Saturday, January 11, 2020

Telugu Murli 11/01/2020

11-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు ఒక్క బాబా ఆదేశానుసారము నడుస్తూ ఉంటే, మీ బాధ్యతంతా బాబాదే అవుతుంది. '' నడుస్తూ, తిరుగుతూ, నన్ను స్మృతి చేయండి '' - ఇది తండ్రి ఆదేశము. ''

ప్రశ్న :- ఎవరైతే మంచి గుణవంతులైన పిల్లలుగా ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు ఏవి ?
జవాబు :- వారు ముళ్ళను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారు, ఎవ్వరికీ ముళ్ళను గుచ్చరు, పరస్పరములో ఎప్పుడూ పోట్లాడరు, ఎవ్వరికీ దు:ఖమివ్వరు. దు:ఖమివ్వడం కూడా ముల్లు గుచ్చడమే.

పాట :- ఈ సమయము వెళ్ళిపోతోంది,................(యహ్‌ వక్త్‌ జా రహే హై,.............)
ఓంశాంతి. మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక పిల్లలు నంబరువారు పురుషార్థానుసారము ఈ పాటను అర్థము చేసుకున్నారు. నెంబరువారుగా ఎందుకు అన్నారంటే కొందరు మొదటి స్థాయిలో (ఫస్ట్‌ గ్రేడ్‌) అర్థము చేసుకుంటారు, కొందరు రెండవ గ్రేడ్‌లో అర్థము చేసుకుంటారు, కొందరు మూడవ గ్రేడ్‌లో అర్థము చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి తమదే అయిన వివేకము ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమదే అయిన నిశ్చయబుద్ధి కూడా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు, శివబాబా ఇతని ద్వారా ఆదేశాన్ని ఇస్తారని సదా భావించండి. మీరు అర్ధకల్పము ఆసురీ ఆదేశానుసారము నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మనము ఈశ్వరీయ ఆదేశానుసారము నడుస్తాము కనుక మన నావ ఒడ్డుకు చేరుతుంది అని నిశ్చయముంచుకోండి. ఒకవేళ ఈశ్వరీయ ఆదేశమని భావించకుండా మనుష్యుల ఆదేశమని భావిస్తే తికమకపడ్తారు. తండ్రి చెప్తారు - నా ఆదేశానుసారము నడిచినట్లయితే నేను బాధ్యుడను కదా. ఇతని ద్వారా ఏమేమి జరుగుతుందో, ఇతని కర్తవ్యాలకు నేనే బాధ్యుడును, వాటిని నేను సరి చేస్తాను. మీరు కేవలం నా ఆదేశానుసారము నడవండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో, వారే నా ఆదేశానుసారము నడుస్తారు. అడుగడుగులో ఈశ్వరీయ ఆదేశమని భావించి నడిచినట్లయితే ఎప్పుడూ నష్టపోరు. నిశ్చయములోనే విజయముంది. చాలామంది పిల్లలు ఈ మాటలు అర్థము చేసుకోరు. కొద్దిగా జ్ఞానము అర్జిస్తూనే దేహాభిమానము వచ్చేస్తుంది. యోగము చాలా తక్కువగా ఉంది. చరిత్ర-భూగోళాలను తెలుసుకోవడమే జ్ఞానము, ఇది సులభము. ఇక్కడ కూడా మనుష్యులు ఎంతగా సైన్సు మొదలైనవి చదువుతారు! ఈ చదువు సులభమైనది, కానీ యోగములోనే శ్రమ ఉంది.
బాబా మేము యోగములో చాలా మస్త్‌గా(మునిగి) ఉంటామని ఎవరైనా చెప్తే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరి పనిని చూస్తారు. తండ్రిని స్మృతి చేసేవారు చాలా ప్రియంగా ఉంటారు. స్మృతి చేయని కారణంగానే ఉల్టా-సుల్టా(తప్పుడు) పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రము పై కూడా బాగా అర్థం చేయించగలరు. ఈ సమయంలో ఇది ముళ్ళ అడవి. ఇది ఉద్యానవనము(తోట) కాదు. భారతదేశము పుష్పాల తోటగా ఉండేదని స్పష్టంగా అర్థం చేయించాలి. తోటలో ఎప్పుడైనా అడవి జంతువులు నివసిస్తాయా ? అక్కడ దేవీ దేవతలుంటారు. తండ్రి అత్యంత ఉన్నతమైన అథారిటి. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా అత్యంత ఉన్నతమైన అథారిటీయే అయ్యారు. ఈ దాదా అందరికంటే గొప్ప అథారిటి. శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మ, ఆత్మలు శివబాబా సంతానము, సాకారములో సోదరీ-సోదరులైన మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ఇతను అందరికీ గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌. ఇలాంటి హైయెస్ట్‌ అథారిటి కొరకు మాకు ఇల్లు కావాలి. ఇలా మీరు వ్రాసి చూడండి. వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో చూడండి.
శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ, ఆత్మల తండ్రి మరియు సర్వ మనుష్యమాత్రుల తండ్రి. ఈ పాయింటు అర్థం చేయించేందుకు చాలా బాగుంది. కాని పిల్లలు పూర్తిగా అర్థము చేయించరు, మర్చిపోతారు. బాప్‌దాదా పైన కూడా విజయము పొందుతాము అనే విధంగా జ్ఞాన అహంకారము పెరిగిపోతుంది. ఈ దాదా చెప్తారు - నా మాట భలే వినకండి, శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా భావించి వారి మతమును అనుసరించండి. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, నేను బాధ్యుడను అని నేరుగా ఈశ్వరుడే మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతమును అనుసరించండి. ఇతను(బ్రహ్మ) ఈశ్వరుడు కాదు. మీరు ఈశ్వరుని నుండి చదువుకోవాలి కదా. ఈ ఆదేశము ఈశ్వరుడే ఇస్తున్నారని సదా భావించండి. ఈ లక్ష్మీనారాయణులు కూడా భారతదేశములోని మనుష్యులే. వీరందరూ మనుష్యులే. కాని వారు శివాలయంలో(సత్యయుగంలో) నివసించేవారు కనుక అందరూ నమస్కరిస్తారు. కాని పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు. వారికి నషా పెరిగిపోతుంది. లోపాలు చాలామందిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే పూర్తి యోగముంటుందో అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. విశ్వానికి అధికారులుగా అవ్వడము పిన్నమ్మ ఇల్లేమీ కాదు(సులభము కాదు). బాబా గమనిస్తారు - మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకొని మురికి కాల్వలో పడేస్తుంది. మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని తండ్రి స్మృతిలో చాలా ఖుషీగా ప్రఫుల్లితంగా ఉండాలి. ముఖ్య ఉద్ధేశ్యము ఎదురుగా ఉంది. మర్చిపోవడం వలన ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కదు. మమ్ములను నిష్ఠ(యోగము)లో కూర్చోబెట్టండి, వెలుపల మేము స్మృతి చేయలేము అని అడుగుతారు. స్మృతిలో ఉండరు. కనుక అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రాము పంపుతారు. కాని స్మృతిలో కూర్చోరు, బుద్ధి అటు-ఇటు భ్రమిస్తూ ఉంటుంది. బాబా తన ఉదాహరణ తెలిపిస్తారు - పక్కా నారాయణుని భక్తునిగా ఉండేవాడిని. ఎక్కడికెళ్లినా జతలో నారాయణుని చిత్రము కూడా ఉండేది. అయినా పూజ చేయు సమయంలో బుద్ధి అటు - ఇటు పరిగెడ్తూ ఉండేది. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. కాని అక్కయ్య నిష్ఠలో కూర్చోబెట్టాలని కొందరు అడుగుతారు. నిష్ఠకు అర్థమే లేదు. స్మృతిలో ఉండండి అని తండ్రి సదా చెప్తారు. చాలామంది పిల్లలు నిష్ఠలో కూర్చొని ఉండగానే ధ్యానములోకి వెళ్ళిపోతారు. జ్ఞానమూ ఉండదు, స్మృతీ ఉండదు. లేకుంటే తూగుతూ ఉంటారు. చాలామందికి ఇది అలవాటైపోయింది. ఇది అల్పకాల శాంతి అనగా మిగిలిన పూర్తి రోజంతటిలో అశాంతి ఉంటుంది. నడుస్తూ - తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకుంటే పాప భారము ఎలా దిగిపోతుంది? అర్ధకల్పము యొక్క భారముంది. ఇందులోనే చాలా శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇంత సమయము స్మృతిలో ఉన్నామని బాబాకు చాలా మంది పిల్లలు వ్రాసి పంపుతారు. కాని అంత స్మృతి ఉండదు. చార్టును అర్థమే చేసుకోరు. బాబా బేహద్‌ తండ్రి, పతితపావనులు కనుక సంతోషంగా ఉండాలి. మేము శివబాబాకు చెందిన వారమే కదా అని అనుకోరాదు. అలా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. మేము బాబాకు చెందినవారమే అని భావిస్తారు కాని అసలు స్మృతే చేయరు. ఒకవేళ స్మృతి చేసినట్లయితే మొదటి నెంబరులోకి వెళ్ళాలి. ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి. మనము భారతదేశాన్ని మహిమ చేస్తాము. నూతన ప్రపంచములో ఆదిసనాతన దేవీదేవతల రాజ్యముండేది. ఇప్పుడిది పాత ప్రపంచము, ఇనుప యుగము. అది సుఖధామము, ఇది దు:ఖధామము. భారతదేశము బంగారు యుగముగా ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యముండేది. వీరి రాజ్యముండేదని మేము ఎలా భావించాలని అడుగుతారు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యములో ఎంత ఉందో, ఎవరు ఎంత పురుషార్థము చేస్తున్నారో కనిపిస్తుంది. మీరు కర్మల ద్వారా తెలుసుకుంటారు. కలియుగము వారు కూడా మనుష్యులే, సత్యయుగము వారు కూడా మనుష్యులే, మరి వీరి(దేవతలు) ముందుకు వెళ్లి తల వంచి ఎందుకు నమస్కరిస్తారు? వారిని స్వర్గానికి అధిపతులని అంటారు కదా. ఎవరైనా మరణించినట్లయితే ఫలానావారు స్వర్గవాసులయ్యారని అంటారు. ఇది కూడా అర్థము చేసుకోరు. ఈ సమయంలో అయితే అందరూ నరకవాసులే. పునర్జన్మ కూడా తప్పకుండా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్కరి నడవడికలను చూస్తూ ఉంటారు. బాబా ఎంత సాధారణ రీతిలో ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది. సంభాళన చేయవలసి ఉంటుంది. తండ్రి ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. విషయము చాలా సరిగ్గా ఉందని అర్థము కూడా చేసుకుంటారు. అయినా పెద్ద పెద్ద ముళ్ళుగా ఎందుకు తయారవుతారు? ఒకరికొకరు దు:ఖాన్ని ఇవ్వడం ద్వారా ముళ్ళుగా అయిపోతారు. అలవాటు వదలనే వదలరు. ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను తయారు చేస్తున్నారు. ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముల్లుగా ఉంటారో, వారు ఇతరులను పుష్పాలుగా ఎలా చేయగలరు? ప్రదర్శనీలకు కూడా ఎవరినైనా చాలా జాగ్రత్తగా పంపవలసి ఉంటుంది.
ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా చేసే మంచి సేవ చేస్తారో, వారే మంచి గుణవంతులైన పిల్లలు. ఎవవ్వరికీ ముళ్ళను గుచ్చరు అనగా ఎవ్వరికీ దు:ఖమునివ్వరు. ఎప్పుడూ పరస్పరములో పోట్లాడుకోరు. పిల్లలైన మీరు చాలా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవ్వరినీ అవమానించే మాటే లేదు. ఇప్పుడు శివజయంతి కూడా వస్తుంది. మీరు ప్రదర్శనీలు ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్న - చిన్న ప్రదర్శనీల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు. ఒక్క సెకెండులో స్వర్గ వాసులుగా అవ్వండి లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్ఠాచారులుగా అవ్వండి. ఒక్క సెకండులో జీవన్ముక్తి ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తికి అర్థము కూడా తెలుసుకోరు. మీరు కూడా ఇప్పుడే అర్థము చేసుకున్నారు. తండ్రి ద్వారా అందరికీ ముక్తి-జీవన్ముక్తి లభిస్తుంది కానీ డ్రామాను గురించి కూడా అర్థం చేసుకోవాలి. అన్ని ధర్మాలు స్వర్గములోకి రావు. వారు మళ్లీ తమ-తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్లీ వారి వారి సమయానికి వచ్చి స్థాపన చేస్తారు. వృక్షములో చాలా స్పష్టంగా ఉంది. ఒక్క సద్గురువు తప్ప వేరెవ్వరూ సద్గతిదాతలుగా అయ్యేందుకు సాధ్యము లేదు. పోతే భక్తి నేర్పించే గురువులు అనేకమంది ఉన్నారు. మనుష్యులు సద్గతినిచ్చే గురువులుగా అవ్వలేరు. కానీ అర్థము చేయించే బుద్ధి కూడా కావాలి. ఇందులో బుద్ధి ద్వారా పని చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఇది ఎంత అద్భుతమైన ఆట! ఈ నషాలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. మంచిది.
రాత్రి క్లాసు
మీరు వాస్తవానికి శాస్త్రాల గురించి వాదవివాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన విషయం - స్మృతి. సృష్టి ఆది-మధ్య-అంత్యములను అర్థం చేసుకోవాలి. చక్రవర్తి రాజులగా అవ్వాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. సెకండులో జీవన్ముక్తి అని దీనికే గాయనముంది. భక్తి అర్ధకల్పము నడుస్తుంది. మీకు ఆశ్చర్యము కలుగుతుంది. జ్ఞానం కొంచెం కూడా లేదు. జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైనవారు! అందుకే కోట్లలో కొంత మందే వెలువడ్తారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరు నేనే తండ్రిని, టీచరును, గురువును అని చెప్తున్నారు. ఈ మాటలు విని మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. భారతదేశాన్ని మాతృదేశమని అంటారు. ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది. అంబ మేళాలు కూడా చాలా జరుగుతాయి. 'అంబ' చాలా మధురమైన పదము. చిన్న పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాళిస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈమె దత్తత తీసుకోబడిన కూతురు. ఈమెకు పతి లేనే లేడు. ఇది కొత్త విషయం కాదు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ దత్తత చేసుకొని ఉంటారు. ఈ విషయాన్ని తండ్రియే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. అంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి, ఎన్ని పూజలు జరుగుతాయి, ఎందుకంటే చాలా సేవ చేశారు. మమ్మా ఎంతమందిని చదివించి ఉంటారో అంత ఇతరులెవ్వరూ చదివించలేరు. మమ్మా పేరు చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పెద్ద పెద్ద మేళాలు కూడా జరుగుతాయి. తండ్రియే వచ్చి రచన ఆది-మధ్య-అంత్యాల రహస్యమంతా పిల్లలైన మీకు అర్థం చేయించారని మీకు తెలుసు. మీకు తండ్రి ఇంటిని గురించి కూడా తెలిసింది. మీకు తండ్రి పై, ఇంటి పై కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంతో సంపాదన జరుగుతుంది. కనుక మీకు సంతోషముండాలి కదా. మీరు ఎంతో సాధారణంగా ఉన్నారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానము వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు. తండ్రియే వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచము తయారవుతుంది. పాత ప్రపంచము పై వైరాగ్యము కలుగుతుంది. పిల్లలైన మీలో జ్ఞాన ఖుషీ ఉంటుంది. తండ్రిని, ఇంటిని స్మృతి చేయాలి. ఇంటికైతే అందరూ వెళ్లాల్సిందే. తండ్రి ఏమో అందరికి పిల్లలూ! నేను మీకు ముక్తి-జీవన్ముక్తి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని చెప్తారు కదా. మరి మీరెందుకు మర్చిపోతారు. నేను మీ అనంతమైన తండ్రిని. మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. మీరు నా శ్రీమతమును అనుసరించరా! అనుసరించకుంటే చాలా నష్టపోతారు. ఇది అనంతమైన నష్టము. తండ్రి చేయి వదిలేస్తే సంపాదనలో నష్టము కలుగుతుంది. మంచిది. గుడ్‌నైట్‌. ఓంశాంతి.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక్క తండ్రి స్మృతి ద్వారా అత్యంత ప్రియము(లవ్‌లీ)గా తయారవ్వాలి. నడుస్తూ-తిరుగుతూ, కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతిలో ఖుషీగా, ప్రఫుల్లితంగా ఉండాలి.
2. అడుగడుగునా ఈశ్వరీయ ఆదేశానుసారము నడుస్తూ ప్రతి కార్యము చేయాలి. మీ అహంకారాన్ని (దేహాభిమానపు నషా) చూపించరాదు. ఏ విధమైన ఉల్టా-సుల్టా(తప్పుడు) పనులు చేయరాదు, తిమకపడరాదు.

వరదానము :- '' విశ్వకళ్యాణము బాధ్యతగా భావించి సమయాన్ని, శక్తులను పొదుపు చేసే మాస్టర్‌ రచయిత భవ ''
విశ్వములోని ఆత్మలందరు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారమే. పరివారము ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పొదుపు చేయాలని ఆలోచిస్తారు. కనుక సర్వ ఆత్మలను ముందుంచుకొని స్వయాన్ని బేహద్‌ సేవకు నిమిత్తంగా భావించి తమ సమయాన్ని, శక్తులను కార్యములో ఉపయోగించండి. స్వయం కొరకు సంపాదించుకొని స్వయం తిని పోగొట్టుకునే స్వార్థపరులుగా అవ్వకండి. నిర్లక్ష్యంగా అవ్వకండి. అన్ని ఖజానాల బడ్జట్‌ను తయారు చేయండి. మాస్టర్‌ రచయిత భవ అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని సమయం మరియు శక్తుల స్టాక్‌ను సేవ కొరకు జమ చేయండి.

స్లోగన్‌ :- '' ఎవరి సంకల్పాలు, మాటల ద్వారా అందరికీ వరదానాలు ప్రాప్తిస్తాయో, వారే మహాదానులు. ''

No comments:

Post a Comment