06-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రి సమానము ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. సంగమ యుగములో పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి వస్తారు. ''
ప్రశ్న :- ఈ పురుషోత్తమ సంగమ యుగమే అన్నింటికంటే మనోహరమైనది, కళ్యాణకారియైనది ఎలా?
జవాబు :- ఈ సమయములోనే పిల్లలైన మీరు(స్త్రీ - పురుషులిరువురూ) ఉత్తములుగా అవుతారు. ఇది కలియుగ అంత్యము మరియు సత్యయుగాదుల మధ్య సమయము. ఈ సమయములోనే పిల్లల కొరకు తండ్రి ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు. ఇక్కడ మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి యూనివర్సిటీ కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు. ఈ సమయములోనే సర్వులకు సద్గతి జరుగుతుంది.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చుని ఉంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే వారు పతితపావనులు, వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా, సతోప్రధానంగా అవ్వాలని మీ లక్ష్యము. సతో వరకు మాత్రమే అవ్వాలనే లక్ష్యము కాదు. సతోప్రధానంగా అవ్వాలి కనుక తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. అంతేకాక స్వీట్ హోమ్‌ను కూడా స్మృతి చేయాలి. ఎందుకంటే అక్కడకు వెళ్లాలి. మళ్లీ వారసత్వము, సంపద(ఆస్తిపాస్తులు) కూడా కావాలి కనుక స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి. ఎందుకంటే ఇది (స్వర్గము) ప్రాప్తి అవుతుంది. మనము తండ్రికి పిల్లలుగా అయ్యాము. తండ్రి ద్వారా శిక్షణ తీసుకొని నంబరువారు పురుషార్థానుసారము స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలిన జీవాత్మలందరూ శాంతిధామానికి వెళ్లిపోతారు. ఇంటికి అయితే తప్పకుండా వెళ్లాలి. ఇప్పుడిది రావణ రాజ్యమని కూడా పిల్లలకు తెలిసింది. దీని పోలికగా సత్యయుగానికి రామరాజ్యమని పేరు ఇవ్వబడ్తుంది. తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. వీరిని సూర్య వంశస్థులు, వారిని చంద్ర వంశస్థులు అని అంటారు. ఎలాగైతే క్రైస్తవుల వంశము ఒక్కటే నడుస్తుందో, ఇక్కడ కూడా ఒకే రాజ్య వంశముంటుంది. కానీ అందులో సూర్య వంశము, చంద్ర వంశము రెండూ ఉన్నాయి. ఈ విషయాలు ఏ శాస్త్ర్రాలలోనూ లేవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు - దీనినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గ స్థాపన జరిగిపోతే ఈ జ్ఞానము అవసరము లేదు. ఈ జ్ఞానాన్ని పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగములోనే నేర్పించబడ్తుంది. మీ సేవాకేంద్రాలలో లేక మ్యూజియాలలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో సోదరీ - సోదరులారా! ఇది పురుషోత్తమ సంగమ యుగము, కల్పమంతటికీ ఒక్కసారి మాత్రమే వస్తుంది అని తప్పకుండా వ్రాయబడి ఉండాలి. వారికి పురుషోత్తమ సంగమ యుగమంటే అర్థమే తెలియదు. కావున కలియుగ అంత్యము మరియు సత్య యుగాదుల సంగమము అని కూడా వ్రాయాలి. కావున సంగమ యుగము అన్నింటికంటే మనోహరమైనదిగా, కళ్యాణకారిగా అయిపోతుంది. నేను పురుషోత్తమ సంగమ యుగములోనే వస్తానని తండ్రి కూడా చెప్తారు. కావున సంగమ యుగము అర్థము కూడా అర్థం చేయించబడింది. వేశ్యాలయ అంతిమము, శివాలయము యొక్క ఆది - దీనిని పురుషోత్తమ సంగమము అని అంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు. అక్కడ అందరూ నిర్వికారులుగా ఉంటారు. కనుక తప్పకుండా నిర్వికారులనే ఉత్తమములని అంటారు కదా. స్త్రీ - పురుషులు ఇరువురూ ఉత్తములుగా అవుతారు. అందుకే దీనికి పురుషోత్తమ అన్న పేరు ఉంది. ఈ విషయాలు తండ్రి మరియు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. పురుషోత్తమ సంగమ యుగము ఎప్పుడు ఉంటుందనే ఆలోచన కూడా ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. వారికే ఇంతటి మహిమ ఉంది. వారు జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, పతితపావనులు. జ్ఞానము ద్వారా సద్గతినిస్తారు. భక్తి ద్వారా సద్గతి లభిస్తుందని మీరు ఎప్పుడూ చెప్పరు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. సత్యయుగములోనే సద్గతి ఉంటుంది. కావున కలియుగ అంత్యము మరియు సత్యయుగము ఆదుల సంగమములోనే వారు వస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. కొత్తవారు కూడా కల్ప-కల్పము వచ్చిన విధంగా వస్తూ ఉంటారు. ఈ విధంగానే రాజధాని స్థాపన అవ్వాలి. మేము సత్యమైన ఈశ్వరీయ సేవాధారులమని పిల్లలైన మీకు తెలుసు. వారు ఒక్కరినే చదివించరు. ఒకరు చదువుకుంటారు తర్వాత ఇతని ద్వారా మీరు చదువుకొని ఇతరులను చదివిస్తారు. అందుకే ఇక్కడ పెద్ద విశ్వ విద్యాలయాన్ని తెరవవలసి వస్తుంది. ప్రపంచమంతటా ఉండు విశ్వ విద్యాలయము మరేదియూ లేదు. ఈశ్వరీయ విద్యాలయము కూడా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. గీతా భగవంతుడు శివుడు వచ్చి ఈ విశ్వ విద్యాలయాన్ని తెరుస్తారని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచానికి అధికారులైన దేవీ దేవతలుగా చేస్తారు. తమోప్రధానమైన ఆత్మయే మళ్లీ ఈ సమయములో సతోప్రధానంగా అవ్వాలి. ఈ సమయములో అందరూ తమోప్రధానంగా ఉన్నారు కదా. భలే చాలామంది కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు, కుమారీలు కూడా పవిత్రంగా ఉంటారు, అలాగే సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆ ఆది సమయములోని పవిత్రత లేదు. మొట్టమొదట ఆత్మలు వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటారు. తర్వాత అపవిత్రంగా అవుతారు. ఎందుకంటే సతోప్రధానము, సతో, రజో, తమోల ద్వారా అందరూ పోవలసిందేనని మీకు తెలుసు. అంతములో అందరూ తమోప్రధానమైపోతారు. ఇప్పుడు తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ వృక్షము తమోప్రధానమై శిథిలావస్థను చేరుకుంది, పాతదైపోయింది. కనుక తప్పకుండా ఇది వినాశనమవ్వాలి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. అందువలన విరాట లీల అని అంటారు. ఎంత పెద్ద బేహద్ వృక్షము! అది జడమైన వృక్షముగా ఉంటుంది, ఏ బీజము వేస్తే ఆ వృక్షము వస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వెరైటీ చిత్రము(వృక్షము). అందరూ మానవులే. కానీ వారిలో చాలా రకాలున్నారు. అందువలన దీనిని విరాట లీల అని అంటారు. అన్ని ధర్మాలు నంబరువారుగా ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు. అందరూ వెళ్లాల్సిందే, మళ్లీ రావాల్సిందే. ఇది తయారుచేయబడిన డ్రామా. ఇది స్వాభావికమైన ప్రాకృతికమైన డ్రామా. ఇంత చిన్న ఆత్మ లేక పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది! ఇదే ప్రకృతి. పరమ-ఆత్మ ఈ రెండిటిని కలిపి పరమాత్మ అని అంటారు. వారిని మీరు బాబా అని అంటారు. ఎందుకంటే వారు ఆత్మలందరి పరమపిత కదా. మొత్తం పాత్ర అంతా ఆత్మయే చేస్తుందని పిల్లలకు తెలుసు. మనుష్యులకు ఇది తెలియదు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. వాస్తవానికి ఈ పదము తప్పు. ఆత్మ నిర్లేపి కాదు అని కూడా పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. మంచి లేక చెడు కర్మలు చేసిన ఫలితమును ఆత్మనే పొందుకుంటుంది. చెడు సంస్కారాలతో పతితమైపోతుంది, అందుకే దేవతల సన్ముఖములోకి వెళ్లి వారిని మహిమ చేస్తూ పాడ్తారు. మీకిప్పుడు 84 జన్మల గురించి తెలిసింది, ఇతర ఏ మనుష్యులకు తెలియదు. మీరు వారికి 84 జన్మలను ఋజువు చేసి తెలిపితే శాస్త్ర్రాలన్నీ అసత్యమా? అని వారు అంటారు. ఎందుకంటే మనుష్యులు 84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటారని వారు విన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - వాస్తవానికి గీతయే సర్వ శాస్త్ర శిరోమణి. తండ్రి మనకు ఇప్పుడు 5 వేల సంవత్సరాల క్రితము నేర్పించిన రాజయోగమును నేర్పిస్తున్నారు.
మనము పవిత్రంగా ఉండేవారమని, పవిత్ర గృహస్థ ధర్మముండేదని మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు. అధర్మస్థులుగా అయ్యారు. అనగా వికారులుగా అయిపోయారు. ఈ ఆటను పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది బేహద్ డ్రామా. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పునరావృతమవుతూ ఉంటుంది. లక్షల సంవత్సరములైతే ఎవ్వరూ అర్థము కూడా చేసుకోలేరు. ఇది నిన్నటి విషయము వలె ఉంది. మీరు శివాలయములో ఉండేవారు. ఈ రోజు వేశ్యాలయములో ఉన్నారు. మళ్లీ రేపు శివాలయములో ఉంటారు. సత్యయుగమును శివాలయమని, త్రేతా యుగమును సెమీ అని అంటారు. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. పునర్జన్మలైతే తీసుకోవలసిందే. దీనిని రావణ రాజ్యమని అంటారు. మీరు అర్ధ కల్పము పతితంగా అయ్యారు. ఇప్పుడు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. కుమారులు, కుమారీలు పవిత్రంగానే ఉన్నారు కనుక మళ్లీ పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థము చేయాల్సి వచ్చే గృహస్థ వ్యవహారములోకి వెళ్లరాదని వారికి అర్థం చేయించబడ్తుంది. భగవానువాచ - ''పావనంగా అవ్వండి'' కనుక బేహద్ తండ్రి మాటను గౌరవించాలి కదా. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండవచ్చు. తండ్రి 21 జన్మల వరకు పతితమవ్వడం నుండి రక్షించునప్పుడు మరి మీ పిల్లలకు పతితంగా అయ్యే అలవాటును ఎందుకు చేయిస్తారు! ఈ విషయములో లోక మర్యాదలను, కుల మర్యాదలను కూడా విస్మరించవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయము. అన్ని ధర్మాలలోనూ కుమారులు(బ్రహ్మచారులు) చాలామంది ఉంటారు. కానీ సురక్షితంగా ఉండడం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుంటే రావణ రాజ్యములో ఉన్నారు కదా! విదేశాలలో కూడా పెళ్లి చేసుకోనివారు చాలామంది ఉన్నారు, తర్వాత చివరి సమయములో తోడు కొరకు(కంపానియన్‌షిప్ కొరకు) చేసుకుంటారు. వికారాల కోసం చేసుకోరు. ఈ విధంగా కూడా ప్రపంచములో చాలామంది వివాహము చేసుకోకుండా తోడుగా ఉంటారు. వారిని పూర్తిగా సంభాళన చేస్తూ ఉంటారు. తర్వాత చనిపోవునప్పుడు ఎంతోకొంత ఇచ్చి వెళ్లిపోతారు. కొంత దాన ధర్మాలకు కేటాయిస్తారు. ట్రస్టును ఏర్పాటు చేసి వెళ్తారు. విదేశాలలో కూడా పెద్ద పెద్ద ట్రస్టులు ఉంటాయి. అవి ఇక్కడ కూడా సహాయము చేస్తాయి. ఇక్కడ విదేశాలకు సహయోగము చేసే ట్రస్టులు లేవు. ఇక్కడ పేదవారు ఉన్నారు. వారేమి సహాయము చేస్తారు! అక్కడైతే వారి వద్ద చాలా ధనము ఉంది. భారతదేశమైతే నిరుపేదగా ఉంది కదా! భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంది! భారతదేశము ఎంత శిరోమణిగా ఉండేది, అది నిన్నటి విషయము. 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని క్రైస్తవులు కూడా అంటారు. దానిని తండ్రే తయారుచేస్తారు. పతితులను పావనంగా తయారుచేసేందుకు తండ్రి పై నుండి క్రిందకు ఎలా వస్తారో మీకు తెలుసు. వారు జ్ఞాన సాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతిదాత అనగా అందరినీ పావనంగా చేసేవారు. నా మహిమను అందరూ కీర్తిస్తారని పిల్లలైన మీకు తెలుసు. నేను ఈ పతిత ప్రపంచములోనే మిమ్ములను పావనంగా చేసేందుకు వస్తాను. మీరు పావనంగా అయితే పావన ప్రపంచములో మొట్టమొదట వస్తారు. చాలా సుఖమును పొందుకున్న తర్వాత మళ్లీ రావణ రాజ్యములో పడి పోతారు. పరమపిత పరమాత్మను గురించి జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, పతిత పావనులు అని మహిమ చేస్తారు. కానీ పావనంగా చేసేందుకు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. మీరు నన్ను మహిమ చేశారు కదా కావున ఇప్పుడు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మీకు నా పరిచయమును ఇస్తున్నాను. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగములో వస్తాను, ఎలా వస్తానో కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ సూక్ష్మ వతనములో ఉండరు. బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మళ్లీ వీరి వంశ వృక్షము కూడా తయారవుతుంది. మానవ సృష్టి వృక్షము ప్రజాపిత బ్రహ్మ ద్వారానే మొదలవుతుంది కదా. ప్రజాపిత ఉన్నారు. కనుక వారి ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కఖ వంశస్థులు అయ్యేందుకు వీలు లేదు. తప్పకుండా దత్తు తీసుకోబడినవారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కనుక తప్పకుండా దత్తు తీసుకొని ఉంటారు. వీరందరూ దత్తు తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్లీ మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది బాజోలీ(పల్టీ ఆట) అవుతుంది. విరాట రూప చిత్రము కూడా ఉంది కదా. అందరూ అక్కడి నుండి ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. అందరూ వచ్చేసిన తర్వాత మళ్లీ సృష్టికర్త కూడా వస్తారు. వారు రచయిత, దర్శకులు కూడా అయినారు, పాత్రను కూడా అభినయిస్తారు. తండ్రి చెప్తున్నారు - ఓ ఆత్మలారా! మీకు నేను తెలుసు. ఆత్మలైన మీరందరూ నా పిల్లలు కదా! మీరు మొదట సత్యయుగములో శరీరాలు ధరించి ఎంత మంచి సుఖమయమైన పాత్ర చేశారు, 84 జన్మలు తీసుకున్న తర్వాత ఎంత దు:ఖితులైపోయారు. డ్రామాకు రచయిత, డైరక్టరు, నిర్మాత ఉంటారు కదా, ఇది బేహద్ డ్రామా. అనంతమైన డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తిమార్గములో ఎటువంటి విషయాలు తెలుపుతారంటే, మానవుల బుద్ధిలో అవే నాటుకొని పోయాయి.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! ఇవన్నీ భక్తి మార్గములోని శాస్త్ర్రాలు. బీజానికి సామాగ్రి వృక్షము ఎలాగైతే ఉందో, అలా భక్తి సామాగ్రి కూడా చాలా ఉంది. ఇంత చిన్న బీజము నుండి ఎంత పెద్దదిగా వ్యాపించి పోతుంది. భక్తికి కూడా ఇంత విస్తారముంది. జ్ఞానమైతే బీజము, అందులో ఏ సామాగ్రి అవసరముండదు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏక ఏ వ్రతాలు, నియమాలు లేవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీకు సద్గతి లభించిన తర్వాత ఏదీ అవసరముండదు. మీరే చాలా భక్తి చేశారు. మీకు దాని ఫలితమునిచ్చేందుకు నేను వచ్చాను. దేవతలు శివాలయములో ఉండేవారు కదా! అందువల్లనే మందిరాలకు వెళ్లి వారిని మహిమ చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! నేను 5 వేల సంవత్సరాల క్రితము కూడా స్వయాన్ని ఆత్మగా భావించమని మీకు తెలిపాను. సర్వ దేహ సంబంధాలన్నీ వదిలి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. తండ్రి ఇప్పుడు అర్థం చేయించే విషయాలన్నీ కల్ప-కల్పము అర్థం చేయిస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని పదాలు బాగున్నాయి. ' మన్మనాభవ ' అనగా నన్ను స్మృతి చేయండి. 'నేను ఇక్కడికి వచ్చాను' అని శివబాబా చెప్తున్నారు. ఎవరి తనువులో వస్తానో కూడా తెలుపుతాను. బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్ర్రాల సారమంతటినీ మీకు వినిపిస్త్తాను. చిత్రాలను చూపించినా అర్థం చేసుకోరు. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా శాస్త్ర్రాల సారమంతా ఎలా వినిపిస్తారో మీరిప్పుడు తెలుసుకున్నారు. డ్రామాలోని 84 జన్మల రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాను. వీరి అనేక జన్మల తర్వాత చివరి జన్మలో నేను వస్తాను. ఇతనే మళ్లీ ప్రప్రథమ రాకుమారునిగా అవుతాడు మళ్లీ 84 జన్మలలో వస్తాడు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! ఇవన్నీ భక్తి మార్గములోని శాస్త్ర్రాలు. బీజానికి సామాగ్రి వృక్షము ఎలాగైతే ఉందో, అలా భక్తి సామాగ్రి కూడా చాలా ఉంది. ఇంత చిన్న బీజము నుండి ఎంత పెద్దదిగా వ్యాపించి పోతుంది. భక్తికి కూడా ఇంత విస్తారముంది. జ్ఞానమైతే బీజము, అందులో ఏ సామాగ్రి అవసరముండదు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏక ఏ వ్రతాలు, నియమాలు లేవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీకు సద్గతి లభించిన తర్వాత ఏదీ అవసరముండదు. మీరే చాలా భక్తి చేశారు. మీకు దాని ఫలితమునిచ్చేందుకు నేను వచ్చాను. దేవతలు శివాలయములో ఉండేవారు కదా! అందువల్లనే మందిరాలకు వెళ్లి వారిని మహిమ చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! నేను 5 వేల సంవత్సరాల క్రితము కూడా స్వయాన్ని ఆత్మగా భావించమని మీకు తెలిపాను. సర్వ దేహ సంబంధాలన్నీ వదిలి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. తండ్రి ఇప్పుడు అర్థం చేయించే విషయాలన్నీ కల్ప-కల్పము అర్థం చేయిస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని పదాలు బాగున్నాయి. ' మన్మనాభవ ' అనగా నన్ను స్మృతి చేయండి. 'నేను ఇక్కడికి వచ్చాను' అని శివబాబా చెప్తున్నారు. ఎవరి తనువులో వస్తానో కూడా తెలుపుతాను. బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్ర్రాల సారమంతటినీ మీకు వినిపిస్త్తాను. చిత్రాలను చూపించినా అర్థం చేసుకోరు. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా శాస్త్ర్రాల సారమంతా ఎలా వినిపిస్తారో మీరిప్పుడు తెలుసుకున్నారు. డ్రామాలోని 84 జన్మల రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాను. వీరి అనేక జన్మల తర్వాత చివరి జన్మలో నేను వస్తాను. ఇతనే మళ్లీ ప్రప్రథమ రాకుమారునిగా అవుతాడు మళ్లీ 84 జన్మలలో వస్తాడు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ రావణ రాజ్యములో ఉంటూ పతిత లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి బేహద్ తండ్రి చెప్పే మాటలను అంగీకరించాలి. గృహస్థ వ్యవహారములో కమల పుష్ప సమానముగా ఉండాలి.
2. ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థము చేసుకోవాలి. ఇందులో పాత్ర చేసే ఆత్మ నిర్లేపి కాదు. మంచి - చెడు పనులు చేస్తూ దాని ఫలితమును పొందుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని శ్రేష్ఠమైన కార్యాలు చేయాలి.
వరదానము :- '' ఆత్మిక అథారిటితో పాటు నిరహంకారులుగా అయ్యి సత్యమైన జ్ఞానము యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే సత్యమైన సేవాధారీ భవ ''
ఎలాగైతే వృక్షములో సంపూర్ణ ఫలములనిచ్చే అథారిటి వచ్చేస్తుందో అప్పుడది వంగుతుంది అనగా నిరహంకారిగా అయ్యి సేవ చేస్తుందో, అలా ఆత్మిక అథారిటి గల పిల్లలు ఎంత పెద్ద అథారిటీగా అవుతారో అంత నిరహంకారులుగా, సర్వులకు స్నేహీలుగా అవుతారు. అల్పకాలపు అథారిటీ వారు అహంకారులుగా ఉంటారు. కానీ సత్యత అథారిటి గలవారు అథారిటీతో పాటు నిరహంకారులుగా కూడా ఉంటారు. ఇదే సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపము. సత్యమైన సేవాధారుల వృత్తి ఎంత అథారిటీగా ఉంటుందో వారి వాణిలో అంత స్నేహము, నమ్రత ఉంటాయి.
స్లోగన్ :- '' త్యాగము లేకుండా భాగ్యము లభించదు ''
No comments:
Post a Comment