18-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు పతితులైన ఏ దేహధారుల పైనా ప్రేమ ఉంచుకోరాదు. ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఒక్క తండ్రినే ప్రేమించాలి ''
ప్రశ్న :- పిల్లలైన మీరు ఏ విషయములో విసుగు చెందరాదు, ఎందుకు ?
జవాబు :- మీరు మీ పాత శరీరముతో కొద్దిగా కూడా విసుగు చెందరాదు. ఎందుకంటే ఈ శరీరము చాలా చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరములో ఉంటూ తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీ తీసుకుంటూ ఉంది. తండ్రి స్మృతిలో ఉంటే ఖుషీ అనే మంచి ఆహారము, ఔషధము లభిస్తూ ఉంటుంది.
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! - మీరు దూరదేశ నివాసులు. మళ్లీ ఆ దూరదేశానికి వెళ్లే ప్రయాణీకులు. మనము ఆత్మలము. ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్లే పురుషార్థము చేస్తున్నాము. ఆత్మలమైన మనము దూరదేశ నివాసులమని, దూరదేశములో ఉండే తండ్రిని, మీరు వచ్చి మమ్ములను కూడా ఆ దూరదేశానికి తీసుకెళ్లమని పిలుస్తామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దూరదేశములో ఉండే తండ్రి, పిల్లలమైన మనలను అక్కడకు తీసుకెళ్తారు. మీరు ఆత్మిక ప్రయాణీకులు. ఎందుకంటే ఈ శరీరముతో పాటు ఉన్నారు కదా. ఆత్మయే ప్రయాణము చేస్తుంది. శరీరాన్ని ఇక్కడే వదిలేస్తుంది. పోతే ఆత్మయే ప్రయాణము(యాత్ర) చేస్తుంది. ఆత్మ ఎక్కడకు వెళ్తుంది. తన ఆత్మిక ప్రపంచానికి వెళ్తుంది. ఇది దైహిక ప్రపంచము. అది ఆత్మిక ప్రపంచము. ఎక్కడ నుండి పాత్ర చేసేందుకు వచ్చామో ఆ ఇంటికి వాపస్ వెళ్లాలని తన పిల్లలైన మనకు అర్థం చేయించారు. ఇది చాలా పెద్ద వేదిక(ూ్aస్త్రవ). వేదిక పై పాత్ర చేసి మళ్లీ అందరూ వాపస్ వెళ్లాలి. నాటకము పూర్తి అయినప్పుడు వెళ్తారు కదా. మీరిప్పుడు కూర్చుని ఉన్నారు. కానీ మీ బుద్ధియోగము ఇంటి పై మరియు రాజధాని పై ఉంది. ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంతమతి సో గతి అని గాయనముంది. మీరిప్పుడు ఇక్కడ చదువుకుంటున్నారు. భగవంతుడైన శివబాబా మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు ఈ పురుషోత్తమ సంగమ యుగములో తప్ప మరెప్పుడూ చదివించరు. మొత్తం 5 వేల సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. ఇది మీకు బాగా నిశ్చయముంది. చదువు కూడా ఎంత సహజమైనది! ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఆ ఇల్లంటే మొత్తం పపంచానికంతా ఎంతో ప్ర్రేమ. ముక్తిధామానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు కానీ దాని అర్థము కూడా తెలుసుకోరు. ఇప్పుడు మానవుల బుద్ధి ఎలా ఉంది, మీ బుద్ధి ఎలా ఉంది! ఎంత వ్యతాసముంది. మీది నెంబరువారు పురుషార్థానుసారము స్వచ్ఛమైన బుద్ధిగా ఉంది. విశ్వమంతటి ఆదిమధ్యాంత జ్ఞానము మీకు బాగా తెలుసు. మనమిప్పుడు పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవ్వాలని మీ మనుసులో ఉంది. ఇక్కడ నుండి మొదట మీ ఇంటికి వెళ్తారు కదా. కావున సంతోషంగా వెళ్లాలి. ఎలాగైతే సత్యయుగములో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారో అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దీనితో విసుగు చెందరాదు. ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరము. ఈ శరీరము ద్వారానే ఆత్మకు తండ్రి ద్వారా లాటరీ లభిస్తుంది. మనము ఎంతవరకు పవిత్రంగా అవ్వమో అంతవరకు ఇంటికి వెళ్లలేము. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే, ఆ యోగబలము ద్వారా పాప భారము దిగిపోతుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవంచవలసి ఉంటుంది. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధములో కూడా పిల్లలు ఏదైనా పతితమైన, మురికి పని చేస్తే తండ్రి కోప్పడి కర్రతో కూడా కొడ్తాడు. ఎందుకంటే నియమ విరుద్ధంగా, పతితులుగా అయితారు. ఎవరితోనైనా నియమ విరుద్ధమైన ప్రేమ ఉంచుకుంటే అది తల్లి, తండ్రికి ఇష్టముండదు. ఈ అనంతమైన తండ్రి అయితే పిల్లలైన మీరిక్కడ ఉండరాదని చెప్తారు. మీరిప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్లాలి. అక్కడ వికారులైన పతితులెవ్వరూ ఉండరు. ఒక్క పతిత పావనుడైన తండ్రియే వచ్చి మిమ్ములను ఇంత పావనంగా చేస్తారు. తండ్రి స్వయముగా చెప్తున్నారు - నాది దివ్యమైన అలౌకిక జన్మ. నా సమానంగా మరే ఆత్మ కూడా శరీరములో ప్రవేశించలేదు. భలే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది. కానీ ఆ విషయము పూర్తిగా వేరు. నేనైతే అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వస్తాను. వారైతే తమ పాత్ర చేసేందుకు పై నుండి క్రిందికి దిగుతారు. నేనైతే అందరినీ తీసుకెళ్తాను. కొత్త ప్రపంచానికి మొట్టమొదట మీరెలా వస్తారో తెలిపిస్తాను. కొత్త ప్రపంచమైన ఆ సత్యయుగములో కొంగలు ఎవ్వరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యలోనే వస్తారు. మళ్లీ మిమ్ములను హంసలుగా చేస్తారు. మీరిప్పుడు హంసలుగా అయ్యారు. ముత్యాలనే ఏరుకుంటారు. సత్యయుగములో మీకు ఈ రాత్నాలు లభించవు. మీరిక్కడ ఈ జ్ఞాన రత్నాలను ఏరుకొని హంసలుగా అవుతారు. కొంగలుగా ఉన్న మీరు హంసలుగా ఎలా అవుతారో తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మిమ్ములను ఇప్పుడు హంసలుగా చేస్తారు. దేవతలను హంసలని, అసురులను కొంగలని అంటారు. మీరిప్పుడు మురికిని వదిలించి ముత్యాలను గ్రోలుతారు.
మిమ్ములనే పదమాపదమ్ భాగ్యశాలురని అంటారు. మీ పాదాల పై పద్మాలను ముద్రిస్తారు. శివబాబాకైతే పద్మములుంచేందుకు పాదాలే లేవు. వారు మిమ్ములను పదమాపదమ్ భాగ్యశాలురుగా చేస్తారు. నేను మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చానని తండ్రి చెప్తారు. ఇవన్నీ బాగా అర్థము చేసుకోవలసి విషయాలు. ఒకప్పుడు స్వర్గముండేదని మానవులు భావిస్తారు కదా. అయితే అది ఎప్పుడు ఉండేదో, మళ్లీ ఎలా వస్తుందో తెలియదు. పిల్లలైన మీరిప్పుడు వెలుగులోకి వచ్చారు. వారంతా అంధకారములో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఎప్పుడు ఎలా అయ్యారో తెలియదు. 5 వేల సంవత్సరాల నాటి విషయం. మీరెలా పాత్ర చేసేందుకు వస్తారో నేను కూడా అలాగే వస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. ఓ బాబా పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని మీరు నన్ను ఆహ్వానించారు. మరెవ్వరినీ ఈ విధంగా ఎప్పుడూ పిలువరు. మీరు వచ్చి అందరినీ పావనముగా తయారు చేయమని ఏ ఇతర ధర్మస్థాపకులను కూడా పిలువరు. క్రీస్తును లేక బుద్ధుని పతితపావనుడని అనరు. సద్గతినిచ్చువారే గురువులు. వారైతే వస్తారు. వారి తర్వాత అందరూ క్రిందకు దిగాలి. ఇక్కడి నుండి వాపస్ వెళ్ళే మార్గమును తెలిపేవారు, సర్వులకు సద్గతినిచ్చేవారు అకాలమూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురువు అనే పదమే సరైనది. మీరు అందరితో చెప్పే ఈ పదమే సరైనది. సిక్కులు కూడా చాలా పెద్ద ధ్వనితో ''సద్గురు అకాల్ '' అని అంటారు. చాలా జోరుగా సద్గురువు అకాలమూర్తి అని రాగముతో పాడ్తారు. మూర్తియే లేకుంటే వారు సద్గురువుగా ఎలా అవుతారు, సద్గతిని ఎలా ఇస్తారు? సద్గురువైన వారే స్వయంగా వచ్చి తన పరిచయమునిస్తారు - నేను మీ వలె జన్మ తీసుకోను. మిగిలినవారంతా శరీరధారులు, వారే కూర్చొని వినిపిస్తారు. మీకు అశరీరి అయిన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఈ సమయములో మానవులు ఏమి చేసినా అది తప్పుగానే చేస్తారు. ఎందుకంటే రావణుని మతములో ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలో పంచ వికారాలున్నాయి. ఇప్పుడిది రావణ రాజ్యము. ఈ విషయాలను వివరంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. లేకుంటే మొత్తం ప్రపంచ చక్రము గురించి ఎలా తెలుస్తుంది? ఈ చక్రము ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా, మీరు అర్థం చేయించండి అని కూడా మీరు అడగరు. తండ్రి వారంతకు వారే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక ప్రశ్న కూడా అడిగే పని ఉండదు. భగవంతుడు మీ తండ్రి. అన్ని విషయాలు వారంతకు వారే వినిపించడం, అన్నీ వారంతకు వారే చేయడం వారి కర్తవ్యము. పాఠశాలలో పిల్లలను తండ్రియే కూర్చోబెడ్తారు. ఉద్యోగములో పెడ్తారు. 60 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వదిలి భగవంతుని గురించి భజన చేయాలి, వేదశాస్త్రాలు మొదలైనవి చదవాలి. పూజ చేయాలి అని వారికి చెప్తాడు. మీరు అర్ధకల్పము పూజారులుగా అయ్యారు. మళ్లీ అర్ధకల్పము పూజ్యులుగా అవుతారు. పవిత్రంగా ఎలా అవ్వాలో చాలా సహజంగా అర్థం చేయించబడ్తుంది. తర్వాత భక్తి పూర్తిగా సమాప్తమౌతుంది. వారందరూ భక్తి చేస్తున్నారు. మీరు జ్ఞానము తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు. మీరు పగలులోకి అనగా స్వర్గములోకి వెళ్తారు. 'మన్మనాభవ' అని భగవద్గీతలో వ్రాయబడి ఉంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. గీతను చదివేవారు అర్థము చేసుకోగలరు. చాలా సహజంగా వ్రాయబడింది. జీవితమంతా గీతను చదువుతూ ఉంటారు. కానీ ఏమీ అర్థము చేసుకోరు. ఇప్పుడు ఆ గీతా భగవంతుడే కూర్చొని నేర్పిస్తారు. కావున పతితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు భగవంతుని ద్వారా మనము గీతను వింటున్నాము. ఇతరులకు కూడా వినిపిస్తాము, పావనంగా అవుతాము.
ఇది తండ్రి మహావాక్యము - ఇది అదే సహజ రాజయోగము. మనుష్యులు మూఢ నమ్మకాలలో ఎంతగా మునిగి ఉన్నారు! మీ మాటలనే వినరు. డ్రామానుసారము తమ అదృష్టము తెరుచుకున్నప్పుడు వారు కూడా మీ వద్దకు వస్తారు. మీకున్నంత అదృష్టం ఇతర ఏ ధర్మాల వారికీ ఉండదు. మీ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిస్తుందని తండ్రి తెలిపారు. తండ్రి సరియైన విషయము తెలుపుతున్నారని మీకు కూడా అర్థమయ్యింది. శాస్త్రాలలో అయితే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైన వారిని చూపించారు. అక్కడి సుఖమును గురించి ఎవ్వరికీ తెలియదు. భలే దేవతలను పూజిస్తారు. కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు - పిల్లలారా! నన్ను స్మృతి చేస్తున్నారా? తండ్రి ఈ విధంగా పిల్లలను స్మృతి చేయమని అడగడం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేసే పురుషార్థాన్ని చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - మీరు విశ్వమంతటి ఆదిమధ్యాంతాలను తెలుసుకుని చక్రవర్తి రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు. తర్వాత మళ్లీ పాత్రధారులుగా అయ్యి వస్తారు. ఇది కొత్త ఆత్మనా లేక పాత ఆత్మనా? అని ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు ఎంత ప్రసిద్ధి చెంది ఉన్నాయో చూడండి. మనుష్యులు చాలా మంది వచ్చేస్తారు. ఉన్నట్లుండి అనాయాసంగా వచ్చేస్తారు. కావున ఆ ప్రభావము పడ్తుంది. బాబా కూడా వీరిలో అనాయాసముగానే వస్తారు కావున ఆ ప్రభావం పడ్తుంది. అక్కడ కూడా కొత్త ఆత్మలు వచ్చినప్పుడు పాతవారి పై వారి ప్రభావము పడ్తుంది. కొమ్మలు-రెమ్మలు వస్తూ ఉంటే వాటికి మహిమ ఉంటుంది. వీరి పేరు ఎందుకు ప్రసిద్ధి గాంచిందో ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ అయినందున వారిలో ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు అసత్యమైన భగవంతులు ఎంతమంది తయారయ్యారో చూడండి. సత్యమైన నావ కదులుతుంది, ఊగుతుంది కానీ మునగదని గాయనముంది. తుఫానులు చాలా వస్తాయి. ఎందుకంటే నావికుడుగా భగవంతుడు ఉన్నాడు కదా. పిల్లలు కూడా కదులుతారు. నావకు చాలా తుఫానులు వస్తాయి. ఇతర సత్సంగాలకు చాలా మంది వెళ్తారు. కానీ అక్కడ ఎప్పుడూ తుఫాన్లు మొదలైనవి రావు. ఇక్కడ అబలల పై ఎంత అత్యాచారము జరుగుతుంది! అయినా స్థాపన అయ్యే తీరాలి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - ఓ ఆత్మలారా! మీరు ఎంత అడవి ముళ్ళుగా అయ్యారు! ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటే మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రతి విషయానికి బదులు(ప్రతిచర్య/ రెస్పాన్స్) అయితే లభిస్తుంది. అక్కడ దు:ఖపూరితమైన ఛీ-ఛీ విషయాలేవీ ఉండవు. కావున దానిని స్వర్గమని అంటారు. మనుష్యులు స్వర్గము, నరకమని అంటారు. కానీ అర్థము తెలియదు. ఫలానావారు స్వర్గస్తులైనారని అంటారు. వాస్తవానికి ఇలా అనడం కూడా తప్పే. నిరాకార ప్రపంచాన్ని స్వర్గమని అనరు. అది ముక్తిధామము. కానీ స్వర్గములోకి వెళ్లారని వారంటారు.
ముక్తిధామము ఆత్మల ఇల్లని మీకిప్పుడు తెలుసు. ఇక్కడ ఇల్లు ఉన్న విధంగానే అది ఆత్మల ఇల్లు. భక్తిమార్గములో చాలా ధనవంతులుగా ఉన్నవారు మందిరాలను ఎంత ఉన్నతంగా ఎత్తులో తయారు చేయిస్తారు. శివాలయాన్ని ఎలా నిర్మించారో చూడండి. సత్యనారాయణలకు కూడా మందిరాన్ని తయారు చేసినప్పుడు సత్యమైన బంగారు నగలు మొదలైనవి ఎన్ని ఉంటాయి! చాలా ధనముంటుంది. ఇప్పుడైతే కల్తీగా అయిపోయాయి. ఇంతకుముందు మీరు కూడా స్వచ్ఛమైన ఆభరణాలు ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచి నకిలీవి ధరిస్తారు. అక్కడైతే సత్యమే సత్యముంటుంది. అసత్యము కొంచెం కూడా ఉండదు. ఇక్కడ సత్యమైనది ఉన్నా దాచుకుంటారు. రోజురోజుకు బంగారు ధర పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేదే స్వర్గము. మీకన్నీ కొత్తవి లభిస్తాయి. క్రొత్త ప్రపంచములో అన్నీ క్రొత్తవి. అపారమైన ధనముండేది. ఇప్పుడైతే ప్రతి వస్తువు వెల ఎంత పెరిగిపోయిందో చూడండి. పిల్లలైన మీకిప్పుడు మూలవతనం మొదలు అన్ని రహస్యాలు అర్థం చేయించారు. మూలలోకములోని రహస్యాలను తండ్రి తప్ప ఎవరు అర్థం చేయిస్తారు! మీరు కూడా టీచర్లుగా అవ్వాలి. భలే గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే చాలా ఉన్నత పదవి పొందగలరు. ఇక్కడ ఉన్నవారికంటే వారు ఉన్నత పదవిని పొందగలరు. నెంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉన్నప్పటికీ విజయమాలలో రాగలరు. 7 రోజుల కోర్సు తీసుకొని భలే విదేశాలకు వెళ్లవచ్చు లేక ఎక్కడికైనా వెళ్లవచ్చు. మొత్తం ప్రపంచానికంతా సందేశము తండ్రి ఇచ్చారు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారనే సందేశము అందాలి. ఆ తండ్రియే ముక్తిదాత, మార్గదర్శి. మీరు అక్కడకు వెళ్తే వార్తాపత్రికలలో కూడా చాలా పేరు వస్తుంది. ఇతరులకు కూడా ఆత్మ, శరీరము రెండూ వేరే వేరే వస్తువులనే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. ఆత్మలోనే మనస్సు-బుద్ధి ఉంది, శరీరమైతే జడమైనది. ఆత్మ పాత్రధారిగా అవుతుంది. మంచి ఆత్మలైతే ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. బయటివారు స్మృతి చేస్తున్నంతగా ఇక్కడున్నవారు చేయరు. తండ్రిని బాగా స్మృతి చేసేవారు. తమ సమానంగా ఇతరులను తయారు చేసేవారు ముళ్ళను పూలుగా తయారు చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. మొదట మనము కూడా ముళ్ళుగా ఉండేవారమని మీకు తెలుసు. కామము మహాశత్రువు. దీని పై విజయము పొందడం వలన మీరు జగత్‌జీతులుగా అవుతారని తండ్రి ఆర్డినెన్స్(ూతీసఱఅaఅషవ) జారీ చేశారు. కాని వ్రాయడము వలన ఎవ్వరికీ అర్థము కాదు. ఇప్పుడు తండ్రి ఈ విషయాన్ని అర్థం చేయించారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సదా జ్ఞానరత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి. ముత్యాలను మాత్రమే తీసుకోవాలి. మురికిని వదిలేయాలి. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకొని పదమాపదమ్ భగ్యశాలురుగా అవ్వాలి.
2. ఉన్నత పదవిని పొందేందుకు టీచరుగా అయ్యి అనేకమందికి సేవ చేయాలి. కమల పుష్ప సమానంగా, పవిత్రంగా ఉంటూ ఇతరులను తమ సమానంగా చేయాలి. ముళ్లను పుష్పాలుగా చేయాలి.
వరదానము :- '' సహజయోగ సాధన ద్వారా సాధనాల పై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మా భవ ''
సాధనాలు ఉన్నా, వాటిని ఉపయోగిస్తున్నా యోగ స్థితి డగ్‌మగ్ కారాదు (కంపించరాదు). యోగులుగా అయ్యి ప్రయోగించుటను అతీతమని అంటారు. సాధనాలు ఉన్నా వాటిని నిమిత్త మాత్రంగా, అనాసక్త రూపంలో ఉపయోగించండి. ఒకవేళ ఇచ్ఛ(కోరిక) ఉంటే అది అచ్ఛాగా(మంచిగా) కానివ్వదు. శ్రమ చేయడంలోనే సమయం గడిచిపోతుంది. ఆ సమయం మీరు సాధనలో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు, కాని సాధనాలు తమ వైపు ఆకర్షిస్తాయి. అందువలన ప్రయోగి ఆత్మలుగా అయి సహజయోగ సాధన ద్వారా సాధనాల పై అనగా ప్రకృతి పైన విజయులుగా అవ్వండి.
స్లోగన్ :- '' '' నావి '' అనుకునే అనేక సంబంధాలను సమాప్తం చేయడమే ఫరిస్తాలుగా అవ్వడం. ''
No comments:
Post a Comment