంది. వారి వంశము కూడా నడుస్తుంది కదా. రెండు యుగాలు గతించిన తర్వాత మళ్లీ ద్వాపరయుగము వస్తుంది. అది రావణ రాజ్యము. దేవతలు వామమార్గము(వేద విరుద్ధమైన తంత్ర-మంత్రములతో కూడి మధు,మాంస, మిధునత్వాలకు తావిచ్చెడి జీవితము)లోకి వెళ్లిపోతారు. అప్పటి నుండి వికారాల పద్ధతి తయారవుతుంది. సత్య-త్రేతా యుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఆదిసనాతనా దేవీ దేవతా ధర్మమొక్కటే ఉంటుంది. చిత్రాలు చూపిస్తూ, నోటితో కూడా అర్థం చేయించాలి. ఆ తండ్రి, టీచరుగా అయ్యి మనలను ఇలా చదివిస్తున్నారు. తండ్రి వచ్చి తన పరిచయము తానే ఇస్తున్నారు - '' పతితులను పావనంగా చేసేందుకు నేను వస్తాను, కనుక నాకు తప్పకుండా శరీరము కావాలి.'' లేకుంటే నేను ఎలా మాట్లాడాలి? నేను చైతన్యాన్ని, సత్యాన్ని, అమరుడను. ఆత్మయే సతో, రజో, తమోలోకి వస్తుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉంటాయి. జరిగిపోయిన(గత జన్మలోని) కర్మ, వికర్మల సంస్కారాలు ఆత్మయే తన వెంట తీసుకొస్తుంది. సత్యయుగములో అయితే వికర్మలు జరగనే జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు. కానీ అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఈ పదాలున్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచంగా చేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. దానినే సత్యయుగమని అంటారు. ఇక్కడ కర్మలు వికర్మలుగానే అవుతాయి. దానిని కలియుగమని అంటారు. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు బాబా ఇరువైపులా ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు. ఆ తండ్రి టీచరై, ఏమేమి అర్థం చేయిస్తున్నారో ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థము చేసుకోండి. ఆ తర్వాత గురువుగారి కర్తవ్యము, పతితులైన మమ్ములను మీరు వచ్చి, పావనంగా చేయండని పిలిచింది మీరే కదా. ఆత్మ పావనంగా అయితే శరీరము కూడా పావనంగా అవుతుంది. బంగారమెలా ఉంటుందో ఆభరణము కూడా అలాగే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారము తీసుకొని అందులో కల్తీ వేయకుంటే నగ(ఆభరణము) కూడా అదే విధంగా స్వచ్ఛంగా, సతోప్రధానంగా తయారవుతుంది. కల్తీ చేస్తే(అలాయ్ కలిపితే) తమోప్రధానంగా అవుతుంది. ఎందుకంటే ఇతర లోహము(రాగి మొదలైనవి) కలుపుతారని తెలుసు కదా. మొట్టమొదట భారతదేశము 24 క్యారెట్లు స్వచ్ఛమైన బంగారు పక్షి అనగా సతోప్రధానంగా, నూతన ప్రపంచంగా ఉండేది. అది ఇప్పుడు మళ్లీ తమోప్రధానంగా అయిపోయింది. మొట్టమొదట స్వచ్ఛమైన బంగారుగా ఉండేది. నూతన ప్రపంచము పవిత్రమైనది. పాత ప్రపంచము అపవిత్రమైనది. కల్తీ(మురికి) ఏర్పడుతూ పోతుంది. ఇదంతా ఆ తండ్రే తెలుపుచున్నారు. ఏ ఇతర మానవ గురువులకు తెలియదు. మీరు వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. సద్గురువు కర్తవ్యము వానప్రస్థ స్థితిలో ఉన్న మనుష్యులను గృహస్థము నుండి అతీతంగా చేయించడం. స్వయంగా ఆ తండ్రియే వచ్చి ఈ జ్ఞానమంతా డ్రామా ప్లాను అనుసారము ఇస్తున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. వారే స్వయంగా కల్పవృక్ష జ్ఞానమంతా పూర్తిగా అర్థం చేయిస్తున్నారు. శివబాబా పేరు ఎల్లప్పుడూ శివుడే(సదా శివుడు). మిగిలిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు భిన్న భిన్న నామ-రూపాలను ధరిస్తాయి. తండ్రినేమో పిలుస్తారు కానీ వారెవరో, వారు మిమ్ములను పావన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు భాగ్యశాలి రథములో ఎలా వస్తారో తెలియదు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారి అంతిమ జన్మలోని శరీరములో వస్తాను. రాజాధి రాజులుగా తయారు చేసేందుకు ఈ భాగ్యశాలి రథములో ప్రవేశించాల్సి వస్తుంది. మొదటి నంబరులోని వారు శ్రీకృష్ణుడు. అతడు నూతన ప్రపంచానికి అధికారి. తర్వాత అతడే క్రిందకు దిగుతాడు. సూర్యవంశి, చంద్రవంశి, వైశ్య, శూద్ర వంశీయులుగా, ఆ తర్వాత బ్రాహ్మ వంశీయులుగా అవుతాడు. బంగారు నుండి వెండి.......... మళ్లీ ఇప్పుడు మీరు ఇనుము నుండి బంగారుగా తయారవుతూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - మీ తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఎవరి శరీరములో ప్రవేశించానో, వారి ఆత్మలో కూడా మొదట కొంచెము కూడా ఈ జ్ఞానము లేదు. ఇతనిలో నేను ప్రవేశిస్తాను. అందుకే ఇతడిని భాగ్యశాలి రథమని అంటారు. వారు స్వయంగా చెప్తున్నారు - నేను ఇతని అనేక జన్మల అంత్యములో వస్తాను. గీతలో ఈ పదాలు ఆక్యురేట్(రైట్)గా ఉన్నాయి. అందుకే గీతను సర్వశాస్త్రమయి శిరోమణి అని అంటారు.
ఈ సంగమ యుగములోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులమును, దేవీ దేవతా కులమును స్థాపన చేస్తున్నారు. ఇతరుల గురించి అందరికీ తెలుసు కానీ వీరిని గురించి ఎవ్వరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మలో అనగా సంగమ యుగములోనే తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను బీజరూపమును. కృష్ణుడైతే సత్యయుగ నివాసి. ఇతర సమయాలలో, ఇతర ప్రదేశాలలో, అతనిని ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మలలో నామ, రూప, దేశ, కాలములన్నీ మారిపోతాయి. మొదట చిన్న బాలుడు చాలా సుందరంగా ఉంటాడు, తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు. తర్వాత మళ్లీ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరము తీసుకుంటాడు. ఇది తయారైన డ్రామా. డ్రామాలో అలా నిర్ణయించబడింది. తర్వాత శరీరములో అతడిని(ఆ ఆత్మను) కృష్ణుడని అనరు. తర్వాతి శరీరములో నామ-రూపాలు మొదలైనవన్నీ వేరుగా ఉంటాయి. సమయము, రూపు రేఖలు, తిథి-తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర-భూగోళము ఉన్నదున్నట్లు రిపీట్ అవుతాయని అంటారు. కనుక ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో, రజో, తమోలో తప్పకుండా రావాల్సిందే. సృష్టి పేరు, యుగము పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడిది సంగమ యుగము. నేను సంగమ యుగములోనే వస్తాను. దీనిని మనము ఆంతరికములో పక్కా చేసుకోవాలి. ఆ తండ్రి మనకు తండ్రి, టీచరు, గురువు అయ్యారు. వారు మళ్లీ మనము సతోప్రధానంగా అయ్యేందుకు యుక్తులను కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు. గీతలో కూడా - దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని ఉంది కదా. మనము ఇంటికి వాపస్ వెళ్లే తీరాలి. భగవంతుని వద్దకు వెళ్లేందుకు భక్తిమార్గములో ఎంతో శ్రమిస్తారు. అది ముక్తిధామము, కర్మల నుండి ముక్తమై మనము నిరాకార ప్రపంచములోకి వెళ్లి కూర్చుంటాము. నటించేవారు ఇంటికి వెళ్తే పాత్ర నుండి ముక్తులుగా అవుతారు. అందరూ ముక్తి పొందాలని కోరుకుంటారు. కానీ ముక్తి ఎవ్వరికీ లభించజాలదు. ఇది అనాది, అవినాశి డ్రామా. ఈ పాత్ర చేయడం నాకిష్టము లేదు అని ఎవరైనా అన్నా, ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు. అవన్నీ అనేక ప్రకారాల మనుష్యుల మతాలు. ఇది శ్రేష్ఠంగా తయారు చేసే శ్రీమతము. మనుష్యులను శ్రేష్ఠులని అనరు. దేవతలను శ్రేష్ఠులని అంటారు. వారి ముందు అందరూ తల వంచి నమస్కరిస్తారు. కనుక వారు శ్రేష్ఠమైనవారే కదా. కానీ ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు 84 జన్మలు తీసుకోవలసిందేనని అర్థం చేసుకున్నారు. శ్రీ కృష్ణుడు దేవత, వైకుంఠములోని రాకుమారుడు. అతడు ఇక్కడికెలా వస్తాడు? అతడు గీతను కూడా వినిపించలేదు, కేవలం అతడొక దేవత. అందువలన అతడిని అందరూ పూజిస్తారు. దేవతలు పవిత్రులు. పూజించేవారు పతితులుగా ఉన్నారు. నిర్గుణడైన నాలో ఏ గుణాలు లేవని, మీరు మమ్ములను ఇలా తయారుచేయండని కూడా అంటారు. శివుని ముందుకు వెళ్లి మాకు ముక్తిని ఇవ్వమని అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలోకి గానీ, జీవన బంధనములోకి గానీ రానే రారు. అందుకే ముక్తినివ్వమని వారిని పిలుస్తారు. జీవన్ముక్తిని ఇచ్చేది కూడా వారే.
ఇప్పుడు మనమంతా బాబా-మమ్మా పిల్లలమని వారి నుండి మనకు అపారమైన ధనము లభిస్తుందని అర్థం చేసుకున్నారు. తెలియనందువలన(తెలివిహీనులైనందున) మానవులు యాచిస్తూ ఉంటారు. తెలివిలేని వారు తప్పక దుఃఖములోనే ఉంటారు కదా. అపారమైన దుఃఖమును అనుభవించివలసి వస్తుంది. కనుక ఈ విషయాలన్నీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. ఆ అనంతమైన తండ్రిని తెలుసుకోనందున పరస్పరము ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు, అనాథలుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథలు(సాకార ప్రపంచములో ఆధారములైన తల్లిదండ్రులను కోల్పోయినవారు), వీరు బేహద్ అనాథలు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడిది పతితాత్మల పతిత ప్రపంచము. సత్యయుగాన్ని పావన ప్రపంచమని అంటారు. కలియుగమును పాత ప్రపంచమని అంటారు. కనుక ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి కదా. పాత ప్రపంచము వినాశనమైపోతుంది తర్వాత మళ్లీ నూతన ప్రపంచములోకి బదిలీ అవుతారు. ఇప్పుడు మనము తాత్కాలికంగా సంగమ యుగములో నిల్చొని ఉన్నాము. పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచము తయారవుతూ ఉంది. నూతన ప్రపంచము గురించి కూడా మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు నూతన ప్రపంచములోకి వెళ్లాలి. కూర్చుంటూ, లేస్తూ మనము చదువుకుంటున్నామని, చదివించేవారు తండ్రి అని గుర్తుండాలి. విద్యార్థులకిది జ్ఞాపకముండాలి. అయినా ఆ స్మృతి నెంబరువారు పురుషార్థానుసారముగా ఉంటుంది. తండ్రి కూడా నంబరువారు పురుషార్థానుసారము ప్రియస్మృతులను తెలుపుతారు. బాగా చదివేవారిని టీచరు తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత తేడా ఏర్పడ్తుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు ధారణ చేయాలి. ఒక్క తండ్రి పట్ల తప్ప ఇతరులెవ్వరి వైపుకు బుద్ధి పోరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలెలా నశిస్తాయి. మాయ పదే పదే మీ బుద్ధియోగమును తుంచేస్తుంది. మాయ చాలా మోసగిస్తుంది. భక్తిమార్గములో నేను లక్ష్మిని చాలా పూజించేవాడినని ఈ బాబా తన ఉదాహరణను ఇస్తున్నారు. లక్ష్మి పాదాలొత్తుచున్నట్లు చిత్రములో చూచి నేను ఆమెను దాని నుండి విముక్తి చేయించాను. శివబాబా స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు పోతే ''ఓ బుద్ధీ నీవు మరోవైపు ఎందుకు వెళ్తావు? '' అని నాకు నేను చెంప దెబ్బలు వేసుకునేవాడిని. చివరికి వినాశనము, స్థాపనలు కూడా చూశాను. సాక్షాత్కారమవ్వాలనే ఆశ పూర్తి అయ్యింది. కొత్త ప్రపంచం వస్తోందని, నేను ఇలా తయారవుతానని అర్థమయ్యింది. పోతే ఈ పాత ప్రపంచమైతే వినాశనమైపోతుందని దృఢ నిశ్చయము ఏర్పడింది. మా రాజధాని కూడా సాక్షాత్కారమయింది. అటువంటప్పుడు ఈ రావణ రాజ్యమును ఏం చేసుకోవాలి? స్వర్గ రాజ్యాధికారమే లభిస్తున్నపుడు దీనినేమి చేసుకోవాలి? ఇలా నిర్ణయించుకోవడమే ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడే ప్రవేశించి నా బుద్ధిని నడిపించారు. జ్ఞాన కలశమేమో మాతలకు లభిస్తుంది. అందుకే సర్వస్వమూ మాతలకే ఇచ్చేశాను. మీరు ఈ కార్యవ్యవహారాలన్నీ సంభాళించండి. అందరికీ నేర్పించండి. నేర్పిస్తూ, నేర్పిస్తూ ఇంతవరకు వచ్చారు. క్రమక్రమంగా ఒకరికొకరు వినిపిస్తూ వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రమౌవుతూ పోతుంది. తర్వాత ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనది కావాలి. అర్థము కూడా చేసుకుంటారు కానీ మాయ మరిపింపచేస్తుంది.
ఏడు రోజుల కోర్సు తీసుకోమని మీరు చెప్తే రేపటి నుండి వస్తామని చెప్తారు, ఆ రెండవ రోజు మాయ తినేస్తుంది. రానే రారు. భగవంతుడు చదివిస్తున్నారంటే వచ్చి చదువుకోరు. తప్పకుండా వస్తామని కూడా అంటారు కానీ మాయ ఎగరగొట్టేస్తుంది. రెగ్యులర్‌గా రానివ్వదు. కల్పక్రితము ఎవరైతే పురుషార్థము చేశారో, వారు తప్పకుండా చేస్తారు. వేరే దుకాణమేదీ లేదు. మీరు చాలా పురుషార్థము చేస్తారు. పెద్ద పెద్ద మ్యూజియంలు నిర్మిస్తారు. కల్పక్రితము అర్థము చేసుకున్నవారే అర్థం చేసుకుంటారు. వినాశనమవుతుంది, స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకొని ఫస్ట్‌క్లాస్ శరీరము తీసుకుంటుంది. ఇది మీ లక్ష్యము కదా. ఎందుకు గుర్తుండదు? ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి మన పురుషార్థానుసారము వెళ్తాము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బుద్ధిలో ఇది సదా గుర్తుండాలి - మనమిప్పుడు కొంత సమయము కొరకు సంగమ యుగములో కూర్చొని ఉన్నాము, పాత ప్రపంచము వినాశనమవుతే మనము నూతన ప్రపంచములోకి బదిలీ అవుతాము. అందువలన దీని నుండి బుద్ధియోగమును తొలగించాలి.
2. సర్వాత్మలకు తండ్రి పరిచయాన్నిచ్చి కర్మ - అకర్మ - వికర్మల గుహ్య గతిని వినిపించాలి. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుని) పాఠమును పక్కా చేయించాలి.
వరదానము :- '' కర్మ మరియు యోగాల బ్యాలన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మబంధనముక్త్ భవ ''
కర్మతో పాటు యోగం బ్యాలన్స్‌లో ఉంటే ప్రతి కర్మలో సఫలత స్వతహాగా ప్రాప్తి అవుతుంది. కర్మయోగి ఆత్మలు ఎప్పుడూ కర్మబంధనంలో చిక్కుకోరు. కర్మబంధనము నుండి ముక్తులుగా ఉన్నవారినే కర్మాతీతులని అంటారు. కర్మాతీతులంటే కర్మలు చేయకుండా అతీతంగా ఉండేవారని కాదు. కర్మతో అతీతం కాదు, కర్మబంధనంలో చిక్కుకోకుండా అతీతమవ్వండి. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మలతో అనేకమంది కర్మలను శ్రేష్ఠంగా చేసేవారిగా ఉంటారు. వారికి ప్రతి కార్యము మనోరంజనంగా ఉంటుంది, కష్టంగా అనుభవమవ్వదు.
స్లోగన్ :- '' పరమాత్మ ప్రేమయే అమృతవేళలో నిదుర లేపే సమయమనే గంట ''
No comments:
Post a Comment