Monday, January 6, 2020

Telugu Murli 07/01/2020

07-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - జ్ఞాన ధారణతో పాటు సత్యయుగములో రాజ్య పదవి కొరకు స్మృతి బలమును, పవిత్రతా బలమును జమ చేసుకోండి. ''

ప్రశ్న :- ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థ లక్ష్యము ఏముండాలి ?
జవాబు :- సదా ఖుషీ(సంతోషం)గా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. అందరినీ ప్రేమతో నడిపించాలి,............... ఇదే మీ పురుషార్థ లక్ష్యముగా ఉండాలి. ఈ లక్ష్యము ద్వారానే మీరు సర్వ గుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా అవుతారు.

ప్రశ్న :- ఎవరి కర్మలు శ్రేష్ఠంగా ఉంటాయో వారి గుర్తులు ఎలా ఉంటాయి ?
జవాబు :- వారి ద్వారా ఎవ్వరికీ దుఃఖము కలగదు. తండ్రి ఎలాగైతే దుఃఖహర్త - సుఖకర్తగా ఉన్నారో, అలా శ్రేష్ఠ కర్మలు చేయువారు కూడా దుఃఖహర్త - సుఖకర్తలుగా ఉంటారు.

పాట :- ఆకాశ సింహాసనాన్ని విడిచిపెట్టి రండి,..............( ఛోడ్‌ భీ ఆకాశసింహాసన్‌,........)
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! అని ఎవరంటున్నారు? ఇద్దరు తండ్రులు అంటున్నారు. నిరాకార తండ్రి కూడా అన్నారు, సాకార తండ్రి కూడా అన్నారు. అందుకే వీరిని బాప్‌ మరియు దాదా అని అంటారు. దాదా సాకారంలో ఉన్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందినది. ఇప్పుడు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. ఆ తండ్రి సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెడ్తున్నారని కూడా పిల్లలకు తెలుసు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా మేము 84 జన్మలు పూర్తి చేశామని, ఇప్పుడు నాటకము పూర్తి అవుతుందని ఉంది. ఇప్పుడు యోగము లేక స్మృతి ద్వారా పావనంగా అవ్వాలి. స్మృతి మరియు జ్ఞానము ప్రతి విషయములో ఉంటుంది. బ్యారిస్టరును స్మృతి చేస్తూ వారి నుండి జ్ఞానము తీసుకుంటారు. దీనిని కూడా జ్ఞాన-యోగ బలము అని అంటారు. ఇక్కడ ఇది నూతన విషయము. ఆ జ్ఞాన-యోగాల ద్వారా హద్దులోని బలము లభిస్తుంది. ఇక్కడ ఈ జ్ఞాన-యోగాల వలన బేహద్‌ బలము లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్వశక్తివంతులు అథారిటీగా ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - నేను జ్ఞానసాగరుడను. మీరిప్పుడు సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మూలవతము, సూక్ష్మవతనము అన్నీ గుర్తున్నాయి. ఏ జ్ఞానము తండ్రిలో ఉందో, అది కూడా లభించింది. అందువలన జ్ఞానము కూడా ధారణ చేయాలి. అంతేకాక రాజ్యపదవి కొరకు తండ్రి పిల్లలకు యోగమును, పవిత్రతను నేర్పిస్తున్నారు. మీరు పవిత్రంగా కూడా అవుతున్నారు. తండ్రి నుండి రాజ్యపదవి కూడా తీసుకుంటారు. తండ్రి మీకు తన కంటే గొప్ప పదవిని ఇస్తున్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పదవిని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు మాత్రమే లభించింది. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రి ద్వారా ఉన్నతాతి ఉన్నతంగా అయ్యే జ్ఞానము లభిస్తుంది. ఇప్పుడు మనము బాప్‌దాదా ఇంటిలో కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. ఈ దాదా(బ్రహ్మ) తల్లి కూడా అయ్యారు. ఆ తండ్రి ఏమో వేరుగా ఉన్నారు. కానీ ఈ దాదా - తల్లి కూడా అయ్యారు. అయితే వీరిది పురుష శరీరము కావున తల్లి నియమించబడ్తుంది. వీరు కూడా దత్తు తీసుకోబడ్తారు. వారి ద్వారా మళ్లీ రచన జరిగింది. రచన కూడా దత్తు తీసుకోబడినవారే. ఆస్తి ఇచ్చేందుకు తండ్రి దత్తు తీసుకుంటారు. బ్రహ్మను కూడా దత్తు తీసుకున్నారు. ప్రవేశించడమన్నా దత్తు తీసుకోవడమన్నా ఒక్కటే. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు, అందరికీ అర్థం కూడా చేయిస్తున్నారు. నంబరువారు పురుషార్థానుసారము అందరికీ ఇది అర్థం చేయించాలి - మేము పరమపిత పరమాత్మ శ్రీమతముననుసరించి ఈ భారతదేశమును మళ్లీ శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా తయారుచేస్తున్నాము. కావున మొదట స్వయాన్ని కూడా శ్రేష్ఠంగా చేసుకోవాల్సి వస్తుంది. మేము శ్రేష్ఠంగా తయారయ్యామా? ఏదైనా భ్రష్ఠాచార పని చేసి ఎవ్వరికీ దుఃఖమివ్వడం లేదు కదా? అని స్వయాన్ని చూసుకోవాలి. నేను పిల్లలకు సుఖమునిచ్చేందుకు వచ్చాను. కనుక మీరు కూడా అందరికీ సుఖమునే ఇవ్వాలి. ఆ తండ్రి ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. వారి పేరే దుఃఖహర్త - సుఖకర్త. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమివ్వడం లేదు కదా? అని పిల్లలు స్వయాన్ని చెక్‌ చేసుకోవాలి. శివబాబా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. తండ్రి అంటున్నారు - నేను కల్ప-కల్పము పిల్లలైన మీకు అనంతమైన(బేహద్‌) కథ వినిపిస్తాను. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్లి మళ్లీ నూతన ప్రపంచములోకి వస్తామని మీ బుద్ధిలో ఉంది. ఇప్పటి చదువుననుసరించి చివర్లో మీరు బదిలీ అయిపోతారు. వాపసు ఇంటికి వెళ్ళి మళ్లీ పాత్ర చేసేందుకు నంబరువారిగా వస్తారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది.
ఇప్పుడు ఏ పురుషార్థము చేస్తారో, ఆ పురుషార్థమే కల్ప-కల్పము సిద్ధిస్తుందని(జరుగుతుందని) పిల్లలకు తెలుసు. రచయిత, రచనల ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదని మొట్టమొదట అందరి బుద్ధిలో కూర్చోబెట్టాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి పేరునే మాయం చేసేశారు. త్రిమూర్తి పేరు మాత్రముంది, త్రిమూర్తి వీధి, త్రిమూర్తి హౌస్‌ కూడా ఉన్నాయి. త్రిమూర్తులు అని బ్రహ్మ, విష్ణు, శంకరులను అంటారు. ఈ ముగ్గురి రచయిత మరియు మూలమైన శివబాబా పేరునే మాయం చేసేశారు. ఇప్పుడు అత్యంత ఉన్నతమైనవారు శివబాబా. ఆ తర్వాత త్రిమూర్తులని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి నుండి పిల్లలైన మనము ఈ వారసత్వము తీసుకుంటాము. తండ్రి ఇచ్చిన జ్ఞానము, వారసత్వము రెండూ స్మృతిలో ఉంటే సదా హర్షితంగా ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా జ్ఞాన బాణము వేస్తే మంచి ప్రభావము ఉంటుంది. వారిలో శక్తి వస్తూ ఉంటుంది. స్మృతియాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడది అదృశ్యమైపోయింది ఎందుకంటే ఆత్మ తమోప్రధానమైపోయింది. ఇప్పుడు ముఖ్యంగా మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలనే చింత మీలో ఉండాలి. గీతను చదివే వారిని మన్మనాభవకు అర్థము చెప్పమని అడగండి. నన్ను స్మృతి చేస్తే వారసత్వము లభిస్తుందని ఎవరన్నారని అడగండి. నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేది కృష్ణుడేమీ కాదు. కృష్ణుడు రాకుమారుడు. బ్రహ్మ ద్వారా స్థాపన అనే మహిమ ఉంది. అసలు చేసి చేయించేది ఎవరో మర్చిపోయారు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. బ్రహ్మ-విష్ణు-శంకరుడు మొదలైన వారిలో కూడా అతనే ఉన్నారని చెప్తారు. దీనినే అజ్ఞానమని అంటారు. తండ్రి చెప్తున్నారు - పంచ వికారాలనే రావణుడు మిమ్ములను ఎంతో తెలివిహీనులుగా చేసేశాడు. మనము కూడా మొదట ఇలాగే ఉండేవారమని మీకు తెలుసు. అయితే మొట్టమొదట మనమే ఉత్తమోత్తములుగా ఉండేవారము. తర్వాత క్రింద పడుతూ అత్యంత పతితులుగా అయ్యాము. శాస్త్రాలలో భగవంతుడైన రాముడు వానర సైన్యము తీసుకున్నట్లు వ్రాశారు. అది కూడా సరైనదే. మనము కోతుల వలె ఉండేవారమని మీకు తెలుసు. ఇది భ్రష్ఠాచార ప్రపంచమని ఇప్పుడు అనుభవమవుతూ ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటూ, ముళ్లు గ్రుచ్చుకుంటూ ఉంటారు. ఇది ముళ్ల అడవి. అది పుష్పాల తోట. అడవి చాలా పెద్దదిగా ఉంటుంది. తోట చాలా చిన్నదిగా ఉంటుంది. తోట పెద్దదిగా ఉండదు. ఇప్పుడిది చాలా పెద్ద ముళ్ళ అడవి అని పిల్లలు అర్థము చేసుకున్నారు. సత్యయుగంలో పుష్పాల తోట చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ విషయాలు పిల్లలైన మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఎవరిలో జ్ఞాన-యోగాలు లేవో, ఎవరైతే సేవలో తత్పరులవ్వరో, వారిలో అంత సంతోషము కూడా ఉండదు. దానము చేసినందున మానవులకు చాలా సంతోషము కలుగుతుంది. ఇతను ముందు జన్మలో దాన-పుణ్యాలు చేసినందున మంచి జన్మ లభించిందని అంటూ ఉంటారు. భక్తులైనవారు, మంచి భక్తుల ఇంటిలో జన్మిస్తామని అనుకుంటారు. మంచి కర్మల ఫలము కూడా మంచిగానే ఉంటుంది. కర్మ-అకర్మ-వికర్మల గురించి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు రావణ రాజ్యమైనందున, మానవుల కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. అందరూ పతితులుగా అయ్యే తీరాలి. అందరిలోనూ పంచ వికారాలు ప్రవేశించే ఉన్నాయి. దాన- పుణ్యాలు మొదలైనవి చేస్తూనే ఉంటారు. వాటి ఫలము అల్పకాలానికి మాత్రమే లభిస్తుంది. మళ్లీ పాపాలు చేస్తూనే ఉంటారు. రావణ రాజ్యములో ఏది ఇచ్చి పుచ్చుకున్నా అది పాపముతో కూడుకున్నదే! దేవతలకు చాలా స్వచ్ఛతతో భోగ్‌(నైవేద్యము) పెట్తారు. స్వచ్ఛంగా తయారై వస్తారు. కాని వారికి ఏ మాత్రము తెలియదు. బేహద్‌ తండ్రిని కూడా ఎంతగానో గ్లాని చేశారు! ఈశ్వరుడు సర్వవ్యాపి అనడం వారిని గొప్పగా మహిమ చేయడమని అనుకుంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. సర్వశక్తి వంతుడు. ఇది వీరి ఉల్టా మతము(తప్పు అభిప్రాయము) అని తండ్రి చెప్తున్నారు.
మీరు మొట్టమొదట తండ్రి మహిమను వినిపిస్తారు - అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు ఒక్కరే. మేము వారినే స్మృతి చేస్తున్నాము. రాజయోగము లక్ష్యము కూడా మీ ఎదుటే ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రి ఒక్కరు మాత్రమే నేర్పించగలరు. కృష్ణుని తండ్రి అని అనరు. కృష్ణుడు ఒక బాలుడు. కాని శివుని ఓ తండ్రీ! అని అంటారు. వారికి తమ స్వంత శరీరము లేదు. ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. అందుకే వీరిని బాప్‌దాదా అని అంటారు. వారు అత్యంత ఉన్నతులైన నిరాకార తండ్రి. రచనకు రచన ద్వారా వారసత్వము లభించదు. లౌకిక సంబంధములో పిల్లలకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఆడ పిల్లలకు లభించదు.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఆత్మలైన మీరంతా నాకు పుత్రులే. ప్రజాపిత బ్రహ్మకు పుత్రులు, పుత్రికలు. బ్రహ్మ నుండి వారసత్వము లభించదు. తండ్రికి చెందినవారిగా అయితేనే వారసత్వము లభిస్తుంది. ఈ తండ్రి సన్ముఖములో కూర్చొని పిల్లలైన మీకు వినిపిస్తున్నారు. వీరు చెప్పింది ఏ శాస్త్రముగానూ తయారవ్వదు. మీరు వ్రాసుకుంటారు, సాహిత్యము కూడా అచ్చు వేయిస్తారు. కానీ టీచరు లేకుండా పుస్తకాల ద్వారా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆత్మిక టీచర్లు, తండ్రి బీజరూపులు, వారి వద్ద మొత్తం వృక్షము యొక్క ఆది-మధ్య-అంత్యముల జ్ఞానముంది. టీచరు రూపములో కూర్చొని అర్థము చేయిస్తున్నారు. సుప్రీమ్‌ తండ్రి మనలను తన పిల్లలుగా చేసుకున్నారనే ఖుషీ సదా ఉండాలి. వారే మనకు టీచరై చదివిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా వారే, తమ వెంట తీసుకెళ్తారు. సర్వుల సద్గతిదాత వారొక్కరే. అత్యంత ఉన్నతమైన తండ్రి కూడా వారే. వారు భారతదేశానికి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వారసత్వమునిస్తారు. వారి శివజయంతిని జరుపుకుంటారు. వాస్తవానికి శివునితో పాటు త్రిమూర్తి అని కూడా ఉండాలి. మీరు త్రిమూర్తి శివజయంతిని జరుపుకుంటారు. కేవలం శివజయంతిని జరుపుకోవడం ద్వారా ఏ విషయము నిరూపించబడదు. తండ్రి వచ్చిన తర్వాత బ్రహ్మ జన్మ జరుగుతుంది. పిల్లలుగా అయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు. లక్ష్యము మీ ఎదుట నిలబడి ఉంది. తండ్రి స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు. మీ లక్ష్యము కూడా చాలా స్పష్టంగా ఉంది. కేవలం కృష్ణుని పేరు వేసినందున గీతకున్న గొప్పతనమంతా పోయింది. కాని ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఈ తప్పు మళ్లీ జరగనే జరుగుతుంది. ఈ డ్రామా అంతా జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట. తండ్రి అంటున్నారు - అల్లారు ముద్దు పిల్లలారా, సుఖధామము - శాంతిధామాలను స్మృతి చేయండి. అల్ఫ్‌(పరమాత్మ), బే(ఆస్తి)లను స్మృతి చేయడం ఎంతో సులభము. మీరు మన్మనాభవ అర్థము చెప్పమని ఎవరినైనా అడగండి. వారేమంటారో చూడండి. భగవంతుడు అని ఎవరిని అనాలి? భగవంతుడు అత్యంత ఉన్నతులు కదా - వారిని సర్వవ్యాపి అని ఎలా అంటారు? అని అడగండి. వారు అందరికీ తండ్రి. ఇప్పుడు త్రిమూర్తి శివజయంతి వస్తుంది. మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారుచేయాలి. అత్యంత ఉన్నతమైనవారు శివుడు. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. అత్యంత ఉన్నతమైనవారు శివబాబా. వారు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. వారి జయంతిని మీరెందుకు జరుపుకోరు? ఆ శివుడు భారతదేశానికి వారసత్వమునిచ్చారు. వారి రాజ్యముండేది. ఇందులో మీకు ఆర్య సమాజము వారు కూడా సహాయమందిస్తారు. ఎందుకంటే వారు కూడా శివుని నమ్మి గౌరవిస్తారు. మీరు మీ జెండాను ఎగురవేయండి. ఒకవైపు త్రిమూర్తి మరియు సృష్టి చక్రము, రెండవ వైపు కల్పవృక్షము ఉండాలి. వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి. ఇలా తయారుజేయగలరు కదా. జెండాను ఎగురవేస్తే అందరూ చూస్తారు. పూర్తి జ్ఞానమంతా ఈ జెండాలో ఉంది. కల్పవృక్షము, డ్రామా ఈ రెండింటిలో చాలా స్పష్టంగా ఉంది. మళ్లీ తమ ధర్మము ఎప్పుడు ప్రారంభమవుతుందని అన్ని ధర్మాల వారికి తెలిసిపోతుంది. వారికి వారే లెక్కించుకుంటారు. అందరికీ ఈ చక్రము గురించి, వృక్షము గురించి అర్థం చేయించాలి. ఏసుక్రీస్తు ఎప్పుడు వచ్చారు? అంతవరకు క్రైస్తవ ఆత్మలు ఎక్కడ ఉన్నారు? నిరాకార ప్రపంచములో అని తప్పకుండా చెప్తారు. మనము ఆత్మలము, రూపాలు మార్చుకొని సాకారులుగా అయ్యాము. తండ్రిని, మీరు కూడా రూపము మార్చుకొని సాకారములోకి రండి అని పిలుస్తారు కదా. బాబా వచ్చేది ఇక్కడకే కదా. సూక్ష్మవతనములోకి రారు. మేమెలా మా రూపాలు మార్చుకొని పాత్ర చేస్తున్నామో, మీరు కూడా వచ్చి మళ్లీ రాజయోగము నేర్పించండని పిల్లలు అంటారు. రాజయోగము భారతదేశాన్ని స్వర్గంగా మారుస్తుంది. ఇవి చాలా సహజమైన విషయాలు. కానీ ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలనే ఆసక్తి పిల్లలకు ఉండాలి. దీని కొరకు బాగా చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఉండాలి. తండ్రి వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల ముందు భారతదేశము స్వర్గంగా ఉండేదని అంటారు. అందువలన త్రిమూర్తి శివుని చిత్రమును అందరికీ పంపించాలి. త్రిమూర్తి శివుని స్టాంపు తయారుచేయాలి. ఈ స్టాంపులు తయారు చేసే డిపార్టుమెంటు కూడా ఉంటుంది. ఢిల్లీలో చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. వారు ఈ పని చేయగలరు. మీ రాజధాని కూడా ఢిల్లీనే అవుతుంది. మొదట ఢిల్లీనే, ఫరిస్తాన్‌ అని స్వర్గధామమని అనేవారు. ఇప్పుడు శ్మశానము వలె తయారయింది. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి.
ఇప్పుడు మీరు సదా ఖుషీ(సంతోషం)గా ఉండాలి. అత్యంత మధురంగా తయరవ్వాలి. అందరినీ ప్రేమతో నడిపించాలి. సర్వ గుణ సంపన్నలు, 16 కళా సంపూర్ణులుగా అయ్యే పురుషార్థము చేయాలి. మీ పురుషార్థము, లక్ష్యము ఇదే అయినా ఇంతవరకు ఎవ్వరూ తయారవ్వలేదు. ఇప్పుడు మీరకు ఉన్నతి చెందే(ఎక్కే) కళలో ఉన్నారు. మెల్లమెల్లగా ఎక్కుతారు కదా. అందుకే బాబా శివజయంతి రోజున అన్ని విధాలుగా సేవ చేసేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అలా చేస్తే వీరి జ్ఞానము గొప్పదని మానవులు భావిస్తారు. మనుష్యులకు అర్థం చేయించేందుకు చాలా శ్రమ పడవలసి వస్తుంది. శ్రమ చేయకుండా రాజధాని స్థాపనవ్వదు. ఎక్కుతారు, క్రింద పడ్తారు మళ్లీ ఎక్కుతారు. పిల్లలకు అనేక రకాలైన తుఫానులు వస్తూనే ఉంటాయి. ముఖ్యమైనది స్మృతి. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. జ్ఞానము చాలా సహజము. పిల్లలు చాలా మధురాతి మధురంగా తయారవ్వాలి. లక్ష్యమేమో మీ ముందే ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఎంతో మధురంగా ఉన్నారు. వీరిని చూస్తూనే ఎంత ఖుషీ కలుగుతుంది! విద్యార్థులమైన మన లక్ష్యము ఇదే. చదివించేవారు భగవంతుడు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని, వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. జ్ఞాన-యోగాలుంటే సేవలో తత్పరులై ఉండాలి.
2 . సుఖధామము, శాంతిధామాలను స్మృతి చేయాలి. ఈ దేవతల వలె మధురంగా అవ్వాలి. అపారమైన ఖుషీలో ఉండాలి. ఆత్మిక టీచరుగా అయి జ్ఞాన దానము చేయాలి.

వరదానము :- '' అంతర్ముఖతను అభ్యసించుట ద్వారా అలౌకిక భాషను అర్థము చేసుకునే సదా సఫలతా సంపన్న భవ ''
పిల్లలైన మీరు ఎంతెంత అంతర్ముఖులుగా అయి స్వీట్‌ సైలెన్స్‌ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో, అంత నయనాల భాష, భావనా భాష, సంకల్పాల భాషలను సహజంగా అర్థము చేసుకుంటారు. ఈ మూడు విధాలైన భాష ఆత్మిక యోగి జీవిత భాష. ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి భాష. సమయానుసారం ఈ మూడు భాషల ద్వారానే సహజ సఫలత ప్రాప్తి అవుతుంది. అందువలన ఇప్పుడు ఆత్మిక భాషను అభ్యసించువారిగా అవ్వండి.

స్లోగన్‌ :- '' తండ్రి మిమ్ములను తమ కనురెప్పల పై కూర్చోబెట్టుకొని తన వెంట తీసుకెళ్లగలిగేటంత తేలికగా అవ్వండి. ''

No comments:

Post a Comment