Wednesday, January 15, 2020

Telugu Murli 15/01/2020

15-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు(పాస్‌ విత్‌ ఆనర్‌) అవ్వాలంటే, శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి, చెడు సాంగత్యము నుండి, మాయా తుఫానుల నుండి మిమ్ములను మీరు కాపాడుకోండి ''

ప్రశ్న :- తండ్రి తన పిల్లలకు చేసిన ఏ సేవను పిల్లలు కూడా ఇతరులకు చేయాలి ?
జవాబు :- ప్రియమైన పిల్లలారా! అంటూ పిల్లలను వజ్ర సమానంగా చేసే సేవ చేశారు. అలాగే పిల్లలైన మనము కూడా మన మధురమైన సోదరులను వజ్ర సమానంగా చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. తండ్రిని స్మృతి చేస్తే వజ్ర సమానంగా అవుతారని చెప్తే చాలు.

ప్రశ్న :- తండ్రి తన పిల్లలకు ఏ ఆజ్ఞను ఇచ్చారు ?
జవాబు :- పిల్లలూ, మీరు సత్యమైన సంపాదన చేస్తూ ఇతరులతో చేయించండి. మీరు ఎవ్వరితోనూ అప్పు తీసుకునేందుకు అనుమతి లేదు.

పాట :- ఈ పాప ప్రపంచము నుండి ఇంకెక్కడికైనా తీసుకెళ్లండి,........ (ఇస్‌ పాప్‌ కీ దునియా సే,..........)
ఓంశాంతి. నూతన ప్రపంచములోకి వెళ్ళే మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి శుభోదయము(గుడ్‌మార్నింగ్‌) పలుకుచున్నారు. ప్రపంచము నుండి దూరంగా తప్పకుండా వెళ్తామని ఆత్మిక పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారము తెలుసు. ఎక్కడకు? మన మధురమైన సైలెన్స్‌ (నిశ్శబ్ధ) ప్రపంచానికి వెళ్తాము. శాంతిధామము చాలా దూరంగా ఉంది. ఆత్మలైన మనము అక్కడ నుండే వస్తాము. అది మూల వతనము, ఇది స్థూల వతనము. అది మన ఆత్మలందరి ఇల్లు. ఆ ఇంటికి తండ్రి తప్ప ఇతరులెవ్వరు తీసుకెళ్లలేరు. బ్రాహ్మణ - బ్రాహ్మణీలైన మీరందరూ ఆత్మిక సేవ చేస్తున్నారు. ఎవరు నేర్పించారు? దూరానికి తీసుకెళ్ళే తండ్రి నేర్పించారు. ఎంతమందిని తీసుకెళ్తారు? లెక్కలేనంత మందిని. మార్గదర్శకుని పిల్లలైన మీరందరూ మార్గదర్శకులే. మీ పేరే పాండవ సైన్యము. పిల్లలైన మీరు దూరంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరికి ''మన్మనాభవ'' అను యుక్తి తెలుపుతారు. తండ్రిని స్మృతి చేయండి - '' బాబా, ఈ ప్రపంచము నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లండి '' అని కూడా అంటారు. నూతన ప్రపంచములో ఇలా చెప్పరు. ఇది రావణ రాజ్యము. కనుక దీని నుండి దూరంగా తీసుకెళ్ళండి. ఇక్కడ సుఖము-శాంతి లేదు అని చెప్తారు. దీని పేరే దు:ఖధామము. ఇప్పుడు తండ్రి మీకు ఎలాంటి ఎదురుదెబ్బ తగలనీయరు. భక్తిమార్గములో తండ్రిని వెతుకుటలో మీరు ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను గుప్తంగా ఉంటాను, స్థూల కనులతో నన్ను ఎవ్వరూ చూడలేరు. తల వంచి నమస్కరించేందుకు కృష్ణ మందిరములో పావుకోళ్ళు(చటారి) ఉంచుతారు. మీరు నమస్కరించేందుకు నాకు కాళ్లే(పాదాలే) లేవు. నేను కేవలం మిమ్ములను ప్రియమైన పిల్లలారా! అని పిలిచి, అందరికీ ''ప్రియమైన సోదరులారా, పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి'' అని చెప్పమంటాను. అంతే ఇది తప్ప ఏ కష్టమూ లేదు. తండ్రి ఎలాగైతే వజ్ర సమానంగా చేస్తారో పిల్లలు కూడా ఇతరులను వజ్ర సమానంగా చెయ్యాలి. మనుష్యులను వజ్ర సమానంగా తయారు చేసే విధమును నేర్చుకుంటే చాలు. డ్రామానుసారము కల్పక్రితము వలె కల్ప-కల్పము సంగమ యుగములో తండ్రి వచ్చి మనకు నేర్పిస్తారు. తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. కొబ్జాల(నపుంసకుల) గురువైన ఆగాఖాన్‌ను బంగారు, వెండి, వజ్రాలతో తూకము వేశారని(తులాభారము చేశారని) మీకు తెలుసు. నెహ్రూను బంగారుతో తూకము వేశారు. వారెవ్వరూ వజ్ర సమానంగా చేయలేదు. అయితే ఈ తండ్రి మిమ్ములను వజ్ర సమానంగా తయారుచేస్తారు. వారిని మీరు దేనితో తూకము వేస్తారు? మీరు వజ్రాలు మొదలైన వాటినేం చేసుకుంటారు? మీకు వాటి అవసరమే లేదు. వారు గుఱ్రపు పందెములలో చాలా ధనము గెలుచుకుంటారు. ఇల్లు, వాకిలి, ఆస్తులు మొదలైనవి తయారు చేసుకుంటారు. పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకుంటే 21 జన్మలకు అప్పు తీర్చవలసి వస్తుంది. ఎవరి వద్దనైనా అప్పు తీసుకునేందుకు మీకు అనుమతి లేదు. ఈ సమయములోని అసత్య సంపాదన సమాప్తమైపోతుందని మీకు తెలుసు. ఇవన్నీ గవ్వలని, నాకు వజ్రాలు లభిస్తాయని బాబా తెలుసుకున్నారు. అప్పుడు ఈ గవ్వలు ఏం చేసుకుంటాను? కనుక తండ్రి నుండి అనంతమైన వారసత్వమెందుకు తీసుకోరాదు? భోజనమేమో తప్పకుండా లభించనే లభిస్తుంది. ఒక సామెత కూడా ఉంది - ''ఎవరి చేయి ఇలా(పైన, ఇచ్చేదిగా) ఉంటుందో వారు మొదటి నంబరు పొందుకుంటారు.'' బాబాను షరాఫ్‌(వ్యాపారస్థుడు) అని కూడా అంటారు కదా. మీ పాత వస్తువులన్నీ తీసుకొని కొత్తవి ఇస్తానని బాబా చెప్తున్నారు. ఎవరైనా మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకిచ్చేస్తారు కదా. తండ్రి చెప్తున్నారు - మీ నుండి నేను ఏం తీసుకుంటాను, ఈ ఉదాహరణ చూడండి. ద్రౌపది కూడా ఒక్కరే ఉండరు కదా. మీరందరు ద్రౌపదులే బాబా మేము నగ్నము(అపవిత్రము) అవ్వకుండా కాపాడమని ఆర్తనాదాలు చేస్తారు. బాబా ఎంతో ప్రేమగా అర్థము చేయిస్తున్నారు - '' పిల్లలూ! ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి.'' తండ్రి పిల్లలకు చెప్తారు కదా - '' నా గడ్డానికి(పెద్దతనానికి) గౌరవమివ్వండి. కులానికి కళంకము తేకండి.'' మధురాతి మధురమైన పిల్లలలైన మీకు ఎంత నషా ఉండాలి. తండ్రి మిమ్ములను వజ్ర సమానంగా చేస్తారు, ఇతడిని కూడా వజ్ర సమానంగా తయారు చేసేది ఆ తండ్రియే. కనుక వారిని స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేస్తే మీ కర్మలు వినాశనమవ్వవని ఈ బ్రహ్మాబాబా చెప్తున్నారు. మీకు గురువు నేను కాదు. ఆ తండ్రి నాకు నేర్పిస్తున్నారు. దానినే నేను మీకు నేర్పిస్తున్నాను. వజ్ర సమానంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి.
బాబా అర్థం చేయిస్తున్నారు - భక్తిమార్గములో భలే ఎవరైనా దేవతలను భక్తి చేస్తున్నా, వారి బుద్ధి వారి దుకాణము, వ్యాపారము మొదలైనవాటి వైపు పరిగెడుతూ ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా ఆదాయము లభిస్తుంది. ఈ బాబా తమ అనుభవము కూడా వినిపిస్తారు - బుద్ధి అటు-ఇటు పరుగెత్తినప్పుడు ఇవెందుకు గుర్తు వస్తాయి? అని చెంపదెబ్బలు వేసుకునేవాడు. కనుక ఇప్పుడు ఆత్మలమైన మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి, కాని మాయ క్షణ-క్షణము మరపింపజేస్తుంది, గట్టిగా గుద్దుతుంది(ఘూసా కొడ్తుంది). మాయ బుద్ధి యోగమును తెంచి వేస్తుంది. ఈ విధంగా మీతో మీరు బ్రహ్మాబాబా వలె మాట్లాడుకోవాలి. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు స్వకళ్యాణము చేసుకుంటూ, ఇతరుల కళ్యాణము కూడా చేయండి. సేవాకేంద్రాలు తెరవండి. చాలామంది పిల్లలు బాబా, ఫలానా చోట సెంటరు తెరవనా? అని అడుగుతారు. ఇటువంటి పిల్లలకు తండ్రి చెప్తారు - నేను దాతను. నాకు ఏ అవసరమూ లేదు. ఈ భవనాలు మొదలైనవి కూడా పిల్లలైన మీ కొరకే కదా. శివబాబా మిమ్ములను వజ్ర సమానంగా చేసేందుకు వచ్చారు. మీరు ఏం చేసినా అదంతా మీకే పనికొస్తుంది. శిష్యులు మొదలైనవారిని తయారు చేసేందుకు వీరేమీ గురువు కాదు. భవనాలు మొదలైనవి పిల్లలు తాముండేందుకే నిర్మిస్తారు. కట్టించువారు ఇక్కడకు వస్తే వారు గౌరవింపబడ్తారు. వారిని పై భాగాన నిర్మించిన నూతన భవనంలో ఉండమని చెప్తారు. కొంతమంది మేము నూతన భవనంలో ఎందుకుంటాము? మాకు పాత భవనమే బాగుంటుంది. బాబా మీరు ఎలా పాత భవనంలో ఉంటున్నారో, మేము కూడా అలా పాత భవనములోనే ఉంటాము, దాతననే అహంకారము మాకు లేదు. బాప్‌దాదాయే కొత్త భవనంలో లేకుంటే మేమెందుకుంటాము? మమ్ములను కూడా మీ జతలోనే ఉంచుకోండి. మీకు ఎంత సమీపంగా ఉంటామో మాకంత బాగంటుంది బాబా అని అంటారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎంత పురుషార్థము చేస్తారో, సుఖధామములో అంత ఉన్నత పదవి పొందుతారు. స్వర్గములోకైతే అందరూ వెళ్తారు కదా. భారతదేశము పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేదని భారతవాసులకు తెలుసు. పాపమనే పదము(పేరు) కూడా ఉండేది కాదు. ఇప్పుడందరూ పాపాత్మలుగా అయ్యారు. అది రావణ రాజ్యము. సత్యయుగములో రావణుడుండడు. అర్ధకల్పము తర్వాతనే రావణ రాజ్యముగా అవుతుంది. తండ్రి ఇంతగా అర్థం చేయిస్తున్నా అర్థము చేసుకోరు. కల్ప-కల్పము ఇదే విధంగా జరుగుతూ వచ్చింది. కొత్త మాటేమీ కాదు. మీరు ప్రదర్శినీలు జరుపుతారు. ఎంతమంది వస్తారు! ప్రజలేమో అనేకమంది తయారవుతారు. వజ్ర సమానంగా అయ్యేందుకు సమయము పడ్తుంది. ప్రజలు తయారైనా అది కూడా మంచిదే. ఇప్పుడిది కయామత్‌(వినాశన) సమయము. అందరి లెక్కాచారము చుక్తా(సమాప్తము) అవుతుంది. 8 మంది మాల తయారయ్యింది. అది గౌరవ పూర్వకంగా ఉత్తీర్ణులైన వారి మాల. 8 మణులే నంబరువన్‌లో వెళ్తారు. వారికి కొద్దిగా కూడా శిక్షలు ఉండవు. కర్మాతీత అవస్థను పొందుకొని ఉంటారు. మీ తర్వాత 108 మాల. నంబర్‌వారు అని అంటారు కదా. ఇది తయారైన అనాది డ్రామా. బాబా దీనిని సాక్షిగా ఉండి ఎవరు మంచి పురుషార్థము చేస్తున్నారో చూస్తూ ఉంటారు. అలాగే శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే పాస్‌ విత్‌ ఆనర్‌ అయ్యి 8 మణుల మాలలో రాగలరు. కానీ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా గ్రహచారము కూడా వచ్చేస్తుంది. ఈ ఉన్నతి - అవనతి అందరికీ వస్తాయి. ఇది సంపాదన. అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది. మాయ తుఫానులు లేక చెడు సాంగత్యము వెనుకకు తోసేస్తుంది. సంతోషము మాయమైపోతుంది. మంచి సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది అని మహిమ కూడా చేయబడింది. ఇప్పుడు రావణుని సాంగత్యము ముంచేసింది. రాముని సాంగత్యము తేల్చుతుంది. రావణుని మతము వలన ఇలా తయారయ్యారు. దేవతలు కూడా వామమార్గములోకి వెళ్తారు. వారి చిత్రాలు ఎంత వికారంగా, అసహ్యంగా చూపించారు! ఈ చిత్రాలు వామమార్గములోకి వెళ్లినందుకు గుర్తు. భారతదేశములోనే రామ రాజ్యముండేది. ఇప్పుడు భారతదేశములోనే రావణ రాజ్యముంది. రావణరాజ్యంలో నూరు శాతము దుఃఖితులుగా అయిపోతారు. ఇది ఒక ఆట. ఎవరికైనా ఈ జ్ఞానాన్ని అర్థం చేయించడం ఎంతో సహజం(సులభము).
(ఒక నర్సు బాబా ముందు కూర్చొని ఉంది) బాబా ఈ బిడ్డకు చెప్తున్నారు - నీవు నర్సువు. ఆ సేవ కూడా చేస్తూ ఉండు, దానితో పాటు ఈ సేవ కూడా చేయగలవు. రోగులకు కూడా ఈ జ్ఞానము వినిపిస్తూ ఉండు - ''ఈ తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత 21 జన్మలకు మీరు జబ్బుపడరు.'' యోగము ద్వారానే ఆరోగ్యము లభిస్తుంది మరియు 84 జన్మల చక్రమును తెలుసుకోవడం వలన సంపద లభిస్తుంది. నీవు చాలా సేవ చేయగలవు. చాలామంది కళ్యాణము చేస్తావు. నీకు లభించే ధనాన్ని కూడా ఈ ఆత్మిక సేవలో ఉపయోగిస్తావు. వాస్తవానికి మీరందరూ నర్సులే కదా. ఛీ - ఛీ వికారి(మురికి) మనుష్యులను దేవతలుగా చేసే సేవ నర్సు సేవకు సమానం కదా. తండ్రి చెప్తున్నారు - నన్ను పతిత మనుష్యులు మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని పిలుస్తారు. నీవు కూడా రోగులకు ఈ సేవ చేస్తే వారు నీకు బలిహారమవుతారు. నీ ద్వారా సాక్షాత్కారము కూడా జరగవచ్చు. యోగయుక్తంగా ఉంటే గొప్ప-గొప్ప సర్జన్లు మొదలైన వారంతా నీ పాదాల పై పడ్తారు. నీవు చేసి చూడు. ఇక్కడకు మేఘాలు రిఫ్రెష్‌ అయ్యేందుకు వస్తాయి. అక్కడకెళ్లి వర్షించి ఇతరులనకు రిఫ్రెష్‌ చేస్తారు. చాలా మంది పిల్లలకు వర్షమెక్కడ నుండి వస్తుందో కూడా తెలియదు. ఇంద్రుడు వర్షిస్తాడని భావిస్తారు. ఇంద్రధనస్సు అని అంటారు కదా. శాస్త్రాలలో అయితే ఎన్ని మాటలు వ్రాసేశారు! తండ్రి చెప్తున్నారు - డ్రామాలో ఏం ఫిక్స్‌ అయిందో అది మళ్లీ జరుగుతుంది. నేను ఎవ్వరినీ నిందించను. ఇది తయారైన అనాది డ్రామా. అయితే ఇది భక్తిమార్గమని అర్థం చేయించబడ్తుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని అంటారు. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము పై వైరాగ్యమేర్పడింది. మీరు మరణించారు, ప్రపంచము మీకు మరణించింది. ఆత్మ శరీరము నుండి వేరైతే దానికి ప్రపంచమే సమాప్తము.
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా, చదువులో అజాగ్రత్తగా ఉండకండి. ఆధారమంతా చదువు పైనే ఉంది. కొంతమంది బ్యారిస్టర్లు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తారు. కొంతమందికి తొడుక్కునేందుకు కోటు కూడా ఉండదు. ఆధారమంతా చదువు పైనే ఉంది. ఈ చదువు చాలా సులభము. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అనగా మన 84 జన్మల ఆదిమధ్యాంతాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది. పునాది లేనే లేదు. మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. అలాగే ఈ ఆది సనాతన దేవీదేవతా ధర్మము ఏదైతే కాండముగా ఉండేదో, అది కూడా ఇప్పుడు లేనే లేదు. ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. మనుష్యులు ఎవ్వరికీ సద్గతినివ్వలేరు. తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మీరు సదా కాలము కొరకు సుఖవంతంగా అవుతారు. ఎప్పుడూ అకాలమృత్యువు జరగదు. ఫలానావారు మరణించినారనే పదమే అక్కడ ఉండదు. కనుక తండ్రి సలహా ఇస్తున్నారు - చాలామందికి దారి చూపిస్తే వారు మీకు బలిహారమవుతారు. సాక్షాత్కారములు కూడా జరగవచ్చు. సాక్షాత్కారము కేవలం 'లక్ష్యము - గురి'కి గుర్తు. ఆ లక్ష్యము కొరకు చదువుకోవలసి వస్తుంది కదా. చదవకుండా బ్యారిస్టరుగా అవ్వలేరు. సాక్షాత్కారమవుతూనే ముక్తులుగా అయ్యామని కాదు. మీరాబాయికి సాక్షాత్కారమయింది. కనుక కృష్ణపురములోకి వెళ్ళిపోయిందని కాదు. నౌధా(తొమ్మిది రకాల భక్తి) చేస్తే సాక్షాత్కారము జరుగుతుంది. ఇక్కడ నౌధా స్మృతి చేయాలి. సన్యాసులైతే బ్రహ్మ జ్ఞానులుగా, తత్వ జ్ఞానులుగా అవుతారు. అంతే. బ్రహ్మ తత్వములో లీనమైపోవాలని భావిస్తారు. అయితే బ్రహ్మతత్వము పరమాత్మ కాదు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాదులు భలే చేసుకోండి, కాని స్వయాన్ని ట్రస్టీగా(నిమిత్తమని) భావిస్తే ఉన్నత పదవి లభిస్తుంది. తర్వాత మమకారము నశిస్తుంది. ఈ బాబా తీసుకొని ఏం చేస్తాడు. ఇతడు అన్నీ వదిలేశాడు కదా. ఇల్లు, వాకిలి లేక భవనాలు మొదలైనవి నిర్మించకండి. ఇక్కడ భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారంటే అనేకమంది పిల్లలు వస్తారు. ఆబూరోడ్డు నుండి ఇక్కడి వరకు క్యూ ఏర్పడ్తుంది. మీ ప్రభావము ఇప్పుడే వెలువడితే తలను పాడు చేస్తారు. గొప్పవారు వస్తే జనము చాలా గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మీ ప్రభావము చివర్లో వెలువడ్తుంది. ఇప్పుడే కాదు. తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి. దాని వలన పాపాలు సమాప్తమైపోతాయి. అలా స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలేయాలి. సత్యయుగములో శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని భావిస్తారు. ఇక్కడైతే దేహాభిమానము చాలా ఉంటుంది. వ్యత్యాసముంది కదా. ఈ విషయాలన్నీ నోట్‌ చేసుకొని ఇతరులచే నోట్‌ చేయించాలి. ఇతరులను కూడా మీ సమానం వజ్ర సమానంగా చేయాల్సి వస్తుంది. ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఈ విషయాలన్నీ ఈ తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీరు ఏ సాధువులూ కాదు, మహాత్ములూ కాదు.
ఈ జ్ఞానము చాలా ఆనందమునిస్తుంది. దీనిని బాగా ధారణ చేయాలి. తండ్రి నుండి విన్న తర్వాత ఎక్కడున్నవారు అక్కడే ఉండరాదు. జతలో తీసుకెళ్ళమని అనడం పాటలో కూడా విన్నారు కదా. మీకు ఈ విషయాలు ఇంతకుముందు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు తండ్రి అర్థము చేయించిన తర్వాత మీరు అర్థము చేసుకున్నారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
మీ ప్రతి సంకల్పాన్ని, ప్రతి కార్యాన్ని అవ్యక్త బలముతో అవ్యక్త రూపము ద్వారా వెరిఫై చేసుకోవాలి. బాప్‌దాదాను సదా అవ్యక్త రూపంతో సన్ముఖంలో జతలో ఉంచుకొని ప్రతి సంకల్పము, ప్రతి కార్యము చేయాలి. 'సాథీ' ని, తోడును(సాథ్‌ను) అనుభవం చేయుట ద్వారా తండ్రి సమానం సాక్షి అనగా న్యారా - ప్యారాగా అవ్వాలి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చదువులో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండరాదు. పొరపాట్లు చేయరాదు. స్వదర్శన చక్రధారులై ఉండాలి. వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి.
2. సత్యమైన సంపాదన చేయాలి. ఇతరులతో చేయించాలి. మీ పాత వస్తువులన్నీ ఇచ్చి కొత్తవి తీసుకోవాలి. చెడు సాంగత్యము నుండి మిమ్ములను మీరు కాపాడుకోవాలి.

వరదానము :- '' సత్యమైన ఆత్మిక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్‌ స్నేహసాగర్‌ భవ ''
ఎలాగైతే సాగర తీరానికి వెళ్లినప్పుడు శీతలత అనుభవమవుతుందో, అలా పిల్లలైన మీరు మాస్టర్‌ స్నేహ సాగరులుగా అయితే, ఏ ఆత్మ మీ ముందుకు వచ్చినా వారు మాస్టర్‌ స్నేహసాగరుల అలలు అనుభూతి చేయిస్తున్నారని అనుభవం చేయాలి. ఎందుకంటే ఈనాటి ప్రపంచము సత్యమైన స్నేహం కొరకు ఆకలిగొని ఉన్నారు. స్వార్థపూరిత స్నేహము చూసి చూసి, ఆ స్నేహంతో మనసు ఉపరాంగా అయిపోయింది. అందువలన స్నేహపూరిత కొన్ని ఘడియల అనుభూతినైనా జీవితానికి ఆధారంగా భావిస్తారు.

స్లోగన్‌ :- '' జ్ఞాన ధనముతో సంపన్నంగా ఉంటే, స్థూల ధనము స్వతహాగా ప్రాప్తి అవుతూ ఉంటుంది ''

No comments:

Post a Comment