23-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - జ్ఞాన మూడవ నేత్రము సదా తెరవబడి ఉన్నట్లయితే సంతోషంలో తన్మయులైపోతారు (సంతోషముతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి), ఖుషీ పాదరస మట్టము సదా పెరిగే ఉంటుంది''
ప్రశ్న :- ఈ సమయములో మానవుల దృష్టి చాలా బలహీనంగా ఉంది, అందువలన వారికి అర్థం చేయించే యుక్తి ఏది ?
జవాబు :- బాబా చెప్తున్నారు - మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలంటే మనుష్యులు దూరము నుండి చూసినా వెంటనే అర్థము చేసుకోగలగాలి. ఈ సృష్టి చక్ర చిత్రము చాలా పెద్దదిగా ఉండాలి. ఇది(సృష్టి చక్రము) అంధుల ఎదుట దర్పణము.
ప్రశ్న :- పూర్తి ప్రపంచాన్ని స్వచ్ఛంగా చేసేందుకు మీకు ఎవరు సహయోగులుగా అవుతారు ?
జవాబు :- ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహయోగులుగా అవుతాయి. ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రపరచేందుకు ఎవరిదైనా సహయోగము తప్పకుండా కావాలి.
ఓంశాంతి. తండ్రి ద్వారా ఒక్క క్షణములో వారసత్వము అనగా జీవన్ముక్తి లభిస్తుందని గాయనము కూడా ఉంది. మిగిలిన వారందరూ జీవన బంధనములో ఉన్నారు. ఈ త్రిమూర్తి చిత్రము, సృష్టిచక్ర చిత్రాలు చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా పెద్ద పెద్దవిగా ఉండాలి. అంధులకైతే పెద్ద దర్పణము కావాలి, అది బాగా కనిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది, బుద్ధి తక్కువగా ఉంది. బుద్ధి అని మూడవ నేత్రమును అంటారు. మీ బుద్ధిలో ఇప్పుడు సంతోషముంది. సంతోషంతో పులకించకపోతే శివబాబాను స్మృతి చేయనట్లే. అనగా వారి జ్ఞాన మూడవ నేత్రము కొద్దిగానే తెరుచుకుంది, మసకగా ఉంది. ఎవరికైనా సంక్షిప్తంగా అర్థం చేయించాలి. తండ్రి చెప్తున్నారు - పెద్ద పెద్ద మేళాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి సర్వీసు చేసేందుకు ఒక్క చిత్రము సరిపోతుందని పిల్లలకు తెలుసు. భలే సృష్టి చక్ర చిత్రము ఒక్కటే ఉన్నా పర్వాలేదు. తండ్రి, డ్రామా, కల్ప వృక్షము, 84 జన్మల చక్ర రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వము లభిస్తుంది. ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ చిత్రములోనే అన్నీ వచ్చేస్తాయి, ఇన్ని చిత్రముల అవసరమే లేదు, ఈ రెండు చిత్రాలే చాలా పెద్ద పెద్ద అక్షరాలు కలిగి ఉండాలి. వ్రాత కూడా ఉండాలి. జీవన్ముక్తి, వినాశనానికి ముందే గాడ్ ఫాదర్ నుండి లభించే జన్మ సిద్ధ అధికారము. వినాశనము కూడా తప్పకుండా జరగాల్సిందే. డ్రామా ప్లాను అనుసారము వారంతట వారే అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయించే అవసరము కూడా ఉండదు. అనంతమైన తండ్రి ద్వారా ఈ అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇది బాగా పక్కాగా గుర్తుండాలి. కానీ మాయ మీరు మర్చిపోయేలా చేస్తుంది. సమయము గడిచిపోతూ ఉంటుంది. చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది,.............(బహుత్ గయీ థోడీ రహీ,..........) అని గాయనము కూడా ఉంది కదా! దీని అర్థం ఈ సమయానికి చెందినదే. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. స్థాపన జరుగుతూనే ఉంది. వినాశనానికి కొద్ది సమయము మాత్రమే ఉంది. కొద్దిలో కూడా కొద్దిగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? అని ఆలోచిస్తారు. ఇప్పుడైతే మేలుకోరు, తర్వాత మేలుకుంటూ ఉంటారు, కళ్లు పెద్దవిగా అవుతూ ఉంటాయి. ఈ స్థూలమైన కళ్లు కాదు, బుద్ధి రూపీ కళ్లు. చిన్న-చిన్న చిత్రాలతో అంత మజా కలగదు, పెద్ద పెద్దవి తయారవుతూ ఉంటాయి. విజ్ఞానము కూడా చాలా సహయోగము చేస్తుంది. వినాశనంలో తత్వాలు కూడా చాలా సహాయము చేస్తాయి. ఏ ఖర్చు లేకుండా మీకు అవి ఎంత సహాయము చేస్తాయి! మీ కొరకు పూర్తిగా శుభ్రము చేస్తాయి. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. అజ్మీర్‌లో స్వర్గపు స్మారకముంది, ఇక్కడ దిల్‌వాడా మందిరములో స్థాపన స్మృతిచిహ్నముంది. కానీ కొంచెము కూడా అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు తెలివిగలవారిగా అయ్యారు. భలే మనుష్యులు వినాశనము ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు, అర్థం కావడం లేదని అంటూ ఉంటారు. పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అని చెప్పినా వారు నమ్మలేదు, ఒక రోజు పులి వచ్చి అన్ని ఆవులను తినిపోయిందని ఒక కథ(నాన్న - పులి కథ) ఉంది కదా! మీరు కూడా ఈ పాత ప్రపంచము వినాశనము అవ్వనే అవుతుంది, సమయం చాలా అయిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని చెప్తూ ఉంటారు.
ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మలో తండ్రి జ్ఞానం కూడా ఉంది. ఎప్పుడైతే వారు శరీరాన్ని ధరిస్తారో, అప్పుడు జ్ఞానమునిస్తారు. వారిలో జ్ఞానముంది అందుకే నాలెడ్జ్‌ఫుల్ గాఢ్‌ఫాదర్ అని అంటారు. వారికి మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. స్వయం గురించి అయితే తెలుసు కదా, అంతేకాక సృష్టి చక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానము కూడా ఉంది. అందువలన ఆంగ్లములోని నాలెడ్జ్‌ఫుల్ అను పదము చాలా బాగుంది. వారు మానవ సృష్టి రూపి వృక్షానికి బీజ రూపము కనుక వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. నంబరువారు పురుషార్థానుసారముగా మీకు తెలుసు. శివబాబా నాలెడ్జ్‌ఫుల్, ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి. అలాగని అందరి బుద్ధిలో ఒకే విధంగా ధారణ అవుతుందని కాదు. భలే వ్రాసుకుంటారు కానీ ధారణ కొద్దిగా కూడా లేదు. నామమాత్రంగా వ్రాస్తారు కానీ ఎవ్వరికీ తెలుపలేరు. కేవలం కాగితానికి చెప్తారు. కాగితము ఏం చేస్తుంది? కాగితము ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా గొప్ప జ్ఞానము. కావున అక్షరాలు కూడా పెద్ద పెద్దవిగా ఉండాలి. పెద్ద పెద్ద చిత్రాలను చూచి మనుష్యులు ఇందులో తప్పకుండా సారముందని భావిస్తారు. స్థాపన, వినాశనము కూడా వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు రాజధాని స్థాపన తండ్రి ఇచ్చే జన్మ సిద్ధ అధికారము. అందరూ జీవన బంధనములో ఉన్నారు, వీరిని జీవన బంధనము నుండి జీవన్ముక్తిలోకి ఎలా తీసుకెళ్లాలి? అని పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి. మొదట శాంతిధామానికి తర్వాత సుఖధామానికి వెళ్తారు. సుఖధామాన్ని జీవన్ముక్తిధామము అని అంటారు. ఈ చిత్రాలను ప్రత్యేకించి పెద్దవిగా చేయించాలి. ముఖ్యమైన చిత్రాలు కదా. చాలా పెద్ద పెద్ద అక్షరాలుంటే బ్రహ్మకుమారీలు ఇంత పెద్ద చిత్రాలను తయారుచేశారు కావున తప్పకుండా ఇందులో కొంత జ్ఞానముందని మానవులు అంటారు. అందువలన అచ్చటచ్చటా మీ పెద్ద పెద్ద చిత్రాలుంటే ఇవి ఏమిటి? అని అడుగుతారు. మీరు అర్థం చేసుకునేందుకే తయారు చేయించామని చెప్పండి. ఇందులో స్పష్టంగా, వీరికి బేహద్ వారసత్వము ఉండేదని వ్రాయబడి ఉంది. ఇది నిన్నటి విషయమే, ఈ రోజు వారు లేరు. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చేశారు. సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అయ్యే తీరాలి. జ్ఞానము మరియు భక్తి, పూజ్యులు మరియు పూజారుల ఆట కదా. అది సగము - ఇది సగముగా పూర్తి ఆట తయారు చేయబడింది. కావున ఇలాంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయించేదుకు ధైర్యముండాలి. సర్వీసు చేసే ఆసక్తి కూడా ఉండాలి. ఢిల్లీలో అయితే మూల మూలలా సర్వీసు చేయాలి. ఉత్సవాలకు, తిరునాళ్లకు చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ఈ చిత్రాలే పనికి వస్తాయి. త్రిమూర్తి, సృష్టి చక్ర చిత్రాలు ముఖ్యమైనవి. ఇవి చాలా బాగున్నాయి, గ్రుడ్డివారి ఎదుట దర్పణము వలె ఉన్నాయి. అంధులను చదివిస్తారు. చదివేది ఆత్మనే కదా. కానీ ఆత్మ అవయవాలు చిన్నవి, కావున వారిని చదివించేందుకు చిత్రాలు మొదలైన వాటిని చూపిస్తారు. కొద్దిగా పెరిగిన తర్వాత ప్రపంచ పటమును చూపిస్తారు. అప్పుడు పటమంతా బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు డ్రామా చక్రము, ఇన్ని ధర్మాలున్నాయి. నంబరువారుగా ఎలా వస్తారు, మళ్లీ ఎలా వెళ్లిపోతారు - ఇదంతా మీ బుద్ధిలో ఉంది. అక్కడైతే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమొక్కటే ఉంటుంది. దానిని స్వర్గము, హెవన్ అని అంటారు. తండ్రితో యోగము చేయడం వలన పతితంగా ఉన్న ఆత్మ పావనంగా అవుతుంది. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. యోగము అనగా స్మృతి, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. నన్ను స్మృతి చేయమని లౌకిక తండ్రి చెప్పనవసరము లేదు. పిల్లలు స్వతహాగా తల్లి-తండ్రి అని అంటూ ఉంటారు. వారు లౌకిక తల్లి-తండ్రి, వీరు పారలౌకి తల్లిదండ్రులు. మీ కృప ద్వారా అపారమైన సుఖము ప్రాప్తిస్తుందని గాయనముంది. దు:ఖమున్నవారే పాడ్తారు. సుఖమున్నప్పుడు ఇలా అనే అవసరమే లేదు. దు:ఖము కలిగినప్పుడే అందరూ పిలుస్తారు. వీరే తల్లి - తండ్రి అని మీరిప్పుడు తెలుసుకున్నారు. తండ్రి అంటారు కదా - రోజురోజుకు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. తల్లి-తండ్రి అని ఎవరిని అంటారో ఇంతకుముందు తెలుసా? తండ్రి అని వారినే అంటారని మీకిప్పుడు తెలుసు. బ్రహ్మ ద్వారా తండ్రి వారసత్వము లభిస్తుంది. తల్లి కూడా కావాలి కదా. ఎందుకంటే పిల్లలను దత్తు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించరు. కావున బాబా క్షణ-క్షణము చెప్తారు - ''మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి.'' లక్ష్యము లభించింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లండి. విదేశాలకు వెళ్లండి, 7 రోజుల కోర్సును చాలామంది తీసుకున్నారు. తండ్రి ద్వారా వారసత్వమును తీసుకోవలసిందే. స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పావనమవుతుంది. స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్యమును బుద్ధిలో ఉంచుకొని ఎక్కడికైనా వెళ్లండి. గీతా జ్ఞానమంతా ఈ బ్యాడ్జిలో ఉంది. ఏమి చేయాలని ఎవ్వరినీ అడిగే అవసరము కూడా లేదు. తండ్రి ద్వారా వారసత్వము తీసుకోవాలనుకుంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఈ వారసత్వమును తండ్రి ద్వారా అనేకసార్లు తీసుకున్నారు. డ్రామా చక్రము పునరావృతమవుతూ ఉంటుంది కదా. అనేకసార్లు మీరు టీచరు ద్వారా చదువుకొని ఏదో ఒక పదవిని పొందుతారు. చదువుకొను సమయములో బుద్ధియోగము టీచరుతో ఉంటుంది కదా. పరీక్ష చిన్నదైనా, పెద్దదైనా చదివేది ఆత్మయే కదా, వీరి ఆత్మ కూడా చదువుకుంటుంది. టీచరును, లక్ష్యమును స్మృతి చేయాలి. సృష్టి చక్రమును కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రిని, వారసత్వమును స్మృతి చేయాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎంత ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబాను బాగా స్మృతి చేస్తూ ఉంటే మళ్లీ ఇక్కడికి వచ్చే అవసరమేముంది. అయినా ఇక్కడకు వస్తారు. ఇటువంటి ఉన్నతమైన తండ్రి, వీరి ద్వారా ఇంతటి అనంతమైన ఆస్తి లభిస్తుంది, వారితో కలుసుకునేందుకు రావాలి. మంత్రము తీసుకొని అందరూ వస్తారు. మీకైతే చాలా గొప్ప మంత్రము లభిస్తుంది. మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో మంచిరీతిగా ఉంది.
వినాశనమయ్యే సంపాదన కొరకు సమయాన్ని ఎక్కువగా వృథా చేయరాదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. అది అంతా మట్టిలో కలిసిపోతుంది. తండ్రికి ఏమైనా కావాలా? ఏమీ అవసరము లేదు. ఖర్చు మొదలైనవి ఏం చేసినా మీ కొరకే చేస్తారు. ఇందులో పైసా కూడా ఖర్చు కాదు. యుద్ధము కొరకు ఫిరంగి గుండు లేక ట్యాంకులు ఏవీ కొనరు. మీరు యుద్ధము చేస్తున్నా ప్రపంచములో గుప్తంగా ఉన్నారు. మీ యుద్ధము ఎలా ఉందో చూడండి. దీనిని యోగబలము అని అంటారు, అంతా గుప్తంగా ఉంది. ఇందులో ఎవ్వరినీ చంపే అవసరము లేదు. మీరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. వీరందరి మృత్యువు డ్రామాలో నిర్ణయించబడి ఉంది. 5 వేల సంవత్సరాల తర్వాత మీరు యోగబలమును జమ చేసుకునేందుకు చదువుకుంటున్నారు. చదువు పూర్తైన తర్వాత క్రొత్త ప్రపంచములో ప్రాలబ్ధము లభించాలి. పాత ప్రపంచ వినాశనము కొరకు ఈ ప్రకృతి ప్రకోపాలు ఉపయోగపడ్తాయి. తమ కులమును ఎలా వినాశనము చేసుకుంటారో గాయనము కూడా ఉంది కదా. ఎంత పెద్ద కులము! అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేస్తుంది. ఈ భారతదేశమైతే ఒక మూలలో ఉంది. మిగిలినదంతా సమాప్తమవ్వనున్నది. యోగబలము ద్వారా మీరు మొత్తం విశ్వమంతటి పై విజయము పొందుతారు, ఈ లక్ష్మీనారాయణుల వలె పవిత్రంగా కూడా అవ్వాలి. అక్కడ చెడు దృష్టే ఉండదు. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలవుతాయి, తమ దేశానికి సమీపంగా వస్తున్నందు వలన మళ్లీ వృక్షము కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఇంటికి సమీపంగా చేరుకున్నామని సంతోషం కలుగుతుంది. మీరు కూడా ఇంటికి వెళ్లి మళ్లీ తమ సుఖధామానికి వస్తారు. ఇక కొద్ది సమయముంది, స్వర్గము నుండి వీడ్కోలు తీసుకొని ఎంత సమయమైపోయింది! మళ్లీ ఇప్పుడు స్వర్గము సమీపంగా వస్తోంది. మీ బుద్ధి పైకి వెళ్తుంది. అది నిరాకార ప్రపంచము, దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మనము అక్కడ ఉండేవారము, ఇక్కడ 84 జన్మల పాత్ర చేశాము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. పిల్లలైన మీరు ఆల్‌రౌండర్లు. మీరు ప్రారంభము నుండి వచ్చి 84 జన్మలు తీసుకుంటారు. ఆలస్యంగా వచ్చేవారిని ఆల్‌రౌండర్ అని అనరు. ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ ఎన్ని జన్మలు తీసుకుంటారో తండ్రి అర్థం చేయించారు. ఒక్క జన్మ కూడా తీసుకోవచ్చు. చివర్లో అందరూ వాపస్ వెళ్లిపోతారు. నాటము పూర్తి అయ్యింది, ఆట సమాప్తమయ్యింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, అంతమతి సో గతిగా అవుతుంది. తండ్రి వద్దకు పరంధామానికి వెళ్లిపోతారు. దానిని ముక్తిధామము, శాంతిధామము అని అంటారు తర్వాత సుఖధామములోకి వెళ్తారు. ఇది దు:ఖధామము, పై నుండి ప్రతి ఒక్కరు సతోప్రధానంగా వస్తారు, తర్వాత సతో, రజో, తమోగుణాలలోకి వస్తారు. ఒక్క జన్మ తీసుకున్నవారు కూడా ఈ 4 స్థితులను పొందుతారు. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించినా స్మృతి చెయ్యరు. తండ్రిని మర్చిపోతారు, నంబరువారుగా ఉన్నారు కదా. నంబరువారు పురుషార్థానుసారము రుద్ర మాల తయారవుతుందని పిల్లలకు తెలుసు. ఈ రుద్ర మాల కోట్లమందిది. ఇది బేహద్ విశ్వమంతటి మాల. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. ఇద్దరి ఇంటి పేరును చూడండి, ప్రజాపిత బ్రహ్మ అన్నది బ్రహ్మ పేరు. అర్ధకల్పము తర్వాత రావణుడు వస్తాడు. దైవీ మతము తర్వాత ఇస్లామ్ ధర్మము,............... ఆదమ్- బీబీని కూడా స్మృతి చేస్తారు, స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు. భారతదేశము స్వర్గంగా ఉండేది, పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు, ఉన్నతాతి ఉన్నతమైన చదువును చదివిస్తాడు. తద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవి లభిస్తుంది. అందరికంటే ఉన్నతమైన టీచరు, తండ్రియే. వారు టీచరుగానూ ఉన్నారు, తమతో పాటు తీసుకెళ్లే సద్గురువుగా కూడా ఉన్నారు. ఇలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు. ఖుషీ పాదరస మట్టము పైకెక్కి ఉండాలి. కానీ యుద్ధ మైదానములో ఉన్నారు, మాయ నిలువనివ్వదు. క్షణ-క్షణము పడిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు స్మృతి చేయడం వలన మాయాజీతులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని అమలు చేయాలి, కేవలం కాగితము పై వ్రాసుకోరాదు. వినాశనానికి ముందే జీవన బంధనము నుండి జీవన్ముక్తి పదవిని ప్రాప్తి చేసుకోవాలి.
2. తమ సమయాన్ని వినాశి సంపాదన కొరకు ఎక్కువగా వృథా చేసుకోరాదు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలసిపోతుంది. అందువలన అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము తీసుకోవాలి, దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.
వరదానము :- '' అథారిటీగా అయ్యి సమయానికి సర్వ శక్తులను కార్యములో ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ ''
సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తించాయో వాటిని పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి ఏ విధంగా మీరు కార్యములో ఉపయోగించాలనుకుంటారో అలా (అదే రూపంలో) ఈ శక్తులు మీ సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులను లేక ప్రభువు వరదానాలను ఏ రూపంలో కావాలంటే ఆ రూపములో ధారణ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే శీతలత రూపంలో, ఇప్పుడిప్పుడే కాల్చే (వికారాలను) రూపంలో ఉపయోగించవచ్చు, కేవలం సమయానికి కార్యములో ఉపయోగించే అథారిటీగా అవ్వండి. ఈ సర్వ శక్తులు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ సేవాధారులు.
స్లోగన్ :- '' స్వ పురుషార్థము లేక విశ్వ కళ్యాణ కార్యములో ధైర్యమున్న చోట సఫలత ఉండనే ఉంటుంది.''
No comments:
Post a Comment