Wednesday, January 1, 2020

Telugu Murli 01/01/2020

01-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - పతితుల నుండి పావనంగా చేసే తండ్రి పై మీకు చాలా చాలా లవ్‌ ( ప్రేమ ) ఉండాలి, ఉదయం ఉదయమే లేచి మొట్టమొదట ' శివబాబా! గుడ్‌మార్నింగ్‌ ' అని చెప్పండి. ''

ప్రశ్న :- చార్టు సరిగ్గా వ్రాశామా, లేదా? అని ఏ నాలుగు విషయాల ద్వారా తెలుసుకోవచ్చు ?
జవాబు :- 1. వ్యక్తి 2. నడవడిక 3. సర్వీసు 4. ఖుషీి. బాప్‌దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చార్టు సరిగ్గా ఉందా లేదా? అని తెలియచేస్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీల సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి నడవడిక రాయల్‌గా ఉంటుందో, అపారమైన ఖుషీలో ఉంటారో వారి చార్టు తప్పకుండా సరిగ్గా ఉంటుంది.

ఓంశాంతి. తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! 'తతత్వమ్‌' అనగా ఆత్మలైన మీరు కూడా శాంతి స్వరూపులు, సర్వ ఆత్మల స్వధర్మమే శాంతి. శాంతిధామము నుండి ఇక్కడకు వచ్చి టాకీ(మాట్లాడేవారు)గా అవుతారు. మీ పాత్ర పోషించేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా ఆవ్వదు. శరీరము చిన్నదిగా, పెద్దదిగా అవుతుంది. తండ్రి అంటారు - నేను శరీరధారిని కాదు. నేను పిల్లలతో సన్ముఖంలో కలిసేందుకు రావాల్సి ఉంటుంది. ఒక తండ్రి ఉన్నాడనుకోండి, ఆయనకు పిల్లలు పుడితే, ఆ పిల్లలు 'నేను పరంధామము నుండి వచ్చి జన్మించి తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చాను' అని అనరు. భలే! ఏదైనా క్రొత్త ఆత్మ ఎవరి శరీరములోకి వచ్చినా లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరములోకి ప్రవేశించినా అది నేను మాతా-పితలను కలుసుకునేందుకు వచ్చానని అనదు. మాతా-పితలు ఆటోమాటిక్‌గా లభిస్తారు. ఇక్కడిది క్రొత్త విషయం. తండ్రి అంటారు - నేను పరంధామము నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖములో ఉన్నాను. పిల్లలకు మళ్లీ జ్ఞానమునిస్తాను ఎందుకంటే నేను నాలెడ్జ్‌ఫుల్‌, జ్ఞానసాగరుడను. నేను పిల్లలైన మిమ్ములను చదివించేందుకు, రాజయోగము నేర్పించేందుకు వస్తాను. రాజయోగము భగవంతుడే నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వరీయ పార్టు(పాత్ర) లేదు. ప్రతి ఒక్కరికీ తమ తమ పాత్ర ఉంది. ఈశ్వరునికి కూడా తన పాత్ర ఉంది. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధరమైన పిల్లలూ! మిమ్ములను మీరు ఆత్మగా భావించండి, స్వయాన్ని ఈ విధంగా భావించడం ఎంత మధురంగా ఉంటుంది! మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అవుతున్నాము.
ఈ డ్రామా వండర్‌ఫుల్‌గా ఎలా తయారయిందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఈ మాత్రం గుర్తున్నా, మేము సత్యయుగానికి వెళ్ళేవారమని పక్కా అవుతుంది. ఇపుడు సంగమ యుగములో ఉన్నారు. మళ్లీ ఇంటికి వెళ్లాలి కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. లోలోపల చాలా ఖుషీ ఉండాలి. ''ఓహో! అనంతమైన తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంత ప్రేమిస్తారు! కేవలం టీచరు రూపములో చదివించి ఇంటికి వెళ్తారని కాదు. వీరు తండ్రి కూడా, టీచరు కూడా, మిమ్ములను చదివిస్తారు కూడా, స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు.
ఇలా విశ్వానికి యజమానులుగా చేసే, పతితుల నుండి పావనంగా చేసే తండ్రి పై చాలా లవ్‌(ప్రేమ) ఉండాలి. ఉదయం లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పాలి. గుడ్‌మార్నింగ్‌ అనగా స్మృతి. బాబాను స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు తమ హృదయాన్ని - మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేశాము? అని ప్రశ్నించుకోవాలి. మనుష్యులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా! భక్తి ఎంత ప్రేమతో చేస్తారు! కానీ చాలామంది పిల్లలు హృదయపూర్వకంగా నిజమైన ప్రేమతో స్మృతి చేయరని బాబాకు తెలుసు. ఉదయం లేచి బాబాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పి, జ్ఞాన చింతన చేస్తే, సంతోష పాదరసం పైకెక్కుతుంది. తండ్రికి గుడ్‌మార్నింగ్‌ చెప్పకపోతే పాప భారం ఎలా దిగుతుంది. ముఖ్యమైనదే స్మృతి. దీనితో భవిష్యత్తు కొరకు మీకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. ఈ సంపాదన కల్ప-కల్పాంతరాలకు పనికి వస్తుంది. చాలా ధైర్యము, గంభీరత, తెలివితో స్మృతి చేయాల్సి ఉంటుంది. అందాసుగా మేము బాబాను చాలా స్మృతి చేస్తామని చెప్తారు. కానీ ఆక్యురేట్‌గా స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంటు ఎక్కువగా లభిస్తుంది ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది. యోగము మరియు జ్ఞానము రెండు విషయాలు. యోగం సబ్జెక్ట్‌ వేరు. ఇది చాలా పెద్ద(భారీ) సబ్జెక్ట్‌. యోగంతోనే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వడం అసంభవము. చాలా బాగా ప్రేమతో స్మృతి చేస్తే ఆటోమాటిక్‌గా కరెంటు లభిస్తుంది. ఆరోగ్యంగా అవుతారు. కరెంటుతో ఆయువు కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సెర్చ్‌లైట్‌ ఇస్తారు. తండ్రి చాలా భారీ ఖజానాను పిల్లలైన మీకు ఇస్తారు.
శివబాబా మమ్ములను చదివిస్తున్నారని మధరమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతితపావనుడు, సద్గతిదాత కూడా. సద్గతి అంటే స్వర్గ రాజ్యం ఇస్తారు. బాబా ఎంత మధురంగా ఉన్నారు, ఎంత ప్రేమగా కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు. తండ్రి ఈ దాదా ద్వారా మనలను చదివిస్తున్నారు. బాబా ఎంత మధురమైనవారు, ఎంత ప్రేమిస్తారు, ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రమును గుర్తు చేసుకోండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో హృదయము ఒక్కసారిగా శీతలమైపోవాలి. ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి. ఎందుకంటే తండ్రి నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది! మాకు తండ్రి పై ఎంత ప్రేమ ఉంది? దైవీగుణాలు ఎంతవరకు ఉన్నాయి? అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలైన మీరు ముళ్ల నుంచి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంత యోగములో ఉంటే అంత ముళ్ల నుండి పుష్పాలుగా, సతోప్రధానంగా అవుతూ ఉంటారు. పుష్పాలుగా అయ్యారంటే ఇక్కడ ఉండలేరు. పూలతోట అంటే స్వర్గము. అనేక ముళ్లను పుష్పాలుగా తయారు చేసేవారినే సత్యమైన సుగంధపుష్పాలని అంటారు. ఇప్పుడు ఎవ్వరికీ ముళ్లు గుచ్చరాదు. క్రోధం కూడా చాలా పెద్ద ముల్లు. చాలామందికి దు:ఖం కలుగచేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు దు:ఖ ప్రపంచాన్ని దాటి వచ్చేశారు. మీరు సంగమ యుగంలో ఉన్నారు. తోటమాలి పుష్పాలను విడిగా ఒక పాత్ర(గిన్నె/పాట్‌)లో ఉంచినట్లుగా అలా పుష్పాలైన మిమ్ములను కూడా సంగమయుగం అనే పాత్రలో వేరుగా ఉంచారు. పుష్పాలైన మీరు మళ్లీ స్వర్గానికి వెళ్లిపోతారు. కలియుగ ముళ్లు భస్మమైపోతాయి.
మాకు పారలౌకిక తండ్రి నుండి అవినాశి వారసత్వము లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. ఎవరైతే సత్య-సత్యమైన పిల్లలుగా ఉంటారో, ఎవరికి బాప్‌దాదా అంటే పూర్తి ప్రేమ ఉంటుందో, వారికి చాలా ఖుషీ ఉంటుంది. మేము విశ్వానికి యజమానిగా అవుతాము. పురుషార్థంతోనే విశ్వానికి యజమానిగా అవుతారు. కేవలం మాటలతో కాదు. మేము మా కొరకు మళ్లీ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తున్నామని అనన్యమైన పిల్లలకు సదా స్మృతి ఉంటుంది. మధురమైన పిల్లలూ! మీరు చాలామందికి ఎంత కళ్యాణము చేస్తే అంత మీకు ప్రతిఫలము లభిస్తుందని తండ్రి చెప్తున్నారు. అనేమందికి మార్గం చూపిస్తే అనేకమంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞాన రత్నాలతో జోలె నింపుకుని, మళ్లీ దానం చేయాలి. జ్ఞానసాగరుడు మీకు పళ్లెములు రత్నాలతో నింపి నింపి ఇస్తారు. వాటిని దానం చేసేవారే అందరికీ ప్రియమనిపిస్తారు. కనుక పిల్లలలో ఎంత ఖుషీ ఉండాలి! తెలివిగా ఉండే పిల్లలు మేము బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకుంటాము అని అంటారు. ఒక్కసారిగా అతుక్కుపోతారు. ప్రాణమిచ్చే తండ్రి లభించారని తెలుసు కనుక తండ్రి పై చాలా ప్రేమ ఉంటుంది. జ్ఞానయుక్త వరదానం ఎలా ఇస్తారంటే, దాని ద్వారా మనము ఎలా ఉండేవారము ఎలా అవుతాము! దివాలా నుండి సంపన్నంగా అవుతాము. భండారాన్ని ఇంత నిండుగా చేస్తారు! తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత లవ్‌ ఉంటుంది, అంత ఆకర్షణ కలుగుతుంది. సూది శుభ్రంగా ఉంటే, అయస్కాంతము వైపు ఆకర్షింపబడ్తుంది కదా! తండ్రి స్మృతితో త్రుప్పు వదిలిపోతూ ఉంటుంది. ఒక్క తండ్రి కాకుండా ఇంకెవరూ గుర్తు రాకూడదు. ఉదాహరణానికి స్త్రీకి పతి పై ఎంత ప్రేమ ఉంటుంది. మీకు కూడా నిశ్చితార్థము జరిగింది కదా! నిశ్చితార్థపు ఖుషీ తగ్గుతుందా? శివబాబా అంటారు - మధురమైన పిల్లలూ! మీ నిశ్చితార్థం నాతో జరిగింది, బ్రహ్మతో కాదు. నిశ్చితార్థము పక్కా అయిపోయింది మరైతే వారి స్మృతే సతాయించాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! నిర్లక్ష్యం చేయకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్‌హౌస్‌గా అవ్వండి. స్వదర్శన చక్రధారిగా అవ్వడం బాగా ప్రాక్టీసైతే మీరు జ్ఞాన సాగరులుగా అవుతారు. ఉదాహరణానికి స్టూడెంట్‌ చదువుకొని టీచరుగా అవుతాడు కదా! మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేసినప్పుడే చక్రవర్తి రాజు-రాణులుగా అవుతారు కనుక బాబా పిల్లలను సదా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నారా అని అడుగుతుంటారు. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా! మధురమైన పిల్లలైన మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పిల్లలు లేకుంటే నాకు కూడా అస్థిమితంగా ఉంటుంది. సమయం అయినప్పుడు అస్థిమితంగా ఉంటుంది. చాలు, ఇప్పుడిక వెళ్లాలి, పిల్లలు చాలా పిలుస్తున్నారు, చాలా దు:ఖితులుగా ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి. మళ్లీ అక్కడి నుండి మీకు మీరే సుఖధామానికి వెళ్తారు. అక్కడ మీకు తోడుగా నేనుండను. మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది.
మేము ఆత్మిక యూనివర్సిటీలో చదువుతున్నామని పిల్లలైన మీకు నషా ఉండాలి. మేము ఈశ్వరీయ విద్యార్థులము. మేము మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నాము. దీనితో మేము మినిస్టరీ మొత్తం పాస్‌ అవుతాము. ఆరోగ్యము (హెల్త్‌), విద్య(ఎజ్యుకేషన్‌) కూడా చదువుతాము. నడవడికను సంస్కరించుకునే జ్ఞానము కూడా చదువుతాము. హెల్త్‌ మినిస్టరీ, ఫుడ్‌ మినిస్టరీ, ల్యాండ్‌ మినిస్టరీ, బిల్డింగ్‌ మినిస్టరీ అన్నీ ఇందులో వచ్చేస్తాయి.
ఏదైనా సభలో ప్రసంగించునప్పుడు లేక ఎవరికైనా అర్థం చేయించునప్పుడు మిమ్ములను ఆత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చేయండని మాటిమాటికీ చెప్పండి. ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమౌతాయి. మీరు పావనంగా అవుతారని చెప్పండి. మాటిమాటికీ స్మృతి చేయాలి. కాని ఇది కూడా స్వయంగా స్మృతిలో ఉన్నప్పుడే చెప్పగలరు. పిల్లలలో ఈ విషయం చాలా బలహీనంగా ఉంది. స్మృతిలో ఉండి ఇతరులకు అర్థం చేయిస్తే ప్రభావం పడ్తుంది. ఆంతరికంగా సంతోషం కలుగుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానిగా ఉండి కొద్దిగా అర్థం చేయించినా బాణము తగులుతుంది. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మొదట మిమ్ములను మీరు సంస్కరించుకోండి. స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే - ఈ మోసము నడవజాలదు. లోలోపల హృదయం తప్పకుండా తింటూ ఉంటుంది. తండ్రి పై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతమును అనుసరించరు. అనంతమైన తండ్రి ఇచ్చే శిక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మధురమైన పిల్లలూ! ఇప్పుడీ పాత ప్రపంచాన్ని మర్చిపోండని తండ్రి చెప్తున్నారు. చివరికి ఇవన్నీ మర్చిపోవాల్సిందే. శాంతిధామము, సుఖధామాల పై బుద్ధి లగ్నమౌతుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మలు వెళ్ళలేవు. అది పావన ఆత్మల ఇల్లు. ఈ శరీరము పంచ తత్వాలతో తయారయింది; కనుక అయిదు తత్వాలు ఇక్కడే ఉండేందుకు లాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ ఇలాంటి ప్రాపర్టీ తీసుకుంది కనుక శరీరం పై మమకారం ఏర్పడింది. ఇప్పుడు దీని పై మమకారం తొలగించి మన ఇంటికి వెళ్లాలి. అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు. సత్యయుగంలో కూడా శరీరం యోగబలంతో తయారవుతుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది కనుక ఆకర్షించదు. దు:ఖము కలగదు. ఇవి అర్థము చేసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఇక్కడ పంచ తత్వాల బలము ఆత్మను లాగుతాయి అందువలన శరీరాన్ని వదిలేందుకు మనసు ఇష్టపడదు. కాని వదిలేందుకు ఇంకా సంతోషంగా ఉండాలి పావనంగా అయి ఈ శరీరాన్ని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా వదిలేస్తాము. కనుక శరీరము నుండి అన్ని వస్తువుల పై మమకారం పూర్తిగా తొలగించాలి. దీనితో మనకు ఎలాంటి సంబంధమూ లేదు. మనము బాబా వద్దకు వెళ్తాము. ఈ ప్రపంచంలో మనకున్న బ్యాగ్‌-బ్యాగేజి(పెట్టె-బేడా) సర్దేసి ముందే పంపేశాము. జతలో అయితే రాలేదు. ఆత్మలే వెళ్ళాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేశాము. బాబా నూతన శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు. రత్నాలు, వజ్రాల మహలు లభిస్తుంది. అటువంటి సుఖధామానికి వెళ్లేందుకు ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది, అలసిపోరాదు. రాత్రి-పగలు చాలా సంపాదన చేయాలి. కనుక బాబా అంటారు - నిద్రను జయించే పిల్లలూ! మామేకం యాద్‌ కరో. విచార సాగర మథనం చేయండి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుంటే, బుద్ధి ఒక్కసారిగా శీతలమైపోతుంది. మహారథులైన పిల్లలు ఎప్పుడూ చలించరు. శివబాబాను స్మృతి చేస్తే వారు సంభాళిస్తారు కూడా.
తండ్రి పిల్లలైన మిమ్ములను దు:ఖము నుండి విడిపించి శాంతిని దానంగా ఇస్తారు. మీరు కూడా శాంతి దానం చేయాలి. ఈ అనంతమైన మీ శాంతి అనగా యోగబలం ఇతరులను కూడా శాంతిగా చేసేస్తుంది. వీరు మన ఇంటివారా? కాదా? అని వెంటనే తెలిసిపోతుంది. ఆత్మకు వెంటనే వీరు మా బాబా అని ఆకర్షణ కలుగుతుంది. నాడి కూడా చూడాల్సి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిన వారేేనా అని చూడండి. మన కులంవారైతే ఈ విషయాలలో వారికి రుచి ఉంటుంది. పిల్లలు స్మృతి చేస్తెే తండ్రి కూడా ప్రేమిస్తారు. ఆత్మను ప్రేమిస్తారు. చాలా భక్తి చేసినవారే చాలా చదువుతారని కూడా తెలుసుకుంటారు. తండ్రి పై ఎంత ప్రేమ ఉందో వారి ముఖము ద్వారా తెలిసిపోతుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలైన మనలను చదవిస్తున్నారు. తండ్రికి కూడా ఇంత చిన్న బిందువైన ఆత్మను చదివిస్తున్నానని భావిస్తారు. పోను పోను మీ స్థితి ఇలా అవుతుంది. సోదరులను చదివిస్తున్నామని భావిస్తారు. రూపం సోదరిదైనా దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరము వైపుకు దృష్టి ఎంత మాత్రము పోరాదు. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా ఉన్నతమైన చదువు. తూకం వేస్తే ఈ చదువు వైపుకే చాలా భారం(బరువు) తూగుతుంది. అఛ్ఛా !

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
సూచన - బ్రాహ్మణ పిల్లలందరు జనవరి 1 నుండి 31 జనవరి 2020 వరకు విశేషంగా అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు ఈ పాయింట్లు నోట్‌ చేసుకోండి. రోజంతా ఈ పాయింట్ల పై మనన చింతన చేస్తూ, అనుభవీ ముర్తులుగా అవ్వాలి. అంతర్ముఖులుగా ఉండి అవ్యక్త వతనములో విహరిస్తూ ఉండండి.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
ఎలాగైతే సాకారంలో బ్రహ్మాబాబా ఇతర బాధ్యతలెన్ని ఉన్నా ఆకార స్థితిని, నిరాకార స్థితిని అనుభవం చేయించారో, అలా పిల్లలైన మీరు కూడా సాకార రూపంలో ఉంటూ ఫరిస్తా స్థితిని అనుభవం చేసి, చేయించండి. సంపర్కములోకి ఎవరు వచ్చినా, వారికి ఈశ్వరీయ స్నేహము, శ్రేష్ఠమైన జ్ఞానము, శ్రేష్ఠమైన చరిత్రలు సాక్షాత్కారమైతే అవుతాయి కానీ ఇప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయించండి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన రత్నాలతో జోలె నింపుకుని, మళ్లీ దానం కూడా చేయాలి. ఎవరు దానం చేస్తారో వారు అందరికీ ప్రియంగా ఉంటారు. వారికి అపారమైన సంతోషం ఉంటుంది.
2. ప్రాణదానం చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతిని దానం చేయాలి. స్వదర్శన చక్రం తిప్పుతూ జ్ఞాన సాగరులుగా అవ్వాలి.

వరదానము :- '' అత్యంత ఉన్నతమైన తండ్రిని ప్రత్యక్షము చేసే శుభప్రదమైన శ్రేష్ఠ కర్మధారీ భవ ''
ఎలాగైతే కుడి చేతితో సదా శుభప్రదమైన శ్రేష్ఠ కర్మలు చేస్తారో, అలా రైట్‌హ్యాండ్‌ పిల్లలైన మీరు సదా శుభప్రదమైన శ్రేష్ఠ కర్మలు చేయువారిగా అవ్వండి. మీరు చేసే ప్రతి కర్మ అత్యంత ఉన్నతమైన తండ్రిని ప్రత్యక్షము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే కర్మయే సంకల్పము లేక మాటను ప్రత్యక్షము చేసేదిగా ఉంటుంది. కర్మను అందరూ చూడగలరు, కర్మ ద్వారా అనుభవం చేయగలరు. అందువలన ఆత్మిక దృష్టి ద్వారా గాని, సంతోషంగా ఉండే ఆత్మిక ముఖము ద్వారా గాని, తండ్రిని ప్రత్యక్షము చేయండి - ఇది కూడా కర్మయే.

స్లోగన్‌ :- '' ఆత్మీయత అనగా కనులలో పవిత్రతా ప్రకాశము, పెదవుల పై (ముఖము పై) పవిత్రమైన మందహాసము (చిరునవ్వు) ఉండాలి. ''

No comments:

Post a Comment