25-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఈ అంతిమ జన్మలో లెక్కాచారమంతా చుక్త చేసుకొని పావనంగా అవ్వాలి ''
ప్రశ్న :- మోసకారి మాయ ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రయత్నిస్తుంది ?
జవాబు :- ఏ దేహధారితోనూ మేము మా హృదయాన్ని జోడించమని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తానని, నా దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది. తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసము చేయిస్తారు. కానీ మాయ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘింపజేస్తుంది. దేహము పై మోహము(ఆకర్షణ) కలుగుతుంది. ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తారో, వారు చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది.
పాట :- మీరే తల్లి - తండ్రి, మీరే బంధువు,...............( తుమ్ హీ హో మాతా-పితా, తుమ్ హీ హో,..........)
ఓంశాంతి. ఉన్నతాతి ఉన్నతులైన భగవంతుని మహిమ కూడా చేశారు, మళ్లీ గ్లాని కూడా చేశారు అనగా నిందించారు. ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయమునిస్తున్నారు. మళ్లీ రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు. భక్తిమార్గములో భక్తి రాజ్యమే ఉంటుంది. అందుకే రావణ రాజ్యమని అంటారు. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. రాముడు, రావణుని పోల్చుతారు. పోతే ఆ రాముడైతే త్రేతా యుగములోని రాజు. అతను ఈ రాముడు కాదు. రావణుడు అర్ధకల్పానికి రాజు. అలాగని రాముడు అర్ధకల్పానికి రాజు అని అనరు. ఇవి విస్తారంగా అర్థము చేసుకోవాల్సిన విషయాలు. కాని అర్థము చేసుకోవడం చాలా చాలా సులభము. మనమంతా సోదరులము(భాయి-భాయి) మనందరి తండ్రి ఆ నిరాకారుడు ఒక్కరే. ఇప్పుడు తన పిల్లలందరూ రావణుని జైలులో ఉన్నారని తండ్రికి తెలుసు. కామచితి పై కూర్చుని అందరూ నల్లగా మాడిపోయారని బాబాకు తెలుసు. జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది కదా. ఇందులో కూడా అన్నిటికంటే ఎక్కవ మహత్యము ఆత్మ-పరమాత్మల గురించి తెలుసుకునేందుకు ఇవ్వాలి. ఇంత చిన్న ఆత్మలో ఎంతో పెద్ద పాత్ర నిండి ఉంది. ఆత్మ ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. దేహాభిమానములోకి వచ్చి పాత్ర చేసినప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు ఎందుకంటే ఆత్మయే నేను పావనంగా అవ్వాలని కోరుకుంటుంది. పావనంగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఓ పరమపితా, ఓ పతిత పావనా, మేము ఆత్మలము పతితంగా అయ్యాము, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని ఆత్మలే పిలుస్తాయి ఎందుకంటే సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది కదా. నేను పతితంగా అయ్యానని ఆత్మ స్పష్టంగా చెప్తుంది. వికారాలకు లోబడినవారిని పతితులని అంటారు. పతిత మనుష్యులు, పావన నిర్వికార దేవతల ముందుకు వెళ్లి, మందిరాలలో వారిని మహిమ చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగాల్సి వచ్చింది. ఇది పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అయ్యే ఆట. ఈ జ్ఞానమంతా ఆ తండ్రే వచ్చి సూచనలతో అర్థం చేయిస్తారు. ఇప్పుడిది అందరికీ అంతిమ జన్మ. అందరూ వారి లెక్కాచారాలను చుక్త్త చేసుకొని వెళ్లాలి. బాబా సాక్షాత్కారము చేయిస్తారు. పతితులు తమ వికర్మల శిక్షలు తప్పకుండా అనుభవించవలసి పడ్తుంది. చివర్లో ఏదో ఒక్క జన్మను ఇచ్చి వారిని శిక్షిస్తారు. మనుష్య శరీరములోనే శిక్షలు అనుభవిస్తారు. అందువలన తప్పకుండా శరీరాన్ని ధరించవలసి వస్తుంది. నేను శిక్షలను అనుభవిస్తున్నానని ఆత్మ అనుభవం చేస్తుంది. కాశీకల్వట్(కాశీలోని కత్తుల బావిలో దూకి ప్రాణ త్యాగము చేసుకొను ఆచారము) సమయంలో శిక్షలు అనుభవిస్తున్నామని అనుభవం చేస్తారు. గతంలో చేసిన పాపాల సాక్షాత్కారము జరుగుతుంది. ఓ భగవంతుడా! క్షమించండి, మేము మళ్లీ ఇలా పాపము చేయము అని వేడుకుంటారు. సాక్షాత్కారములోనే క్షమించమని యాచిస్తారు. ఫీల్ చేస్తారు, దు:ఖాన్ని అనుభవిస్తారు. ఆత్మ- పరమాత్మలకే ఎక్కువ గొప్పతనముంది. ఆత్మనే 84 జన్మల పాత్ర అభినయిస్తుంది. కనుక ఆత్మ అన్నింటికంటేె శక్తివంతమయింది కదా. మొత్తం డ్రామాలో ఆత్మ-పరమాత్మలకే ప్రాధాన్యత ఉంది. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఒక్క మనిషికి కూడా తెలియదు. డ్రామానుసారంగా ఇది కూడా జరగాల్సిందే, ఇది క్రొత్త విషయమేమీ కాదని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితం కూడా ఇదే విధంగా జరిగింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అంటారు కానీ అర్థము తెలియదు. ఈ బాబా సాధువులు మొదలైనవారి సాంగత్యము చాలా చేేశారు. వారు కేవలం జ్ఞానము, భక్తి, వైరాగ్యమని పేరుకు మాత్రం అంటారు. ఈ పాత ప్రపంచము నుండి క్రొత్త ప్రపంచములోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు బాగా తెలుసు. కనుక మనకు ఈ పాత ప్రపంచము పై తప్పకుండా వైరాగ్యము కలగాలి. ఇంకా దీని పై మనసు ఎందుకు పెట్టాలి. ఏ దేహధారి పైనా మనసు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తానని, స్వంత దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది. తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసము చేయిస్తారు. అటువంటప్పుడు ఇతరుల దేహము పై ఎందుకు ఆకర్షణ ఉంచాలి? ఎవరి పై ఆకర్షణ ఉండినా వారి స్మృతి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు గుర్తుకు రాడు. ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తే, చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. అందువలన ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. మాయ చాలా మోసకారి. ఏ పరిస్థితిలోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. దేహాభిమానము చాలా కఠినమైన జబ్బు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే దేహాభిమానమనే జబ్బు వదిలిపోతుంది. రోజంతా దేహాభిమానములో ఉంటారు. తండ్రిని చాలా కష్టంగా స్మృతి చేస్తారు. బాబా అర్థం చేయించారు - చేతులతో పనులు చేయండి, హృదయములో స్మృతి చేయండి(హాత్ కార్ డే దిల్ యార్ డే........). వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా ప్రేయసి తన ప్రియుడినే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మను ప్రేమించాలి. అందువలన వారినొక్కరినే స్మృతి చేయాలి కదా. మనము దేవీ దేవతలుగా అవ్వాలని మీ లక్ష్యము. అందుకొరకు పురుషార్థము చేయాలి. మాయ తప్పకుండా మోసగిస్తుంది. స్వయాన్ని దాని నుండి విడిపించుకోవాలి లేకుంటే చిక్కుకొని మరణిస్తారు. గ్లాని కూడా జరుగుతుంది. చాలా నష్టము కూడా కలుగుతుంది.
మనమంతా ఆత్మలము, బిందువులము. మన తండ్రి కూడా బీజరూపులు, జ్ఞానసాగరులు......... అని పిల్లలైన మీకు తెలుసు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఆత్మ అనగా ఏమిటో అందులో అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో ఈ రహస్యమైన విషయాలను మంచి-మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మగా భావించి, తండ్రిని కూడా బిందు సమానమని భావించి స్మృతి చేయాలి. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు, ఇలా భావించి చాలా కష్టంగా(అరుదుగా) స్మృతి చేస్తారు. మందబుద్ధి ఆలోచనలతో కాకుండా సూక్ష్మమైన బుద్ధితో పని చేయాలి. మనము ఆత్మలము, మన తండ్రి వచ్చి ఉన్నారు. వారు బీజరూపులు, జ్ఞానసాగరులు మనకు జ్ఞానము వినిపిస్తున్నారు. ధారణ కూడా అత్యంత సూక్ష్మమైన నా ఆత్మలోనే జరుగుతుంది. చాలామంది ఊరకే(అర్థము తెలియకుండానే) ఆత్మ మరియు పరమాత్మ.... అంటారు. కానీ యథార్థంగా బుద్ధిలోకి రాదు. అసలు చేయకపోవడం కంటే ఇలా మందస్మృతి చేసినా మంచిదే. కానీ ఆ యథార్థ స్మృతి చాలా ఫలదాయకము. వారు అంత శ్రేష్ఠమైన పదవిని పొందలేరు. ఇందులో చాలా శ్రమ ఉంది. నేను ఆత్మ, చిన్న బిందువును, బాబా కూడా ఇంత చిన్న బిందువే. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారు కనుక కొంచెమైనా బుద్ధిలోకి వస్తుంది. కానీ నడుస్తూ, తిరుగుతూ ఆ చింతన ఉండాలి, కానీ అలా లేదు, మర్చిపోతారు. మొత్తం రోజంతా అదే చింతన ఉండాలి. ఇదే సత్య-సత్యమైన స్మృతి. ఎలా స్మృతి చేస్తున్నారో యథార్థంగా ఎవ్వరూ తెలుపరు. చార్టు భలే పంపుతారు. కానీ స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని కూడా బిందువుగా భావించి స్మృతి చేస్తున్నానని ఎవ్వరూ వ్రాయరు. పూర్తి సత్యంగా ఎవ్వరూ వ్రాయరు. చాలా బాగా మురళి చదివి వినిపిస్తారు. కానీ యోగము చాలా తక్కువగా ఉంది. దేహాభిమానము చాలా ఎక్కువగా ఉంది. ఈ గుప్త విషయాలను పూర్తిగా అర్థము చేసుకోరు. స్మృతి చేయరు. స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. మొదట కర్మాతీత స్థితి కావాలి కదా. వారే ఉన్నత పదవి పొందగలరు. మురళి చదివేవారు అనేకమంది ఉన్నారు కానీ యోగములో ఉండలేరని బాబాకు తెలుసు. విశ్వానికి అధికారులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభము కాదు. వారు అల్పకాల పదవి పొందుకునేందుకు ఎంతగానో చదువుకుంటారు. ఆదాయానికి మూలము(సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్) ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు బ్యారిష్టరు మొదలైన వారికి ఇంత సంపాదన ఉండేది కాదు. ఇప్పుడు చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు.
యథార్థ పద్ధతిలో పిల్లలు తమ కళ్యాణము కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయాలి. త్రిమూర్తి శివుని పరిచయము ఇతరులకు కూడా ఇవ్వాలి. కేవలం శివ అన్నందున అర్థము చేసుకోరు. త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి. ముఖ్యమైనవి రెండు చిత్రాలు. 1. త్రిమూర్తి 2. కల్పవృక్షము. మెట్ల చిత్రము కంటే వృక్షము చిత్రములో ఎక్కువ జ్ఞానముంది. ఈ చిత్రాలు అందరి వద్ద ఉండాలి. ఒకవైపు త్రిమూర్తి, సృష్టి చక్రము, మరోవైపు కల్ప వృక్షమును పెట్టాలి. పాండవ సైన్యము యొక్క ఈ జెండా ఉండాలి. డ్రామా మరియు కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తున్నారు. లక్ష్మీనారాయణులు, విష్ణువు మొదలైనవారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. మహాలక్ష్మిని పూజిస్తే లక్ష్మి(ధనము) వస్తుందని భావిస్తారు. కానీ లక్ష్మికి ధనము ఎక్కడ నుండి వస్తుంది? నాలుగు భుజాల దేవతలు, 8 భుజాల దేవతల చిత్రాలు చాలా తయారు చేశారు. కొంచెం కూడా అర్థము చేసుకోరు. 8-10 భుజాలున్న మనుష్యులు ఎవ్వరూ ఉండరు. ఎవరికి ఎలా తోస్తే అలా తయారు చేశారు. అలాగే నడుస్తూ పోయారు. ఎవరో హనుమంతుని పూజ చేయండి అని చెప్పగానే పూజ చేయడం ప్రారంభించారు. సంజీవని మూలికను తీసుకుని వచ్చారని చూపిస్తారు, దాని అర్థము కూడా పిల్లలైన మీకు తెలుసు. సంజీవిని మూలిక అనగా ' మన్మనాభవ.' ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వమో, తండ్రి పరిచయము లభించదో అంతవరకు పైసకు కొరగానివారే (వర్త్ నాట్ ఏ పెన్నీ ). మనుష్యులకు వారి పదవులంటే చాలా అభిమానము. వారికి అర్థం చేయించాలంటే చాలా కష్టము. రాజ్య స్థాపనలో ఎంతో శ్రమ కలుగుతుంది. వారిది బాహుబలము. మీది యోగబలము. ఈ విషయాలు శాస్త్రాలలో లేనే లేవు. వాస్తవానికి మీరు ఏ శాస్త్రాలు మొదలైన వాటిని రెఫర్ చేయరు. మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా? అని ఎవరైనా అడిగితే శాస్త్రాలన్నీ భక్తిమార్గానికి చెందినవి. ఇప్పుడు మేము జ్ఞాన మార్గములో ఉన్నామని చెప్పండి. జ్ఞానమిచ్చేవారు ఒకే ఒక జ్ఞానసాగరులైన తండ్రి మాత్రమే. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ కూర్చొని ఆత్మలకు జ్ఞానమిస్తున్నారు. అక్కడ మనుష్యులు మనుష్యులకు ఇస్తారు. మనుష్యులు ఆత్మిక జ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ముక్తిదాత, సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే.
ఇది చేయండి, ఇది చేయండి అని తండ్రి మనకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు శివజయంతి రాబోతుంది. శివజయంతి ఎంత వైభవంగా చేస్తారో చూడాలి. ట్రాన్స్ లైట్ చిత్రము చిన్నదైనా అందరికీ అందాలి. మీది పూర్తిగా క్రొత్త విషయము. ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. వార్తాపత్రికలలో చాలా ఎక్కువగా ప్రచురింపచేయాలి. శబ్ధము వ్యాపించాలి. సెంటర్లు తెరిచేవారు కూడా ఇలా శక్తిశాలిగా ఉండాలి. అయితే ఇంకా పిల్లలలో అంత నషా ఎక్కలేదు. నంబరువారు పురుషార్థానుసారము అర్థం చేయిస్తారు. ఎంతోమంది బి.కె.లు ఉన్నారు. బ్రహ్మ పేరు తప్పకుండా ఉండాలి. బ్రహ్మ పేరు తీసి వేరే పేరు ఏదైనా వ్రాసినామనుకోండి. రాధా-కృష్ణుల పేర్లు వేసినామనుకోండి. అప్పుడు బి.కె.లు ఎక్కడి నుండి వస్తారు? ఎవరో ఒక బ్రహ్మ ఉండాలి కదా. అప్పుడు వారి ముఖవంశావళి బి.కె.లని అంటారు. పిల్లలు పోను పోను చాలా అర్థం చేసుకుంటారు. ఖర్చు తప్పకుండా చేయవలసి వస్తుంది. చిత్రాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీనారాయణుల చిత్రము చాలా బాగుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్
సంపూర్ణ ఫరిస్తా లేక అవ్యక్త ఫరిస్తా డిగ్రీ తీసుకునేందుకు అన్ని గుణాలలో ఫుల్‌గా అవ్వండి. నాలెడ్జ్‌ఫుల్‌తో పాటు ఫెయిత్‌ఫుల్, పవర్‌ఫుల్, సక్సెస్‌ఫుల్‌గా(విజయులుగా) అవ్వండి. ఇప్పుడు ఈ సున్నితమైన సమయంలో వయ్యారంగా నడవడం మాని, వికర్మలు మరియు వ్యర్థ కర్మలను తమ వికరాల రూపంతో(శక్తి రూపంతో) సమాప్తం చేయండి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి. చదువుతో పాటు యోగము పై పూర్తి గమనముంచాలి.
2. స్వయాన్ని మాయ చేసే మోసము నుండి రక్షించుకోవాలి. ఎవరి దేహములోనూ మోహముంచుకోరాదు. సత్యమైన ప్రేమ ఒక్క తండ్రి పైనే ఉంచాలి. దేహాభిమానములోకి రారాదు.
వరదానము :- '' సమయం మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నం చేసుకునే విశ్వానికి ఆధారమూర్త్ భవ ''
ఇది మొత్తం కల్పానికంతా సంపాదన చేసుకునే, శ్రేష్ఠ కర్మ రూపి బీజాన్ని నాటే, 5 వేల సంవత్సరాల రికార్డును నింపుకునే విశ్వ కళ్యాణ సమయము లేక విశ్వ పరివర్తన జరిగే సమయం. ఒకవేళ సమయం గురించిన జ్ఞానమున్నవారు కూడా ఈ సమయాన్ని పోగొట్టుకుంటే లేక రాబోయే సమయం పై వదిలేస్తే, అది సమయం ఆధారం పై పురుషార్థమవుతుంది. కానీ విశ్వ ఆధారమూర్తులు ఏ విధమైన ఆధారము పై నడవరు. వారు ఒక అవినాశి ఆధారము పై కలియుగ ప్రపంచం నుండి దూరమై స్వయాన్ని సంపన్నంగా చేసుకునే పురుషార్థము చేస్తారు.
స్లోగన్ :- '' స్వయాన్ని సంపన్నంగా చేసుకుంటే, విశాల కార్యములో స్వతహాగా
No comments:
Post a Comment