26-01-2020 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్: 13-11-1985 మధువనము
'' సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు, మాటలు మరియు కర్మలలో నవీనతను తీసుకు రండి ''
ఈ రోజు కొత్త ప్రపంచానికి, కొత్త రచనకు రచయిత అయిన తండ్రి తమ కొత్త ప్రపంచానికి అధికారులైన పిల్లలను అనగా కొత్త రచనను చూస్తున్నారు. కొత్త రచన సదా ప్రియంగా అనిపిస్తుంది. ప్రపంచం లెక్కలో పాత యుగములో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ మీరు కొత్త రచన యొక్క కొత్త యుగమును, కొత్త జీవితమును అనుభవం చేస్తున్నారు. అంతా కొత్తగా అయిపోయింది. పాతదంతా సమాప్తమై కొత్త జన్మ, కొత్త జీవితం ప్రారంభమయింది. జన్మ కొత్తదైనందున జన్మ ద్వారా జీవితము స్వతహాగా మారుతుంది. జీవితం మారడం అనగా సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు అన్నీ మారిపోయాయి. అనగా కొత్తగా అయిపోయాయి. ధర్మమూ కొత్తదే, కర్మా కొత్తదే. వారు కేవలం కొత్త సంవత్సరమని అంటారు. కానీ మీ అందరి కొరకు అంతా కొత్తగా అయిపోయింది. ఈ రోజు అమృతవేళ నుండి కొత్త సంవత్సర శుభాకాంక్షలనైతే తెలిపారు. కానీ కేవలం నోటితోనే శుభాకాంక్షలు తెలిపారా లేక మనస్సు ద్వారా తెలిపారా? నవీన సంకల్పాలు చేశారా? విశేషమైన ఈ మూడు విషయాల నవీన సంకల్పాలను చేశారా? సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు సంస్కారాలు మరియు సంకల్పాలు కొత్తగా అనగా శ్రేష్ఠంగా అయిపోయాయి. కొత్త జన్మ, కొత్త జీవితము ఉండి కూడా ఇప్పటి వరకూ పాత జన్మ లేక జీవితములోని సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు మిగిలిపోలేదు కదా! ఒకవేళ ఈ మూడు విషయాలలో ఏ విషయంలోనైనా అంశమాత్రముగానైనా పాతదనం మిగిలి ఉన్నట్లయితే ఈ అంశము కొత్త జీవితము, కొత్త యుగము, కొత్త సంబంధాల, కొత్త సంస్కారాల సుఖము లేక సర్వ ప్రాప్తుల నుండి వంచితులుగా చేసేస్తుంది. చాలా మంది పిల్లలు బాప్‌దాదా ముందు ఇలా తమ మనసులోని మాటలను ఆత్మిక సంభాషణలో చెప్తూ ఉంటారు. బయటికి చెప్పరు. బయట నుండి ఎవరైనా ఎలా ఉన్నారని అడిగినప్పుడు అందరూ చాలా బాగున్నామనే అంటారు. ఎందుకంటే బాహర్యాములైన ఆత్మలకు లోపల ఏముందో తెలియదని తెలుసు. కానీ తండ్రితో ఆత్మిక సంభాషణ చేయునప్పుడు దాచలేరు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయాము, శూద్ర తనము నుండి దూరమయ్యాము, కానీ బ్రాహ్మణ జీవితము యొక్క మహానత, విశేషతలైన సర్వ శ్రేష్ఠ ప్రాప్తులు లేక అంతీంద్రియ సుఖము, ఫరిస్తా జీవితము, డబల్ లైట్ జీవితాల విశేషమైన అనుభవం ఎంతగా ఉండాలో అంతగా జరగడం లేదని తమ మనసులోని విషయాలను చెప్తారు. ఈ శ్రేష్ఠ యుగము, శ్రేష్ఠ జీవితాల వర్ణన ఏదైతే ఉందో అటువంటి అనుభవము, అటువంటి స్థితి చాలా కొద్ది సమయమే కలుగుతుంది. దీనికి కారణమేమి? బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అధికారము అనుభవమవ్వడం లేదు. ఎందుకు? రాజు పిల్లలుగా ఉంటూ భికారుల సంస్కారమున్నట్లయితే వారిని ఏమంటారు? రాకుమారులని అంటారా? ఇక్కడ కూడా కొత్త జన్మ, కొత్త బ్రాహ్మణ జీవితము లభించాయి. అయినా పాత సంకల్పాలు లేక సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉంటే లేక అవి కర్మలలోకి వస్తూ ఉంటే లేక సంస్కారాలు ఎమర్జ్ అవుతూ ఉంటే లేక అవి కర్మలలో కనిపిస్తూ ఉంటే వారిని బ్రహ్మాకుమారులని అంటారా? లేక సగం శూద్రకుమారులు సగం బ్రహ్మకుమారులని అంటారా? సగం తెల్లగా, సగం నల్లగా డ్రామాలో ఒక ఆటను చూపిస్తారు కదా! సంగమ యుగమని దీనినైతే భావించడం లేదు కదా! సంగమ యుగమనగా కొత్త యుగము. యుగము కొత్తదైతే అన్నీ కొత్తవిగానే ఉంటాయి.
'నూతన సంవత్సర శుభాకాంక్షలు' అనే స్వరాన్ని(శబ్ధాన్ని) బాప్‌దాదా ఈ రోజు అందరి నుండి వింటున్నారు. కార్డులు కూడా పంపిస్తారు, ఉత్తరాలు కూడా వ్రాస్తారు కానీ చెప్పడం మరియు చేయడం రెండూ ఒక్కటిగా ఉన్నాయా? అభినందనలు తెలిపారు. చాలా బాగా చేశారు. బాప్‌దాదా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరి నోటి మాటలలో అవినాశి భవ అనే వరదానముంది. మీ నోటిలో గులాబ్‌జామ్ అని మీరు అంటారు కదా! అలా మీ నోటిమాటలలో అవినాశి వరాదనాలుండాలని బాప్‌దాదా అంటారు. ఈనాటి నుండి కేవలం 'కొత్త' అన్న ఈ ఒక్క పదమును గుర్తుంచుకోండి. ఏ సంకల్పాలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కర్మలు చేసినా కొత్తగా ఉన్నాయా అని పరిశీలించుకోండి, గుర్తుంచుకోండి. ఇదే లెక్కాచారాల పుస్తకము(చౌపడా). ఈ రిజష్టరును ఈ రోజు నుండి ప్రారంభించండి. దీపావళినాడు లెక్కాచారాల పుస్తకాలను(చౌపడే) ఏం చేస్తారు? వాటి పై స్వస్తిక్‌ను దిద్దుతారు కదా! (గణేష్) వినాయకుని చిత్రాన్ని గీస్తారు మరియు నాలుగు యుగాలలో బిందువును తప్పకుండా దిద్దుతారు. అలా ఎందుకు దిద్దుతారు? ఏ కార్యమును ప్రారంభించే సమయములోనైనా స్వస్తిక్ లేక గణేశాయ నమః అని తప్పకుండా అంటారు. ఇది ఎవరి స్మృతి చిహ్నము? స్వస్తిక్‌ను కూడా గణేష్ అని ఎందుకంటారు? స్వస్థికము స్వస్థితిలో స్థితులయ్యేందుకు మరియు పూర్తి రచన యొక్క జ్ఞానానికి సూచకము(గుర్తు). వినాయకుడు జ్ఞాన సంపన్నుడు. ఈ ఒక్క స్వస్తిక్ చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఇమిడి ఉంది. నాలెడ్జ్‌ఫుల్‌కు(జ్ఞానసంపన్నులు) స్మృతి చిహ్నంగా వినాయకుడిని లేక స్వస్తిక్‌ను చూపిస్తారు. దీని అర్థమేమిటి ? ఏ కార్యము సఫలమవ్వాలన్నా దానికి ఆధారం నాలెడ్జ్‌ఫుల్ అనగా వివేకవంతులుగా, జ్ఞానస్వరూపులుగా అవ్వడం. జ్ఞానస్వరూపులుగా, వివేకవంతులుగా అయినట్లయితే ప్రతి కర్మ శ్రేష్ఠంగా మరియు సఫలంగా అవుతుంది కదా! వారైతే కేవలం కాగితము పై స్మృతిచిహ్నాన్ని దిద్దుతారు. కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం జ్ఞాన సంపన్నులుగా అయి ప్రతి సంకల్పాన్ని చేసినట్లయితే సంకల్పము మరియు సఫలత రెండూ జత జతలో అనుభవం చేస్తారు. కావున నేటి నుండి ఈ దృఢ సంకల్పమనే రంగు ద్వారా మీ జీవితమనే పుస్తకము పై ప్రతి సంకల్పము, సంస్కారము కొత్తగానే ఉండాలి. అవుతుందని కూడా కాదు. అవ్వాల్సిందే, జరగాల్సిందే. స్వస్థితిలో స్థితులై ఈ శ్రీగణేష్‌ను అనగా ప్రారంభము చేయండి. స్వయం శ్రీగణేష్‌గా అయి ప్రారంభించండి. ఇదైతే జరుగుతూనే ఉంటుందని ఆలోచించకండి. సంకల్పాలను ఎన్నోసార్లు చేస్తూ ఉంటారు. కానీ సంకల్పాలు దృఢంగా ఉండాలి. ఎలాగైతే ఫౌండేషన్(పునాది)లో సిమెంట్ మొదలైన వాటిని పక్కాగా ధృఢంగా చేస్తారో, అలా ధృఢ సంకల్పము చేయాలి. ఇసుకతో ఫౌండేషన్ వేసినట్లయితే అది ఎంత కాలము కొనసాగుతుంది? కావున ఏ సమయంలో అయితే సంకల్పాలు చేస్తారో ఆ సమయంలో, చేసి చూస్తాము, ఎంత వీలైతే అంత చేస్తాము, ఇతరులు కూడా ఇలాగే చేస్తున్నారు కదా అని అంటారు. ఈ విధమైన ఇసుకను కలిపేస్తారు. అందువలన ఫౌండేషన్ పక్కాగా ఉండదు. ఇతరులను చూడడం సులభమనిపిస్తుంది. తమను తాము చూసుకోవడం శ్రమ అనిపిస్తుంది. ఒకవేళ ఇతరులను చూడాలనుకుంటే, అ అలవాటుకు వశమై ఉంటే బ్రహ్మాబాబాను చూడండి. అతను కూడా వేరే వారే కదా! అందువలన బాప్‌దాదా దీపావళి లెక్కాచారాన్ని చూశారు. లెక్కాచారంలో విశేష కారణము బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అనుభూతి కలగకపోవడం, ఎంత కలగాలో అంత జరగకపోవడం, ఇందుకు విశేష కారణం - పరదృష్టి, పరచింతన పరుల వద్దకు వెళ్లడం, పరిస్థితుల వర్ణన మరియు మననములో ఎక్కువగా ఉంటారు. అందువలన స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. స్వ ద్వారా పర సమాప్తమైపోతుంది. ఎలాగైతే అందరూ కలిసి ఈ రోజు కొత్త సంవత్సరం సందర్భంగా అభినందనలు తెలిపారో అలా ప్రతిరోజూ కొత్త రోజు, కొత్త జీవితము, కొత్త సంకల్పము, కొత్త సంస్కారాలను స్వతహాగానే అనుభవం చేసుకుంటారు. మనసు ద్వారా ప్రతి ఘడియ తండ్రి పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల అభినందనలతో కూడుకున్న శుభ ఉత్సాహము స్వతహాగానే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందరి దృష్టిలో అభినందనలు, శుభాకాంక్షలు, గ్రీటింగుల అల ఉంటుంది. కావున ఈ విధంగా ఈనాటి అభినందనా ఫలాలను అవినాశిగా చేయండి. అర్థమయిందా? మనుష్యులైతే కొత్త పుస్తకాలను ఉంచుకుంటారు. తండ్రి లెక్కాచారాలు చూపారు. సర్వస్వమూ లభిస్తూ కూడా అసంపూర్ణంగా ఎందుకు తీసుకుంటున్నారు? అని బాప్‌దాదాకు పిల్లల పై దయ లుగుతుంది. బ్రహ్మాకుమారీలు, కుమారులు అన్న కొత్త పేరు ఉంది కానీ పని మిక్స్‌గా ఉంది. దాత పిల్లలు, విధాత పిల్లలు, వరదాత పిల్లలు మరి కొత్త సంవత్సరంలో ఏం గుర్తుంచుకుంటారు? అన్నీ కొత్తగా చేయాలి అనగా బ్రాహ్మణ జీవిత మర్యాదలలో అన్నీ కొత్తవే. కొత్తదనము అనగా ఎటువంటి కల్తీ చేయకుండా ఉండడం. చాలా చతురులుగా కూడా అయిపోయారు కదా. తండ్రిని కూడా చదివిస్తారు. చాలామంది పిల్లలు - కొత్తవి చేయాలని బాబా చెప్పారు కదా! కావున మేము ఈ కొత్తవి చేస్తున్నామని అంటారు. కానీ కొత్తవి కూడా బ్రాహ్మణ జీవితములోని మర్యాదల అనుసారంగా కొత్తగా ఉండాలి. బ్రాహ్మణ జీవితము మరియు బ్రాహ్మణ జన్మ ద్వారా బాప్‌దాదా మర్యాదల రేఖను ఇచ్చేశారు. కొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో అర్థమయిందా! 18వ అధ్యాయం ప్రారంభమవుతోందని వినిపించారు కదా!
గోల్డెన్ జూబ్లీ (స్వర్ణిమ జయంతి) కంటే ముందు విశ్వవిద్యాలయము యొక్క స్వర్ణిమ జయంతి ఉంది. కేవలం 50 సంవత్సరాలు నిండిన వారి స్వర్ణ జయంతి అని భావించకండి. ఇది ఈశ్వరీయ కార్యానికి గోల్డెన్ జూబ్లీ. స్థాపనా కార్యంలో సహయోగులెవరైతే ఉన్నారో వారు 2 సవత్సరాలు వారైనా, లేక 50 సంవత్సరాల వారైనా అందరూ స్వయాన్ని బ్రహ్మాకుమారులుగానే పిలుచుకుంటారు కదా! లేక ఇంకేమైనా పేరు ఉందా? కావున ఇది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచనకు స్వర్ణ జయంతి. ఇందులో బ్రహ్మాకుమారులు, కుమారీలు ఉన్నారు. గోల్డెన్ జూబ్లీ వరకు స్వయంలో స్వర్ణిమ యుగము అనగా సతోప్రధాన సంకల్పాలను, సంస్కారాలను, ఎమర్జ్(ఉత్పన్నం) చేసుకోవాలి. ఇటువంటి గోల్డెన్ జూబ్లీని జరుపుకోవాలి. ఇది కేవలం నిమిత్తమాత్రంగా, ఆచార రూపంలో జరుపుకుంటారు. కానీ వాస్తవికమైన గోల్డెన్ జూబ్లీ అంటే స్వర్ణిమ యుగం వారిగా అయ్యే జూబ్లీ. కార్యం సఫలమవ్వడం అనగా కార్యార్థము నిమిత్తంగా ఉన్న ఆత్మలు సఫలతా స్వరూపులుగా అవ్వాలి. ఇప్పుడు కూడా సమయముంది. ఈ మూడు మాసాలలో ప్రపంచమనే స్టేజి పై అతీతమైన గోల్డెన్‌జూబ్లీని జరిపి చూపించండి. ప్రపంచంలోనివారు గౌరవిస్తారు. ఇక్కడ సమాన స్థితిని ప్రత్యక్షము చేయాలి. గౌరవమునిచ్చేందుకు ఏం చేసినా అదంతా నిమిత్త మాత్రమే. వాస్తవికతను ప్రపంచం ముందు చూపించాలి. మనమంతా ఒక్కటే, ఒక్కరికి చెందిన వారము, ఏకరస స్థితి గలవారము. ఒక్కరి లగ్నంలో మగ్నమై ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షము చేసేవారము. ఈ అతీతమైన మరియు ప్రియమైన స్వర్ణిమ స్థితి అనే జెండాను ఎగురవేయండి. స్వర్ణిమ ప్రపంచ దృశ్యాలు మీ కనుల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఇటువంటి స్వర్ణిమ జయంతిని జరుపుకోవాలి. మంచిది.
ఇటువంటి సదా అవినాశి అభినందనలకు పాత్రులైన తమ శ్రేష్ఠమైన పిల్లలకు, తమ ప్రతి సంకల్పము, కర్మల ద్వారా కొత్త సంస్కారాల సాక్షాత్కారము చేయించే పిల్లలకు, తమ స్వర్ణిమ స్థితి ద్వారా స్వర్ణిమ ప్రపంచం ఇక వచ్చేస్తోంది అనే శుభ ఆశా దీపాలను విశ్వంలోని ఆత్మలలో వెలిగింపజేసే సదా ప్రకాశిస్తున్న నక్షత్రాలకు, సఫలతా దీపాలను దృఢ సంకల్పం ద్వారా కొత్త జీవితాన్ని దర్శనం చేయించే దర్శనీయ మూర్తులైన పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు, అవినాశి అభినందనలు మరియు అవినాశి వరదానాల సహితంగా నమస్తే.
పాదయాత్ర మరియు సైకిల్ యాత్ర చేసిన వారితో అవ్యక్త బాప్‌దాదా మిలనము :- యాత్ర ద్వారా సేవనైతే అందరూ చేశారు. ఏ సేవ అయితే చేశారో ఆ సేవకు ప్రత్యక్ష ఫలాన్ని కూడా అనుభవం చేశారు. సేవలో విశేషమైన సంతోషాన్ని అనుభవం చేశారు కదా. పాదయాత్రనైతే చేశారు, అందరూ మిమ్ములను పాదయాత్రికుల రూపంలో చూశారు. ఇప్పుడు ఆత్మిక యాత్రికుల రూపంలో చూడాలి. సేవా రూపంలో అయితే చూశారు కాని ఇప్పుడు ఇంతటి అతీతమైన యాత్రను చేయించే అలౌకిక యాత్రికులు అని అనుభవమవ్వాలి. ఎలాగైతే ఈ సేవలో లగ్నము ద్వారా సఫలత పొందారో అలాగే ఇప్పుడు ఆత్మిక యాత్రలో కూడా సఫలమవ్వాలి. శ్రమ చేస్తారు, చాలా మంచి సేవ చేస్తారు, చాలా బాగా వినిపిస్తారు, వీరి జీవితం చాలా బాగుందని అనడమైతే జరిగింది. కానీ ఇప్పుడిక జీవితాన్ని తయారు చేసుకోవడంలో లగ్నమవ్వాలి. ఈ జీవితం కాకుండా అసలు ఇక ఏ జీవితమూ లేదని అనుభవమవ్వాలి. కావున ఆత్మిక యాత్ర లక్ష్యముంచుకొని ఆత్మిక యాత్రను అనుభవం చేయించండి. ఏం చేయాలో అర్థమయిందా! నడుస్తూ, తిరుగుతూ వీరు సాధారణమైనవారు కారు, వీరు ఆత్మిక యాత్రికులు అనే విధంగా చూడాలి. అందుకు ఏం చేయాలి? స్వయం మీరు యాత్రలో ఉంటూ ఇతరులకు కూడా యాత్రను అనుభవం చేయించండి. పాదయాత్రను అనుభవం చేయించారు, ఇప్పుడిక ఫరిస్తా స్థితిని అనుభవం చేయించండి. వీరు భూమి పై నివసించేవారు కాదు, వీరు ఎవరో ఫరిస్తాలు, వీరి పాదాలు ఈ ధరణి పై ఉండవు అని అనుభవం చేయాలి. రోజురోజుకు ఎగిరేకళ ద్వారా ఇతరులను ఎగిరించండి. ఇప్పుడు ఎగిరించే సమయం. నడిపించే సమయం కాదు. నడవడంలో సమయం పడ్తుంది. ఎగరడంలో సమయం పట్టదు. మీ ఎగిరేకళ ద్వారా ఇతరులను కూడా ఎగిరించండి. అర్థమయిందా. ఇటువంటి స్థితి ద్వారా, స్మృతి ద్వారా అందరినీ సంపన్నంగా చేస్తూ ఉండండి. మాకు ఏదో లభించింది, మేము నిండుగా అయిపోయామని వారు భావించాలి. ఖాళీగా ఉండేవారము కానీ ఇప్పుడు నిండుగా అయిపోయామని వారు భావించాలి. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ క్షణములో బలిహారమైపోతారు. మీకు ప్రాప్తి లభించింది కనుకనే వదిలిపెట్టారు కదా. అన్నీ నచ్చాయి, అనుభవం చేస్తున్నారు, కనుకనే వదిలిపెట్టారు కదా. ఏదో అలా వదిలేయలేదు. అలాగే ఇతరులకు కూడా ప్రాప్తిని అనుభవం చేయించండి. అర్థమయిందా. మిగిలినదంతా బాగుంది. సేవలో ఏ రోజులనైతే గడిపారో అది స్వయాన్ని, ఇతరులను కూడా శ్రేష్ఠంగా తయారు చేశాయి. ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. ఆత్మిక యాత్ర సదా ఉన్నట్లయితే సఫలత కూడా సదా ఉంటుంది. పాదయాత్రను పూర్తి చేయడంతో సేవ పూర్తి అయిపోయిందని కాదు. మళ్లీ ఎలా ఉన్నారో అలా అయిపోవడం కాదు. సేవాక్షేత్రంలో సేవ లేకుండా బ్రాహ్మణులు ఉండలేరు. కేవలం సేవ పాత్ర మారింది. సేవ అయితే చివరి వరకు చేయాలి. మీరు ఇటువంటి సేవాధారులే కదా! లేక మూడు నెలలు, రెండు నెలల సేవాధారులా? సదాకాలిక సేవాధారులకు సదా ఉల్లాస - ఉత్సాహాలు ఉండాలి. మంచిది. డ్రామాలో ఏదైతే సేవ చేసే పాత్ర లభిస్తుందో అందులో విశేషత నిండి ఉంది. ధైర్యంగా సహాయాన్ని అనుభవం చేశారు. మంచిది.
స్వయం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ సంకల్పం మిగిలి ఉంది. ఎందుకంటే తండ్రిని ప్రత్యక్షం చేసినప్పుడే ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది, మీ రాజ్యం వస్తుంది. తండ్రిని ప్రత్యక్షం చేయడమనగా మీ రాజ్యాన్ని తీసుకురావడం. మీ రాజ్యాన్ని తీసుకు రావాలన్న ఉల్లాస-ఉత్సాహాలు సదా ఉంటాయి కదా. ఎలాగైతే విశేష ప్రోగ్రాంలో ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అలా సదా ఈ సంకల్పము గురించిన ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలి. అర్థమయిందా.
పార్టీలతో :- వినడమైతే ఎంతో విన్నారు. ఇప్పుడు ఆ విన్న విషయాలను ఇముడ్చుకోవాలి. ఎందుకంటే ఎంతగా ఇముడ్చుకుంటారో అంత తండ్రి సమానం శక్తిశాలిగా అవుతారు. మీరు మాస్టర్లు కదా. అయితే తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులో, అలా మీరందరు కూడా మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సర్వశక్తులను ఇముడ్చుకునేవారు, తండ్రి సమానంగా అయ్యేవారు. తండ్రి మరియు పిల్లలలో, జీవితం ఆధారంగా తేడా కనిపించరాదు. ఎలాగైతే బ్రహ్మాబాబా జీవితాన్ని చూసినట్లయితే బ్రహ్మాబాబా మరియు పిల్లలు సమానంగా కనిపించారు. సాకారంలో బ్రహ్మాబాబా కర్మలు చేసి చూపించేందుకు నిమిత్తంగా అయ్యారు కదా. అలా సమానంగా అవ్వడమనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం. మరి సర్వశక్తులు ఉన్నాయా. ధారణనైతే చేశారు కానీ శాతంగా చేశారు. ఎంత ఉండాలో అంత లేదు. సంపన్నంగా లేరు. సంపన్నంగా అయితే అవ్వాలి కదా. కావున శాతాన్ని పెంచండి. శక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించాలి. దీని ఆధారంగానే నెంబరు లభిస్తుంది. ఒకవేళ సమయానికి కార్యంలో వినియోగించకుంటే ఏమంటారు? ఉన్నా కూడా లేనట్లే అని అంటారు. ఎందుకంటే అవి సమాయనికి ఉపయోగపడలేదు. కావున సమయానుసారంగా ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించగలమా అని పరిశీలించుకోండి. కావున తండ్రి సమానం మాస్టర్ సర్వశక్తివంతులుగా ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందు కనిపించాలి. అప్పుడే సర్వశక్తివంతులు ప్రత్యక్షమయ్యారని విశ్వం అంగీకరిస్తుంది. ఇదే లక్ష్యముంది కదా. గోల్డెన్ జూబ్లీ వరకు నెంబరు ఎవరు తీసుకుంటారో చూస్తాము. అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు విశేషమైన హోంవర్క్
ఒకవేళ ఏ విధమైన భారీతనం లేక భారము ఉంటే ఆత్మిక వ్యాయామం చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి అనగా సాకారీ స్వరూపధారిగా అయి సాకార సృష్టి పై పాత్రను అభినయించండి. ఇప్పుడిప్పుడే ఆకారి ఫరిస్తాగా అయి ఆకారీ వతనవాసిగా అయి అవ్యక్త రూపాన్ని అనుభవం చేయండి. ఇప్పుడిప్పుడే నిరాకారిగా అయి మూలవతన వాసిగా అనుభవం చేయండి. ఈ అభ్యాసము ద్వారా తేలికగా అయిపోతారు, భారీతనము సమాప్తమైపోయింది.

వరదానము :- '' విశ్వకళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మకు భద్రతా ప్రణాళిక (సేఫ్టీ ప్లాన్)ను తయారు చేసే సత్యమైన దయాహృదయులుగా అవ్వండి (రహమ్‌దిల్ భవ) ''
వర్తమాన సమయంలో అనేక ఆత్మలు తమకు తామే స్వయానికి అకళ్యాణానికి నిమిత్తంగా అవుతున్నారు. వారి కోసం దయాహృదయులుగా అయి ప్లాను ఏదైనా తయారు చేయండి. ఏ ఆత్మ పాత్రనైనా చూసి స్వయం అలజడిలోకి రాకండి. కానీ వారి భద్రతా(సేఫ్టీ) సాధనము గురించి ఆలోచించండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, వృక్షానికి రాలడం(విరగడం) సహజం అని కాదు. వచ్చిన విఘ్నాలను సమాప్తం చేయండి. విశ్వకళ్యాణకారి లేక విఘ్నవినాశకులనే టైటిల్ ఏదైతే ఉందో దాని అనుసరించి సంకల్పాలు, వాక్కు మరియు కర్మలలో దయాహృదయులుగా అయి వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో సహయోగిగా అవ్వండి.
స్లోగన్ :- '' ఎవరైతే బుద్ధి పై అటెన్షన్ అనే కాపలా ఉంచుతారో, వారే కర్మయోగులుగా అవ్వగలరు ''
No comments:
Post a Comment