Tuesday, September 17, 2019

Telugu Murli 13/09/2019

13-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - స్మృతి చేసేందుకు మీరందరూ శ్రమించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నేను మిమ్ములను అన్ని పాపాల నుండి విముక్తులుగా చేసేస్తాను.''

ప్రశ్న :- సర్వులకు సద్గతినిచ్చే స్థానమేది ? దానికున్న మహత్వము ప్రపంచమంతటికీ తెలుస్తుంది?
జవాబు :- 'ఆబూ భూమి' సర్వులకు సద్గతినిచ్చే స్థానము. మీరు బ్రహ్మకుమారీలు అనే పదానికి ముందు బ్రాకెట్‌లో ఇది సర్వోన్నత తీర్థ స్థానము అని వ్రాయవచ్చు. మొత్తం ప్రపంచమంతటికి సద్గతి ఇక్కడి నుండే జరగనున్నది. సర్వుల సద్గతిదాత తండ్రి. ఆదమ్‌(బ్రహ్మ) ఇక్కడ కూర్చ్చుని సర్వులకు సద్గతినిస్తారు. ఆదమ్‌ అనగా ఆద్మీ(మానవుడు) అతడు దేవుడు కాదు. అతనిని భగవంతుడని కూడా అనజాలరు.

ఓంశాంతి. డబుల్‌ ఓంశాంతి. ఎందుకంటే ఒకటి తండ్రిది, మరొకటి దాదాది. ఇరువురి ఆత్మలు ఉన్నాయి కదా. వారు పరమ ఆత్మ, ఇతడు ఆత్మ. వారు కూడా మనము పరంధామ నివాసులమని లక్ష్యమును తెలిపిస్తారు. నేను ఆత్మ శాంతిధామ నివాసినని ఇరువురూ అలాగే చెప్తారు. తండ్రి కూడా ఓంశాంతి అని అంటారు. అలాగే ఇతను కూడా ఓంశాంతి అని అంటాడు. పిల్లలు కూడా ఓంశాంతి అని అంటారు. అనగా నేను ఆత్మను, శాంతిధామ నివాసిని. ఇక్కడ వేరు వేరుగా, దూర-దూరంగా కూర్చోవాలి. ఒకరి శరీరము మరొకరి శరీరముతో తగలరాదు. ఎందుకంటే యోగము చేయునప్పుడు ప్రతి ఒక్కరి స్థితికి, యోగానికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యతాసముంది. కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు. కొందరు స్మృతియే చేయరు. కనుక పూర్తిగా స్మృతి చేయనివారు పాపాత్మలు, తమోప్రధానులు. స్మృతి చేయువారు పుణ్యాత్మలు, సతోప్రధానులు. చాలా తేడా ఉంది కదా. ఇంట్లో కలిసి ఉంటున్నా తేడా ఉంటుంది కదా. అందువల్లనే భాగవతములో ఆసురీ పేర్లు కీర్తింపబడినవి. అది ఈ సమయంలోని విషయమే. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇది ఈశ్వరీయ చరిత్ర. దీనిని భక్తిమార్గములో కీర్తిస్తారు. సత్యయుగములో అయితే ఏదీ గుర్తుండదు. అన్నీ మర్చిపోతారు. తండ్రి ఇప్పుడే శిక్షణ ఇస్తారు. సత్యయుగములో అయితే వీటిని పూర్తిగా మర్చిపోతారు. మళ్లీ ద్వాపర యుగములో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. రాజయోగమును నేర్పించేందుకు ప్రయత్నిస్తారు. కాని నేర్పించలేరు. దానిని తండ్రి సన్ముఖంగా వచ్చినప్పుడే నేర్పిస్తారు. తండ్రి ఎలాగైతే రాజయోగమును నేర్పిస్తారో మీకు తెలుసు. మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి ''మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా!'' అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా ఏ మనిషి, మనుష్యులను ఎప్పటికీ అనలేరు. దేవతలు దేవతలను కూడా అనలేరు. ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మిక పిల్లలతో అంటారు. ఒక్కసారి చేసిన పాత్రను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత చేస్తారు. ఎందుకంటే మీరు మళ్లీ మెట్లు దిగుతారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఆదిమధ్యాంతాల రహస్యముంది. అది శాంతిధామము లేక పరంధామమని తెలుసు. భిన్న-భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలైన మనమందరము నెంబరువారుగా నిరాకార ప్రపంచములో ఉంటాము. నక్షత్రాలు నిలబడి ఉన్నట్లుగా చూస్తారు కదా. చూచేందుకు ఏ ఆధారము కనిపించదు. పైన ఏ వస్తువూ లేదు, బ్రహ్మతత్వముంది. మీరిక్కడ భూమి పై నిల్చొని ఉన్నారు. ఇది కర్మ క్షేత్రము. ఇక్కడకు వచ్చి శరీరము తీసుకొని కర్మ చేస్తారు. మీరు నా ద్వారా వారసత్వమును పొందినప్పుడు 21 జన్మలు మీరు చేసే కర్మ అకర్మగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని తండ్రి అర్థం చేయించారు. అది ఈశ్వరీయ రాజ్యము. దానిని ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేస్తే స్వర్గానికి అధికారులుగా అవుతారని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. స్వర్గమును శివబాబా స్థాపించారు కదా. కావున శివబాబాను, సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట శాంతిధామమును స్మృతి చేస్తే చక్రము కూడా గుర్తుకు వస్తుంది. పిల్లలు మర్చిపోతారు. అందువలన క్షణ-క్షణము గుర్తు చేయించవలసి వస్తుంది. 'ఓ మధురాతి మధురమైన పిల్లలారా!' స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. మీరు స్మృతి చేస్తే మిమ్ములను పాపాల నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రియే పతితపావనులు. సర్వశక్తివంతులైన అధికారి. వారిని వరల్డ్‌ ఆల్‌మైటీ అథారిటీ అని అంటారు. వారికి మొత్తం సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము తెలుసు. వేదాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. అందుకే వీటిలో సారమేదీ లేదని చెప్తారు. గీతలో కూడా ఏ సారమూ లేదు. భలే గీత సర్వశాస్త్ర శిరోమణి అయిన తల్లి - తండ్రి. మిగిలినవన్నీ దాని పిల్లలు. ఉదాహరణానికి మొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, మిగిలినవారందరూ వారి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మను ఆదమ్‌ అని అంటారు. ఆదమ్‌ అనగా వ్యక్తి. (ఆద్‌మీ) మనిషి కదా. కావున ఇతనిని దేవత అని అనరు. ఏడమ్‌ను, ఆదమ్‌ అని అంటారు. భక్తులు బ్రహ్మ, ఏడమ్‌ను దేవత అని అంటారు. ఏడమ్‌ అనగా మనిషి అని తండ్రి అర్థం చేయిస్తారు. దేవతా కాదు, భగవంతుడూ కాదు. లక్ష్మీనారాయణులు దేవతలు, స్వర్గములో దైవత్వముంది. అది కొత్త ప్రపంచము కదా. అది ప్రపంచములోని అద్భుతము. మిగిలినవన్నీ మాయ అద్భుతాలు. ద్పాపర యుగము తర్వాత మాయ విచిత్రాలు(అద్భుతాలు) ఉంటాయి. ఈశ్వరీయ అద్భుతము - (వండర్‌) హెవన్‌ లేక స్వర్గము. దానిని తండ్రియే స్థాపన చేస్తారు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. ఈ దిల్వాడా మందిరము విలువ ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు యాత్ర చేసేందుకు వెళ్తారు. ఇది అన్నిటికంటే మంచి తీర్థ స్థానము. మీరు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, ఆబూ పర్వతమని వ్రాస్తారు కదా. అక్కడ బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థ స్థానము అని కూడా వ్రాయాలి. ఎందుకంటే అందరికి సద్గతి ఇక్కడ నుండే లభిస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే సర్వశాస్త్రమయి శిరోమణిగా గీత ఉందో, అలా సర్వ తీర్థాలలో శ్రేష్ఠమైన తీర్థ స్థానము ఆబూ. కావున మనుష్యులు చదువుతారు, గమనముంచుతారు. ప్రపంచములోని అన్ని తీర్థస్థానాలలో ఇది అన్నిటికంటే పెద్ద తీర్థ స్థానము. ఇక్కడ తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు. తీర్థ స్థానాలైతే చాలా అయ్యాయి. గాంధీ సమాధిని కూడా తీర్థ స్థానమని భావిస్తారు. అందరూ వెళ్లి అక్కడ పూలు మొదలైనవి సమర్పిస్తారు. వారికి ఏమీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు కదా. కావున ఇక్కడ కూర్చునే మేము స్వర్గ స్థాపన చేస్తున్నామని మీ మనసులో చాలా సంతోషముండాలి. మనము స్వర్గమును స్థాపిస్తున్నాము. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. చదువు కూడా చాలా సహజమైనది. ఏ ఖర్చూ లేదు. మీ మమ్మాకు ఒక పైసా అయినా ఖర్చు అయిందా? ఒక్క పైసా ఖర్చు కాకుండానే చదువుకుని ఎంత తెలివైన నంబర్‌వన్‌గా అయిపోయింది! రాజయోగినిగా అయిపోయింది కదా. మమ్మా వలె ఎవ్వరూ తయారవ్వలేదు.
చూడండి, తండ్రి కూర్చుని ఆత్మలనే చదవిస్తారు. ఆత్మలకే రాజ్యము లభిస్తుంది. ఆత్మనే రాజ్యము పోగొట్టుకుంది. ఇంత చిన్న ఆత్మ ఎంత పని చేస్తుంది! వికారాలలోకి వెళ్ళడము అన్నిటికంటే చాలా చెడ్డ పని. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంది! మొత్తం విశ్వమంతటి పై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంత శక్తి ఉంది! ప్రతి ధర్మానికి తమ - తమ శక్తి ఉంటుంది కదా. క్ర్రౖెెస్తవ ధర్మములో ఎంత శక్తి ఉంది! ఆత్మలో శక్తి ఉంది. అది శరీరము ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మయే ఇక్కడకు వచ్చి ఈ కర్మ క్షేత్రములో పని చేస్తుంది. అక్కడ చెడు పనులు జరగవు. రావణ రాజ్యమున్నప్పుడు ఆత్మ వికారీ మార్గములో వెళ్తుంది. వికారాలు సదా ఉండనే ఉంటాయని మనుష్యులు అంటారు. అక్కడ రావణరాజ్యమే లేనప్పుడు వికారాలెలా ఉంటాయని మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ ఉండేదే యోగబలము. భారతదేశపు రాజయోగము ప్రసిద్ధి చెందినది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కాని మీరు నేర్పిస్తే కదా. మరెవ్వరూ నేర్పించలేరు. ఉదాహరణానికి మహర్షి ఉన్నప్పుడు యోగము నేర్పించేందుకు ఎంత కష్టపడేవారు! కాని ఈ హఠయోగులు రాజయోగమును ఎలా నేర్పించగలరు? ఇది ప్రపంచానికి తెలియదు. చిన్మయానంద వద్దకు ఎంతోమంది వెళ్తారు. సత్యమైన భారతీయ ప్రాచీన రాజయోగమును బ్రహ్మకుమారీలు తప్ప మరెవ్వరూ చేయించలేరని వారు ఒకసారి చెప్తే చాలు. కాని ఇప్పుడే ఈ శబ్ధము వ్యాపించడం నియమములో లేదు. దీనిని అందరూ అర్థము చేసుకోలేరు. చాలా కష్టము. మహిమ కూడా జరుగుతుంది. చివర్లో ''ఓహో ప్రభూ! ఓహో శివబాబా! ఇదంతా మీ లీల'' అని అంటారు. ఇప్పుడు తండ్రిని పరమపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురువు అని మీరు తప్ప మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. నడుస్తూ - నడుస్తూ మాయ వీరిని గాభరా పెట్టడంతో పూర్తిగా బుద్ధిహీనులుగా అయిపోతారు. గమ్యము చాలా గొప్పది. ఇది యుద్ధ మైదానము. ఇందులో మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. వారు వినాశనము చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరిక్కడ పంచ వికారాలను జయించేందుకు పురుషార్థము చేస్తున్నారు. మీరు విజయము కొరకు, వారు వినాశనము కొరకు పురుషార్థము చేస్తున్నారు. రెండు పనులు ఒకేసారి జత జతలో జరుగుతాయి కదా. ఇప్పుడింకా సమయముంది. మన రాజ్యము ఇంకా స్థాపనవ్వలేదు. ఇప్పుడు రాజులు, ప్రజలు అందరూ తయారవ్వాలి. మీరు అర్ధకల్పానికి తండ్రి ద్వారా వారసత్వము తీసుకుంటారు. పోతే మోక్షమైతే ఎవ్వరికీ లభించదు. ఫలానావారు మోక్షమును పొందుకున్నారని కొందరంటారు. మరణించిన తర్వాత వారెక్కడికి వెళ్లారో తెలియదు. ఈ విధంగా అసత్యాలను చెప్తూ ఉంటారు.
ఎవరైతే శరీరాన్ని వదుల్తారో, వారు మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని, మోక్షము పొందుకోలేరని మీకు తెలుసు. నీటి బుడగ నీటిలో కలిసిపోయిన విధంగా జరగదు. తండ్రి చెప్తున్నారు - ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గపు సామగ్రి. పిల్లలైన మీరు సన్ముఖములో వింటారు. వేడి వేడి హల్వా తింటారు. అందరికంటే వేడిగా ఉన్న హల్వా ఎవరు తింటారు? (బ్రహ్మ). ఇతను వారి ప్రక్కలోనే కూర్చుని ఉన్నారు, వెంటనే వింటారు, ధారణ చేస్తారు. మళ్లీ ఇతనే ఉన్నత పదవి పొందుతారు. సూక్ష్మ వతనములో, వైకుంఠములో ఇతని సాక్షాత్కారమే అవుతుంది. ఇక్కడ కూడా ఈ కళ్లతో వారినే చూస్తారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తారు. ఇక స్మృతిలోనే శ్రమ ఉంది. స్మృతిలో ఉండేందుకు మీకు కష్టమనిపించినట్లే ఇతనికి కూడా అనిపిస్తుంది. ఈ విషయములో ఎవ్వరూ కృప చూపించేదేమీ లేదు. తండ్రి చెప్తారు - నేను అప్పుగా తీసుకున్నాను. వారి లెక్కాచారమును ఇచ్చేస్తాను. ఇక స్మృతి చేయు పురుషార్థము ఇతను కూడా చేయాల్సిందే. పక్కలో కూర్చున్నారని కూడా అర్థమవుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ మళ్లీ మర్చిపోతాను. అందరికంటే ఇతను ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. యుద్ధ మైదానములో మహారథులుగా, శక్తివంతులుగా హనుమంతుని వలె ఉన్నవారికే మాయ పరీక్ష పెడ్తుంది. ఎందుకంటే వారు మహావీరులుగా ఉండేవారు. ఎంత ఎక్కువ శక్తివంతులైతే అంత ఎక్కువగా మాయ పరీక్షిస్తుంది. తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. బాబా, మాకు ఇలా ఇలా జరుగుతోందని పిల్లలు వ్రాస్తారు. ఇవన్నీ జరిగేవే అని బాబా చెప్తారు. జాగ్రత్తగా ఉండమని ప్రతి రోజూ చెప్తారు. బాబా, మాయ చాలా తుఫానులు తెస్తూ ఉందని వ్రాస్తారు. కొందరు దేహాభిమానులుగా ఉన్నప్పుడు బాబాకు తెలుపరు. మీరిప్పుడు చాలా తెలివైనవారిగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది! మొదట పేదవారే తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పెన్నిధి అని కీర్తింపబడ్డారు. మిగిలినవారైతే ఆలస్యంగా వస్తారు. సోదర - సోదరీలుగా అవ్వనంతవరకు సోదర-సోదరులుగా ఎలా అవుతారని మీరు అర్థము చేసుకుంటారు ప్రజాపిత బ్రహ్మ సంతానమైతే సోదర - సోదరీలు అయ్యారు కదా. మళ్లీ తండ్రి, సోదరులుగా(భాయి - భాయిగా) భావించమని చెప్తారు. ఇది చివరి సంబంధము. మళ్లీ పైన కూడా సోదరులతో వెళ్లి కలుసుకుంటారు. మళ్లీ సత్యయుగములో కొత్త సంబంధము ప్రారంభమవుతుంది. అక్కడ మరిది, పినతండ్రి, మామ మొదలైన అనేక సంబంధాలుండవు. సంబంధాలు చాలా తేలికగా ఉంటాయి. తర్వాత మళ్లీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే సోదరీ - సోదరునిగా కూడా కాదు, పరస్పరము సోదరులుగా భావించాలి. నామ-రూపాల నుండి కూడా దూరమవ్వాలి. తండ్రి సోదరుల(ఆత్మల)నే చదివిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడు అందరూ సోదర-సోదరీలు కదా. కృష్ణుడైతే చిన్న బాలుడు. అతను భాయి-భాయిగా ఎలా చేస్తాడు? గీతలో కూడా ఈ విషయాలు లేవు. ఇది చాలా విభిన్నమైన జ్ఞానము. డ్రామాలో అంతా రచింపబడి ఉంది. ఒక్క క్షణములోని పాత్ర మరొక క్షణము ఉండదు. వన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గడిచాయో మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇదే విధంగా గడుస్తాయి. తక్కువ బుద్ధి గలవారైతే ఇన్ని ధారణ చేయలేరు. అందువలన స్వయాన్ని ఆత్మగా భావించి బేహద్‌ తండ్రిని స్మృతి చేయడం చాలా సహజమైనదని తండ్రి చెప్తారు. పాత ప్రపంచ వినాశనము కూడా జరగాలి. సంగమ యుగములోనే నేను వస్తానని తండ్రి చెప్తారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. వీరి రాజ్యమున్నప్పుడు మరే ధర్మమూ లేదని మీకు తెలుసు. ఇప్పుడైతే వీరి రాజ్యము లేదు. అచ్ఛా (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇది చివరి సమయము. వాపస్‌ ఇంటికి వెళ్లాలి కావున తమ బుద్ధిని నామ-రూపాల నుండి తొలగించి వేయాలి. ఆత్మలైన మనము పరస్పరము సోదరులము(భాయి - భాయి). దీనిని అభ్యాసము చేయాలి. దేహాభిమానములోకి రాకూడదు.
2. ప్రతి ఒక్కరి స్థితిలో, యోగములో రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. అందువలన దూర-దూరంగా కూర్చోవాలి. ఒకరి అవయవాలు మరొకరి అవయవాలను తాకరాదు. పుణ్యాత్మగా తయారయ్యేందుకు స్మృతిలో శ్రమించాలి.

వరదానము :- '' స్మృతి మరియు సేవల బ్యాలన్స్‌ ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసే ఆశీర్వాదాలకు పాత్ర ఆత్మా భవ ''
ఎక్కడైతే స్మృతి మరియు సేవల బ్యాలన్స్‌ అనగా సమానత ఉంటుందో, అక్కడ తండ్రి నుండి విశేషమైన సహాయము అనుభవమవుతుంది. ఈ సహాయమే ఆశీర్వాదము. ఎందుకంటే బాప్‌దాదా ఇతర ఆత్మల వలె ఆశీర్వాదాలు ఇవ్వరు. తండ్రి అశరీరి కనుక సహజంగా, స్వతహాగా సహాయము లభించుటే వారి ఆశీర్వాదము. తద్వారా అసంభవమైన విషయము సంభవమైపోతుంది. ఇదే సహాయము అనగా ఆశీర్వాదము. మీరు ఎటువంటి ఆశీర్వాదానికి పాత్రులైన ఆత్మలంటే, మీకు ఒక అడుగులో పదమాల సంపాదన జమ అవుతుంది.

స్లోగన్‌ :- '' సకాశ్‌ ఇచ్చేందుకు అవినాశి సుఖము, శాంతి మరియు సత్యమైన ప్రేమల స్టాక్‌ను జమ చేయండి ''

No comments:

Post a Comment