Wednesday, January 22, 2020

Telugu Murli 23/01/2020

23-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - నిరాకార తండ్రి మీకు తన మతాన్నిచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు, ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి వారసత్వమును తీసుకోగలరు ''

ప్రశ్న :- బేహద్‌ రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు ఏ రెండు విషయాల పై సంపూర్ణ గమనముంచాలి?
జవాబు :- ఒకటి చదువు, రెండవది సర్వీసు(సేవ). సర్వీసు చేసేందుకు చాలా మంచి లక్షణాలు ఉండాలి. ఈ చదువు చాలా అద్భుతమైనది. దీని ద్వారా మీరు రాజ్యపదవిని ప్రాప్తి చేసుకుంటారు. ద్వాపర యుగము నుండి ధనం దానము చేయడం ద్వారా రాజ్యము ప్రాప్తిస్తుంది, కాని ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా యువరాజ - యువరాణులుగా అవుతారు.

పాట :- మా తీర్థ యాత్రలు భిన్నమైనవి,...........( హమారే తీర్థ యాత్రలు భిన్నమైనవి,............)  
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఒక చరణము విన్నారు. మీ తీర్థయాత్ర అంటే - ఇంట్లో కూర్చునే మౌనంగా ముక్తిధామానికి చేరుకోవడం. ప్రాపంచిక తీర్థయాత్రలైతే సాధారణమైనవి. మీవి భిన్నమైనవి. మనుష్యుల బుద్ధియోగమైతే సాధు-సత్పురుషులు మొదలైనవారి వైపు చాలా తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీకు కేవలం తండ్రిని స్మృతి చేయాలనే ఆదేశము లభిస్తుంది. వారు నిరాకార తండ్రి. నిరాకారుని అంగీకరించే వారందరూ నిరాకార మతస్థులని కాదు. ప్రపంచంలో అనేక భిన్నాభిప్రాయాలున్నాయి కదా. ఇది నిరాకార తండ్రి మాత్రమే ఇచ్చు నిరాకార మతము. దీని ద్వారా మనుష్యులు ముక్తి-జీవనముక్తి అనే సర్వ శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఈ విషయాల గురించి కొద్దిగా కూడా తెలియదు. నిరాకారుని నమ్ముతామని అనాయాసంగా చెప్పేస్తారు. అనేక మతాలున్నాయి. సత్యయుగములో అయితే ఒకే మతముంటుంది. కలియుగములో అనేక మతాలు, అనేక ధర్మాలున్నాయి, లక్షల-కోట్ల మతాలుండవచ్చు. ఇంటింటిలో ప్రతి ఒక్కరిది వారిదే అయిన మతము(అభిప్రాయము) ఉంది. ఇక్కడ పిల్లలైన మీ అందరికీ ఒక్క తండ్రి మాత్రమే ఉన్నతోన్నతంగా తయారయ్యేందుకు సర్వ శ్రేష్ఠ మతమునిస్తున్నారు. మీ చిత్రాలను చూసి - ఇదేమిటి ఇలా తయారు చేశారు, ముఖ్యమైన విషయము ఏమిటి? అని చాలామంది అడుగుతారు. ఇది రచయిత-రచనల ఆదిమధ్యాంత జ్ఞానము, ఈ జ్ఞానము ద్వారా మనము ఆస్తికులుగా అవుతాము. ఆస్తికులుగా అయితే తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. నాస్తికులుగా అయినందున వారసత్వము పోగొట్టుకున్నాము అని చెప్పండి. ఇప్పుడు పిల్లలైన మీ కర్తవ్యమే - నాస్తికులను ఆస్తికులుగా చేయడం. ఈ పరిచయము మీకు తండ్రి ద్వారా లభించింది. త్రిమూర్తి చిత్రము చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి కదా. బ్రాహ్మణుల ద్వారానే ఈ యజ్ఞము నడుస్తుంది. ఇది చాలా పెద్ద యజ్ఞము. మొట్టమొదట శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు ఒక్క తండ్రియే అని అర్థము చేయించవలసి వస్తుంది. ఆత్మలందరూ సోదరులు. అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. వారిని తండ్రి అని అంటారు, రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. రచన ద్వారా లభించదు. అందుకే అందరూ ఈశ్వరుని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి స్వర్గ రచయిత. వారు భారతదేశములోనే వస్తారు, వచ్చి ఈ కార్యము చేస్తారు. త్రిమూర్తి చిత్రము చాలా మంచి చిత్రము. వీరు బాబా, వీరు దాదా. బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. ముఖ్య లక్ష్యము స్పష్టంగా ఉంది. అందుకే బాబా మెడల్స్‌(బ్యాడ్జిలు) కూడా తయారు చేయిస్తారు. కేవలం రెండే రెండు అక్షరాలతో చాలా సంక్షిప్తంగా అర్థం చేయిస్తామని చెప్పండి. తండ్రి ద్వారా సెకండులో వారసత్వము లభించాలి కదా. తండ్రి స్వర్గ రచయిత. ఈ బ్యాడ్జీలు చాలా మంచివి. కాని చాలా దేహాభిమానముండే పిల్లలు దీనిని అర్థము చేసుకోలేరు. వీటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది - ఒక్క సెకండులో జ్ఞానము. బాబా వచ్చి భారతదేశమునే స్వర్గంగా చేస్తారు. నూతన ప్రపంచాన్ని తండ్రియే స్థాపిస్తారు. ఈ పురుషోత్తమ సంగమ యుగము కూడా మహిమ చేయబడింది. ఈ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. కొందరిలో యోగము బాగుంది కానీ జ్ఞానము లేదు, ధారణ కూడా లేదు. సర్వీసు చేసే పిల్లలలో జ్ఞాన ధారణ బాగా జరుగుతుంది. తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా చేసే సేవ చేస్తూ ఉంటే పిల్లలు ఏ సేవా చేయకుంటే వారు ఇంకెందుకు పనికి వస్తారు? వారు తండ్రి హృదయమునెలా అధిరోహించగలరు? తండ్రి చెప్తున్నారు - డ్రామాలో నా పాత్రయే రావణరాజ్యము నుండి అందరినీ విడిపించడం. రామరాజ్యము, రావణరాజ్యము రెండూ భారతదేశములోనే మహిమ చేయబడ్డాయి. ఇప్పుడు రాముడు ఎవరో కూడా వారికి తెలియదు. పతితపావనుడు, భక్తులందరి భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు. కావున సేవాకేంద్రములోకి ఎవరు ప్రవేశించినా మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వండి. మనిషి - మనిషిని చూసి అర్థం చేయించాలి. బేహద్‌ తండ్రి బేహద్‌ సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకే వస్తారు. వారికి తమదే అయిన శరీరమే లేనప్పుడు ఆస్తిని ఎలా ఇస్తారు? నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా చదివించి, రాజయోగాన్ని నేర్పించి ఈ పదవి ప్రాప్తింపజేస్తానని స్వయంగా చెప్తున్నారు. ఈ మెడల్‌(బ్యాడ్జి) ద్వారా క్షణములో అర్థం చేయించవచ్చు. ఇది చాలా చిన్నదైనా తెలిపించేవారు చాలా దేహీ-అభిమానులుగా ఉండాలి. కానీ అది తక్కువగా ఉంది. ఈ శ్రమ ఎవ్వరూ చేయడం లేదు. అందుకే బాబా చెప్తున్నారు - చార్టు ఉంచి గమనించండి - పూర్తి రోజులో ఎంత సమయము స్మృతిలో ఉండినాము? రోజంతా ఆఫీసులో పని చేస్తున్నా స్మృతిలో ఉండాలి. కర్మ చేయనే చేయాలి. ఇక్కడ యోగములో కూర్చోబెట్టి తండ్రిని స్మృతి చేయండని చెప్పబడ్తుంది. ఆ సమయములో కర్మ చేయరు. మీరు కర్మ చేస్తున్నా స్మృతి చేయాలి. లేకుంటే కూర్చునే అలవాటైపోతుంది. కర్మ చేస్తూ స్మృతిలో ఉంటేనే కర్మయోగులుగా అవుతారు. పాత్ర ఏమో తప్పకుండా అభినయించాలి, ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది. సత్యతతో చార్టును కూడా ఎవ్వరూ వ్రాయరు. కొందరు అర్ధగంట, ముక్కాలు గంట స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. అది కూడా ఉదయమే స్మృతిలో కూర్చుంటూ ఉండవచ్చు. భక్తిమార్గములో కూడా ఉదయమే లేచి కూర్చుని రామ మాలను జపిస్తూ ఉంటారు. ఆ సమయములో అదే స్మృతిలో ఉంటారని కాదు, అప్పుడు కూడా అలా ఉండరు. ఇతర అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి. తీవ్రభక్తుల బుద్ధి మాత్రము కొంత స్థిరంగా ఉంటుంది. ఇది అజపాజపము అనగా నిరంతరం స్మరణ చేయాలి. కొత్త విషయము కదా. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది. కానీ కృష్ణుని పేరు చెప్పి కృష్ణుడినే స్మృతి చేస్తూ ఉంటారు. కొంచెం కూడా అర్థము చేసుకోరు. ఎల్లప్పుడూ మీ జతలో ఈ బ్యాడ్జి తప్పకుండా ఉండాలి. తండ్రి బ్రహ్మ తనువులో కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మాకు ఆ తండ్రి పై ప్రీతి ఉందని చెప్పండి. మనుష్యులలో ఆత్మ జ్ఞానము గాని, పరమాత్మ జ్ఞానము గాని లేదు. బాబా తప్ప ఈ జ్ఞానమును ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ త్రిమూర్తి శివుని చిత్రము అన్నింటికంటే ముఖ్యమైనది. తండ్రి మరియు వారసత్వమును స్మృతి చేయాలి. ఈ చక్రమును అర్థము చేసుకోవడం చాలా సులభము. ప్రదర్శినీల ద్వారా ప్రజలు లక్షల మంది తయారౌతూ ఉంటారు కదా. రాజులు కొంతమందే ఉంటారు కానీ వారి ప్రజలు కోట్ల కొలది ఉంటారు. ప్రజలు అనేకమంది తయారవుతారు. కానీ రాజులుగా చేసేందుకు మీరు పురుషార్థము చేయాలి. ఎవరు ఎక్కువగా సర్వీసు చేస్తారో వారు శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. చాలామంది పిల్లలకు సర్వీసు చేయు అభిరుచి చాలా ఉంటుంది. ఉద్యోగాన్ని వదిలేస్తాము, తినేందుకు ఉండనే ఉంది కదా అని అంటారు. బాబావారిగా అయ్యాము కనుక శివబాబా పాలననే తీసుకుంటామని అంటారు. కానీ బాబా చెప్తున్నారు - నేను వానప్రస్థములో ప్రవేశించాను కదా. యువ మాతలు ఇంట్లో ఉంటున్నా రెండు సర్వీసులు చేయాలి. బాబా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి సలహానిస్తారు. వివాహాలు మొదలైన వాటికి అనుమతి ఇవ్వకుంటే గొడవలైపోతాయి. అందుకే తండ్రి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని పరిశీలించి సలహానిస్తారు. కుమారులైతే మీరు సేవ చేయవచ్చని చెప్తారు. సర్వీసు చేసి బేహద్‌ తండ్రి నుండి వారసత్వమును తీసుకోండి. ఆ తండ్రి ద్వారా మీకు ఏం లభిస్తుంది? దుమ్ము, ధూళి లభిస్తాయి. అదంతా మట్టిలో కలిసిపోతుంది. రోజురోజుకు సమయము తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది మా ఆస్తికి పిల్లలు(లౌకికము) వారసులుగా అవుతారని భావిస్తారు. కానీ బాబా చెప్తున్నారు - ఏమీ దొరకదు. ఆస్తి అంతా బూడిదలో కలిసిపోతుంది. తర్వాతి తరాల వారు తింటారని వారు భావిస్తారు. ధనవంతుని ధనము నశించేందుకు సమయమేమీ పట్టదు. మృత్యువు ఎదురుగా నిలిచే ఉంది. ఎవ్వరూ మీ వారసత్వాన్ని తీసుకోలేరు. పూర్తిగా అర్థం చేయించగలవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎక్కువ సర్వీసు చేసేవారే ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. కావున వారి పై గౌరవము కూడా ఉంచాలి. వారిని చూసి నేర్చుకోవాలి. 21 జన్మలు గౌరవించాల్సి ఉంటుంది. వారు ఆటోమేటిక్‌గా ఉన్నతమైన పదవిని పొందుతారు, కనుక గౌరవము కూడా అన్ని స్థానాలలో ఉంచాల్సిందే. ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థము చేసుకోగలరు. ఏది దొరికితే అదే మంచిదని భావిస్తారు. అందులోనే సంతోషిస్తారు.
అనంతమైన రాజ్యపదవి కొరకు చదువు మరియు సేవల పై పూర్తి గమనముంచాలి. ఇది అనంతమైన చదువు. ఇక్కడ రాజధాని స్థాపనవుతూ ఉంది కదా. ఈ చదువు ద్వారా మీరు ఇక్కడ చదువుకొని రాకుమారులుగా అవుతారు. ఎవరైనా మనుష్యులు ధనము దానము చేస్తే రాజుల వద్ద లేక ధనవంతుల వద్ద జన్మిస్తారు కానీ అది అల్పకాల సుఖము. కావున ఈ చదువు పైన పూర్తి గమనమివ్వాలి. సర్వీసు చేయాలనే చింత ఉండాలి. మనము మన గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి. అనేకమందికి కళ్యాణము జరుగుతుంది. సర్వీసు చేయాలనే ఆసక్తి ఇంకా ఎవ్వరిలోనూ లేదని బాబాకు తెలుసు. మంచి లక్షణాలు కూడా ఉండాలి కదా. అంతేకానీ డిస్‌సర్వీసు చేసి యజ్ఞమును అపకీర్తి పాలు చేసి తమను తాము ఇంకా నష్టపరచుకోవడం కాదు. బాబా ప్రతి విషయాన్ని బాగా అర్థము చేయిస్తారు. బ్యాడ్జీలు మొదలైనవాటిని చేయించాలని ఎంతగానో తపన ఉంటుంది కానీ డ్రామానుసారము ఆలస్యమవుతోందని అర్థము చేసుకోబడ్తుంది. ఈ లక్ష్మీ నారాయణుల ట్రాన్స్‌లైట్‌ చిత్రము కూడా చాలా బాగుంది. కానీ పిల్లల పై ఈ రోజు బృహస్పతి దశ రేపు మళ్లీ రాహుదశ కూర్చునేస్తుంది. డ్రామాలో సాక్షిగా ఉండి పాత్రను చూడవలసి వస్తుంది. శ్రేష్ఠ పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. గ్రహచారము తొలగిపోవచ్చు. గ్రహచారము తొలగిపోతే మళ్లీ జంప్‌ చేస్తారు. పురుషార్థము చేసి మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి, లేకుంటే కల్ప-కల్పాలకు సర్వ నాశనమైపోతుంది. కల్పక్రితము వలె గ్రహచారము వచ్చి కూర్చుందని అర్థము చేసుకుంటారు. శ్రీమతమును అనుసరించకపోతే పదవి కూడా లభించదు. భగవంతుని మతము సర్వ శ్రేష్ఠమైనది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రమును కూడా మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. వారు కేవలం ఈ చిత్రము చాలా బాగా తయారు చేశారని అంటారు. కాని ఈ చిత్రమును చూస్తూనే మీకు మూలవతనము, సూక్ష్మవతనము మరియు స్థూలవతనాలు, పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు నంబరువారు పురుషార్థానుసారము నాలెడ్జ్‌ఫుల్‌గా అవుతారు. బాబాకు ఈ చిత్రము చూసి చాలా సంతోషము కలుగుతుంది. విద్యార్థులకు లక్ష్యాన్ని(లక్ష్మీనారాయణుల చిత్రాన్ని) చూసి మేము చదువుకొని ఇలా తయారౌతామని సంతోషము కలగాలి కదా. చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. భాగ్యములో ఏది ఉంటే అది లభిస్తుందని కాదు. పురుషార్థము ద్వారానే ప్రాలబ్ధము లభిస్తుంది. పురుషార్థము చేయించే తండ్రి లభించారు, వారి శ్రీమతానుసారము నడుచుకోలేదంటే దుర్గతి కలుగుతుంది. మొట్ట మొదట ఎవరికైనా ఈ బ్యాడ్జి పై అర్థము చేయించండి. తర్వాత ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు వెంటనే మాకు ఈ బ్యాడ్జి ప్రాప్తిస్తుందా? అని అడుగుతారు. ఎందుకు లభించదు, తప్పకుండా దొరుకుతుంది అని చెప్పండి. ఈ ధర్మానికి చెందిన వారికి బాణము తగుల్తుంది. వారి కళ్యాణం జరగగలదు. తండ్రి ఒక్క క్షణములో అరచేతిలో వైకుంఠాన్ని ఇస్తారు. ఇందులో చాలా ఖుషీ ఉండాలి. మీరు శివుని భక్తులకు ఈ జ్ఞానమునివ్వండి. నన్ను స్మృతి చేస్తే మీరు రాజాధి రాజులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి. పూర్తి రోజంతా ఈ సేవ చేయండి చాలు. ముఖ్యంగా బనారసులో శివుని మందిరాలు చాలా ఉన్నాయి, అక్కడ మంచి సర్వీసు జరగవచ్చు. ఎవరో ఒకరు వెలువడ్తారు. చాలా సులభమైన సేవ. ఎవరైనా అక్కడ సేవ చేసి చూడండి, భోజనం దొరకనే దొరుకుతుంది, సర్వీసు చేసి చూడండి. సేవకేంద్రాలు అక్కడ ఉండనే ఉన్నాయి. ఉదయమే మందిరానికి వెళ్ళండి, రాత్రికి వాపస్‌ రండి. కొత్త సేవాకేంద్రాన్ని తయారు చేయండి. అన్నిటికంటే ఎక్కువగా మీరు శివుని మందిరాలలో సర్వీసు చేయవచ్చు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది శివుని మందిరమే. బొంబాయిలో బబుల్‌నాథ్‌ మందిరముంది. రోజంతా అక్కడ సర్వీసు చేస్తూ అనేమందికి కళ్యాణము చేయవచ్చు. ఈ బ్యాడ్జి చాలు. ప్రయత్నించి చూడండి. బాబా చెప్తున్నారు - ఈ బ్యాడ్జీలను లక్ష కాదు, 10 లక్షలు తయారు చేయించండి. వృద్ధులు చాలా మంచి సర్వీసు చేయవచ్చు. లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. తండ్రి కేవలం - ''నన్ను స్మృతి చేయండి చాలు, మన్మనాభవ పదాన్ని మర్చిపోయారు'' అని చెప్తున్నారు. భగవానువాచ కదా. కృష్ణుడు భగవంతుడు కాదు, అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. ఈ కృష్ణునికి కూడా ఈ పదవిని ప్రాప్తి చేయించింది శివబాబాయే. మళ్లీ మోసపోయే అవసరమేముంది. తండ్రి ఇంత మాత్రమే చెప్తారు - ''నన్ను స్మృతి చేయండి.'' మీరు చాలా మంచి సర్వీసు శివుని మందిరములో చేయవచ్చు. సర్వీసులో సఫలత కొరకు ఆత్మాభిమాని స్థితిలో ఉండి సర్వీసు చేయండి. హృదయము స్వచ్ఛంగా ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది. బనారస్‌ విషయంలో బాబా ముఖ్యంగా సలహానిస్తారు - అక్కడ వానప్రస్థుల ఆశ్రమము కూడా ఉంది. వారికి మేము బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులము, శివబాబా బ్రహ్మ ద్వారా - ''నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమౌతాయి, ఇతర ఏ ఉపాయము లేదు'' అని చెప్తున్నారని చెప్పండి. ఉదయం నుండి రాత్రి వరకు శివుని మందిరములో కూర్చుని సర్వీసు చేయండి. ప్రయత్నించి చూడండి. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నా మందిరాలైతే చాలా ఉన్నాయి. మిమ్ములను ఎవ్వరూ ఏమీ అనరు, ఇంకా వీరు శివబాబాను ఎంత మహిమ చేస్తారు! అని సంతోషిస్తారు. వారికిలా చెప్పండి - ఇతను బ్రహ్మ, వీరంతా బ్రాహ్మణులు, వీరు దేవతలు కాదు అని చెప్పండి. ఇతను కూడా శివబాబాను స్మృతి చేసి ఈ పదవిని తీసుకుంటాడు. ఇతని ద్వారా శివబాబా చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఎంత సులభము! వృద్ధులను ఎవరూ అవమానించరు. బనారసులో ఇంతవరకు ఎప్పుడూ ఇంత సర్వీసు జరగలేదు. బ్యాడ్జి లేక చిత్రాల పై అర్థం చేయించడం చాలా సులభము. ఎవరైనా పేదవారుంటే - మీకు ఉచితంగా ఇస్తామని చెప్పండి. ధనవంతులైతే - మీరు ఇచ్చారంటే అనేమంది కళ్యాణము కొరకు ఇంకా ముద్రిస్తాము. కనుక మీ కళ్యాణము కూడా జరుగుతుంది అని చెప్పండి. ఈ మీ వ్యాపారము చాలా తీక్షణమైపోతుంది. ఎవరైనా ప్రయత్నించి చూడండి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
ఏ సంకల్పము ఉత్పన్నమైనా అది స్వయం పట్ల, ఇతరుల పట్ల కళ్యాణకారిగా ఉందా? అని చెక్‌ చేసుకోండి. సెకండులో ఎన్ని సంకల్పాలు ఉత్పన్నమయ్యాయి? అందులో ఎన్ని సఫలమయ్యాయి? ఎన్ని అసఫలమయ్యాయి? సంకల్పము మరియు కర్మలో అంతరముండరాదు. సంకల్పము జీవితంలో అమూల్యమైన ఖజానా. ఎలాగైతే స్థూల ఖజానాను వ్యర్థము చేయరో, అలా ఒక్క సంకల్పము కూడా వ్యర్థమవ్వరాదు.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తర్వాత సర్వీసు చేయాలి. ఎవరైతే ఎక్కువగా సర్వీసు చేస్తారో, మంచి లక్షణాలున్నాయో వారిని తప్పకుండా గౌరవించాలి కూడా.
2. కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. సర్వీసులో సఫలత కొరకు తమ స్థితిని ఆత్మాభిమానిగా చేసుకోవాలి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి.

వరదానము :- '' సైలెన్స్‌ శక్తి ద్వారా సెకండులో ముక్తి, జీవన్ముక్తిని అనుభవం చేయించే విశేష ఆత్మా భవ ''
విశేష ఆత్మల లాస్ట్‌(చివరి) విశేషత - ఒక సెకండులో ఏ ఆత్మనైనా ముక్తి, జీవన్ముక్తుల అనుభవీగా చేస్తారు. కేవలం దారి చూపించడం కాదు. ఒక సెకండులో శాంతిని, అతీంద్రియసుఖాన్ని అనుభవం చేయిస్తారు. జీవన్ముక్తిని అనుభవం చేయడమంటే సుఖము, ముక్తిని అనుభవం చేయడమంటే శాంతిని అనుభవం చేయడం. కనుక ఎవరు మీ ముందుకు వచ్చినా వారు సెకండులో వీటిని అనుభవం చేయాలి. ఇంత వేగముంటే అప్పుడు సైన్సు పై సైలెన్స్‌ విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్‌ వాహ్‌ అనే శబ్ధము వెలువడ్తుంది. ప్రత్యక్షమయ్యే దృశ్యము కనిపిస్తుంది.

స్లోగన్‌ :- ''తండ్రి ప్రతి ఆజ్ఞ పై స్వయాన్ని సమర్పణ చేసుకునే సత్యమైన దీపపు పురుగులుగా (పర్వానేగా) అవ్వండి. ''

No comments:

Post a Comment