Saturday, January 4, 2020

Telugu Murli 03/01/2020

03-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మిమ్ములను స్వచ్ఛ బుద్ధిగలవారిగా చేసేందుకు బాబా వచ్చారు, స్వచ్ఛ బుద్ధి గలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవ్వగలరు''

ప్రశ్న :- బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారుచేయబడి ఉన్న ప్రణాళిక ఏది ?
జవాబు :- ప్రతి కల్పము బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి, పతితులుగా, దు:ఖితులుగా అయిన తన పిల్లలను సుఖీలుగా చేసే తీరాలి - డ్రామాలో ఈ ప్లాను రచింపబడి ఉంది. ఈ బంధనము నుండి తండ్రి కూడా తప్పించుకోలేరు.

ప్రశ్న :- చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏది ?
జవాబు :- వారు చాలా నిరహంకారులగా అయి పతిత ప్రపంచములో, పతిత తనువులో వస్తారు. తండ్రి ఈ సమయంలో మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. మీరు మళ్లీ ద్వాపరములో వారి కొరకు స్వర్ణిమ మందిరాలు కట్టిస్తారు.

పాట :- ఈ పాప ప్రపంచము నుండి,...........(ఇస్‌ పాప్‌ కీ దునియా సే,.........)
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి పాప ప్రపంచము, మరొకటి పుణ్య ప్రపంచము. దు:ఖ ప్రపంచము, సుఖ ప్రపంచము. సుఖము తప్పకుండా నూతన ప్రపంచములో, కొత్త ఇంటిలోనే ఉంటుంది. పాత ఇంటిలో దు:ఖమే ఉంటుంది. కనుక దానిని అంతం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ఇంటిలో సుఖంగా ఉంటారు. భగవంతుని గూర్చి ఏ మనుష్య మాత్రులెవ్వరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. రావణ రాజ్యమైనందున పూర్తిగా రాతి బుద్ధి గలవారిగా, తమోప్రధానమైన బుద్ధి గలవారిగా అయ్యారు. నన్ను భగవంతుడని అంటారు కాని నా గురించి ఎవ్వరికీ తెలియదని తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. భగవంతుని గురించి తెలుసుకోలేదంటే దేనికీ పనికిరారు. దు:ఖములోనే ఓ ప్రభూ! ఓ ఈశ్వరా! అని పిలుస్తారు కాని విచిత్రమేమంటే ఒక్క మనిషికి కూడా రచయిత అయిన బేహద్‌ తండ్రిని గురించి తెలియదు. సర్వవ్యాపి అని, చేపలో, తాబేలులో పరమాత్మ ఉన్నారని చెప్తారు. ఇలా పరమాత్మను నిందిస్తారు. తండ్రిని ఎంత అగౌరవపరుస్తారు. కనుక భగవానువాచ - ఎప్పుడైతే భారతదేశములో నన్ను, దేవీదేవతలను నిందిస్తూ నిందిస్తూ మెట్లు దిగుతూ తమోప్రధానంగా అవుతారో అప్పుడు నేను వస్తాను. డ్రామానుసారంగా ఈ పాత్రలో మళ్లీ రానే రావలసి ఉంటుందని పిల్లలంటారు. ఇది తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు. నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను. నేను పతితులను పావనంగా చేసేందుకు నేను తప్పకుండా రావలసి ఉంటుంది. లేకుంటే నూతన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు. పిల్లలను రావణ రాజ్యములోని దు:ఖముల నుండి విడిపించి నూతన ప్రపంచానికి ఎవరు తీసుకెళ్తారు? ఈ ప్రపంచములో చాలా ధనవంతులైన మనుష్యులున్నారు. ధనము, భవనాలు, విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. కాని అకస్మాత్తుగా అనారోగ్యము పాలవుతారు. కూర్చుని ఉండగానే మరణిస్తారు. ఎంత దు:ఖము కలుగుతుంది. సత్యయుగములో అకాలమృత్యువులే ఉండవని దు:ఖము అనే మాటే ఉండదని వారికి తెలియదు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు. సత్యయుగములో ఇలాంటి విషయాలు ఉండవు. అక్కడ ఏముంటాయో కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎంత తుచ్ఛ బుద్ధిగలవారని తండ్రి అంటారు. నేను వచ్చి వారిని స్వచ్ఛ బుద్ధిగలవారిగా చేస్తాను. రావణుడు రాతిబుద్ధి, తుచ్ఛబుద్ధి గలవారిగా చేస్తాడు. భగవంతుడు స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేస్తున్నారు. బాబా మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా చేస్తున్నారు. మేము సూర్యవంశీ మహారాజు-మహారాణిగా అయ్యేందుకు వచ్చామని పిల్లలందరూ అంటారు. ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఇది సత్యనారాయణుని కథ. భక్తిమార్గములో బ్రాహ్మణులు కథను వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఎవ్వరూ నరుని నుండి నారాయణునిగా అవ్వరు. మీరైతే వాస్తవంగా నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. మీ సంస్థ ఉద్ధేశ్యము ఏమిటి? అని కొందరు ప్రశ్నిస్తారు. నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మా ఉద్ధేశ్యము అని చెప్పండి. కాని ఇది ఒక సంస్థ కాదు. ఇది పరివారము. తల్లి, తండ్రి, పిల్లలు కూర్చొని ఉన్నారు. భక్తిమార్గములో మీరే తల్లి, తండ్రి,............. అని పాడేవారు. హే మాతా-పితా! మీరు ఎప్పుడు వస్తారో, అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖము పొందుతాము. మేము విశ్వాధిపతులుగా అవుతామని పాడేవారు. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖము పొందుతాము. ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా. అది కూడా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అలాంటి తండ్రిని చూస్తూనే ఖుషీ ఎంతగా పెరగాలి. ఓ భగవంతుడా! రండి. మీరు వచ్చినట్లైతే మేము మీ నుండి చాలా సుఖాన్ని పొందుతాము అని అర్ధకల్పము నుండి వారిని స్మృతి చేశారు. ఈ అనంతమైన తండ్రి 21 జన్మలకు అనంతమైన వారసత్వమునిస్తారు. బాబా చెప్తారు - నేను మిమ్ములను దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాను, రావణుడు ఆసురీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాడు. నేను ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. అక్కడ పవిత్రత కారణంగా ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు భోగులు, అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. అక్కడ యోగము ద్వారా వారసత్వం లభించి ఉంటుంది. ఆయువు కూడా 150 సంవత్సరాలుంటుంది. తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రియే కూర్చొని ఇస్తారు. భక్తులు భగవంతుని వెతుకుతారు. శాస్త్రాలు చదవడం, తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ భగవంతుని మిలనము చేసే మార్గాలని భావిస్తారు. ఇవి మార్గాలే కావు. మార్గాన్ని నేనే తెలియచేస్తానని తండ్రి చెప్తారు. అంధుల చేతికి ఉతకర్రలాంటి ఓ ప్రభూ! రండి మమ్ములను శాంతిధామము, సుఖధామాలకు తీసుకెళ్ళండని మీరు అనేవారు కనుక తండ్రియే సుఖధామానికి మార్గాన్ని తెలియచేస్తారు. తండ్రి ఎప్పుడూ దు:ఖాన్ని ఇవ్వరు. ఇలా బాబా పై అసత్య కళంకాన్ని(నేరాన్ని) ఆపాదిస్తారు. ఎవరైనా మరణించినట్లైతే భగవంతున్ని నిందించడం ప్రారంభిస్తారు. నేను ఎవ్వరినీ చంపను, దు:ఖాన్ని ఇవ్వను. ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమ తమ పాత్ర ఉంటుందని బాబా చెప్తారు. నేను ఏ రాజ్యాన్ని స్థాపన చేస్తానో అక్కడ అకాలమృత్యువులు, దు:ఖము మొదలైనవి ఎప్పుడూ ఉండవు. నేను మిమ్ములను సుఖధామానికి తీసుకెళ్తాను. ఓహో బాబా! మమ్ములను పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని పిల్లలు రోమాంచితులవ్వాలి(పులకించిపోవాలి). సంగమయుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారని మనుష్యులకు తెలియదు. భక్తిమార్గములో భక్తులు కూర్చుని పురుషోత్తమ మాసము మొదలైనవి తయారు చేశారు. వాస్తవానికి తండ్రి వచ్చి ఉన్నతాతి ఉన్నతులుగా తయారుచేసే ఈ సమయమే పురుషోత్తమ యుగము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అందరికన్నా సర్వ శ్రేష్ఠ పురుషోత్తములు లక్ష్మీనారాయణులే. మనుష్యులకు ఏమీ అర్థం కాదు. ఉన్నతకళలోకి తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే. మెట్ల(సీఢీ) గురించి ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు ఆట పూర్తి అయ్యింది, ఇంటికి పదండని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాత ఛీ-ఛీ శరీరాన్ని వదలాలి. మీరు మొదట నూతన ప్రపంచములో సతోప్రధానంగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలు అనుభవించి తమోప్రధాన శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు భక్తికి ఫలము ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. తండ్రి సత్యయుగములో ఫలాన్ని ఇచ్చారు. బాబా సుఖదాత పతితపావనుడైన తండ్రి వచ్చినట్లైయితే పూర్తి ప్రపంచములోని మనుష్యులనే కాక ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తారు. ఇప్పుడు ప్రకృతి కూడా తమోప్రధానంగా ఉంది. ధాన్యము మొదలైనవి లభించడము లేదు. మేము ఇలా ఇలా చేస్తాము. రాబోయే సంవత్సరము చాలా ధాన్యము వస్తుందని వారు భావిస్తారు. కానీ ఏమీ జరగదు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరైనా ఏం చేయగలరు. కరువు వస్తుంది. భూకంపాలు వస్తాయి, అనారోగ్యాలు కలుగుతాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఇది అదే మహాభారత యుద్ధము. ఇప్పుడు బాబా చెప్తున్నారు - మీరు మీ వారసత్వాన్ని పొందుకోండి. నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చాను. మాయా రావణుడు శాపాన్ని ఇస్తాడు, నరక వారసత్వాన్ని ఇస్తాడు. ఇది కూడా తయారైన ఆట. తండ్రి చెప్తారు - డ్రామానుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను. ఈ భారతదేశము శివాలయంగా ఉండేది. ఇప్పుడు వేశ్యాలయంగా ఉంది. విషయసాగరములో మునకలు వేస్తూ ఉంటారు.
ఇప్పుడు బాబా మనలను శివాలయానికి తీసుకెళ్తున్నారని మీకు తెలుసు. కనుక మీకు ఈ సంతోషము ఉండాలి కదా! మనలను అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు. నేను మిమ్ములను విశ్వాధికారులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. భారతవాసులు తమ ధర్మాన్నే ఎరుగరు. మన వంశము అత్యంత పెద్దది. దీని నుండే ఇతర వంశాలు వెలువడ్తాయి. ఆది సనాతనం ఏ ధర్మమో, ఏ వంశానికి చెందిందో తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారి వంశము తర్వాత రెండవ నంబరులో చంద్రవంశము తర్వాత ఇస్లాం వంశము. ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని వేరెవ్వరూ అర్థము చేయించలేరు. ఇప్పుడు ఎన్ని వంశాలున్నాయో చూడండి. శాఖోపశాఖలు (కొమ్మలు-రెమ్మలు) ఎన్ని ఉన్నాయి! ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఈ విషయాలను తండ్రియే వచ్చి బుద్ధిలో వేస్తారు. ఇది చదువు కనుక దీనిని ప్రతి రోజూ చదవాలి. భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులగా చేస్తాను. వినాశి ధనాన్ని దానము చేయడం వలన పతిత రాజులగా అవ్వగలరు. కానీ నేను మిమ్ములను 21 జన్మలకు విశ్వాధిపతులుగా అయ్యేంత పావనంగా చేస్తాను. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులుండవు. తమ సమయానుసారంగా శరీరాన్ని వదుల్తారు. డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఆ సినిమా, డ్రామాలు మొదలైనవి వచ్చాయి కనుక ఈ డ్రామా గురించి అర్థం చేయించడం కూడా సహజమవుతుంది. ఈ రోజుల్లో డ్రామాలు మొదలైనవి చాలా తయారుచేస్తున్నారు. మననుష్యులకు అందులో చాలా ఆసక్తి ఉంది. అవన్నీ హద్దులోనివి, ఇది అనంతమైన డ్రామా. ఈ సమయములో మాయ వైభవము(ఆడంబరము) చాలా ఉంది. ఇప్పుడే స్వర్గము తయారైపోయిందని మనుష్యులు భావిస్తారు. ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉండేవి కావు. కనుక ఎంత అపోజిషన్‌(వ్యతిరేకత) ఉంది! భగవంతుడు స్వర్గాన్ని రచిస్తూ ఉంటే మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది. ఇదంతా మాయ యొక్క అట్టహాసము. అదంతా పడిపోవలసిందే. మాయ ఎంత శక్తివంతమైనది! మీరు దాని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. ధనవంతులు స్వర్గములో ఉన్నారు, పాపం పేదవారు నరకములో ఉన్నారు. కనుక ఇప్పుడు నరకవాసులను స్వర్గవాసులుగా చేయాలి. పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు. ధనవంతులైతే మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. స్వర్గ, నరకాలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థము చేసుకున్నారు. భారతదేశము ఎంత భికారిగా అయిపోయింది. భారతదేశమే ఎంత ధనవంతముగా ఉండేది. ఒకే ఆది సనాతన ధర్మము ఉండేది. ఇప్పుడు కూడా ఎన్ని పురాతన వస్తువులు వెలికి తీస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల పురాతన వస్తువులు అని చెప్తారు. ఎముకలు కూడా వెలికి తీసి ఇన్ని లక్షల సంవత్సరాలవి అని చెప్తారు. ఇప్పుడు లక్షల సంవత్సరాల ఎముకలు ఎక్కడ నుండి రాగలవు? వాటికి మళ్లీ వెలను కూడా ఎంతో ఎక్కువగా నిర్ణయిస్తారు.
తండ్రి అర్థం చేయిస్తారు - నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. వీరిలో ప్రవేశము చేసి వస్తాను. ఈ బ్రహ్మ సాకారి. ఇతనే మళ్లీ సూక్ష్మవతనవాసి ఫరిస్తా, సూక్ష్మ దేవతగా అవుతారు. వారు అవ్యక్తము, ఇతను వ్యక్తము. తండ్రి అంటున్నారు - నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో వస్తాను. ఎవరైతే నంబరువన్‌ పావనంగా ఉండేవారో, వారే నంబరువన్‌ పతితంగా అయినప్పుడు నేను అతనిలో వస్తాను. ఎందుకంటే ఇతనే మళ్లీ నంబరువన్‌ పావనంగా అవ్వాలి. ఇతను నేను భగవంతుడిని, నేను ఫలానా అని ఎప్పుడన్నాడు! తండ్రికి కూడా - నేను ఈ శరీరములో ప్రవేశించి ఇతని ద్వారా అందరినీ సతోప్రధానంగా చేస్తానని తెలుసు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు అశరీరులుగా వచ్చారు. తర్వాత 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయించారు, ఇప్పుడు వాపస్‌ వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానాన్ని వదలండి. కేవలం స్మృతియాత్రలో ఉండాలి. వేరే ఏ కష్టమూ లేదు. ఎవరైతే పవిత్రంగా అవుతారో, జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద పాఠశాల. చదివించే తండ్రి ఎంత నిరహంకారిగా అయి పతిత ప్రపంచములో, పతిత శరీరములో వస్తారు! భక్తిమార్గములో మీరు వారి కొరకు ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు. ఈ సమయంలో మిమ్ములను స్వర్గాధిపతులుగా చేస్తాను. కనుక నేను పతిత శరీరములో వచ్చి కూర్చుంటాను. తర్వాత మళ్లీ భక్తి మార్గములో మీరు నన్ను సోమనాథ మందిరములో కూర్చోపెట్తారు. బంగారుతో, వజ్రాలతో మందిరాన్ని తయారుచేస్తారు. ఎందుకంటే మిమ్ములను స్వర్గాధిపతులుగా చేస్తానని మీకు తెలుసు అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు. ఈ రహస్యాలన్నీ మీకు అర్థం చేయించాను. మొదట అవ్యభిచారి భక్తిగా ఉంటుంది. తర్వాత వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఈ రోజులలో మనుష్యులను కూడా పూజిస్తూ ఉంటారు. గంగానది తీరములో శివోహం అని అంటూ కుర్చుండిపోతారు. మాతలు వెళ్లి క్షీరాభిషేకము చేస్తారు, పూజిస్తారు. స్వయంగా ఈ దాదా కూడా ఇవన్నీ చేశారు. ఇతను నంబరువన్‌ పూజారిగా అయ్యారు కదా. విచిత్రము కదా. అది అద్భుత ప్రపంచమని తండ్రి అంటున్నారు. స్వర్గము ఎలా తయారవుతుంది? నరకము ఎలా తయారవుతుంది? ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానము ఏ శాస్త్ర్రాలలోనూ లేదు. అవన్నీ వేదాంత శాస్త్ర్రాలు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. దీనిని ఆత్మిక తండ్రి, బ్రాహ్మణులైన మీరు తప్ప వేరెవ్వరూ అర్థము చేయించలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఆత్మిక జ్ఞానము వేరెవ్వరికీ లభించదు. ఎప్పటివరకు బ్రాహ్మణులుగా అవ్వరో, అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలైన మీకు చాలా ఖుషీ ఉండాలి. మిమ్ములను భగవంతుడే చదివిస్తున్నారు, శ్రీ కృష్ణుడు కాదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మాయ అట్టహాసం(వైభవము, ఆడంబరము) చాలా ఉంది. దీని నుండి ముఖాన్ని తిప్పేసుకోవాలి. మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారని సదా సంతోషంతో రోమాంచితులవ్వాలి(పులకించిపోవాలి).
2. విశ్వరాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి. ఎలాగైతే బాబా నిరహంకారులుగా అయి పతిత ప్రపంచములో, పతిత తనువులో వస్తారో, అలా తండ్రి సమానంగా నిరహంకారులుగా అయి సేవ చేయాలి.

వరదానము :- '' హద్దులోని అన్ని కామనల పై విజయము ప్రాప్తి చేసుకునే కామజీత్‌, జగత్‌జీత్‌ భవ ''
కామ వికారపు అంశము - సర్వ హద్దు కామనలు(కోరికలు). ఒకటేమో వస్తువుల పై కోరిక, రెండవది - వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులు పొందాలనే కోరిక, మూడవది - సంబంధాలు నిభాయించడంలో, నాల్గవది - సేవా భావంలో హద్దు కామనలు లభించాలనే భావము. '' ఏ వ్యక్తి లేక వస్తువు పట్ల విశేషంగా ఆకర్షణ అవ్వడం, ఇచ్ఛ లేదు కానీ ఈ వస్తువు లేక వ్యక్తి బాగుందనిపిస్తుంది'' అని అనడం కూడా కామవికారమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ వంశము కూడా సమాప్తమౌతుందో అప్పుడు కామజీత్‌, జగత్‌జీత్‌ అని అంటారు.

స్లోగన్‌ :- '' హృదయంతో అనుభవం ద్వారా హృదయాభిరాముడైన తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునే అధికారులుగా అవ్వండి. ''

No comments:

Post a Comment