14-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పిల్లలే కర్మాతీతులుగా అవుతారు ''
ప్రశ్న :- పిల్లలైన మీ కొరకు ఇరువురు తండ్రులు ఏ శ్రమ చేస్తారు ?
జవాబు :- పిల్లలు స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు, సర్వగుణ సంపన్నము, 16 కళా సంపూర్ణులుగా చేసేందుకు తండ్రి మరియు దాదా(బాప్‌దాదా) ఇరువురూ శ్రమ చేస్తారు. ఇది మీకు డబల్ ఇంజన్ దొరికినట్లవుతుంది. ఇటువంటి అద్భుతమైన చదువును మీకు చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మీరు 21 జన్మలకు చక్రవర్తి పదవి పొందుకుంటారు.
పాట :- చిన్ననాటి రోజులు మర్చిపోరాదు,............(బచ్‌పన్ కెే దిన్ భులా న దేనా,...........)
ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. డ్రామా ప్లాను అనుసారము ఇటువంటి పాటలు సెలెక్టు చేయబడ్డాయి. వీరు సినిమా లేక నాటకములోని పాటలను ఉపయోగించి వాణి చేస్తున్నారే, ఇదేం జ్ఞానము అని మానవులు ఆశ్చర్యపడ్తారు. శాస్త్ర్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ వదిలేశారు, రికార్డును ఉపయోగించి వాణి చేస్తున్నారు! అని ఆశ్చర్యపడ్తారు. మనము అనంతమైన తండ్రివారగా అయ్యామని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీని ద్వారా అతీంద్రియ సుఖము లభిస్తుంది. ఇటువంటి తండ్రిని మర్చిపోరాదు. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జన్మ-జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. స్మృతిని వదిలి పాపాలను ఉంచుకోరాదు. అలాగైతే పదవి కూడా తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేసే పురుషార్థము చేయాలి. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగెే మీ నిశ్చితార్థము కూడా జరిగిపోయింది. మీరు కర్మాతీత స్థితిని పొందుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు. ఇప్పుడు శివబాబా కూడా ఉన్నారు. పజ్రాపిత బహ్మ్రాబాబా కూడా ఉన్నారు. మీకు రెండు ఇంజన్లు లభించాయి. ఒకరు నిరాకారులు, మరొకరు సాకారులు. ఇరువురు కలిసి పిల్లలను స్వర్గానికి అర్హులుగా అవ్వాలని శమ్ర చేస్తున్నారు. సర్వ గుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. ఇక్కడ పరీక్షలో పాస్ అవ్వాలి. ఈ విషయాలు ఏ శాస్త్ర్రాలలోనూ లేవు. ఈ చదువు చాలా అద్భుతమైనది. భవిష్యత్తులో 21 జన్మలకు ఉపయోగపడ్తుంది. ఇతర చదువులు మృత్యులోకము కొరకు ఉపయోగపడ్తాయి. ఈ చదువు అమరలోకము కొరకు. అందుకొరకు చదువుకోవాల్సింది ఇక్కడే కదా. ఎంతవరకు ఆత్మ పవిత్రమవ్వదో అంతవరకు సత్యయుగములోకి వెళ్లలేదు. అందువలన పావనంగా చేసేందుకు తండ్రి సంగమ యుగములోనే వస్తారు, దీనినే పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు. ఈ యుగములో మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. అందుకు మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీ శ్రీ అని ఒక్క శివబాబానే అంటారు. 'మాల' అర్థము కూడా పిల్లలకు అర్థము చేయించాము. మాలకు పైన ఉన్న పుష్పము శివబాబా తర్వాత జంటపూస. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఆ తర్వాత విజయము పొందుకునే వారి గుర్తుగా మిగిలిన పూసలు. వారిదే రుద్రమాల, తర్వాత విష్ణుమాల తయారవుతుంది. ఈ మాలకు అర్థము ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవ్వాలి. 63 జన్మలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు ఒకే ప్రియునికి ప్రేయసులు. అందరూ ఒక్క భగవంతుని భక్తులే. వారు పతులకు పతి, తండ్రులకు తండ్రి వారొక్కరే. వారు పిల్లలైన మిమ్ములను రాజాధి రాజులుగా తయారుచేస్తారు. వారు స్వయం రాజాధి రాజుగా అవ్వరు. తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు - తండ్రి స్మృతి ద్వారానే జన్మ-జన్మాంతరాల మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపమని అంటారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మయే తీసుకెళ్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ చూచినా అంతటా భగవంతుడే, భగవంతుడని వారంటారు. ఈ లీలలన్నీ భగవంతునివే అని వారంటారు. పూర్తిగా వామమార్గములో అపవిత్రమైపోతారు. ఇటువంటి మతాన్ని కూడా లక్షలమంది అనుసరిస్తున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. సదా మీ బుద్ధిలో మూడు ధామాలను గుర్తుంచుకోండి. శాంతిధామములో ఆత్మలుంటాయి. రెండవది సుఖధామము, దీని కొరకు మీరు పురుషార్థము చేస్తున్నారు. అర్ధకల్పము తర్వాత దు:ఖధామము మొదలవుతుంది. భగవంతుడనగా స్వర్గాన్ని స్థాపించిన తండ్రిని హెవెన్లీ గాడ్‌ఫాదర్ అని అంటారు. వారు నరకమును స్థాపన చేయరు. నేను సుఖధామాన్ని స్థాపన చేస్తానని తండ్రి చెప్తున్నారు. పోతే ఇది గెలుపు-ఓటముల ఆట. పిల్లలైన మీరు శ్రీమతముననుసరించి ఇప్పుడు మాయా రూపి రావణుని పై విజయము పొందుతారు. మళ్లీ అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. పిల్లలైన మీరిప్పుడు యుద్ధ మైదానములో ఉన్నారు. ఇది బుద్ధిలో ధారణ చేయాలి, ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అంధులకు ఊతకర్రగా అయి ఇంటికి మార్గాన్ని తెలపాలి ఎందుకంటే ఆ ఇంటిని అందరూ మర్చిపోయారు. ఇది ఒక నాటకమని కూడా అంటారు. కానీ దీని ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు. రావణుడు మిమ్ములను ఎంత అంధులుగా(జ్ఞాన నేత్ర హీనులుగా) చేశాడో తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. తండ్రినే జ్ఞానసాగరులని అంటారు. అలాగని వారు అందరి ఆంతర్యమును తెలిసినవారని కాదు. ఆ పని క్షుద్ర విద్యలు తెలిసినవారు చెప్తారు. మీ లోపల ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు. జ్ఞానసాగరులనగా అర్థము ఇది కాదు. ఈ మహిమ ఆ తండ్రిదే. వారు జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. వారు అంతర్యామి అని మనుష్యులంటారు. వారు టీచర్ అని మనలను చదివిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వారు ఆత్మలందరికీ తండ్రి కూడా అయ్యారు. ఆత్మిక సద్గురువు కూడా వారే. ఆ భౌతిక టీచరు గురువుగా ఉంటాడు. అది కూడా వేరు వేరుగా ఉంటారు. ముగ్గురూ ఒక్కరే అయ్యేందుకు వీలు లేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కరే తండ్రిగా, టీచరుగా ఇరువురిగా ఉంటారు. కాని గురువుగా ఉండరు. అయినా వారు మానవులు. ఇక్కడ పరమపిత పరమాత్మ చదివిస్తారు. ఆత్మయే పరమాత్మ అని అనరాదు. ఇది కూడా ఎవ్వరికీ అర్థము కాదు. పరమాత్మ అర్జునునికి సాక్షాత్కారము చేయించారని, అర్జునుడు ఇక చాలు అన్నాడని, నేను ఇంత తేజస్సును సహించలేనని అర్జునుడు అన్నాడని అంటారు. ఇదంతా విన్నవారు పరమాత్మ ఎంతో గొప్ప తేజోవంతులని భావిస్తారు. ప్రారంభములో బాబా వద్దకు వచ్చినవారికి సాక్షాత్కారాలయ్యేవి. ఇక చాలు, చాలా తేజంగా ఉన్నారని, మేము సహించలేమని అనేవారు. ఎందుకంటే విన్నదంతా బుద్ధిలో భావనగా ఉండిపోతుంది. ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో వారి భావనలను నేను పూర్తి చేయగలను. ఎవరైనా విఘ్నేశ్వరుని పూజారి అయితే అతనికి విఘ్నేశ్వరుని సాక్షాత్కారము చేయిస్తాను. సాక్షాత్కారము అయినంతనే ముక్తిధామానికి చేరుకున్నామని భావిస్తారు. కానీ అలా జరగదు. ముక్తిధామానికి ఎవ్వరూ వెళ్లలేరు. నారదుని ఉదాహరణ కూడా ఉంది. అతను భక్తశిరోమణి అని మహిమ చేయబడ్డాడు. అతను నేను లక్ష్మిని వరిస్తానని అన్నప్పుడు నీ ముఖము చూసుకోమని చెప్పారు. భక్తుల మాల కూడా ఉంటుంది. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు ముఖ్యులని గాయనము చేయబడ్డారు. ఇక్కడ జ్ఞానములో ముఖ్యశిరోమణి సరస్వతి. నంబరువారుగా ఉంటారు కదా.
మాయ నుండి చాలా హెచ్చరికగా ఉండాలని తండ్రి అర్థం చేయిస్తారు - మాయ ఎటువంటి వ్యతిరేక పనులు చేయిస్తుందంటే, వాటి వలన చివర్లో చాలా ఏడ్చి పశ్చాత్తాపపడవలసి వస్తుంది - భగవంతుడు వచ్చినా మేము వారసత్వము తీసుకోలేకపోయామని బాధపడ్తారు. ప్రజలలో కూడా దాస-దాసీలుగా అవుతారు. చివర్లో చదువేమో పూర్తి అయిపోతుంది. తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. చివర్లో పశ్చాత్తాప పడరాదని బాబా ముందే తెలియచేస్తున్నారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత యోగాగ్నిలో పాపాలు భస్మమైపోతాయి. ఆత్మ సతోప్రధానంగా ఉండేది. అందులో మలినము చేరుతూ చేరుతూ తమోప్రధానమైపోయింది. బంగారు, వెండి, రాగి, ఇనుము,........... పేర్లు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇనుప యుగము నుండి మళ్లీ మీరు బంగారు యుగములోకి వెళ్లాలి. పవిత్రంగా అవ్వకుండా ఆత్మలు వెళ్లలేవు. సత్యయుగములో పవిత్రత ఉండేది కనుక సుఖ- శాంతులు కూడా ఉండేవి. ఇక్కడ పవిత్రత లేదు కనుక సుఖ-శాంతులు కూడా లేవు. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. అందువలన చిన్ననాటి రోజులు మర్చిపోకండని బాబా అర్థం చేయిస్తారు. తండ్రి దత్తత చేసుకున్నారు కదా. బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. దీనిని దత్తత అని అంటారు. స్త్రీ దత్తత తీసుకోబడ్తుంది. స్త్రీని రచన అని అనరు. పిల్లలు రచింపబడ్తారు. ఈ తండ్రి కూడా దత్తత చేసుకుంటారు. మీరు కల్పక్రితము దత్తత తీసుకున్న పిల్లలే అని తండ్రి అంటున్నారు. దత్తత తీసుకోబడిన పిల్లలకే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. అత్యంత ఉన్నతమైన తండ్రి నుండి అత్యంత ఉన్నతమైన వారసత్వము లభిస్తుంది. వారు భగవంతుడు. రెండవ నంబరులో లక్ష్మీనారాయణులు. వీరు సత్యయుగానికి యజమానులు. ఇప్పుడు మీరు సత్యయుగానికి అధికారులుగా అవుతున్నారు. ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు. అవుతూ ఉన్నారు.
పావనంగా అయి పావనంగా చేయడమే సత్యమైన ఆత్మిక సేవ. ఇప్పుడు మీరు ఆత్మిక సేవ చేస్తున్నారు. అందువలన మీరు చాలా ఉన్నతమైనవారు. శివబాబా పతితులను పావనంగా చేస్తారు. మీరు కూడా పావనముగా చేస్తారు. రావణుడు ఎంత తుచ్ఛ బుద్ధిగా తయారుచేశాడు. ఇప్పుడు తండ్రి మళ్లీ అర్హులుగా చేసి విశ్వానికి అధికారులుగా చేస్తారు. ఇటువంటి తండ్రి రాయి, రప్పలలో ఉన్నారని ఎలా అనగలరు? తండ్రి చెప్తున్నారు - ఇది తయారైన ఆట. కల్పము తర్వాత మళ్లీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు డ్రామా ప్లాను అనుసారము నేను మీకు అర్థం చేయించేందుకు వచ్చాను. ఇందులో కొంచెము కూడా తేడా రాదు. తండ్రి ఒక్క సెకెండు కూడా ఆలస్యము చేయరు. బాబా ఎలా అవతరిస్తారో, అలా పిల్లలైన మీరు కూడా అవతరిస్తారు. మీరు అవతరించినవారు. ఆత్మ ఇక్కడకు వచ్చిన తర్వాత సాకారంలో పాత్రను అభినయిస్తుంది, దీనినే అవతరణ అని అంటారు. పై నుండి క్రిందికి పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రిది కూడా దివ్యమైన, అలౌకిక జన్మ. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది. నేను ఈ శరీరములో ప్రవేశిస్తాను. ఇది నాకు నిర్ణయించబడిన శరీరము. ఇది చాలా అద్భుతమైన ఆట. ఈ నాటకములో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది, ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటారు. 21 జన్మల పాత్రను మళ్లీ ఇలానే అభినయిస్తారు. మీకు నంబరువారు పురుషార్థమనుసారము స్పష్టమైన జ్ఞానము లభించింది. మహారథులను బాబా మహిమ చేస్తారు కదా. పాండవ, కౌరవ యుద్ధము జరిగినట్లు చూపిస్తారు కదా. ఇవన్నీ కాల్పనికమైన కథలు. వారు శారీరిక డబల్ హింసకులు, మీరు ఆత్మిక డబల్ అహింసకులని మీరు అర్థం చేసుకున్నారు. చక్రవర్తి పదవిని తీసుకునేందుకు మీరిక్కడ ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. ఇదే చింతలో లగ్నమై ఉన్నారు. శ్రమ అంతా స్మృతి చేయడంలోనే ఉంది. అందుకే భారతదేశపు ప్రాచీనయోగము మహిమ చేయబడింది. విదేశాలవారు కూడా ఈ భారతదేశ ప్రాచీన యోగమును నేర్చుకోవాలనుకుంటున్నారు. సన్యాసులు ఈ యోగము నేర్పిస్తారని వారు భావిస్తారు. వాస్తవానికి వారు ఏమీ నేర్పించరు. వారిది హఠయోగ సన్యాసము. మీరు ప్రవృత్తి మార్గములోనివారు. మీ రాజ్యము ప్రారంభములోనే ఉండేది. ఇప్పుడిది అంతిమ సమయం. ఇప్పుడు పంచాయితి రాజ్యముంది. ప్రపంచములో అంధకారము చాలా ఉంది. ఇప్పుడు అనవసర రక్తపాత నాటకము జరుగుతుందని మీకు తెలుసు. ఇది కూడా ఒక నాటకంగా చూపిస్తారు. కాని ఇది బేహద్ విషయము. ఎన్నో ఖూనీలు జరుగుతాయి. ఎంతో రక్త పాతము జరుగుతుంది. ప్రాకృతిక ఆపదలు వస్తాయి. అందరూ మరణిస్తారు. దీనిని అనవసర రక్తపాతము(ఖూనే నాహేక్) అని అంటారు. ఇది చూచేందుకు చాలా ధైర్యముండాలి. పిరికివారు వెంటనే మూర్ఛపోతారు. ఇది చూచేందుకు చాలా నిర్భయత అవసరము, మీరు శివశక్తులు కదా. శివబాబా సర్వశక్తివంతులు. మనము వారి నుండి శక్తి తీసుకుంటాము. పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తి తండ్రి మాత్రమే తెలుపగలరు. తండ్రి చాలా సింపుల్ సలహా ఇస్తున్నారు. పిల్లలూ! మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా, సతోప్రధానంగా అవుతారు. ఆత్మ తండ్రితో యోగము చేస్తే పాపము భస్మమైపోతుంది. ఆ అథారిటి కూడా తండ్రియే. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించినట్లు వారి ద్వారా సర్వ వేదశాస్త్ర్రాల రహస్యాలను తెెలిపారని చిత్రాలలో చూపిస్తారు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. స్థాపన అయిన దానిని తప్పకుండా పాలన కూడా చేస్తారు కదా. ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేయించబడ్డాయి. అర్థము చేసుకున్నవారు ఈ ఆత్మిక జ్ఞానము అందరికీ ఎలా లభించాలని ఆలోచిస్తూ ఉంటారు. మన వద్ద ధనము ఉంటే సెంటర్లు ఎందుకు తెరవరాదని అనుకుంటూ ఉంటారు. తండ్రి అంటున్నారు - అచ్ఛా, బాడుగకు అయినా ఇల్లు తీసుకోండి. అందులో ఆసుపత్రి కం యూనివర్సిటీ తెరవండి. యోగము ద్వారా ముక్తి, జ్ఞానము ద్వారా జీవన్ముక్తి. రెండు వారసత్వాలు లభిస్తాయి. ఇందుకు కేవలము 3 అడుగుల జాగా చాలు. ఇంకేమీ అవసరము లేదు. అందులో గాడ్‌ఫాదర్‌లీ యూనివర్సిటీ తెరవండి. విశ్వవిద్యాలయమన్నా యూనివర్సిటీ అన్నా ఒక్కటే. ఇది మానవుల నుండి దేవతలుగా తయారయ్యే చాలా గొప్ప యూనివర్సిటీ. ఇది జరిగేందుకు ఖర్చు ఎలా వస్తుంది? అని అడుగుతారు. అరే బి.కెల తండ్రికి ఎంతమంది పిల్లలున్నారో మీకు తెలుసా? మీరు అడిగేందుకు వచ్చారా! బోర్డు పై ఏమి వ్రాసి ఉందో చూడండి. ఇది చాలా అద్భుతమైన జ్ఞానము. తండ్రి కూడా అద్భుతమైనవారే కదా. మీరు విశ్వానికి అధికారులుగా ఎలా అవుతారు? శివబాబాను శ్రీ శ్రీ అని అంటారు. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైనవారు కదా. లక్ష్మీనారాయణులను శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ అని అంటారు. ఇవన్నీ చాలా బాగా ధారణ చేసే విషయాలు. తండ్రి చెప్తున్నారు - నేను మీకు రాజయోగము నేర్పిస్తాను. ఇది సత్య-సత్యమైన అమరకథ. కేవలం ఒక్క పార్వతికే అమరకథను వినిపించి ఉండరు. అమరనాథ యాత్రకు ఎంతోమంది మనుష్యులు వెళ్తారు. రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరు రిఫ్రెష్ అయిన తర్వాత అందరికీ తెలిపి రిఫ్రెష్ చేయాలి. సెంటర్ తెరవాలి. కేవలం 3 అడుగుల జాగా తీసుకుని ఆస్పత్రి కం యూనివర్సిటీ తెరుస్తూ వెళ్లండి. చాలామందికి కళ్యాణమవుతుంది. ఇందులో ఏ ఖర్చు కూడా లేదు. ఆరోగ్యము, సంపద, సంతోషము అన్నీ ఒక్క సెకెండులోనే లభిస్తాయి. పిల్లలు జన్మిస్తూనే వారసులుగా అవుతారు. నిశ్చయమైన వెంటనే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. తర్వాత మీరు చేసే పురుషార్థము పై ఆధారపడి ఉంటుంది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్
పూర్తి రోజంతా అందరి పట్ల కళ్యాణ భావన, సదా స్నేహ సహయోగాలనిచ్చే భావన, ధైర్యము - ఉత్సాహాలను పెంచే భావన, నా వారనే భావన, ఆత్మిక స్వరూప భావనను ఉంచుకోవాలి. ఈ భావన అవ్యక్త స్థితిని తయారు చేసుకునేందుకు ఆధారము.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అంతిమ అనవసర రక్తపాతము జరిగే దృశ్యాన్ని చూచేందుకు చాలా చాలా నిర్భయంగా, శివశక్తులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకోవాలి.
2. పావనంగా అయి పావనంగా చేసే సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. అంధులకు ఊతకర్రగా అయి అందరికీ ఇంటి దారిని తెలపాలి.
వరదానము :- '' పాత సంస్కారాలను అగ్ని సంస్కారము చేసే (కాల్చివేసే) సత్యమైన మరజీవా భవ ''
ఎలాగైతే మరణించిన తర్వాత శరీరాన్ని అగ్ని సంస్కారము చేస్తే వారి నామ-రూపాలు సమాప్తమైపోతాయో, అలా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరజీవాగా అవుతారో శరీరము అదే అయినా పాత సంస్కారాలు, స్మృతులు లేక స్వభావాలను సంస్కారము చేసేస్తారు. సంస్కారము చేయబడిన మనిషి మళ్లీ ముందుకు వస్తే దానిని భూతమని ఎలా అంటారో, అలా ఇక్కడ కూడా ఏదైనా కాల్చేసిన సంస్కారము జాగృతమైతే అది కూడా మాయ భూతమే. ఈ భూతాలను తరిమేయండి. వాటిని వర్ణన కూడా చేయకండి.
స్లోగన్ :- '' కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులు కర్మయోగ స్థితిని వర్ణిస్తూ ఉండండి ''
No comments:
Post a Comment