Wednesday, January 1, 2020

Telugu Murli 02/01/2020

02-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ దృష్టి శరీరాల పైకి వెళ్ళరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరాలను చూడకండి ''

ప్రశ్న :- ప్రతి బ్రాహ్మణ పుత్రుడు ఏ రెండు విషయాల పై ప్రత్యేకంగా గమనముంచాలి ?
జవాబు :- ఒకటి చదువు పై, రెండవది దైవీ గుణాల పై. చాలామంది పిల్లలలో అంశమాత్రము క్రోధము కూడా లేదు. కొందరు క్రోధములోకి వచ్చి చాలా కొట్లాడ్తారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని, ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదని పిల్లలు గమనముంచాలి. బాబా చెప్తారు - ఏ పిల్లలలోనైనా కోపము ఉంటే, వారు భూతనాథ, భూతనాథనీలు. అలాంటి భూతాలున్న వారితో మీరు అసలు మాట్లాడరాదు.

పాట :- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను,............ (తక్‌దీర్‌ జగాకర్‌ ఆయీ హూ,........)
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. ఇతర ఏ సత్సంగములోనూ రికార్డుల(పాటలు) ద్వారా అర్థం చేయించరు. అక్కడ శాస్త్ర్రాలు చదివి వినిపిస్తారు. ఉదాహరణానికి గురు ద్వారములో గ్రంథములోని రెండు వచనాలు(వాక్యాలు) తీసి దాని గురించి వినిపించేవారు. వాటిని విస్తారంగా చేసి వినిపిస్తారు. రికార్డు పై అర్థం చేయించడం ఎక్కడా ఉండదు. ఈ పాటలన్నీ భక్తి మార్గములోనివని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము వేరని అది కేవలం నిరాకారుడైన శివుని నుండి మాత్రమే లభిస్తుందని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ జ్ఞానాన్ని ఆత్మిక జ్ఞానమని అంటారు. జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది కదా. ఉదాహరణానికి ఈ తివాచీ ఎలా తయారు చేస్తారు? మీకు దీని గురించిన జ్ఞానముందా? అని ఎవరినైనా అడుగుతారు. ప్రతి వస్తువు గురించిన జ్ఞానముంటుంది. అవన్నీ దేహ సంబంధమైన విషయాలు. ఆత్మలమైన మన ఆత్మిక తండ్రి వారు ఒక్కరే అని, వారి రూపము స్థూలమైన కనులకు కనిపించదని పిల్లలకు తెలుసు. ఆ నిరాకారునికి చిత్రము కూడా ఉంది. అది సాలిగ్రామము వలె ఉంటుందని పిల్లలకు తెలుసు. వారినే పరమాత్మ అని అంటారు. వారిని నిరాకారులని అంటారు. వారికి మనుష్యుల వంటి ఆకారము లేదు. ప్రతి వస్తువుకు ఆకారము తప్పకుండా ఉంటుంది. వాటన్నింటిలో ఆత్మది అతి చిన్న ఆకారము. దానిని ప్రాకృతికమనే అంటారు. ఆత్మ అతి సూక్ష్మమైనది, ఈ కనుల ద్వారా చూడలేము. పిల్లలైన మీకు దివ్యదృష్టి లభిస్తుంది. దాని ద్వారా అంతా సాక్షాత్కారము చేసుకుంటారు. గతించిపోయిన వారిని దివ్యదృష్టి ద్వారా చూస్తారు. మొట్టమొదట ఇతను నంబరువన్‌లో ఉండి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ వచ్చారు కనుక అది కూడా అతనికి సాక్షాత్కారమవుతుంది. ఇది అతి సూక్ష్మమైనది. పరమపిత పరమాత్మ తప్ప ఆత్మ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకోవచ్చు. మనుష్యులకు ఆత్మను గురించి యదార్థంగా తెలియదు. అలాగే పరమాత్ముని గురించి కూడా యదార్థంగా తెలియదు. ప్రపంచములో అనేక మనుష్య మతాలున్నాయి. కొందరు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని చెప్తారు, మరికొందరు మరో రకంగా చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అది కూడా నంబరువారు పురుషార్థానుసారము తెలుసుకున్నారు. అందరి బుద్ధిలో ఒకే రకంగా కూర్చోదు. క్షణ-క్షణము, బుద్ధిలో కుర్చోపెట్టవలసి ఉంటుంది. మనము ఆత్మలము, ఆత్మనే 84 జన్మల పాత్రను అభియించాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మనైన నన్ను తెలుసుకోండి, స్మృతి చేయండి. నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తానని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించరు. అందుకే మీ దృష్టి ఈ శరీరము పైకి వెళ్తుంది. వాస్తవానికి మీకు ఇతనితో ఏ పనీ లేదు. సర్వుల సద్గతిదాత ఆ శివబాబాయే, వారి మతానుసారము మనము అందరికీ సుఖాన్ని ఇస్తాము. నేను అందరికీ సుఖాన్ని ఇస్తానని ఇతనికి కూడా అహంకారము రాదు. ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చేయరో, వారి నుండి అవగుణాలు తొలగిపోవు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోరు. మనుష్యులకైతే ఆత్మను గురించి గాని, పరమాత్మను గురించి గాని తెలియదు. సర్వవ్యాపి జ్ఞానమును కూడా భారతవాసులే వ్యాపింపచేశారు. మీలో కూడా ఎవరైతే సేవాధారీ పిల్లలుగా ఉంటారో, వారే అర్థము చేసుకుంటారు. మిగిలినవారు అంతగా అర్థము చేసుకోలేరు. ఒకవేళ తండ్రి గురించి పూర్తి గుర్తింపు పిల్లలకు ఉన్నట్లైతే తండ్రిని స్మృతి చేస్తూ స్వయంలో దైవీ గుణాలను ధారణ చేయాలి.
శివబాబా పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు. ఇవన్నీ కొత్త విషయాలు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మకు సంతానముగా ఎప్పుడు అవుతారో ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైతే అనేకమంది ఉన్నారు. కానీ వారు కుఖవంశావళులు(గర్భ జనితులు). వారెవ్వరూ ముఖవంశావళి బ్రహ్మ సంతానము కాదు. బ్రహ్మ సంతానానికైతే, తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు మీకు వారసత్వము లభిస్తోంది కదా. బ్రాహ్మణులైన మీరు వేరు, వారు వేరు. బ్రాహ్మణులైన మీరు సంగమ యుగములో ఉంటారు. వారు ద్వాపర-కలియుగాలలో ఉంటారు. ఈ సంగమయుగ బ్రాహ్మణులే వేరు. ప్రజాపిత బ్రహ్మకు అనేకమంది పిల్లలున్నారు. భలే హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మ అని అంటారు. ఎందుకంటే పిల్లలకు జన్మనిస్తారు కానీ అది దేహానికి సంబంధించిన విషయము. ఆత్మలందరూ నా పిల్లలే అని ఈ తండ్రి చెప్తున్నారు. మీరు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం సులభము. శివబాబాకు వారి స్వంత శరీరము లేదు. శివజయంతిని ఆచరిస్తారు, కాని వారి శరీరము కంటికి కనిపించదు. మిగిలినవారందరికి శరీరముంది. ఆత్మలందరరికీ వారి వారి శరీరాలున్నాయి. శరీరానికి పేరు ఉంటుంది. పరమాత్మకు తన శరీరమే లేనందున వారిని పరమాత్మ అని అంటారు. 'శివ' అనేది వారి ఆత్మకు పేరు. అది ఎప్పుడూ మార్పు చెందదు. శరీరాలు మారితే పేర్లు కూడా మారిపోతాయి. కాని నేను సదా నిరాకార పరమాత్మనేనని శివబాబా చెప్తున్నారు. డ్రామా ప్లాను అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను. సన్యాసుల పేర్లు కూడా మారిపోతాయి. గురువుకు అనుచరులుగా అయితే పేర్లు మారిపోతాయి. ఇంతకుముందు మీకు కూడా పేర్లు మారేవి. కాని ఎంతవరకు పేర్లు మారుస్తూ ఉంటారు. ఎందరో వెళ్లిపోయారు. ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు పేర్లు పెట్టారు. ఎవ్వరికీ నమ్మకము లేదు. మాయ చాలమందిని ఓడించడంతో చాలామంది వెళ్లిపోతారు. అందుకే బాబా ఎవ్వరికీ పేర్లు పెట్టరు. కొందరికి పెట్టడము, కొందరికి పెట్టకపోవడం కూడా బాగుండదు. బాబా మేము మీ వారిగా అయ్యామని అందరూ అంటారు. కాని యథార్థంగా నా వారిగా అవ్వరు. వారసులయ్యే రహస్యాన్ని తెలుసుకోనివారు కూడా చాలామంది ఉన్నారు. బాబా వద్దకు మిలనము చేసేందుకు వస్తారు కాని వారసులు కారు. విజయమాలలోకి రాలేరు. కొంతమంది మంచి మంచి పిల్లలు మేము వారసులమని భావిస్తారు కాని వారు వారసులు కారని బాబాకు తెలుసు. వారసులుగా అయ్యేందుకు భగవంతుని తమ వారసునిగా చేసుకోవలసి ఉంటుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టము. వారసులని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తారు. భగవంతుని ఎవరైనా వారసునిగా చేసుకున్నట్లైయితే తమ ఆస్తిని ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత బాబా కూడా వారిని వారసులుగా చేసుకుంటారు. పేదవారు తప్ప శ్రీమంతులు ఎవ్వరూ ఆస్తిని ఇవ్వలేరు. చాలా కొద్దిమంది మాల మాత్రమే తయారవుతుంది. మీరు వారసులు అయ్యేందుకు హక్కుదారులా, కాదా? అని ఎవరైనా అడిగితే చెప్పగలరు. ఈ బాబా కూడా తెలియజేయగలడు. ఇది అర్థము చేసుకోవలసిన సాధారణ విషయము. వారసులుగా అయ్యేందుకు కూడా చాలా తెలివి ఉండాలి. లక్ష్మీనారాయణులు ఒకప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు, కాని వారు ఆ అధికారము ఎలా పొందుకున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీ ముఖ్య లక్ష్యము మీ ముందే ఉంది. మీరు ఇలా తయారవ్వాలి. మేము సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా అవుతాము, చంద్రవంశీ సీతా-రాములుగా అవ్వమని పిల్లలు కూడా అంటారు. సీతా-రాములను కూడా శాస్త్ర్రాలలో నిందించారు. లక్ష్మీనారాయణుల నింద ఎప్పుడూ వినరు. శివబాబాకు, కృష్ణునికి కూడా నిందలు ఉన్నాయి. తండ్రి చెప్తారు - నేను పిల్లలైన మిమ్ములను ఇంత ఉన్నతాతి ఉన్నతంగా చేస్తాను. పిల్లలు నా కంటే తీక్షణంగా ముందుకు వెళ్తారు. లక్ష్మీనారాయణులను ఎవ్వరూ నిందించరు. భలే కృష్ణుని ఆత్మ అయితే అదే. కాని తెలియనందున నిందించారు. లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా చాలా సంతోషంగా నిర్మిస్తారు. వాస్తవానికి రాధా-కృష్ణుల మందిరాలను నిర్మించాలి. ఎందుకంటే వారు సతోప్రధానమైనవారు. ఇది వారి యువ స్థితే కనుక వారిని సతో అని అంటారు. వారు చిన్నవారు కనుక సతోప్రధానమని అని అంటారు. చిన్న పిల్లలు మహాత్ముల సమానమైనవారు. ఎలాగైతే చిన్న పిల్లలకు వికారాలు మొదలైనవాటి గురించి తెలియదో, అలా అక్కడ పెద్దవారికి కూడా వికారమంటే ఏమిటో తెలియదు. ఈ పంచభూతాలు అక్కడ ఉండనే ఉండవు. వికారాల గురించి తెలియనే తెలియదు. ఇది రాత్రి సమయము, కామ చేష్టలు కూడా రాత్రి సమయములోనే జరుగుతాయి. దేవతలు పగలులో ఉంటారు. కనుక అక్కడ కామ చేష్టలు ఉండవు. ఏ వికారమూ ఉండదు. ఇప్పుడు రాత్రి సమయములో అందరూ వికారులుగా ఉన్నారు. తెల్లవారగానే మనలోని అన్ని వికారాలు వెళ్లిపోతాయని మీకు తెలుసు. వికారాలంటే ఏమిటో కూడా తెలియదు. ఇవి రావణుని వికారీ గుణాలు. ఇది వికారీ ప్రపంచము. నిర్వికారి ప్రపంచములో వికారాల మాటే ఉండదు. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు. ఇప్పుడిది ఆసురీ రాజ్యము. ఇది ఎవ్వరికీ తెలియదు. నంబరువారు పురుషార్థానుసారం మీరు అంతా తెలుసుకున్నారు. అనేకమంది పిల్లలున్నారు. ఇంతమంది బి.కె.లు ఎవరి సంతానమో మనుష్యులెవ్వరూ అర్థము చేసుకోలేరు.
అందరూ శివబాబాను స్మృతి చేస్తారు, బ్రహ్మను స్మృతి చేయరు. ఇతను స్వయంగా శివబాబాను స్మృతి చేయండని చెప్తాడు. దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఇతరులెవ్వరిని స్మృతి చేసినా వికర్మలు వినాశనమవ్వవు. గీతలో కూడా నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్పారు. కృషుడైతే ఇలా చెప్పలేడు. నిరాకార తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు. నేను ఆత్మను - మొట్ట మొదట ఇది పక్కాగా నిశ్చయము చేసుకోవలసి ఉంటుంది. నా తండ్రి పరమాత్మ. వారు చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లైయితే నేను మీకు వారసత్వమునిస్తాను. నేను అందరికి సుఖమునిచ్చేవాడను. నేను ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకెళ్తాను. ఎవరైతే కల్పక్రితము తండ్రి నుండి వారసత్వము తీసుకొని ఉంటారో వారే వచ్చి వారసత్వము తీసుకుంటారు, బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులలో కూడా కొందరు పిల్లలు పక్కాగా ఉన్నారు. స్వంత పిల్లలుగా కూడా అవుతారు, కొంతమంది సవతి పిల్లలుగా కూడా అవుతారు. మేము నిరాకార శివబాబా వంశావళులము. వంశము ఎలా పెరుగుతూ ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులైన తర్వాత మనము వాపస్‌ వెళ్ళాలి. ఆత్మలన్నీ శరీరాలను వదిలి వాపస్‌ వెళ్ళాలి. పాండవులు, కౌరవులు ఇరువురు శరీరాలను వదలాల్సిందే. మీరు ఈ జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు. తర్వాత మళ్లీ దాని అనుసారంగానే ప్రాలబ్ధము లభిస్తుంది. అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. తర్వాత జ్ఞాన పాత్ర సమాప్తమైపోతుంది. మీరు 84 జన్మల తర్వాత మళ్లీ జ్ఞానము లభించింది. తర్వాత ఈ జ్ఞానము ప్రాయ: లోపమవుతుంది. మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ వేరే ఏ ఇతర ధర్మము గానీ, వారి చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. భక్తిమార్గములో కూడా మీ చిత్రాలు ఉంటాయి. సత్యయుగములో ఎవరి చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. మీ చిత్రాలు ఆల్‌రౌండ్‌ భక్తిమార్గములో ఉంటాయి. మీ రాజ్యములో వేరెవ్వరి చిత్రాలు ఉండవు. కేవలం దేవీదేవతలు మాత్రమే ఉంటారు. ఆదిసనాతన దేవీ దేవతలే ఉన్నారని, దీని ద్వారానే అర్థము చేసుకుంటారు. తర్వాత సృష్టి వృద్ధి అవుతూ ఉంటుంది, పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసి అతీంద్రియ సుఖములో ఉండాలి. చాలా పాయింట్లు ఉన్నాయి. కాని మాయ క్షణ-క్షణము మరపింపజేస్తూ ఉందని బాబా అర్థం చేసుకుంటారు. కనుక శివబాబా మనలను చదివిస్తున్నారని స్మృతి ఉండాలి. వారు అత్యంత ఉన్నతమైనవారు. ఇప్పుడు మనము వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. ఇవి ఎంత సహజమైన విషయాలు! పూర్తి ఆధారము స్మృతి పైననే ఉంది. మనము దేవతలుగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. 5 వికారాలను భూతాలని అంటారు. కామ భూతము, క్రోధ భూతము, దేహాభిమాన భూతము కూడా ఉంటుంది. కొందరిలో ఎక్కువ భూతాలు ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. ఈ 5 పెద్ద భూతాలని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మొదటి నంబరు కామ భూతము. రెండవ నంబరు క్రోధ భూతము. ఎవరైనా మొరటుగా మాట్లాడితే వీరు క్రోధీలని బాబా చెప్తారు. ఈ భూతము తొలగిపోవాలి. కాని భూతము తొలగడం చాలా కష్టము. క్రోధము ఇతరులకు దు:ఖాన్నిస్తుంది. మోహము ద్వారా చాలామందికి దు:ఖము కలుగదు. ఎవరిలో మోహముంటుందో వారికే దు:ఖము కలుగుతుంది. కనుక ఈ భూతాలను పారద్రోలండని తండ్రి అర్థం చేయిస్తున్నారు.
ప్రతి పుత్రుడు విశేషంగా చదువు మరియు దైవీగుణాల పై గమనముంచాలి. చాలామంది పిల్లలలో క్రోధము అంశ మాత్రము కూడా లేదు. కొందరు క్రోధములోకి వచ్చి చాలా జగడాలు చేస్తారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని పిల్లల ఆలోచనలో ఉండాలి. ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదు. ఎవరైనా కోపము చేసుకుంటే వీరిలో కోప భూతము ఉందని అర్థం చేసుకోండి. వారు భూతనాథ, భూతనాథినీలుగా అవుతారు. ఇలాంటి భూతాలున్నవారితో ఎప్పుడూ మాట్లాడరాదు. ఒకరు కోపములోకి వచ్చి మాట్లాడ్తారు. మళ్లీ రెండవవారిలో కూడా భూతము వచ్చేస్తే భూతాలు పరస్పరము పోట్లాడుకుంటాయి. భూతనాథిని అను పదము చాలా ఛీ-ఛీ పదము. భూతాల ప్రవేశత జరగరాదు. కనుక మనుష్యులు దూరంగా వెళ్తారు. భూతాల ముందు అసలు నిలబడరాదు. లేకుంటే ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి ఆసురీ గుణాలను తొలగించి దైవీగుణాలను ధారణ చేయిస్తారు. దైవీ గుణాలను ధారణ చేయించి దేవతలుగా చేసేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మునము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలకు తెలుసు. దేవతల చిత్రాలు కూడా ముందే ఉన్నాయి. కోపము ఉన్నవారి నుండి పూర్తి దూరంగా ఉండమని బాబా అర్థం చేయించారు. స్వయాన్ని రక్షించుకునే యుక్తి అవసరము. మనకు కోపము రాకూడదు. లేకుంటే నూరు రెట్ల పాపము కలుగుతుంది. బాబా పిల్లలకు ఎంత మంచి వివేకమునిస్తున్నారు! బాబా కల్పక్రితము వలె అదే విధంగా తెలియచేస్తున్నారని పిల్లలు కూడా అర్థము చేసుకున్నారు. నంబరువారు పురుషార్థానుసారము అర్థం చేసుకుంటూనే ఉంటారు. స్వయం పై కూడా దయ చూపించుకోవాలి. ఇతరుల పై కూడా దయ చూపించాలి. కొందరు స్వయం పై దయ చూపించుకోరు. ఇతరుల పై చూపిస్తారు. దానితో వారు పైకెక్కిపోతారు. కాని వీరు అలాగే ఉండిపోతారు. స్వయంలోని వికారాల పై విజయము పొందరు కాని ఇతరులకు అర్థము చేయిస్తారు. వారు విజయాన్ని పొందుతారు. ఇలాంటి విచిత్రము కూడా జరుగుతుంది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన స్మరణ చేసి అతీంద్రియ సుఖములో ఉండాలి. ఎవ్వరితోనూ రఫ్‌డఫ్‌గా(కఠినంగా) మాట్లాడరాదు. ఎవరైనా కోపంగా మాట్లాడితే, వారి నుండి దూరంగా వెళ్లాలి.
2. భగవంతునికి వారసులుగా అయ్యేందుకు మొదట వారిని మీ వారసులుగా చేసుకోవాలి. బుద్ధివంతులై మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తము చేసుకోవాలి. మీ పై మీరే దయ చూపించుకోవాలి.

వరదానము :- '' ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని అనుసరించే ప్రసన్నచిత్త్‌ భవ ''
పిల్లలైన మీకు బ్రహ్మాబాబా జీవితము ఖచ్ఛితమైన కంప్యూటర్‌. ఎలాగైతే ఈ రోజులలో కంప్యూటర్‌ ద్వారా ఏ ప్రశ్నకైనా జవాబు అడుగుతారో అలా మనసులో ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఎందుకు, ఏమి అని ప్రశ్నించేందుకు బదులు బ్రహ్మబాబా జీవితమనే కంప్యూటర్‌ ద్వారా చూడండి. ఎందుకు, ఏమి అనే ప్రశ్న 'ఇలా' లోకి మారిపోతుంది. ప్రశ్నచిత్తులకు బదులు ప్రసన్నచిత్తులుగా అవుతారు. ప్రసన్నచిత్తులనగా ఏకరస స్థితిలో ఉండి ఒక్క తండ్రినే అనుసరించేవారు.

స్లోగన్‌ :- '' ఆత్మిక శక్తి ఆధారంతో సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి ''

No comments:

Post a Comment