Tuesday, September 17, 2019

Telugu Murli 16/09/2019

16-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తమ బ్యాటరీని ఛార్జ్‌ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీ సమయాన్ని పరచింతనలో వృథా చేసుకోకండి. మీకు మీరే చేసుకుంటే

ప్రశ్న :- జ్ఞానము ఒక్క క్షణములోనిదే అయినా తండ్రి ఇంత వివరంగా అర్థం చేయించవలసిన లేక ఇంత సమయము ఇవ్వవలసిన అవసరమేమి?
జవాబు :- ఎందుకంటే జ్ఞానమిచ్చిన తర్వాత పిల్లలు పరివర్తన అయినారా లేదా? అని కూడా తండ్రి చూస్తారు. తర్వాత పరివర్తన చేసుకునేందుకు జ్ఞానము ఇస్తూనే ఉంటారు. మొత్తం బీజము, వృక్షముల జ్ఞానమంతా ఇస్తారు. అందువల్లనే తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. ఒకవేళ ఒక్క క్షణములో మంత్రము చెప్పి వెళ్లిపోతే జ్ఞానసాగరులనే బిరుదు కూడా లభించదు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తిమార్గంలో పరమపిత పరమాత్ముడైన శివుడిని ఇక్కడే పూజిస్తారు. వారు ఇక్కడ ఉండి వెళ్లిపోయారని బుద్ధిలో ఉంటుంది. లింగమును ఎక్కడ చూసినా పూజిస్తారు. శివుడు పరంధామములో ఉంటారని తెలుసు. ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్లారని భావిస్తారు. అందువలన వారి స్మృతిచిహ్నలను తయారుచేసి పూజిస్తారు. స్మృతి చేస్తున్నప్పుడు వారి బుద్ధిలో తప్పకుండా వారు నిరాకారులని, పరంధామములో ఉండేవారని, వారిని శివుడని అంటూ పూజిస్తారు. మందిరానికి వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. వారిని పాలు, ఫలాలు, జలము మొదలైన వాటితో అభిషేకిస్తారు. కానీ అక్కడ ఉండేది జడమైనది. జడమైన వాటికే భక్తి చేస్తారు. వారు చైతన్యమైన వారని, వారి నివాస స్థానము పరంధామమని మీకిప్పుడు తెలసింది. వారు పూజించునప్పుడు పరంధామనివాసి అని, ఒకప్పుడు ఉండి వెళ్లిపోయారని, అందుకే ఈ చిత్రాలు తయారుచేశారని, ఆ చిత్రాలనే పూజిస్తున్నారని వారి బుద్ధిలోకి వస్తుంది. ఆ చిత్రము(లింగము) శివుడేమీ కాదు, అది వారి ప్రతిమ. అదే విధంగా దేవతలను కూడా పూజిస్తారు. అవి జడ చిత్రాలు, చైతన్యమైనవి కావు. కానీ చైతన్యంగా ఉన్నవారు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చారని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయితే అదే. ఆత్మ పేరు మారదు. పోతే శరీరము పేరు మారుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఏదో ఒక శరీరములో ఉంది. పునర్జన్మలనైతే తీసుకోవలసిందే. మీరు వారిని పూజిస్తారు. మొట్టమొదట శరీరధారులుగా ఉన్నవారిని(సత్యయుగ లక్ష్మీనారాయణులను) పూజిస్తారు. ఈ సమయంలో తండ్రి చెప్పే జ్ఞానము గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిని పూజిస్తున్నారో వారు మొదటి నెంబరులోనివారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులు చైతన్యంగా ఉండేవారు. ఇక్కడే భారతదేశములో ఉండేవారు. కానీ ఇప్పుడు వారు లేరు. వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ భిన్న భిన్న నామ-రూపాలను తీసుకుంటూ 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఉంటారని ఎవరి ఆలోచనలోకి రాదు. సత్యయుగములో ఉండేవారు కానీ వారు ఇప్పుడు లేరు. ఇది కూడా ఎవ్వరికీ అర్థము కాదు. ఇప్పుడు మీకు తెలుసు. డ్రామా ప్లాను అనుసారము వారు మళ్లీ తప్పకుండా చైతన్యములోకి వస్తారు. మనుష్యుల బుద్ధిలోకి ఈ ఆలోచన కూడా రాదు. వీరు ఒకప్పుడు ఉండేవారని మాత్రం తప్పకుండా భావిస్తారు. ఇప్పుడు వీరి జడ చిత్రాలున్నాయి. కానీ ఆ చైతన్యమైన వారు ఎక్కడకి వెళ్లిపోయారో అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. మనుష్యులైతే 84 లక్షల పునర్జన్మలని అనేస్తారు. కానీ 84 జన్మలు మాత్రమే తీసుకుంటారు. 84 లక్షలు కాదని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. ఇప్పుడు శ్రీరామచంద్రుని పూజిస్తారు. రాముడు ఎక్కడికి వెళ్లారో వారికి తెలియదు. శ్రీరాముని ఆత్మ తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ పరీక్షలో పాస్‌ అవ్వరు. కానీ ఏదో ఒక రూపములో తప్పకుండా ఉంటారు కదా. ఇక్కడే పురుషార్థము చేస్తూ ఉంటారు. రాముని పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. కావున తప్పకుండా వస్తాడు. వారు జ్ఞానము తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియనందున ఈ విషయము వదిలేయవలసి ఉంటుంది. ఈ విషయాలలోకి వెళ్లడం వల్ల కూడా సమయము వృథా అవుతుంది. దీనికంటే మన సమయాన్ని ఎందుకు సఫలము చేసుకోరాదు? స్వ ఉన్నతి కొరకు బ్యాటరీని చార్జ్‌ చేసుకోండి. ఇతర విషయాల గురించి చింతించడం పరచింతన అవుతుంది. ఇప్పుడు స్వయమును గురించి చింతన చేయాలి. మనము తండ్రిని స్మృతి చేయాలి. అతను(రాముడు) కూడా తప్పకుండా చదువుకుంటూ ఉంటారు. తన బ్యాటరీని చార్జ్‌ చేసుకుంటూ ఉంటాడు. కానీ మీరు మీ బ్యాటరీని చార్జ్‌ చేసుకోవాలి. మీ ఆంతరికములోకి మీరే వెళ్లి చూసుకుంటే నషా పెరుగుతుంది(అపనీ ఘోట్‌ తో నషా చడే) అని అంటారు.
మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా ఉండేదని తండ్రి అన్నారు. మళ్లీ ఇప్పుడు పురుషార్థము చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ గమ్యముంది కదా. ఈ చింతన చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతారు. నారాయణుడినే స్మరిస్తూ ఉంటే మనము నారాయణునిగా అవుతాము. అంతిమకాలములో ఎవరు నారాయణుని స్మరిస్తే.................. అని అంటారు. మీరు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా పాపము సమాప్తమవుతుంది. మళ్లీ నారాయణునిగా అవుతారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు అత్యున్నతమైన ఉపాయము. నారాయణుడు ఒక్కడే ఉండడు కదా. వంశమంతా తయారవుతుంది. తండ్రి అత్యున్నతమైన పురుషార్థము చేయిస్తారు. దీని పేరే రాజయోగ జ్ఞానము. అందులోనూ విశ్వానికంతా అధికారులుగా అవ్వాలి. ఎంత పురుషార్థము చేస్తారో, అంత లాభము తప్పకుండా ఉంటుంది. మొదట స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా నిశ్చయము చేసుకోండి. ఫలానా ఆత్మ మిమ్ములను స్మృతి చేస్తోందని కొందరు వ్రాస్తారు కూడా. ఆత్మ శరీరము ద్వారా వ్రాస్తుంది. ఆత్మకు శివబాబాతో సంబంధముంది. నేను ఆత్మ ఫలానా శరీరము యొక్క నామ-రూపములు కలిగి ఉన్నాను. ఇది తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ ఉన్న శరీరానికే భిన్న-భిన్న పేర్లు ఉంటాయి. నేను ఆత్మ, మీ బిడ్డను. ఆత్మనైన నా శరీరము పేరు ఫలానా. ఆత్మ పేరైతే ఎప్పటికీ మారదు. నేను ఆత్మ ఫలానా శరీరాన్ని కలిగి ఉన్నాను. శరీరము పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే కార్యవ్యవహారాలు జరగవు. నేను కూడా బ్రహ్మ తనువులో తాత్కాలికంగా వస్తానని తండ్రి అంటారు. ఈ విషయం ఇతని ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను. నేను ఈ శరీరము ద్వారా మిమ్ములను చదివించేందుకు వచ్చాను. ఇది నా శరీరము కాదు. నేను ఇతనిలో ప్రవేశించాను. మళ్లీ నా ధామానికి వెళ్లిపోతాను. పిల్లలైన మీకు ఈ మంత్రమును ఇచ్చేందుకే వచ్చాను. అలాగని మంత్రమునిచ్చి వెళ్లిపోతానని కాదు. పిల్లలు ఎంత వరకు పరివర్తనయ్యారో కూడా గమనించవలసి ఉంటుంది. పరివర్తన అయ్యేందుకు శిక్షణ ఇస్తూ ఉంటారు. క్షణములో జ్ఞానమంతా ఇచ్చి వెళ్లిపోతే, జ్ఞానసాగరుడని కూడా అనరు. మీకు అర్థం చేయిస్తూ ఎంత సమయము గడచింది. వ్షృము గురించి, భక్తిమార్గములోని విషయాలన్నీ అర్థం చేసుకోవడం విస్తారము. వివరంగా అర్థం చేయిస్తారు. హోల్‌సేల్‌గా తెలపాలంటే 'మన్మనాభవ.' కానీ ఈ విధంగా చెప్పి వెంటనే వెళ్లిపోరు. పాలన కూడా చేయవలసి ఉంటుంది. కొంతమంది పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మాయమైపోతారు. ఫలానా ఆత్మ, వారి పేరు ఫలానా చాలా బాగా చదువుకుంటూ ఉండేవాడని గుర్తుకు వస్తాడు కదా. పాత పాత పిల్లలు ఎంత బాగుండేవారు! వారిని మాయ మింగేసింది. ప్రారంభములో ఎంతమంది వచ్చారు! వచ్చిన వెంటనే బాబా ఒడిని తీసుకున్నారు. భట్టీ తయారయ్యింది. ఇందులో అందరూ తమ భాగ్యాన్ని పొందుకున్నారు. పొందుకుంటూ పొందుకుంటూ మాయ ఒక్కసారిగా ఎగిరేసుకు పోయింది(పడగొట్టేసింది). స్థిరపడలేదు. మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఎంతోమంది వెళ్లిపోయారు. అర్ధ వృక్షము వరకు వెళ్ళిపోయారు. వ్షృము వృద్ధి చెందింది. కానీ పాతవారు వెళ్లిపోయారు. వారిలో కొందరు చదువుకునేందుకు మళ్లీ వస్తారని భావించవచ్చు. మేము తండ్రి ద్వారా చదువుకునేవారము. ఇప్పుడు అందరూ చదువుకుంటూ ఉంటారు. మేము ఓడిపోయామని వారికి గుర్తు వస్తుంది. మళ్లీ మైదానములోకి వస్తారు. మళ్లీ వచ్చి పురుషార్థము చేసుకోనీ అని బాబా రానిస్తారు. ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది.
తండ్రి గుర్తు చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు? బాబా పరంధామములో ఉన్నారని భావిస్తున్నారా? లేదు. బాబా అయితే ఇక్కడ ఈ రథములో కూర్చుని ఉన్నారు. ఈ రథము గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది భాగ్యశాలీ రథము. ఇందులో వచ్చి ఉన్నారు. భక్తిమార్గములో వారిని పరంధామములో స్మృతి చేసేవారు. కాని వారిని స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో వారికి తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి స్వయంగా ఈ రథములో వచ్చి శ్రీమతమును ఇస్తున్నారు. అందువలన ఈ మృత్యులోకములో పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మను స్మృతి చేయరాదని మీకు తెలుసు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఈ రథములో ఉంటూ మీకు ఈ జ్ఞానమును ఇస్తున్నానని తండ్రి చెప్తారు. నేను ఇక్కడ ఉన్నాను, నా పరిచయం కూడా ఇస్తున్నాను. పరంధామములో ఉంటారని ఇంతకు ముందు మీరు భావించేవారు. అయితే ఎప్పుడు అనేది తెలియదు. అందరూ వచ్చి వెళ్ళిపోయారు కదా. ఎవరి చిత్రాలున్నాయో ఇప్పుడు వారెక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఎవరౖెెతే వెళ్తారో వారు మళ్లీ తమ సమయానుసారంగా వస్తారు. రకరకాలుగా పాత్ర చేస్తూ ఉంటారు. స్వర్గానికైతే వవ్వరూ వెళ్ళరు. స్వర్గములోకి వెళ్లేందుకు పురుషార్థము చేయాలని, పాత ప్రపంచము సమాప్తము, కొత్త యుగము ప్రారంభము కావాలి, దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారని తండ్రి అర్థం చేయించారు. మీకిప్పుడు ఈ జ్ఞానముంది. మనుష్యులకేమీ తెలియదు. ఈ శరీరము కాలిపోతుంది. ఆత్మ వెళ్ళిపోతుందని కూడా తెలుసు. ఇప్పుడిది కలియుగము. కావున తప్పకుండా కలియుగములోనే జన్మ తీసుకుంటారు. సత్యయుగములో ఉన్నప్పుడు సత్యయుగములోనే జన్మ తీసుకునేవారు. ఆత్మల స్టాకు అంతా నిరాకార ప్రపంచములోనే ఉంటుందని కూడా తెలుసు. ఇది మీ బుద్ధిలో కూర్చుంది కదా. మళ్లీ అక్కడ నుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధరించి జీవాత్మలుగా అవుతారు. అందరూ ఇక్కడికి వచ్చి జీవాత్మలుగా అవ్వాల్సిందే. మళ్లీ నెంబరువారుగా వాపస్‌ వెళ్ళాలి. అందరినీ తీసుకెళ్ళరు. అలాగైతే జల ప్రళయమైపోతుంది. ప్రళయము జరిగిందని చూపిస్తారు. కాని దాని ఫలితమునేమీ చూపించరు. ఈ ప్రపంచము ఎప్పటికీ ఖాళీ అవ్వజాలదని మీకు తెలుసు. రాముడూ వెళ్ళిపోయాడు, వారు బహు పరివారమూ పోయిందనే గాయనముంది. పూర్తి ప్రపంచమంతా రావణుని సంప్రాదాయములో ఉంది కదా. రాముని సంప్రదాయము చాలా కొద్దిగానే ఉంటుంది. సత్య, త్రేతా యుగాలలోనే రాముని సంప్రదాయముంటుంది. చాలా వ్యతాసము ఉంటుంది. తర్వాత కొమ్మ రెమ్మలు వెలువడ్త్తాయి. మీరు ఇప్పుడు బీజము, వృక్షముల గురించి కూడా తెలుసుకున్నారు. తండ్రికి అన్నీ తెలుసు. అందుకే మీకు వినిపిస్తూ ఉంటారు. అందుకే వారిని జ్ఞానసాగరుడని అంటారు. ఒకే ఒక విషయము ద్వారా శాస్త్రాలు తయారవ్వజాలవు. వృక్షమును గురించిన వివరాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన మొదటి నెంబరు సబ్జెక్టు తండ్రిని స్మృతి చేయడం. అందులోనే శ్రమ ఉంది. మొత్తం దీని పైనే ఆధారపడి ఉంది. మిగిలిన వృక్షమును గురించి మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచములోని వారికి ఈ విషయాలను గురించి ఏమీ తెలియదు. మీరు అన్ని ధర్మాలవారి తిథి, తారీకులు మొదలైన వాటి గురించి తెలియజేస్తారు. అర్ధకల్పములో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉన్నారు. వీరి కొరకు చాలా యుగాలైతే ఉండవు కదా. అక్కడ ఉండేవే రెండు యుగాలు. అక్కడ మానవులు కూడా కొద్దిమందే ఉంటారు. 84 లక్షల జన్మలుండజాలవు. వీలే లేదు. మానవులు బుద్ధిహీనులైపోతారు. అందువలన తండ్రి మళ్లీ వచ్చి ఆ వివేకాన్ని ఇస్తారు. రచయిత అయిన తండ్రియే వచ్చి రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానమును ఇస్తారు. భారతవాసులకు ఏమీ తెలియదు. అందరినీ పూజిస్తూ ఉంటారు. ముస్లింలను, పారసీలను మొదలైనవారు ఎవరు వస్తే వారినందరినీ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ ధర్మమును, ధర్మస్థాపకులను మర్చిపోయారు. మిగిలిన వారందరికీ తమ ధర్మము గురించి తెలుసు. ఫలానా ధర్మము ఎప్పుడు ఎవరు స్థాపించారో అందరికీ తెలుసు. ఇక సత్య, త్రేతా యుగాల చరిత్ర - భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబాకు ఈ రూపముందని చిత్రాలను కూడా చూపిస్తారు. వారే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. కావున వారినే స్మృతి చేయాలి. ఇక్కడ అందరికంటే ఎక్కువగా కృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే తాను భగవంతుని తర్వాతి వాడు. అతడిని ఎంతో ప్రీతిస్తారు కూడా. కావున అతడే గీతా భగవంతుడని కూడా భావించేశారు. వినిపించేవారు వస్తేనే వారి ద్వారా వారసత్వము లభించగలదు. తండ్రియే వినిపిస్తారు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము తండ్రి తప్ప మరెవ్వరూ చేయించలేరు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన అని కూడా వ్రాస్తారు. అది ఇక్కడి విషయమే. కానీ ఏమీ అర్థము చేసుకోరు.
అది నిరాకార సృష్టి, ఇది సాకార సృష్టి అని మీకు తెలుసు. సృషి ఉండేది ఇక్కడే. ఇక్కడే రామరాజ్యము, రావణ రాజ్యము ఉంటాయి. మహిమ అంతా ఇక్కడిదే కేవలం సూక్ష్మలోకము సాక్షాత్కారమవుతుంది. మూలవతనములోనైతే ఆత్మలే ఉంటాయి. మళ్లీ ఇక్కడకు వచ్చి పాత్ర చేస్తాయి. సూక్ష్మవతనములో ఏముందో చిత్రాలు కూడా తయారు చేశారు. దానిని గురించి తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఇలా సూక్ష్మలోక నివాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి. ఫరిస్తాలు రక్తమాంసాలు లేకుండా ఉంటాయి. దధీచీ ఋషి ఎముకలను కూడా ఇచ్చేశారని అంటారు కదా. శంకరుని గురించిన గాయనము ఎక్కడా లేదు. బ్రహ్మ, విష్ణువులకు మందిరాలున్నాయి. శంరునికి ఏమీ లేదు. కావున వారిని వినాశనము కొరకు నిమిత్తము చేశారు. అంతేకాని కనులు తెరచి వినాశనమేమీ చేయడు. దేవతలు హింసతో కూడిన పనిని ఎలా చేయగలరు? వారు అలా చెయ్యరు. శివబాబా కూడా వారికి అటువంటి ఆదేశాలనివ్వరు. ఆదేశించేవారి పై కూడా భారము పడ్తుంది కదా. అలా అన్నవారు చిక్కుకుని పోతారు. వారైతే శివ-శంకరులను ఒకటిగా చేసి చెప్పేస్తారు. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తారు. శివ-శంకరులను స్మృతి చేయమని చెప్పరు. పతిత పావనుడని ఒక్కరినే అంటారు. భగవంతుడు అర్థ సహితంగా తెలిపిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియనందు వలన చిత్రాలను చూచి తికమకపడ్తారు. అర్థము గురించి తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. అర్థము చేసుకునేందుకు సమయము పడ్తుంది. కోటిలో ఏ ఒక్కరో అరుదుగా వెలువడ్తారు. నేను ఎవరో ఎలా ఉన్నానో కోటికి ఒక్కరు మాత్రమే నన్ను గుర్తించగలరు. మంచిది!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ విషయము గురించి కూడా చింత చేస్తూ సమయాన్ని వృథా చేసుకోకండి. తమలో తాము మస్తీగా(ఆనందంగా/తన్మయత్వములో) ఉండాలి. స్వయాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి.
2. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు అంతిమ సమయములో తండ్రి ఒక్కరే గుర్తుండాలి. ఈ అత్యున్నతమైన యుక్తిని ఎదురుగా ఉంచుకొని నేను ఆత్మను అని పురుషార్థము చేయాలి, ఈ శరీరాన్ని మర్చిపోవాలి.

వరదానము :- '' దేహ భావము నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనధారీ భవ ''
కమల ఆసనము బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలు దేహ భావము నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. వారిని శరీర భావము తన వైపు ఆకర్షించదు. ఎలాగైతే బ్రహ్మాబాబాకు నడుస్తూ-తిరుగుతూ ఉన్నా ఫరిస్తా రూపము లేక దేవతా రూపము సదా స్మృతిలో ఉండేదో అలా న్యాచురల్‌ దేహీ-అభిమాని స్థితి సదా ఉండాలి. దీనిని దేహ భావము నుండి అతీతమని అంటారు. ఇలా దేహ భావము నుండి భిన్నంగా ఉండువారే పరమాత్మ ప్రియులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదాలు. వాటిని మావి అని భావించుటే దేహాభిమానము ''

No comments:

Post a Comment