10-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ముఖ్యంగా రెండు విషయాలు అందరికీ అర్థం చేయించాలి - ఒకటి - తండ్రిని స్మృతి చేయండి, రెండవది 84 జన్మల చక్రాన్ని తెలుసుకోండి. అప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. ''
ప్రశ్న :- శ్రీ కృష్ణుని మహిమలో లేని ఏ శబ్ధాలు తండ్రి మహిమలో వస్తాయి ?
జవాబు :- వృక్షపతి ఒక్క తండ్రి మాత్రమే, శ్రీ కృష్ణుని వృక్షపతి అని అనరు. తండ్రులకు తండ్రి (పితల పిత) లేక పతులకు పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు, శ్రీ కృష్ణుని అలా అనరు. ఇరువురి మహిమ వేరు వేరుగా స్పష్టము చేయండి.
ప్రశ్న :- పిల్లలైన మీరు గ్రామ గ్రామాలలో ఏ దండోరా వేయించాలి ?
జవాబు :- మనుష్యుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి, స్థాపన, వినాశనము ఎలా అవుతాయో వచ్చి తెలుసుకోండి అని గ్రామ గ్రామాలలో దండోరా వేయించండి.
పాట :- నీవే తల్లివి, నీవే తండ్రివి,............ (తుమ్ హీ హో మాతా, తుమ్ హీ హో,........)
ఓంశాంతి. ఈ పాట చివర్లో నీవే నావ, నీవే నావికుడు(తుమ్‌హీ నయ్యా, తుమ్ హీ ఖివయ్యా................) అనే ఏ చరణము వస్తుందో అది తప్పు. ఎలా మీరే పూజ్యులు, మీరే పూజరులు అని అంటారో, ఇది కూడా అలాగే అవుతుంది. జ్ఞాన ప్రకాశము గలవారిగా ఎవరైతే ఉంటారో, వారు తక్షణము పాటను ఆపివేస్తారు ఎందుకంటే దీని వలన తండ్రికి అవమానము జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది, ఇతర మనుష్యులకు ఈ జ్ఞానము తెలియదు. మీకు కూడా ఇప్పుడే లభిస్తుంది. ఇంకెప్పుడూ ఉండదు. గీతాభగవానుని జ్ఞానము పురుషోత్తములుగా చేసేందుకు లభిస్తుంది, ఇంతమాత్రము అర్థము చేసుకుంటారు. కానీ ఎప్పుడు లభిస్తుందో, ఎలా లభిస్తుందో మర్చిపోయారు. గీత ధర్మస్థాపన చేసే శాస్త్రము. వేరే ఏ శాస్త్రాలు ధర్మ స్థాపనార్థముగా ఉండవు. శాస్త్రము అనే పదము కూడా భారతదేశములోనే ఉపయోగపడ్తుంది. సర్వశాస్త్ర శిరోమణి గీతయే. మిగిలిన ఆ ధర్మములన్నీ చివర్లో వచ్చేవి. వాటిని శిరోమణి అని అనరు. వృక్షపతి ఒక్క తండ్రియే అని పిల్లలకు తెలుసు. వారు మన తండ్రి, పతి కూడా అయ్యారు, అలాగే అందరికీ తండ్రి కూడా వారే. వారిని పతులకు పతి, పితలకు పిత,............ అని అంటారు. ఈ మహిమ ఒక్క నిరాకారునికి మాత్రమే గాయనము చేయబడుతుంది. కృష్ణుని మహిమను నిరాకార శివుని మహిమతో పోల్చడం జరుగుతుంది. శ్రీ కృష్ణుడు నూతన ప్రపంచములోని రాకుమారుడు. అతను పాత ప్రపంచములో సంగమ యుగములో, రాజయోగాన్ని ఎలా నేర్పించగలడు! మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. మీరు చదివి ఇలా(దేవీ-దేవతలుగా) అవుతారు. తర్వాత ఈ జ్ఞానము ఉండదు. ప్రాయ: లోపమైపోతుంది. పిండిలో ఉప్పులా అనగా కేవలం చిత్రాలు మాత్రము మిగిలిపోతాయి. వాస్తవానికి ఎవరి చిత్రాలు కూడా యథార్థమైనవి కావు. మొట్టమొదట తండ్రి పరిచయము లభిస్తే, ఇది భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు చెప్తారు. వారు స్వతహాగానే తెలియజేస్తారు. మీరు ప్రశ్నలు ఎందుకు అడుగుతారు! మొదట తండ్రిని తెలుసుకోండి అని చెప్పండి.
తండ్రి ఆత్మలకు చెప్తున్నారు - 'నన్ను స్మృతి చేయండి.' కేవలం రెండు మాటలను గుర్తుంచుకుంటే చాలు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి చాలు. ఈ రెండు ముఖ్య విషయాలనే అర్థం చేయించాలి. తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదని చెప్తున్నారు. బ్రాహ్మణ పిల్లలకే చెప్తారు, ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థము కూడా చేసుకోలేరు. ప్రదర్శనీలో ఎంత గుంపు చేరుతుందో చూడండి. ఇంతమంది మనుష్యులు వెళ్తున్నారుంటే తప్పకుండా చూడదగిన వస్తువులే ఉంటాయనుకొని వారు కూడా వస్తారు. ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేయిస్తే నోరు అలసిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రదర్శని నెల అంతా నడుస్తూ ఉంటే, ఈ రోజు చాలా రద్దీగా ఉంది, రేపు, ఎల్లుండి రండి అని చెప్పవచ్చు. కానీ ఎవరికి ఈ చదువు పై అభిరుచి ఉంటుందో లేక మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలనుకుంటారో వారికి అర్థం చేయించాలి. ఒక్క లక్ష్మీనారాయణుల చిత్రమును లేక బ్యాడ్జ్‌ను చూపించాలి. తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి అధికారులుగా అవ్వగలరు, ఇప్పుడు రద్దీగా ఉంది, సెంటర్‌కు రండి, అడ్రస్సు వ్రాయబడి ఉంది అని చెప్పండి. అంతేగాని ఇది స్వర్గము, ఇది నరకము అని అలాగే చెప్పినట్లయితే దాని నుండి మనుష్యులు ఏం అర్థము చేసుకుంటారు? సమయము వ్యర్థమైపోతుంది. వీరు గొప్పవారా, శ్రీమంతులా లేక పేదవారా? అని అలాగే గుర్తించడం సాధ్యపడదు. ఈ రోజులలో దుస్తులు మొదలైనవి ఎలా ధరిస్తారంటే, దానిని చూసి ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. మొట్టమొదట తండ్రి పరిచయమివ్వాలి. తండ్రి స్వర్గమును స్థాపన చేసేవారు ఇప్పుడిలా తయారవ్వాలి. లక్ష్యము ఎదురుగా ఉంది. తండ్రి చెప్తున్నారు - నేను అత్యంత ఉన్నతమైనవాడిని, నన్ను స్మృతి చేయండి, ఇది వశీకరణ మంత్రము. తండ్రి చెప్తారు - నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు విష్ణుపురములోకి వచ్చేస్తారు - ఇంత మాత్రమైనా తప్పకుండా అర్థము చేయించాలి. ప్రదర్శనీని 8 -10 రోజులు ఉంచాలి. మనుష్యుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. స్థాపన, వినాశనము ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని గ్రామ-గ్రామాలలో దండోరా వేయించండి. యుక్తులు చాలా ఉన్నాయి.
సత్యయుగానికి, కలియుగానికి, రాత్రింబవళ్లకున్నంత వ్యత్యాసముందని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు అంటే విష్ణు పగలు, విష్ణువుదే బ్రహ్మది. విషయము ఒక్కటే. బ్రహ్మకు కూడా 84 జన్మలు, విష్ణువుకు కూడా 84 జన్మలు ఉంటాయి. కేవలం ఈ లీప్ జన్మ మాత్రము వ్యత్యాసము వస్తుంది. ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టాలి. ధారణ జరగలేదంటే, ఇతరులకు ఎలా అర్థము చేయించగలరు? ఇది అర్థం చేయించడం చాలా సహజము. కేవలం లక్ష్మీనారాయణుల చిత్రము ముందే ఈ పాయింట్లు వినిపించండి. తండ్రి ద్వారా ఈ పదవిని పొందాలి, నరకము త్వరలో వినాశనమవ్వనున్నది. వారు తమ మానవ మతమునే వినిపిస్తారు. ఇక్కడ వినిపించేది ఈశ్వరీయ మతము. అది ఈశ్వరుని నుండే ఆత్మలైన మాకు లభించింది. నిరాకార ఆత్మలకు, నిరాకార పరమాత్ముని మతము లభిస్తుంది. మిగిలినవన్నీ మానవ మతాలు. రెండింటికి రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది కదా. సన్యాసులు, ఉదాసులు మొదలైనవారు ఎవ్వరూ ఈ మతమును ఇవ్వలేరు. ఈశ్వరీయ మతము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈశ్వరుడు ఎప్పుడు వస్తారో, అప్పుడు వారి మతము ద్వారా మనము ఇలా అవుతాము. వారు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తారు. ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి, అవే సమయానికి ఉపయోగపడ్తాయి. ముఖ్యమైన విషయము కొద్దిగా అర్థం చేయించినా చాలు, ఒక్క లక్ష్మీనారాయణుల చిత్రము పై అర్థము చేయించినా చాలు. ఇది ముఖ్య లక్ష్యమును తెలిపే చిత్రము, భగవంతుడు ఈ నూతన ప్రపంచాన్ని రచించాడు, భగవంతుడే పురుషోత్తమ సంగమయుగములో వీరిని చదివించారు. ఈ పురుషోత్తమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. కనుక ఈ విషయాలన్నీ విని పిల్లలకు ఎంత సంతోషముండాలి. విని మళ్లీ ఇతరులకు వినిపించడంలో ఇంకా ఎక్కువ సంతోషము కలుగుతుంది. సర్వీసు చేసేవారినే బ్రాహ్మణులని అంటారు. మీ చంకలో సత్యమైన గీత ఉంది. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. కొందరు బ్రాహ్మణులు చాలా ప్రసిద్ధమైనవారిగా ఉంటారు. చాలా సంపాదిస్తారు. కొందరికి తినేందుకు కూడా చాలా కష్టంగా లభిస్తుంది. కొందరు బ్రాహ్మణులు లక్షాధికారులుగా ఉంటారు. మేము బ్రాహ్మణులము అని చాలా ఖుషీగా, నషాతో చెప్తారు. సత్యమైన బ్రాహ్మణ కులము గురించి తెలియనే తెలియదు. బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు, అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాల వారికి ఎప్పుడూ తినిపించరు, బ్రాహ్మణులకే తినిపిస్తారు. అందుకే మీరు బ్రాహ్మణులకు బాగా అర్థము చేయించమని తండ్రి చెప్తున్నారు. బ్రాహ్మణుల సంగఠన కూడా ఉంటుంది. వారు ఎక్కడ ఉండేది తెలుసుకొని అక్కడకు వెళ్లాలి. బ్రాహ్మణులు అంటే ప్రజాపిత బ్రహ్మ సంతానమై ఉండాలి, మేము వారి సంతానము అని వారికి చెప్పాలి. బ్రహ్మ ఎవరి పుత్రుడో కూడా అర్థం చేయించాలి. ఎక్కడెక్కడ వారి సంగఠన జరుగుతుందో తెలుసుకోవాలి. మీరు అనేకమందికి కళ్యాణము చేయగలరు. వానప్రస్థ స్త్రీల సభలు కూడా ఉంటాయి. ఎక్కడెక్కడకు వెళ్లారో బాబాకు ఎవ్వరూ సమాచారాన్ని ఇవ్వరు. ఇది పూర్తి అడవిగా ఉంది, మీరు ఎక్కడకు వెళ్లినా వేటాడి రాగలరు, ప్రజలను తయారుచేసుకొని రాగలరు, రాజులను కూడా తయారు చేయగలరు. సర్వీసేమో చాలా ఉంది. సాయంకాలము 5 గంటలకు శెలవు లభిస్తుంది, ఈ రోజు ఇక్కడిక్కడకు వెళ్లాలని లిస్టులో నోట్ చేసుకోవాలి. బాబా యుక్తులైతే చాలా తెలియజేస్తారు. తండ్రి పిల్లలతోనే మాట్లాడ్తారు. నేను ఆత్మను, నా తండ్రి(పరమాత్మ) నాకు వినిపిస్తున్నారు, నేను ధారణ చేయాలని పక్కా నిశ్చయముండాలి. ఉదాహరణానికి శాస్త్రాలను అధ్యయనము చేసేవారు ఆ సంస్కారాన్నే తీసుకెళ్తారు. మరుసటి జన్మలో కూడా అదే సంస్కారము ఉత్పన్నమవుతుంది. సంస్కారాన్ని తీసుకొచ్చారని అంటారు. ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వారిని అథ¸ారిటీ అని అంటారు. వారు స్వయాన్ని ఆల్‌మైటీ అథారిటీ(సర్వశక్తివంతులు) అని భావించరు. ఇది ఆట. దీనిని గురించి తండ్రే అర్థం చేయిస్తున్నారు - క్రొత్త విషయమేమీ కాదు. ఇది తయారైన డ్రామా. దీనిని అర్థము చేసుకోవాలి. ఇది పాత ప్రపంచమని మనుష్యులు అర్థము చేసుకోరు. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చేశాను, మహాభారత యుద్ధము ఎదురుగా నిలిచి ఉంది. మనుష్యులు అజ్ఞానాంధకారములో నిద్రిస్తున్నారు. భక్తినే అజ్ఞానమని అంటారు. జ్ఞానసాగరులు తండ్రి మాత్రమే. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో, వారు భక్తిసాగరులు. భక్తి మాల కూడా ఉంది కదా. భక్త మాలలోని పేర్లు కూడా పోగు చేయాలి. భక్తమాల ద్వాపరము నుండి కలియుగము వరకే ఉంటుంది. పిల్లలకు చాలా సంతోషముండాలి. ఎవరు పూర్తి రోజంతా సర్వీసు చేస్తూ ఉంటారో, వారికి చాలా సంతోషముంటుంది.
బాబా అర్థం చేయించారు - మాల వేల సంఖ్యలో చాలా పెద్దదిగా ఉంటుంది. దానిని కొందరు ఒక దగ్గర నుండి, కొందరు మరొక దగ్గర నుండి లాగుతూ జపము చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద మాలను ఎందుకు తయారుచేశారు, ఏదో ఉంటుంది కదా. నోటి ద్వారా రామ - రామ అని అంటూ ఉంటారు. రామ-రామ అని ఎవరిని స్మృతి చేస్తున్నారు? అని కూడా ప్రశ్నించవలసి ఉంటుంది. మీరు ఎక్కడైనా సత్సంగాలు మొదలైన వాటికి వెళ్లి వారితో చేరి కూర్చోవచ్చు. ఎక్కడ సత్సంగము జరిగేదో, అక్కడ చెప్పుల వద్ద వెళ్లి కూర్చునేవారని హనుమంతుని ఉదాహరణ ఉంది కదా. మీరు కూడా అవకాశాన్ని తీసుకోవాలి. మీరు చాలా సర్వీసు చేయగలరు. ఎప్పుడు జ్ఞాన పాయింట్లు బుద్ధిలో ఉంటాయో, జ్ఞానములో మస్త్‌గా(మునిగి) ఉంటారో, అప్పుడే సర్వీసులో సఫలత లభిస్తుంది. సర్వీసుకు అనేక యుక్తులున్నాయి, రామాయణము, భాగవతము మొదలైన వాటి విషయాలు కూడా అనేకమున్నాయి. వీటి పైన మీరు దృష్టిని ఉంచవచ్చు. కేవలం అంధ విశ్వాసముతో కూర్చొని సత్సంగము చేయరాదు, మేము మీ కళ్యాణము చేయాలనుకుంటున్నాము అని వారికి చెప్పండి. ఆ భక్తి పూర్తి భిన్నమైనది, ఈ జ్ఞానము వేరు. జ్ఞానము ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రి మాత్రమే ఇస్తారు. సేవ ఏమో చాలా ఉంది. కేవలం అత్యంత ఉన్నతమైనవారు ఎవరో తెలియజేయండి. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క భగవంతుడే, వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. మిగిలినవారంతా వారి రచన. పిల్లలకు సర్వీసు చేయాలనే ఆసక్తి ఉండాలి. మీరు రాజ్యపాలన చేయాలంటే, ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే అంత మతి సో గతి అయిపోతుంది అను ఈ మహామంత్రము తక్కువైనదేమీ కాదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఏ వశీకరణ మంత్రమునిచ్చారో, దానిని అందరికీ స్మృతినిప్పించాలి. సర్వీసు కొరకు రకరకాల యుక్తులను రచించాలి. గుంపులో మీ సమయాన్ని వ్యర్థము చేసుకోరాదు.
2. జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానములో మస్త్‌గా(మునిగి) ఉండాలి. హనుమంతుని వలె సత్సంగాలకు వెళ్లి కూర్చోవాలి. విన్న తర్వాత వారికి సేవ చేయాలి. సంతోషంగా ఉండేందుకు పూర్తి రోజంతా సేవ చేస్తూ ఉండాలి.
వరదానము :- '' శ్రేష్ఠ సంకల్పాల సహయోగము ద్వారా అందరిలో శక్తిని నింపే శక్తిశాలి ఆత్మా భవ ''
సదా శక్తిశాలి భవ అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకొని శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సర్వ ఆత్మలలో బలాన్ని నింపే సేవ చేయండి. ఎలాగైతే ఈ రోజులలో సౌర శక్తిని జమ చేసి అనేక కార్యాలను సఫలము చేస్తున్నారో, అలా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఎంత జమ చేసుకోవాలంటే ఇతరుల సంకల్పాలలో శక్తిని నింపండి. ఈ సంకల్పాలు ఇంజెక్షన్ చేసే పని చేస్తాయి. దీని ద్వారా లోపల వృత్తిలో శక్తి వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు శ్రేష్ఠ భావన లేక శ్రేష్ఠ సంకల్పము ద్వారా పరివర్తన చేసే సేవ అవసరముంది.
స్లోగన్ :- '' మాస్టర్ దు:ఖహర్తలుగా అయి దు:ఖాన్ని కూడా ఆత్మిక సుఖములోకి పరివర్తన చేయడమే మీ శ్రేష్ఠ కర్తవ్యము ''
No comments:
Post a Comment