03-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఆబూ అన్నిటికంటే గొప్ప తీర్థ స్థానము, స్వయం భగవంతుడే ఇక్కడ నుండి అందరికీ సద్గతి ఇచ్చారనే రహస్యాన్ని అందరికీ తెలపండి ''
ప్రశ్న :- ఏ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది ?
జవాబు :- తండ్రి ఇంతకుముందు నేర్పించిన రాజయోగాన్ని ఇప్పుడు మళ్లీ నేర్పిస్తున్నారు, వారు సర్వవ్యాపి కాదు అను ముఖ్యమైన విషయాన్ని అర్థము చేసుకోండి. తండ్రి ఆబూలో వచ్చి విశ్వమంతటా శాంతిని స్థాపిస్తున్నారు, వారి జడ స్మారకచిహ్నంగా దిల్వాడా మందిరము కూడా ఉంది. ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంగా కూర్చుని ఉన్నారు, ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. ఈ విషయాన్ని అర్థము చేసుకుంటే ఆబూ మహిమాన్వితమైపోతుంది మరియు ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. ఆబూ పేరు ప్రసిద్ధి చెందితే ఇక్కడకు చాలామంది వస్తారు.
ఓంశాంతి. పిల్లలకు యోగము నేర్పించారు. ఇతర స్థానాలన్నిటిలో వారే నేర్చుకుంటారు, అక్కడ నేర్పించేందుకు తండ్రి ఉండరు, ఒకరికొకరు వారే నేర్పించుకుంటారు. ఇక్కడ తండ్రి కూర్చుని పిల్లలకు నేర్పిస్తారు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. అక్కడైతే బంధు-మిత్రులు మొదలైనవారంతా గుర్తుకు వస్తూ ఉంటారు. ఇక్కడ చేసినంతగా అక్కడ స్మృతి చేయలేరు. అందువలన దేహి-అభిమానులుగా చాలా కష్టంగా తయారవుతారు. ఇక్కడైతే మీరు చాలా త్వరగా దేహి- అభిమానులుగా తయారవ్వాలి, కాని చాలామందికి ఏమీ తెలియదు. శివబాబా మనకు సేవ చేస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని మనకు చెప్తున్నారు. వీరిలో విరాజమానమై ఉన్న తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా మనకు నేర్పిస్తున్నారని చాలామంది పిల్లలకు నిశ్చయమే లేదు. ఎలాగైతే ఇతరులు మేము నిశ్చయము ఎలా చేసుకోవాలని అంటుంటారో, అలా ఇక్కడ కూడా ఉన్నారు. ఒకవేళ పూర్తిగా నిశ్చయముంటే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ స్వయంలో బలము నింపుకుంటారు. చాలా సర్వీసు చేస్తారు, ఎందుకంటే మొత్తం విశ్వాన్ని పావనంగా చేయాలి కదా. యోగములో బలహీనంగా ఉంటే జ్ఞానములో కూడా బలహీనంగా ఉంటారు. వింటారు కానీ ధారణ జరగదు. ఒకవేళ ధారణ అయ్యి ఉంటే ఇతరులతో కూడా ధారణ చేయిస్తారు. బాబా అర్థం చేయించారు - వారు సమావేశాలు మొదలైనవి చేస్తూ ఉంటారు, విశ్వములో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు, కాని విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో, ఏ విధంగా ఏర్పడిందో కొంచెం కూడా తెలియదు. అప్పుడు ఏ విధమైన శాంతి ఉండేదో, అదే కావాలి కదా. విశ్వములో సుఖము, శాంతి ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. దిల్వాడా మందిరము ఎలా ఉందో చూడండి. ఆదిదేవుడు కూడా ఉన్నాడు. పైన విశ్వములో శాంతి దృశ్యము కూడా ఉంది. ఎక్కడైనా సమావేశాలకు మిమ్ములను పిలిస్తే, విశ్వములో ఏ విధమైన శాంతి కావాలి? అని వారిని అడగండి. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో విశ్వమంతటా శాంతి ఉండేది. ఆ పూర్తి స్మృతి చిహ్నము దిల్వాడా మందిరములో ఉంది. విశ్వములో శాంతి ఉన్న నమూనా ఉండాలి కదా! లక్ష్మీనారాయణుల చిత్రం ద్వారా కూడా అర్థము చేసుకోరు. రాతి బుద్ధి గలవారు కదా! విశ్వములో శాంతి నమూనా మేము తెలుపగలమని వారికి చెప్పాలి. విశ్వములో శాంతికి శ్యాంపుల్ ఒకటేమో ఈ లక్ష్మీనారాయణ చిత్రము. వీరి రాజధానిని చూడాలంటే దిల్వాడా మందిరానికి వెళ్లి చూడండి అని చెప్పండి. మాడల్‌ను మాత్రమే చూపడం జరుగుతుంది కదా! దానిని ఆబూకు వెళ్లి చూడండి. ఆ స్మారక మందిరాన్ని తయారు చేసి, దానికి దిల్వాడా మందిరమని పేరు పెట్టినవారికి కూడా తెలియదు. మందిరంలో ఆదిదేవుని కూడా కూర్చోబెట్టారు, పైన స్వర్గమును కూడా చూపించారు. అక్కడ జడంగా ఉన్న విధంగా ఇక్కడ మీరు చైతన్యంగా ఉన్నారు. దీనిని చైతన్య దిల్వాడా అని పేరు పెట్టవచ్చు. కాని తెలిస్తే ఎంత రద్దీగా అయిపోతుందో తెలియదు. ఇదేమిటని మనుష్యులే తికమక చెందుతారు. అర్థము చేయించడం చాలా కష్టమవుతుంది. చాలామంది పిల్లలు కూడా అర్థము చేసుకోరు, భలే ద్వారము వద్ద దగ్గర కూర్చుని ఉన్నా కొంచెం కూడా అర్థము చేసుకోరు. ప్రదర్శినీకి అనేక రకాల మనుష్యులు వెళ్తారు. చాలామంది మఠాధిపతులు, వైష్ణవ ధర్మము వారు కూడా ఉన్నారు. వైష్ణవ ధర్మమంటే ఏమో అర్థమే చేసుకోరు. కృష్ణుని సామ్రాజ్యము ఎక్కడ ఉండేదో తెలియనే తెలియదు. కృష్ణుని రాజ్యమునే స్వర్గము అని, వైకుంఠమని అంటారు.
ఎక్కడ నుండి పిలుపు వచ్చినా అక్కడకు వెళ్లి విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో అర్థం చేయించండి అని తండ్రి చెప్పారు. ఈ ఆబూ సర్వ శ్రేష్ఠ తీర్థ స్థానము. ఎందుకంటే ఇక్కడ తండ్రి విశ్వానికి సద్గతినిస్తున్నారు, వారి నమూనాను చూడాలంటే ఆబూ పర్వతము పైకి వెళ్లి దిల్వాడా మందిరాన్ని చూడండి. విశ్వములో శాంతి ఎలా స్థాపించారో దాని నమూనా ఉంది. ఇది విని వారు చాలా సంతోషిస్తారు. జైనులు కూడా సంతోషిస్తారు. ఈ ప్రజాపిత బ్రహ్మ అయిన ఆదిదేవుడు మా తండ్రి అని మీరు చెప్తారు. మీరు అర్థం చేయించినా అర్థము చేసుకోరు. బ్రహ్మకుమారీలు ఏమి చెప్తారో ఏమిటో తెలియదు అని అంటారు. కావున పిల్లలైన మీరు ఆబూ గురించి చాలా మహిమ చేస్తూ అర్థం చేయించాలి. ఆబూ చాలా గొప్ప తీర్థ స్థానము అని బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు, ఎందుకంటే పరమపిత పరమాత్మ ఆబూలో వచ్చి స్వర్గమును స్థాపించారు. ఎటువంటి స్వర్గమును రచించారో ఆ స్వరము మాడల్, ఆదిదేవుని నమూనా మొదలైనవన్నీ ఆబూలో ఉన్నాయి. దానిని మానవులెవ్వరూ అర్థము చేసుకోరు. ఇప్పుడు మేము తెలుసుకున్నాము, మీకు తెలియదు, కావున మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పండి. విశ్వములో ఏ విధమైన శాంతి కావాలనుకుంటున్నారు? దానిని ఎప్పుడైనా చూశారా? అని మొదట వారిని అడగండి. విశ్వమంతటా లక్ష్మీనారాయణుల రాజ్యములో శాంతి ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమొక్కటే ఉండేది, వారి వంశము వారి రాజ్యము ఉండేది. మీరు వస్తే వీరి రాజధాని నమూనాను ఆబూలో మీకు చూపిస్తాము. ఇది పతితమైన పాత ప్రపంచము. దీనిని కొత్త ప్రపంచమని అనరు కదా. క్రొత్త ప్రపంచము నమూనా ఇక్కడ ఉంది, క్రొత్త ప్రపంచము ఇప్పుడు స్థాపన అవుతోంది. మీరు తెలుసుకున్నారు కనుక ఇతరులకు చెప్తారు. ఇది అందరికీ తెలియదు కనుక తెలుపలేరు. వారికి అర్థమే కాదు. విషయము చాలా సహజమైనది. పైన స్వర్గ రాజధాని చిత్రముంది, క్రింద ఆదిదేవుడు కూర్చుని ఉన్నాడు. అతనిని ఏడమ్ అని కూడా అంటారు. అతను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మీరు మహిమ చేసి వినిపిస్తే వారు సంతోషిస్తారు. మహిమ కరెక్టుగా కూడా ఉంది. మీరు కృష్ణుని మహిమ చేస్తున్నారు కాని మీకేమీ తెలియదు అని వారికి చెప్పండి. కృష్ణుడైతే వైకుంఠానికి మహారాజుగా, విశ్వానికి యజమానిగా ఉండేవాడు. దాని నమూనాను చూడాలనుకుంటే ఆబూ పర్వతానికి పదండి. మీకు వైకుంఠము నమూనాను చూపిస్తాము అని చెప్పండి. పురుషోత్తమ సంగమ యుగములో రాజయోగము నేర్చుకుని, విశ్వాధికారులుగా ఎలా అయ్యారో దాని నమూనాను కూడా చూపించండి. సంగమ యుగములోని తపస్సును కూడా చూపించండి. వాస్తవంగా ఏదైతే జరిగిందో, దాని స్మృతి చిహ్నాన్ని చూపించండి. లక్ష్మీనారాయణుల రాజ్యమును స్థాపించిన శివబాబా చిత్రము కూడా ఉంది, అంబ మందిరము కూడా ఉంది. అంబకు 10-20 భుజాలేమీ లేవు, రెండు భుజాలే ఉంటాయి. వస్తే మీకు చూపిస్తాము. వైకుంఠాన్ని కూడా ఆబూలో చూపిస్తాము. ఆబూలోనే తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటినీ స్వర్గంగా తయారు చేశారు, సద్గతినిచ్చారు. ఆబూ అన్నిటికంటే గొప్ప తీర్థ స్థానము. సర్వ ధర్మాల వారికి సద్గతినిచ్చే తండ్రి ఒక్కరే. మీరు వస్తే వారి స్మారకచిహ్నాన్ని ఆబూలో చూపిస్తాము. ఆబూ గురించి మీరు చాలా మహిమ చేయవచ్చు. మీరు స్మారకచిహ్నాలన్నీ చూపించాలి. క్రైస్తవులు కూడా ప్రాచీన భారతదేశపు రాజయోగాన్ని ఎవరు నేర్పించారో, అది ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆబూలో చూస్తాము పదండి అని వారికి చెప్పండి. వైకుంఠాన్ని కూడా పూర్తి సరియైన విధంగా పై కప్పులో ఖచ్ఛితంగా తయారుచేశారు. మీరు అలా తయారుచేయలేరు. ఈ విధంగా చాలా బాగా తెలియజేయాలి. పర్యాటకులు మోసపోతూ ఉంటారు, వారు కూడా వచ్చి తెలుసుకోనివ్వండి. ఆబూలో మీ పేరు ప్రసిద్ధి చెందితే చాలామంది వస్తారు. ఆబూ చాలా ప్రసిద్ధి చెందుతుంది. విశ్వములో శాంతి ఎలా వస్తుంది అని ఎవరైనా అడుగుతారు, సమ్మేళనాలు మొదలైన వాటిలో ఆహ్వానించినప్పుడు, విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో మీకు తెలుసునా? అని అడగాలి. విశ్వములో శాంతి ఎలా ఉండేదో మేము అర్థం చేయిస్తాము పదండి, నమూనాలన్నీ చూపిస్తాము. ఇటువంటి నమూనాలు మరెక్కడా లేవు అని చెప్పండి. ఆబూయే అన్నింటికంటే ఉన్నతమైన గొప్ప తీర్థ స్థానము, ఇక్కడకు తండ్రి వచ్చి విశ్వములో శాంతిని నెలకొల్పి, సర్వులకు సద్గతినిచ్చారు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు, ఎంత గొప్ప మహారథులైనా, మ్యూజియమ్ మొదలైన వాటిని నిర్వహిస్తున్నా సరియైన విధంగా అర్థం చేయిస్తున్నారా లేదా? అని తండ్రి చూస్తారు కదా. ఎవరు ఎక్కడున్నా బాబా అన్నీ అర్థం చేసుకుంటారు. ఎవరెవరు పురుషార్థము చేస్తున్నారు, ఏ పదవిని పొందుతారో బాబా అన్నీ తెలుసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు మరణిస్తే ఏ పదవినీ పొందుకోలేరు! స్మృతి యాత్రలోని శ్రమను వారు అర్థము చేసుకోలేరు. తండ్రి ప్రతి రోజూ క్రొత్త క్రొత్త విషయాలు అర్థం చేయిస్తారని తెలియజేసి పిలుచుకొని రండి. ఇక్కడ స్మారక చిహ్నము స్థిరంగా ఉంది.
నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఆదిదేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు, వైకుంఠము కూడా ఇక్కడే ఉంది అని తండ్రి చెప్తారు. ఆబూ మహిమ గొప్పగా చేయబడ్తుంది. ఆబూ ఎలా అయిపోతుందో తెలియదు. కురుక్షేత్రాన్ని బాగు చేసేందుకు కోట్లాది రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి. అక్కడ ఎంతమంది మనుష్యులు గుమిగూడుతారు? ఎంత మురికి దుర్గంధము ఉంటుందో అడగనవసరమే లేదు. ఎంత రద్దీగా ఉంటుంది! ఒక భజనమండలి బస్సు నదిలో మునిగిపోయిందని సమాచారము అందింది. ఇదంతా దు:ఖమే కదా. అకాల మృత్యువు సంభవిస్తూనే ఉంటుంది. అక్కడైతే ఇటువంటివి జరగనే జరగవు. ఈ విషయాలన్నీ మీరు అర్థము చేయించవచ్చు. మాట్లాడేవారు చాలా తెలివైనవారిగా ఉండాలి. తండ్రి జ్ఞానాన్ని పంప్ చేస్తున్నారు, బుద్ధిలో నింపుతున్నారు. ఈ విషయాలను ప్రపంచము అర్థము చేసుకోలేదు. వారు క్రొత్త ప్రపంచములో తిరిగేందుకు వెళ్తామని అనుకుంటారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పోనే పోతుందని తండ్రి చెప్తారు. వారైతే ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని చెప్తారు. మీరైతే మొత్తం కల్పమంతా 5 వేల సంవత్సరాలే అని చెప్తారు. పాత ప్రపంచ మృత్యువు ఎదురుగానే ఉంది. దీనిని ఘోరమైన అంధకారమని అంటారు. కుంభర్ణుని వలె నిద్రపోయారు. కుంభకర్ణుడు అర్ధకల్పము నిద్రపోయి, అర్ధకల్పము మేల్కొంటాడు. మీరు కుంభకర్ణునిలా ఉండేవారు. ఇది చాలా అద్భుతమైన ఆట. ఈ విషయాలను అందరూ అర్థము చేసుకోలేరు! కొందరైతే కేవలం భావనతోనే వస్తారు. అందరూ వెళ్తున్నారని వింటే వారు కూడా వచ్చేస్తారు. మేము శివబాబా దగ్గరకు వెళ్తున్నాము, శివబాబా స్వర్గాన్ని స్థాపిస్తున్నారు, ఆ బేహద్ తండ్రిని స్మృతి చేస్తే, బేహద్ వారసత్వము లభిస్తుందని చెప్తే చాలు. శివబాబా మేము మీకు పిల్లలము, మీ ద్వారా తప్పకుండా వారసత్వము తీసుకుంటామని వారు కూడా అంటారు, నావ తీరానికి చేరుకుంటుంది. భావనకు ఎంత ఫలితము లభిస్తుందో చూడండి, భక్తిమార్గములో అయితే అల్పకాలిక సుఖముంది. అనంతమైన(బేహద్) తండ్రి ద్వారా బేహద్ వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఆ భావన అల్పకాలిక సుఖముతో కూడిన ఫలితమును ఇస్తుంది. ఇక్కడ మీకు 21 జన్మల వరకు భావనా ఫలితము లభించింది. ఇక సాక్షాత్కారాలు మొదలైనవాటిలో ఏమీ లేదు. కొందరు సాక్షాత్కారమవ్వాలని అంటారు, అప్పుడు వారికి ఏమీ అర్థము కాలేదని బాబా అర్థము చేసుకుంటారు. సాక్షాత్కారము కావాలంటే వెళ్లి నవ విధాల భక్తి చేయండి. దాని ద్వారా ఏమీ లభించదు. భక్తి చేస్తే మరుజన్మలో కాస్త మంచిగా ఉంటారు. మంచి భక్తులైతే మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడి విషయమే భిన్నమైనది. ఈ పాత ప్రపంచము పరివర్తనైపోతుంది. ప్రపంచాన్ని మార్చేవారు తండ్రియే. స్మారక చిహ్నముంది కదా. చాలా పురాతన మందిరము కొద్దిగా పడిపోతూ ఉంటే మళ్లీ మరమ్మతులు చేయిస్తూ ఉంటారు. కాని ఆ శోభ తగ్గుతూనే ఉంటుంది. ఇవన్నీ వినాశనమయ్యే వస్తువులు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! మొదట మీ కళ్యాణము చేసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది చదివి తెలుసుకోవలసిన విషయము. ఇక మధురలో మధువనము, కుంజగలి మొదలైనవన్నీ కూర్చుని తయారుచేశారు, నిజానికి అవేవీ లేనే లేవు. గోప-గోపికల ఆటలు కూడా ఏవీ లేవు. ఇవి అర్థము చేయించేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క విషయాన్ని కూర్చుని బాగా అర్థం చేయించండి. కాన్ఫరెన్స్(సమ్మేళనము) మొదలైన వాటిలో కూడా యోగ్యులైనవారు కావాలి. కత్తికి పదును లేకపోతే ఎవ్వరికీ బాణము తగలదు. ఇప్పుడింకా సమయముందని తండ్రి కూడా చెప్తారు - పరమపిత సర్వవ్యాపి కాదని అంగీకరిస్తే చాలా రద్దీ అయిపోతుంది. కానీ ఇప్పుడింకా సమయము కాలేదు. ఒప్పుడు రాజయోగాన్ని నేర్పించిన తండ్రి ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారనే ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థము చేసుకోవాలి. శివబాబా పేరుకు బదులు ఈ సమయములో నల్లగా ఉన్నవారి పేరును వేసేశారు, ఎంత పెద్ద తప్పు జరిగింది! దీనితోనే మీ నావ మునిగిపోయింది.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ చదువు సంపాదనకు ఆధారము(మూలము). మానవులను దేవతలుగా చేసేందుకు స్వయం తండ్రియే చదివించేందుకు వస్తారు. ఈ విషయములో తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి, దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నంబర్‌వార్‌గా ఉండనే ఉంటారు. అన్ని సేవాకేంద్రాలలో అందరూ నంబర్‌వార్‌గా ఉన్నారు. మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు(సులభము కాదు). సత్యయుగమును స్వర్గమంటారు, కాని అక్కడ రాజ్యమెలా జరుగుతుందో, దేవతల సమూహమును చూడాలనుకుంటే ఆబూకు పదండి అని చెప్పండి. మరే స్థానములోనూ రాజ్యమును పై కప్పు మీద చూపించలేదు. అజ్మీర్‌లో కూడా స్వర్గము నమూనా ఉంది కానీ అది వేరే విషయము. ఇక్కడైతే ఆదిదేవుడు కూడా ఉన్నారు కదా. సత్యయుగమును ఎవరు, ఎలా స్థాపించారో ఇది సరియైన స్మారక చిహ్నముగా ఉంది. మనమిప్పుడు చైతన్య దిల్వాడా అని వ్రాయలేము. మనుష్యులు తెలుసుకున్నప్పుడు ఈ విధంగా వ్రాయండి అని వారే చెప్తారు, కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు చిన్న-చిన్న విషయాలకు ఏమేమి చేస్తున్నారో చూడండి. చాలా కోపిష్ఠులుగా ఉంటారు, దేహాభిమానము ఉంది కదా. దేహి-అభిమానులుగా పిల్లలైన మీరు తప్ప మరెవ్వరూ ఉండలేరు. పురుషార్థము చేయాల్సి ఉంటుంది. అదృష్టములో ఏది ఉంటే అది అవుతుందని పురుషార్థము చేయువారు అనరు. వారు పురుషార్థము చేస్తూ ఉంటారు. ఫెయిల్ అయినప్పుడు అదృష్టములో ఏమి ఉంటే అది జరుగుతుందని అంటారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము పూర్తిగా చేయాలి. అదృష్టము(తలవ్రాత)లో ఏముంటే అది అని అనుకోరాదు. తెలివైనవారిగా అవ్వాలి.
2. జ్ఞానము విని దానిని స్వరూపములో తీసుకురావాలి. స్మృతి అనే పదునును ధారణ చేసి తర్వాత సేవ చేయాలి. అందరికీ ఆబూ మహాతీర్థ స్థానము మహిమను వినిపించాలి.
వరదానము :- '' తండ్రి జతలో ఉంటూ - ఉంటూ వారి సమానంగా అయ్యే సర్వ ఆకర్షణల ప్రభావము నుండి ముక్త్ భవ ''
ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో అనగా తండ్రి జతలో ఉంటారో, అక్కడ దేహాభిమానము (బాడికాన్షస్) ఉత్పన్నమవ్వజాలదు. తండ్రి జతలో లేక తండ్రి వద్ద ఉండేవారు ప్రపంచములోని వికారి వైబ్రేషన్లు లేక ఆకర్షణల ప్రభావము నుండి దూరమైపోతారు. ఇలా తండ్రి జతలో ఉండేవారు, జతలో ఉంటూ ఉంటూ తండ్రి సమానంగా అవుతారు. తండ్రి ఎలాగైతే అత్యంత ఉన్నతమైనవారో, అలా పిల్లల స్థితి కూడా ఉన్నతంగా అవుతుంది. నీచ స్థితిలోని ఏ విషయాలూ వారి పై తమ ప్రభావాన్ని వేయలేవు.
స్లోగన్ :- '' మనసు మరియు బుద్ధి కంట్రోల్‌లో (అదుపులో) ఉంటే, అశరీరిగా అవ్వడం సహజమైపోతుంది. ''
No comments:
Post a Comment