Friday, September 27, 2019

Telugu Murli 28/09/2019

28-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ స్వయాన్ని అలంకరించుకోండి. పరచింతన చేస్తూ మీ అలంకారాన్ని పాడు చేసుకోకండి, సమయాన్ని వృథా చేయకండి. ''

ప్రశ్న :- పిల్లలైన మీరు తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులు - ఎలా ?
జవాబు :- ఇక్కడ మీరు కూర్చుంటూ కూర్చుంటూనే లక్ష్మినారాయణుల వలె అలంకరించుకుంటున్నారు. ఇక్కడ కూర్చునే తమను తాము పరివర్తన చేసుకుంటున్నారు. ఇది కూడా ఇంద్రజాలమే. కేవలం తండ్రిని స్మృతి చేయడం వలన మీ శృంగారము జరిగిపోతుంది. కాళ్లు, చేతులు కదిలించే పని కూడా లేదు. కేవలం ఆలోచన చేసే విషయము. యోగము ద్వారా మీరు శుభ్రంగా, స్వచ్ఛంగా, శోభాయమానంగా అవుతారు. మీ ఆత్మ మరియు శరీరము రెండూ కంచనంగా(బంగారముగా) అవుతాయి. ఇది కూడా అద్భుతమే కదా.

ఓంశాంతి. ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చుని తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులైన తన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చుని ఉన్నా ఎలాంటి కదలికా లేదు. తండ్రి లేక ప్రియుడు తన ప్రేయసులకు యుక్తి తెలుపుతున్నారు. ప్రియుడు చెప్తున్నారు - ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? స్వయాన్ని మీరు ఈ లక్ష్మినారాయణుల వలె అలంకరించుకుంటున్నారు. మిమ్ములను చూసి అలా ఎవరైనా భావిస్తారా? మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరికైనా అర్థమవుతుందా? మీరిక్కడ నంబరువారు పురుషార్థానుసారముగానే ఉన్నారు కదా. ఈ విధంగా అలంకారమూర్తులుగా అవ్వాలని తండ్రి చెప్తారు. భవిష్య అమరపురికి వెళ్లడమే మీ లక్ష్యము. మీరిక్కడ ఏం చేస్తున్నారు? స్వర్గ శృంగారము కొరకు పురుషార్థము చేస్తున్నారు. దీనిని ఏమంటారు? ఇక్కడ కూర్చుని స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్మృతి చేసేందుకు 'మన్మనాభవ' అనే తాళంచెవిని తండ్రి ఇచ్చేశారు. ఇది తప్ప వ్యర్థ విషయాలను వింటూ, వినిపిస్తూ సమయాన్ని వృథా చేయకండి. మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే లగ్నమై ఉండండి. ఇతరులు చేస్తున్నారా లేదా? అని చూడకండి. అందులో మీకేం వస్తుంది? మీరు మీ పురుషార్థంలో ఉండండి. ఇవన్నీ ఎంతగా అర్థము చేసుకునే విషయాలు! ఎవరైనా కొత్తవారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కూడా కొందరైతే అలంకరించుకుంటున్నారు, కొందరైతే ఇంకా పాడు చేసుకుంటున్నారు. పరచింతన మొదలైన వాటిలో సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. మీరు కేవలం ''నేను ఏమి చేస్తున్నానని స్వయాన్ని పరిశీలించుకోండి'' అని తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు. చాలా చిన్న ఉపాయము తెలిపించారు, ''మన్మనాభవ'' అనే పదమొక్కటే చాలు. మీరిక్కడ కూర్చున్నా మీ బుద్ధికి సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో తెలుసు. మనమిప్పుడు మళ్లీ విశ్వమంతటినీ అలంకరిస్తున్నాము. మీరు ఎంతో పదమాపదమ్‌ భాగ్యశాలురు. మీరిక్కడ కూర్చుని ఉండే ఎంత గొప్ప కార్యము చేస్తున్నారు. కాళ్లు, చేతులు కదిలించే పని కూడా లేదు. కేవలం ఆలోచించవలసిన విషయము. మేము ఇక్కడ కూర్చుని విశ్వాన్ని అత్యుత్తమంగా అలంకరిస్తున్నామని అంటారు. 'మన్మనాభవ' మంత్రము ఎంత గొప్పది! ఈ యోగము ద్వారానే మీరు చేసిన పాపాలు భస్మమౌతూపోతాయి. మీరు స్వచ్ఛంగా అవుతూ అవుతూ మళ్లీ ఎంతో శోభాయమానమవుతారు. ఇప్పుడు ఆత్మ పతితమైనందున శారీరిక స్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి, ఇప్పుడు మీ ఆత్మ, శరీరము కంచనంగా అవుతాయి. ఇది అద్భుతం కదా. కావున స్వయాన్ని ఇలా అలంకరించుకోవాలి. దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి అందరికి ఒకే మార్గమును తెలుపుతారు - తండ్రి మరియు ఆస్తి(అల్ఫ్‌, బే). కేవలం తండ్రిని స్మృతి చేసే విషయము ఒక్కటే. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అలంకారము పూర్తిగా మారిపోతుంది.
తండ్రి కంటే మీరు గొప్ప ఇంద్రజాలికులు. మీరు అలంకారమూర్తులుగా అయ్యేందుకు తండ్రి యుక్తులు తెలుపుతారు. ఇలా ఇలా చేయడం వలన అలంకారం జరుగుతుంది. స్వయాన్ని అలంకరించుకోకుంటే మిమ్ములను మీరు అనవసరంగా నష్టపరచుకుంటారు. భక్తిమార్గములో మనము ఏమేం చేసేవారమో మీరు అర్థం చేసుకున్నారు. అలంకారమునంతా పాడు చేసుకొని ఎలా అయిపోయారు! ఇప్పుడు ఒకే పదముతో తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ అలంకారము జరుగుతుంది. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించి తాజాగా చేస్తారు. ఇక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారు? స్మృతియాత్రలో కూర్చుని ఉన్నారు. ఒకవేళ ఎవరి ఆలోచనలైనా మరెటు వైపైనా ఉంటే సింగారము జరగదు. మీరు అలంకరింపబడి ఉంటే ఇతరులకు కూడా మార్గమును తెలపాలి. ఇలా అలంకరించేందుకే తండ్రి వస్తారు. శివబాబా, మీరు ఎంత అద్భుతం చేస్తారు, మీరు మమ్ములను ఎంత బాగా అలంకరిస్తారు! లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్వయాన్ని అలంకరించుకోవాలి. కొందరైతే స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరిస్తారు. కొందరైతే స్వయాన్ని అలంకరించుకోరు, ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాటలు వినిపించి వారి స్థితిని కూడా క్రిందికి తెస్తారు. స్వయం అలంకారము నుండి దూరమౌతారు, ఇతరుల అలంకారమును కూడా నిలిపేస్త్తారు. తండ్రి ఎటువంటి యుక్తులను తెలుపుతారో బాగా ఆలోచించండి. భక్తిమార్గములోని శాస్త్రాలను చదవడం వలన ఈ ఉపాయాలు రావు. శాస్త్రాలైతే భక్తిమార్గములోనివి. శాస్త్రాలను మీరెందుకు నమ్మరని మిమ్ములను అడుగుతారు. మేము అన్నీ ఒప్పుకుంటామని అర్ధకల్పము భక్తి చేశామని చెప్పండి. శాస్త్రాలను చదివాము, ఎందుకు నమ్మము? రాత్రి పగలు ఉన్నప్పుడు తప్పకుండా రెండిటినీ ఒప్పుకుంటారు కదా. ఇది బేహద్‌ పగలు మరియు రాత్రి.
తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా, మీరు స్వయాన్ని అలంకరించుకోండి, సమయాన్ని వృథా చేయకండి. సమయము చాలా తక్కువగా ఉంది. మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. పరస్పరము చాలా ప్రేమతో ఉండాలి. సమయాన్ని వృథా చేయరాదు. ఎందుకంటే మీ సమయము చాలా విలువైనది. మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతారు. ఊరకే ఇదంతా వినడం లేదు. ఇదేమైనా కథనా! తండ్రి ఒక్క పదమునే వినిపిస్తారు. గ్పొప-గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు. తండ్రి అయితే ఒక్క క్షణములో జీవన్ముక్తికి వెళ్లే మార్గమును తెలుపుతారు. వీరు(లక్ష్మినారాయణులు) ఉన్నతమైన సింగారము గలవారు. కనుక వారి చిత్రాలే ఉన్నాయి. వారిని చాలా పూజిస్తారు. ఎంత గొప్ప వ్యక్తులుగా ఉంటారో అంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు. చాలా బాగా అలంకరిస్తారు. ఇంతకుముందు దేవతల చిత్రాలకు వజ్రాల హారాలను ధరింపజేసేవారు. బాబాకైతే అనుభవముంది కదా. బాబాయే స్వయంగా వజ్రాల హారము లక్ష్మినారాయణుల కొరకు తయారు చేయించారు. వాస్తవానికి అక్కడ వారు ధరించే హారాలను ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. మీరిప్పుడు నంబరువారు పురుషార్థానుసారంగా తయారు చేస్తున్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, మీరు మీ సమయాన్ని వృథా చేయకండి. ఇతరుల సమయాన్ని కూడా వృథా చేయకండి. తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. స్మృతి చేయకుండా ఇంత బాగా అలంకరించుకోలేరు. మీరు ఇలా అయ్యేవారు కదా. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఇందులో చెప్పే అవసరము కూడా లేదు. కాని రాతిబుద్ధిగా ఉన్నందువలన అన్ని విషయాలు అర్థం చేయించవలసి ఉంటుంది. ఒక్క క్షణములో అర్థము చేసుకునే విషయము. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! మీరు మీ తండ్రిని మర్చిపోయినందున మీ అలంకారాన్ని పాడు చేసుకున్నారు. నడుస్తూ, తిరుగుతూ అలంకరించుకుంటూ ఉండమని తండ్రి చెప్తారు. కాని మాయ కూడా తక్కువైనది కాదు. బాబా, మీ మాయ చాలా విసిగిస్తోందని కొందరు వ్రాస్తారు. అరే! నా మాయ ఎక్కడుంది, ఇది ఆట కదా. నేను మిమ్ములను మాయ నుండి విడిపించేందుకు వచ్చాను. నా మాయ ఎక్కడుంది? ఇప్పుడు పూర్తిగా దీని రాజ్యముగానే ఉంది. ఎలాగైతే ఈ రాత్రికి, పగలుకు కొద్ది సమయము కూడా తేడా రాజాలదో, అలా ఇది బేహద్‌ రాత్రి-పగలు. ఇందులో కూడా ఒక్క సెకండు కూడా మార్పు రాజాలదు. పిల్లలైన మీరిప్పుడు నంబరువారు పురుషార్థానుసారంగా ఇలా అలంకరించుకుంటున్నారు. చక్రవర్తి రాజులుగా అవ్వాలంటే చక్రమును తిప్పుతూ ఉండండి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. మీకిక్కడ బయటి చిక్కులు, వ్యాపారాదులు ఏవీ లేవు. స్వయాన్ని అలంకరించుకునేందుకు, తాజాగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వస్తారు. తండ్ర్రి అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఇక్కడ తండ్రి ఎదురుగా కూర్చుని కొత్త కొత్త పాయింట్లు వినేందుకు తండ్రి వద్దకు వస్తారు. మళ్లీ ఇంటికి వెళ్తే విన్నవన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. ఇక్కడి నుండి బయటకు వెళ్లగానే జోలె కత్తెరించబడ్తుంది. అంటే విన్నవన్నీ బుద్ధి నుండి ఖాళీ అయిపోతాయి. విన్న దానిని గురించి మనన చింతన చెయ్యరు. ఇక్కడ మీ కొరకు ఏకాంత స్థానాలు చాలా ఉన్నాయి. బయట అయితే నల్లులు తిరుగుతూ ఉంటాయి. ఒకరిని ఒకరు చంపుకుంటూ, రక్తము పీల్చి తాగుతూ ఉంటారు.
కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ ఈ సమయము చాలా విలువైనది, దీనిని వృథా చేయకండి. స్వయాన్ని అలంకరించుకునేందుకు చాలా యుక్తులు లభించాయి. నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. మీకు విశ్వచక్రవర్తి పదవినిచ్చేందుకు వచ్చాను. కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. సమయాన్ని వృథా చేయకండి. పని పాటలు చేస్తున్నా తండ్ర్రిని స్మృతి చేస్తూ ఉండండి. పరమపిత పరమాత్ముడైన ఒక్క ప్రియునికి ఇంతమంది ఆత్మలు ప్రేయసులుగా ఉన్నారు. దైహిక కథలు మొదలైనవైతే మీరు చాలా వింటూ వచ్చారు. అవన్నీ మర్చిపోండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మేము మీ వారిగానే ఉంటామని భక్తిమార్గములో నన్ను స్మృతి చేశారు, ప్రతిజ్ఞ కూడా చేశారు. అనేకమంది ప్రేయసులకు ప్రియుడు ఒక్కరే. భక్తిమార్గములో బ్రహ్మలో లీనమైపోతామని చెప్తారు. ఇవన్నీ వ్యర్థ మాటలు. ఒక్క మనిషి కూడా మోక్షమును పొందలేరు. ఇది అనాది డ్రామా. ఎంతోమంది పాత్రధారులున్నారు. ఇందులో ఏ మాత్రము తేడా ఏర్పడజాలదు. కేవలం ఒక్క అల్ఫ్‌ను (తండ్రిని) స్మృతి చేస్తే మీకు అలంకారము జరుగుతుందని తండ్రి చెప్తారు. మీరిప్పుడు ఈ విధంగా (లక్ష్మినారాయణులుగా) అవుతున్నారు. అనేకసార్లు మనము ఈ విధంగా అలంకరించుకున్నామని మీకు స్మృతిలోకి వస్తుంది. బాబా కల్ప-కల్పము మీరు వస్తారు, మేము మీరు చెప్పిందే వింటాము. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు! బాబా ఎంతో మంచి యుక్తిని తెలిపించారు. ఇలాంటి తండ్రికి బలిహారి అవుతాను. ప్రేయసీ ప్రియులు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. వీరు ఆత్మలందరికీ ఒకే ప్రియుడు. దైహిక విషయమేదీ లేదు. కానీ మీకు సంగమ యుగములోనే తండ్రి ద్వారా ఈ యుక్తి లభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా తినండి, తాగండి, తిరగండి, ఉద్యోగము చెయ్యండి, స్వయాన్ని అలంకరించుకుంటూ ఉండండి. ఆత్మలందరూ ఒకే ప్రియునికి ప్రేయసులు. వారినే స్మృతి చేస్తూ ఉంటే చాలు. మేము 24 గంటలు స్మృతి చేస్తూ ఉంటామని కొందరు పిల్లలంటారు. కాని సదా ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఎక్కువలో ఎక్కువ రెండు-రెండున్నర గంటల వరకు స్మృతి చేెస్తారు. ఒకవేళ ఎక్కువ వ్రాస్తే బాబా నమ్మరు. ఇతరులకు స్మృతినిప్పించకపోతే మీరు స్మృతి చేస్తున్నారని ఎలా భావించాలి? ఇదేమైనా కష్టమైన విషయమా? ఇందులో ఏమైనా ఖర్చు ఉందా? ఏమీ లేదు. బాబాను స్మృతి చేస్తూ ఉంటే చాలు. మీ పాపాలు సమాప్తమైపోతాయి. దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. పతితులైన వారెవ్వరూ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్లలేరు. స్వయాన్ని ఆత్మ- ఆత్మ సోదరులుగా (భాయీ-భాయీగా) భావించమని పిల్లలకు తండ్రి చెప్తారు. 84 జన్మల పాత్ర ఇప్పుడు పూర్తి అవుతుంది. ఈ పాత శరీరాన్ని ఇప్పుడు వదిలి పెట్టాలి. డ్రామా ఎలా తయారయ్యిందో చూడండి. నంబరువారు పురుషార్థానుసారంగా మీకు తెలుసు. ప్రపంచములో ఎవ్వరూ ఏమీ అర్థం చేసుకోరు. మనము తండ్రి మతమును అనుసరిస్తున్నామా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. శ్రీమతానుసారము నడుచుకుంటే అలంకారము కూడా చాలా బాగుంటుంది. ఒకరికొకరు ఉల్టా విషయాలు వినిపించి లేక విని తమ అలంకారాన్ని పాడు చేసుకుంటారు, ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తారు. మనము ఇలాంటి అలంకారమూర్తులుగా ఎలా అవ్వాలనే తపన పిల్లలకు ఉండాలి. మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయి. కేవలం కడుపు కొరకు రొట్టె(భోజనం) లభిస్తే చాలు. వాస్తవానికి కడుపు ఎక్కువగా తినదు. మీరు భలే సన్యాసులే అయినా రాజయోగులు. అంత ఉన్నతమైనవారు కాదు, అంత నీచమైనవారూ కాదు. భలే తినండి కానీ అదే ఎక్కువగా అలవాటు పడరాదు. శివబాబా స్మృతి ఉందా? వారసత్వము గుర్తుందా? విశ్వరాజ్య అలంకారము గుర్తుందా? అని ఒకరికొకరు గుర్తు చేసుకోండి. ఇక్కడ కూర్చుని ఎంత సంపాదిస్తున్నారో ఆలోచించండి. ఈ సంపాదన ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది. కేవలం స్మృతియాత్రను చేయడం తప్ప మరే కష్టమూ లేదు. భక్తిమార్గములో మనుష్యులు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. ఇప్పుడు అలంకరించుకునేందుకు తండ్రి వచ్చారు. కనుక మీరు స్వయము గురించి బాగా ఆలోచించండి, మర్చిపోకండి. మాయ మరిపింపజేస్తుంది. తర్వాత ఎంతో సమయాన్ని వృథా చేస్తారు. మీ ఈ సమయము చాలా విలువైనది. కష్టపడి చదవడం వలన మనుష్యులు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు! బాబా మీకు మరే కష్టమూ ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి అని అంటారు. పుస్తకాలు మొదలైనవేవీ తీసుకునే అవసరము లేదు. బాబా ఏ పుస్తకమైనా తీసుకుంటారా? నేను వచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటానని తండ్రి చెప్తారు. ఇతను ప్రజాపిత కదా. ఇంతమంది కుఖవంశావళులు(గర్భజనిత) ప్రజలెలా అవుతారు? పిల్లలు దత్తత తీసుకోబడ్తారు. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. తండ్రి, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. కావున వారిని తల్లి, తండ్రి అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి రావడము చాలా ఖచ్ఛితంగా జరుగుతుంది. తండ్రి ఖచ్ఛితంగా సరియైన సమయంలో వస్తారు, వెళ్తారు. ప్రపంచము మార్పు అయితే జరగాల్సిందే. పిల్లలైన మీకిప్పుడు తండ్రి ఎంత తెలివినిస్తారు! తండ్రి మతమును అనుసరించాలి. విద్యార్థులు చదివిన దానినే బుద్ధిలో ఉంచుకోవాలి. మీరు కూడా ఈ సంస్కారమును తీసుకెళ్తారు. తండ్రిలో ఏ విధంగా సంస్కారముందో అలాగే ఆత్మలైన మీలో కూడా ఈ సంస్కారము నింపుకుంటారు. మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే పాత్ర పునరావృతమౌతుంది. నంబరువారు పురుషార్థానుసారము వస్తారు. అలంకరించుకునేందుకు ఎంత పురుషార్థము చేశాను, సమయాన్ని ఎక్కడా వృథా చేయలేదు కదా? అని మనసులో ప్రశ్నించుకోండి. బాబా హెచ్చరిస్తున్నారు - వ్యర్థమైన విషయాలలో ఎక్కడా సమయాన్ని వృథా చేయకండి. తండ్రి శ్రీమతమును గుర్తుంచుకోండి. మనుష్యుల మతమును అనుసరించకండి. మనము పాత ప్రపంచములో ఉన్నామని మీకు తెలియదు. మీరెలా ఉండేవారో తండ్రి తెలిపించారు. ఈ పాత ప్రపంచములో ఎంత అపారమైన దు:ఖముంది. ఈ పాత్ర కూడా డ్రామానుసారముగా లభించింది. డ్రామానుసారంగా అనేకానేక విఘ్నాలు కూడా వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! ఇది జ్ఞానము మరియు భక్తిల ఆట. అద్భుతమైన డ్రామా. ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా అవినాశిగా నిండి ఉంది. ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇతర విషయాలన్నీ వదిలి మేము లక్ష్మినారాయణుల వలె అలంకారమూర్తులుగా ఎలా అవ్వాలనే తపన(ధున్‌) ఉండాలి.
2. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - 1. శ్రీమతానుసారము నడుచుకొని మన్మనాభవ అనే తాళంచెవితో నా అలంకారాన్ని సరి చేసుకుంటున్నానా? 2. ఉల్టా విషయాలను విని, వినిపిస్తూ అలంకారము పాడు చేసుకోవడం లేదు కదా? 3. పరస్పరము ప్రేమగా ఉంటున్నామా? విలువైన మా సమయాన్ని ఎక్కడా వృథా చేసుకోవడం లేదు కదా? 4. దైవీ స్వభావాన్ని ధారణ చేశానా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి.

వరదానము :- '' స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యములో ఇష్టమైన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ ''
ప్రతి ఒక్కరు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో లగ్నమై ఉన్నారు. అందరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేసే తీరాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలున్నాయి. అంతేకాక పరివర్తన అవ్వనే అవుతుందనే నిశ్చయం కూడా ఉంది. ధైర్యమున్న చోట ఉల్లాస-ఉత్సాహాలుంటాయి. స్వ పరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యములో ఇష్టమైన సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఈ సఫలత వృత్తి, వైబ్రేషన్లు, వాణి(వాచా) ఈ మూడు శక్తిశాలిగా ఉన్నప్పుడే ప్రాప్తిస్తుంది.

స్లోగన్‌ :- '' మాటలలో స్నేహము, సంయమము ఉంటే వాచా శక్తి జమ అవుతుంది ''

No comments:

Post a Comment