19-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు మీరు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు. అందువలన మీలో ఏ భూతమూ ఉండరాదు ''
ప్రశ్న :- మొత్తం కల్పమంతటిలో చదివించని ఏ చదువును మీకిప్పుడు తండ్రి చదివిస్తున్నారు ?
జవాబు :- కొత్త రాజధానిని స్థాపన చేసే చదువును, మనుష్యులకు రాజ్య పదవినిచ్చే చదువును ఈ సమయంలో సుప్రీమ్ తండ్రియే చదివిస్తారు. ఈ క్రొత్త చదువును కల్పమంతటిలో ఎప్పుడూ చదివించరు. ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతోంది.
ఓంశాంతి. మనము ఆత్మలమని శరీరము కాదని పిల్లలకు తెలుసు. అటువంటి వారినే ఆత్మాభిమానులని అంటారు. మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇది పాపాత్మల ప్రపంచము అనగా వికారి ప్రపంచము, రావణ రాజ్యము. సత్యయుగము గడిచిపోయింది. అక్కడ అందరూ నిర్వికారులుగా ఉండేవారు. మేమే పవిత్ర దేవీదేవతలుగా ఉండేవారమని, 84 జన్మల తర్వాత పతితమైపోయామని పిల్లలకు తెలుసు. 84 జన్మలను అందరూ తీసుకోరు. భారతీయులే దేవీదేవతలుగా ఉండేవారు. వారు 82, 83, 84 జన్మలు తీసుకున్నారు. వారే పతితమయ్యారు. భారతదేశమే అవినాశి ఖండముగా కీర్తించబడింది. భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. అప్పుడది కొత్త ప్రపంచమని, కొత్త భారతదేశమని పిలువబడేది. ఇప్పుడు పాత ప్రపంచము, పాత భారతదేశముగా ఉంది. అక్కడైతే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. వారికి ఏ వికారమూ లేదు. ఆ దేవతలే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు పతితులుగా అయ్యారు. కామమనే భూతము, క్రోధమనే భూతము, లోభమనే భూతము. ఇవన్నీ కఠినమైన భూతాలు. ఇందులో ముఖ్యమైనది దేహాభిమానమనే భూతము. రావణ రాజ్యము కదా. ఈ రావణుడు భారతదేశానికి అర్ధకల్పపు శత్రువు. మనుష్యులలో 5 వికారాలు ప్రవేశించినప్పుడు రావణుడు శత్రువుగా అవుతాడు. దేవతలలో ఈ భూతాలు ఉండవు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వారి ఆత్మలు కూడా వికారాలలోకి వచ్చేశాయి. మనము దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఏ భూతమూ ఉండేది కాదని మీకు తెలుసు. సత్య, త్రేతా యుగాలను రామరాజ్యమని, ద్వాపర కలియుగాలను రావణరాజ్యమని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క నర-నారిలో పంచ వికారాలున్నాయి. ద్వాపర యుగము నుండి కలియుగము వరకు పంచ వికారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు. నిర్వికారులైన తర్వాత ఏ వికారానికి వశమైనా మీ ముఖాన్ని నల్లగా చేసుకున్నారని, ఇప్పుడిక తెల్లగా అవ్వడం కష్టమని బాబా వ్రాస్తారు. అది 5 అంతస్థుల నుండి పడిపోయినట్లే. ఎముకలు విరిగిపోతాయి. గీతలో కూడా భగవానువాచ - ''కామము మహాశత్రువు''. భారతదేశపు వాస్తవిక ధర్మశాస్త్రము ఒక్క గీతయే. ప్రతి ఒక్క ధర్మానికి ఒక్క శాస్త్రమే ఉంది. భారతీయులకైతే చాలా శాస్త్రాలున్నాయి. దీనిని భక్తి అని అంటారు. కొత్త ప్రపంచము సతోప్రధానమైన బంగారు యుగము. అక్కడ యుద్ధాలు మొదలైనవేవీ ఉండవు. దీర్ఘాయువు గలవారిగా నిరంతరము ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. దేవతలమైన మనము చాలా సుఖంగా ఉండేవారమని మీకు గుర్తుకొచ్చింది. అక్కడ అకాలమృత్యువు ఉండదు. మృత్యు భయముండదు. అక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ ఉంటాయి. నరకములో సంతోషము ఉండదు. శరీరానికి ఏదో ఒక రోగము వస్తూనే ఉంటుంది. ఇది అత్యంత దు:ఖపూరిత ప్రపంచము. అది అపారమైన సుఖాల ప్రపంచము. బేహద్ తండ్రి దు:ఖ ప్రపంచమును రచించరు. తండ్రి సుఖ ప్రపంచమును రచించారు. రావణ రాజ్యము వచ్చిన తర్వాత రావణుని ద్వారా దు:ఖము, అశాంతి లభించింది. సత్యయుగము సుఖధామము. కలియుగము దు:ఖధామము. వికారములో వెళ్లడం అనగా ఒకరి పై ఒకరు కామ ఖడ్గమును ఉపయోగించడం. ఇది భగవంతుని రచనే కదా అని మనుష్యులు అంటారు. కానీ కాదు. భగవంతుని రచన కాదు. ఇది రావణుని రచన. భగవంతుడు స్వర్గాన్ని రచించారు. అక్కడ కామ వికారము(ఖడ్గము) ఉండదు. సుఖ-దు:ఖాలను భగవంతుడే ఇస్తాడని కాదు. అరే! భగవంతుడు అనంతమైన తండ్రి. పిల్లలకు దు:ఖమునెలా ఇస్తారు! నేను సుఖవారసత్వమునిస్తాను. అర్ధకల్పము తర్వాత రావణుడు శాపమిస్తాడని తండ్రి చెప్తారు. సత్యయుగములో చాలా సుఖంగా, సంపన్నంగా ఉండేవారు. ఒక్క సోమనాథ మందిరములోనే ఎన్ని వజ్రవైఢూర్యాలుండేవి. భారతదేశము ఎంత సంపన్నంగా ఉండేది. ఇప్పుడు దివాలా తీసింది. సత్యయుగములో 100% సంపన్నంగా, కలియుగములో 100% దివాలాగా ఉంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడిది ఇనుప యుగము. తుప్పుపడుతూ పడుతూ పూర్తిగా తమోప్రధానమై పోయింది. ఎంత దు:ఖముంది. ఈ విమానాలు మొదలైనవి కూడా ఈ 100 సంవత్సరాల లోపే తయారయ్యాయి. దీనిని మాయ ఆడంబరమని అంటారు. సైన్సు స్వర్గమును తయారు చేసిందని భావిస్తారు. కానీ ఇది రావణుని స్వర్గము. కలియుగములో మాయ ఆడంబరము చూసి మీ వద్దకు చాలా కష్టంగా వస్తారు. మా దగ్గర మహళ్ళు, మోటర్లు మొదలైనవి ఉన్నాయని భావిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు సత్యయుగమును స్వర్గమని అంటారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము లేదు. ఇప్పుడిది కలియుగము. దీని తర్వాత వీరి రాజ్యము వస్తుంది. మొదట భారతదేశము చాలా చిన్నదిగా ఉండేది. క్రొత్త ప్రపంచములో 9 లక్షల మంది దేవతలు మాత్రమే ఉండేవారు. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. మొత్తం సృష్టి అంతా వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. మొట్టమొదట కేవలం దేవీదేవతలు మాత్రమే ఉండేవారు. కావున బేహద్ తండ్రి కూర్చుని ప్రపంచ చరిత్ర-భూగోళాలను అర్థం చేయిస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ తెలుపలేరు. వారిని నాలెడ్జ్‌ఫుల్, గాడ్‌ఫాదర్ అని అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలందరూ పరస్పరములో సోదరులు(భాయి-భాయి) తర్వాత సోదర - సోదరీలుగా అవుతారు. మీరందరూ ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలు. ఆత్మలందరూ వారి సంతానమే. వారిని పరమపిత అని అంటారు. వారి పేరు శివ. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నాకు శివ అను పేరు ఒక్కటే ఉంది. తర్వాత భక్తిమార్గములో మనుష్యులు చాలా మందిరాలు నిర్మించారు. కనుక చాలా పేర్లు పెట్టేశారు. భక్తి సామాగ్రి చాలా ఉంది. దానిని చదువు అని అనరు. అందులో లక్ష్యము లేదు. అది ఇంకా క్రిందకు దిగజారుస్తుంది. దిగుతూ దిగుతూ తమోప్రధానమైపోతారు. మళ్లీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి. మీరు సతోప్రధానంగా అయ్యి స్వర్గములోకి వస్తారు. మిగిలిన వారందరూ సతోప్రధానమై శాంతిధామములో ఉంటారు. దీనిని బాగా గుర్తుంచుకోండి. బాబా, మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలిచారు. కనుక ఈ మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు నేను వచ్చాను. గంగా స్నానము చేయడం వలన పావనంగా అవుతారని మానవులు అనుకుంటారు. గంగను పతితపావనిగా భావిస్తారు. కుంటలో లేక బావిలో నుండి నీరు వచ్చినా దానిని కూడా గంగ నీరు అని భావించి స్నానము చేస్తారు. గుప్త గంగగా భావిస్తారు. తీర్థ యాత్రలకు గానీ, ఏ కొండ పైకో గానీ వెళ్లినప్పుడు, దానిని కూడా గుప్త గంగ అని అంటారు. దీనిని అసత్యమని అంటారు. భగవంతుడు అనగా సత్యమని (గాడ్ ఈజ్ ట్రూత్) అంటారు. పోతే రావణ రాజ్యములో అందరూ అసత్యాన్నే చెప్తారు. భగవంతుడైన తండ్రి ఒక్కరే సత్య ఖండమును స్థాపిస్తారు. అక్కడ అసత్యమనే విషయమే ఉండదు. దేవతలకు నైవేద్యము(భోగ్) కూడా శుద్ధంగా పెడ్తారు. ఇప్పుడు ఆసురీ రాజ్యముంది. సత్య, త్రేతా యుగాలలో ఈశ్వరీయ రాజ్యము ఉంటుంది. అది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. దేవతలలో ఏ వికారమూ ఉండదు. యథా రాజా రాణి, తథా ప్రజా. అందరూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ అందరూ పాపులుగా, కాముకులుగా, క్రోధులుగా ఉన్నారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, దీనిని నరకమని అంటారు. నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. ఇక్కడ అందరూ పతితమై నరకవాసులుగా ఉన్నారు. సత్యయుగములో పావనంగా ఉంటారు. మేము పతితుల నుండి పావనమయ్యేందుకు స్నానం చేసేందుకు వెళ్తున్నామని అక్కడ అనరు.
ఇది వెరైటి మానవ సృష్టి రూపి వృక్షము. భగవంతుడు బీజరూపుడు. వారే రచనను రచిస్తారు. మొట్టమొదట దేవీదేవతలను రచిస్తారు. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇన్ని ధర్మాలైపోతాయి. మొదట ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది, చాలా సుఖముండేది. విశ్వములో శాంతి ఉండాలని మానవులు కోరుకుంటారు. దానిని మీరిప్పుడు స్థాపిస్తున్నారు. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలియుగాంతము, మరియు సత్యయుగాదుల పురుషోత్తమ సంగమ యుగము. దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. కలియుగము తర్వాత సత్యయుగము స్థాపనవుతూ ఉంది. సంగమ యుగములో మీరు చదువుకుంటున్నారు. దీని ఫలితము సత్యయుగములో లభిస్తుంది. ఇక్కడ ఎంత పవిత్రంగా అవుతారో, ఎంత బాగా చదకువుకుంటారో అక్కడ అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇటువంటి చదువు ఎక్కడా ఉండదు. మీకు ఈ చదువు ద్వారా సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఒకవేళ ఏదైనా భూతముంటే ఒకటేమో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, రెండవది అక్కడ మీరు తక్కువ పదవిని పొందుతారు. ఎవరైతే సంపూర్ణమై ఇతరులను కూడా చదివిస్తారో, వారు పదవిని కూడా ఉన్నతమైనది పొందుతారు. ఎన్ని సేవాకేంద్రాలున్నాయి! లక్షల సేవాకేంద్రాలవుతాయి. విశ్వమంతటా సేవాకేంద్రాలు తెరవబడుతాయి. పాపాత్మలుగా ఉన్నవారు పుణ్మాత్మలుగా అవ్వాల్సిందే. మీ లక్ష్యము - ఉద్ధేశ్యము కూడా ఉంది. చదివించేవారు ఒక్క శివబాబాయే. వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. తండ్రియే వచ్చి చదివిస్తారు. ఇతను చదివించరు. ఇతని ద్వారా శివబాబా చదివిస్తారు. ఇతడిని భగవంతుని రథమని, భాగ్యశాలీ రథమని అంటారు. మిమ్ములను ఎంతో పదమాపదమ్ భాగ్యశాలురుగా చేస్తారు. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఎప్పటికీ జబ్బుపడరు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ లభిస్తాయి. ఇక్కడ భలే ధనమున్నా జబ్బులు మొదలైనవి చాలా ఉన్నాయి. ఆ సంతోషము ఉండజాలదు. ఏదో ఒక దు:ఖముంటుంది. దాని పేరే సుఖధామము, స్వర్గము, ప్యారడైజ్. ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యమును ఎవరు ఇచ్చారో ఎవ్వరికీ తెలియదు. వీరు భారతదేశములో ఉండేవారు. విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అప్పుడు ఏ విధమైన విభజనలు మొదలైనవి లేవు. ఇప్పుడైతే ఎన్ని విభజనలున్నాయి! ఇక్కడ రావణరాజ్యముంది. ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది! కొట్లాడుతూ ఉంటారు. అక్కడైతే మొత్తం భారతదేశమంతటా ఈ దేవీ దేవతల రాజ్యముండేది. అక్కడ మంత్రులు మొదలైనవారెవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎంతమంది మంత్రులున్నారో చూడండి. ఎందుకంటే తెలివిహీనులుగా ఉన్నారు. మంత్రులు కూడా అదే విధంగా తమోప్రధానమై పతితంగా ఉన్నారు. పతితులతో పతితులు చేరి, చేయి - చేయి కలిపి పొడవైన చేయి అయినట్లు............. నిరుపేదలుగా అవుతూ ఉంటారు. అప్పు కూడా తీసుకుంటూ ఉంటారు. సత్యయుగములో అయితే ధాన్యము, ఫలాలు మొదలైనవన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. మీరు అక్కడకు వెళ్లి అన్నీ అనుభవము చేసి వస్తారు. సూక్ష్మవతనములోకి వెళ్తారు, స్వర్గములోకి కూడా వెళ్తారు. సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో తండ్రి చెప్త్తారు. భారతదేశములో మొట్టమొదట దేవీ దేవతా ధర్మమొక్కటే ఉండేది. మరే ధర్మము ఉండేది కాదు. తర్వాత ద్వాపర యుగము నుండి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఇప్పుడిది వికారీ ప్రపంచము. తర్వాత మీరు పవిత్రంగా అయ్యి నిర్వికారి దేవతలుగా అవుతారు. ఇది పాఠశాల. భగవానువాచ - నేను పిల్లలైన మీకు రాజయోగమును నేర్పిస్తాను. భవిష్యత్తులో మీరు ఇలా(లక్ష్మినారాయణులుగా) అవుతారు. రాజ్యమును పొందేే చదువు మరెక్కడా లభించదు. తండ్రియే చదివించి, కొత్త ప్రపంచ రాజధానిని ఇస్తారు. సుప్రీమ్ ఫాదర్, టీచర్, సద్గురువు శివబాబా ఒక్కరే. తండ్రి అనగా తప్పకుండా వారసత్వము లభించాలి. భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వమునే ఇస్తారు. రావణున్ని ప్రతి సంవత్సరము తగులబెడ్తారు. ఇతడు భారతదేశానికి నెంబర్‌వన్ శత్రువు. రావణుడు ఎలాంటి అసురులుగా చేసేశాడు! ఇతని రాజ్యము 2500 సంవత్సరాలుంటుంది. నేను మిమ్ములను సుఖధామానికి అధికారులుగా చేస్తానని తండ్రి చెప్తారు. రావణుడు మిమ్ములను దు:ఖధామములోకి తీసుకెళ్తాడు. మీ ఆయువు కూడా తగ్గిపోతుంది. అకస్మాత్తుగా అకాలమృత్యువు సంభవిస్తుంది. అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. అక్కడ ఇలాంటి విషయాలేవీ ఉండవు. దాని పేరే స్వర్గము. ఇప్పుడు మిమ్ములను హిందువులని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పతితులుగా ఉన్నారు. కావున దేవతలని చెప్పుకునే యోగ్యత లేదు. తండ్రి ఈ రథము ద్వారా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇతని ప్రక్కనే భృకుటి మధ్యలో వచ్చి కూర్చుని మిమ్ములను చదివిస్తారు. ఇతను కూడా చదువుకుంటారు. మనమందరము విద్యార్థులము. తండ్రి ఒక్కరే టీచరు. ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారు. ఈ జ్ఞానము, ఈ చదువు మళ్లీ అదృశ్యమైపోతుంది. చదువుకొని మీరు దేవతలుగా అయినప్పుడు 2500 సంవత్సరాలు సుఖ వారసత్వము తీసుకుంటారు. తర్వాత దు:ఖముంటుంది. అది రావణుని శాపము. ఇప్పుడు భారతదేశము చాలా దు:ఖపూరితమైపోయింది. ఇది దు:ఖధామము. ''పతితపావనా! రండి, వచ్చి పావనంగా చేయండి'' అని అంటారు కదా. ఇప్పుడు మీలో ఏ వికారమూ ఉండరాదు. కానీ అర్ధకల్పము నుండి ఉన్న జబ్బులన్నీ అంత త్వరగా నయం కావు. ఆ చదువులో కూడా బాగా చదవనివారు ఫెయిల్ అవుతారు. గౌరవపూర్వకంగా పాస్ అయినవారు స్కాలర్‌షిప్ తీసుకుంటారు. అలా ఇక్కడ కూడా సంపూర్ణ పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా తయారు చేసేవారు ఈ బహుమతిని తీసుకుంటారు. అష్టరత్నాల మాల ఉంటుంది. వారు గౌరవపూర్వకంగా పాస్ అయ్యేవారు. తర్వాత 108 మాల కూడా ఉంటుంది. ఆ మాల కూడా స్మరించబడ్తుంది. దీని రహస్యము మానవులకు అర్థం కాదు. మాలలో పైన పుష్పముంది. తర్వాత జంట పూస(మేరు) ఉంటుంది. స్త్రీ - పురుషులిరువురు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రంగా ఉండేవారు కదా. మీరు స్వర్గవాసులని పిలువబడేవారు. ఈ ఆత్మయే పునర్జన్మలు తసుకుంటూ - తీసుకుంటూ ఇప్పుడు పతితమైపోయింది. మళ్లీ ఇప్పుడు పావనమై పావన ప్రపంచములోకి వెళ్తుంది. ప్రపంచ చరిత్ర - భూగోళము పునారావృతమౌతుంది కదా. వికారీ రాజులు, నిర్వికారులైన రాజులకు మందిరాలు మొదలైనవి నిర్మించి వారిని పూజిస్తారు. పూజ్యులుగా ఉన్నవారే మళ్లీ పూజారులుగా అవుతారు. వికారులుగా అయినందున ఆ ప్రకాశ కిరీటము కూడా ఉండదు. ఇది తయారు చేయబడిన ఆట. ఇది బేహద్ అద్భుతమైన డ్రామా. మొదట ఒకే ధర్మముంటుంది. దీనిని రామరాజ్యమని అంటారు. తర్వాత వేరు వేరు ధర్మాలవారు వస్తారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు. భగవంతుడు ఒక్కరే. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయం భగవంతుడే టీచరుగా అయ్యి చదివిస్తున్నారు. కావున చాలా బాగా చదువుకోవాలి. స్కాలర్‌షిప్‌్ తీసుకునేందుకు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయు సేవ చేయాలి.
2. ఆంతరికములో ప్రవేశించిన కామ, క్రోధాలనే భూతాలన్నిటినీ తొలగించాలి. లక్ష ్యము ఎదురుగా ఉంచుకొని పురుషార్థము చేయాలి.
వరదానము :- '' అనుభూతి శక్తి ద్వారా పాత స్వభావ - సంస్కారాల నుండి అతీతంగా అయ్యే మాయాజీత్ భవ ''
ఈ పాత దేహము యొక్క స్వభావ-సంస్కారాలు చాలా కఠినమైనవి. అవి మాయాజీతులుగా అవ్వడంలో పెద్ద విఘ్న రూపాలుగా అవుతాయి. స్వభావ-సంస్కారాలనే పాము సమాప్తం కూడా అవుతుంది, కానీ దాని రేఖ మిగిలిపోతుంది. అది సమయం వచ్చినప్పుడు పదే పదే మోసం చేసేస్తుంది. చాలాసార్లు మాయకు ఎంతగా వశమైపోతారంటే తప్పును తప్పుగా కూడా భావించరు, పరవశమైపోతారు. అందువలన చెక్ చేసుకొని అనుభూతి శక్తి ద్వారా పాత, దాగి ఉన్న స్వభావ-సంస్కారాల నుండి అతీతంగా అవ్వండి. అప్పుడు మాయాజీతులుగా అవుతారు.
స్లోగన్ :- '' విదేహి స్థితిని అభ్యాసము చేయండి, అచానక్ (అకస్మాత్తుగా వచ్చే) పరీక్షలో పాస్ అవ్వండి ''
No comments:
Post a Comment