08-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఉదయమే లేచి తండ్రితో ఆత్మిక సంభాషణ (రూహ్ రిహాన్) చేయండి, తండ్రి ఇచ్చిన శిక్షణలను నెమరు వేస్తూ ఉండండి ''
ప్రశ్న :- పూర్తి రోజంతా ఖుషీ - ఖుషీగా(సంతోషంగా) గడిచేందుకు ఏ యుక్తిని రచించాలి ?
జవాబు :- ప్రతి రోజూ అమృతవేళ లేచి జ్ఞాన విషయాలలో రమణము చేయండి. మీతో మీరు మాట్లాడుకోండి, పూర్తి డ్రామా ఆదిమధ్యాంతాలను స్మరణ చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పూర్తి రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. విద్యార్థులు తమ పాఠాలను చాలాసార్లు అభ్యాసము చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఈ చదువును అలా రిహార్సల్ (అభ్యాసము) చెయ్యండి.
పాట :- ఈనాడు మానవుడు అంధకారములో ఉన్నాడు,........... (ఆజ్ అంధేరే మే హై ఇన్‌సాన్,........)
ఓంశాంతి. మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు - మీరు భగవంతుని పిల్లలు కదా. భగవంతుడు మనకు మార్గము చూపిస్తారని మీకు తెలుసు. మేము అంధకారములో ఉన్నామని వారు పిలుస్తూ ఉంటారు ఎందుకంటే భక్తిమార్గమంటేనే అంధకార మార్గము. కొన్నిసార్లు తీర్థయాత్రలు చేస్తూ, మరి కొన్ని సార్లు దాన-పుణ్యాలు చేస్తూ, మంత్రాలను జపిస్తూ, మేము మిమ్ములను కలిసేందుకు తిరుగుతున్నామని భక్తులు చెప్తారు. అనేక ప్రకారాల మంత్రాలనిస్తారు. అయినా మేము అంధకారములో ఉన్నామని వారికి తెలియదు. ప్రకాశము అంటే ఏమిటో కొద్దిగా కూడా అర్థము చేసుకోరు ఎందుకంటే అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీరు అంధకారములో లేరు. మీరు వృక్షములో మొట్టమొదట వస్తారు. కొత్త ప్రపంచములోకి వెళ్లి రాజ్యపాలన చేస్తారు, తర్వాత మెట్లు దిగుతారు. దీని మధ్యలో ఇస్లాం మతం వారు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారు వస్తారు. ఇప్పుడు తండ్రి మళ్లీ అంటు(సాప్లింగ్‌లూaజూజూశ్రీఱఅస్త్ర) కడుతూ ఉన్నారు. ఉదయమే లేచి ఇలా జ్ఞాన విషయాలలో రమణము చేస్తూ ఆనందము అనుభవించాలి. ఇది ఎంత అద్భుతమైన నాటకము, ఈ డ్రామా ఫిలిమ్ రీల్ వ్యవధి 5 వేల సంవత్సరాలు. సత్యయుగము అయువు ఇంత, త్రేతా ఆయువు ఇంత......... అని తండ్రిలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. ప్రపంచములో ఇతరులెవ్వరికీ తెలియదు. కనుక పిల్లలు ఉదయమే లేచి ఒకటి - తండ్రిని స్మృతి చేయాలి, ఖుషీగా జ్ఞాన స్మరణ చేయాలి. ఇప్పుడు మనము పూర్తి డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నాము. కల్పము ఆయువే 5 వేల సంవత్సరాలని తండ్రి చెప్తారు. మనుష్యులు లక్షల సంవత్సరాలని చెప్తారు. ఇది ఎంత అద్భుతమైన నాటకము! తండ్రి ఇస్తున్న శిక్షణలను మళ్లీ నెమరు వేసుకోవాలి. రిహార్సల్ చేయాలి. విద్యార్థి చదువును రిహార్సల్స్ (మరలా చదువుకోవడం) చేస్తారు కదా.
మధురాతి మధుర పిల్లలైన మీరు పూర్తి డ్రామాను తెలుసుకున్నారు - ఇది అనాది, అవినాశి డ్రామా అని బాబా ఎంత సహజ రీతిలో తెలియజేశారు! ఇందులో గెలుపొందుతారు మళ్లీ ఓడిపోతారు. ఇప్పుడు చక్రము పూర్తి అయ్యింది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. తండ్రినైన నన్ను స్మృతి చేయండని వారి ఆజ్ఞ లభించింది. ఈ డ్రామా జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఎప్పుడూ లక్షల సంవత్సరాల నాటకము ఉండదు. ఎవ్వరికీ గుర్తు కూడా ఉండదు. ఇది 5 వేల సంవత్సరాల చక్రము, ఇదంతా మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత మంచి గెలుపు - ఓటముల(హార్ ఔర్ జీత్‌ల) ఆట. ఉదయమే లేచి ఇలాంటి ఆలోచనలు నడుస్తూ ఉండాలి - బాబా మమ్ములను రావణుని పై విజయులుగా చేస్తున్నారు - ఉదయమే లేచి మీతో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అలవాటైపోతుంది. ఈ బేహద్ నాటకము గురించి ఎవ్వరికీ తెలియదు. పాత్రధారులుగా ఉండి కూడా దీని ఆదిమధ్యాంతాలు తెలియదు. ఇప్పుడు మనము బాబా ద్వారా యోగ్యులుగా అవుతున్నాము.
బాబా తన పిల్లలను తమ సమానంగా చేస్తారు. తమ సమానంగానే కాదు, బాబా పిల్లలను తమ భుజాల పై కూర్చుండబెట్టుకుంటారు. బాబాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉంది! మధురాతి మధురమైన పిల్లలారా! - నేను మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేస్తానని ఎంత బాగా అర్థం చేయిస్తారు. నేను అధికారిగా అవ్వను, మిమ్ములను చేస్తాను. పిల్లలైన మిమ్ములను పుష్పాలుగా చేసి తర్వాత టీచరై చదివిస్తాను. మళ్లీ సద్గతి(సత్యయుగము) కొరకు జ్ఞానాన్నిచ్చి మిమ్ములను శాంతిధామము, సుఖధామాలకు అధికారులుగా చేస్తాను. నేను నిర్వాణధామములో కూర్చుండిపోతాను. లౌకిక తండ్రి కూడా శ్రమ పడి ధనము సంపాదించి, అంతా పిల్లలకే ఇచ్చి వారు వానప్రస్థములోకి వెళ్ళి భజనలు మొదలైనవి చేసుకుంటారు. కాని ఇక్కడ తండ్రి చెప్తున్నారు - ఒకవేళ వానప్రస్థ స్థితిలో ఉంటే మీ పిల్లలను ఒప్పించి మీరు ఈ సర్వీసులో తత్పరులవ్వండి. మళ్లీ గృహస్థ వ్యవహారములో చిక్కుకోరాదు. మీరు స్వ కళ్యాణము, ఇతరుల కళ్యాణము చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి. నేను మిమ్ములను శబ్ధానికి అతీతంగా తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. అపవిత్ర ఆత్మలు వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి సన్ముఖములో వచ్చి అర్థం చేయిస్తున్నారు. మజా కూడా సన్ముఖములోనే ఉంటుంది. అక్కడైతే మురళిని పిల్లలు కూర్చొని వినిపిస్తారు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నారు. అందుకే కదా మధువనానికి మహిమ ఉంది! అందుకే తండ్రి చెప్తారు, ఉదయమే లేచే అలవాటు చేసుకోండి. భక్తి కూడా మనుష్యులు ఉదయమే లేచి చేస్తారు. కానీ దాని ద్వారా ఆస్తి లభించదు. వారసత్వము రచయిత అయిన తండ్రి ద్వారా లభిస్తుంది. రచన ద్వారా ఆస్తి లభించదు. కనుక మాకు రచయిత, రచనల ఆదిమధ్యాంతాలు తెలియదని చెప్తారు. ఒకవేళ తెలిసి ఉంటే అది పరంపరగా అలాగే వచ్చేది. మనము ఎంత శ్రేష్ఠమైన ధర్మానికి చెందినవారము, తర్వాత ఎలా ధర్మభ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయ్యామో కూడా మీరు అర్థం చేయించాలి. మాయ మన బుద్ధికి గాడ్‌రెజ్ తాళాన్ని వేసేస్తుంది అందుకే ''మీరు బుద్ధివంతుల బుద్ధి, వీరి బుద్ధికి వేసిన తాళాన్ని తెరవండి'' అని భగవంతునికి చెప్తారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు - నేను జ్ఞానసాగరుడను. మీకు ఇతని ద్వారా ఏ మనుష్యులు ఇవ్వలేని ఈ సృష్టిచక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నాను.
తండ్రి చెప్తారు - సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళడం కంటే పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం మంచిది. చదువు సంపాదనకు ఆధారము. సత్సంగములో ఏమీ లభించదు. దానపుణ్యాలు చేయండి, ఇది చేయండి, బహుమతులివ్వండి, అంతా ఖర్చే ఖర్చు ఉంటుంది. డబ్బు(దక్షిణ) కూడా ఉంచండి, తల కూడా వంచండి, తలంతా బోడి అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏ జ్ఞానము లభిస్తోందో దానిని స్మరణ చేసే అలవాటు చేసుకోండి, ఇతరులకు కూడా అర్థం చేయించండి. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు ఆత్మలైన మీ పై బృహస్పతి దశ ఉంది. వృక్షపతి అయిన భగవంతుడు మిమ్ములను చదివిస్తున్నారు, కనుక మీకు ఎంత ఖుషీ ఉండాలి! భగవంతుడు చదివించి మమ్ములను భగవాన్ - భగవతీలుగా చేస్తున్నారు, ఓహో! అలాంటి తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. ఇలా ఇలా విచార సాగర మథనము చేసే అలవాటు చేసుకోవాలి. తాత(శివబాబా) మనకు ఈ తండ్రి (బ్రహ్మబాబా) ద్వారా ఆస్తినిస్తున్నారు, నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటానని వారు స్వయంగా చెప్తున్నారు. మీకు జ్ఞానము లభిస్తోంది కదా. జ్ఞానగంగలు, జ్ఞానాన్ని వినిపించి పవిత్రంగా చేస్తారా లేక గంగాజలము పవిత్రంగా చేస్తుందా? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! మీరు భారతదేశానికి సత్య-సత్యమైన సేవ చేస్తున్నారు. ఆ సమాజ సేవకులు, హద్దులోని సేవలు చేస్తారు. ఇది సత్యమైన ఆత్మిక సేవ. భగవానువాచ - తండ్రి అర్థం చేయిస్తున్నారు, భగవంతుడు పునర్జన్మరహితుడు. శ్రీ కృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. అతని పేరు గీతలో వేయబడింది. నారాయణుని పేరు ఎందుకు వేయలేదు? శ్రీ కృష్ణుడే నారాయణునిగా అవుతాడని ఎవ్వరికీ తెలియదు. శ్రీ కృష్ణుడు రాకుమారునిగా ఉండేవాడు, తర్వాత రాధతో స్వయంవరం జరిగింది. మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. శివబాబా మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు తండ్రి కూడా అయ్యారు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. సద్గతినిస్తారు. శివుడే సర్వ శ్రేష్ఠమైన భగవంతుడు. వారు చెప్తున్నారు - నన్ను నిందించేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు. పిల్లలు ఒకవేళ చదవకుంటే టీచరు గౌరవం పోతుంది. మీరు నా గౌరవాన్ని పోగొట్టరాదు. చదువుతూ ఉండండి. ముఖ్య లక్ష్యము ఎదురుగానే ఉంది. ఆ గురువులు దీనిని తమకు వర్తింప చేసుకుంటారు అందువలన మాకేమైనా శాపము లభిస్తుందేమోనని మనుష్యులు భయపడ్తారు. గురువు నుండి లభించిన మంత్రమే వినిపిస్తూ ఉంటారు. మీరు ఇంటిని ఎలా వదిలారు? అని సన్యాసులను అడుగుతారు. ఈ వ్యక్తిగత విషయాలు అడగకండి అని వారు అంటారు. అరే! ఎందుకు తెలుపరు? మీరు ఎవరో మాకేం తెలుసు? చురుకు బుద్ధిగలవారు ఇలా అడుగుతారు. అజ్ఞానకాలంలో కొందరికి నషా ఉంటుంది. స్వామి రామతీర్థుల అనన్య శిష్యుడు స్వామినారాయణ. వారి పుస్తకాలు మొదలైనవి బాబా(బ్రహ్మాబాబా) చదివారు. బాబాకు ఇవన్నీ చదివే ఆసక్తి ఉండేది. చిన్నతనములో వైరాగ్యము వచ్చేది తర్వాత ఒకసారి సినిమా చూశారు, అంతే వారి వృత్తి పాడైపోతుంది. సాధుతనము మారిపోయింది. ఆ గురువులు మొదలైన వారందరూ భక్తిమార్గానికి చెందినవారని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. వారిని అందరూ స్మృతి చేస్తారు. నాకు ఒక్క గిరిధర గోపాలుడు తప్ప వేరెవ్వరూ లేరు (మేరాతో గిరిధర గోపాల్ దూసరా నా కోయీ) అని గానము చేస్తారు. గిరిధరుడని కృష్ణుని అంటారు. వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మకు లభిస్తాయి. కృష్ణుని ఆత్మ ఎప్పుడైతే చివర్లో పల్లె పిల్లవానిగా తమోప్రధానంగా ఉంటాడో అప్పుడు తిట్లు తిన్నాడు. వాస్తవానికి ఇది కృష్ణుని ఆత్మయే కదా. పల్లెలో పెరిగాడు, మార్గములో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడు(రాస్తా చల్ తే బ్రాహ్మణ్ ఫస్ గయా) అనగా బాబా ప్రవేశించారు, ఎన్ని తిట్లు తిన్నాడు! అమెరికా వరకు సమాచారము వ్యాపించింది. ఇది అద్భుతమైన డ్రామా. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కనుక సంతోషము కలుగుతుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుందో, మనము ఎలా బ్రాహ్మణులుగా ఉండేవారమో మళ్లీ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యామో ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది 84 జన్మల చక్రము. ఇదంతా స్మృతిలో ఉంచుకోవాలి. రచయిత, రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. ఇది ఎవ్వరికీ తెలియదు. మేము విశ్వాధికారులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో ఏ కష్టమూ లేదు. ఆసనాలు మొదలైన వాటిని వేయమని చెప్పరు. హఠయోగాన్ని ఎలా నేర్పిస్తారంటే అడగకండి. కొందరి మెదడే చెడిపోతుంది. తండ్రి ఎంతో సహజంగా సంపాదన చేయిస్తారు. ఇది 21 జన్మలకు సత్యమైన సంపాదన. మీ అరచేతిలో స్వర్గముంది(హథేలీ పర్ బహిస్ట్). తండ్రి పిల్లల కొరకు స్వర్గాన్ని బహుమతిగా తెస్తారు. ఇలా వేరే ఏ మనుష్యులూ చెప్పలేరు. తండ్రి మాత్రమే చెప్తారు, ఇతని ఆత్మ కూడా వింటుంది. కనుక పిల్లలు ఉదయమే లేచి ఇలా ఇలా ఆలోచించాలి. భక్తులు కూడా ఉదయమే గుప్తంగా మాలను తిప్పుతూ ఉంటారు. మాలను తిప్పే ఆ సంచిని గోముఖమని అంటారు. అందులో చేయి పెట్టి రామ- రామ,................ అని వాయిద్యాలు మ్రోగించినట్లుగా మాలను తిప్పుతారు. వాస్తవానికి తండ్రిని స్మృతి చేయడం గుప్తమైనది. అజపాజపమని(నిరంతర స్మృతి) దీనినే అంటారు. ఖుషీ కలుగుతుంది. ఇది ఎంత అద్భుతమైన డ్రామా! ఇది బేహద్ నాటకము. ఇది మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలో లేదు. మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా ఉంది. చాలా సులభమైనది. మనలను ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు - వారినే స్మృతి చేయండి, చాలు. ఆస్తి కూడా వారి నుండే లభిస్తుంది. ఈ బాబా అయితే ఆ రోజు నుండి తక్షణమే అంతా వదిలేశారు. ఎందుకంటే మధ్యలో బాబా ప్రవేశించారు. సర్వస్వాన్ని ఈ మాతలకు అర్పణ చేసేశారు. ఇంత పెద్ద స్థాపన జరగాలి, సర్వస్వాన్ని ఈ సేవలో సమర్పించు, ఒక్క పైసా కూడా ఎవ్వరికీ ఇవ్వరాదు అని తండ్రి ఇతనికి చెప్పారు. అంతటి నిర్మోహులుగా అవ్వాలి. లక్ష్యము చాలా గొప్పది. మీరాబాయి లోకమర్యాదలు, వికారి కులమర్యాదలు వదిలినందున ఆమెకు ఎంత గొప్ప పేరుంది! మేము వివాహము చేసుకోమని ఈ పిల్లలు కూడా చెప్తారు. లక్షాధికారి అయినా, ఇంకెవరైనా మేము బేహద్ తండ్రి నుండే ఆస్తి తీసుకుంటామని అంటారు. ఇటువంటి నషా ఎక్కాలి. బేహద్ తండ్రి కూర్చొని పిల్లలను అలంకరిస్తున్నారు. ఇందులో ధనము మొదలైనవాటి ఆవశ్యకత కూడా లేదు. పెళ్లి రోజున వనవాసములో కూర్చోబెడ్తారు. పాత చిరిగిపోయిన వస్త్రాలు మొదలైన వాటిని ధరింపజేస్తారు, వివాహము తర్వాత నూతన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవాటిని ధరింపచేస్తారు. ఈ తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను జ్ఞాన రత్నాలతో అలంకరిస్తాను, మీరు మళ్లీ ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇలా వేరెవ్వరూ చెప్పలేరు.
తండ్రియే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు కనుక విష్ణువుకు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు. శంకరునితో పార్వతిని, బ్రహ్మతో సరస్వతిని చూపించారు. ఇప్పుడు బ్రహ్మకు పత్ని ఎవ్వరూ లేరు. ఇతనైతే బాబావానిగా అయ్యారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! మాత-పిత ఇతనే కదా. ఇతడు ప్రజాపిత కూడా అయ్యారు, మళ్లీ ఇతని ద్వారా తండ్రి పిల్లలను రచిస్తారు కనుక ఇతను తల్లి కూడా అయ్యారు. సరస్వతి బ్రహ్మపుత్రిక అని గాయనము చేయబడ్తుంది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఉదయమే లేచి బాబా ఎలా విచార సాగర మథనము చేస్తారో అలా పిల్లలు కూడా బాబాను అనుసరించాలి. ఇది గెలుపు-ఓటముల అద్భుతమైన తయారైన ఆట అని పిల్లలైన మీకు తెలుసు. దీనిని చూసి ఖుషీ కలుగుతుంది, తిరస్కార భావన రాదు. ఈ పూర్తి డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నామని మనకు తెలుసు. కనుక తిరస్కార భావన అను మాటే లేదు. పిల్లలైన మీరు శ్రమ కూడా చేయాలి. గృహస్థ వ్యవహారములో ఉండాలి, పావనంగా అవుతామని ప్రతిజ్ఞ కూడా చేయాలి. దంపతులమైన మేము కలిసి ఉంటూ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. మళ్లీ కొందరు ఫెయిల్ కూడా అవుతారు. బాబా చేతిలో ఏ శాస్త్రాలు మొదలైనవేవీ లేవు. నేను బ్రహ్మ ద్వారా మీకు వేదశాస్త్రాలన్నిటి సారాన్ని వినిపిస్తాను, కృష్ణుడు కాదు అని శివబాబా చెప్తారు. ఎంత వ్యత్యాసముంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చదువు పై పూర్తి గమనముంచాలి. తండ్రి, టీచరు, సద్గురువుకు నిందలు తెచ్చే గౌరవాన్ని పోగొట్టే కర్మలేవీ చేయరాదు.
2. విచార సాగర మథనము చేసేందుకు అలవాటు పడాలి. తండ్రి నుండి ఏ జ్ఞానము లభించిందో, దానిని స్మరణ చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఎవ్వరి పైనా తిరస్కార భావన ఉండరాదు.
వరదానము :- '' బాలుని నుండి యజమాని (బాలక్ సో మాలిక్)'' అనే పాఠము ద్వారా నిరహంకారి మరియు నిరాకారి భవ ''
బాలునిగా అవ్వడం అనగా హద్దు జీవితము పరివర్తన అగుట. ఎంత పెద్ద దేశానికి రాజైనా(మాలిక్ అయినా), ఎంత గొప్ప సంపదకు, పరివారానికి యజమాని అయినా తండ్రి ముందు అందరూ బాలురే(పిల్లలే). బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా పిల్లలుగా(బాలురుగా) అయితే, చింతలేని చక్రవర్తులుగా, భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా అవుతారు. ''బాలుని నుండి యజమానిని (బాలక్ సో మాలిక్ హూ)'' ఈ స్మృతి సదా నిరహంకారి, నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలుడు అనగా పుత్రునిగా అవ్వడం అనగా మాయ నుండి రక్షింపబడుట.
స్లోగన్ :- '' బ్రాహ్మణ జీవిత పర్సనాలిటి - ప్రసన్నత. కనుక సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. ''
No comments:
Post a Comment