17-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు మా తండ్రి అని మీకు ఎలా నిశ్చయముందో, అలా ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయమును కలిగించండి, తర్వాత వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ''
ప్రశ్న :- ఇతరులెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని తండ్రి తమ పిల్లలనకు అడుగుతారు ?
జవాబు :- పిల్లలారా! ఇంతకుముందు మీరెప్పుడు నన్ను కలుసుకున్నారు? అని బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు అడుగుతారు. అర్థము చేసుకున్న పిల్లలు వెంటనే అవును బాబా! మేము 5 వేల సంవత్సరాల క్రితము కూడా మిమ్ములను లుసుకున్నామని అంటారు. అర్థము చేసుకోనివారు తికమక పడతారు. ఇటువంటి ప్రశ్నలు అడిగే వివేచన(తెలివి) మరెవ్వరికీ ఉండదు. తండ్రియే మొత్తం కల్పమంతటి రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తారు.
ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక అనంతమైన తండి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! ఇక్కడ మీరు తండి సన్ముఖములో కూర్చుని ఉన్నారు. పిల్లలు ఇంటి నుండి బయలుదేరునప్పుడు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, వారు బహ్మ్ర రథములో వచ్చి మాకు స్వర్గ వారసత్వమునిస్తున్నారు, మేము స్వర్గములో ఉండేవారము మళ్లీ 84 జన్మల చకమ్రులో తిరిగి ఇప్పుడు నరకములో వచ్చి పడి ఉన్నామను ఆలోచనలతో వస్తారు. ఇతర ఏ సత్సంగాలలో, మరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. మేము శివబాబా వద్దకు వెళ్తామని, వారు ఈ రథములో వచ్చి చదివిస్తున్నారని కూడా మీకు తెలుసు. వారు ఆత్మలైన మమ్ములను తమతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు. బేహద్ తండ్రి ద్వారా తప్పకుండా బేహద్ వారసత్వమే లభించాలి. నేను సర్వవ్యాపిని కానని తండ్రి అర్థం చేయించారు. పంచ వికారాలే సర్వవ్యాపిగా ఉన్నాయి. మీలో కూడా పంచ వికారాలున్నాయి. అందువల్లనే మీరు మహాన్ దు:ఖితులుగా అయ్యారు. ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని తప్పకుండా వ్రాయించాలి. ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కాదని పిల్లలైన మీకు దృఢ నిశ్చయముంది. తండ్రి పరమపిత (సుప్రీమ్ తండ్రి), పరమ శిక్షకులు, పరమ సద్గురువు కూడా. అనంతమైన సద్గతిదాత. శాంతిని ఇచ్చేవారు వారే. మరే స్థానములోనూ ఏం ప్రాప్తిస్తుందని ఎవ్వరూ ఆలోచించను కూడా ఆలోచించరు. కేవలం కర్ణ రసముతో - రామాయణము, భగవద్గీత మొదలైనవి వింటారు. ఏమీ అర్థము కాదు. ఇంతకుముందు మనము పరమాత్ముని సర్వవ్యాపి అని అనేవారము, ఇప్పుడు ఇది అసత్యమని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది చాలా గ్లాని చేసే విషయము. కావున ఈ అభిప్రాయము వ్రాయించడము కూడా చాలా అవసరము. ఈ రోజుల్లో ఎవరితో మీరు ప్రారంభోత్సవము(ఓపెనింగ్/ూజూవఅఱఅస్త్ర) మొదలైనవి చేయిస్తారో, వారు బ్రహ్మకుమారీలు చాలా మంచి పని చేస్తున్నారని, చాలా బాగా అర్థం చేయిస్తున్నారు, ఈశ్వరుని పొందే మార్గమును తెలుపుతారని వ్రాస్తున్నారు. దీని ద్వారా మనుష్యుల మనసుల పై చాలా మంచి ప్రభావం పడ్తుంది. కానీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని ప్రపంచమంతా చెప్తున్న విషయము చాలా పెద్ద తప్పు అనే అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయరు. ఈశ్వరుడే తండ్రి, టీచరు, గురువు. మొదట ఇది ముఖ్యమైన విషయము, రెండవది ఈ జ్ఞానము ద్వారా గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, భగవంతుడని మనుష్యులను లేక దేవతలను అనజాలరు. భగవంతుడు ఒక్కరే. వారు తండ్రి. ఆ తండ్రి ద్వారానే సుఖ-శాంతుల వారసత్వము లభిస్తుంది - ఈ అభిప్రాయమును కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు వ్రాయిస్తున్న అభిప్రాయాలు పనికొచ్చేవి కావు. ఇక్కడ చాలా మంచి శిక్షణ ఇస్తారని మాత్రమే వ్రాస్తారు. కాని ముఖ్యమైన విషయము - దేనితో అయితే మీ విజయం జరగనున్నదో దానిని గురించి వాయ్రించండి. 'ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు' అని బహ్మ్రకుమారీలు సత్యం చెప్తున్నారు. వారు తండి, వారే గీతా భగవంతుడు. తండి వచ్చి భక్తిమార్గము నుండి విడిపించి జ్ఞానమును ఇస్తారు. పతితపావని నీటి గంగ కాదు. తండి ఒక్కరే పతితపావనులు అని వారు తమ అభిపాయ్రమును వాయ్రాలి. ఇప్పుడింకా సమయము ఉంది. మీరు చేస్తున్న సర్వీసుకు అయ్యే ఖర్చును పిల్లలైన మీరే పరస్పరములో సహాయము చేసుకుంటున్నారు. వెలుపలి వారికైతే ఏమీ తెలియదు. మీరే మీ తనువు-మనసు-ధనములను ఖర్చు చేసి మీ కొరకు మీరే రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఎవరు చేస్తారో, వారు పొందుతారు. చేయనివారు పొందరు కూడా. కల్ప-కల్పము మీరే చేస్తారు. మీరే నిశ్చయబుద్ధి గలవారిగా అవుతారు. తండ్రి తండ్ర్రే కాక టీచరుగా కూడా ఉన్నారు. గీతా జ్ఞానమును కూడా యధార్థంగా వినిపిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. భక్తిమార్గములో భగవద్గీతను వింటూ వచ్చారు కానీ రాజ్యమునైతే పొందలేదు. ఈశ్వరీయ మతము నుండి మారి ఆసురీ మతమైపోయింది. స్వభావము మరియు గుణాలు పాడైపోతూ పతితులుగా అయిపోయారు. కుంభమేళాలకు కోట్ల లెక్కలో మనుష్యులు వెళ్తారు. ఎక్కడెక్కడ నీటిని చూస్తారో అక్కడకు వెళ్తారు. నీటి ద్వారానే పావనంగా అవుతామని భావిస్తారు. ఇప్పుడు నీరు అనేకచోట్ల నుండి వస్తూ ఉంటుంది. నీటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా? నీటిలో స్నానము చేస్తే పతితంగా ఉన్న మనము పావనమై దేవతలుగా అవుతామా? ఎవ్వరూ పావనంగా అవ్వలేరని మీకిప్పుడు తెలుసు. ఇది తప్పు. కావున ఈ మూడు విషయాల పై అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పుడు కేవలం ఈ సంస్థ బాగుందని మాత్రమే అంటారు. తద్వారా అనేకమందిలో బ్రహ్మకుమారీలలో ఇంద్రజాలముంది, ఎత్తుకుపోతారు......... ఈ సంకల్పాల భ్రాంతులు దూరమైపోతాయి ఎందుకంటే ఈ మాట చాలా వ్యాపించి ఉంది కదా. ఇతనికి 16,108 మంది రాణులు కావాలి, అందులో 400 మంది లభించారని విదేశాల వరకు కూడా వ్యాపించింది ఎందుకంటే ఆ సమయములో సత్సంగానికి 400 మంది వచ్చేవారు. చాలామంది వ్యతిరేకించారు, పికెటింగులు మొదలైనవి కూడా చేశారు. కానీ తండ్రి ఎదురుగా ఎవ్వరిదీ నడవలేదు. ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు? అని అందరూ అనేవారు. తర్వాత ఎంత విచిత్రమో చూడండి. బాబా కరాచీలో ఉండేవాడు, వారంతటవారే పరస్పరములో కలుసుకొని గుంపుగా తయారౖెె అన్నీ వదిలి కరాచీకి వచ్చేశారు. తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవ్వరికీ తెలియదు. ఇంతమంది వెళ్లి ఎక్కడ, ఎలా ఉంటారో కూడా ఆలోచించలేదు. తర్వాత బాబా వెంటనే ఒక బంగళా తీసుకున్నారు. కావున ఇది ఇంద్రజాలమే కదా. ఇప్పుడు కూడా ఈ బ్రహ్మకుమారీలు మంత్రగత్తెలని, వారి దగ్గరకు వెళ్తే వెళ్లినవారు మళ్లీ తిరిగి రారని అనుకుంటూ ఉంటారు. బ్రహ్మకుమారీలు స్త్రీ-పురుషులను సోదర-సోదరీలుగా చేసేస్తారని భావించి చాలామంది రానే రారు. ఇప్పుడు మీరు పెట్టిన ప్రదర్శినీ మొదలైనవి చూసి వారి బుద్ధిలో ఉన్న విషయాలు దూరమైపోతాయి కాని బాబా కోరుకున్న అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయరు. బాబాకు ఆ అభిప్రాయము కావాలి - గీతా భగవానుడు కృష్ణుడు కాదని వ్రాయాలి. ప్రపంచమంతా కృష్ణ భగవానువాచ అని భావిస్తుంది. కాని కృష్ణుడైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. శివబాబా పునర్జన్మ రహితులు. కావున ఈ విషయములో చాలా మంది అభిప్రాయం కావాలి. గీతను వినేవారైతే అనేకమంది ఉన్నారు. తర్వాత గీతా భగవానుడు పరమపిత శివ పరమాత్మ అని వార్తాపత్రికలలో కూడా చూస్తారు. వారే తండ్రి, టీచరు, సర్వుల సద్గతిదాత. శాంతి-సుఖాల వారసత్వము కేవలం వారి ద్వారానే లభిస్తుంది. మీరిప్పుడు శ్రమ పడి ఉద్ఘాటన(ప్రారంభోత్సవము) చేయిస్తారు. దీని వలన కేవలం మనుష్యుల భ్రాంతి దూరమౌతుంది. వారికి జ్ఞానము బాగా లభిస్తుంది. కాని బాబా చెప్పే అభిప్రాయాన్ని వ్రాయాలి. ఇదే ముఖ్యమైన అభిప్రాయము. ఈ సంస్థ చాలా మంచిదని కేవలం సలహా మాత్రమే ఇస్తారు. దీని వలన ఏమవుతుంది? మున్ముందు వినాశనము మరియు స్థాపన సమీపించినప్పుడు మీకు ఈ అభిప్రాయము కూడా లభిస్తుంది. అర్థము చేసుకొని వ్రాస్తారు. ఇప్పుడు మీ వద్దకు రావడమైతే మొదలు పెట్టారు కదా. ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరులమనే జ్ఞానము మీకు లభించింది. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. సర్వాత్మల తండ్రి ఒకే పరమపిత, వారి ద్వారా తప్పకుండా అనంతమైన పదవి కూడా లభించాలి. అది 5 వేల సంవత్సరాల క్రితము మీకు లభించింది. వారు కలియుగ ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. మీరు 5 వేల సంవత్సరాలని చెప్తారు. ఎంత వ్యత్యాసముంది!
తండ్రి అర్థం చేయిస్తారు - 5 వేల సంవత్సరాల క్రితము విశ్వములో శాంతి ఉండేది. ఈ లక్ష్యము(లక్ష్మినారాయణ) ఎదురుగా ఉంది. వీరి రాజ్యములో విశ్వములో శాంతి ఉండేది. ఈ రాజధానిని మళ్లీ మనము స్థాపిస్తున్నాము. మొత్తం విశ్వమంతటా సుఖ-శాంతులుండేవి. దు:ఖమునకు నామ-రూపాలు ఉండేవి కావు. ఇప్పుడైతే అపారమైన దు:ఖముంది. మనము మన తనువు, మనసు, ధనముల ద్వారా గుప్తంగా ఈ సుఖ-శాంతుల రాజ్యమును స్థాపిస్తున్నాము. తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు, జ్ఞానము కూడా గుప్తంగా ఉంది, మీ పురుషార్థము కూడా గుప్తంగా ఉంది. అందువలన బాబా పాటలు, కవితలు మొదలైనవి కూడా ఇష్టపడరు. అది భక్తిమార్గము. ఇక్కడైతే నిశ్శబ్ధముగా ఉండాలి. నడుస్తూ, తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రమును బుద్ధిలో తిప్పాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచములో ఇది మీ అంతిమ జన్మ. తర్వాత మళ్లీ కొత్త ప్రపంచములో మొదటి జన్మ తీసుకుంటాము. ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగమును జోడిస్తారు. తండి స్వయంగా చెప్తున్నారు - పిల్లలారా, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలిపెట్టండి. తండ్రి మీ కొరకు కొత్త పప్రంచాన్ని తయారు చేస్తున్నారు. వారిని స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమవుతాయి. అరే! మీకు విశ్వ రాజ్యమునిచ్చే తండిన్రి ఎలా మర్చిపోతారు! పిల్లలారా, ఈ అంతిమ జన్మలో కేవలం పవితంగా అవ్వండి అని తండి చెప్తారు. ఇప్పుడీ మృత్యులోక వినాశనము ఎదురుగా ఉంది. ఈ వినాశనము కూడా 5 వేల సంవత్సరాల క్రితము జరిగిన విధంగానే ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. తమ రాజ్యమున్నప్పుడు ఇతర ఏ ధర్మమూ లేదు. బాబా వద్దకు ఎవరైనా వస్తే ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా? అని వారిని అడుగుతారు. అర్థము చేసుకున్నవారు వెంటనే 5 వేల సంవత్సరాల క్రితము అని చెప్పేస్తారు. కొత్తవారు వస్తే తికమక పడతారు. బ్రాహ్మణి అర్థం చేయించలేదని బాబా అర్థము చేసుకుంటారు. ఆలోచించి గుర్తు చేసుకోండని బాబా అంటారు. ఈ మాట మరెవ్వరూ అడగలేరు. అడగాలి అన్న ఆలోచనే రాదు. ఈ విషయాల గురించి వారికేం తెలుసు? మున్ముందు ఈ కులానికి చెందినవారు అనేకమంది మీ దగ్గరకు వచ్చి వింటారు. ప్రపంచము తప్పకుండా పరివర్తనవ్వాల్సిందే. చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్లాలి. ఈ పాత ప్రపంచమును మర్చిపోండి. తండ్రి కొత్త ఇంటిని తయారు చేస్తున్నప్పుడు బుద్ధి అటువైపే వెళ్తుంది. పాత ఇంటి పై మమత్వముండదు. ఇది బేహద్ విషయము. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గమును స్థాపిస్తున్నారు కనుక ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడకండి. కొత్త ప్రపంచము పై మమత్వము, ఈ పాత ప్రపంచము పై వైరాగ్యము ఉండాలి. వారు హఠయోగము ద్వారా హద్దు సన్యాసము చేసి అడవులకు వెళ్లి కూర్చుంటారు. మీకైతే ఈ పాత ప్రపంచమంతటి పై వైరాగ్యముంది. ఇందులో చాలా దు:ఖముంది. కొత్త ప్రపంచమైన స్వర్గములో చాలా సుఖముంది కావున తప్పకుండా దానిని స్మృతి చేస్తారు కదా. ఇక్కడ అందరూ దు:ఖమిచ్చేవారే ఉన్నారు. తల్లి, తండ్రి మొదలైన వారంతా వికారాలలో పడేస్తారు. కామము మహాశత్రువు. దీనిని జయిస్తేనే మీరు జగత్‌జీతులుగా అవుతారని తండ్రి చెప్తారు. ఈ రాజయోగమును తండ్రి నేర్పిస్తారు. తద్వారా మనము ఈ పదవిని పొందుతాము. పావనంగా తయారైతే స్వర్గ రాజ్యము లభిస్తుందని మాకు స్వప్నములో భగవంతుడు చెప్పారు, కావున నేనిప్పుడు ఒక జన్మ అపవిత్రమై నా రాజ్యమును పోగొట్టుకోను? అని చెప్పండి. ఈ పవిత్రత గురించే జగడాలు జరుగుతాయి. ద్రౌపది కూడా, ఈ దుశ్శాశనుడు నన్ను వివస్త్రను చేస్తున్నాడని వేడుకుంది. ద్రౌపదికి 21 చీరలను కృష్ణుడు ప్రసాదించాడని కూడా ఒక ఆటను చూపిస్తారు. ఇప్పుడు ఎంత దుర్గతి పాలైనారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అపారమైన దు:ఖముంది కదా. సత్యయుగములో అపారమైన సుఖముండేది. అనేక అధర్మాలను వినాశనము చేసి ఒకే సత్యమైన ధర్మమును స్థాపన చేసేందుకు నేనిప్పుడు వచ్చాను. నేను మీకు రాజ్య భాగ్యమునిచ్చి వానప్రస్థములోకి వెళ్లిపోతాను. మళ్లీ అర్ధకల్పము వరకు నా అవసరమే ఉండదు. మీరు ఎప్పుడూ స్మృతి కూడా చేయరు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ గురించి అందరి మునసులో ఉన్న వ్యతిరేక అభిప్రాయాలు తొలగిపోయి సరిపోతున్నాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని వ్రాయించండి. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. పతితపావనులు కూడా తండ్రియే. నీటి నదులు పావనంగా చేయలేవు. నీరైతే అన్ని స్థానాలలో ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని బేహద్ తండ్రి చెప్తారు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. ఆత్మయే ఒక శరీరమును వదిలి మరొక శరీరమును తీసుకుంటుంది. వారు మళ్లీ ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మయే పరమాత్మ అను మాట భక్తిమార్గములోనిది. బాబా, ఎలా స్మృతి చేసేది? అని పిల్లలు అడుగుతారు. అరే! స్వయాన్ని ఆత్మ అని అర్థము చేసుకున్నారు కదా. ఆత్మ ఇంత సూక్ష్మమైన బిందువుగా ఉన్నప్పుడు ఆత్మల తండ్రి కూడా ఎంత సూక్ష్మంగా ఉంటారు! వారు పునర్జన్మ రహితులు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. తండ్రి ఎందుకు గుర్తు రారు. నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. మంచిది. తండ్రిని పెద్ద రూపంగానే భావించండి. కానీ ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమౌతాయి. మరే ఇతర ఉపాయము లేదు. అర్థము చేసుకున్నవారు, బాబా మీ స్మృతి ద్వారా మేము పావనంగా అయ్యి పావన ప్రపంచానికి, విశ్వానికి అధికారులుగా అవుతున్నామంటే మేము ఎందుకు స్మృతి చేయము? అని అంటారు. పరస్పరములో కూడా స్మృతి కలిగించుకుంటూ ఉంటే పాపాలు సమాప్తమవుతాయి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి మరియు వారి జ్ఞానము ఎలా గుప్తంగా ఉందో అలా పురుషార్థము కూడా గుప్తంగా చేయాలి. పాటలు, కవితలకు మొదలైన వాటికి బదులు నిశ్శబ్ధంగా ఉండడం మంచిది. నడుస్తూ, తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి.
2. పాత ప్రపంచము పరివర్తన అవుతూ ఉంది. అందువలన దీని పై మమత్వమును తొలగించి వేయాలి. దీనిని చూస్తున్నా చూడరాదు. బుద్ధి కొత్త ప్రపంచము పై లగ్నము చేయాలి.
వరదానము :- ''సర్వ పదార్థాల పై ఆసక్తికి అతీతంగా అనాసక్త ప్రకృతిజీత్ భవ''
ఒకవేళ ఏదైనా పదార్థము కర్మేంద్రియాలను విచలితం చేస్తున్నా అనగా ఆసక్తి భావము ఉత్పన్నమైనా అతీతంగా అవ్వలేరు. కోరికలే ఆసక్తుల రూపము. చాలామంది కోరిక లేదు కానీ బాగుందని అంటారు. ఇది కూడా సూక్ష్మమైన ఆసక్తియే. అల్పకాల సుఖానికి సాధనమైన ఈ పదార్థము నన్ను ఆకర్షించడం లేదు కదా అని సూక్ష్మ రూపంలో చెక్ చేసుకోండి. ఈ పదార్థము ప్రకృతి యొక్క సాధనము. ఎప్పుడైతే దీని నుండి అనాసక్తము అనగా అతీతంగా అవుతారో అప్పుడు ప్రకృతిజీత్‌లుగా అవుతారు.
స్లోగన్ :- '' '' నాది, నాది ( మేరే, మేరే ) '' అనే చిక్కులను వదిలి అనంతంలో ఉంటే, విశ్వ కళ్యాణకారులని అంటారు.
No comments:
Post a Comment