16-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు మీ యోగబలము ద్వారానే వికర్మలను వినాశనము చేసుకొని పావనుంగా అయి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి, ఇదే మీరు చేసే సేవ ''
ప్రశ్న :- దేవీ దేవతా ధర్మములో ఏ విశేషత మహిమ చేయబడింది ?
జవాబు :- దేవీ దేవతా ధర్మమే చాలా సుఖమునిచ్చేది. అక్కడ దుఃఖానికి నామ-రూపాలుండవు. పిల్లలైన మీరు 3/4 వంతు సుఖాన్ని పొందుతారు. ఒకవేళ అర్ధము సుఖము, అర్ధము దుఃఖము ఉన్నట్లయితే అందులో మజానే ఉండదు.
ఓంశాంతి. భగవానువాచ. భగవంతుడే అర్థం చేయిస్తున్నారు - ఏ మనుష్యమాత్రున్ని భగవంతుడని అనలేము. దేవతలను కూడా భగవంతుడని అనరు. భగవంతుడు నిరాకారులు, వారికి ఏ సాకార రూపము గానీ, ఆకార రూపము గానీ ఉండదు. సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారముంటుంది. అందుకే దానిని సూక్ష్మవతనమని అంటారు. ఇక్కడ సాకార మనుష్యుల శరీరాలున్నాయి కనుక దీనిని స్థూల వతనమని అంటారు. సూక్ష్మవతనములో ఈ 5 తత్వాల స్థూల శరీరముండదు. ఈ 5 తత్వములతోనే మనుష్య శరీరము తయారయ్యింది. దీనిని మట్టిబొమ్మ అని అంటారు. సూక్ష్మవతన వాసులను మట్టిబొమ్మలని అనరు. దేవతా ధర్మమువారు కూడా మనుష్యులే కానీ వారిని దైవీ గుణములు కలిగిన మనుష్యులని అంటారు. ఈ దైవీగుణాలను శివబాబా నుండి ప్రాప్తి చేసుకున్నారు. దైవీ గుణాలు కలిగిన మనుష్యులకు, ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులకు ఎంత వ్యత్యాసముంది! మనుష్యులే శివాలయము లేక వేశ్యాలయములో ఉండేందుకు యోగ్యులుగా అవుతారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. సత్యయుగము ఇక్కడే ఉంటుంది. మూలవతనములో గానీ, సూక్ష్మవతనములో గానీ ఉండదు. అది శివబాబా ద్వారా స్థాపన చేయబడిన శివాలయమని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడు స్థాపన చేశారు? సంగమ యుగములో. ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఇప్పుడిది పతిత తమోప్రధానమైన ప్రపంచము. దీనిని సతోప్రధాన నూతన ప్రపంచమని అనరు. నూతన ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు. అదే ఎప్పుడైతే పాతదిగా అవుతుందో, అప్పుడు దానిని తమోప్రధానమని అంటారు. మళ్లీ సతోప్రధానంగా ఎలా అవుతుంది? పిల్లలైన మీ యోగబలము ద్వారా. యోగబలము ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయి, అంతేకాక మీరు పవిత్రంగా కూడా అవుతారు. పవిత్రుల కొరకు తప్పకుండా పవిత్ర ప్రపంచము కావాలి. కొత్త ప్రపంచాన్ని పవిత్రమైన ప్రపంచమని, పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అంటారు. పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. అపవిత్ర ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. ఈ విషయాలను గురించి మనుష్యులెవ్వరికీ తెలియదు. ఈ 5 వికారాలు లేకుంటే మనుష్యులు దుఃఖితులై, తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు! తండ్రి చెప్తున్నారు - నేను దుఃఖహర్త-సుఖకర్తను. 10 తలలు ఉన్న రావణుని 5 వికారాల దిష్టి బొమ్మను తయారు చేశారు, ఆ రావణుని శత్రువుగా భావించి తగులబెడ్తారు. అలాగని ద్వాపరము ఆది నుండే తగలబెట్టడం ప్రారంభము చెయ్యరు. ఎప్పుడైతే తమోప్రధానంగా అవుతారో అప్పుడు ఎవరో మత-మతాంతరాల వారు కూర్చొని ఈ క్రొత్త విషయాలను తెలియచేస్తారు. ఎప్పుడు ఎవరైనా చాలా దుఃఖాన్ని ఇస్తారో, అప్పుడు వారి దిష్టిబొమ్మను తయారు చేస్తారు. ఇక్కడ కూడా మనుష్యులకు ఎప్పుడైతే చాలా దుఃఖము కలుగుతుందో అప్పుడు ఈ రావణుని దిష్టి బొమ్మను తయారుచేసి తగులబెడ్త్తారు. మీకు 3/4 వంతు సుఖము ఉంటుంది. ఒకవేళ అర్ధము దుఃఖము ఉంటే అందులో మజా ఏముంటుంది. తండ్రి చెప్తారు - మీ దేవీదేవతా ధర్మము చాలా సుఖాన్నిస్తుంది. ఈ సృష్టి అయితే అనాదిగా ఉంది. ఈ సృష్టి ఎందుకు తయారయింది, ఎప్పుడు సమాప్తమవుతుంది అని ఎవ్వరూ అడగరాదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షల సంవత్సరాలుగా చూపించారు. తప్పకుండా సంగమ యుగము కూడా ఉంటుంది. ఆ సమయములోనే సృష్టి పరివర్తన అవుతుంది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ చేస్తున్నారో, అలా వేరెవ్వరూ అర్థము చేసుకోలేరు. బాల్యములో రాధా-కృష్ణులనే పేర్లు ఉంటాయి. తర్వాత స్వయంవరం జరుగుతుంది. ఇరువురు వేరు వేరు రాజధానులకు చెందినవారు, తర్వాత వారి స్వయంవరం జరుగుతుంది. అప్పుడు వారు లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా వారికి తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రియే జ్ఞానపూర్ణులు. అలాగని వారు సర్వజ్ఞులు(జానీజానన్‌హార్) అని కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. జ్ఞానము పాఠశాలలో లభిస్తుంది. పాఠశాలలో ముఖ్య లక్ష్యము తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఛీ-ఛీ ప్రపంచములో రాజ్యపాలన చేయలేరు. పుష్పాల ప్రపంచములో రాజ్య పాలన చేస్తారు. రాజయోగాన్ని సత్యయుగంలో ఎవ్వరూ నేర్పించరు. సంగమ యుగములోనే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది అనంతమైన విషయము. తండ్రి ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. గాఢాంధకారములో ఉన్నారు. జ్ఞాన సూర్యుని పేరుతో జపాన్ దేశమువారు తమను సూర్య వంశీయులమని చెప్పుకుంటారు. వాస్తవానికి దేవతలు సూర్యవంశీయులు. సూర్యవంశీయుల రాజ్యము సత్యయుగములో ఉండేది. జ్ఞానసూర్యుడు ఉదయించాడు,......... (జ్ఞాన సూర్య్ ప్రగటా, అజ్ఞాన్ అంధేరా వినాశ్,........). కనుక భక్తిమార్గములోని అంధకారము సమాప్తమయిందని గాయనముంది. కొత్త ప్రపంచము పాతదిగా, పాత ప్రపంచము మళ్లీ కొత్తదిగా అవుతూ ఉంటుంది. ఇది అనంతమైన పెద్ద ఇల్లు. ఇది ఎంతో పెద్ద రంగస్థలము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చాలా సేవ చేస్తాయి. రాత్రి సమయంలో చాలా పని నడుస్తుంది. ఇలాగే కొందరు రాజులు పగలు నిద్రిస్తారు, రాత్రి సమయంలో తమ సభ మొదలైవి నడిపిస్తారు, కొనుగోలు చేస్తారు. ఇది ఇప్పటికీ అక్కడక్కడా జరుగుతుంది. పరిశ్రమలు మొదలైనవి రాత్రి సమయములో నడుస్తాయి. ఇవి హద్దులోని రాత్రింబవళ్లు. అది బేహద్ విషయము. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలో లేవు. వారికి శివబాబా గురించి కూడా తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ అని బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడు సృష్టిని రచిస్తారో, అప్పుడు తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశిస్తారు. పావనమైన మనుష్యులైతే సత్యయుగములో మాత్రమే ఉంటారు. కలియుగములో అందరూ వికారాల నుండి జన్మిస్తారు, అందుకే పతితులని అనబడ్తారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది? అని మనుష్యులు ప్రశ్నిస్తారు. అరే! మీరు దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. చాలా శుద్ధంగా వారి మందిరాలను నిర్మిస్తారు. బ్రాహ్మణులను తప్ప ఎవ్వరినీ లోనికి అనుమతించరు. వాస్తవానికి ఈ దేవతలను వికారులెవ్వరూ స్పర్శించలేరు. కాని వర్తమాన సమయంలో ధనము ద్వారా అన్నీ జరుగుతాయి. కొందరు తమ ఇంట్లో మందిరాలు మొదలైనవి నిర్మించుకున్నా బ్రాహ్మణులనే పిలుస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా వికారులే. కేవలం పేరుకు మాత్రము బ్రాహ్మణులు. ఈ ప్రపంచమే వికారి ప్రపంచము. కనుక పూజ కూడా వికారుల ద్వారానే జరుగుతుంది. నిర్వికారులు ఎక్కడ నుండి వస్తారు! నిర్వికారులు సత్యయుగములో మాత్రమే ఉంటారు. వికారాలలోకి వెళ్ళని వారిని నిర్వికారులు అని అనేందుకు వీలు లేదు. శరీరమైతే వికారాల నుండే జన్మించింది కదా. ఇదంతా రావణ రాజ్యమని తండ్రి ఒకే మాట చెప్పారు. రామరాజ్యములో సంపూర్ణ నిర్వికారులు, రావణ రాజ్యములో వికారులు ఉంటారు. సత్యయుగములో పవిత్రత ఉండేది కనుక శాంతి-సంపదలు కూడా ఉండేవి. సత్యయుగములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా, ఇది మీరు చూపించగలరు. అక్కడ 5 వికారాలుండవు. అది భగవంతుడు స్థాపన చేసిన పవిత్ర రాజ్యము. భగవంతుడు పతిత రాజ్యాన్ని స్థాపన చేయరు. సత్యయుగములో ఒకవేళ పతితులున్నట్లయితే పిలిచేవారు కదా. అక్కడ ఎవ్వరూ పిలవనే పిలవరు. సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు. సుఖసాగరులు, పవిత్రతాసాగరులు........ అని పరమాత్ముని మహిమ కూడా చేస్తారు. శాంతి కావాలి....... అని అంటారు కూడా. ఇప్పుడు పూర్తి ప్రపంచములో మనుష్యులు శాంతిని ఎలా స్థాపించగలరు? శాంతి రాజ్యము ఒక్క స్వర్గములోనే ఉండేది. ఎప్పుడైనా ఎవరైనా పరస్పరములో కొట్లాడుకుంటే శాంతింపజేయవలసి ఉంటుంది. అక్కడ ఒకే రాజ్యముంటుంది.
తండ్రి చెప్తారు - ఈ పాత ప్రపంచమే ఇప్పుడు సమాప్తమౌతుంది. ఈ మహాభారత యుద్ధములో అంతా వినాశనమవుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. వాస్తవానికిి పాండవులు మీరే కదా. మీరు ఆత్మిక మార్గదర్శకులు. అందరికీ ముక్తిధామానికి దారి తెలియజేస్తారు. అది ఆత్మల ఇల్లయిన శాంతిధామము. ఇది దుఃఖధామము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మర్చిపోండి. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళాలని ఆత్మ చెప్తుంది, ఆత్మనే గ్రహిస్తుంది(రియలైజ్). నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి వచ్చింది. తండ్రి చెప్తున్నారు - నేను ఎవరో, ఎలా ఉంటానో,........... ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. నేను బిందు రూపమని మీకు మాత్రమే అర్థము చేయించాను. మేము 84 జన్మల చక్రములో ఎలా తిరిగాము అని క్షణ-క్షణము మీ బుద్ధిలో ఉండాలి. ఇందులో తండ్రి కూడా గుర్తుకొస్తారు, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, చక్రము కూడా గుర్తుకొస్తుంది. ఈ విశ్వం చరిత్ర-భూగోళాలను గూర్చి మీకు మాత్రమే తెలుసు. ఎన్ని ఖండాలున్నాయి, ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి. సత్యయుగములో యుద్ధాలు మొదలైనవాటి మాటే ఉండదు. రామరాజ్యమెక్కడ ? రావణ రాజ్యమెక్కడ ? తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు ఈశ్వరీయ రాజ్యములో ఉన్నట్లే, ఎందుకంటే ఈశ్వరుడు రాజ్యస్థాపన చేసేందుకు ఇక్కడకు వచ్చారు. ఈశ్వరుడు స్వయంగా రాజ్యపాలన చేయరు, స్వయంగా రాజ్యాన్ని తీసుకోరు, నిష్కామ సేవ చేస్తారు. సర్వ శ్రేష్ఠమైన భగవంతుడు సర్వాత్మల తండ్రి. ఆ తండ్రిని '' బాబా '' అని అంటూనే ఒక్కసారిగా ఖుషీ పాదరస మీటరు పెరగాలి. మీ అంతిమ స్థితిలోని అతీంద్రియ సుఖము మహిమ చేయబడింది. పరీక్ష రోజులు సమీపానికి వచ్చినప్పుడు ఆ సమయంలో అన్నీ సాక్షాత్కారమవుతాయి. అతీంద్రియ సుఖము కూడా పిల్లలకు నంబరువారుగా ఉంది. కొందరు తండ్రి స్మృతిలో చాలా సంతోషంగా ఉంటారు.
పిల్లలైన మీలో పూర్తి రోజంతా ఇదే ఫీలింగు(భావనలు) ఉండాలి - ఓహో బాబా, మీరు మమ్ములను ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారు! మీ నుండి మాకు ఎంతటి సుఖము లభిస్తుంది......... ఇలా తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమతో కన్నీరు వచ్చేస్తుంది. అద్భుతము, మీరు వచ్చి మమ్ములను దుఃఖము నుండి విడిపిస్తారు, విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకెళ్తారు, పూర్తి రోజంతా ఇదే ఫీలింగు ఉండాలి. ఏ సమయంలో మీకు తండ్రి స్మృతి కలిగిస్తారో, మీరు ఎంత గద్గదులవుతారు! (పులకిస్తారు). శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. శివరాత్రి కూడా తప్పకుండా ఆచరింపబడ్తుంది. కానీ మనుష్యులు శివబాబాకు బదులు శ్రీ కృష్ణుని పేరు గీతలో వేశారు. ఇది ఒకే ఒక అతి పెద్ద తప్పు(ఏకజ్ భూల్). మొదటి నంబరు తప్పు గీతలోనే చేసేశారు. డ్రామానే అలా తయారై ఉంది. తండ్రి వచ్చి ఈ తప్పును తెలియజేస్తారు. పతితపావనుడను నేనా లేక కృష్ణుడా? మీకు నేను రాజయోగాన్ని నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా చేశాను. మహిమ కూడా నాదే కదా. అకాలమూర్తి, అజన్మ, అయోనిజ,............. అని నన్ను మహిమ చేస్తారు. కృష్ణుని ఇలా మహిమ చేయలేరు. ఎందుకంటే అతను పునర్జన్మలోకి వచ్చేవాడు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ విషయాలన్నీ నంబరువారుగా ఉంటాయి. జ్ఞానముతో పాటు నడవడికలు కూడా బాగుండాలి. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. ఎవరు మొదట వస్తారో వారు తప్పకుండా అంత శక్తివంతులుగా ఉంటారు. పాత్రధారులు రకరకాలుగా ఉంటారు కదా. నాయకీ - నాయకుల పాత్ర (హీరో-హీరోయిన్ల పాత్ర) భారతవాసులకే లభించింది. మీరు అందరినీ రావణ రాజ్యము నుండి విడిపిస్తారు. శ్రీమతము ద్వారా మీకు ఎంత శక్తి లభిస్తుంది! మాయ కూడా చాలా శక్తివంతమైనది. నడుస్తూ నడుస్తూ మోసము చేస్తుంది.
బాబా ప్రేమసాగరుడు కనుక పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ కఠినంగా మాట్లాడకండి. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు. ఈ అలవాట్లన్నీ సమాప్తము చేసుకోవాలి. విషయసాగరములో మునగడం అన్నిటికంటే చెడ్డ(మురికి) అలవాటు. కామము మహాశత్రువని తండ్రి కూడా చెప్తారు. ఎంతోమంది పిల్లలు దెబ్బలు తింటారు. కొంతమంది తమ కన్యలకు పవిత్రంగా ఉండమని చెప్తారు. అరే! మొదట మీరు పవిత్రులవ్వండి. కన్యలను పంపునప్పుడు - మీ అదృష్టములో ఏముందో, సుఖమైన ఇల్లు దొరకుతుందో లేదో తెలియదు, ఖర్చు మొదలైన భారము నుండి విముక్తులౌతామని భావిస్తారు. ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది. పేదవారు చాలా త్వరగా ఇచ్చేస్తారు. కొందరికి ఇంకా మోహముంటుంది. మొదట ఒక బోయ స్త్రీ వస్తూ ఉండేది, కాని జాదూ చేస్తారేమో అనే భయము వలన జ్ఞానములోకి వచ్చేందుకు అనుమతించలేదు. భగవంతుని ఇంద్రజాలికుడని కూడా అంటారు. దయాహృదయులని భగవంతుని మాత్రమే అంటారు. కృష్ణుని అలా అనరు. ఎవరైతే నిర్దయుని నుండి విడిపిస్తారో వారే దయాహృదయులు. రావణుడు నిర్దయుడు.
మొదటిది జ్ఞానము. జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యము. భక్తి, జ్ఞానము తర్వాత వైరాగ్యమని అనరు. జ్ఞానము పై వైరాగ్యము కలగదు. భక్తి పై వైరాగ్యము కలుగుతుంది. కనుక జ్ఞానము, భక్తి, వైరాగ్యము, ఇవి సరియైన వరుస పదాలు. తండ్రి మీకు బేహద్ అనగా పాత ప్రపంచము పై వైరాగ్యము కలిగిస్తారు. సన్యాసులైతే కేవలం ఇల్లు-వాకిళ్ళ పై వైరాగ్యము కలిగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. మనుష్యుల బుద్ధిలో ఇది కూర్చోదు. భారతదేశము నూరు శాతము శ్రేష్ఠ సంపన్నంగా, నిర్వికారంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎప్పుడూ అకాలమృత్యువులు జరిగేవి కాదు. ఈ అన్ని విషయాల ధారణ చాలా కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో, వారు చాలా ధనవంతులుగా అవుతారు. పిల్లలకు పూర్తి రోజంతా 'బాబా-బాబా' అనే స్మృతి ఉండాలి. కాని మాయ అలా ఉండనివ్వదు. తండ్రి చెప్తున్నారు - సతోప్రధానంగా అవ్వాలంటే నడుస్తూ-తిరుగుతూ-తింటూ నన్ను స్మృతి చేయండి. నేను మిమ్ములను విశ్వాధిపతులుగా చేస్తాను, మీరు నన్ను స్మృతి చేయలేరా! చాలామందికి మాయ తుఫానులు చాలా వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తారు - ఇలా జరుగుతుంది. డ్రామాలో నిర్ణయించబడి ఉంది. స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుంది. సదా కొత్త ప్రపంచముండేందుకు వీలు కాదు. చక్రము తిరిగినట్లయితే తప్పకుండా క్రిందకు దిగుతారు. కొత్తగా ఉన్న ప్రతి వస్తువు తప్పకుండా పాతదిగా అవుతుంది. ఈ సమయంలో మాయ అందరిని ఏప్రిల్ ఫూల్‌గా(ఏమార్చింది) చేసేసింది, తండ్రి వచ్చి సుగంధ పుష్పాలుగా చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్
ఈ స్థూల దేహములో ప్రవేశించి కర్మేంద్రియాలతో కార్యము చేస్తున్నానని అభ్యాసము చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు భిన్నమైపోండి. ఒక సెకండులో శరీరాన్ని ధరించండి, ఒక సెకండులో దేహ భావాన్ని వదిలి దేహీగా అవ్వండి. ఈ అభ్యాసమే అవ్యక్త స్థితికి ఆధారము.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి సమానం ప్రేమసాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ, ఎవ్వరికీ దుఃఖమివ్వరాదు. కటువచనాలు మాట్లాడరాదు, చెడు అలవాట్లను సమాప్తము చెయ్యాలి.
2. బాబాతో మధురంగా మాట్లాడుతూ - ''ఓహో బాబా! మీరు మమ్ములను ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారు? మీరు మాకు ఎంత సుఖాన్నిచ్చారు! బాబా మీరు క్షీరసాగరానికి తీసుకెళ్తున్నారు,......'' ఈ ఫీలింగులోకి రావాలి. పూర్తి రోజంతా బాబా-బాబా అను స్మృతి ఉండాలి.
వరదానము :- '' మీ ప్రతి కర్మ లేక విశేషత ద్వారా దాత వైపు సూచించే సత్యమైన సేవాధారి భవ ''
సత్యమైన సేవాధారులు ఏ ఆత్మకైనా సహయోగమిస్తారు, స్వయం ఆగిపోరు, చిక్కుకుపోరు. వారు అందరి కనెక్షన్ తండ్రితో చేయిస్తారు. వారి ప్రతి మాట తండ్రి స్మృతి ఇప్పించేదిగా ఉంటుంది. వారి ప్రతి కర్మ ద్వారా తండ్రి కనిపిస్తారు. నా విశేషత కారణంగా నాకు సహయోగులుగా ఉన్నారనే సంకల్పము కూడా వారికి రాదు. మిమ్ములను చూస్తూ తండ్రిని చూడకుంటే అది సేవ చేయడం కాదు, తండ్రిని మరిపించడం. సత్యమైన సేవాధారులు అందరి సంబంధము 'సత్యము' తో జోడిస్తారు, స్వయంతో కాదు.
స్లోగన్ :- '' అర్జీ వేసేందుకు బదులు రాజీగా ఉండండి. ''
No comments:
Post a Comment