24-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు అశరీరులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే, మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది, దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు ''
ప్రశ్న :- తండ్రి ద్వారా పిల్లలందరికి జ్ఞాన(మూడవ) నేత్రము ఎందుకు లభించింది?
జవాబు :- స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో, ఎలా ఉంటారో, అదే రూపములో స్మృతి చేసేందుకు మూడవ నేత్రము లభించింది. కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రము పని చేస్తుంది. ఎవరి నామ-రూపాలలో చిక్కుకొని ఉండరాదు. పరమాత్మను ప్రేమించడంలోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది. ఇందులోనే పిల్లలు మోసపోతారు.
ఓంశాంతి. బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ పాటను అర్థము చేసుకోలేరు. ఉదాహరణానికి వేదశాస్త్రాలు మొదలైనవి తయారు చేశారు. కానీ చదివిన వాటిని అర్థము చేసుకోలేరు. అందుకే తండ్రి అంటున్నారు - నేను బ్రహ్మ నోటి ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. అలాగే ఈ పాటలను కూడా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. తండ్రి మాత్రమే ఈ పాటల అర్థము తెలుపుచున్నారు. ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోతే దానికి ఈ ప్రపంచముతో గల సంబంధాలన్నీ తెగిపోతాయి. పాటలో కూడా స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచము సమాప్తమైపోతుందని చెప్తారు. ఈ శరీరము ఈ భూమి పై ఉంది. ఆత్మ దీని నుండి వెళ్లిపోతే అప్పుడు దాని కొరకు మనుష్య సృష్టియే లేదు. ఆత్మ శరీరము లేకుండా నగ్నంగా అయిపోతుంది. మళ్లీ శరీరములోకి వచ్చినప్పుడు పాత్ర ప్రారంభమవుతుంది. మళ్లీ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరములోకి ప్రవేశిస్తుంది. వాపస్ మహాతత్వములోకి వెళ్లదు. అది ఎగిరి మరో శరీరములోకి పోతుంది. ఇక్కడ ఈ ఆకాశ తత్వములోనే అది పాత్రను అభినయించాలి. మూలవతనములోకి వెళ్లదు. శరీరము వదిలినప్పుడు ఈ కర్మ బంధనమూ ఉండదు, ఆ కర్మ బంధనమూ ఉండదు. శరీరము నుండి వేరైపోతుంది కదా. మళ్లీ మరో శరీరము తీసుకోగానే అక్కడ కర్మబంధనము ప్రారంభమవుతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఏ మనుష్యులకు తెలియదు. అందరూ పూర్తిగా తెలివిహీనులుగా ఉన్నారని తండ్రి అర్థము చేయించారు. కానీ ఇలా ఉన్నామని ఎవ్వరూ భావించరు. స్వయాన్ని ఎంతో తెలివిగలవారమని భావిస్తారు. శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇది కూడా బ్రాహ్మణ కులభూషణులైన మీరు మాత్రమే మంచిరీతిగా అర్థము చేయించగలరు. అసలు వారికి శాంతి అంటే ఏమిటో తెలియదు. కొంతమంది అయితే ఎవరైనా మహాత్ముల వద్దకు వెళ్ళి మన:శాంతి ఎలా కలుగుతుందని అడుగుతారు. ఈ ప్రపంచములో శాంతి ఎలా ఏర్పడ్తుందని అడుగుతారు. కానీ నిరాకార ప్రపంచములో శాంతి ఎలా లభిస్తుందని అనరు. అది అయిందే శాంతిధామము. ఆత్మలైన మనము శాంతిధామములో ఉంటాము. కాని దీనిని మన:శాంతి అని అంటారు. శాంతి ఎలా లభిస్తుందో వారికి తెలియదు. శాంతిధామమైతే అది మన ఇల్లు. ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది? సత్యయుగంలో సుఖము-శాంతి సంపదలు అన్నీ ఉంటాయి. దానిని తండ్రి స్థాపన చేస్తున్నారు. ఇక్కడ ఎంతో అశాంతి ఉంది. ఇవన్నీ ఇప్పుడు పిల్లలైన మీరే అర్థము చేసుకోగలరు. సుఖము-శాంతి-సంపదలు భారతదేశములోనే ఉండేవి. అవి తండ్రి ఇచ్చిన వారసత్వము. దుఃఖము, అశాంతి, పేదరికము రావణుని వారసత్వము. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి పరంధామ నివాసులు జ్ఞానసాగరులు, వారు మనకు సుఖధామమును వారసత్వంగా ఇస్తారు. వారు ఆత్మలైన మనకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఆత్మలో జ్ఞానముంటుందని మీకు తెలుసు. వారినే జ్ఞానసాగరులని అంటారు. ఆ జ్ఞాన సాగరులు ఈ శరీరము ద్వారా ప్రపంచ చరిత్ర-భూగోళాలు(హిస్టరి జాగ్రఫి) అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా. ప్రపంచము సదా ఉండనే ఉంటుంది. కేవలం నూతన ప్రపంచము, పాత ప్రపంచము అనబడ్తాయి. నూతన ప్రపంచము నుండి పాత ప్రపంచంగా అయ్యేందుకు ఎంత సమయము పడ్తుందో కూడా మనుష్యులకు తెలియదు.
కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అందుకే కలియుగము, సత్యయుగ సంగమంలో తండ్రి రావలసి వచ్చింది. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన, శంరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము చేయిస్తారని కూడా మీకు తెలుసు. త్రిమూర్తి అర్థమేమంటే స్థాపన, వినాశనము మరియు పాలన, ఇది సాధారణ విషయము. కానీ ఈ విషయాలు పిల్లలైన మీరు మర్చిపోతారు. లేకుంటే మీకు చాలా ఖుషీ ఉండాలి. నిరంతరము ఈ స్మృతి ఉండాలి. బాబా మనలను నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తున్నారు. భారతీయులు అయిన మీరే అర్హులుగా అవుతారు, ఇతరులెవ్వరూ అవ్వరు. ఎవరైతే వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారో వారు రావచ్చు. అందులోకి మారినట్లు ఇప్పుడు మళ్లీ ఇందులోకి మారిపోతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచము ఇప్పుడు పరివర్తనౌతుందని మనుష్యులకు అర్థం చేయించాలి. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ సమయశలోనే బాబా వచ్చి రాజయోగము నేర్పిస్తారు. ఎవరైతే రాజయోగము నేర్చుకుంటారో, వారు నూతన ప్రపంచములోకి వెళ్లిపోతారు. భగవంతుడు ఉన్నతోన్నతుడని, ఆ తర్వాత బ్రహ్మ-విష్ణు-శంకరులు, ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమైనవారు జగదంబ-జగత్పిత అని మీరు అందరికీ అర్థము చేయించగలరు. తండ్రి వచ్చేది ఇక్కడే, బ్రహ్మ శరీరములో వస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన సూక్ష్మవతనములో అయితే జరగదు కదా. ఇక్కడే జరుగుతుంది. ఇతను వ్యక్తము నుండి అవ్యక్తమైపోతాడు. ఈ రాజయోగాన్ని నేర్చుకుని మళ్లీ విష్ణువు రెండు రూపాలుగా అవుతారు. ప్రపంచ చరిత్ర-భూగోళాన్ని అర్థము చేసుకోవాలి కదా. అర్థము చేసుకునేది మనుష్యులే. ప్రపంచానికి యజమానియే ప్రపంచ చరిత్ర-భూగోళాలు అర్థము చేయించగలరు. వారు జ్ఞానసాగరులు పునర్జన్మ రహితులు. ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు. పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా. బుద్ధిలో ఏమైనా కొంచెమైనా కూర్చుంటుందా లేక అలాగే ఉన్నారా? అని నాడి చూడాలి. అజ్‌మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు. రోగిని చూసినంతనే అతనికి వ్యాధి గురించి అర్థమైపోయేదని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా వీరు యోగ్యులా ? కాదా? అని అర్థము చేసుకోవాలి.
తండ్రి పిల్లలకు జ్ఞాన మూడవ నేత్రమునిచ్చారు. దాని వలన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో వారిని అదే రూపములో స్మృతి చేస్తారు. కాని పూర్తిగా యోగయుక్తంగా ఉన్నవారికే ఇటువంటి బుద్ధి ఉంటుంది. వారు తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు. అందరూ అలా లేరు కదా. పరస్పరము నామ-రూపాలలో తగుల్కొని ఉంటారు. తండ్రి అంటున్నారు - మీ ప్రీతి నా పై ఉంచండి. కానీ మాయ ప్రీతిని నా పై ఉండనివ్వదు. మా గిరాకీ పోతుందని మాయ కూడా గమనిస్తుంది. వారి ముక్కు, చెవిని గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది. మోసపోయినప్పుడు మాయతో ఓడిపోయానని అర్థము చేసుకుంటారు. మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవ్వలేరు. ఉన్నత పదవిని పొందలేరు. ఇందులోనే శ్రమ ఉంది. నన్నొక్కరినే స్మృతి చేస్తే(మామేకం యాద్ కరో తో) మీ పతిత బుద్ధి పావనంగా అవుతుందని శ్రీమతము చెప్తుంది. కానీ చాలామందికి చాలా కష్టమనిపిస్తుంది. ఇందులో ఉండేది ఒక సబ్జక్టే. అల్ఫ్(బాబా) మరియు బే(ఆస్తి). రెండు పదాలు కూడా స్మృతి చేయలేరు. అల్ఫ్‌ను స్మృతి చేయండి అని బాబా చెప్తే తమ దేహాన్ని ఇతరుల దేహలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహాన్ని చూస్తున్నా మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తారు. ఆత్మకు ఇప్పుడు మూడవ నేత్రము లభించింది. నన్ను చూచేందుకు, అర్థము చేసుకునేందుకు మూడవ నేత్రమును ఉపయోగించండి. పిల్లలైన మీరు ఇప్పుడు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు కాని త్రికాలదర్శులు కూడా నంబరువారుగా ఉన్నారు. జ్ఞానము ధారణ చేయడం కష్టమేమీ కాదు. చాలా బాగా అర్థము చేసుకుంటారు. కానీ యోగబలము తక్కువగా ఉంది. చాలా తక్కువ మంది దేహీ-అభిమానులుగా అయ్యారు. చిన్న విషయాలకే కోపము వచ్చేస్తుంది. క్రింద పడుతూ ఉంటారు. పైకి లేస్తూ, క్రిందపడ్తూ ఉంటారు. ఈ రోజు లేచి మళ్లీ రేపు క్రింద పడ్తారు. ముఖ్యమైనది దేహాభిమానము. ఆ తర్వాత ఇతర వికారాలు, లోభము, మోహము మొదలైన వాటిలో చిక్కుకొని పోతారు. దేహము పై కూడా మోహముంటుంది కదా. మాతలలో మోహము ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి దాని నుండి విడిపిస్తారు. మీకు బేహద్ తండ్రి లభించి ఉన్నా మోహమెందుకు ఉంచుకుంటారు? ఆ సమయములో ముఖము, మాటలు, వ్యవహారము అన్నీ కోతి వలె మారిపోతాయి. తండ్రి అంటున్నారు - నిర్మోహులుగా అవ్వండి. నిరంతరం నన్ను స్మృతి చేయండి. తల పై పాప భారము చాలా ఉంది. అది ఎలా దిగిపోవాలి ? కాని మాయ ఎటువంటిదంటే స్మృతి చేయనివ్వదు. ఎంత తలబాదుకున్నా మాటిమాటికి బుద్ధిని మరపింపజేస్తుంది. ఎంతో ప్రయత్నిస్తారు. బాబా మేము మీ వద్దకు వచ్చేస్తామని అత్యంత ప్రియమైన బాబానే మహిమ చేస్తూ ఉండాలి, కాని మర్చిపోతామని పిల్లలు అంటారు. బుద్ధి ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. నంబర్‌వన్‌లోకి పోయే ఇతను కూడా పురుషార్థియే కదా.
మనము గాడ్‌ఫాదర్(పరమాత్మ) విద్యార్థులమని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. గీతలో కూడా భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తానని ఉంది. కేవలం శివునికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. వాస్తవానికి శివబాబా జయంతి ప్రపంచమంతా జరుపుకోవాలి. శివబాబా అందరినీ దుఃఖము నుండి ముక్తులుగా చేసి, మార్గదర్శకుడై తీసుకెళ్తాడు. వారు ముక్తిదాత, మార్గదర్శకులు అని అందరూ అంగీకరిస్తారు. సర్వుల పతితపావనులు ఆ తండ్రియే. అందరినీ శాంతిధామము, సుఖధామాలకు తీసుకెళ్లేవారు. అటువంటప్పుడు వారి జయంతిని ఎందుకు జరుపరు? భారతీయులే జరుపుకోవడం లేదు. అందుకే భారతదేశానికి ఈ దుర్గతి పట్టింది. మృత్యువు కూడా దుర్గతి వల్లనే కలుగుతుంది. వారు తయారు చేయు బాంబుల నుండి గ్యాస్ వచ్చి అందరూ క్లోరోఫార్మ్ తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది కూడా వారు తయారు చేసే తీరాలి. మానేయడం అసాధ్యము. కల్పక్రితము జరిగినదంతా ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మిస్సైల్స్ మరియు ప్రకృతి భీభత్సాల ద్వారా పాత ప్రపంచము ఎలా నాశమయిందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. వినాశన సమయము ఎప్పుడు వస్తుందో అప్పుడు డ్రామా ప్లాను అనుసారం వినాశనము పాత్రలోకి రానే వస్తుంది. డ్రామా తప్పకుండా వినాశనము చేయిస్తుంది. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. అంత: కలహాలలో ఒకరినొకరు చంపుకుంటారు కదా. ఈ ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని, ఇప్పుడు మనము సుఖదామానికి వెళ్తామని మీలో కూడా కొంతమందికే తెలుసు. అందువలన సదా జ్ఞానము ద్వారా అతీంద్రియ సుఖము అనుభవిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో, అంత సుఖము పెరుగుతూ ఉంటుంది. ఛీ-ఛీ దేహము నుండి నిర్మోహులుగా అవుతూ ఉంటారు. తండ్రి కేవలం ఒక్కటి మాత్రమే చెప్తున్నారు - అల్ఫ్‌ను(పరమాత్మను) స్మృతి చేస్తే బే(చక్రవర్తి పదవి) మీదే. ఒక్క సెకెండులోనే చక్రవర్తి పదవి. చక్రవర్తికి పుత్రుడు జన్మిస్తే, ఆ పుత్రుడు కూడా చక్రవర్తే అవుతాడు కదా. అందువలన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తూ, చక్రమును స్మృతి చేస్తూ ఉంటే చక్రవర్తి మహారాజులుగా అవుతారు. అందుకే సెకెండులోనే జీవన్ముక్తి, సెకెండులోనే భికారి నుండి రాకుమారుడు అని గాయనముంది. ఎంత బాగుంది! అందుకే మీరు శ్రీమతమును బాగా అనుసరించాలి. అడుగడుగునా సలహా తీసుకోవాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! ట్రస్టీ(నిమిత్తము)గా ఉంటే మమకారము తొలగిపోతుంది. కానీ ట్రస్టీగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు(సులభం కాదు). ఇతను స్వయం ట్రస్టీగా అయ్యాడు. పిల్లలను కూడా ట్రస్టీలుగా చేస్తాడు. వీరు మీ వద్ద ఏమైనా తీసుకుంటారా? మీరు ట్రస్టీగా ఉండి సంభాళించండి అని చెప్తారు. ట్రస్టీగా అయితే మమకారము తొలగిపోతుంది. అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు. కానీ ఏదైనా నష్టము సంభవించినా, ఎవరైనా మరణించినా, దు:ఖపడి జబ్బుపడినట్లవుతారు. లభిస్తే సంతోషిస్తారు. అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు కదా. మరి ఎవరైనా మరణిస్తే ఏడ్చే అవసరమేముంది? కానీ మాయ తక్కువైనది కాదు. పిన్నమ్మ ఇల్లేమీ కాదు. ఈ సమయంలో తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను పిలిచారు ఎందుకంటే ఈ పతిత ప్రపంచములో మాకు ఉండాలని లేదు. పావన ప్రపంచములోకి తీసుకెళ్ళమని పిలిచారు. వెంట తీసుకెళ్లమన్నారు. కానీ దీని అర్థము కూడా తెలియదు. పతిత పావనుడు వస్తే శరీరాలు తప్పకుండా సమాప్తమవుతాయి కదా. అప్పుడే కదా ఆత్మలను తన వెంట తీసుకెళ్లగలడు. అటువంటి తండ్రి పై చాలా ప్రీతిబుద్ధి కలిగి ఉండాలి. ఒక్కరినే ప్రేమించాలి. వారినే స్మృతి చేయాలి. మాయ కల్పించే తుఫానులైతే వస్తూనే ఉంటాయి. కర్మేంద్రియాలతో ఏ వికర్మా చేయరాదు. అది నియమ విరుద్ధమౌతుంది. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. ఇది ఇతని శరీరము కదా. కానీ మీరు తండ్రిని స్మృతి చేయాలి. బ్రహ్మ కూడా బాబాయే, శివుడు కూడా బాబాయే అని మీకు తెలుసు. విష్ణువును, శంకరుని బాబా అని అనరు. శివుడు, నిరాకార తండ్రి. ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి. ఇప్పుడు సాకారము ద్వారా నిరాకార తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నారు. దాదా(తాత) ఇతని శరీరములో ప్రవేశించినప్పుడు వారసత్వము తండ్రి ద్వారా తీసుకున్నామని అంటారు. దాదా అనగా తాత, నిరాకారులు. తండ్రి సాకారులు. ఇవన్నీ అద్భుతమైన నూతన విషయాలు కదా. త్రిమూర్తిని చూపిస్తారు. కానీ వారెవరో తెలియదు. శివుని మర్చిపోయారు. తండ్రి ఎంతో మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తారు. కనుక ఎంత ఖుషీ ఉండాలి! మనము విద్యార్థులము. బాబా మనకు తండ్రి, టీచరు, సద్గురువు. ఇప్పుడు మీరు ప్రపంచ చరిత్ర - భూగోళము అనంతమైన తండ్రి ద్వారా వింటున్నారు. తర్వాత ఇతరులకు వినిపిస్తారు. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. కాలేజి విద్యార్థులకు కూడా ప్రపంచ చరిత్ర-భూగోళము అర్థము చేయించాలి. అంతేకాక 84 జన్మల సీఢీ(మెట్లు)ని గురించి, భారతదేశ ఉన్నతి, అవనతి ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాలి. క్షణములో భారతదేశము స్వర్గమైపోతుంది, మళ్లీ 84 జన్మలలో భారతదేశము నరకంగా అవుతుంది. ఇవి చాలా సహజంగా అర్థము చేసుకునే విషయాలు. భారతదేశము గోల్డన్ ఏజ్ (స్వర్ణిమ యుగము) నుండి ఐరన్ ఏజ్(ఇనుపయుగము)లోకి ఎలా వచ్చిందో భారతవాసులకు అర్థం చేయించాలి. టీచర్లకు కూడా అర్థం చేయించాలి. అది భౌతిక జ్ఞానము, ఇది ఆత్మిక జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనుష్యులు ఇస్తారు, ఈ జ్ఞానాన్ని గాడ్‌ఫాదర్ ఇస్తారు. వారు ఈ మానవ సృష్టికి బీజరూపులు. అందువలన వారి వద్ద మానవ సృష్టిని గురించిన జ్ఞానమే ఉంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్
లగావ్(ఆకర్షించే) దారాలను చెక్ చేసుకోండి. బుద్ధి ఎక్కడా బలహీన దారాలలో కూడా చిక్కుకొని లేదు కదా. ఎలాంటి సూక్ష్మబంధనం కూడా ఉండరాదు. స్వంత దేహం పై కూడా లగావ్(ఆకర్షణ) ఉండరాదు. ఇలా స్వతంత్రులుగా అనగా ఫస్ట్‌గా అయ్యేందుకు బేహద్ వైరాగ్యము గలవారిగా అవ్వండి. అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులై ఉండగలరు.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ ఛీ-ఛీ దేహము నుండి పూర్తిగా నిర్మోహులై జ్ఞానము వలన కలిగే అతీంద్రియ సుఖములో ఉండాలి. ఇప్పుడీ ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని, మనము మన సుఖధామానికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి.
2. ట్రస్టీగా అయి అన్నీ సంభాళిస్తూ మమకారాన్ని తొలగించుకోవాలి. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతినుంచాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయరాదు.
వరదానము :- '' సర్వ కర్మేంద్రియాల ఆకర్షణకు దూరంగా కమలపుష్ప సమానంగా ఉండే దివ్యబుద్ధి మరియు దివ్యనేత్రాల వరదానీ భవ ''
బాప్‌దాదా ద్వారా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు జన్మిస్తూనే దివ్య సమర్థ బుద్ధి, దివ్య నేత్రాల వరదానం లభించింది. ఏ పిల్లలైతే తమ తమ జన్మదిన కానుకను సదా యథార్థ రీతిగా ఉపయోగిస్తారో, వారు కమలపుష్ప సమానం శ్రేష్ఠ స్థితి అనే ఆసనం పై స్థితులై ఉంటారు. ఏ విధమైన ఆకర్షణ, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు లేక ఏ కర్మేంద్రియమూ వారిని ఆకర్షించలేవు. వారు అన్ని ఆకర్షణలకు దూరంగా సదా హర్షితంగా ఉంటారు. వారు స్వయాన్ని కలియుగ పతిత వికారి ఆకర్షణలను దాటుకున్నట్లు అనుభవం చేస్తారు.
స్లోగన్ :- '' ఎప్పుడైతే ఎక్కడా ఆకర్షణ ఉండదో, అప్పుడు శక్తి స్వరూపము ప్రత్యక్షమౌతుంది. ''
No comments:
Post a Comment