Wednesday, January 22, 2020

Telugu Murli 22/01/2020

22-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - బాబా పాత్ర ఖచ్ఛితమైనది (ఆక్యురేట్‌). వారు తమ సమయంలో వస్తారు, కొద్దిగా కూడా వ్యత్యాసము ఉండదు. వారు వచ్చినందుకు స్మారక చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవోపేతంగా జరపండి ''

ప్రశ్న :- ఏ పిల్లల వికర్మలు పూర్తిగా వినాశనమవ్వవు ?
జవాబు :- ఎవరి యోగము సరిగ్గా ఉండదో, ఎవరికి బాబా స్మృతి ఉండదో, వారి వికర్మలు వినాశనమవ్వవు. యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు. పాపాలు మిగిలిపోతాయి. పదవి కూడా తగ్గిపోతుంది. యోగము లేకుంటే నామ-రూపాలలో చిక్కుకుంటారు, వారి మాటలే జ్ఞాపకము వస్తుంటాయి, వారు ఆత్మాభిమానులుగా ఉండలేరు.

పాట :- ఈ రోజు ఉదయమే ఎవరు వచ్చారు,.................(యహ్‌ కోన్‌ ఆయా ఆజ్‌ సవేరే,..........)
ఓంశాంతి. ఉదయము ఎన్ని గంటలకు అవుతుంది? బాబా ఉదయము ఎన్ని గంటలకు వస్తారు?(కొందరు 3 గంటలకు అని, కొందరు 4 గంటలకు అని, కొందరు సంగమ యుగములో అని, కొందరు 12 గంటలకు అని చెప్పారు). బాబా ఖచ్ఛితంగా ఎన్ని గంటలకు అని అడుగుతున్నారు 12 గంటలను మీరు ఉదయమని చెప్పేందుకు వీలు కాదు. 12 గంటలు దాటి ఒక్క సెకండు, ఒక్క నిముషము అయిందంటే ఎ.ఎమ్‌(ూ.వీ) అనగా ఉదయము ప్రారంభమౌతుంది. ఇది పూర్తిగా ఉదయము. డ్రామాలో వీరి పాత్ర పూర్తిగా ఖచ్ఛితమైనది. ఒక్క సెకండు కూడా ఆలస్యము జరగదు. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటి ఒక్క సెకండు అయ్యేవరకు ఎ.ఎమ్‌. అని అనరు. ఇది బేహద్‌ విషయము. నేను ఉదయము ఉదయమే వస్తానని తండ్రి అంటారు. విదేశస్థుల ఎ.ఎమ్‌, పి.యమ్‌(ూ.వీ, ూ.వీ)లు ఖచ్ఛితంగా నడుస్తాయి, అయినా వారి బుద్ధి బాగానే ఉంది. వారు అంత సతోప్రధానంగాను అవ్వరు, తమోప్రధానంగా కూడా అవ్వరు. భారతీయులే నూరు శాతము సతోప్రధానంగా మళ్లీ నూరు శాతము తమోప్రధానంగా అవుతారు. బాబా చాలా ఖచ్ఛితమైనవారు. ఉదయం అనగా 12 గంటలు గడిచిన ఒక్క నిమిషములో వస్తారు. సెకెండును ఎవ్వరూ లెక్క పెట్టరు. సెకెండు గడిచిపోవడం తెలియను కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థము చేసుకుంటారు. ప్రపంచమైతే పూర్తి గాఢాంధకారంలో ఉంది. '' ఓ పతితపావనా! రండి'' అని తండ్రిని భక్తులందరూ దుఃఖములో స్మృతి చేస్తారు, వారు ఎవరో, ఎప్పుడు వస్తారో ఏమీ తెలియదు. మనుష్యులై ఉండి, ఏదీ ఖచ్ఛితంగా తెలియదు ఎందుకంటే పతితులుగా, తమోప్రధానంగా ఉన్నారు. వారు చేసే పనులు కూడా ఎంత తమోప్రధానమైనవి! ఇప్పుడు బేహద్‌ తండ్రి ఆర్డినెన్స్‌ (ూతీసఱఅaఅషవ/అధికార పూర్వకమైన ఆదేశము) జారీ చేస్తున్నారు - పిల్లలారా, కామజీతులుగా, జగత్‌ జీతులుగా అవ్వండి. ఒకవేళ ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే వినాశనాన్ని పొందుతారు. మీరు పవిత్రంగా అవ్వడం వలన అవినాశి పదవిని పొందుతారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. 'పవిత్రులు కండి, యోగులు కండి' (దీవ నశీశ్రీవ, దీవ ్‌శీస్త్రఱ) అని స్లోగన్‌ కూడా వ్రాస్తారు, వాస్తవానికి రాజయోగులుగా అవ్వండి(బి రాజోగి) అని వ్రాయాలి. యోగి అనునది సాధారణ పదము. బ్రహ్మ తత్వముతో యోగాన్ని జోడించేవారు కూడా యోగులే. పిల్లలు తండ్రితో, స్త్రీ భర్తతో యోగాన్ని జోడిస్తారు. కానీ మీది రాజయోగము. బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు కనుక రాజయోగము అని వ్రాయడము సరియైనది. పవిత్రులుగా అవ్వండి, రాజయోగులుగా అవ్వండి. రోజురోజుకు సవరణలు(జశీతీతీవష్‌ఱశీఅర) జరుగుతూ ఉంటాయి. నేడు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తానని తండ్రి కూడా చెప్తారు. ఇప్పుడు శివజయంతి కూడా రానున్నది. మీరు శివజయంతిని చాలా బాగా ఆచరించాలి. శివజయంతిలో చాలా బాగా సర్వీసు చేయాలి. ఎవరి వద్ద ప్రదర్శిని ఉందో, వారందరూ వారి వారి సేవాకేంద్రాలలో లేక ఇండ్లలో శివజయంతిని బాగా జరుపుకోండి మరియు శివబాబా గీతా జ్ఞానదాత తండ్రి నుండి బేహద్‌ వారసత్వాన్ని తీసుకునే మార్గాన్ని వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. భలే దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి. ఇంటింటిలో శివజయంతిని జరుపుకోవాలి. మీరు జ్ఞానగంగలు కదా. కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి. ఇంటింటిలో గీతను చదువుతారు కదా. పురుషులకన్నా మాతలు భక్తిలో తీవ్రంగా ఉంటారు. గీతను చదివే పరివారాలు కూడా ఉంటాయి. కనుక ఇంటిలో కూడా చిత్రాలను ఉంచుకోవాలి. బేహద్‌ తండ్రి నుండి వారసత్వాన్ని మళ్లీ వచ్చి తీసుకోండి అని వ్రాయండి.

ఈ శివజయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి. ఎప్పుడైతే శివబాబా వస్తారో, అప్పుడు ఇంటింటిలో ప్రకాశము వచ్చేస్తుంది. ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైనవి వెలిగించి ప్రకాశవంతంగా చేసి ఆచరించండి. మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు. సత్యయుగములో ఫైనల్‌ కావాలి. అక్కడ ఇంటింటిలో ప్రకాశమే ప్రకాశముంటుంది. అనగా ప్రతి ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడైతే అంధకారముంది. ఆత్మలు ఆసురీ బుద్ధిగలవారిగా అయ్యారు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉన్న కారణంగా దైవీ బుద్ధి ఉంటుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఇప్పుడు మీరు విలువలేని(వర్త్‌ నాట్‌ ఏ పెన్నీ) వారి నుండి అమూల్యమైనవారిగా (వర్త్‌ పౌండ్‌) అవుతున్నారు. ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ ఆత్మ అపవిత్రంగా ఉన్నందున శరీరము మరియు ప్రపంచము కూడా అపవిత్రంగా ఉంది. ఈ విషయాలను మీలో కూడా కొందరు మాత్రమే యథార్థంగా అర్థము చేసుకున్నారు. వారిలో సంతోషముంటుంది. పురుషార్థమైతే నంబరువారుగా చేస్తూ ఉంటారు. గ్రహచారము కూడా ఉంటుంది. ఎప్పుడైనా రాహు గ్రహచారము కూర్చుంటే ఆశ్చర్యంగా వదిలి వెళ్ళిపోతారు. బృహస్పతి దశ మారి రాహుదశ వచ్చి కూర్చుంటుంది. కామవికారములోకి వెళ్ళారంటే రాహుదశ కూర్చుంటుంది. మల్లయుద్ధము జరుగుతుంది. మాతలైన మీరు చూసి ఉండరు, ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలు అని అంటారు. భ్రమరాన్ని ఇల్లాలు అనగా ఇంటిని తయారు చేసేవి అని అంటారని మీకు తెలుసు. ఇంటిని తయారు చేసే మంచి నైపుణ్యము ఉంది. కనుక ఇల్లాలు అనే పేరు ఉంది. ఎంత శ్రమ పడ్తుంది. అది కూడా పక్కా మేస్త్రీలు, రెండు-మూడు గదులను తయారు చేస్తుంది. 3-4 క్రిములను తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా బ్రాహ్మణీలు. ఒకరిద్దరిని తయారు చేయండి లేక 10-12 మందినైనా తయారు చేయండి, 100 మందినైనా, 500 మందినైనా తయారు చేయండి. మండపము మొదలైనవి తయారు చేస్తారు, ఇది కూడా ఇంటిని తయారు చేయడమే కదా. అందులో కూర్చొని అందరికి భూ-భూ చేస్తారు. అప్పుడు ఎవరైనా అర్థము చేసుకుంటే క్రిముల నుండి బ్రాహ్మణులుగా అవుతారు, కొందరు పాడై కుళ్లిపోతారు. అనగా ఈ ధర్మమువారు కారని అర్థము. ఈ ధర్మము వారికి మాత్రమే పూర్తిగా టచ్‌ అవుతుంది. మీరు కూడా మనుష్యులే కదా. మీ శక్తి ఆ భ్రమరము కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు 2 వేల మంది సభలోనైనా ఉపన్యసించగలరు. మున్ముందు 4-5 వేల మంది గల సభకు కూడా మీరు వెళ్తారు. భ్రమరానికి మీతో పోలిక ఉంది. ఈ రోజులలో సన్యాసులు కూడా వెలుపల విదేశాలకు వెళ్ళి మేము భారతదేశపు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తామని చెప్తున్నారు. ఈ రోజులలో మాతలు కూడా కాషాయ వస్త్రాలను ధరించి వెళ్ళి విదేశస్థులను మోసము చేసి వస్తారు. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని వారికి చెప్తారు. భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని మీరు చెప్పరు. మీరు విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడే కూర్చుని అర్థము చేయిస్తారు. ఈ రాజయోగాన్ని నేర్చుకుంటే మీరు స్వర్గములో జన్మిస్తారు అని చెప్తారు. ఇందులో దుస్తులు మొదలైనవి మార్చుకునే మాటే లేదు. ఇక్కడే దేహము యొక్క సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే ముక్తిదాత(లిబరేటర్‌ ) మార్గదర్శకుడు( గైడ్‌ ) అందరినీ దుఃఖము నుండి విడుదల చేస్తారు.

ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవ్వాలి. మీరు మొదట బంగారు యుగములో ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగములో ఉన్నారు. పూర్తి విశ్వము, అన్ని ధర్మాల వారు ఇనుప యుగములో ఉన్నారు. ఏ ధర్మమువారు దొరికినా, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు, మళ్లీ నేను జతలో తీసుకువెళ్తానని తండ్రి చెప్తున్నారని చెప్పండి. కేవలం ఇంతే చెప్పండి, ఎక్కువ వద్దు. ఇది చాలా సహజమైనది. మీ శాస్త్రాలలో కూడా - ఇంటింటిలో సందేశాన్నిచ్చారని ఉంది. ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకు ఎవ్వరూ తెలియజేయలేదని ఫిర్యాదు చేశాడు. తండ్రి వచ్చారు కనుక దండోరా వేయించాలి. శాంతిధామము, సుఖధామాల వారసత్వమునిచ్చేందుకు తండ్రి వచ్చారని ఒక రోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది. ఎప్పుడు దేవతా ధర్మముండేదో(డీటిజమ్‌) అప్పుడు వేరే ధర్మాలేవీ లేవు. అందరూ శాంతిధామములో ఉండేవారు. ఇలా ఇలా ఆలోచిస్తూ ఉండాలి. స్లోగన్లు తయారు చేయాలి. దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలేయండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలు అపవిత్రంగా ఉన్నారు. ఇప్పుడు అందరినీ పవిత్రంగా చేసి, తండ్రి మార్గదర్శకులై వాపస్‌ తీసుకువెళ్తారు. అందరూ తమ-తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్లీ దేవతా ధర్మమువారు నంబరువారుగా వస్తారు. ఎంత సహజము! ఇది బుద్ధిలో ధారణ అవ్వాలి. సర్వీసు చేసేవారు గుప్తంగా ఉండలేరు. డిస్‌సర్వీస్‌ చేసేవారు కూడా గుప్తంగా ఉండలేరు. సేవాధారి పిల్లలను పిలుస్తూ ఉంటారు. ఎవరు కొద్దిగా కూడా జ్ఞానాన్ని వినిపించలేరో, వారిని పిలువరు. వారు ఇంకా పేరును పాడు చేస్తారు. బి.కె.లు ఇలా ఉంటారా? అని అంటారు. పూర్తి జవాబు కూడా చెప్పరు. కనుక పేరు చెడగొట్టినట్లే కదా. శివబాబాకు చెడ్డ పేరు తెచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు. ఎలా ఇక్కడ కూడా కొందరు కోటిశ్వరులున్నారు, పదమాపదమపతులు కూడా ఉన్నారు, కొందరు ఆకలితో చనిపోతున్నారు. అలాంటి భికారులు(అడుక్కునేవారు) కూడా వచ్చి రాకుమారులుగా అవుతారు. స్వర్గానికి రాకుమారునిగా ఉండే అదే శ్రీ కృష్ణుడు మళ్లీ భికారిగా అవుతాడు. మళ్లీ భికారి నుండి రాకుమారునిగా అవుతాడని ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. ఇతను భికారిగా ఉండేవాడు కదా. కొద్దిగా సంపాదించాడు అది కూడా పిల్లలైన మీ కొరకే. లేనట్లయితే మీ సంభాళన ఎలా జరుగుతుంది? ఈ విషయాలు శాస్త్రాలలో లేవు, శివబాబాయే వచ్చి తెలియజేస్తారు. ఇతను పల్లె పిల్లవాడిగా ఉండేవాడు, పేరు శ్రీ కృష్ణుడేమీ కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయము కనుక మనుష్యులు తికమకలో ఉన్నారు. కనుక బాబా అర్థం చేయిస్తున్నారు - శివజయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటింటిలో చిత్రాల పై సర్వీసు చేయండి. అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మల కొరకు స్వర్గ సామ్రాజ్యము సెకండులో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. ఎలా దీపావళి సందర్భంలో మనుష్యులు చాలా దుకాణాలు తెరచి కూర్చుంటారో, మీరు అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరచి కూర్చోవాలి. మీది ఎంత మంచి అలంకరింపబడిన దుకాణముగా ఉంటుంది. మనుష్యులు దీపావళి సందర్భముగా చేస్తారు, మీరు శివజయంతి సందర్భంగా చెప్పండి. శివబాబా అందరి దీపాలను వెలిగిస్తారు, మిమ్ములను విశ్వాధిపతులుగా చేస్తారు. వారు లక్ష్మి నుండి వినాశి ధనాన్ని వేడుకుంటారు ఇక్కడ మీకు జగదంబ ద్వారా విశ్వ సామ్రాజ్యము లభిస్తుంది. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా ఏ శాస్త్రాలను చదవరు. తండ్రి చెప్తారు - నేను జ్ఞానసాగరుడను కదా. ఫలానా ఫలానా పిల్లలు సర్వీసు చాలా బాగా చేస్తారని తెలుసు. అందుకే వారు గుర్తుకొస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరి ఆంతర్యములో ఏమేం జరుగుతుందో కూర్చుని తెలుసుకోను. అవును కొన్ని సమయాలలో వీరు పతితులు అని తెలుస్తుంది, సంశయము వస్తుంది. వారి ముఖమే నిరాశగా వాడిపోయి ఉంటుంది. అతనిని అడగండి అని పై నుండి బాబా కూడా చెప్పి పంపుతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కొన్ని కొందరి కొరకు చెప్తారు అంతేకాని అందరికీ చెప్తారని కాదు. ముఖము నల్లగా చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. అలా ఎవరు చేస్తారో, వారు తమను తామే నష్టపరచుకుంటారు. సత్యాన్ని తెలియజేయడము వలన కొంత లాభముంటుంది. చెప్పకపోవడము వలన ఇంకా నష్టపోతారు. బాబా మమ్ములను సుందరంగా(పవిత్రంగా) చేసేందుకు వచ్చారు అయినా నేను మళ్లీ ముఖము నల్లగా చేసుకుంటున్నాని అర్థము చేసుకోవాలి. ఇది అసలే ముళ్ళ ప్రపంచము. ముళ్ళ వంటి మనుష్యులున్నారు. సత్యయుగాన్ని భగవంతుని తోట(గార్డన్‌ ఆఫ్‌ అల్లా / +aతీసవఅ శీట ూశ్రీశ్రీaష్ట్ర) అని అంటారు. ఇది అడవి(ఫారెస్ట్‌ / ఖీశీతీవర్‌). కనుక తండ్రి చెప్తారు, ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. మొదటి నంబరు శ్రీ కృష్ణుడు 84 జన్మల తర్వాత ఎలా తయారవుతారో చూడండి. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా ఉన్నారు. పరస్పరములో జగడాలాడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా డ్రామాలో ఉంది. తర్వాత స్వర్గములో ఇవేవీ ఉండవు. పాయింట్లు చాలా ఉన్నాయి. నోట్‌ చేసుకోవాలి. న్యాయవాదులు కూడా పాయింట్లను నోట్‌ చేసుకునేందుకు పుస్తకాన్ని ఉంచుకుంటారు కదా. వైద్యులు కూడా పుస్తకం ఉంచుకుంటారు. దానిలో చూసి ఔషధాలను ఇస్తారు. కనుక పిల్లలు ఎంత బాగా చదవాలి, సర్వీసు చేయాలి. బాబా మన్మనాభవ అను నెంబరువన్‌ మంత్రాన్నిచ్చారు. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివజయంతిని జరుపుకుంటారు కానీ శివబాబా ఏం చేశారో తెలియదు. తప్పకుండా స్వర్గ వారసత్వమును ఇచ్చి ఉంటారు. బాబా వచ్చి 5 వేల సంవత్సరాలయింది. స్వర్గము నుండి నరకము, నరకము నుండి స్వర్గము తయారవుతుంది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, యోగయుక్తులుగా అయితే మీకు ప్రతి విషయము బాగా అర్థమవుతుంది. కాని యోగము సరిగ్గా లేకుంటే, తండ్రి స్మృతి లేకుంటే ఏమీ అర్థము చేసుకోలేరు. వికర్మలు కూడా వినాశనమవ్వవు. యోగయుక్తులుగా ఉండనట్లయితే ఇంత సద్గతి కూడా లభించదు, పాపము మిగిలిపోతుంది. తర్వాత పదవి కూడా తగ్గిపోతుంది. యోగము అసలు లేకుండా చాలా మంది ఉన్నారు, నామ-రూపాలలో చిక్కుకొని ఉంటారు, వారి స్మృతే వస్తూ ఉంటుంది. మరి వికర్మలు ఎలా వినాశనమవుతాయి. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మంచిది

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌

బుద్ధి రూపి పాదము భూమి పై ఉండరాదు. ఎలాగైతే ఫరిస్తాల పాదము భూమి పై ఉండదు అని అంటారో అలా బుద్ధి ఈ దేహమనే భూమి అనగా ప్రకృతి ఆకర్షణకు దూరంగా ఉండాలి. ప్రకృతిని అధీనం చేసుకునేవారిగా అవ్వండి, అధీనులుగా అవ్వకండి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శివజయంతి సందర్భంగా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరచి సేవ చేయండి. ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయమునివ్వండి.
2. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఏదైనా వికర్మ చేసి బాబా నుండి దాచరాదు. ఏ పాపమూ మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా అవ్వాలి. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోరాదు.

వరదానము :- '' సాగర గర్భంలోకి వెళ్లి అనుభవమనే రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మా భవ ''
సమర్థ ఆత్మగా అయ్యేందుకు యోగంలో ప్రతి విశేషతను, ప్రతి శక్తిని, జ్ఞానములో ప్రతి ముఖ్యమైన పాయింటును అభ్యాసం చేయండి. అభ్యాసము చేస్తూ లగ్నములో మగ్నమై ఉండే ఆత్మ ముందు ఏ విధమైన విఘ్నము నిలబడలేదు. అందువలన అభ్యాసము చేసే ప్రయోగశాలలో కూర్చోండి. ఇంతవరకు జ్ఞానసాగరుడు, గుణసాగరుడు, శక్తుల సాగరంలో పై పై అలలలో తేలియాడుతూ ఉన్నారు కాని ఇప్పుడు సాగర గర్భంలోకి వెళ్తే అనేక విధాలైన విచిత్ర అనుభవాల రత్నాలను ప్రాప్తించుకొని సమర్థ ఆత్మలుగా అవుతారు.

స్లోగన్‌ :- '' అశుద్ధతే వికారాలనే భూతాలను ఆహ్వానిస్తుంది, అందువలన సంకల్పాలలో కూడా శుద్ధంగా అవ్వండి. ''

No comments:

Post a Comment