09-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా, ఇది చాలా బాగా తయారు చేయబడింది. దీని భూత-వర్తమాన-భవిష్యత్తులు పిల్లలైన మీకు బాగా తెలుసు ''
ప్రశ్న :- ఏ ఆకర్షణ వలన ఆత్మలంతా ఆకర్షింపబడి మీ వద్దకు వస్తారు ?
జవాబు :- పవిత్రత మరియు యోగముల ఆకర్షణ ఆధారము పై వస్తారు. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. పోను పోను తరడ్రిని వెంటనే తెలుసుకుంటారు. ఇంతమంది వారసత్వమును తీసుకోవడం చూసి చాలామంది వస్తారు. ఎంత సమయము గడుస్తూ ఉంటుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది.
ఓంశాంతి. ఆత్మలైన మనము పరంధామము నుండి వచ్చామని ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ బుద్ధిలో ఉంది కదా. ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేసి కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటాయో అప్పుడు బాబా వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎవరికైనా అర్థము చేయించడం చాలా సహజము. దూరదేశములో ఉండే తండ్రి అందరి కంటే వెనుక వస్తారు. ఇక కొన్ని ఆత్మలు మాత్రమే అక్కడ మిగిలి ఉంటాయి. ఇప్పటివరకు కూడా జనాభా వృద్ధి అవుతూనే ఉంది కదా. తండ్రి గురించే ఎవ్వరికీ తెలియకుంటే రచన ఆదిమధ్యాంతాలను ఎలా తెలుసుకుంటారు? ఇది బేహద్(అనంతమైన) డ్రామా కదా, కావున డ్రామాలోని పాత్రధారులకు ఇది తెలిసి ఉండాలి. హద్దులోని డ్రామాలలో అంటే హద్దులోని పాత్రధారులకు కూడా - ఫలానా ఫలానా వారికి ఫలానా పాత్ర లభించి ఉందని తెలిసి ఉంటుంది కదా. ఏ విషయము గతించి ఉంటుందో దాని గురించి చిన్న డ్రామాగా తయారు చేస్తారు. భవిష్యత్తు గురించి తయారు చేయలేరు. గడిచిపోయిన దానిని తీసుకొని దానికింకా కొన్ని కథలను చేర్చి డ్రామాలు తయారుచేస్తారు. దానినే అందరికీ చూపిస్తారు. భవిష్యత్తు గురించి అయితే తెలియనే తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చారని, స్థాపన జరుగుతూ ఉందని, మనము వారసత్వము పొందుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరెవరు వస్తూ ఉంటారో వారికి మనము దేవీదేవతా పదవిని పొందే మార్గాన్ని తెలుపుతాము. ఈ దేవతలు ఇంత శ్రేష్ఠంగా ఎలా అయ్యారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఆదిసనాతనమైనది దేవీదేవతా ధర్మమే. తమ ధర్మమును మర్చిపోయినప్పుడు - మాకు అన్ని ధర్మాలు ఒక్కటే అని అంటారు.
బాబా మనలను చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఆదేశానుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయబడ్తాయి. బాబా దివ్యదృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు. కొందరు తమ బుద్ధిశక్తితో కూడా తయారు చేస్తారు. పాత్రధారులే కాని సృష్టినాటక రచయిత, దర్శకులు మొదలైన వారి గురించి ఎవ్వరికీ తెలియదని తప్పకుండా వ్రాయాలని పిల్లలకు తెలియజేస్తున్నారు. తండ్రి ఇప్పుడు నూతన ప్రపంచము, నూతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచము నుండి క్రొత్త ప్రపంచము తయారవుతుంది. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. పాత ప్రపంచములోనే తండ్రి వచ్చి మిమ్ములను బ్రాహ్మణులుగా చేస్తారు. బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. ఈ యుక్తి ఎంత బాగుందో గమనించండి. భలే ఇది అనాదిగా తయారైన డ్రామా కాని చాలా బాగా తయారయ్యింది. తండ్రి చెప్తున్నారు - మీకు గుహ్య గుహ్యమైన విషయాలను ప్రతిరోజూ వినిపిస్తూ ఉంటాను. ఎప్పుడు వినాశనము ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీకు గతించిన పూర్తి చరిత్ర అంతా తెలుస్తుంది. మళ్లీ సత్యయుగానికి వెళ్ళినట్లయితే గడిచిపోయిన చరిత్ర కొద్దిగా కూడా గుర్తు ఉండదు. ప్రాక్టికల్‌గా పాత్ర చేస్తూ ఉంటారు. గతాన్ని ఎవరికి వినిపిస్తారు? ఈ లక్ష్మీ నారాయణులకు గతాన్ని గురించి బొత్తిగా తెలియదు. వినాశనము ఎలా జరుగుతుందో, రాజ్యము ఎలా ఉంటుందో, భవనాలు ఎలా నిర్మిస్తామో, గతము, వర్తమానము, భవిష్యత్తులన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. భవనాలు తప్పకుండా తయారవుతాయి కదా. స్వర్గ దృశ్యములే వేరుగా ఉంటాయి. ఎలా ఎలా పాత్రను అభినయిస్తూ ఉంటామో అన్నీ తెలుస్తాయి. దీనిని అనవసరంగా రక్తనదులు ప్రవహించే ఆట(ఖూనే నాహేక్ ఖేల్..........) అని అంటారు. అనవసరంగా నష్టము కలుగుతూ ఉంటుంది కదా. భూకంపాలు వస్తాయి, తద్వారా ఎంత నష్టము సంభవిస్తుంది! బాంబులు వేస్తారు, ఇది అనవసరము కదా. ఎవ్వరూ ఏమీ చేయరు. వినాశనమయింది, తప్పకుండా మారణహోమము జరిగింది అని విశాలబుద్ధి కలిగిన వారు తెలుసుకుంటారు. ఇటువంటి డ్రామా కూడా తయారుచేస్తారు. ఇది అర్థం చేసుకోగలరు కూడా. ఏదో సమయంలో ఎవరి బుద్ధిలోనో టచ్ అవుతుంది. మీరు ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీరు ఆ రాజధానికి మాలికులుగా కూడా అవుతారు. ఇప్పుడు ఆ క్రొత్త ప్రపంచములోకి తప్పకుండా వెళ్లాలని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, బ్రహ్మ ద్వారా లేక బ్రాహ్మకుమార-కుమారీల ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటారో, వారు అక్కడకు వచ్చేస్తారు. మీ గృహస్థ వ్యవహారములోనే ఉంటారు కదా. చాలామందిని గురించి తెలుసుకోలేరు కూడా. సేవాకేంద్రాలకు ఎంతోమంది వస్తారు. అందరూ జ్ఞాపకము కూడా ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులున్నారు! వృద్ధి అవుతూ అవుతూ లెక్కలేనంతమంది అవుతారు. ఖచ్ఛితమైన లెక్క తీయలేరు. ఖచ్ఛితంగా మా ప్రజలు ఎంతమంది ఉంటారో రాజుకు తెలియదు. భలే జనాభా లెక్కలు మొదలైనవవి తయారు చేస్తారు. అయినా వ్యత్యాసముంటుంది. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. సోదరులందరూ(ఆత్మలు) ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బాబా-బాబా అని అనమని చిన్న పిల్లలకు కూడా నేర్పించబడ్తుంది. ముందు ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలరని మీకు తెలుసు. ఇంతమంది ఆస్తి తీసుకుంటూ ఉండడం చూసి చాలా మంది వస్తారు. ఎంత ఆలస్యము జరుగుతుందో, అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పవిత్రంగా అవ్వడం వలన మీలో ఆకర్షణ ఉంటుంది, ఎంత యోగములో ఉంటారో అంత ఆకర్షణ ఉంటుంది, ఇతరులను కూడా ఆకర్షిస్తారు. తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా. చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని కొరకు యుక్తులు కూడా రచింపబడ్తున్నాయి. గీతా భగవానుడు ఎవరు? కృష్ణుని స్మృతి చేయడం చాలా సులభము. వారు సాకార రూపము కదా. నన్ను స్మృతి చేయండి అని నిరాకార తండ్రి చెప్తున్నారు. ఆధారమంతా ఈ స్మృతి పైనే ఉంది. అందుకే బాబా చెప్తారు - ఈ విషయము గురించే అందరి చేత వ్రాయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద లిస్టు తయారు చేసినట్లయితే మనుష్యులకు తెలుస్తుంది.
బ్రాహ్మణులైన మీరు పక్కా నిశ్చయబుద్ధి గలవారిగా అయినప్పుడు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయా తుఫానులు కూడా చివరి వరకు వస్తాయి. విజయము పొందుకున్న తర్వాత పురుషార్థమూ ఉండదు, మాయా ఉండదు. స్మృతిలోనే ఎక్కువగా ఓడిపోతారు. మీరు యోగములో ఎంత శక్తిశాలిగా ఉంటారో, అంత ఓడిపోకుండా ఉంటారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలకు నిశ్చయము ఉంది - మా రాజ్యము వస్తుంది, మేము వజ్రవైడూర్యాలను ఎక్కడ నుండి తెస్తాము! గనులన్నీ ఎక్కడ నుండి వస్తాయి! ఇవన్నీ ఉండేది నిజమే కదా! ఇందులో తికమకపడే విషయమే లేదు. ఏం జరగాలో అది ప్రాక్టికల్‌గా చూస్తారు. స్వర్గమైతే తప్పకుండా తయారవ్వాలి. ఎవరైతే బాగా చదువుతారో, వారికి మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము, వజ్రవైఢూర్యాల భవనాలుంటాయని నిశ్చయముంటుంది. ఈ నిశ్చయము కూడా సేవాధారి పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే తక్కువ పదవిని పొందేవారుగా ఉంటారో వారికి భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తాము అనే ఆలోచనలు కూడా ఎప్పుడూ రావు. ఎవరు ఎక్కువగా సర్వీసు చేస్తారో, వారే మహళ్ళలోకి వెళ్తారు కదా. దాస-దాసీలైతే రెడీగా దొరుకుతారు. సేవాధారి పిల్లలకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరెవరు మంచి సర్వీసు చేస్తారో వారు పిల్లలకు కూడా తెలుసు. చదివినవారి ముందు మేము బరువులు మోస్తామని కూడా తెలుసు. ఉదాహరణానికి ఈ బాబా ఉన్నారు, బాబాకు ఆలోచన ఉంటుంది కదా. వృద్ధుడు, బాలుని సమానంగా తయారయారు కనుక ఇతని పనులు కూడా బాలకుని వలె ఉంటాయి. పిల్లలను చదివించడం, నేర్పించడం ఇదొక్కటే వారి కర్తవ్యము. విజయ మాలలోని మణులుగా అవ్వాలంటే పురుషార్థము కూడా చాలా చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే ఉన్నతంగా అవుతారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. తండ్రి చెప్తారు - నేను ఏదైతే వినిపిస్తానో దాని పై నిర్ణయం తీసుకోండి. ముందు ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. సమీపానికి వచ్చే కొలది జ్ఞాపకము వస్తూ ఉంటుంది. మన రాజధాని నుండి వచ్చి 5 వేల సంవత్సరాలయింది. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాము. వాస్కోడిగామా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడని అంటారు. మీరు ఈ ప్రపంచములో 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఆ వాస్కోడిగామా ఒక్కడే వెళ్ళాడు కదా. మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించే వీరు కూడా ఒక్కరే. వంశము నడుస్తుంది. కనుక మాలో ఎలాంటి దేహాభిమానము లేదు కదా? ఖంగు తినడము లేదు కదా? ఎక్కడా పాడవడము లేదు కదా? అని లోపల పరిశీలించుకోవాలి.
మీరు యోగబలముతో ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్ములను ఎవ్వరూ చెంపదెబ్బ మొదలైనవి వేయలేరు. యోగబలమే ఢాలు వంటిది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బ తిన్నారంటే తప్పకుండా దేహాభిమానము ఉంటుంది. ఆత్మాభిమానిని ఎవ్వరూ దెబ్బ వేయలేరు. తప్పు తనదే అయ్యి ఉంటుంది. ఆత్మాభిమానిని ఎవ్వరూ ఏమీ చేయలేరని వివేకము చెప్తుంది. కనుక ఆత్మాభిమానులుగా అయ్యే ప్రయత్నము చేయాలి. అందరికీ సందేశము కూడా ఇవ్వాలి. భగవానువాచ - 'మన్మనాభవ.' ఏ భగవంతుడు? ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఈ ఒక్క విషయము ద్వారానే మీకు విజయము కలుగుతుంది. పూర్తి ప్రపంచములోని మనుష్యుల బుద్ధిలో కృష్ణ భగవానువాచ అని ఉంది. ఎప్పుడు మీరు అర్థం చేయిస్తారో, అప్పుడు విషయము సరిగ్గానే ఉంది అని అంటారు. కానీ ఎప్పుడు మీలాగా అర్థము చేసుకుంటారో, అప్పుడు బాబా ఏమి నేర్పిస్తున్నారో, అది సరియైనదని చెప్తారు. నేను ఇలా ఉన్నాను, నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు అని కృష్ణుడు ఎప్పుడూ చెప్పడు. కృష్ణుడైతే అందరికీ తెలుసు. కృష్ణుని తనువు ద్వారా భగవంతుడు చెప్పడము కూడా జరగదు. కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. అక్కడకు భగవంతుడు ఎలా వస్తారు? భగవంతుడు పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తారు కనుక మీరు అనేమంది ద్వారా వ్రాయిస్తూ ఉండండి. మీ వద్ద ఇలాంటి పెద్ద పుస్తకము ముద్రింపబడి ఉండాలి. అందులో అందరూ వ్రాసినవి ఉండాలి. ఇంతమంది ఇలా వ్రాయడాన్ని చూసినప్పుడు వారు కూడా వ్రాస్తారు. తర్వాత మీ వద్ద గీతా భగవంతుడు ఎవరు? అను విషయము పై అనేకమంది అభిప్రాయాలు ఉంటాయి. సర్వ శ్రేష్ఠమైనవారు తండ్రి మాత్రమే, కృష్ణుడు సర్వ శ్రేష్ఠుడు కాడు అని పైన కూడా వ్రాయబడి ఉండాలి. కృష్ణుడు ఉన్నతాతి ఉన్నతమైన వాడు కాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని ఎప్పుడూ చెప్పలేడు. బ్రహ్మ కంటే శ్రేష్ఠమైనవారు భగవంతుడు కదా. ఇదే ముఖ్యమైన విషయము. ఇందులోనే అందరూ దివాలా తీస్తారు.
ఇక్కడే కూర్చోవాలి అని బాబా చెప్పరు. సద్గురువును మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఉండండి. ప్రారంభంలో అయితే మీ భట్టీ ఉండేది. శాస్త్రాలలో కూడా భట్టీ మాట ఉంది. కానీ భట్టీ అని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఇటుకల భట్టీ ఉంటుంది, అందులో కొన్ని పక్కాగా కాల్తాయి, కొన్ని కాలవు. కొన్ని పాడైనవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి బంగారు లేనే లేదు కాని రాళ్లు రప్పలున్నాయి. పాత వస్తువులకు చాలా విలువ ఉంది. శివబాబాకు, దేవతలకు కూడా గౌరవము ఉంది కదా. సత్యయుగములో విలువ అను మాటే ఉండదు. అక్కడ పురాతన వస్తువులను ఎవ్వరూ కూర్చొని వెతకరు. అక్కడ కడుపులు నిండి సంతుష్టంగా ఉంటారు. వెతకవలసిన అవసరము ఉండదు. మీకు తవ్వవలసిన అవసరము ఉండదు. ద్వాపరము తర్వాతనే తవ్వడం ప్రారంభిస్తారు. ఇండ్లను నిర్మించునప్పుడు ఏదైనా వెలికి వచ్చినట్లయితే క్రింద ఏమో ఉంది అని భావిస్తారు. సత్యయుగంలో మీకు ఏ చింతా ఉండదు. అక్కడ అంతా బంగారమే బంగారముంటుంది. ఇటుకలు కూడా బంగారువే ఉంటాయి. కల్పక్రితము ఏం జరిగిందో, ఏది నిర్ణయమై ఉందో, అదే సాక్షాత్కారము అవుతుంది. ఆత్మలను పిలవడం జరుగుతుంది. అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇందులో తికమకపడే అవసరము లేదు. ప్రతి క్షణము పాత్ర నడుస్తుంది మళ్లీ అదృశ్యమైపోతుంది. ఇది చదువు. భక్తిమార్గములో అనేక చిత్రాలున్నాయి. మీ ఈ జ్ఞాన మార్గములోని చిత్రాలన్నీ అర్థ సహితమైనవి. అర్థ రహితంగా ఏ చిత్రమూ లేదు. మీరు అర్థము చేయించనంతవరకు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. అర్థము చేయించేవారు బుద్ధివంతుడు, జ్ఞానపూర్ణుడు అయిన తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. మీరు ఈశ్వరీయ వంశానికి లేక కులానికి చెందినవారు. ఈశ్వరుడు వచ్చి వంశాన్నే స్థాపన చేస్తారు. ఇప్పుడు మీకు రాజ్యము ఏదీ లేదు. ఒకప్పుడు రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. దేవీదేవతలకు కూడా ధర్మము తప్పకుండా ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి కదా. గీత ద్వారా బ్రాహ్మణ కులము కూడా తయారవుతుంది, సూర్యవంశీ-చంద్రవంశీ కులాలు కూడా తయారవుతాయి. వేరెవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇంతకు ముందు పెద్ద ప్రళయము జరుగుతుందని భావించేవారు. తర్వాత సాగరములో రాగి ఆకు పై కృష్ణుడు వస్తాడని చూపిస్తారు. మొదట నెంబరులో కృష్ణుడే వస్తాడు కదా. కాని సాగరము మాటేమీ లేదు, ఇప్పుడు పిల్లలైన మీకు చాలా మంచి వివేకము లభించింది. ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుతుంటారో, వారికి సంతోషము కూడా ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో వారే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులౌతారు. ఒకవేళ ఎవరితోనైనా మనస్సు జోడింపబడి ఉంటే చదువుకునే సమయములో కూడా వారు గుర్తు వస్తూ ఉంటారు. బుద్ధి అక్కడకు వెళ్ళిపోతుంది కనుక చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యములోనే చదువుకుంటారు. ఒక్క బాబా పైకి తప్ప బుద్ధి వేరెక్కడకు వెళ్ళరాదని ఇక్కడ మీకు అర్థం చేయించబడ్తుంది కాని చాలామందికి పాత ప్రపంచము గుర్తుకొచ్చేస్తుందని తెలుసు. అప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నా వినరు. భక్తిమార్గములో కూడా ఇలా జరుగుతుంది. సత్సంగములో కూర్చొని ఉన్నా బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇది అతికఠినమైన, శక్తివంతమైన పరీక్ష. కొందరు కూర్చొని ఉన్నా వినరు. కొంతమంది పిల్లలకు సంతోషము కలుగుతుంది. ఎదురుగా సంతోషంగా ఊగుతూ ఉంటారు. బుద్ధి తండ్రి జతలో ఉంటే అంతమతి సో గతి అవుతుంది(చివరి స్థితిని బట్టి తర్వాత జన్మ వస్తుంది). దీని కొరకు చాలా పురుషార్థము చేయాలి. ఇక్కడ మీకు చాలా ధనము లభిస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థము చేయాలి, చాలా మధురంగా అవ్వాలి, శ్రీమతమును అనుసరించాలి.
2. యోగమే సురక్షితంగా ఉండేందుకు ఢాలు వంటిది కనుక యోగబలమును జమ చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా ప్రయత్నము చేయాలి.
వరదానము :- '' ప్రతి సంకల్పము, మాట, కర్మను ఫలదాయకంగా చేసుకునే ఆత్మిక ప్రభావశాలి భవ ''
ఎప్పుడు ఎవ్వరి సంపర్కములోకి వచ్చినా వారి పట్ల మానసిక భావన - స్నేహము, సహయోగము మరియు కళ్యాణముతో ప్రభావశాలిగా ఉండాలి. ప్రతి మాట ఎవరికైనా ధైర్యము, ఉత్సాహము ఇచ్చే ప్రభావశాలిగా ఉండాలి. సాధారణ మాటలలో సమయం ఖర్చు అవ్వరాదు. అలాగే ప్రతి కర్మ స్వయం పట్ల గాని, ఇతరుల పట్ల గాని ఫలదాయకంగా ఉండాలి. పరస్పరంలో కూడా ప్రతి రూపంలో ప్రభావశాలిగా అవ్వండి. సేవలో ఆత్మిక ప్రభావశాలిగా అయినప్పుడు తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు.
స్లోగన్ :- '' మీ కిరణాలు విశ్వాన్ని ప్రకాశవంతము చేసేటంత శుభ చింతక మణులుగా అవ్వండి. ''
No comments:
Post a Comment