27-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు సర్వాత్మలకు కర్మ బంధనముల నుండి ముక్తి కలిగించు సాల్వేషన్ ఆర్మి. మీరు కర్మ బంధనములో చిక్కుకోరాదు. ''
ప్రశ్న :- ఏ అభ్యాసము చేస్తూ ఉంటే, ఆత్మ చాలా చాలా శక్తిశాలిగా అవుతుంది ?
జవాబు :- సమయము లభించినప్పుడంతా శరీరము నుండి భిన్నంగా ఉండే అభ్యాసము చేయండి. భిన్నముగా ఉండుట వలన ఆత్మకు శక్తి వస్తుంది, అందులో బలము నిండుతుంది. మీరు అంతర్భాగములో ఉన్న సైనికులు(అండర్‌గ్రౌండ్ మిలిటరి). మీకు 'అటెన్షన్ ప్లీస్' అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి, అశరీరులుగా అవ్వండి అని అదేశము(డైరెక్షన్) లభిస్తుంది.
ఓంశాంతి. ఓంశాంతి అర్థమునైతే తండ్రి చాలా బాగా అర్థము చేయించారు. మిలిటరీవారు నిలబడినప్పుడు అటెన్షన్ అని అంటారు. అటెన్షన్ అనగా వారి దృష్టిలో మౌనంగా ఉండడం. ఇక్కడ కూడా మీకు తండ్రి అటెన్షన్ అని చెప్తారు అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. నోటితో మాట్లాడవలసి ఉంటుంది లేకపోతే వాస్తవానికి మాట్లాడటం నుండి కూడా దూరము కావాలి. అటెన్షన్, తండ్రి స్మృతిలో ఉన్నారా? తండ్రి ఆదేశము లేక శ్రీమతము లభిస్తుంది. మీరు ఆత్మనూ గుర్తించారు, తండ్రినీ గుర్తించారు కావున తండ్రిని స్మృతి చేయకుండా మీరు వికర్మాజీతులుగా లేక సతోప్రధాన పవిత్రులుగా అవ్వలేరు. ముఖ్యమైన విషయము ఇదే. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇవన్నీ ఇప్పటి విషయాలే. వీటిని వారు అక్కడకు తీసుకెళ్లారు. వారూ మిలిట్రీవారే, అలాగే మీరు కూడా మిలిట్రీ వారే. అండర్‌గ్రౌండ్ మిలిట్రీ కూడా ఉంటుంది కదా. వారు గుప్తమైపోతారు. మీరు కూడా అండర్‌గ్రౌండులో ఉన్నారు. మీరు కూడా అదృశ్యమైపోతారు అనగా తండ్రిని స్మృతి చేయడంలో లీనమైపోతారు. దీనినే అండర్‌గ్రౌండ్ అని అంటారు. మిమ్ములను ఎవ్వరూ గుర్తించలేరు ఎందుకంటే మీరు గుప్తంగా ఉన్నారు కదా. మీరు చేయు స్మృతియాత్ర గుప్తంగా ఉంది. తండ్రి చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే ఈ ధీనులకు కళ్యాణము జరుగుతుందని తండ్రికి తెలుసు. ఇప్పుడు మిమ్ములను ధీనులని, దిక్కులేని వారని అంటారు కదా. స్వర్గములో ధీనులెవ్వరూ ఉండరు. ఎవరైతే బంధనములో చిక్కుకొని ఉంటారో వారిని ధీనులని, అభాగ్యులని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు - మిమ్ములను లైట్‌హౌస్ అని కూడా అంటారు. తండ్రిని కూడా లైట్‌హౌస్ అని అంటారు. ఒక కంటిలో శాంతిధామము, మరొక కంటిలో సుఖధామము ఉంచుకోండి అని క్షణ-క్షణము తండ్రి అర్థం చేయిస్తారు. మీరు లైట్‌హౌస్ వంటి వారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీరు లైటుగా ఉండండి. అందరికీ సుఖధామము - శాంతిధామాల మార్గమును తెలుపుతూ ఉండండి. ఈ దు:ఖధామములో అందరి నావలు చిక్కుకుపోయి ఉన్నాయి. అందుకే మా నావను తీరానికి చేర్చండి అని అంటారు. హే నావికుడా! అందరి నావ చిక్కుకుపోయింది. వారిని తీరానికి ఎవరు చేరుస్తారు? వారు ముక్తినిప్పించే సైన్యము కాదు. ఊరకనే ఆ పేరు పేట్టేశారు. వాస్తవానికి సాల్వేషన్ ఆర్మీ(ముక్తిని కలిగించు సైనికులు) మీరే, ప్రతి ఒక్కరికీ ముక్తినిప్పిస్తారు. అందరూ పంచ వికారాల సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు, అందువలన మమ్ములను విడిపించండి, ముక్తినివ్వండి....... అని వేడుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఈ స్మృతియాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు. ఇప్పుడైతే అందరూ చిక్కుకొని ఉన్నారు. తండ్రిని తోటమాలి అని కూడా అంటారు. ఈ విషయాలన్నీ ఇప్పటివే. మీరు పుష్పాలుగా తయారవ్వాలి. ఇప్పుడైతే అందరూ ముళ్ళుగా ఉన్నారు ఎందుకంటే హింసకులుగా ఉన్నారు. ఇప్పుడు అహింకులుగా అవ్వాలి. పావనంగా అవ్వాలి. ధర్మమును స్థాపించేందుకు పవిత్రమైన ఆత్మలే వస్తారు. వారు అపవిత్రంగా ఉండజాలరు. మొదట వచ్చినప్పుడు పవిత్రంగా ఉన్నందువలన వారి ఆత్మకు లేక శరీరానికి దు:ఖము లభించజాలదు ఎందుకంటే వారి పై ఏ పాప భారమూ ఉండదు. మనము పవిత్రంగా ఉన్నప్పుడు ఏ పాపమూ జరగదు. అలాగే ఇతరుల ద్వారా కూడా జరగదు. ప్రతి విషయము గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ధర్మమును స్థాపించేందుకు అక్కడి నుండి ఆత్మలు వస్తాయి. వారికి వంశము కూడా ఉంటుంది. సిక్కుధర్మము వారి వంశము కూడా ఉంటుంది. సన్యాసుల వంశము నడవదు. వారు రాజులుగా అవ్వరు. సిక్కు ధర్మములో మహారాజులు మొదలైనవారు ఉన్నారు కావున స్థాపన చేసే సమయంలో కొత్త ఆత్మయే వస్తుంది. ఏసుక్రీస్తు వచ్చి క్త్రెస్తవ ధర్మమును స్థాపించాడు. బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని, ఇబ్రహీం ఇస్లామ్ ధర్మాన్ని స్థాపించారు. అందరి పేర్లతో వారి రాశి కలుస్తుంది. దేవీ దేవతా ధర్మము వారిదైతే కలువదు. నిరాకారుడైన తండ్రియే వచ్చి దేవీ దేవతా ధర్మమును స్థాపిస్తారు, వారు దేహధారి కాదు. ఇతర ధర్మస్థాపకుల దేహాలకు పేరు ఉంటుంది. వీరు దేహధారి కారు. కొత్త ప్రపంచములో రాజ్యవంశము నడుస్తుంది. కావున తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! స్వయాన్ని ఆత్మిక మిలిట్రీగా తప్పకుండా భావించండి. ఆ మిలిట్రీలోని కమాండర్ మొదలైనవారు వస్తే, ' అటెన్షన్ ' అని అన్న వెంటనే అందరూ అటెన్షన్‌లో నిలబడ్తారు. ఇప్పుడు వారైతే ప్రతి ఒక్కరూ తమ తమ గురువును స్మృతి చేస్తారు లేక శాంతిగా ఉంటారు. కానీ అది అసత్యమైన శాంతి. మనము ఆత్మలము, మన ధర్మమే శాంతి..... అని మీకు తెలుసు. మరి ఎవరిని స్మృతి చేయాలి? ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. జ్ఞాన సహితంగా స్మృతిలో ఉండుట వలన పాపము తొలగిపోతుంది. ఈ జ్ఞానము మరెవ్వరికీ లేదు. మనము ఆత్మలము, శాంతి స్వరూపులమని మానవులకు ఏ మాత్రము తెలియదు. మనము శరీరము నుండి భిన్నమై కూర్చోవాలి. ఇక్కడ మీకు ఆ బలము లభిస్తుంది. దీని ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయగలరు. స్వయాన్ని ఆత్మగా భావించి శరీరము నుండి డిటాచ్ అయ్యి ఎలా కూర్చోవాలో తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనము ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్లాలని మీకు తెలుసు. మనము అక్కడి నివాసులము. ఇన్ని రోజులు మనము ఇంటిని మర్చిపోయాము. మనము ఇంటికి వెళ్లాలని ఇతరులెవ్వరూ భావించరు. పతితమైన ఆత్మ వాపస్ వెళ్లజాలదు. ఎవరిని స్మృతి చేయాలో అర్థం చేయించేవారు కూడా లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక్కరినే స్మృతి చేయండి. ఇతరులెవ్వరినైనా స్మృతి చేసినా లాభమేముంది! భక్తి మార్గములో శివ, శివ అని అంటూ ఉంటారు, దీని వలన ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. శివుని స్మృతి చేయడం వలన పాపము సమాప్తమవుతుందని ఎవ్వరికీ తెలియదు. శబ్ధము చేస్తే తప్పకుండా వినిపిస్తుంది. కానీ వీటన్నింటితో లాభమేమీ లేదు. బ్రహ్మబాబాకు ఈ గురువులందరి అనుభవముంది కదా.
తండ్రి చెప్పారు కదా - హే అర్జునా, వీటన్నింటిని వదిలేయ్......... సద్గురువు లభించినప్పుడు వీటన్నిటి అవసరము లేదు. సద్గురువు తేలుస్తారు(తార్‌తా హై). తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను ఆసురీ ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్తాను. విషయ సాగరాన్ని దాటుకొని వెళ్లాలి. ఇవన్నీ అర్థము చేయించవలసిన విషయాలు. నావికుడు అనగా నావను నడిపేవాడు. కానీ అర్థము చేయించేందుకే తండ్రికి ఈ పేరు ఏర్పడింది. ఇప్పుడు వారిని ప్రాణేశ్వరుడైన బాబా అనగా ప్రాణదానము ఇచ్చే బాబా అని అంటారు, వారు అమరులుగా చేస్తారు. ఆత్మను ప్రాణమని అంటారు. ఆత్మ వెళ్లిపోతే, ప్రాణము వెళ్లిపోయిందని అంటారు. తర్వాత శరీరాన్ని ఉండనివ్వరు కదా. ఆత్మ ఉన్నప్పుడు శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ లేకుంటే శరీరము నుండే దుర్వాసన వస్తుంది. తర్వాత దానిని ఉంచుకొని ఏం చేస్తారు? జంతువులు కూడా అలా చేయవు. కేవలం కోతి మాత్రమే తన బిడ్డ చనిపోయినా, దుర్వాసన వస్తున్నా ఆ శవాన్ని వదిలిపెట్టదు, కడుపుకు అతికించుకునే ఉంటుంది. అది జంతువు, మీరు మానవులు కదా. శరీరము వదిలేసిన వెంటనే, దానిని బయట పెట్టండని అంటారు. మానవులు స్వర్గస్థులైనారని అంటారు. శవాన్ని తీసుకేళ్లే సమయంలో మొదట కాళ్ళను శ్మశానము వైపు ఉంచుతారు. లోపలికి వెళ్ళినప్పుడు పూజ మొదలైనవి చేసిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నారని ఆ శవాన్ని త్రిప్పి ముఖమును శ్మశానము వైపు ఉంచుతారు. మీరు కృష్ణుడిని కూడా ఆక్యురేట్‌గా చూపించారు. నరకాన్ని కాలితో తన్నినట్లు మీరు కృష్ణుని కూడా సరియైన విధంగా చూపించారు. కృష్ణునికి ఈ శరీరముండదు, వారి నామ-రూపాలు మారుతాయి. ఎన్ని విషయాలు అర్థం చేయించి చివరికి 'మన్మనాభవ' అని తండ్రి చెప్తారు.
ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అటెన్షన్ ఉంచండి. బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. ఈ విధంగా సదా కాలముండాలి. జీవించి ఉన్నంతవరకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే జన్మ-జన్మల పాపము సమాప్తమవుతుంది. స్మృతే చేయకుంటే పాపము కూడా సమాప్తమవ్వదు. తండ్రిని స్మృతి చేయాలి, స్మృతిలో ఎప్పుడూ కళ్లు మూసుకోరాదు. సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కొందరైతే స్త్రీ ముఖమును చూడరు. కళ్ళకు పట్టీ కట్టుకుని కూర్చుంటారు. మీరిక్కడ కూర్చున్నప్పుడు రచయిత, రచనల ఆది, మధ్య, అంత్యముల స్వదర్శన చక్రమును తిప్పాలి. మీరు లైట్‌హౌస్‌లు కదా. ఇది దు:ఖధామము. ఒక కంటిలో దు:ఖధామము, మరొక కంటిలో సుఖధామము. లేస్తూ, కూర్చుంటూ స్వయాన్ని లైట్‌హౌస్‌గా భావించండి. బాబా రకరకాల ఉదాహరణాలతో తెలియజేస్తారు. మీరు స్వయాన్ని కూడా సంభాళించుకుంటారు. లైట్‌హౌస్‌గా అవ్వడం ద్వారా మీ కళ్యాణము చేసుకుంటారు. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. దారిలో ఎవరైనా లభిస్తే వారికి కూడా తెలపాలి. మీకు పరిచయమున్నవారు చాలామంది లభిస్తారు. వారైతే పరస్పరం రాం-రాం అని పలకరించుకుంటూ ఉంటారు. వారితో ఇది దు:ఖధామమని, అది శాంతిధామమని, సుఖధామము మీకు తెలుసా? అని అడగండి. మీరు శాంతిధామము, సుఖధామానికి వెళ్లాలని అనుకుంటున్నారా? అని అడగండి. ఈ మూడు చిత్రాలను ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. మీకు సూచనలు ఇస్తారు. లైట్‌హౌస్ కూడా సూచననిస్తుంది. ఈ నావ రావణుని జైలులో చిక్కుకొని ఉంది. మనుష్యులు మనుష్యులను రక్షించలేరు. అవన్నీ కృత్రిమమైన హద్దు విషయాలు. ఇవి బేహద్ విషయాలు. అది నిజానికి సమాజ సేవ కూడా కాదు. వాస్తవానికి అందరి నావను తీరానికి చేర్చడమే సత్యమైన సేవ. మానవులకు సర్వీసు ఎలా చేయాలో మీ బుద్ధిలో ఉంది.
ముక్తిధామానికి వెళ్లేందుకు, తండ్రితో కలుసుకునేందుకు మీరు గురువుల వద్దకు వెళ్తారు కానీ ఎవ్వరూ కలవరు. కలుసుకునే మార్గాన్ని తండ్రియే తెలియజేస్తారు. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన భగవంతుడు లభిస్తారని ఓర్పుతో ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. భగవంతుడు ఎప్పుడు లభిస్తారో అదంతా మీకు తండ్రి అర్థం చేయించారు. ఒక్కరినే స్మృతి చేయాలని మీరు చిత్రములో చూపించారు. ధర్మస్థాపకులు కూడా ఇలాగే సూచననిస్తారు. ఎందుకంటే మీరు శిక్షణనిచ్చారు కనుక వారు కూడా అలాగే సూచననిస్తారు. భగవంతుని జపించండి అని అంటారు. ఆ తండ్రి సద్గురువు. మిగిలిన వారందరూ అనేక రకాలుగా శిక్షణనిస్తారు. వారిని గురువులని అంటారు. పోతే అశరీరులుగా అయ్యే శిక్షణ గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు శివబాబాను స్మృతి చేయమని చెప్తారు. వారు శివాలయానికి వెళ్లినప్పుడు సదా శివుని తండ్రి అనడం అలవాటైపోయింది. మరెవ్వరినీ బాబా అని అనరు. ఎందుకంటే వారు నిరాకారులు కారు, వారు శరీరధారులు. శివుడైతే నిరాకారుడు, సత్యమైన బాబా. వారు అందరికీ తండ్రి. ఆత్మలందరూ అశరీరులు.
పిల్లలైన మీరిక్కడ కూర్చున్నప్పుడు ఇదే తపనలో ఉండండి. మనమెలా చిక్కుకొని ఉండినామో మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి దారి తెలిపించారు. మిగిలిన వారందరూ చిక్కుకొని ఉన్నారు. బయట పడడం లేదు. శిక్షలు అనుభవించిన తర్వాత అందరూ విడుదల అవుతారు. శిక్షలు అనుభవించి పదవిని పొందుకోరాదని పిల్లలైన మీకు తెలియజేస్తూ ఉంటారు. శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదభ్రష్ఠులైపోతారు. రొట్టె(పదవి) తక్కువగా లభిస్తుంది. తక్కువగా శిక్షలు అనుభవిస్తే మంచి రొట్టె లభిస్తుంది. ఇది ముళ్ల అడవి. అందరూ ఒకరినొకరు ముళ్లతో గుచ్చుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని భగవంతుని పూలతోట అని అంటారు. ఒకప్పుడు స్వర్గముండేదని క్రైస్తవులు కూడా అంటారు. ఒక్కొక్కసారి సాక్షాత్కారము కూడా పొందగలరు. ఈ ధర్మానికి చెందినవారిగా ఉండవచ్చు. వారు మళ్లీ తమ ధర్మములోకి రాగలరు. పోతే కెేవలం చూసినంత మాత్రాన ఏమీ రాదు. చూసినంత మాత్రాన ఎవ్వరూ వెళ్లలేరు. తండ్రిని గుర్తించి జ్ఞానము తెలుసుకోవాలి. అందరూ రాలేరు. అక్కడ దేవతలైతే చాలా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు ఇంతమంది హిందువులున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు కదా. కానీ వారు పావనంగా ఉండేవారు. వీరు పతితంగా ఉన్నారు. పతితమైనవారిని దేవతలని అనడం శోభించదు. ఈ ఒక్క ధర్మమే కర్మభ్రష్ఠము, ధర్మభ్రష్ఠమయిందని చెప్తారు. ఆది సనాతన హిందూ ధర్మమని అంటారు. దేవతా ధర్మము వారని జనాభా లెక్కలో కూడా ఉండనే ఉండదు.
అతిప్రియమైన మన తండ్రి పిల్లలను ఎలా ఉండేవారిని ఎలా తయారు చేస్తారు! తండ్రి ఎలా వస్తారో మీరు అర్థం చేయించగలరు. ఈ పాత తమోప్రధాన సృష్టిలో దేవతలు పాదము కూడా మోపరు. మరి తండ్రి ఎలా వస్తారు? తండ్రి అయితే నిరాకారుడు, వారికి పాదాలే లేవు అందువలన ఇతనిలో ప్రవేశిస్తారు.
పిల్లలైన మీరిప్పుడు ఈశ్వరీయ ప్రపంచములో కూర్చుని ఉన్నారు, వారందరూ ఆసురీ ప్రపంచములో ఉన్నారు. ఇది చాలా చిన్న సంగమ యుగము. మనము దేవతల ప్రపంచములోనూ లేము, ఆసురీ ప్రపంచములోనూ లేమని మీరు అర్థం చేసుకున్నారు. మనము ఈశ్వరీయ ప్రపంచములో ఉన్నాము. మనలను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. అది నా ఇల్లు అని తండ్రి చెప్తారు. మీ కొరకు నేను నా ఇంటిని వదిలి వస్తాను. భారతదేశము సుఖధామంగా అయిన తర్వాత నేను అందులోకి రాను. నేను విశ్వానికి అధిపతిగా అవ్వను, మీరు అధిపతులుగా అవుతారు. నేను బ్రహ్మాండానికి యజమానిని. బ్రహ్మాండములో అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు కూడా అక్కడ అధికారులుగా కూర్చుని ఉన్నారు. పోతే వారు ఇక్కడకు రావాలి. అయితే వారు వచ్చి విశ్వానికి అధిపతులుగా అవ్వరు. చాలా బాగా అర్థం చేయిస్తారు. చాలా మంచి విద్యార్థులైతే స్కాలర్‌షిప్ తీసుకుంటారు. ఆశ్చర్యమేమంటే మేము పవిత్రంగా అవుతామని ఇక్కడ చెప్తారు, కానీ అక్కడకు వెళ్లి పతితంగా అవుతారు. ఇటువంటి కచ్ఛాగా ఉన్నవారిని తీసుకు రాకండి. పరిశీలించి పిలుచుకు రావడం బ్రాహ్మణి కర్తవ్యము. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్ర చేస్తుందని, దానికి అవినాశి పాత్ర లభించిందని మీకు తెలుసు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. లైట్‌హౌస్‌గా అయ్యి అందరికీ శాంతిధామము, సుఖధామాల మార్గమును తెలపాలి. అందరి నావను దు:ఖధామము నుండి వెలికి తీసే సేవ చేయాలి. స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి.
2. మీ శాంతి స్వరూపములో స్థితమై శరీరము నుండి భిన్నమయ్యే అభ్యాసము చెయ్యాలి. స్మృతి చేయునప్పుడు కళ్లు తెరచుకొని కూర్చోవాలి. బుద్ధిలో రచయిత, రచనను స్మరించండి.
వరదానము :- '' ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తితో అవినాశి స్నేహాన్ని సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మా భవ ''
ఈ అలౌకిక జీవితంలో పిల్లలైన మీకు సంబంధాల శక్తి డబల్ రూపంలో ప్రాప్తించింది. ఒకటేమో తండ్రి ద్వారా సర్వ సంబంధాలు, రెండవది దైవీ పరివారపు సంబంధాలు. ఈ సంబంధాల ద్వారా నిస్వార్థ స్నేహము, అవినాశి సహయోగాలు సదా ప్రాప్తి అవుతూ ఉంటాయి. కనుక మీ వద్ద సంబంధాల శక్తి కూడా ఉంది. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జీవితము గడుపుతున్న శక్తి సంపన్నమైన వరదాని ఆత్మలు. అందువలన మీరు అర్జీ (ఫిర్యాదులు) చేసేవారు కాదు, సదా రాజీగా (సంతుష్టంగా, తృప్తిగా) ఉండేవారిగా అవ్వండి.
స్లోగన్ :- '' ఏ ప్లానునైనా విదేహిగా అయ్యి సాక్షిగా ఉండి ఆలోచించండి, సెకండులో ప్లెయిన్ స్థితిని చేసుకుంటూ వెళ్లండి. ''
No comments:
Post a Comment