Sunday, January 5, 2020

Telugu Murli 06/01/2020

06-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు భారతదేశానికి అత్యంత అమూల్యమైన సేవాధారులు, మీరు మీ తనువు-మనస్సు-ధనముల ద్వారా శ్రీమతానుసారము దీనిని రామ రాజ్యంగా తయారు చేయాలి ''

ప్రశ్న :- ఇప్పుడు పిల్లలైన మీరు చేస్తున్న సత్యమైన అలౌకిక సేవ ఏది ?
జవాబు :- పిల్లలైన మీరు గుప్తంగా, శ్రీమతానుసారము పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు. ఇదే భారతదేశానికి సత్యమైన అలౌకిక సేవ. మీరు అనంతమైన తండ్రి శ్రీమతానుసారము అందరినీ రావణుని జైలు నుండి విడుదల చేస్తున్నారు. దీని కొరకు మీరు పావనంగా అయి ఇతరులను పావనంగా చేస్తారు.

పాట :- నయనహీనులకు దారిని చూపండి ,................ ( నయన్‌హీన్‌ కో రాహ్‌ దిఖావో,...........)
ఓంశాంతి. ఓ ప్రభూ! ఈశ్వరా, పరమాత్మ అని అనడంలో, తండ్రీ అని అనడంలో ఎంతో వ్యత్యాసముంది. ఓ ఈశ్వరా, ఓ ప్రభూ! అని అనడంలో ఎంత గౌరవముంది. వారిని తండ్రి అని కూడా అంటారు. తండ్రి అను పదము చాలా సాధారణమైనది. తండ్రులైతే అనేకమంది ఉన్నారు. ప్రార్థనలో కూడా ఓ ప్రభూ! ఓ ఈశ్వరా! అని అంటారు. బాబా అని ఎందుకు అనరు? వారు పరమపిత కదా. బాబా అను పదము అణిచి వేయబడినట్లుంటుంది. పరమాత్మ అనే పదము ఉన్నతంగా ఉంటుంది, ఆకర్షించుకుంటుంది. ఓ ప్రభూ, నయన హీనులుకు దారి చూపండి అని పిలుస్తారు. బాబా, మాకు ముక్తి-జీవన్ముక్తికి మార్గాన్ని తెలియజేయండి అని ఆత్మలు అంటాయి. 'ప్రభూ!' అను పదము ఎంత గొప్పది! పిత అను పదము తేలికైనది. ఇక్కడకు తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారని మీకు తెలుసు. లౌకిక పద్ధతిలో తండ్రులు చాలామంది ఉన్నారు. మీరే తల్లి, తండ్రి!............. అని పిలుస్తారు కూడా. ఇది ఎంత సాధారణ శబ్ధము. ఈశ్వరా, ప్రభూ! అని అనడం వలన వారు ఏమైనా చేయగలరని భావిస్తారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చాలా ఉన్నతమైన, సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. నా పిల్లలారా, మీరు రావణుని మతానుసారము కామచితి పైకి ఎక్కి భస్మమైపోయారు. ఇప్పుడు నేను మిమ్ములను పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా అంటారు. పతితులను పావనంగా చేసేందుకే తండ్రిని పిలుస్తారు. నేను మీ సేవ కొరకే వచ్చానని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరందరూ భారతదేశానికి అలౌకిక సేవ చేసేందుకే ఉన్నారు. ఈ సర్వీసు మీరు తప్ప వేరెవ్వరూ చేయలేరు. మీరు భారతదేశము కొరకే చేస్తారు. శ్రీమతానుసారము పవిత్రంగా అయి భారతదేశాన్ని కూడా పవిత్రంగా చేస్తారు. రామరాజ్యము రావాలని గాంధీజీకి కూడా ఆశ ఉండేది. ఇప్పుడు ఏ మనుష్యులూ రామరాజ్యము తయారు చేయలేరు. లేకుంటే ప్రభువును పతితపావనా! అని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు పిల్లలైన మీకు భారతదేశము పై ఎంతో ప్రేమ ఉంది. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతాదేశానికి సత్యమైన సేవ మీరు చేస్తున్నారు.
బాపూజీ కోరుకున్నట్లుగా భారతదేశాన్ని మళ్లీ రామరాజ్యంగా చేస్తామని మీకు తెలుసు. వారు హద్దులోని బాపూజి. వీరు బేహద్‌ బాపూజి. వీరు అనంతమైన సేవ చేస్తున్నారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మేము రామరాజ్యాన్ని తయారు చేస్తామనే నషా మీలో కూడా నంబరువారుగా ఉంది. మీరు ప్రభుత్వానికి సేవకులు. మీరు దైవీ ప్రభుత్వాన్ని తయారు చేస్తారు. మీకు భారతదేశమంటే గర్వంగా ఉంది. సత్యయుగములో ఇది పావన భూమిగా ఉండేదని ఇప్పుడు పతితంగా అయిందని మీకు తెలుసు. తండ్రి ద్వారా మళ్లీ పావన భూమి లేక సుఖధామాన్ని గుప్తంగా తయారు చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. శ్రీమతము కూడా గుప్తంగా లభిస్తుంది. భారత ప్రభుత్వము కొరకే మీరు చేస్తున్నారు. శ్రీమతానుసారము మీరు మీ తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశానికి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తున్నారు. కాంగ్రెస్‌ వారు చాలాసార్లు జైలు మొదలైన వాటిలోకి వెళ్ళారు. మీరు జైళ్ళకు మొదలైన వాటికి వెళ్ళే అవసరము లేదు. మీది ఆత్మిక విషయము. మీ యుద్ధము కూడా 5 వికారాల రూపి రావణునితో జరుగుతుంది. ఈ రావణుని రాజ్యము పూర్తి పృధ్వి పై ఉంది. ఇది మీ సైన్యము. లంక కేవలం ఒక చిన్న ద్వీపం మాత్రమే. ఈ సృష్టి బేహద్‌ ద్వీపము వంటిది. మీరు బేహద్‌ తండ్రి శ్రీమతానుసారము అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. ఈ పతిత ప్రపంచము వినాశనమయ్యే తీరాలని మీకు తెలుసు. మీరు శివశక్తులు. ఈ గోపులు కూడా శివశక్తులే. మీరు గుప్త రీతిలో భారతదేశానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మున్ముందు(పోను పోను) అందరికీ తెలుస్తుంది. మీరు శ్రీమతానుసారముగా ఆత్మిక సేవ చేస్తున్నారు. మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బి.కె.లు భారతదేశాన్ని తమ తనువు-మనసు-ధనముల ద్వారా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన సత్య ఖండంగా చేస్తారని ప్రభుత్వానికి తెలియనే తెలియదు. భారతదేశము సత్యఖండముగా ఉండేది, ఇప్పుడు అసత్య ఖండముగా అయింది. సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. గాడ్‌ ఈజ్‌ ట్రూత్‌ అని కూడా అంటారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మీకు సత్యమైన శిక్షణనిస్తున్నారు. తండ్రి చెప్తారు - కల్పక్రితము కూడా మిమ్ములను నరుని నుండి నారాయణునిగా చేశాను, రామాయణంలో అయితే ఏమేమో కథలు కూర్చుని వ్రాసేశారు. రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని చెప్తారు. మీరు ముందు కోతుల వలె ఉండేవారు. ఇది ఒక్క సీత విషయము కాదు. మనము రావణ రాజ్యాన్ని వినాశనము చేసి రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తామో తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇందులో ఎలాంటి కష్టము మాటే లేదు. వారు ఎంతో ఖర్చు చేస్తారు. రావణుని బొమ్మను తయారుచేసి తగులబెడ్తారు. ఏమీ అర్థము చేసుకోలేరు. గొప్ప-గొప్ప వ్యక్తులందరూ చూచేందుకు వెళ్తారు, విదేశీయులకు కూడా చూపిస్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. మేము భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నామని పిల్లలైన మీకు మనసులో ఉమంగముందని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మిగిలిన ప్రపంచమంతా రావణుని మతానుసారము నడుస్తోంది. మీరు రాముని శ్రీమతానుసారము నడుస్తున్నారు. రాముడు అనండి, శివుడు అనండి, అనేక పేర్లు పెట్టేశారు.
పిల్లలైన మీరు భారతదేశానికి శ్రీమతముననుసరించి సేవ చేసే అత్యంత విలువైన సేవాధారులు. ఓ పతితపావనా! వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని కూడా అంటారు. సత్యయుగములో మనకు ఎంత సుఖము లభిస్తుందో మీకు తెలుసు. అపారమైన ఖజానా లభిస్తుంది. అక్కడ సరాసరి ఆయువు కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది. వారు యోగులు, ఇక్కడ ఉన్నవారంతా భోగులు. వారు పావనులు, వీరు పతితులు, రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. కృష్ణుని కూడా యోగి అని అంటారు, మహాత్మ అని కూడా అంటారు. నిజానికి అతనే సత్యమైన మహాత్ముడు. సర్వ గుణసంపన్నులు....... అని వారిని మహిమ చేస్తారు. ఆత్మ, శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకొని మళ్లీ సన్యాసులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో మనుష్యులు అధర్మస్థులుగా, దు:ఖితులుగా ఉన్నారు. సత్యయుగములో ఎలా ఉండేవారు? ధార్మికులుగా, న్యాయవంతులుగా ఉండేవారు. నూరు శాతము సంపన్నంగా(సాల్వెంటుగా) ఉండేవారు. రాత్రి పగలుకున్నంత వ్యత్యాసముంది. ఇది ఖచ్చితంగా మీకు మాత్రమే తెలుసు. భారతదేశము స్వర్గము నుండి నరకంగా ఎలా అయిందో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులను పూజిస్తారు. మందిరాలు నిర్మిస్తారు కాని కొద్దిగా కూడా అర్థము తెలియదు. మంచి మంచి హోదాలలో ఉన్నవారికి, బిర్లాకు కూడా లక్ష్మీ నారాయణులు ఈ పదవి ఎలా పొందారో, ఏమి చేశారో మీరు అర్థం చేయించవచ్చు. వారి కర్తవ్యాలను తెలుసుకోకుండా పూజ చేయడం అనగా అది రాతి పూజ లేక బొమ్మలను పూజించడమే అయింది. క్రీస్తు ఫలానా సమయంలో వచ్చాడని, మళ్లీ వస్తాడని ఇతర ధర్మాల వారికి తెలుసు.
కనుక పిల్లలైన మీలో ఎంత గుప్తమైన ఆత్మిక నషా ఉండాలి! ఆత్మకు ఖుషీ కలగాలి. అర్ధ కల్పము దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు అశరీరులుగా అవ్వండి, మిమ్ములను మీరు ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. మన ఆత్మ తండ్రి ద్వారా వింటూ ఉంది. ఇతర సత్సంగాలలో ఇలా ఎప్పుడూ భావించరు. ఈ ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు. అన్నీ వినేది ఆత్మయే కదా. నేను ప్రధానమంత్రిని, ఫలానావాడిని అని ఆత్మనే చెప్తుంది. ఆత్మనే ఈ శరీరము ద్వారా నేను ప్రధానమంత్రిని అని చెప్తుంది. ఆత్మలమైన మేము పురుషార్థము చేసి స్వర్గములోని దేవీ దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు మీరు అంటారు. నేను ఆత్మ, ఇది నా శరీరము. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే చాలా కష్టపడవలసి వస్తుంది. క్షణ-క్షణము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. మీరు అతి విధేయులైన(వీశీర్‌ శీపవసఱవఅ్‌ రవతీఙaఅ్‌) సేవకులు. కర్తవ్యము గుప్తంగా చేస్తారు. కనుక నషా కూడా గుప్తంగా ఉండాలి. మేము ఈశ్వరీయ ప్రభుత్వానికి ఆత్మిక సేవాధారులము. భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాము. కొత్త ప్రపంచములో కొత్త భారతదేశముండాలి, కొత్త ఢిల్లీ ఉండాలి అని బాపూజీ కూడా కోరుకునేవారు. ఇప్పుడు కొత్త ప్రపంచమైతే లేదు. ఈ పాత ఢిల్లీ శ్మశానంగా అవుతుంది. తర్వాత మళ్లీ ఫరిస్తాన్‌గా అవుతుంది. ఇప్పుడు దీనిని ఫరిస్తాన్‌(స్వర్గమని) అని అనరు. కొత్త ప్రపంచములో ఫరిస్తాన్‌, కొత్త ఢిల్లీని మీరు తయారు చేస్తున్నారు. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఈ విషయాలు మర్చిపోరాదు. భారతదేశాన్ని మళ్లీ సుఖధామంగా చేయడం ఎంత ఉన్నతమైన కార్యము. డ్రామా ప్లాను అనుసారము డ్రామా తప్పకుండా పాతదిగా అవ్వాల్సిందే. ఇది దుఃఖధామము కదా. దుఃఖహర్త, సుఖకర్త అని ఒక్క తండ్రినే అంటారు. తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి దుఃఖముగా ఉన్న భారతదేశాన్ని సుఖంగా చేస్తారని మీకు తెలుసు. సుఖాన్ని కూడా ఇస్తారు, శాంతిని కూడా ఇస్తారు. మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది? అని మనుష్యులు అడుగుతారు. ఇప్పుడు శాంతి, మధురమైన ఇల్లైన(ూషవవ్‌ నశీఎవ) శాంతిధామములో మాత్రమే ఉంటుంది. అక్కడ శబ్ధము ఉండదు, దుఃఖమూ ఉండదు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి కూడా ఉండవు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా వచ్చి విధేయుడైన సేవాధారిగా అయ్యాడు కదా. అయితే తండ్రిని గురించి అసలు తెలియనే తెలియదు. అందరినీ మహాత్ములని అనేస్తారు. ఇప్పుడు స్వర్గములోనివారు తప్ప ఎవ్వరూ మహాత్మలు కాదు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. పవిత్రత ఉన్న కారణంగా సుఖ-శాంతులు కూడా ఉండేవి. ఇప్పుడు పవిత్రత లేదు కనుక ఏదీ లేదు. గౌరవమంతా పవిత్రతదే. దేవతలు పవిత్రంగా ఉంటారు అందుకే వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రులను పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వీరు పూర్తి విశ్వానికి బేహద్‌ బాపూజి. మేయర్‌ను కూడా సిటీ ఫాదర్‌ అని అంటారు. అక్కడ ఇలాంటి మాటలుండవు. అక్కడ నియమానుసారంగా రాజ్యము నడుస్తుంది. ఓ పతితపావనా, రండి! అని పిలుస్తారు. ఇప్పుడు పవిత్రులవ్వండి అని తండ్రి చెప్తే ఇది ఎలా జరుగుతుంది? సంతానోత్పత్తి ఎలా అవుతుంది? సృష్టి వృద్ధి ఎలా అవుతుంది? అని అడుగుతారు. ఈ లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులని వారికి తెలియదు. పిల్లలైన మీరు ఎంతటి వ్యతిరేకతను సహించవలసి వస్తుంది.
డ్రామాలో కల్పక్రితము ఏం జరిగిందో అదే మళ్లీ పునరావృతమవుతుంది. అలాగని డ్రామా అని చెప్పి ఆగిపోరాదు. డ్రామాలో ఉంటే లభిస్తుందని అనుకోరాదు. పాఠశాలలో అలాగే కూర్చొని ఉంటే ఎవరైనా పాస్‌ అవ్వగలరా? ప్రతి వస్తువు కొరకు మానవుని పురుషార్థము జరుగుతుంది. పురుషార్థము లేకుండా నీరు కూడా లభించదు. క్షణక్షణము జరిగే పురుషార్థము ప్రాలబ్ధము కొరకే. బేహద్‌ సుఖము కొరకు ఈ బేహద్‌ పురుషార్థము చేయాలి. ఇది బ్రహ్మరాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. మళ్లీ బ్రాహ్మణుల పగలు వస్తుంది. శాస్త్రాలలో కూడా చదివేవారు కాని ఏమీ అర్థము చేసుకునేవారు కాదు. ఈ బాబా స్వయంగా కూర్చొని రామాయణము, భాగవతము మొదలైనవి వినిపించేవాడు, పండితునిలా కూర్చునేవాడు. అది భక్తిమార్గము అని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. భక్తి వేరు, జ్ఞానము వేరు. తండ్రి చెప్తున్నారు - మీరందరూ కామచితి పై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు. కృష్ణుని కూడా శ్యామసుందరుడని అంటారు కదా. పూజారులు అంధ విశ్వాసము గలవారు. ఎంతటి భూత పూజ! శరీర పూజ అనగా పంచతత్వాల పూజ అయింది. దీనినే వ్యభిచారి పూజ అని అంటారు. భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది. ఒక్క శివుడినే పూజించేవారు. ఇప్పుడు ఏ ఏ పూజలు జరుగుతున్నాయో చూడండి. తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు, జ్ఞానాన్ని కూడా అర్థము చేయిస్తున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు. దానిని పుష్పాలతోట అని అంటారు. కరాచీలో ఒక పటాన్‌ వ్యక్తి కాపలాదారునిగా ఉండేవాడు. అతడు కూడా ధ్యానములోకి వెళ్ళి నేను స్వర్గానికి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పమిచ్చాడు అని చెప్పేవాడు. ఆయనకు చాలా మజా కలిగేది. అద్భుతము కదా. వారు 7 అద్భుతాలని అంటారు. వాస్తవానికి విశ్వములో అద్భుతము స్వర్గము. ఇది ఎవ్వరికీ తెలియదు.
మీకు ఎంత ఫస్ట్‌క్లాస్‌ అయిన జ్ఞానము లభించింది! మీరు ఎంత ఖుషీగా ఉండాలి. ఎంత ఉన్నతోన్నతమైన బాప్‌దాదా ఎంత సాధారణంగా ఉన్నారు! నిరాకారులు, నిరహంకారులు అని తండ్రినే మహిమ చేస్తారు. తండ్రి వచ్చి సేవ చేయాలి కదా. తండ్రి సదా పిల్లలకు సేవ చేసి వారికి ధనసంపదలనిచ్చి, తాను మాత్రం వానప్రస్థ స్థితిని తీసుకుంటారు. పిల్లలను తల పైకి ఎత్తుకుంటారు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మధురమైన ఇంటికి వెళ్లి మళ్లీ మధురమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. నేను రాజ్యాన్ని తీసుకోనని తండ్రి చెప్తారు. సత్యమైన నిష్కామ సేవాధారి ఒక్క తండ్రి మాత్రమే. కనుక పిల్లలకు ఎంత ఖుషీ ఉండాలి. కాని మాయ మరిపింపజేస్తుంది. ఇంత గొప్ప బాప్‌దాదాను మర్చిపోరాదు. తాత ఆస్తిని గురించి ఎంత నషా ఉంటుంది. మీకైతే శివబాబా లభించారు. ఇది వారి ఆస్తి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. ఆసురీ గుణాలను తొలగించి వేయాలి. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవని పాట కూడా పాడ్తారు. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. ఇప్పుడు దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. నిర్గుణము అనగా ఏ గుణాలు లేవని అర్థము. అయితే వారు అర్థము చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి ఒకే మాటను అర్థం చేయిస్తారు - మేము భారతదేశము సేవ చేస్తున్నాము. మేము సర్వుల బాపూజీ ఎవరైతే ఉన్నారో, వారి శ్రీమతానుసారము నడుస్తున్నాము అని చెప్పండి. శ్రీమద్భగవద్గీత మహిమ చేయబడింది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎలాగైతే ఉన్నతోన్నతమైన(నఱస్త్రష్ట్రవర్‌) బాప్‌దాదా సాధారణంగా (సింపుల్‌గా) ఉంటారో, అలా చాలా చాలా సాధారణంగా నిరాకారి నిరహంకారులుగా అయి ఉండాలి. తండ్రి ద్వారా ఫస్ట్‌క్లాస్‌ జ్ఞానము ఏదైతే లభించిందో దానిని మననము చేయాలి.
2. కల్పక్రితము వలె ఏ డ్రామా అయితే పునారావృతమవుతూ ఉందో, అందులో బేహద్‌ పురుషార్థము చేసి బేహద్‌ సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి. డ్రామా అని అంటూ ఎప్పుడూ ఆగిపోరాదు. ప్రాలబ్ధము కొరకు పురుషార్థము తప్పకుండా చేయాలి.

వరదానము :- '' వినుటతో పాటు స్వరూప్‌గా అయి మానసిక మనోరంజనం ద్వారా సదా శక్తిశాలి ఆత్మా భవ ''
ప్రతిరోజు మనసులో స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఉల్లాస-ఉత్సాహాల సంకల్పాలు తీసుకు రండి (చేయండి). స్వయం మీరు కూడా ఆ సంకల్పాల స్వరూపంగా అవ్వండి, ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి. అలా చేస్తే మీ జీవితం కూడా సదా ఉత్సాహవంతంగా అవుతుంది, ఇతరులకు కూడా ఉత్సాహము కలిగించేదిగా అవ్వగలదు. ఎలాగైతే మనోరంజక ప్రోగ్రాము జరుగుతుందో అలా ప్రతిరోజు మనసును రంజింపజేసే ప్రోగ్రాము తయారు చేయండి. ఏదైతే వింటున్నారో దాని స్వరూప్‌గా అయినారంటే శక్తిశాలిగా అవుతారు.

స్లోగన్‌ :- '' ఇతరులను మార్చేందుకు ముందు స్వయాన్ని స్వయాన్ని పరివర్తన చేసుకోండి -

No comments:

Post a Comment