19-01-2020 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్: 30-03-1985 మధువనము
'' ప్రతి కార్యంలో సఫలతకు సహజ సాధనం స్నేహం ''
ఈ రోజు అతి ప్రియమైన(మురబ్బీ) పిల్లల స్నేహానికి బదులిచ్చేందుకు వచ్చారు. మధువనం వారికి, అలసటలేని సేవకు విశేష ఫలమిచ్చేందుకు కేవలం కలుసుకునేందుకు వచ్చారు. ఇది స్నేహానికి ప్రత్యక్ష ప్రమాణ స్వరూపం. ఈ విశేష స్నేహమే బ్రాహ్మణ పరివారానికి విశేషమైన పునాది. వర్తమాన సమయంలో ప్రతి సేవాకార్యంలో సఫలతకు సహజ సాధనం స్నేహం. యోగీ జీవితానికి పునాది అయితే నిశ్చయమే. కానీ పరివారానికి పునాది స్నేహము. ఈ స్నేహమే ఎవరి హృదయాన్నైనా సమీపానికి తీసుకొస్తుంది. వర్తమాన సమయంలో స్మృతి మరియు సేవల బ్యాలెన్స్‌తో పాటు, స్నేహము మరియు సేవల బ్యాలెన్సు సఫలతకు సాధనము. దేశంలోని సేవ కావచ్చు, విదేశాలలోని సేవ కావచ్చు, రెండిటి సఫలతకు సాధనము - ఆత్మిక స్నేహము. జ్ఞానము మరియు యోగము అనే శబ్ధాలనైతే చాలామంది నుండి విన్నారు. కాని దృష్టి ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ఆత్మలకు స్నేహము అనుభూతి అవ్వడం - ఇది విశేషత మరియు నవీనత. అంతేకాక నేటి విశ్వానికి స్నేహము చాలా అవసరము. ఎంత అభిమానమున్న ఆత్మనైనా స్నేహము సమీపానికి తీసుకు రాగలదు. స్నేహానికి భికారులు శాంతికి కూడా భికారులే. కాని శాంతి అనుభవము కూడా స్నేహదృష్టి ద్వారా చేయించగలరు. కావున స్నేహము స్వతహాగా శాంతిని అనుభవం చేయిస్తుంది. ఎందుకంటే స్నేహంలో లీనమైపోతారు. అందువలన కొద్ది సమయం కొరకు స్వతహాగా అశరీరిగా అయిపోతారు. అశరీరిగా అయిన కారణంగా శాంతి సహజంగా అనుభవమవుతుంది. తండ్రి కూడా స్నేహానికే బదులిస్తారు. రథము నడిచినా, నడవక పోయినా తండ్రి మీ స్నేహానికి ఋజువునివ్వాల్సిందే. బాప్‌దాదా ఈ ప్రత్యక్ష ఫలమునే పిల్లలలో కూడా చూడాలనుకుంటున్నారు. కొంతమంది(గుల్జార్ దాదీ, జగదీష్ భాయి, నిర్వైర్ భాయి,) విదేశ సేవ చేసి వచ్చారు. మరికొంతమంది(దాదీజీ మరియు మోహిని బెహన్) విదేశ సేవకు వెళ్తున్నారు. ఇది కూడా ఆ ఆత్మల స్నేహానికి ఫలము ఇప్పుడు లభిస్తోంది. డ్రామానుసారం ఆలోచించేది ఒక్కటి కానీ జరిగేది మరొకటి. అయినా ఫలము లభించే తీరుతుంది. అందువలన ప్రోగ్రామ్ తయారవ్వనే అవుతుంది. అందరూ తమ-తమ పాత్రను మంచిరీతిగానే అభినయించి వచ్చారు. తయారై, తయారు చేయబడిన డ్రామాలో నిశ్చితమై ఉన్నట్లయితే సహజంగానే ఫలం లభిస్తుంది. విదేశాలు కూడా మంచి లగ్నంతో(పట్టుదలతో) సేవలో ముందుకు వెళ్తున్నారు. వారిలో నలువైపులా మంచి ధైర్యము మరియు ఉల్లాసాలు ఉన్నాయి. అందరి హృదయ పూర్వక ధన్యవాదాల సంకల్పాలు బాప్‌దాదా వద్దకు చేరుకుంటూ ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో కూడా వారి అవసరం ఎంతో ఉంది. అయినా భారతదేశ స్నేహమే మాకు సహయోగమిస్తోందని వారు(విదేశాల వారు) భావిస్తారు. భారతదేశంలో సేవ చేసే సహయోగ పరివారానికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు. దేశమెంత దూరంగా ఉందో అంతగాహృదయపూర్వకంగా పాలనకు పాత్రులుగా అవ్వడంలో సమీపంగా ఉన్నారు. అందుచేత బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలకు ధన్యవాదాలకు బదులు ప్రియస్మృతులు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తండ్రి కూడా పాటను పాడ్తారు కదా!
భాతదేశంలో కూడా మంచి ఉత్సాహ-ఉల్లాసాలతో సేవ యొక్క ఆడంబరాల శోభ చాలా బాగుంది. ఉత్సాహ-ఉల్లాసాలు అలసటను మరిపింపజేసి, సఫలతను ప్రాప్తింపజేస్తున్నాయి. నలువైపులా జరిగిన సేవకు సఫలత బాగుంది. బాప్‌దాదా కూడా పిల్లలందరి సేవల ఉత్సాహ-ఉల్లాసాల స్వరూపాన్ని చూసి హర్షితమవుతారు.
(నైరోబిలో జగదీష్ భాయి పోపుతో కలిసి వచ్చారు) పోపుకు కూడా దృష్టి ఇచ్చావు కదా! ఇది కూడా మీ కొరకు విశేషంగా వి.ఐ.పి.ల సేవలో సఫలత సహజంగా జరిగేందుకు సాధనం. ఉదాహరణానికి భారతదేశంలో విశేషంగా రాష్ట్రపతి వచ్చారు. ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రపతి కూడా వచ్చారని చెప్పగలరు. అలాగే విశేషంగా విదేశాలలో అక్కడి ముఖ్యులు(పోప్), ధర్మము యొక్క ప్రభావాల సంబంధం ద్వారా మీ సమీప సంపర్కంలోకి వచ్చినట్లయితే, మేము కూడా సంపర్కంలోకి రావచ్చని ఎవరికైనా సహజంగా ధైర్యము వస్తుంది. కావున దేశానికి కూడా మంచి సేవా సాధనం తయారయింది మరియు విదేశ సేవకు కూడా విశేష సాధనం తయారయింది. కావున సమయ ప్రమాణంగా సేవలో సమీపంగా రావడంలో ఏవైతే ఆటంకాలు వస్తాయో, అవి కూడా సహజంగా సమాప్తమైపోతాయి. ప్రధానమంత్రినైతే కలవడం జరిగింది కదా! కావున ప్రపంచం వారి కొరకు ఈ ఉదాహరణ కూడా సహాయం చేస్తుంది. ఇంకెవరైనా వచ్చారా? అని అందరూ ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న ఇప్పుడు సమాప్తమై పోతుంది. కావున ఇది కూడా డ్రామానుసారంగా ఈ సంవత్సరం సేవలో సహజంగా ప్రత్యక్షతకు సాధనంగా అయింది. ఇప్పుడు సమీపంగా వస్తున్నారు. వీరి కొరకు కేవలం పేరు మాత్రమే పని చేస్తుంది. కావున పేరుతో ఏ పని జరగాలో దానికి భూమి తయారయ్యింది. వీరు శబ్ధాన్ని వ్యాపింపజేసే మైకులు వేరే ఉన్నారు. ఈ మైకులు లైటునిచ్చేవారు. అయినా బాగా తయారయింది. ఏ విదేశాలలో అయితే వి.ఐ.పి.ల సేవ కష్టమని ముందు అనుభవం చేసేవారో వారు ఇప్పుడు నలువైపులా సహజమైపోయిందని అనుభవం చేస్తున్నారు. ఈ రిజల్టు ఇప్పుడు బాగుంది. వీరి పేరుతో పని చేసేవారు తయారైపోతారు. ఇప్పుడు ఎవరు నిమిత్తంగా అవుతారో చూడండి. ధరణిని తయారు చేసేందుకు అందరూ నలువైపులకు వెళ్ళారు. అన్నివైపులా పాదము మోపి భూమినైతే తయారు చేశారు. ఇప్పుడు ఫలము ప్రత్యక్ష రూపంలో ఎవరి ద్వారా లభిస్తుందో దాని ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. అందరి రిజల్టు బాగుంది.
పాదయాత్రికులు కూడా ఒకే బలము - ఒకే విశ్వాసము ఉంచుకొని ముందుకు వెళ్తున్నారు. మొదట కష్టంగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్‌లోకి వచ్చినప్పుడు సహజమైనపోతుంది. కావున దేశ-విదేశాల వారందరూ అంతేకాక ఎవరైతే సేవకు నిమిత్తంగా అయి, సేవ ద్వారా అనేమందిని బాప్‌దాదాకు - స్నేహితులుగా, సహయోగులుగా తయారుచేసి వచ్చారో వారందరికీ విశేషమైన ప్రియస్మృతులు ఇస్తున్నారు. ప్రతి పుత్రునికి, వారి వారి వరదానము లభించింది. విశేషంగా భారతదేశానికి చెందిన పాదయాత్రలో నడిచే పిల్లలందరికి, విదేశ సేవార్థము నలువైపులా నిమిత్తంగా అయిన పిల్లలకు, మధువన నివాసి శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అయిన పిల్లలకు, జత జతలో భారతదేశంలో యాత్ర చేసేవారికి, ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించేందుకు నిమిత్తంగా అయిన వారికి, నలువైపులా ఉన్న పిల్లలందరికి విశేషమైన యాద్‌ప్యార్ మరియు సేవలో సఫలతకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రతి స్థానములో శ్రమనైతే చేశారు. కానీ ఈ విశేష కార్యము కొరకు నిమిత్తంగా అయ్యారు. కావున విశేషంగా జమ అయింది. మారిషస్, నైరోబి, అమెరికా ఈ ప్రతి దేశము ఉదాహరణగా తయారవుతోంది. ఈ ఉదాహరణ ముందు ముందు ప్రత్యక్షతలో సహయోగిగా అవుతుంది. అమెరికా వారు కూడా తక్కువేమీ చేయలేదు. చిన్న చిన్న స్థానాలు కూడా ఒక్కొక్కటి ఎంతో ఉత్సాహ-ఉల్లాసాలతో తమ శక్తి అనుసారంగా చాలా ఎక్కువగానే చేశారు. విదేశాలలో అత్యధికులు క్రిస్టియన్లే. అయినా రాజ్యమైతే ఉంది కదా! ఇప్పుడు ఆ బలం సమాప్తమైపోయినా ధర్మమునైతే వదిలిపెట్టలేదు. చర్చిలను వదిలిపెట్టారు కానీ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. కావున అక్కడ పోపు కూడా రాజుకు సమానమైనవారు. రాజు వరకు చేరుకున్నట్లయితే ప్రజలలో స్వతహాగానే గౌరవము లభిస్తుంది. ఎవరైతే ఛాదస్తులైన క్రిస్టియన్లు ఉన్నారో వారికి కూడా ఈ ఉదాహరణ బాగుంది. ఈ ఉదాహరణ క్రిస్టియన్లకు నిమిత్తంగా అవుతుంది. కృష్ణుడు మరియు క్రిస్టియన్లకు సంబంధముంది కదా! భారతదేశ వాతావరణమైతే ఇంకా వేరుగా ఉంటుంది. సెక్యూరిటి(రక్షణ) మొదలైనవి చాలా ఉంటాయి. కానీ వీరు ప్రేమగా కలిశారు. ఇది బాగుంది. రాయల్టీతో సమయమునివ్వడం, విధి పూర్వకంగా కలవడం, దీని ప్రభావం పడుతుంది. ఇప్పుడిది సమయం సమీపంగా వస్తోందని తెలియజేస్తోంది.
లండన్‌లో కూడా విదేశాల లెక్కలో చాలా మంచి సంఖ్య ఉంది. అంతేకాక విశేషంగా మురళి పై ప్రేమ ఉంది, చదువు పై ప్రేమ ఉంది. ఇది పునాది. ఇందులో లండన్ నెంబరువన్‌గా ఉంది. ఏం జరిగినా ఎప్పుడూ క్లాసు మిస్ చేయరు. నాలుగు గంటలకు యోగము మరియు క్లాసుల మహత్వము అన్నిటికంటే లండన్‌లో ఎక్కువగా ఉంది. దీనికి కూడా కారణం స్నేహమే. స్నేహం కారణంగా లాగబడి వస్తారు. వాతావరణాన్ని శక్తిశాలిగా చేయడంలో అటెన్షన్ బాగుంది. అలాగే దూరదేశాలేవైతే ఉన్నాయో అక్కడ సేవాకేంద్రానిదైనా లేక తమదైనా, వాయుమండలాన్నే ఆధారంగా భావిస్తారు. ఒకవేళ ఏదైనా విషయం వచ్చినట్లయితే వెంటనే తమను చెక్ చేసుకొని వాతావరణాన్ని శక్తిశాలిగా చేసుకునేరదుకు ప్రయత్నాన్ని బాగా చేస్తారు. అక్కడ వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేసుకునే లక్ష్యము బాగుంది. చిన్న చిన్న విషయాలలో అక్కడ వాతావరణాన్ని పాడు చేసుకోరు. వాతావరణం శక్తిశాలిగా లేకుంటే సేవలో సఫలత ఉండదని భావిస్తారు. కావున తమ పురుషార్థం పై మరియు సెంటరు వాతావరణం పై కూడా ఈ అటెక్షన్ బాగా ఉంచుతారు. ధైర్యము మరియు ఉల్లాసాలలో ఎవ్వరూ తక్కువగా లేరు.
ఎక్కడ పాదము మోపుతారో, అక్కడ తప్పకుండా బ్రాహ్మణులకు కూడా విశేషమైన ప్రాప్తి ఉంటుంది, దేశానికి కూడా ఉంటుంది. సందేశము కూడా లభిస్తుంది. బ్రాహ్మణులలో కూడా విశేషమైన శక్తి పెరుగుతుంది. అంతేకాక పాలన కూడా లభిస్తుంది. సాకార రూపంతో విశేషమైన పాలన పొంది అందరూ సంతోషిస్తారు మరియు అదే సంతోషంతో సేవలో ముందుకు వెళ్తూ, సఫలతను పొందుతారు. దూరదేశంలో ఉండేవారి కొరకు పాలన అయితే అవసరం. పాలన పొంది సంతోషంగా ఎగురుతారు. ఎవరైతే మధువనంలోకి రాలేదో వారు అక్కడే కూర్చుని మధువనాన్ని అనుభవం చేస్తారు. ఉదాహరణానికి ఇక్కడ స్వర్గము మరియు సంగమ యుగము రెండింటి ఆనందాన్ని అనుభవం చేస్తారు. డ్రామానుసారంగా విదేశాలకు వెళ్ళే పాత్ర కూడా ఏదైతే తయారై ఉందో, అది అవసరమయిందే. అందులో సఫలత కూడా ఉంది. ప్రతి విదేశి పుత్రుడు పేరు పేరున తమ విశేష సేవకు అభినందలు మరియు విశేష సేవల సఫలతకు ఫలితంగా ప్రియస్మృతులను స్వీకరించండి. తండ్రి ఎదురుగా ప్రతి పుత్రుడు ఉన్నాడు. ప్రతి దేశములోని ప్రతి పుత్రుడు, నయనాల ఎదురుగా వస్తున్నాడు. ఒక్కొక్కరికి బాప్‌దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. తపిస్తున్న పిల్లలెవరైతే ఉన్నారో, వారి అద్భుతాన్ని కూడా చూసి బాప్‌దాదా పిల్లల పై సదా స్నేహపుష్పాల వర్షం కురిపిస్తారు. వారి బుద్ధి బలమెంతో చురుగ్గా ఉంది! వేరే విమానం లేదు కాని బుద్ధి రూపీ విమానం చురుగ్గా ఉంది. వారి బుద్ధి బలానికి బాప్‌దాదా కూడా హర్షితమవుతారు. ప్రతి స్థానానికి తమ తమ విశేషత ఉంది. సింధీ వారు కూడా ఇప్పుడు సమీపంగా వస్తున్నారు. ఆదిలో ఏం జరిగిందో అది అంతములో జరగాల్సిందే.
మీరు సమాజ సేవ చేయరనే భ్రాంతి ఏదైతే ఉందో అది కూడా ఈ పాదయాత్రను చూసి తొలగిపోయింది. ఇప్పుడు క్రాంతికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఢిల్లీ వారు కూడా పాద యాత్రికులను ఆహ్వానిస్తున్నారు. ఇంతమంది బ్రాహ్మణులు ఇంటికి వస్తారు. అటువంటి బ్రాహ్మణ అతిథులు భాగ్యవంతుల వద్దకే వస్తారు. ఢిల్లీలో అందరికీ అధికారముంది. అధికారులకు సత్కారమునైతే చేయాలి. ఢిల్లీ నుండే విశ్వంలో పేరు ప్రసిద్ధమవుతుంది. తమ-తమ స్థానాలలో అయితే వేస్తూనే ఉన్నారు. కానీ దేశ-విదేశాలలో అయితే ఢిల్లీ టి.వి., రేడియోలే నిమిత్తంగా అవుతాయి.
నిర్మలశాంత దాదీతో :- ఈమె ఆదిరత్నాలకు గుర్తు. 'హా జీ' పాఠాన్ని సదా గుర్తుంచుకుంటూ శరీరానికి కూడా శక్తినిచ్చి వచ్చి చేరుకున్నారు. ఆదిరత్నాలో ఈ సహజ సంస్కారముంది. ఎప్పుడూ కాదని అనరు. సదా 'హా జీ' అని అంటారు. ఈ 'హా జీ' పాఠమే గొప్ప హజూర్‌గా చేసింది. అందువలన బాప్‌దాదా కూడా సంతోషంగా ఉన్నారు. ధైర్యమున్న అమ్మాయికి సహాయమిచ్చి తండ్రి స్నేహ మిలనం చేసే ఫలమునిచ్చారు.
దాదీజీ తో :- అందరికీ ఉల్లాస-ఉత్సాహలతో సేవ చేసినందుకు అభినందనలు తెలియజేయండి. సదా సంతోషాల ఊయలలో ఊగుతూ మరియు సంతోషంగా తండ్రిని ప్రత్యక్షం చేయాలనే లగ్నముతో ముందుకు వెళ్తూ ఉంటారు. కావున శుద్ధ శ్రేష్ఠ సంకల్పాలకు అందరికీ అభినందలు. చార్లీ, కేన్ మొదలైన మొదటి ఫలాలెవరైతే వెలువడ్డారో ఊ గ్రూపు మంచి రిటర్న్ ఇస్తోంది. నమ్రత నిర్మాణ కార్యమును సహజం చేస్తుంది. ఎంతవరకు నమ్రతగా అవ్వరో, అంతవరకు నిర్మాణము చేయజాలరు. ఈ పరివర్తన చాలా బాగుంది. అందరి విషయాలు వినడం మరియు ఇముడ్చుకోవడం, అందరికీ స్నేహమివ్వడం - ఇది సఫలతకు ఆధారము. మంచి ప్రగతిని సాధించారు. కొత్త కొత్త పాండవులు కూడా బాగా శ్రమించారు. స్వయంలో మంచి పరివర్తన తీసుకొచ్చారు. అన్నివైపులా మంచి వృద్ధి జరుగుతోంది. ఇప్పుడింకా నవీనత తీసుకొచ్చే ప్లాను తయారుచేయండి. ఇంతవరకు అయితే అందరూ చేసిన శ్రమకు ఫలము వెలువడంది. ఎవరైతే ముందు వినేవారే కాదో వారు సమీపంగా వచ్చి బ్రాహ్మణాత్మలుగా అవుతున్నారు. ఇప్పుడింకా ప్రత్యక్షం చేసే ఏదైనా కొత్త సేవా సాధనం తయారవుతుంది. బ్రాహ్మణుల సంఘటన కూడా బాగుంది. ఇప్పుడు సేవ వృద్ధి వైపుకు వెళ్తోంది. ఒకసారి వృద్ధి ప్రారంభమైనట్లయితే అప్పుడు ఆ అల నడుస్తుంది. మంచిది.
అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు విశేషమైన హోంవర్క్
బ్రహ్మాబాబా నిశ్చయం ఆధారంగా, ఆత్మిక నషా ఆధారంగా నిశ్చితమైన భవిష్యత్తు తెలిసినవారిగా అయి సెకనులో సర్వమూ సఫలం చేసుకున్నారు. తమ కొరకు ఏమీ ఉంచుకోలేదు. కావున స్నేహానికి గుర్తుగా స్వరమూ సఫలం చేసుకోండి. సఫలం చేసుకోవడం అంటే శ్రేష్ఠత వైపు వినియోగించడం.

వరదానము :- '' సంఘటన రూపి కోటను దృఢంగా చేసుకునే సర్వుల స్నేహీ, సంతుష్ట ఆత్మా భవ! ''
సంఘటన శక్తి విశేషమైన శక్తి. ఏకమతంతో ఉన్న సంఘటిత కోటను ఎవ్వరూ కదిలించలేరు. కాని ఇందుకు ఆధారం - పరస్పరం స్నేహితులుగా అయి అందరికి గౌరవము ఇవ్వడం, స్వయం సంతుష్టంగా ఉండి అందరిని సంతుష్టంగా చేయడం. ఎవరూ డిస్టర్బ్ అవ్వరాదు, ఎవరూ డిస్టర్ట్ చేయరాదు. అందరూ ఒకరికొకరు శుభభావన మరియు శుభకామనల సహయోగం చేసుకుంటూ ఉంటే ఈ సంఘటన అనే కోట దృఢంగా అవుతుంది. సంఘటనా శక్తియే విజయానికి విశేష ఆధార స్వరూపము.
స్లోగన్ :- '' ప్రతి కర్మ యథార్థంగా, యుక్తి యుక్తంగా ఉన్నప్పుడే వారిని పవిత్ర ఆత్మ అని అంటారు ''
No comments:
Post a Comment