Thursday, January 16, 2020

Telugu Murli 17/01/2020

17-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ పాత ప్రపంచంలో ఎలాంటి సారమూ లేదు. అందువలన దీని పై మనసునుంచరాదు. తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ''

ప్రశ్న :- తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆదేశమేది ? దానినెందుకు ఉల్లంఘిస్తారు(ధిక్కరిస్తారు) ?
జవాబు :- తండ్రి ఆదేశామేమంటే - ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి. ఎందుకంటే స్వయం మీరే సేవకులు. అయితే దేహాభిమానము కారణంగా తండ్రి ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తారు. బాబా చెప్తున్నారు - మీరు ఇక్కడ సుఖము తీసుకుంటే అక్కడ సుఖము తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలు - మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు. కాని మీరందరు తండ్రి పైనే ఆధారపడి ఉంటారు.

పాట :- నా మనసుకు ఆధారము తెగిపోరాదు,...........( దిల్‌ కా సహారా టూట్‌ న జాయే,............)
ఓంశాంతి. శివభగవాచ - వారు తమ సాలిగ్రామ పిల్లలతో చెప్తున్నారు - శివుని గురించి, సాలిగ్రామాల గురించి మానవులందరికీ తెలుసు. ఇరువురూ నిరాకారులే. ఇప్పుడు కృష్ణ భగవానువాచ అని అనేందుకు వీలు లేదు. భగవంతుడు ఒక్కరే కనుక ఇప్పుడు శివభగవానువాచ ఎవరి కొరకు? ఆత్మిక పిల్లల కొరకు. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లల సంబంధము తండ్రితోనే ఉంది. ఎందుకంటే వారు పతితపావనులు, జ్ఞానసాగరులు, స్వర్గ వారసత్వమునిచ్చేవారు ఒక్క శివబాబా మాత్రమే. స్మృతి కూడా వారినే చేయాలి. బ్రహ్మ వారి భాగ్యశాలి రథము. రథము ద్వారానే తండ్రి వారసత్వాన్నిస్తారు. బ్రహ్మ వారసత్వమును ఇచ్చేవారు కాదు. అతను వారసత్వము తీసుకునేవారు. కనుక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ రథానికి ఏదైనా కష్టము కలిగిందనుకోండి, కారణ-అకారణము వలన పిల్లలకు మురళి లభించకుంటే పిల్లల గమనము(అటెన్షన్‌) పూర్తిగా శివబాబా వైపుకే పోతుంది. శివబాబా ఎప్పుడూ జబ్బు పడరు. ఇతరులకు అర్థము చేయించగలిగినంత జ్ఞానము పిల్లలకు కూడా లభించింది. ప్రదర్శినీలో పిల్లలు చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలలో జ్ఞానముంది కదా. ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానము నిండి ఉంది. పిల్లలను ఎవ్వరూ ఆటంకపరచలేరు. పోస్టు రాలేదనుకోండి, స్ట్రైకు జరుగుతుందనుకోండి అప్పుడు ఏం చేస్తారు? జ్ఞానమైతే పిల్లల బుద్ధిలో ఉంది. సత్యయుగము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచమని అర్థం చేయించండి. పాత ప్రపంచములో సారమేదీ లేదని పాటలో కూడా ఉంది. అందువలన దీని పై మనసు ఉంచరాదు. లేకుంటే శిక్షలు లభిస్తాయి. తండ్రి స్మృతి ద్వారా శిక్షలు కట్‌(తగ్గిపోతూ) అవుతూ పోతాయి. తండ్రి స్మృతి తెగిపోయి శిక్షలను అనుభవించి, మళ్లీ పాత ప్రపంచములోకి వెళ్లరాదు. ఈ విధంగా చాలామంది వెళ్ళిపోయారు. వారికి తండ్రి స్మృతి కూడా లేదు. మళ్లీ పాత ప్రపంచము వైపుకు వెళ్లిపోయారు. ప్రపంచము చాలా చెడిపోయింది. ఎవరి వైపు అయినా మనసు వెళ్లిందంటే, ఆకర్షింపబడితే శిక్షలు చాలా అనుభవించాల్సి వస్తుంది. పిల్లలు జ్ఞానము వినాలి. భక్తిమార్గములోని పాటలు కూడా వినరాదు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మీకు సంగమ యుగమలోనే జ్ఞానము లభిస్తుంది. ప్రపంచములోని వారెవ్వరికీ ఈ విషయము తెలియదు. జ్ఞానసాగరులు ఒక్కరే అని కూడా తెలియదు. వారు జ్ఞానము ఇచ్చినప్పుడు మనుష్యులకు సద్గతి కలుగుతుంది. సద్గతిదాత వారు ఒక్కరు మాత్రమే కావున వారి మతమును అనుసరించాలి. మాయ ఎవ్వరినీ వదలదు. దేహాభిమానము వచ్చిన తర్వాతనే ఏదో ఒక తప్పు జరుగుతుంది. కొంతమంది సెమీ కామానికి వశమవుతారు, కొంతమంది క్రోధ వశమవుతారు. ఎవరినైనా ప్రేమించాలి, ఇది చేయాలి,............ అని మనసులో తుఫానులు చాలా వస్తాయి. ఎవరి శరీరము పైనా మనసు తగులుకోరాదు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహ భావము ఉండదు. లేకుంటే తండ్రి ఆజ్ఞ ఉల్లంఘించడమవుతుంది. దేహ అహంకారము వలన చాలా నష్టము కలుగుతుంది. అందువలన దేహ సహితంగా సర్వమూ మర్చిపోవాలి. కేవలం తండ్రిని, ఇంటిని మాత్రము స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - శరీరము ద్వారా పనులు చేస్తూ నన్ను స్మృతి చేస్తే వికర్మలు భస్మమైపోతాయి. ఇది చాలా సులభమైన మార్గము. మీ ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయని కూడా తెలుసు. కానీ తప్పులు చేస్తూ అందులోనే ఇరుక్కుపోరాదు. ఒకసారి తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు మళ్లీ చేయరాదు. మీ చెవులు మీరే పట్టుకోవాలి. అప్పుడు మళ్లీ ఆ తప్పు జరగదు. పురుషార్థము చేయాలి. ఒకవేళ పదే పదే తప్పు జరుగుతూ ఉంటే నేను చాలా నష్టపోతానని అర్థం చేసుకోవాలి. తప్పులు చేస్తూ చేస్తూ దుర్గతి పాలయ్యారు కదా. ఎంత పెద్ద మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకు దిగిపోయి, ఎలా ఉండేవారు ఎలా అయ్యారు? ఇంతకు ముందు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారము జ్ఞానములో అందరూ ప్రవీణులైపోయారు. ఎంత సాధ్యమైతే అంత అంతర్ముఖులుగా కూడా ఉండాలి, నోటితో ఏమీ మాట్లాడరాదు. జ్ఞానములో ప్రవీణులైన పిల్లలు ఎప్పుడూ పాత ప్రపంచము పై మనసు ఉంచుకోరు. మేము రావణరాజ్యమును వినాశనము చేయాలని వారి బుద్ధిలో ఉంటుంది. ఈ శరీరము కూడా పాత రావణ సంప్రదాయానికి చెందింది. అందువలన మనము రావణ సంప్రదాయమును ఎందుకు స్మృతి చేయాలి? ఒక్క రాముని మాత్రమే స్మృతి చేస్తాము. సత్యమైన పితావ్రతులుగా అయ్యారు కదా.
తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనమైపోతాయి. పితావ్రత అనగా భగవంతుని వ్రతులుగా అవ్వాలి. భక్తులు భగవంతుడినే స్మృతి చేస్తారు - '' ఓ భగవంతుడా, మీరు వచ్చి మాకు సుఖ-శాంతుల వారసత్వమునివ్వండి '' అని వేడుకుంటారు. భక్తిమార్గములో సమర్పణవుతారు, బలి అవుతారు. ఇక్కడ బలి అయ్యే మాటే లేదు. మనము బ్రతికి ఉండే మరణిస్తాము అనగా బలి అవుతాము అనగా జీవించి ఉండే తండ్రివారిగా అవుతాము ఎందుకంటే వారితో వారసత్వము తీసుకోవాలి. వారి మతమును అనుసరించాలి. జీవించే బలి అవ్వడం, సమర్పణ అవ్వడం, వాస్తవానికి అది ఇప్పటి మాటే. భక్తి మార్గములోని వారు ఎన్నో జీవాలను బలి ఇస్తారు. ఇక్కడ జీవఘాతము మాటే లేదు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగము జోడించండి, దేహాభిమానములోకి రాకండి. కూర్చుంటూ-లేస్తూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేయాలి. నూటికి నూరు శాతము ఎవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. క్రింద-మీద అవుతూ ఉంటుంది. తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటి పై గమనము ఉంచకుంటే తప్పులు ఎలా వదిలిపోతాయి? మాయ ఎవ్వరినీ వదిలి పెట్టదు. బాబా మేము మాయతో ఓడిపోతున్నామని అంటారు. పురుషార్థము కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏం జరుగుతుందో తెలియదు. మా ద్వారా ఇంత పెద్ద తప్పులు ఎలా జరుగుతాయో మాకు తెలియదు. తప్పుల ద్వారా బ్రాహ్మణుల కులములో మా పేరు చెడిపోతుందని కూడా తెలుసు. కాని అర్థము కానంతగా మాయ దాడి చేస్తుంది. దేహాభిమానములోకి వచ్చినందున తెలివిలేని వారైపోతారు. తెలివిహీనమైన పనులు చేస్తారు, కనుక గ్లాని కూడా జరుగుతుంది, వారసత్వము కూడా తగ్గిపోతుంది. ఇలా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మాయ చాలా తీవ్రంగా చెంప దెబ్బ వేస్తుంది. స్వయము ఓడిపోయి, క్రోధములోకి వచ్చి ఇతరులకు చెంప దెబ్బ వేస్తారు. ఇంకా ఎక్కువ కోపము వస్తే పాదరక్ష పూజ(చెప్పు దెబ్బ) కూడా చేసి తర్వాత పశ్చాత్తాప పడ్తారు. బాబా అంటున్నారు - ఇప్పుడు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. స్వయం నష్టపోయి ఇతరులను కూడా నష్టపరచారు. ఎంత నష్టము జరిగిపోయింది! రాహు గ్రహణము వారి నెత్తిన కూర్చుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దానము ఇస్తే గ్రహణము తొలగిపోతుంది. రాహు గ్రహణము కూర్చున్నట్లయితే, అది వదిలేందుకు సమయము పడ్తుంది. మెట్లు ఎక్కి-దిగడం కష్టమవుతుంది. మానవులకు సారాయి తాగే అలవాటు ఉంటే దానిని వదలాలంటే ఎంత కష్టమవుతుంది. అన్నిటికంటే పెద్ద తప్పు ముఖము నల్లగా చేసుకోవడం(కామ వికారము) దీని వలన మాటి మాటికి శరీరము గుర్తుకు వస్తుంది. పిల్లలు మొదలైనవారు ఉంటే వారి స్మృతే ఉంటుంది. వారు ఇతరులకు జ్ఞానమేమిస్తారు? వారి మాటలు ఎవ్వరూ వినను కూడా వినరు. మనమిప్పుడు అందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తాము. ఇందులో చాలా గమనముంచి సంభాళించుకోవాల్సి వస్తుంది. మాయ చాలా తీవ్రమైనది. రోజంతా శివబాబాను మాత్రమే స్మృతి చేయాలనే గమనముండాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. మనము వెళ్లిపోవాలి. ఈ శరీరము కూడా నాశనమవుతుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా దేహాభిమానము వదలుతూ పోతుంది. ఇతరులెవ్వరూ గుర్తుకు రారు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మనస్సు జోడించరాదు. అలా జోడిస్తే వారే గుర్తుకు వస్తారు. తప్పకుండా బదులు తీర్చుకుంటారు. చాలా ఉన్నతమైన గమ్యము. చెప్పడమైతే చాలా తేలిక. లక్షలలో ఎవరో ఒకరు మాత్రమే వస్తారు. కొంతమంది స్కాలర్‌షిప్‌ కూడా తీసుకుంటారు కదా. బాగా శ్రమ చేసేవారు స్కాలర్‌షిప్‌ తప్పకుండా తీసుకుంటారు. సాక్షిగా ఉండి సర్వీసు ఎలా చేస్తున్నామని గమనించుకోవాలి. చాలా మంది పిల్లలు భౌతిక సేవ వదిలి ఈ సేవలో లగ్నమవ్వాలని అనుకుంటారు. కాని బాబా పరిస్థితులను కూడా చూస్తారు. ఒంటరిగా ఉండి ఏ సంబంధాలు, బంధువులు లేకుంటే పర్వాలేదు. అయినా నౌకరి కూడా చేయండి. ఈ సేవ కూడా చేయండి అని అంటారు. నౌకరిలో కూడా చాలామంది కలుస్తూ ఉంటారు. పిల్లలైన మీకు జ్ఞానమైతే చాలా లభించింది. పిల్లల ద్వారా కూడా తండ్రి చాలా సేవ చేయిస్తూ ఉంటారు. ఎవరిలోనైనా ప్రవేశించి సేవ చేస్తారు. సేవ అయితే చేసే తీరాలి. ఎవరికి బాధ్యతలు ఉంటాయో వారు ఎలా నిదురిస్తారు. శివబాబా అయితే సదా మేల్కొని ఉండే జ్యోతి. నేను రాత్రింబవళ్లు సేవ చేస్తానని తండ్రి అంటారు. శరీరమైతే అలసిపోతుంది. శరీరము పని చేయకుంటే ఆత్మ ఏం చేస్తుంది? తండ్రి అయితే అలసిపోరు కదా. వారు సదా మేలుకొని ఉండే జ్యోతి. మొత్తం ప్రపంచమంతటినీ మేల్కొల్పుతారు. వారి పాత్ర అద్భుతమైనది. వారి పాత్ర గురించి పిల్లలైన మీలో కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ తండ్రి మృత్యువుకు మృత్యువు(యమునికి యముడు). వారి ఆజ్ఞను పాటించకపోతే వారు ధర్మరాజు ద్వారా శిక్షలు అనుభవిస్తారు. తండ్రి ముఖ్యమైన ఆదేశమేమంటే ఎవ్వరితోనూ సేవ తీసుకోకండి. కానీ దేహాభిమానములోకి వచ్చి తండ్రి ఆజ్ఞలను ధిక్కరిస్తారు. బాబా అంటున్నారు - స్వయం మీరే సేవకులు. ఇక్కడ సుఖము తీసుకుంటే అక్కడ సుఖము తగ్గిపోతుంది. అలవాటైపోతే సేవకులు లేకుండా ఉండలేరు. కొంతమంది మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు. కానీ ఆధారముండడం మంచిదని తండ్రి అంటారు. మీరంతా తండ్రి పై ఆధారపడ్తారు. నా ఆధారము లేకుండా స్వతంత్రులుగా అయితే క్రింద పడిపోతారు. మీరంతా శివబాబా పై ఆధారపడ్తారు. ప్రపంచమంతటికీ వారే ఆధారము. అందుకే '' ఓ పతిత పావనా! '' రమ్మని పిలుస్తారు. వారి ద్వారానే సుఖ-శాంతులు లభిస్తాయి కానీ అర్థము చేసుకోరు. భక్తిమార్గపు ఈ సమయాన్ని కూడా దాటుకోవాలి. రాత్రి పూర్తి అయినప్పుడు తండ్రి వస్తారు. ఒక్క సెకండు కూడా తేడా ఉండదు. నేను ఈ డ్రామాను గురించి తెలిసినవాడను. డ్రామా ఆదిమధ్యాంతాల గురించి మరెవ్వరికీ తెలియదు. సత్యయుగము నుండి ఈ జ్ఞానము పూర్తి అదృశ్యమవుతుంది. ఇప్పుడు మీకు రచయిత, రచనల ఆది మధ్యాంతాలు తెలుసు. దీనినే జ్ఞానమని అంటారు. మిగిలినదంతా భక్తి. తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. మనకు ఆ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. పిల్లలకు మంచి నషా కూడా ఉండాలి. రాజధాని స్థాపన అవుతూ ఉందని కూడా అర్థం చేసుకున్నారు. కొంతమంది సాధారణ ప్రజలలో కూడా సాధారణ నౌకర్లు, చాకర్లుగా అవుతారు. కొంచెము కూడా జ్ఞానము అర్థము కాదు. ఆశ్చర్యము కదా! జ్ఞానమైతే చాలా సులభము. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయింది. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. ఈ డ్రామాలో మనము ముఖ్య పాత్రధారులము. మీరిప్పుడు మొత్తం డ్రామాను గురించి పూర్తిగా తెలుసుకున్నారు. మొత్తం డ్రామాలో హీరో-హీరోయిన్‌లు(నాయక-నాయకీలు) మనమే. చాలా సులభము. కానీ అదృష్టములో లేకుంటే పురుషార్థము కూడా చేయలేరు. చదువులో ఇలా అవుతుంది. కొంతమంది పాస్‌ అవ్వలేరు. ఇది ఎంతో గొప్ప పాఠశాల. రాజధాని స్థాపన అవ్వనున్నది. ఇప్పుడు ఎవరు ఎంత చదువుతారో అంత పదవి పొందుతారు. చదువును బట్టి ఏ పదవి పొందుకుంటారో పిల్లలు తెలుసుకోగలరు. అనేకమంది పిల్లలున్నారు. అందరూ వారసులుగా అవ్వరు. పవిత్రంగా అవ్వడం చాలా కష్టము. తండ్రి చాలా సులభంగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నాటము పూర్తి అవుతుంది. తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఎంత ఎక్కువ వీలైతే, అంత ఎక్కువ స్మృతిలో ఉండాలి. కానీ అదృష్టములో లేకుంటే, తండ్రికి బదులు ఎవరెవరినో స్మృతి చేస్తారు. ఇతరుల పై మనసు ఉంచితే తర్వాత చాలా ఏడ్వవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచము పై మనసు ఉంచరాదని తండ్రి చెప్తున్నారు. ఇది సమాప్తమౌతుంది. ఈ విషయము ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ కలియుగము ఇంకా చాలా కాలముంటుందని వారు భావిస్తారు. గాఢనిద్రలో మునిగి ఉన్నారు. మీరు చూపించే ప్రదర్శిని(ఎగ్జిబిషన్‌) ప్రజలను తయారు చేసుకునే విహంగమార్గ సేవకు సాధనము. కొంతమంది రాజులు, రాణులు కూడా వెలువడ్తారు. సేవ చేయాలనే ఆసక్తి గలవారు చాలామంది ఉన్నారు. కొంతమంది పేదలు, కొంతమంది ధనవంతులు కూడా ఉన్నారు. ఇతరులను వారి సమానంగా తయారుచేస్తారు. వారికి కూడా లాభము లభిస్తుంది కదా. గ్రుడ్డివారికి ఊతకర్రగా అవ్వాలి, కేవలం ఇది తెలపాలి - ''తండ్రిని, వారసత్వమును స్మృతి చేయండి, వినాశనము మీ ఎదురుగా నిలబడి ఉంది.'' వినాశ సమయము సమీపంగా చూసినప్పుడు మీ మాటలు వింటారు. మీ సేవ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. వీరు చెప్పేది సత్యమేనని తెలుసుకుంటారు. వినాశనమవుతుందని మీరు ఉత్సాహముతో కేకలు వేస్తూ ఉంటారు.
మీ ప్రదర్శినీలు, మేళాలు, సేవ వృద్ధి చెందుతూ ఉంటాయి. ఏదైనా మంచి హాలు లభిస్తే, బాడుగ ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని ప్రయత్నము చేయాలి. మీ పేరు ఇంకా ప్రసిద్ధమవుతుందని వారికి చెప్పండి. చాలామంది వద్ద విశాలమైన గదులు(హాలులు) ఊరికే పడి ఉంటాయి. పురుషార్థము చేస్తే 3 అడుగుల స్థలము దొరకనే దొరుకుతుంది. అంతవరకు మీరు చిన్న-చిన్న ప్రదర్శినీలు చేస్తూ ఉండండి. శివజయంతి కూడా మీరు జరిపితే అందరికీ తెలుస్తుంది. మీరు శివజయంతి శెలవు రోజున ఫిక్స్‌ చేసుకోండి అని కూడా వ్రాస్తారు. వాస్తవానికి ఆ ఒక్కరి పుట్టిన రోజునే జరుపుకోవాలి. వారే పతితపావనులు. వాస్తవానికి ఈ త్రిమూర్తిదే అసలైన స్టాంపు. '' సత్యమేవ జయతే '' ఇది విజయము పొందే సమయము. అర్థం చేయించేవారు కూడా చాలా బాగుండాలి. అన్ని సెంటర్లలోని ముఖ్యమైనవారు గమనమివ్వాల్సి వస్తుంది. మన స్టాంపును ముద్రించవచ్చు. ఇది త్రిమూర్తి శివజయంతి. కేవలం శివజయంతి అంటే అర్థము చేసుకోలేరు. ఇప్పుడు పని చేయవలసింది పిల్లలే. చాలామందికి కళ్యాణమైతే ఎంత లిఫ్ట్‌ లభిస్తుంది. సేవ చేసేందుకు చాలా లిఫ్టు లభిస్తుంది. ప్రదర్శినీల ద్వారా చాలా సేవ జరుగుతుంది. ప్రజలు తయారవుతారు కదా. సేవ చేయాలనే గమనము ఏ పిల్లలకుంటుందో బాబా గమనిస్తారు. బాబా హృదయాన్ని కూడా వారే అధిరోహిస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
ఏ కర్మ చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ సంకల్పము చేసినా మొదట అది బ్రహ్మాబాబా సమానంగా ఉందా అని చెక్‌ చేసుకోండి. బ్రహ్మాబాబా విశేషత ఏమంటే - ఏది అనుకున్నారో, అది చేశారు. ఏం చెప్పారో అది చేశారు. ఇలా తండ్రిని అనుసరించండి. మీ స్వమాన స్థితి ద్వారా, తండ్రి తోడు యొక్క సమర్థత ద్వారా, దృఢత మరియు నిశ్చయం యొక్క శక్తి ద్వారా శ్రేష్టమైన పొజిషన్‌లో ఉండి అపోజిషన్‌ను సమాప్తం చేస్తే అవ్యక్త స్థితి సులభంగా తయారవుతుంది.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, వెంటనే ఎవరి చెవులు వారే పట్టుకోవాలి. మరోసారి ఆ తప్పు జరగరాదు. దేహ అహంకారములోకి ఎప్పుడూ రారాదు. జ్ఞానములో ప్రవీణులుగా అయి అంతర్ముఖులుగా ఉండాలి.
2. సత్యమైన పితావ్రతలుగా అవ్వాలి. బ్రతికి ఉండి, బలిహారమవ్వాలి. ఎవ్వరితోనూ మనసు లగ్నమవ్వరాదు. తెలివిహీనమైన పని ఏదీ చేయరాదు.

వరదానము :- '' విశాల బుద్ధి, విశాల హృదయం ద్వారా 'నా వారు' అనే అనుభూతి చేయించే మాస్టర్‌ రచయిత భవ ''
మాస్టర్‌ రచయితల మొదటి రచన - ఈ దేహము. ఎవరైతే ఈ దేహానికి యజమాని స్థితిలో సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకుంటారో, వారు తమ స్నేహము లేక సంపర్కము ద్వారా అందరికీ 'వీరు నా వారు' అని అనుభవం చేయిస్తారు. వారి సంపర్కము ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, సహయోగము, ధైర్యము, ఉత్సాహము, దాతృత్వము ఏదో ఒక విశేషత అనుభవమవుతుంది. వారిని విశాలబుద్ధి గలవారని అంటారు.

స్లోగన్‌ :- '' ఉమంగ - ఉత్సాహాలనే రెక్కల ద్వారా సదా ఎగిరేకళను అనుభవం చేస్తూ నడవండి ''

No comments:

Post a Comment