12-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - లోలోపల రాత్రింబవళ్లు ''బాబా - బాబా'' అని పలుకుతూ ఉంటే అపారమైన ఖుషీ ఉంటుంది, బాబా మనకు కుబేర ఖజానా ఇచ్చేందుకు వచ్చారని బుద్ధిలో ఉంటుంది ''
ప్రశ్న :- బాబా ఏ పిల్లలను నిజాయితీపరులైన పుష్పాలని అంటారు? వారి గుర్తులు వినిపించండి ?
జవాబు :- నిజాయితీపరులైన పుష్పాలు ఎప్పటికీ మాయకు వశమవ్వరు. మాయ ప్రభావములోకి రారు. ఇలాంటి నిజాయితీపరులైన పుష్పాలు చివర్లో వచ్చినా చాలా ఫాస్టుగా(వేగంగా) వెళ్లే పురుషార్థం చేస్తారు. వారు పాతవారి కంటే ముందుకు వెళ్లాలనే లక్ష్యము ఉంచుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థములో ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు.
ఓంశాంతి. శివభగవానువాచ - వారు ఆత్మిక తండ్రి, ఎందుకంటే శివుడు పరమాత్మ కదా, అయినా ఆత్మయే కదా. తండ్రి ప్రతి రోజూ కొత్త - కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైనవారు చాలా మంది ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు. వారి నోటి నుండి ఎప్పుడూ బాబా అను పదము వెలువడజాలదు. ఈ పదము గృహస్థ మార్గములోని వారి కొరకు. వారు(సన్యాసులు) నివృత్తి మార్గములోనివారు. వారు బ్రహ్మ తత్వమునే స్మృతి చేస్తారు. నోటితో ఎప్పుడూ శివబాబా అని అనరు. కావలంటే మీరు పరిశీలించండి. పెద్ద - పెద్ద విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానంద మొదలైనవారు గీతను వినిపిస్తారు. అలాగని గీతా భగవానుడు కృష్ణుడని భావించి వారితో యోగము జోడించగలరని కాదు. వారు ఎంతైనా మళ్లీ బ్రహ్మముతో యోగము జోడించే బ్రహ్మ జ్ఞానులు లేక తత్వ జ్ఞానులు. వారు కృష్ణుని ఎప్పుడూ బాబా(తండ్రి) అని అనరు. ఇలా జరిగేందుకు వీలు లేదు. కనుక కృష్ణుడు గీతను వినిపించే బాబా కారు కదా. శివుని అందరూ 'బాబా' అని అంటారు, ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి. పరమపిత పరమాత్మ అని సర్వాత్మలు వారిని పిలుస్తాయి. వారు సుప్రీమ్, సర్వోన్నతమైనవారు, ఎందుకంటే పరంధామములో ఉంటారు. మీరు కూడా పరంధామములోనే ఉంటారు. కాని వారిని పరమ - ఆత్మ అని అంటారు. వారెప్పటికీ పునర్జన్మలు తీసుకోరు. పరమాత్మయే స్వయంగా ''నాది దివ్యమైన అలౌకిక జన్మ'' అని చెప్తారు. ఎవరి రథములోనైనా ప్రవేశించి మీరు విశ్వానికి అధికారులుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. అటువంటివారు మరెవ్వరూ ఉండుటకు వీలు లేదు. అందువలన నేను ఎవరు, ఎలా ఉన్నాను అని నా గురించి ఎవ్వరికీ తెలియదని తండ్రి చెప్తారు. నేను నా పరిచయమును ఇచ్చినప్పుడే తెలుసుకోగలరు. బ్రహ్మమును లేక తత్వాలను నమ్మేవారు, కృష్ణుని తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ పిల్లలే కదా. కృష్ణుని అందరూ తండ్రి అని ఎలా అంటారు? కృష్ణుడు అందరికీ తండ్రి అని అనరు. మనమంతా పరస్పరము సోదరులము. కృష్ణుడు సర్వవ్యాపి కూడా కాదు. అందరూ కృష్ణునిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ కృష్ణులైతే వారికి తండ్రి కూడా ఉండాలి, మానవులు చాలా విషయాలను మర్చిపోయారు. వారికి తెలియనందున నన్ను కోటిలో ఒక్కరే తెలుసుకుంటారు. కృష్ణుడినైతే ఎవరైనా తెలుసుకోగలరు. విదేశాలలోని వారికి కూడా అతడు తెలుసు. లార్డ్(కూశీతీస) కృష్ణ అని అంటారు కదా. చిత్రాలు కూడా ఉన్నాయి, అసలైన చిత్రమైతే లేదు. భారతీయుల ద్వారా వింటారు, వీరికి చాలా ఎక్కువగా పూజ జరుగుతుంది. కావున గీతలో కృష్ణ భగవానుడని వ్రాసేశారు. ఇప్పుడు భగవంతుని లార్డ్ అని అంటారా! లార్డ్ కృష్ణ అని అంటారు కదా. లార్డ్ అనే బిరుదు వాస్తవానికి గొప్ప వ్యక్తులకు లభిస్తుంది. వారైతే అందరికీ ఇస్తూ ఉంటారు. దీనిని అంధకార నగరము................ (అంధేరీ నగరి.............) అని అంటారు. పతితమైన మానవులనెవ్వరినైనా లార్డ్ అని అంటూ ఉంటారు. ఇక్కడున్న పతిత మానవులెక్కడ? శివుడు లేక కృష్ణుడు ఎక్కడ? నేను మీకు ఇచ్చే జ్ఞానము తర్వాత మళ్లీ అదృశ్యమైపోతుందని తండ్రి చెప్తారు. నేనే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను. జ్ఞానాన్ని కూడా ఇప్పుడే ఇస్తాను. నేను జ్ఞానము ఇచ్చినప్పుడే పిల్లలు వింటారు. నేను తప్ప మరెవ్వరూ వినిపించలేరు. ఎవ్వరికీ తెలియనే తెలియదు.
సన్యాసులు శివబాబాను స్మృతి చేయగలరా? నిరాకారులైన భగవంతుని స్మృతి చేయమని వారు చెప్పలేరు కూడా. అలా ఎప్పుడైనా విన్నారా? చాలా గొప్ప చదువులు చదువుకున్న మనుష్యులు కూడా అర్థము చేసుకోరు. కృష్ణుడు భగవంతుడు కాడని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మనుష్యులైతే వారినే భగవంతుడని అంటూ ఉంటారు. ఎంత వ్యతాసమైపోయింది. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. వారు తండ్రి, టీచరు, గురువు కూడా. శివబాబా కూర్చుని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థము చేసుకోనందున త్రిమూర్తి చిత్రములో శివుని ఉంచరు. ప్రజలను రచించే ప్రజాపిత బ్రహ్మను ఉంచుతారు. కాని వారిని భగవంతుడని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతునికైతే ఆత్మలందరూ పిల్లలే. ఎవరి ద్వారానైనా ప్రజలను రచిస్తారు. మిమ్ములను ఎవరు దత్తు తీసుకున్నారు? బ్రహ్మ ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులైనప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయమునైతే ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడ నుండి వస్తారు? కుఖవంశస్థులు(గర్భ జనితులు) ఉండడానికి సాధ్యము లేదు. ఆ కుఖవంశావళి బ్రాహ్మణులు మా సర్‌నేమ్ బ్రాహ్మణులు అని అంటారు. పేర్లేమో అందరికి వేరు వేరుగా ఉంటాయి. వీరిలో శివబాబా ప్రవేశించినప్పుడే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నా గురించి ఎవ్వరికీ తెలియదు. సృష్టి చక్రము గురించి కూడా తెలియదు. అందుకే ఋషులు, మునులు అందరూ నేతి - నేతి అంటూ వెళ్లిపోయారు. పరమాత్ముని గురించి గాని, పరమాత్ముని రచనను గురించి గాని మాకు తెలియదని అన్నారు. నేను వచ్చి నా పరిచయమునిచ్చినప్పుడే నన్ను తెలుసుకుంటారని తండ్రి చెప్పారు. దేవతలకు వారు ఈ రాజ్యమును ఎలా పొందుకున్నారో అక్కడ తెలియదు. వారిలో జ్ఞానమే ఉండదు. పదవి పొందుకున్న తర్వాత జ్ఞానము అవసరమే ఉండదు. సద్గతి కొరకే జ్ఞానము కావాలి. ఈ దేవతలైతే సద్గతిని పొందుకున్నవారు. ఇవి చాలా బాగా అర్థము చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. బుద్ధివంతులు మాత్రమే అర్థము చేసుకుంటారు. వృద్ధులైన మాతలకు అంత తెలివితేటలు ఉండవు. వారికి కూడా డ్రామా ప్లాను అనుసారము ప్రతి ఒక్కరికి తమ - తమ పాత్ర ఉంది. ఓ ఈశ్వరా! బుద్ధినివ్వండి అని అనరు. నేను అందరికీ ఒకే విధమైన బుద్ధిని ఇస్తే అందరూ నారాయణులైపోతారు. సింహాసనము మీద ఒకరి పై ఒకరు కూర్చుంటారా! అయితే అలా తయారవ్వాలనే లక్ష ్యముంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు అందరూ పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థానుసారమే తయారవుతారు కదా! మేము నారాయణునిగా అవుతామని అందరూ చేతులెత్తినప్పుడు తండ్రికి మనసులో నవ్వు వస్తుంది కదా. అందరూ ఒకే విధంగా ఎలా అవ్వగలరు? నెంబరువారుగా ఉంటారు కదా ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకెండ్, థర్డ్,.................ఉన్నట్లే నారాయణులు కూడా మొదటివారు, రెండవవారు, మూడవవారు............ ఉంటారు. భలే లక్ష ్యము ఇదే అయినా నడవడికను బట్టి ఏ పదవిని పొందుతామని స్వయం అర్థం చేసుకోగలరు కదా. పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సిందే...... బాబా నెంబరువారు పూలను తీసుకొస్తారు. పూలను నెంబరువారుగా కూడా ఇవ్వవచ్చు. కానీ అలా చేయరు. అలా చేస్తే ఫంక్ అయిపోతారు(ఖంగు తింటారు, భయపడిపోతారు). ఎవరు ఎక్కువగా సర్వీసు చేస్తున్నారో బాబాకు తెలుసు. వారు మంచి పుష్పాలని గమనిస్తారు. ఆ తర్వాత నెంబరువారు ఉండనే ఉంటారు. చాలా పాతవారు కూడా కూర్చున్నారు. కాని వారిలో క్రొత్త-క్రొత్తవారు, చాలా మంచి పుష్పాలు ఉన్నారు. వీరు నెంబర్‌వన్ నిజాయితీగా ఉన్న పుష్పము, ఎలాంటి కల్మషము, ఈర్ష్య మొదలైనవి వీరిలో లేవని చెప్తారు. చాలా మందిలో ఎవో కొన్ని బలహీనతలు తప్పకుండా ఉన్నాయి. ఎవ్వరినీ సంపూర్ణులని చెప్పలేరు. 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడే ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేరు. ఇప్పుడైతే మంచి-మంచి పిల్లలలో కూడా చాలా ఈర్ష్య ఉంది. బలహీనతలైతే ఉన్నాయి కదా. ఎవరెవరు ఎలాంటి పురుషార్థము చేస్తున్నారో తండ్రికి తెలుసు. ప్రపంచములోని వారికేం తెలుసు! వారేమీ అర్థము చేసుకోరు. చాలా కొద్దిమందే అర్థం చేసుకుంటారు. పేదవారు వెంటనే అర్థము చేసుకుంటారు. చదివించేందుకు బేహద్ తండ్రి వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు సమాప్తమైపోతాయి. మనము తండ్రి వద్దకు వచ్చాము. బాబా ద్వారా నూతన ప్రపంచ వారసత్వము తప్పకుండా లభిస్తుంది. 100 నుండి ఒకటి వరకు నెంబరువారుగా అయితే ఉన్నారు. అయితే తండ్రిని తెలుసుకున్నారు, కొద్దిగా విన్నా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల వరకు స్వర్గానికి రావడము తక్కువ విషయమా! ఎవరైనా మరణిస్తే 21 జన్మలకు స్వర్గసులయ్యారని అనరు. అసలు స్వర్గము ఎక్కడుంది? ఎంత అపార్థము చేసుకున్నారు. చాలా గొప్ప-గొప్ప బుద్ధివంతులు కూడా ఫలానావారు స్వర్గస్థులైనారని అంటారు. స్వర్గమని దేనిని అంటారో కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు కూడా మనుష్యులే అయితే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. స్వయాన్ని బ్రాహ్మణులమనే తెలుపుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఒక్క బాప్‌దాదాయే ఉన్నారు. కావున మీరు సన్యసులను ఇలా అడగవచ్చు. దేహ సహితంగా దేహ ధర్మాలను వదిలి సదా నన్ను ఒక్కరినే స్మృతి చేయండని కృష్ణుడు అన్నాడా? మీరు కృష్ణుని స్మృతి చేస్తారా? అని పిల్లలైన మీరు అడిగితే అవును అని ఎప్పుడూ అనరు. అక్కడే తెలిసిపోతుంది. కాని అమాయకులైన అబలలు వెళ్తారు. వారికేం తెలుసు. సన్యాసులు తమ అనుచరుల ముందు కుపితులౌతారు(కోపపడ్తారు). దుర్వాసుని పేరు కూడా ఉంది కదా. వారికి చాలా అహంకారముంటుంది. అనుచరులు చాలామంది ఉంటారు. ఇది భక్తి రాజ్యము కదా. వారిని అడిగే శక్తి ఎవ్వరికీ ఉండదు. శక్తి ఉంటే మీరు శివబాబాను పూజిస్తారు, ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? రాయి-రప్పలు భగవంతుడా? అని మీరు వారిని అడగగలగాలి. మున్ముందు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంత నషా ఉంది. అందరూ పూజారులుగానే ఉన్నారు, పూజ్యులని అనరు.
తండ్రి అంటున్నారు - నన్ను అరుదుగా ఎవరో కొందరే తెలుసుకుంటారు. నేనెవరినో, ఎలా ఉన్నానో పిల్లలైన మీలో కూడా అరుదుగా కొందరికి మాత్రమే యధార్థంగా తెలుసు. వారికి లోపల చాలా సంతోషముంటుంది. బాబాయే మనకు స్వర్గసామ్రాజ్యమునిస్తారని అర్థము చేసుకోగలరు కదా. కుబేరుని ఖజానాలు లభిస్తాయి. అల్లావుద్దీన్(అల్లా - అవల్‌దీన్) ఆటను కూడా చూపిస్తారు కదా. దీపాన్ని రుద్దిన వెంటనే ఖజానా వస్తుంది. చాలా ఆటలు చూపిస్తారు. ఖుదా దోస్త్ రాజా ఏం చేసేవాడు. దాని పై కూడా ఒక కథ ఉంది. వంతెన పై వచ్చేవారికి ఒక రోజు రాజ్యమిచ్చి పంపించేస్తాడు. ఇవన్నీ కథలు. తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు భగవంతుడు పిల్లలైన మీకు స్నేహితుడు. ఇతనిలో ప్రవేశించి మీతో తింటారు, తాగుతారు, ఆడ్తారు కూడా. శివబాబా మరియు బ్రహ్మాబాబాల రథము ఒక్కటే. కావున శివబాబా కూడా తప్పకుండా ఆడుతూ ఉంటారు కదా. తండ్రినే స్మృతి చేస్తూ ఆడుతున్నారు. కావున తండ్రి మరియు దాదా ఇరువురూ ఇందులో ఉన్నారు. కానీ ఎవ్వరూ అర్థము చేసుకోరు. రథములో వచ్చారని చెప్తారు. కానీ వారు గుఱ్టపు బండి రథమును తయారు చేశారు. కృష్ణునిలో శివబాబా కూర్చొని జ్ఞానమిస్తారని కూడా అనరు. వారు కృష్ణ భగవానువాచ అని అనేస్తారు. బ్రహ్మ భగవానువాచ అని అనరు. ఇతను రథముగా ఉన్నారు. శివభగవానువాచ - తండ్రి కూర్చొని పిల్లలైన మీకు తమ పరిచయమును మరియు రచన ఆదిమధ్యాంతాల పరిచయమును, దాని కాలమును తెలుపుతారు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. తెలివైన పిల్లలు బుద్ధితో పని చేస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నిటినీ సన్యసిస్తారు. పాత శరీరమని తెలుసు. మనమిప్పుడు క్రొత్త ప్రపంచానికి వెళ్లాలి. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులము కాదు. పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చాము. మనము పరంధామ నివాసులము. అక్కడ నిరాకార వృక్షము ఎలా ఉందో కూడా పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎన్ని కోట్లమంది జీవాత్మలున్నారు. ఇంతమంది ఎక్కడ ఉంటారు. నిరాకార ప్రపంచములో ఉంటారు. ఆ నక్షత్రాలు ఆత్మలు కావు. మనుష్యులైతే ఈ నక్షత్రాలను కూడా దేవతలని అంటారు. కానీ అవి దేవతలు కాదు. మనము శివబాబాను జ్ఞాన సూర్యుడని అంటాము. కానీ వాటిని దేవతలని అనము. శాస్త్రాలలో అయితే ఏమేమో వ్రాసేశారు. ఇదంతా భక్తిమార్గపు సామగ్రి. దీని ద్వారా మీరు క్రిందకే దిగజారుతూ వచ్చారు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగజారుతారు కదా. ఇప్పుడిది ఇనుప యుగ ప్రపంచము. సత్యయుగమును బంగారుయుగ ప్రపంచమని అంటారు. అక్కడ ఎవరు ఉండేవారు? దేవతలు. వారు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటారని కూడా భావిస్తారు. తీసుకుంటూ తీసుకుంటూ దేవతలుగా ఉన్నవారు హిందువులుగా అయిపోయారని తండ్రి అర్థం చేయించారు. పతితమైనారు కదా. ఇంకెవ్వరి ధర్మమూ మారదు. వీరి ధర్మము ఎందుకు మారిందో ఎవ్వరికీ తెలియదు. ధర్మభ్రష్ఠులుగా, కర్మభ్రష్ఠులుగా అయినారని తండ్రి చెప్తారు. దేవీదేవతలుగా ఉన్నప్పుడు పవిత్రమైన జంటలుండేవి. తర్వాత రావణ రాజ్యములో మళ్లీ మీరు అపవిత్రమైపోయారు. కావున మీరు దేవీ దేవతలని అనబడరు. అందువలన హిందువులనే పేరు పెట్టారు. దేవీ దేవతా ధర్మమును కృష్ణ భగవానుడు స్థాపించలేదు. శివబాబాయే వచ్చి స్థాపించి ఉంటారు. శివజయంతిని, శివరాత్రిని జరుపుకుంటారు కానీ వారు వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. ఒక శివపురాణము కూడా ఉంది. వాస్తవానికి శివుని గీత ఒక్కటే. దానిని శివబాబా వినిపించారు. మరే శాస్త్రము వారిది కాదు. మీరు ఎలాంటి హింసా చేయరు. మీ శాస్త్రమేదీ తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచములోకి వెళ్లిపోతారు. సత్యయుగములో ఏ శాస్త్రాలు, గీత మొదలైనవేవీ ఉండవు. అక్కడ ఎవరు చదువుతారు? ఈ వేదశాస్త్రాలు పారంపర్యముగా వస్తూ ఉన్నాయని వారు అంటారు. వారికేమీ తెలియదు. స్వర్గములో ఏ శాస్త్రాలూ ఉండవు. తండ్ర్రి ఏమో మనలను దేవతలుగా తయారు చేసేశారు. అందరికీ సద్గతి లభించినప్పుడు శాస్త్రాలను చదివే అవసరమేముంది. అక్కడ శాస్త్రాలు ఉండవు. తండ్రి మీకిప్పుడే జ్ఞానమనే తాళం చెవిని ఇచ్చారు. దీని ద్వారా బుద్ధి రూపీ తాళం తెరుచుకుంది. మొదట తాళము పూర్తిగా మూయబడి ఉండేది. ఏమీ అర్థము చేసుకునేవారు కాదు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవరిని చూచినా ఈర్ష్య మొదలైనవి ఉండరాదు. లోపాలను తీసేసి సంపూర్ణముగా అయ్యే పురుషార్థము చేయాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి.
2. శరీర సహితంగా అన్నిటినీ సన్యసించాలి. ఏ విధమైన హింసా చేయరాదు. అహంకారమును ఉంచుకోరాదు.
వరదానము :- '' 'నాది' ని 'నీది' గా పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తిగా అయ్యి ఖుషీ ఖజానాతో భర్‌పూర్ భవ ''
ఏ పిల్లలైతే తమ సర్వస్వము 'నీది'గా (బాబాదిగా)' చేశారో వారే నిశ్చింతగా ఉంటారు. నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే............. ఎప్పుడైతే ఇలా పరివర్తన చేస్తారో అప్పుడు నిశ్చింతులుగా అవుతారు. జీవితంలో ప్రతి ఒక్కరు నిశ్చింతగా ఉండాలని కోరుకుంటారు. ఎక్కడైతే చింత ఉండదో, అక్కడ సదా ఖుషీ(సంతోషము) ఉంటుంది. కనుక 'నీది' అని అనడం వల్ల చింతలేని వారిగా అవుతారు. తద్వారా ఖుషీ ఖజానాతో భర్‌పూర్‌గా అవుతారు. నిశ్చింత చక్రవర్తులైన మీ వద్ద లెక్కలేనంత, తరగని ఖజానాలున్నాయి. ఆ ఖజానాలు సత్యయుగంలో కూడా ఉండవు.
స్లోగన్:- '' ఖజానాలను సేవలో ఉపయోగించడమనగా జమ ఖాతాను పెంచుకొనుట. ''
No comments:
Post a Comment