26-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రి వద్దకు తమ గుణాలను (క్యారెక్టర్‌ను) సరిదిద్దుకునేందుకు వచ్చారు, మీరిప్పుడు దైవీ గుణాలను తయారు చేసుకోవాలి. ''
ప్రశ్న :- పిల్లలైన మీరు కళ్లు మూసుకొని కూర్చోరాదని ఎందుకు చెప్తారు ?
జవాబు :- ఎందుకంటే దృష్టి ద్వారా పరివర్తన చేసే(తృప్తిపరచే) తండ్రి మీ సన్ముఖములో ఉన్నారు. ఒకవేళ కళ్లు మూసుకుంటే ఎలా తృప్తి చెందుతారు? పాఠశాలలో కళ్లు మూసుకొని కూర్చోరు. కళ్లు మూసుకొని కూర్చుంటే సోమరితనము వచ్చేస్తుంది. పిల్లలైన మీరు పాఠశాలలో చదువుకుంటున్నారు, ఇది సంపాదనకు ఆధారము. లక్షల-పదమాల సంపాదన జరుగుతోంది. సంపాదన సమయంలో సోమరితనము, ఉదాసీనత రాజాలదు.
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పరంధామము నుండి వచ్చి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఏం చదివిస్తున్నారు? తండ్రితో ఆత్మ యోగము చేయడం నేర్పిస్తున్నారు. దీనినే స్మృతియాత్ర అని అంటారు. మధురమైన ఆత్మిక పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రమై, తమ పవిత్రమైన శాంతిధామాన్ని చేరుకుంటారని కూడా తెలిపించారు. ఎంత సహజమైన జ్ఞానము. స్వయాన్ని ఆత్మగా భావించండి. తమ ప్రియమైన బేహద్ తండ్రిని స్మృతి చేస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది భారతీయ ప్రాచీన రాజయోగము, దీనిని ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రియే వచ్చి నేర్పిస్తారు. బేహద్ తండ్రియే భారతదేశములో ఈ సాధారణ తనువులో వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఈ స్మృతి ద్వారానే మీ జన్మ-జన్మాంతరాల పాపము సమాప్తమవుతుంది. ఎందుకంటే తండ్రి పతితపావనుడు, సర్వశక్తివంతుడు. మీ ఆత్మ రూపీ బ్యాటరీ ఇప్పుడు తమోప్రధానమై పోయింది. ఒకప్పుడు సతోప్రధానంగా ఉండేది, ఇప్పుడు దానిని మళ్లీ సతోప్రధానంగా ఎలా తయారుచేయాలి. ఆత్మ సతోప్రధానమైన ప్రపంచానికి వెళ్లాలి లేక శాంతిధామమైన ఇంటికి పోగలగాలి. దీనిని పిల్లలు చాలా బాగా గుర్తుంచుకోవాలి. తండ్రి పిల్లలకు ఈ డోస్(హెచ్చరిక) ఇస్తారు. ఈ స్మృతి యాత్రను లేస్తూ - కూర్చుంటూ, నడుస్తూ - తిరుగుతూ మీరు చేయవచ్చు. గృహస్థ వ్యవహారములో ఉంటూ వీలైనంత కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయుటతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎందుకంటే ప్రపంచములోని వారివి ఆసురీ గుణాలు. పిల్లలైన మీరు ఇక్కడికి దైవీ గుణాలను తయారు చేసుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల నడవడిక(గుణాలు) చాలా మధురంగా ఉండేది. భక్తిమార్గములో వారి మహిమనే కీర్తించారు. భక్తిమార్గము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు, మీరిప్పుడు తెలుసుకున్నారు. రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు ఈ జ్ఞానమంతటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మనము జ్ఞాన సాగరుడైన ఆత్మిక తండ్రి పిల్లలము. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనలను చదివించేందుకు వస్తారు. వీరు సాధారణమైన తండ్రి కాదని కూడా మీరు తెలుసుకున్నారు. వీరు ఆత్మిక తండ్రి, మనలను చదివించేందుకు వచ్చారు. వారి నివాస స్థానము సదా బ్రహ్మలోకము. అందరికీ లౌకిక తండ్రులు ఇక్కడే ఉన్నారు. ఆత్మలైన మనలను చదివించే పరమపిత పరమాత్మ అనంతమైన తండ్రి అని పిల్లలు బాగా నిశ్చయముంచుకోవాలి. భక్తిమార్గములో లౌకిక తండ్రి ఉన్నా పరమపిత పరమాత్మను పిలుస్తారు. వారి యదార్థమైన పేరు 'శివ ' ఒక్కటే. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, నా పేరు ఒక్కటే, 'శివ'. భలే అనేక పేర్లతో అనేక మందిరాలు తయారు చేశారు కానీ అవన్నీ భక్తిమార్గములోని సామాగ్రి. యదార్థమైన నా పేరు ఒక్కటే 'శివ'. పిల్లలైన మిమ్ములను ఆత్మ అనే అంటారు, సాలిగ్రామము అని అన్నా పర్వాలేదు. సాలిగ్రామాలు అనేకమున్నాయి, శివుడు ఒక్కరే. వారు అనంతమైన తండ్రి, మిగిలిన వారందరూ పిల్లలు. ఇంతకుముందు హద్దు పిల్లలైన మీరు హద్దు తండ్రి వద్ద ఉండేవారు. అప్పుడు మీకు జ్ఞానము లేదు. పోతే అనేక విధాలుగా భక్తి చేస్తూ ఉండేవారు. అర్ధకల్పము భక్తి చేశారు, ద్వాపర యుగము నుండి భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడే రావణ రాజ్యము కూడా ప్రారంభమయ్యింది. ఇది చాలా సహజమైన విషయము. ఇంత సహజమైన విషయాన్ని కూడా కొందరు కష్టంగా అర్థము చేసుకుంటారు. రావణరాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే జ్ఞాన సాగరులని మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారు వచ్చి వారిలో ఉన్న జ్ఞానమంతా పిల్లలకు ఇస్తారు. శాస్త్రాలు భక్తి మార్గములోనివి.
జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ మూడు ముఖ్యమైనవి. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని సన్యాసులకు కూడా తెలుసు. కానీ సన్యాసులది హద్దు వైరాగ్యము. వారు బేహద్ వైరాగ్యమును నేర్పించలేరు. వైరాగ్యము రెండు రకాలు - 1. హద్దు వైరాగ్యము 2. బేహద్ వైరాగ్యము. వారిది హఠయోగీ సన్యాసుల వైరాగ్యము. ఇది బేహద్ వైరాగ్యము. మీది రాజయోగము, వారు ఇల్లు - వాకిళ్లను వదిలి అడవికి వెళ్లిపోతే, వారికి సన్యాసి అని పేరు వచ్చేస్తుంది. హఠయోగులు పవిత్రంగా ఉండేందుకు ఇంటిని వదిలేస్తారు, ఇది కూడా మంచిదే. భారతదేశము చాలా పవిత్రంగా ఉండేదని తండ్రి చెప్తారు. ఇంత పవిత్రమైన ఖండము మరేదీ ఉండదు. భారతదేశానికి ఉన్న చాలా ఉన్నతమైన మహిమను గురించి భారతవాసులకే తెలియదు. తండ్రిని మర్చిపోయినందున అన్నీ మర్చిపోతారు అనగా నాస్తికులుగా, అనాథులుగా అవుతారు. సత్యయుగములో ఎంతో సుఖము, శాంతి ఉండేది. ఇప్పుడు ఎంత దు:ఖము, అశాంతి ఉంది! మూలవతనమంటే శాంతిధామము, అక్కడ ఆత్మలమైన మనము ఉంటాము. ఆత్మలు తమ ఇంటి నుండి బేహద్ పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తాయి. ఈ పురుషోత్తమ సంగమ యుగములో బేహద్ తండ్రి కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు వస్తారు. తండ్రి వచ్చి ఉత్తమోత్తమంగా చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడని అంటారు. కానీ వారు ఎవరో, ఎవరిని అలా అంటారో ఏమీ తెలియదు. ఒక పెద్ద లింగమును ఉంచేశారు, వీరు నిరాకార పరమాత్మ అని భావిస్తారు. ఆత్మలమైన మనందరికీ వారు తండ్రి అని కూడా తెలియదు, కేవలం పూజ చేస్తారు. సదా శివబాబా అనే అంటారు, రుద్ర బాబా, బబుల్‌నాథ్ బాబా అని అనరు. మీరైతే శివబాబా స్మృతి ఉందా? వారసత్వము స్మృతి ఉందా? అని వ్రాస్తారు కూడా. శివబాబాను స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి. ఎందుకంటే పతితపావనుడు తండ్రి ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులు ఉండజాలరు. పావన ప్రపంచములో పతితులు ఒక్కరు కూడా ఉండజాలరు. శాస్త్రాలలో అయితే అన్ని స్థానాలలో పతితులు ఉన్నారని వ్రాసేశారు. త్రేతా యుగములో కూడా రావణుడు సీతను అపహరించుకు పోయాడని వ్రాశారు. కృష్ణునితో పాటు కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యపుడు మొదలైన వారిని చూపించారు. కృష్ణుని పై కళంకాలను మోపారు. సత్యయుగములో ఇవేమీ జరగజాలవు. అసత్య కళంకాలను ఎన్ని ఆపాదించారు! తండ్రి పై కూడా కళంకము ఆపాదించారు, అలాగే దేవతల పై కూడా కళంకాలను ఆపాదించారు. అందరినీ నిందిస్తూ ఉంటారు. కావున ఆత్మను పవిత్రంగా చేసే ఈ స్మృతియాత్ర చెయ్యమని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యి మళ్లీ పావన ప్రపంచంలోకి వెళ్లాలి. తండ్రి 84 జన్మల చక్రమును కూడా అర్థం చేయిస్తారు. ఇది అంతిమ జన్మ. మళ్లీ ఇంటికి వెళ్లాలి. ఇంటికి శరీరమైతే వెళ్లదు. ఆత్మలందరూ వెళ్లాలి. అందువలన మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! - స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి, దేహమని భావించకండి. ఇతర సత్సంగాలలో మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు. ఇక్కడ ఆత్మాభిమానులై కూర్చోండి అని తండ్రి చెప్తారు. నేను జ్ఞాన సాగరుడను,............ నాలో ఈ సంస్కారముంది, పిల్లలైన మీరు కూడా ఇలాగే తయారవ్వాలి. బేహద్ తండ్రి మరియు హద్దు తండ్రికి గల భేదము కూడా తెలిపిస్తారు. బేహద్ తండ్రి కూర్చొని మీకు మొత్తం జ్ఞానమంతా అర్థము చేయిస్తారు. ఇంతకు ముందు మీకు ఈ జ్ఞానము తెలియదు. ఇప్పుడు సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో, దాని ఆదిమధ్యాంతాల చక్రము ఆయువు ఎంతో, అన్ని విషయాలు తెలియజేస్తారు. భక్తిమార్గములో అయితే కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని వినిపించి ఘోరమైన అంధకారములో పడేశారు. క్రిందికే దిగజారుతూ వచ్చారు. ఎంతగా భక్తి చేస్తే అంతగా తండ్రిని క్రిందికి ఆకర్షిస్తామని, తండ్రి వచ్చి మనలను పావనంగా తయారు చేస్తారని కూడా అంటారు కదా. తండ్రిని క్రిందికి లాగుతారు. ఎందుకంటే పతితులుగా అయ్యి దు:ఖిస్తున్నారు. అందుకే మేము తండ్రిని పిలుస్తున్నామని అంటారు. పూర్తిగా దు:ఖితులుగా, తమోప్రధానంగా అయ్యారని తండ్రి కూడా గమనిస్తారు. 5 వేల సంవత్సరాలు పూర్తైనప్పుడే మళ్లీ వస్తారు. ఈ చదువు ఈ పాత ప్రపంచము కొరకు కాదు. ఈ జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేసి తన జతలో తీసుకెళ్తుంది. నేను ఎలాగైతే జ్ఞాన సాగరుడనో, అలా మీరు కూడా జ్ఞాన నదులు. ఈ జ్ఞానము ఈ పాత ప్రపంచము కొరకు కాదు. ఈ ఛీ-ఛీ(అసహ్యమైన) ప్రపంచము, ఛీ-ఛీ శరీరము వదిలేయాలి. శరీరమైతే ఇక్కడ పవిత్రంగా అవ్వజాలదు. నేను ఆత్మల తండ్రిని, ఆత్మలను పవిత్రంగా చేసేందుకు వచ్చాను. ఈ విషయాలను మనుష్యులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. పూర్తిగా రాతిబుద్ధి గలవారిగా పతితులుగా ఉన్నారు. అందుకే ఓ పతితపావనా! అని పాడ్తారు. ఆత్మయే పతితమవుతుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. భక్తి కూడా ఆత్మయే చేస్తుంది, శరీరాన్ని కూడా ఆత్మయే తీసుకుంటుంది.
ఆత్మలైన మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. బేహద్ తండ్రినైన నేను, ఆత్మలైన మీ పిలుపుతో వచ్చాను. మీరు ఎంతగా పిలిచారు(ప్రార్థించారు)! ఇప్పటివరకు కూడా హే పతితపావనా, ఓ గాడ్ ఫాదర్! మీరు వచ్చి ఈ పాత ప్రపంచపు దు:ఖాల నుండి, మాయ(డెవిల్) నుండి ముక్తులుగా చేయండి. తద్వారా మేము ఇంటికి వచ్చేస్తామని పిలుస్తూనే ఉన్నారు. మన ఇల్లు ఎక్కడ ఉందో, ఇంటికి ఎలా, ఎప్పుడు వెళ్తామో మరెవ్వరికీ తెలియదు. ముక్తికి వెళ్లేందుకు ఎంతగా కష్టపడ్తూ ఉంటారు! ఎంతమంది గురువుల వద్దకు వెళ్తారు. జన్మ-జన్మల నుండి ఇలా తల కొట్టుకుంటూ, కష్టపడ్తూ వచ్చారు. ఆ గురువులకు జీవన్ముక్తిలోని సుఖాలను గురించి తెలియనే తెలియదు. వారు ముక్తిని కోరుకుంటారు. విశ్వములో శాంతి ఎలా స్థాపించబడ్తుంది? అని అంటారు కూడా. సన్యాసులకు కూడా ముక్తి మాత్రమే తెలుసు. జీవన్ముక్తి గురించి తెలియదు. కానీ ముక్తి - జీవన్ముక్తి రెండింటి వారసత్వమును తండ్రే ఇస్తారు. మీరు జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలినవారంతా ముక్తిలోకి వెళ్లిపోతారు. పిల్లలైన మీరిప్పుడు ఇలా తయారయ్యేందుకు జ్ఞానము తీసుకుంటున్నారు. మీరే అందరికంటే ఎక్కువగా సుఖాన్ని చూచారు, అందరికంటే ఎక్కువగా దు:ఖమును కూడా మీరే చూచారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మములో ఉన్న మీరే మళ్లీ ధర్మభ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయిపోయారు. మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గములో ఉండేవారు, ఈ లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గములోనివారు. ఇల్లు-వాకిలి వదిలిపెట్టడం సన్యాసుల ధర్మము. సన్యాసులు కూడా మొదట బాగుండేవారు, మీరు కూడా మొదట చాలా బాగుండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇది డ్రామా ఆట అని తండ్రి చెప్తారు. ఈ చదువు క్రొత్త ప్రపంచము కొరకని తండ్రి అర్థం చేయిస్తారు. పతిత శరీరములో, పతిత ప్రపంచములో డ్రామానుసారంగా నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత రావలసి ఉంటుంది. కల్పము లక్షల సంవత్సరాలూ కాదు, నేను సర్వవ్యాపినీ కాదు. ఇలా మీరు నన్ను నిందిస్తూ వచ్చారు. అయినా నేను మీకు ఎంత ఉపకారము చేస్తాను. శివబాబాను చేసినంత గ్లాని మరెవ్వరినీ చేయలేదు. విశ్వానికి అధిపతులుగా తయారుచేసే తండ్రిని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు. అవమానము (గ్లాని) కూడా హద్దు దాటిపోయినప్పుడు మళ్లీ నేను వచ్చి మీకు ఉపకారము చేస్తాను. ఇది పురుషోత్తమ సంగమ యుగము, కళ్యాణకారి యుగము. ఈ యుగములో మిమ్ములను పవిత్రంగా చేసేందుకు వస్తాను. పావనంగా అయ్యేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలుపుతాను. భక్తిమార్గములో మీరు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు, చెరువులో కూడా స్నానము చేసేందుకు వెళ్తారు. ఇలా చేయడం వలన పావనంగా అవుతామని భావిస్తారు. ఆ నీరు ఎక్కడ! పతితపావనుడైన తండ్రి ఎక్కడ! అదంతా భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మానవులు ఎంత ఘోరమైన అంధకారములో ఉన్నారు. కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు. వినాశ కాలములో విపరీత బుద్ధి గలవారందూ నశిస్తారు(వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి) అని గానము కూడా చేస్తారని మీకు తెలుసు. మీకిప్పుడు నంబరువారు పురుషార్థానుసారము ప్రీతి బుద్ధి ఉంది, పూర్తిగా లేదు. ఎందుకంటే క్షణ క్షణము మాయ మరిపిస్తుంది. ఇది పంచ వికారాలతో యుద్ధము. పంచ వికారాలను రావణుడు అని అంటారు. రావణుని పై గాడిద తలను చూపిస్తారు.
పాఠశాలలో కళ్లు మూసుకొని ఎప్పుడూ కూర్చోరని కూడా తండ్రి అర్థం చేయించారు. వారైతే భక్తిమార్గములో భగవంతుని స్మృతి చేసేందుకు కళ్లు మూసుకొని కూర్చోమని శిక్షణ ఇస్తారు. ఇది పాఠశాల అని తండ్రి చెప్తున్నారు. దృష్టి ద్వారా పరివర్తన(నజర్ సే నిహాల్,........) అని కూడా విన్నారు, ఇది ఇంద్రజాలము అని అంటారు. అరే! ఆ గాయనము కూడా ఉంది కదా, దేవతలు కూడా దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా మానవులను దేవతలుగా చేసేవాడు ఇంద్రజాలికుడే కదా. తండ్రి వచ్చి బ్యాటరీని నింపుతూ ఉంటే(చార్జ్ చేస్తూ ఉంటే) పిల్లలు కళ్లు మూసుకొని కూర్చుంటే ఏమంటారు! పాఠశాలలో కళ్లు ముసుకొని కూర్చోరు. అలా కూర్చుంటే సోమరితనము, నిద్ర వస్తుంది. చదువు సంపాదనకు ఆధారము. ఇందులో లక్షల-పదమాలంత సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడూ ఆవళించరు. ఇక్కడ ఆత్మలు పరివర్తనవ్వాలి. మీ ఎదుట ఈ లక్ష్యము ఉంది. వారి రాజధాని చూడాలంటే దిల్వాడా మందిరానికి వెళ్లండి. అక్కడ జడ మూర్తులుగా ఉన్నారు, ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. దేవతలు కూడా ఉన్నారు, స్వర్గము కూడా ఉంది. సర్వుల సద్గతిదాత ఆబూలోనే వస్తారు, అందువలన ఆబూ చాలా గొప్ప తీర్థ స్థానము. ధర్మ స్థాపకులకు లేక గురువులందరికీ తండ్రి వచ్చి ఇక్కడ సద్గతినిస్తారు. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థ స్థానము, కానీ గుప్తంగా ఉంది. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రిలో ఏ సంస్కారాలున్నాయో వాటినే ధారణ చేయాలి. తండ్రి సమానం జ్ఞానసాగరులుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి.
2. ఆత్మ రూపీ బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ - తిరుగుతూ స్మృతియాత్రలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి.
వరదానము :- '' జ్ఞాన ధనము ద్వారా ప్రకృతిలోని సాధనాలన్నీ ప్రాప్తి చేసుకునే పదమా పదమ్ పతి భవ ''
జ్ఞాన ధనము, స్థూల ధనాన్ని స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది. ఎక్కడైతే జ్ఞాన ధనముంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసిగా అవుతుంది. జ్ఞాన ధనము ద్వారా ప్రకృతిలోని సాధనాలన్నీ స్వతహాగా ప్రాప్తి అవుతాయి. అందువలన జ్ఞాన ధనము అన్ని ధనాలకు రాజు వంటిది. రాజు ఎక్కడుంటాడో అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగా ప్రాప్తి అవుతాయి. ఈ జ్ఞాన ధనమే పదమాపదమ్ పతులుగా చేస్తుంది. పరమార్థము మరియు వ్యవహారము స్వతహాగా సిద్ధిస్తాయి. జ్ఞాన ధనములో ఎంత శక్తి ఉందంటే ఆ శక్తి అనేక జన్మలకు రాజాధి రాజులుగా చేసేస్తుంది.
స్లోగన్ :- '' '' కల్ప -కల్పము నేను విజయీ ఆత్మను '' - ఈ ఆత్మిక నశా ఎమర్జ్‌గా ఉంటే, మాయాజీత్‌లుగా అవుతారు. ''
No comments:
Post a Comment