02-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇది అద్భుతమైన సత్సంగము. ఇక్కడ మీకు జీవించి ఉండే మరణించడం నేర్పించబడ్తుంది. జీవించి ఉండి మరణించువారే హంసలుగా అవుతారు.''
ప్రశ్న :- పిల్లలైన మీకిప్పుడు ఏ ఒక్క చింత ఉంది ?
జవాబు :- మేము వినాశనానికి ముందే సంపన్నంగా అవ్వాలి అనే చింత ఉంది. ఏ పిల్లలైతే జ్ఞాన - యోగాలలో శక్తిశాలిగా అవుతూ ఉంటారో, వారికి మనుష్యులను దేవతలుగా చేయాలనే అలవాటు అవుతూ ఉంటుంది. వారు సర్వీసు చేయకుండా ఉండలేరు. జిన్ను(భూతము) వలె పరుగులు తీస్త్తూ ఉంటారు. సర్వీసు(సేవ) చేయడంతో పాటు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలనే చింత ఉంటుంది.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఇప్పుడు సాకారములో ఉంది. అంతేకాక ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా కూడా ఉంది. ఎందుకంటే దత్తత తీసుకోబడింది. వీరు సోదర-సోదరీలుగా చేస్తారని మీ గురించి అందరూ అంటారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పరస్పరములో సోదరులని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు నూతన సృష్టి రచన జరుగుతుంది కనుక మొట్టమొదట శిఖ సమానమైన బ్రాహ్మణులు కావాలి. మీరు శూద్రులుగా ఉండేవారు ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యారు (పరివర్తనయ్యారు). బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ఈ లెక్కతో పిల్లలైన మనమంతా సోదరీ-సోదరులమని మీరు భావిస్తారు. బ్రహ్మకుమార-కుమారీలని స్వయాన్ని చెప్పుకుంటున్న వారంతా తప్పకుండా సోదరీ- సోదరులవుతారు. అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే కనుక పరస్పరము సోదరీ-సోదరులుగానే ఉండాలి. ఇది తెలియనివారికి అర్థం చేయించాలి. బుద్ధిహీనతతో పాటు అంధ విశ్వాసములో కూడా ఉన్నారు. ఎవరిని పూజిస్తున్నారో, ఎవరి పై వీరు ఫలానా అని విశ్వాసముంచుతున్నారో వారిని గురించి కొద్దిగా కూడా తెలియదు. లక్ష్మినారాయణులను పూజిస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారు? ఎలా తయారయ్యారు? తర్వాత ఎక్కడకు వెళ్లారు? అని ఎవ్వరికీ తెలియదు. నెహ్రూ మొదలైన మనుష్యులను గురించి తెలుసు. వారి చరిత్ర-భూగోళాల గురించి కూడా అందరికీ తెలుసు. జీవన చరిత్ర తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు? పూజిస్తారు కాని వారి జీవితకథను గురించి తెలియదు. మనుష్యుల జీవితకథ అయితే తెలుసు కానీ ఏ గొప్పవారైతే గతించిపోయారో వారిలో ఒక్కరి జీవితకథ గురించి కూడా తెలియదు. శివునికి ఎంత మంది పూజారులున్నారు! పూజిస్తారు మళ్లీ వారు రాయి-రప్పలలో అణువణువులో ఉన్నారని చెప్తారు. ఇదేమైనా జీవితకథనా? ఇది తెలివైన విషయము కాదు. స్వయాన్ని కూడా పతితులుగానే పిలుచుకుంటారు. పతితమనే పదము ఎంత ఖచ్ఛితంగా సరిపోతుంది! 'పతితులు' అనగా వికారులు. బ్రహ్మకుమార-కుమారీలని ఎందుకు పిలువబడ్తారో మీరు అర్థం చేయించగలరు. ఎందుకంటే దత్తత తీసుకోబడిన బ్రహ్మ సంతానము. మనము కుఖవంశావళి వారము కాదు, ముఖ వంశస్థులము. బ్రాహ్మణ-బ్రాహ్మణీలు సోదర-సోదరీలు అవుతారు కదా. కావున వారికి పరస్పరములో చెడు దృష్టి ఉండజాలదు. చెడు ఆలోచన ముఖ్యంగా కామ వికారానికి సంబంధించినది. మేము ప్రజాపిత బ్రహ్మకు సంతానము, సోదరీ-సోదరులవుతామని మీరు చెప్తారు. శివబాబా సంతానులైన మేము పరస్పరములో సోదరులము(భాయీ-భాయీ) అని కూడా భావిస్తారు. ఇది కూడా పక్కాగా ఉంది. ప్రపంచానికి ఏమీ తెలియదు. ఏదో నామమాత్రానికి అనేస్తారు. సర్వాత్మల తండ్రి వారు ఒక్కరే అని మీరు అర్థం చేయించగలరు. వారిని అందరూ పిలుస్తారు. మీరు చిత్రములో కూడా చూపించారు. గొప్ప-గొప్ప ధర్మాలవారు కూడా ఆ నిరాకారులైన తండ్రిని అంగీకరిస్తారు. వారు నిరాకార ఆత్మల తండ్రి. సాకారములో అందరి తండ్రి ప్రజాపిత బ్రహ్మ. అతని ద్వారా మళ్లీ వృద్ధి చెందుతూ ఉంటారు. వృక్షము పెరుగుతూ ఉంటుంది. భిన్న-భిన్న ధర్మాలలో వస్తూ ఉంటారు. ఆత్మ ఈ శరీరానికి భిన్నంగా ఉంది. శరీరాన్ని చూసి వీరు అమెరికన్లు, వీరు ఫలానా అని చెప్తారు. ఇలా ఆత్మను గురించి చెప్పరు. ఆత్మలన్నీ శాంతిధామములో ఉంటాయి. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి. పునర్జన్మలైతే అందరూ తీసుకుంటారు, పై నుండి కూడా కొత్త ఆత్మలు వస్తూ ఉంటాయని మీరు ఏ ధర్మము వారికైనా వినిపించండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు కూడా మనుష్యులే. మనుష్యులకే ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతోంది, దీని రచయిత ఎవరు, ఇది తిరిగేందుకు ఎంత సమయము పడ్తుంది? అని సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి తెలియాలి. ఇది మీకే తెలుసు. దేవతలకు తెలియదు. మనుష్యులు తెలుసుకొని తర్వాత మళ్లీ దేవతలుగా అవుతారు. మనుష్యులను దేవతలుగా చేయువారు తండ్రి. వారు తమ పరిచయాన్ని, వారి రచన పరిచయాన్ని కూడా ఇస్తారు. బీజరూపులైన తండ్రికి మనము బీజరూపులైన పిల్లలమని మీకు తెలుసు. ఎలాగైతే ఉల్టా(తలక్రిందుల) వృక్షము గురించి తండ్రికి తెలుసో, అలా మనము కూడా తెలుసుకున్నాము. మానవులు మానవులకు ఎప్పటికీ అర్థము చేయించలేరు. కానీ మీకు తండ్రి అర్థం చేయించారు.
మీరు బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంత వరకు ఇక్కడకు రాలేరు. పూర్తి కోర్సును తీసుకొని అర్థం చేసుకోనంత వరకు వారిని బ్రాహ్మణుల సభలో ఎలా కూర్చోపెట్టగలరు? దీనిని ' ఇంద్ర సభ ' అని కూడా అంటారు. ఇంద్రుడేమీ ఆ నీటి వర్షమును కురిపించరు. ఇంద్రసభ అని అనబడ్తుంది. అందులో పరీలు(దేవకన్యలు, ఫరిస్తాలు)గా కూడా మీరే అవ్వాలి. అనేక విధాలైన దేవతలు మహిమ చేయబడ్డారు. ఏ పిల్లలైనా శోభాయమానంగా(సుందరంగా) ఉంటే వీరు దేవకన్యల వలె ఉన్నారని అంటారు కదా. పౌడరు మొదలైనవి పూసుకొని సుందరరగా అవుతారు. సత్యయుగములో పిల్లలైన మీరు దైవీ రాకుమార - రాకుమారీలుగా అవుతారు. మీరిప్పుడు జ్ఞాన సాగరములో జ్ఞాన స్నానము చేయడం ద్వారా దేవీ దేవతలుగా అవుతారు. ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నామో మీకు తెలుసు! ఏ తండ్రి అయితే సదా పవిత్రులో, సదా సుందరమైనవారో ఆ తండ్రి బాటసారియై మిమ్ములను ఇలా తయారు చేసేందుకు పతిత తనువులో ప్రవేశిస్తారు. ఇప్పుడు సుందరంగా ఎవరు తయారు చేస్తారు? బాబా తయారు చేయవలసి ఉంటుంది కదా. సృష్టి చక్రమైతే తిరగాల్సిందే(తిరుగుతూనే ఉంటుంది). మీరిప్పుడు సుందరంగా అవ్వాలి. చదివించేవారు జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరే. జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు అని ఆ తండ్రికి ఉన్నంత మహిమ లౌకిక తండ్రికి ఉండజాలదు. ఈ మహిమ బేహద్ తండ్రిదే. అంతటి మహిమ ఉన్న ఓ తండ్రీ! వచ్చి మమ్ములను మహిమా యోగ్యులుగా తయారుచేయండి అని అందరూ వారినే ప్రార్థిస్తారు. మీరిప్పుడు నంబరువారు పురుషార్థానుసారము అవుతున్నారు కదా. చదువులో అందరూ ఒకే విధంగా ఉండరు. రాత్రికి, పగలుకున్నంత తేడా ఉంటుంది కదా. మీ వద్దకు కూడా చాలా మంది వస్తారు. బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. అందరికంటే బాగా చదువుకునేవారు ఇతరులను కూడా చదివించగలరు. ఎన్ని కాలేజీలు తెరవబడుతూ ఉంటాయో మీరు అర్థం చేసుకోగలరు. ఈ కళాశాలలో రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము లభిస్తుందని అందరూ తెలుసుకునే విధంగా కాలేజ్‌ను తయారు చేయండని తండ్రి కూడా చెప్తారు. తండ్రి భారతదేశములోనే వస్తారు కనుక భారతదేశములోనే కాలేజీలు తెరుస్తూ ఉంటారు. పోను పోను విదేశాలలో కూడా తెరుస్తూ ఉంటారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు చాలా కావాలి కదా. చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకొని, చదువు పూర్తి అయిన తర్వాత అందరూ దేవీదేవతా ధర్మములోకి బదిలీ అయిపోతారు అనగా మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు కదా. మానవుల నుండి దేవతలుగా చేసేవారి మహిమ వర్ణించనలవి కాదు............. (మనుష్య సే దేవతా కియే కరత్ నా లాగీ వార్..........) అని గాయనము కూడా ఉంది. ఇది మానవుల ప్రపంచము, అది దేవతల ప్రపంచము. దేవతలకు, మనుష్యులకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. పగలులో దేవతలు, రాత్రిలో మానవులు ఉంటారు. అందరూ భక్తులుగా, పూజారులుగానే ఉన్నారు. మీరిప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. సత్యయుగములో శాస్త్రాలు, భక్తి మొదలైన పేర్లు(పదాలు) కూడా ఉండవు. అక్కడ అందరూ దేవతలుగానే ఉంటారు. మానవులు భక్తులుగా ఉంటారు. మానవులే మళ్లీ దేవతలుగా అవుతారు. అది దైవీ ప్రపంచము. దీనిని ఆసురీ ప్రపంచమని అంటారు. రామరాజ్యము మరియు రావణ రాజ్యము. రావణ రాజ్యమని దేనినంటారో, రావణుడు ఎప్పుడు వచ్చాడో ఇంతకు ముందు మీకు ఏ మాత్రమూ తెలియదు. లంక సముద్రములో మునిగిపోయిందని అంటారు. అదే విధంగా ద్వారక గురించి కూడా అంటారు. ఈ మొత్తం లంక అంతా మునిగిపోతుందని మీకు తెలుసు. ప్రపంచమంతా అనంతమైన లంకగా ఉంది. ఇదంతా మునిగిపోతుంది. నీరు వచ్చేస్తుంది. స్వర్గము మాత్రము మునిగిపోదు. ఎంత అపారమైన ధనముండేది! ఒక్క సోమనాథ మందిరములోనే ముసల్మానులు ఎంత లూటీ చేశారు! (మహమ్మద్ గోరీ గజనీ 17 సార్లు దండెత్తి వచ్చి ఒక్క సోమనాథ మందిరములో ఉన్న అమూల్యమైన ఖజానాలను 17 వేల ఒంటెల పైన తన దేశానికి దోచుకుపోయాడు). ఇప్పుడు చూడండి ఏమీ లేదు. భారతదేశములో ఎంత అపారమైన ధనముండేది! భారతదేశమునే స్వర్గమని అంటారు. ఇప్పుడు స్వర్గమని అంటారా? ఇప్పుడు నరకంగా ఉంది. మళ్లీ స్వర్గముగా అవుతుంది. స్వర్గమును ఎవరు తయారు చేశారో, నరకమును ఎవరు తయారుచేశారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. రావణరాజ్యము ఎంతకాలము ఉంటుందో కూడా తెలిపించారు. రావణరాజ్యములో ఎన్ని ధర్మములైపోయాయి. రామరాజ్యములో అయితే కేవలం సూర్య వంశము, చంద్ర వంశములు మాత్రమే ఉంటాయి. మీరిప్పుడింకా చదువుకుంటున్నారు. ఈ చదువు మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. వారు రావణరాజ్యములోనే ఉన్నారు. సత్యయుగములో రామరాజ్యముంటుంది. నేను మిమ్ములను యోగ్యులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. తర్వాత మళ్లీ మీరు అయోగ్యులుగా అవుతారు. అయోగ్యులని ఎందుకు అంటారు? ఎందుకంటే పతితులుగా అవుతారు. దేవతల అర్హతా మహిమను, తమ అనర్హతా మహిమను గానం చేస్తారు.
మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచముండేదని తండ్రి అర్థం చేయిస్తారు. చాలా కొంతమంది మనుష్యులు ఉండేవారు. విశ్వమంతటికీ మీరే అధికారులుగా ఉండేవారు. మీకిప్పుడు చాలా సంతోషముండాలి. సోదరీ-సోదరులుగా అవుతారు కదా. వీరు ఇల్లు-వాకిళ్లను వదిలింపజేస్తారని వారంటారు. తర్వాత వారే వచ్చి శిక్షణ తీసుకున్నప్పుడు జ్ఞానము చాలా బాగుందని అర్థం చేసుకుంటారు. అర్థము చేసుకుంటారు కదా. సోదరీ-సోదరులుగా అవ్వకుంటే పవిత్రత ఎక్కడి నుండి వస్తుంది? అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. చాలా దిగజారిపోయిన, చాలా పతితమైన మగధ దేశములోనే తండ్రి వస్తారు. ఆహార-పానీయాలు కూడా అపవిత్రంగా, మురికిగా ఉంటాయి. అనేక జన్మల తర్వాత అంతిమ శరీరములోనే నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. ఇతడే 84 జన్మలు తీసుకుంటాడు. లాస్టులో ఉన్నవారే మళ్లీ ఫస్టుకు, ఫస్టులోని వారే మళ్లీ లాస్ట్‌లోకి వస్తారు. ఎవరైనా ఒకరిది మాత్రమే ఉదాహరణగా చెప్తారు కదా. మీ వంశము తయారవ్వబోతుంది. ఎంత బాగా అర్థము చేసుకుంటూ ఉంటారో అంతగా మీ వద్దకు చాలామంది వస్తారు. ఇప్పుడు ఈ వృక్షము చాలా చిన్నదిగా ఉంది. తుఫానులు కూడా చాలా వస్తాయి. సత్యయుగములో తుఫానుల ప్రసక్తే లేదు. పై నుండి కొత్త కొత్త ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడ తుఫానులు రాగానే పడిపోతారు. అక్కడ మాయ తుఫానులే ఉండవు. ఇక్కడైతే కూర్చున్నవారు కూర్చునే మరణిస్తారు. మాయతో మీరు యుద్ధము చేస్తున్నారు. కావున అది కూడా హైరానా పెడ్తుంది. సత్యయుగములో ఇది ఉండదు. ఇతర ధర్మాలలో ఈ విషయాలు ఉండవు. రావణరాజ్యము మరియు రామరాజ్యము గురించి మరెవ్వరికీ తెలియదు. సత్సంగానికి వెళ్తారు కానీ అక్కడ మరణించే, జీవించే విషయాలుండవు. ఇక్కడైతే పిల్లలను దత్తు తీసుకుంటారు. మేము శివబాబాకు పిల్లలమని వారి నుండి వారసత్వము తీసుకుంటామని అంటారు. తీసుకుంటూ తీసుకుంటూ దిగజారిపోగానే వారసత్వమంతా సమాప్తమైనట్లే. హంసల నుండి కొంగలుగా మారిపోతారు. అయినా తండ్రి దయాహృదయులు కనుక అర్థం చేయిస్తూనే ఉంటారు. కొందరు మళ్లీ పైకి ఎక్కుతారు. స్థిరముగా ఉన్నవారిని మహావీరులని, హనుమంతులని అంటారు. మీరు మహావీరులు, మహావీర వనితలు నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. అందరికంటే శక్తివంతముగా ఉన్నవారిని మహావీరులని అంటారు. ఆదిదేవుని కూడా మహావీరుడని అంటారు. వీరి ద్వారానే ఈ మహావీరుడు జన్మించి ఈ విశ్వమంతటి పై రాజ్యపాలన చేస్తాడు. నంబరువార్ పురుషార్థానుసారంగా రావణుని పై విజయము పొందేందుకు పురుషార్థము చేస్తూ ఉంటారు. రావణుడంటే పంచ వికారాలు. ఇది అర్థము చేసుకునే విషయము. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తండ్రి తెరుస్తారు. మళ్లీ తాళము పూర్తిగా మూసుకుపోతుంది. ఇక్కడ కూడా ఎవరి తాళము తెరుచుకుంటుందో వారు వెళ్లి సర్వీసు చేస్తారు. వెళ్లి సర్వీసు చేయండి, మురికిలో పడిపోయిన వారిని వెలుపలికి తీయండి అని తండ్రి చెప్తారు. మిమ్ములను కూడా మురికి కాలువలో పడిపొమ్మని చెప్పరు. మీరు బయటపడి ఇతరులను కూడా వెలుపలికి తీయండి. విషయ వైతరణీ నదిలో అపారమైన దు:ఖముంది. ఇప్పుడు అపారమైన సుఖములోకి వెళ్లాలి. చాలా సుఖమునిచ్చేవారిని మహిమ చేస్తారు. దు:ఖమిచ్చే రావణుని మహిమ చేస్తారా? రావణుని అసురుడని అంటారు. మీరు రావణ రాజ్యములో ఉండేవారు. ఇప్పుడు అపారమైన సుఖమును పొందేందుకు మీరు ఇక్కడకు వచ్చారని తండ్రి చెప్తున్నారు. మీకు ఎంత అపారమైన సుఖము లభిస్తుంది! ఎంత సంతోషముండాలి! జాగ్రత్తగా కూడా ఉండాలి. హోదా అయితే నంబరువారుగా ఉంటుంది. ప్రతి పాత్రధారి పదవి వేరు వేరుగా ఉంటుంది. అందరిలో ఈశ్వరుడు ఉండరు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరు తండ్రిని, రచన యొక్క ఆదిమధ్యాంతాలను గురించి నంబరువారు పురుషార్థానుసారము తెలుసుకుంటారు. చదువు నంబరువారు చదువు పైనే మార్కులు ఉంటాయి. ఇది అనంతమైన చదువు. ఇందులో పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజు కూడా చదువును మిస్ చేయరాదు. మేము విద్యార్థులము, గాడ్‌ఫాదర్ అయిన భగవంతుడు తండ్రి చదివిస్తున్నారనే నషా పిల్లలకు ఎక్కి ఉండాలి. భగవానువాచ, వారు కేవలం పేరు మార్చి కృష్ణుని పేరు వేసేశారు. తప్పు జరిగినందున కృష్ణ భగవానువాచ అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే తండ్రి స్థాపిస్తున్న స్వర్గములో నంబర్‌వన్ కృష్ణుడే కదా. ఈ జ్ఞానము మీకిప్పుడే లభించింది. నంబరువారు పురుషార్థానుసారము స్వయం కళ్యాణము చేసుకుంటూ ఇతరుల కళ్యాణము కూడా చేస్తూ ఉంటారు. వారికి సర్వీసు లేకుండా ఎప్పుడూ సుఖము దొరకదు.
పిల్లలైన మీరు జ్ఞాన-యోగాలలో దృఢంగా అయితే జిన్ను వలె పని చేస్తారు. మనుష్యులను దేవతలుగా చేసే అలవాటవుతుంది. మరణించక ముందే పాస్ అవ్వాలి. సర్వీసు చాలా చేయాలి. చివర్లో అయితే యుద్ధము ప్రారభమైపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. లాస్ట్ నుండి ఫస్ట్‌లోకి వెళ్లేందుకు మహావీరులుగా అయి పురుషార్థము చేయాలి. మాయ తుఫానులు వచ్చినప్పుడు కదలరాదు. తండ్రి సమానము దయాహృదయులై మానవుల బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరిచే సేవ చేయాలి.
2. జ్ఞాన సాగరములో ప్రతి రోజూ జ్ఞాన స్నానము చేసి దైవీ రాజకుమార-కుమారీలుగా అవ్వాలి. ఒక్క రోజు కూడా చదువును వదలరాదు. ''భగవంతుని విద్యార్థులము'' అనే నషాలో ఉండాలి.
వరదానము :- '' హృదయపూర్వకంగా 'నా బాబా (మేరా బాబా)' అంటూ సత్యమైన వ్యాపారము చేసే సరెండర్ లేక మరజీవా భవ ''
బ్రహ్మకుమార-కుమారీలుగా అవ్వడమనగా సరెండర్(సమర్పణ) అవ్వడం. ఎప్పుడైతే హృదయపూర్వకంగా 'మేరా బాబా' అని అంటారో అప్పుడు బాబా కూడా పిల్లలూ, నా సర్వస్వమూ మీదే అని అంటారు. ప్రవృత్తిలో ఉన్నా, సెంటర్లో ఉన్నా ఎవరైతే హృదయపూర్వకంగా 'నా బాబా' అని అన్నారో వారిని తండ్రి తనవారిగా చేసుకున్నారు. ఇది హృదయంతో చేసే వ్యాపారము. నోటితో చేసే స్థూల వ్యాపారము కాదు. సరెండర్ అనగా శ్రీమతమును అనుసరించువారు. ఇలా సరెండర్ అయినవారే మరజీవా బ్రాహ్మణులు(జీవించి ఉండే మరణించిన బ్రాహ్మణులు).
స్లోగన్ :- '' 'నాది' అనే శబ్ధము పై ప్రేమ ఉంటే అనేకమైన 'నాది' ని ఒక్క 'నా బాబా' లో ఇమిడ్చి వేయండి. ''
No comments:
Post a Comment