21-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు జ్ఞాన వర్షమును కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు, మీరు ధారణ చేయాలి, చేయించాలి ''
ప్రశ్న :- వర్షించని మేఘాలను ఏమంటారు ?
జవాబు :- వాటిని సోమరి మేఘాలని అంటారు. వర్షించేవాటిని చురుకైన మేఘాలని అంటారు. ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు. ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించకుంటే, వారి కడుపు - వీపుకు అతుక్కుంటుంది. వారు పేదవారు. ప్రజల్లోకి వెళ్ళిపోతారు.
ప్రశ్న :- వర్షించని మేఘాలను ఏమంటారు ?
జవాబు :- స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు రూపములో స్మృతి చేయడం, తండ్రి ఎవరో ఎలాగుంటారో అదే స్వరూపములో యధార్థంగా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది.
పాట:- ప్రియుని జతలో ఎవరుంటారో,..... ( జో పియా కే సాథ్ హై,............)
ఓంశాంతి. సముద్రము పై మేఘాలుంటాయి కనుక మేఘాలకు తండ్రి సాగరుడు. సాగరము వద్ద(జతలో) ఉన్న మేఘాలకే వర్షము. ఆ మేఘాలు కూడా నీరు నింపుకున్న తర్వాత వర్షిస్తాయి. మీరు కూడా నింపుకునేందుకు సాగరుని దగ్గరకు వస్తారు. సాగరుని పిల్లలంటేనే మేఘాలు. మీరు మధురమైన నీటిని లాక్కుంటారు. ఇప్పుడు మేఘాలు కూడా అనేక ప్రకారాలుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా జోరుగా వర్షిస్తాయి. వరదలు లుగజేస్తాయి. కొన్ని తక్కువగా వర్షిస్తాయి. మీలో కూడా ఇలాగే నంబరువారుగా ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేర్లు కూడా మహిమ చేస్తారు. వర్షము బాగా కురిస్తే మనుష్యులు సంతోషిస్తారు. ఇది కూడా అలాగే. ఎవరౖెెతే బాగా వర్షాన్ని కురిపిస్తారో వారిని మహిమ చేస్తారు. ఎవరు వర్షించరో వారి హృదయము సోమరిగా ఉంటుంది, వారి కడుపు నిండదు. పూర్తిగా ధారణ చేయనందున వారి కడుపు వెళ్లి వీపుకు అంటుకుంటుంది. కరువు వస్తే మనుష్యుల కడుపు వీపుకు అంటుకుంటుంది. ఇక్కడ కూడా ధారణ చేసి చేయించకపోతే వారి కడుపు వీపుకు అంటుకుంటుంది. బాగా వర్షించేవారు వెళ్లి రాజా- రాణులుగా తయారవుతారు. మిగిలినవారు పేదవారిగా అవుతారు. పేదవారి కడుపులు వీపుకు తగులుతూ ఉంటాయి. కనుక పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి. ఇందులో కూడా ఆత్మ, పరమాత్మల జ్ఞానము ఎంత సహజమైనది! మీలో కూడా ఒకప్పుడు ఆత్మ-పరమాత్మల జ్ఞానము ఉండేది కాదని మీకిప్పుడు తెలిసింది. కనుక కడుపు వీపుకు తగులుకుంది కదా. ముఖ్యమైనది ఆత్మ-పరమాత్మల విషయము(జ్ఞానము). మనుష్యులకు ఆత్మల గురించే తెలియకుంటే పరమాత్మనెలా తెలుసుకోగలరు? ఎంతో గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారున్నారు. వీరెవ్వరికి ఆత్మ గురించి తెలియదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని, అది నడుస్తూనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశినే. ఆత్మ ఆల్‌రౌండు పాత్ర ఎలా చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీకు ఆది నుండి అంత్యము వరకు సంపూర్ణ జ్ఞానముంది. వారు డ్రామా ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఈ తండ్రి రచించిన జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహా అవుతుందని మీకు తెలుసు. అందుకే దేహ సహితంగా ఉన్నదంతా మర్చిపోయి, స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఇది దుఃఖధామము. మీలో కూడా నంబరువార్ పురుషార్థానుసారము అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు జ్ఞానముతో నిండుగా ఉన్నారు. ఇక శ్రమ అంతా స్మృతిలోనే ఉంది. జన్మ-జన్మాంతరాల దేహాభిమానాన్ని నశింపజేసి, దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే చాలా శ్రమ ఉంది. చెప్పడమైతే చాలా సులభము. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు రూపంలో స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. తండ్రి చెప్తున్నారు - నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరో కొంతమంది మాత్రమే కష్టంగా స్మృతి చేస్తారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. స్వయాన్ని తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు. చదివించేవారు ఒక్క తండ్రియే అని, చదువుకునేవారు చాలామంది ఉన్నారని మీకు తెలుసు. తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గపు సామాగ్రి. మీకు అర్థం చేయించేందుకు నేను ఈ మాట అనవలసి వస్తుంది. అంతేగాని నాకు ఎలాంటి అసూయ లేదు. శాస్త్రాలలో కూడా బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. కానీ వారికి అర్థము కాదు. రాత్రి అర్ధము, పగలు అర్ధము ఉంటుంది. మెట్ల చిత్రము పై ఎంతో సులభంగా అర్థము చేయించవచ్చు.
భగవంతుడు చాలా సమర్థుడని, వారు ఏం కావాలంటే అది చేయగలరని మనుష్యులు భావిస్తారు. కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తున్నారు. భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేనేమైనా మాటి మాటికి వస్తానా? నా పాత్రకు కూడా హద్దులున్నాయి. పూర్తిగా దు:ఖము అలుముకున్నప్పుడు నేను నా సమయానికి వస్తాను. ఒక్క సెకెండు కూడా తేడా ఉండదు. డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిశ్చయింపబడి ఉంది. ఇది అత్యున్నతమైన తండ్రి అవతరణ. మళ్లీ నంబరువారుగా అందరూ వస్తారు. బలహీన పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానము లభించింది. ఈ జ్ఞానము వలన మీరు విశ్వానికే అధికారులుగా అవుతారు. మీకు ఫుల్ ఫోర్సుతో శక్తి వస్తుంది. పురుషార్థము చేసి మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇతరులకు పాత్ర లేనే లేదు. ముఖ్యమైనది డ్రామా. ఈ డ్రామా జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది. మిగిలినవన్నీ పదార్థాలు ఎందుకంటే వాటన్నిటినీ ఈ కళ్లతో చూడవచ్చు. ప్రపంచములో అద్భుతమైనవారు బాబా. వారు స్వర్గాన్ని రచిస్తారు. దానిని హెవెన,్ ప్యారడైజ్ అని అంటారు. దానికెంతో గొప్ప మహిమ ఉంది. తండ్రికి, తండ్రి రచనకు చాలా మహిమ ఉంది. భగవంతుడు అత్యంత ఉన్నతమైనవారు. ఉన్నతోన్నతమైన స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవ్వరికీ కొంచెము కూడా తెలియదు. మధురమైన పిల్లలైన మీకు కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. దాని అనుసారమే పదవిని పొందుతారు. ఎవరు ఎంత పురుషార్థము చేసినా డ్రామానుసారమే చేస్తారు. పురుషార్థము చేయకుంటే ఏమీ లభించదు. కర్మ చేయకుండా ఒక్క సెకెండు కూడా ఉండలేరు. వారు హఠయోగము చేస్తారు, ప్రాణాయామము చేస్తారు. జడము వలె అయిపోతారు. లోపల ఉండిపోతారు. పైన మట్టి కప్పేస్తుంది. మట్టి పైన వర్షము పడితే గడ్డి కూడా మొలుస్తుంది. కానీ దాని వలన ఎలాంటి లాభమూ లేదు. ఎన్ని రోజులు ఇలా కూర్చునే ఉంటారు? కర్మలేమో తప్పకుండా చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు. కేవలం అన్నము మొదలైనవి వండుకోరు. అందువలన వారిని కర్మ సన్యాసులని అంటారు. ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో లభించింది. ఈ నివృత్తి మార్గము వారు కూడా లేకుంటే భారతదేశము ఏ స్థితికి పోయి ఉండేది? భారతదేశము నంబరువన్ పవిత్రంగా ఉండేది. తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు. తర్వాత అది అర్ధకల్పము కొనసాగుతుంది. సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది. దైవీ రాజ్యము ఇప్పుడు మళ్లీ స్థాపన అవుతూ ఉంది. ఇటువంటి మంచి - మంచి స్లోగన్లు తయారు చేసి మనుష్యులను మేల్కొలపాలి. మళ్లీ దైవీ రాజ్యభాగ్యము వచ్చి తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థము చేసుకున్నారు. కృష్ణుని శ్యామ సుందరుడని ఎందుకు అంటారో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజులలో అయితే ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. కృష్ణునితో పోటి పడ్తారు. పతిత రాజులు పావన రాజుల ముందు తల వంచి ఎలా నమస్కరిస్తారో మీకు తెలుసు. కానీ వారిని గురించి తెలియనే తెలియదు. పూజ్యులుగా ఉన్నవారే మళ్లీ పూజారులుగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్ర జ్ఞానమంతా ఉంది. ఇది గుర్తున్నా మీ స్థితి చాలా బాగుంటుంది. కానీ మాయ స్మరణ చేయనివ్వదు. మరపింపజేస్తుంది. సదా హర్షితముఖ స్థితి ఉంటే మిమ్ములను దేవతలని అంటారు. లక్ష్మీనారాయణుల చిత్రాలను చూచి ఎంత సంతోషిస్తారో అంత రాధా-కృష్ణులు, రాముడు మొదలైనవారిని చూచి సంతోషించరు. ఎందుకంటే కృష్ణుని గురించి శాస్త్రాలలో హంగామా(చెడు) మాటలు వ్రాసేవారు. ఈ బాబా శ్రీ నారాయణునిగా అవుతారు కదా. బాబా ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూచి సంతోషిస్తారు. పిల్లలు కూడా ఇలాగే భావించాలి - ఇంకా ఎంత సమయము ఈ పాత శరీరములో ఉంటాము! తర్వాత వెళ్లి రాకుమారులుగా అవుతాము. ఇది లక్ష్యము కదా. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. సంతోషములో ఎంతగానో పులకరించిపోవాలి. ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవపోతే ఏ పదవి దొరుకుతుంది ? విశ్వమహారాజు, మహారాణి ఎక్కడ, షాహుకార్లు ఎక్కడ, ప్రజలలో నౌకర్లు - చాకర్లు ఎక్కడ ? విషయమంతా ఒక్కటే. కేవలం మన్మనాభవ, మధ్యాజీభవ. అల్ఫ్(పరమాత్మ), బే(వారసత్వము). స్మృతి మరియు జ్ఞానము. ఇతనికి ఎంత సంతోషము కలిగింది! అల్లా లభించారు. మిగిలిందంతా ఇచ్చేశారు. ఎంత గొప్ప లాటరీ లభించిది! ఇంకేం కావాలి. మరి పిల్లలలో కూడా ఈ సంతోషం ఉండాలి. పిల్లలు చూసి సంతోషించేలాంటి ట్రాన్స్‌లైట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి అని తండ్రి చెప్తున్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. మనుష్యులకు కొంచెము కూడా తెలియదు. పూర్తిగా తుచ్ఛ బుద్ధి గలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు తుచ్ఛ బుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధిగలవారిగా అవుతున్నారు. అంతా తెలుసుకున్నారు. ఇంకేదీ చదివే అవసరము లేదు. ఈ చదువు ద్వారా మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. అందుకే తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు వారికి ప్రతి ఒక్కరి మనసు తెలుసని భ్రమపడ్తారు. కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. ఫలానివారు బాగా చదువుకుంటారని టీచర్‌కు తెలుసు. అంతేగాని రోజంతా కూర్చుని వీరి బుద్ధిలో ఏం నడుస్తూ ఉందని చూడరు. ఇది అద్భుతమైన జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగరులు, సుఖ-శాంతి సాగరులని అంటారు. మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. తర్వాత ఈ బిరుదులు ఎగిరిపోతాయి. మళ్లీ సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇది మానవులకు ఉన్నత పదవి. ఈ సమయంలో ఇది ఈశ్వరీయ పదవి. ఇవి ఎంతో బాగా అర్థము చేసుకుని ఇతరులకు అర్థం చేయించవలసిన విషయాలు. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూచి చాలా సంతోషించాలి. మనమిప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతాము. జ్ఞానము ద్వారానే అన్ని గుణాలు వచ్చేస్తాయి. మన లక్ష్యమును చూస్తూనే తాజాగా అయిపోతారు. అందుకే బాబా చెప్తున్నారు - ఈ లక్ష్మీనారాయణుల చిత్రము ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి. ఈ చిత్రము మనసులో ప్రేమను పెంచుతుంది. ఇది ఈ మృత్యులోకములో చివరి జన్మ అని మనసుకు తట్తుంది. మళ్లీ మేము అమరలోకములోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు. తతత్వమ్ అనగా ఆత్మనే పరమాత్మ అని కాదు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఎప్పుడైనా, ఎవరికి తెలిపినా, మేము ఎప్పుడూ ఎవ్వరినీ, దానమివ్వండని అడగము(స్థూల ధనము). ప్రజాపిత బ్రహ్మకు చాలామంది పిల్లలున్నారు. మేము మా శరీరము, మనస్సు, ధనముల ద్వారానే సేవ చేస్తాము. బ్రాహ్మణులు తమ సంపాదన ద్వారానే యజ్ఞాన్ని నడిపిస్తున్నారు. శూద్రుల పైకము ఈ యజ్ఞములో ఉపయోగించజాలము. అనేకమంది పిల్లలున్నారు. మనము మన తనువు, మనస్సు, ధనముతో ఎంత సేవ చేస్తామో, సమర్పణ అవుతామో అంత గొప్ప పదవి పొందుతామని వారికి తెలుసు. బాబా బీజము నాటినారని తెలుసు. దీని ద్వారానే వీరు లక్ష్మీ నారాయణులుగా అవుతారు. ధనముతో అక్కడ పని లేకుంటే, ఈ కార్యములో ఎందుకు ఉపయోగించరాదు? సమర్పణైన వారు ఆకలితో చస్తారా? చాలా బాగా సంభాళించబడ్తారు. బాబాకు ఎంత బాగా సంభాళన జరుగుతూ ఉంది. ఇతను శివబాబా రథము కదా. తండ్రి ప్రపంచమంతటిని స్వర్గంగా తయారు చేసేవారు. వీరు అందమైన(హసీన్) యాత్రికులు.
పరమపిత పరమాత్మ వచ్చి అందరినీ అందంగా తయారు చేస్తారు. మీరు నల్లగా(అపవిత్రులు) ఉన్నవారు, అందంగా(పవిత్రంగా) అవుతారు కదా. ఎంతో సుందరమైన ప్రియుడు, వచ్చి అందరినీ పవిత్రంగా(సుందరంగా) చేస్తారు. వారికి సమర్పణవ్వాలి. స్మృతి చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఆత్మను చూడలేమో, తెలుసుకోగలమో అలా పరమాత్మను కూడా తెలుసుకోగలము. చూచేందుకైతే ఆత్మ, పరమాత్మ ఇరువురూ ఒకే విధమైన బిందువులు. ఇక మిగిలినదంతా జ్ఞానము. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇది పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారము ధారణ జరుగుతుంది. డాక్టర్లకు కూడా మందుల పేర్లు బుద్ధిలో ఉంటాయి కదా. అంతేకాని రోగి వచ్చినప్పుడు కూర్చొని పుస్తకము చూడరు. డాక్టర్లకు కూడా పాయింట్లు ఉంటాయి. లాయర్లకు కూడా పాయింట్లు ఉంటాయి. మీ వద్ద కూడా అర్థము చేయించేందుకు పాయింట్లు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి, వాటి పై అర్థం చేయిస్తారు. కొన్ని పాయింట్లు కొందరికి ఉపయోగపడ్తాయి. కొంతమందికి కొన్ని పాయింట్లతో బాణము తగులుతుంది(ప్రభావము పడ్తుంది). పాయింట్లు అయితే అనేకమున్నాయి. ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు మంచిరీతిగా సేవ చేయగలరు. అర్ధకల్పము నుండి గొప్ప రోగులుగా ఉన్నారు. ఆత్మ పతితమైపోయింది. వారికి ఒక్క అవినాశి సర్జన్ మాత్రమే ఔషధము ఇస్తారు. వారు సదా సర్జన్‌గానే ఉంటారు. వారు ఎప్పుడూ జబ్బుపడరు. మిగిలిన సర్జన్లు అయితే జబ్బుపడ్తారు. అవినాశి సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఎంతో సులభము. చిత్ర్రాన్ని సదా పాకెట్‌లో ఉంచుకోండి. ఈ బాబా నారాయణుని పూజ చేసేవారు. లక్ష్మి చిత్రాన్ని చెరిపించి, ఒంటరిగా ఉన్న నారాయణుని చిత్రాన్ని ఉంచుకున్నారు. మనము ఎవరిని పూజిస్తూ ఉండేవారమో ఇప్పుడు వారిగా మనము తయారవుతున్నామని మీరు తెలుసుకున్నారు. లక్ష్మీ చిత్రాన్ని తీయించారు, వీడ్కోలు ఇచ్చారు అనగా ఇతనికి(బ్రహ్మ) నేను లక్ష్మిగా అవ్వను అని పక్కా నమ్మకముండేది. లక్ష్మి కూర్చొని కాళ్లు వత్తడం ఇతనికి ఇష్టము లేదు. ఆ చిత్ర్రాన్ని చూచి పురుషులు స్త్రీలతో కాళ్లు వత్తించుకుంటారు. అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్లు వత్తదు. ఈ ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు. ఈ ఆచారము రావణ రాజ్యములోనిది. ఈ చిత్రములో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. భారతదేశము ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది. ఇది ఎంతో మంచి జ్ఞానము. కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు. అగ్ని చాలా తీవ్రంగా తగుల్కొంటుంది. అడవికి అగ్ని అంటుకోనున్నది. రావణ రాజ్యమైతే తప్పకుండా సమాప్తమవ్వాల్సిందే. యజ్ఞములో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. ఇది చాలా గొప్ప యజ్ఞము, విశ్వమంతటిలో పవిత్రతను తీసుకొచ్చే యజ్ఞము. ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమేనని చెప్పుకుంటారు. అయితే వారు గర్భజనితులు, బ్రహ్మ సంతానము పవిత్ర ముఖ వంశావళి వారు కదా. నుక వారికిది అర్థము చేయించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్క్య ముఖ్య సారము :-
1. స్వచ్చమైన బుద్ధిగలవారిగా అయి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి. జ్ఞానము ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేయాలి.
2. బాబా ఎలాగైతే తనువు, మనస్సు, ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో, అలా తండ్రి సమానంగా, మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలము చేసుకోవాలి. సదా తాజాగా ఉండేందుకు లక్ష్యముండే చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి.
వరదానము :- '' పాస్ విత్ ఆనర్‌గా అయ్యేందుకు పురుషార్థ వేగమును తీవ్రంగా, బ్రేకును శక్తిశాలిగా ఉంచుకునే యథార్థ యోగీ భవ ''
వర్తమాన సమయానుసారం పురుషార్థ వేగము తీవ్రంగా, బ్రేకు శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు చివర్లో పాస్ విత్ ఆనర్‌గా అవ్వగలరు. ఎందుకంటే ఆ సమయంలోని పరిస్థితులు బుద్ధిలో అనేక సంకల్పాలు తెచ్చేవిగా ఉంటాయి. ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థితమయ్యే అభ్యాసము కావాలి. ఏ సమయంలో విస్తారంగా బుద్ధి చెదిరిపోయి ఉంటుందో ఆ సమయంలో స్టాప్ చేసే అభ్యాసం కావాలి. స్టాప్ అంటూనే స్టాప్ అవ్వాలి. ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని ఒకే సంకల్పంలో స్థితం చేసుకోండి - ఇదే యథార్థమైన యోగము.
స్లోగన్ :- '' మీరు నమ్రత గల సేవకులు అందువలన సోమరిగా ఉండరాదు. ''
No comments:
Post a Comment