20-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - పుణ్యాత్మలుగా అవ్వాలంటే, మేము ఏ పాపము చేయడం లేదు కదా, సత్యత ఖాతా జమ అయిందా? అని మీ లెక్కాచారాన్ని మీరు చూచుకోండి ''
ప్రశ్న :- అన్నిటికంటే పెద్ద పాపమేది ?
జవాబు :- ఎవ్వరి పైన అయినా చెడు(వికారి) దృష్టి ఉంచడం - ఇది అన్నిటికంటే పెద్ద పాపము. మీరు పుణ్యాత్మలుగా అయ్యే పిల్లలు ఎవ్వరి పైనా చెడు(వికారి) దృష్టి ఉంచరాదు. నేను ఎంతవరకు యోగములో ఉంటున్నాను? ఏ పాపము చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఉన్నత పదవి పొందాలంటే కొద్దిగా కూడా చెడు దృష్టి లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఇచ్చే శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉండండి.
పాట :- నీ ముఖము చూచుకో ప్రాణీ!.............( ముఖ్‌డా దేఖ్ లో ప్రాణీ,..............)
ఓంశాంతి. అనంతమైన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ! మీ ఆంతరికములో కొంచెము చెక్ చేసుకోండి. మా జీవితములో మేమెంత పాపము చేశాము, ఎంత పుణ్యము చేశాము? అని ప్రతి మనిషికి తెలిసే ఉంటుంది. ప్రతి రోజు మీ లెక్కాచారము చూసుకోండి - ఎంత పాపము చేశాను, ఎంత పుణ్యము చేశాను? ఎవరికి కోపము తెప్పించలేదు కదా? ఎవ్వరినీ విసిగించేలేదు కదా? మా జీవితములో ఏమేం చేశాము? అని ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు. ఎంత పాపము చేశాను, ఎన్ని దాన పుణ్యాలు మొదలైనవి చేశాను? మనుష్యులు తీర్థ యాత్రలకు వెళ్తే దాన-పుణ్యాలు చేస్తారు. పాపము చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనుక తండ్రి పిల్లలను - మీరు ఎన్ని పాపాలు చేశారు? ఎన్ని పుణ్యకార్యాలు చేశారు? అని అడుగుచున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి. ఏ పాపమూ చేయరాదు. పాపాలు కూడా అనేక రకాలుంటాయి. ఎవరినైనా వికారి దృష్టితో చూచుట కూడా పాపమే. చెడు దృష్టి అంటే వికారి దృష్టి. ఇది అన్నింటికంటే చెడ్డది. వికారి దృష్టి ఎప్పుడూ ఉండరాదు. తరచుగా స్త్రీ - పురుషుల దృష్టి వికారంగానే ఉంటుంది. కుమారి - కుమారులలో కూడా ఎక్కడో అక్కడ వికారి దృష్టి కలుగుతుంది. ఈ వికారి దృష్టి మీలో ఉండరాదని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. లేకుంటే మిమ్ములను కోతులని అనవలసి వస్తుంది. నారదుని ఉదాహరణ ఉంది కదా. నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగాడు. మేము లక్ష్మిని వరిస్తామని మీరు కూడా అంటారు కదా. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని అంటారు. తండ్రి చెప్తున్నారు - మీ హృదయములో ''ఎంతవరకు పుణ్యాత్మలుగా అయ్యాము? ఏ పాపము చేయడం లేదు కదా.'' ఎంతవరకు యోగములో ఉంటున్నానని ప్రశ్నించుకోండి.
పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు. అందుకే కదా మీరిక్కడ కూర్చొని ఉన్నారు. ప్రపంచములోని వారు బాబాను చూచినప్పుడు వీరు బాప్‌దాదా అని గుర్తించలేరు. పరమపిత పరమాత్మ బ్రహ్మలో ప్రవేశించి మనకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా ఇస్తారని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మనుష్యుల వద్ద వినాశి ధనముంటుంది. వారు దానినే దానము చేస్తారు. అవి రత్నాలు కాదు రాళ్లు. ఇవి జ్ఞాన రత్నాలు. ఈ రత్నాలు జ్ఞానసాగరులైన తండ్రి వద్ద మాత్రమే ఉంటాయి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలకు సమానము. రత్నాగరుడైన తండ్రి నుండి జ్ఞాన రత్నాలు ధారణ చేసుకున్న తర్వాత ఇతరులకు దానము చేయాలి. ఎవరెంత తీసుకుంటూ - ఇస్తూ ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇంతవరకు మేము ఎన్ని పాపాలు చేశామని మీలో మీరు చూసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడిక నా ద్వారా ఏ పాపము జరుగుట లేదు కదా? అని పరిశీలించుకోండి. కొద్దిగా కూడా చెడు(వికారి) దృష్టి ఉండరాదు. తండ్రి ఇచ్చు శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉండాలనే గమనముండాలి. మాయ తుఫానులు భలే వచ్చినా కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయరాదు. ఎవరి పై అయినా చెడు దృష్టి పోయిందంటే వారి ముందు నిలబడను కూడా నిలబడరాదు. అక్కడ నుండి వెంటనే వెళ్లిపోవాలి. వీరిది చెడు దృష్టి అని తెలిసిపోతుంది. ఉన్నత పదవి పొందాలంటే చాలా హెచ్చరికగా ఉండాలి. కుదృష్టి ఉంటే, కుంటి, గ్రుడ్డి వారిగా అవుతారు. తండ్రి ఏ శ్రీమతమునిస్తారో దానిని అనుసరించాలి. తండ్రిని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. బాబా ఎక్కడకైనా వెళ్లారనుకోండి. బాప్‌దాదా వచ్చారని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. చాలామంది మనుష్యులు చూస్తారు. కానీ వారికి కొంచెం కూడా తెలియదు. ఎవరైనా వీరు ఎవరు అని అడిగితే, బాప్‌దాదా అని చెప్పండి. బ్యాడ్జి అయితే అందరి వద్ద ఉండనే ఉండాలి. శివబాబా మాకు ఈ దాదా ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలను దానమిస్తున్నారని చెప్పండి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. సర్మాత్మల తండ్రి కూర్చొని ఈ జ్ఞానమిస్తున్నారని చెప్పండి. శివభగవానువాచ, గీతలో కృష్ణ భగవానుచ అనేది తప్పు. జ్ఞాన సాగరులు, పతిత పావనులు అని శివుడినే అంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. తండ్రి ఒక్కరే సద్గతిదాత. ఇవన్నీ పూర్తిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నామని పిల్లలు భావిస్తారు. అలాగే తండ్రి కూడా నేను పిల్లలను తెలుసుకున్నానని భావిస్తారు. వీరందరు నా పిల్లలే. అయితే నన్ను తెలుసుకోలేరు అని తండ్రి చెప్తున్నారు. భాగ్యములో ఉంటే పోను పోను తెలుసుకుంటారు. ఈ బ్రహ్మాబాబా ఎక్కడికైనా వెళ్లారనుకోండి. వీరెవరు? అని ఎవరైనా అడుగుతారు. తప్పకుండా మంచి భావనతోనే అడుగుతారు. వీరు బాప్‌దాదా అని చెప్పండి. అనంతమైన తండ్రి నిరాకారులు. ఎంతవరకు వారు సాకారములోకి రారో అంతవరకు వారసత్వమెలా లభిస్తుంది? కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకొని వారసత్వమునిస్తారు. ఇతను ప్రజాపిత బ్రహ్మ, వీరంతా బి.కె.లు. చదివించేవారు జ్ఞానసాగరులు. వారి నుండే వారసత్వము లభిస్తుంది. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. ఇతను బ్రాహ్మణుని నుండి దేవతగా అయ్యేవాడు. ఇలా అర్థం చేయించడం ఎంత సులభము! ఎవరికైనా బ్యాడ్జి పై అర్థము చేయించడం మంచిది. బాబా చెప్తున్నారు - ''నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి, పావనమై పావన ప్రపంచములోకి వెళ్లిపోతారని'' వారికి చెప్పండి. వీరు పతిత పావనులైన తండ్రి కదా. పావనమయ్యేందుకు మేము పురుషార్థము చేస్తున్నాము. వినాశన సమయానికి మా చదువు పూర్తి అవుతుంది. ఇలా అర్థము చేయించడం ఎంత సులభము! మీరు ఎక్కడకు వెళ్లినా బ్యాడ్జి మీతోనే ఉండాలి. ఈ బ్యాడ్జితో పాటు ఒక చిన్న కరపత్రము కూడా ఉండాలి. తండ్రి భారతదేశములో వచ్చి మళ్లీ ఆదిసనాతన దేవిదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని ఆ కర పత్రములో వ్రాయబడి ఉండాలి. అంతేకాక ఇతర అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధము ద్వారా కల్పక్రితము వలె డ్రామానుసారము సమాప్తమైపోతాయని కూడా ముద్రింపబడి ఉండాలి. ఇటువంటి కరపత్రాలు 2-4 లక్షలు ముద్రింపబడి ఉండాలి. ఈ కరపత్రమును ఎవ్వరికైనా ఇవ్వవచ్చు. పైన త్రిమూర్తి ఉండాలి, రెండవ వైపు సెంటరు అడ్రసు ఉండాలి. రోజంతా సేవ చేయాలనే ఆలోచన పిల్లలకు నడుస్తూ ఉండాలి.
పిల్లలు పాట విన్నారు కదా - మొత్తం ఈ రోజంతా నా స్థితి ఎలా ఉండినది? అని ప్రతి రోజూ మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పూర్తి లెక్కాచారాన్ని వ్రాసుకునే వారిని ఈ బాబా చాలామందిని చూశారు. ఏ చెడు పని చెయ్యలేదు కదా? అని చెక్ చేసుకుంటారు. చేసినవన్నీ వ్రాసుకుంటారు. వ్రాయబడిన జీవిత కథ మంచిగా ఉంటే తర్వాత వచ్చేవారు చదువుకొని అలాగే నేర్చుకుంటారని భావిస్తారు. ఇలా వ్రాసేవారు మంచి మనుష్యులుగానే ఉంటారు. అందరూ వికారులుగానే ఉంటారు. ఇక్కడ ఆ విషయమే లేదు. మీరు మీ లెక్కాచారాన్ని ప్రతి రోజు చూసుకోండి. ఆ లెక్కాచారాన్ని బాబా వద్దకు పంపితే ఉన్నతి చాలా బాగా జరుగుతుంది. భయము కూడా ఉంటుంది. అంతా స్పష్టంగా వ్రాయాలి - ఈ రోజు నా దృష్టి చెడుగా ఉండినది. ఇలా జరిగింది.............. ఒకరికొకరు దుఃఖమిచ్చుకునే వారిని బాబా ధూర్తులు అని అంటారు. జన్మ-జన్మాంతరాల పాపము మీ తల పై ఉంది. ఇప్పుడు మీరు యోగబలము ద్వారా పాప భారాన్ని దించుకోవాలి. కనుక ప్రతిరోజూ ఈ రోజంతటిలో ఎంత ధూర్తునిగా ఉన్నాను ? ఎవరికైనా దుఃఖము కలిగించడం అనగా ధూర్తునిగా అవ్వడం. పాపము తయారవుతుంది. తండ్రి చెప్తున్నారు - ధూర్తులుగా అయి ఎవ్వరికీ దుఃఖమివ్వకండి. ఎంత పాపము చేశాను? ఎంత పుణ్యము చేశాను? అని పూర్తిగా స్వయం ఎవరికి వారే చెక్ చేసుకోండి. ఎవరు కలిసినా, వారందరికీ ఈ దారి తెలపాల్సిందే. తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి అని అందరికి చాలా ప్రీతిగా చెప్పండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి. భలే మీరు సంగమ యుగములో ఉన్నారు. కాని ఇది రావణ రాజ్యము కదా. ఈ మాయావి విషయవైతరిణీ నదిలో ఉంటూ కమలపుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి. కమలపుష్పానికి చాలా పిల్ల మొక్కలుంటాయి. అయినా అది నీటి పై భాగములోనే ఉంటుంది. ఈ పుష్పము గృహస్థు, చాలా వాటికి జన్మనిస్తుంది. ఈ దృష్టాంతము మీ కొరకు కూడా చెప్పబడింది. వికారాలకు భిన్నంగా ఉండండి. ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే, అది అవినాశిగా అయిపోతుంది. మీకు తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలనిస్తారు. మిగిలినవన్నీ రాళ్ళే. వారైతే భక్తిలోని మాటలే వినిపిస్తారు. జ్ఞానసాగరులు పతితపావనులు ఒక్కరు మాత్రమే. కనుక అటువంటి తండ్రి పై పిల్లలకు ఎంత ప్రేమ ఉండాలి! తండ్రికి పిల్లల పై, పిల్లలకు తండ్రి పై ప్రేమ ఉంటుంది. ఇక ఏ ఇతరులతోనూ మీకు సంబంధము లేదు. ఎవరు తండ్రి మతమును పూర్తిగా అనుసరించరో వారు సవతి పిల్లలు. రావణుని మతము పై నడిస్తే రాముని మతము వారిగా ఉండరు. అర్ధకల్పము రావణ సంప్రదాయము. కనుక దీనిని భ్రష్టాచార ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు ఇతరులందరినీ వదిలి ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి. బి.కె.ల మతము లభిస్తుంది కాని ఈ మతము రైటా, తప్పా అని చెక్ చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు రైటు ఏదో, తప్పు ఏదో ఆ జ్ఞానము ఇప్పుడే లభించింది. సత్యమైనవారు వచ్చినప్పుడే మీకు రైటు, తప్పులను గురించి తెలుపుతారు. తండ్రి అంటున్నారు - మీరు అర్ధకల్పము ఈ భక్తి మార్గపు శాస్త్రాలు విన్నారు. ఇప్పుడు నేను మీకు ఏది వినిపిస్తున్నానో అది రైటా లేక అది రైటా? వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. నేను మీ తండ్రిని అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు రైటో మీరే నిర్ణయించండి. ఇది కూడా పిల్లలకు మాత్రమే అర్థము చేయించబడ్తుంది కదా. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే అర్థము చేసుకుంటారు. రావణ సంప్రదాయము వారైతే చాలామంది ఉన్నారు. మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా నంబరువారుగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా చెడు దృష్టి ఉంటే, వారిని రావణ సంప్రదాయానికి చెందినవారని అంటారు. ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దైవీ దృష్టిగా అవుతుందో అప్పుడు వారు రామ సంప్రదాయులుగా భావించబడ్తారు. తమ స్థితి ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా. ఇంతకు ముందు మీలో జ్ఞానమే లేదు, ఇప్పుడు తండ్రి దారి చూపించారు. కనుక అవినాశి జ్ఞాన రత్నాలను దానము చేస్తున్నానా లేదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. భక్తులు వినాశి ధనాన్ని దానము చేస్తారు. ఇప్పుడు మీరు దానము చేయవలసింది - అవినాశి ధనాన్ని, వినాశి ధనాన్ని కాదు. మీ వద్ద వినాశి ధనముంటే అలౌకిక సేవలో ఉపయోగిస్తూ ఉండండి. పతితులకు దానము చేయడం వలన పతితులుగానే అవుతారు. ఇప్పుడు మీరు మీ ధనమును దానము చేస్తే దాని ఫలితము 21 జన్మలకు నూతన ప్రపంచములో లభిస్తుంది. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. బాబా సేవ చేసేందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. అందరి పై దయ చూపించండి. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనము కూడా చేయబడి ఉంది. కానీ వారికి అర్థము తెలియదు. అటువంటి పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారు. కనుక పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి. ఇతరులకు కళ్యాణము చేస్తే మీ కళ్యాణము కూడా జరుగుతుంది. రోజురోజుకు బాబా చాలా సులభము చేస్తూ ఉంటారు. ఈ త్రిమూర్తి చిత్రము చాలా మంచిగా ఉపయోగపడే చిత్రము. ఇందులో శివబాబాయే కాక ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నాడు. బి.కె.ల ద్వారా మళ్లీ భారతదేశములో నూరు శాతము పవిత్రత-సుఖ-శాంతుల దైవీ స్వరాజ్యము స్థాపన చేస్తున్నారు. మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధములో కల్పక్రితము వలె వినాశనమైపోతాయి. ఇటువంటి కరపత్రాలు అచ్చు వేయించి పంచాలి. బాబా చాలా సులభ మార్గాన్ని తెలియచేస్తున్నారు. ప్రదర్శినిలో కూడా కరపత్రాలు ఇవ్వండి. కరపత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సులభము. పాత ప్రపంచము వినాశనమయ్యే తీరాలి. నూతన ప్రపంచము స్థాపనవుతూ ఉంది. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపనవుతూ ఉంది. మిగిలినవన్నీ కల్పక్రితము వలె వినాశనమైపోతాయి. ఎక్కడకు వెళ్లినా మీ జేబులో కూడా కరపత్రాలు, బ్యాడ్బిలు సదా ఉండాలి. సెకండులో జీవన్ముక్తి అని గాయనము చేయబడింది. వీరు బాబా(తండ్రి) అని, ఇతను దాదా అని, ఈ తండ్రిని స్మృతి చేస్తే ఇటువంటి దైవీ పదవి సత్యయుగములో పొందుతారని చెప్పండి. పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. కొత్త ప్రపంచమైన విష్ణుపురములో మళ్లీ వీరి రాజ్యము ఉంటుంది. ఎంత సులభము. తీర్థయాత్రలు మొదలైన వాటికి మనుష్యులు వెళ్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. ఆర్య సమాజము మొదలైన వారు కూడా మనుష్యులను రైలు నిండా నింపుకొని యాత్రలకు వెళ్తారు. దీనిని ధర్మము యొక్క దెబ్బ(నష్టము) అని అంటారు. కానీ వాస్తవానికి ఇది అధర్మము వలన కలిగిన నష్టము లేక ఆపద. ధర్మములో అయితే నష్టపడే అవసరమే లేదు. మీరైతే చదువుకుంటున్నారు. భక్తిమార్గములో మనుష్యులు ఏమేమో అర్థము లేని పనులు చేస్తూ ఉంటారు.
పిల్లలు పాటలో మీ ముఖము చూచుకో ప్రాణీ,........... అని విన్నారు. మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ ఇలా దర్పణములో తమ ముఖమును చూసుకోలేరు. ఆ భగవంతునికి కూడా మీ ముఖము చూపించగలరు. ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతారు. ప్రపంచములోని వారికి ఈ విషయాలు బొత్తిగా తెలియవు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ తెలుసు. ఎవరి బుద్ధికైనా ఈ బాణము తగిలితే వారి నావ తీరానికి చేరిపోతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్
ప్రతి సమయం నవీనతను అనుభవం చేస్తూ ఇతరులను కూడా నూతన ఉమంగ- ఉత్సాహాలలోకి తీసుకు రావాలి. సంతోషంగా నాట్యం చేయాలి, తండ్రి గుణగానము చేయాలి. మధురత అను మిఠాయితో స్వంత నోటిని మధురంగా చేసుకొని ఇతరులకు కూడా మధురమైన మాటలు, మధురమైన సంస్కారము, మధురమైన స్వభావం ద్వారా నోటిని తీపిగా చేయాలి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ వద్ద వినాశి ధనము ఉంటే దానిని సఫలము చేసుకునేందుకు అలౌకిక సేవలో ఉపయోగించండి. అలాగే అవినాశి ధనమును కూడా తప్పకుండా దానము చేయాలి.
2. మా స్థితి ఎలా ఉంది? పూర్తి రోజంతటిలో ఏ చెడ్డ పని చేయలేదు కదా? పరస్పరములో ఒకరికొకరు దుఃఖము ఇవ్వడం లేదు కదా? ఎవరి పై కూడా చెడు(వికారి) దృష్టి పోలేదు కదా? అని మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి.
వరదానము :- '' ప్రతి ఖజానాను తండ్రి ఆదేశానుసారము కార్యములో ఉపయోగించే నిజాయితి లేక నమ్మకస్థులుగా అవ్వండి (ఆనెస్ట్ వా ఈమాన్‌దార్ భవ) ''
ఎవరైతే తండ్రి నుండి ప్రాప్తి చేసుకున్న ఖజానాలను తండ్రి ఆదేశం లేకుండా ఏ కార్యములోనూ ఉపయోగించరో వారిని ఆనెస్ట్ లేక నమ్మకస్థులని అంటారు. ఒకవేళ సమయం, వాక్కు, కర్మ, శ్వాస లేక సంకల్పము పరమతం లేక సాంగత్య దోషంతో వ్యర్థంగా పోగొట్టుకుంటే, స్వచింతన బదులు పరచింతన చేస్తే, స్వమానానికి బదులు ఎలాంటి అభిమానంలోకి వచ్చినా, శ్రీమతానికి బదులు మన్మతము ఆధారం పై నడుచుకుంటారో వారిని ఆనెస్ట్(నిజాయితి) అని అనరు. ఈ ఖజానాలన్నీ విశ్వకళ్యాణము కొరకు లభించాయి. కనుక అందులోనే ఉపయోగించుటను ఆనెస్ట్‌గా అవ్వడమని అంటారు.
స్లోగన్ :- '' మాయను అపోస్ చేయాలి(వ్యతిరేకించాలి), దైవీ పరివారాన్ని కాదు ''
No comments:
Post a Comment