Tuesday, September 17, 2019

Telugu Murli 09/09/2019

09-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - బ్రాహ్మణులు శిఖ, శూద్రులు పాదాలు. ఎప్పుడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు దేవతలుగా అవ్వగలరు ''

ప్రశ్న :- మీ ఏ శుభ భావనను కూడా మనుష్యులు వ్యతిరేకిస్తారు ?
జవాబు :- ఈ పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచము స్థాపన అవ్వాలనేదే మీ శుభ భావన. అందువలన ఈ పాత ప్రపంచము వినాశనమయ్యే తీరుతుందని మీరు చెప్తారు. దీనిని కూడా మనుష్యులు వ్యతిరేకిస్తారు.

ప్రశ్న :- ఈ ఇంద్రప్రస్థ సభ యొక్క ముఖ్యమైన నియమము ఏది ?
జవాబు :- పతితులైన ఏ శూద్రులను ఈ ఇంద్రప్రస్థ సభకు తీసుకు రాకూడదు. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే వారికి కూడా పాపము అంటుకుంటుంది.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - మనము మన కొరకే దైవీ రాజ్యమును మళ్లీ స్థాపిస్తున్నామని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఎందుకంటే మీరు బ్రహ్మకుమార - కుమారీలు. మీకు మాత్రమే ఈ విషయం తెలుసు. కానీ మాయ మిమ్ములను కూడా మరపింపజేస్తుంది. మీరు దేవతలుగా అవ్వాలనుకుంటే మాయ మిమ్ములను బ్రాహ్మణుల నుండి శూద్రులుగా చేసేస్తుంది. శివబాబాను స్మృతి చేయపోవడం ద్వారా బ్రాహ్మణులు శూద్రులుగా అయిపోతారు. మనము మన రాజ్యమును స్థాపిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. రాజ్యము స్థాపన అయినప్పుడు ఈ పాత సృష్టి ఉండదు. అందరినీ ఈ విశ్వము నుండి శాంతిధామానికి పంపేస్తారు. ఇది మీ భావన. కానీ ఈ ప్రపంచము సమాప్తమవుతుందని మీరు చెప్తున్న విషయాన్ని బయటివారు తప్పకుండా వ్యతిరేకిస్తారు కదా. ఈ బ్రహ్మకుమారీలు ఏం చెప్తున్నారని అంటారు. వినాశనము, వినాశనము అని చెప్తూనే ఉంటారు. ఈ వినాశనము ద్వారానే విశేషంగా భారతదేశానికి, ప్రపంచమంతటికీ మంచి జరుగుతుందని మీకు తెలుసు. ఈ విషయము ప్రపంచములోని వారికి తెలియదు. వినాశనము జరిగితే అందరూ ముక్తిధామానికి వెళ్లిపోతారు. మీరిప్పుడు ఈశ్వరీయ సంప్రదాయస్థులుగా అయ్యారు. మొదట ఆసురీ సంప్రదాయులుగా ఉండేవారు. మీకు ఈశ్వరుడే స్వయంగా ''నన్ను ఒక్కరినే స్మృతి(మామేకం యాద్‌ కరో) చేయండని'' చెప్తారు. ఎవ్వరూ సదా స్మృతి చేస్తూ ఉండలేరని తండ్రికి తెలుసు. సదా స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమై కర్మాతీత స్థితి ఏర్పడ్తుంది. ఇప్పుడైతే అందరూ పురుషార్థులే. బ్రాహ్మణులైన వారే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు. బ్రాహ్మణులు శిఖ అని తండ్రి అర్థం చేయించారు. పిల్లలు పల్టీ ఆటను ఆడుతారు. మొదట తల పైనున్న శిఖ వస్తుంది. బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ శిఖ(పిలక) ఉంటుంది. మీరు బ్రాహ్మణులు. మొదట శూద్రులుగా అనగా పాదాలుగా ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా, పిలకగా ఉన్నారు. తర్వాత దేవతలుగా అవుతారు. ముఖ భాగమును దేవతలని, భుజ భాగమును క్షత్రియులని, కడుపును వైశ్యులని, పాదాలను శూద్రులని వర్ణిస్తారు. శూద్రులనగా క్షుద్రబుద్ధి, తుచ్ఛబుద్ధి గలవారు. తండ్రిని గురించి తెలియని వారిని తుచ్ఛబుద్ధి అని అంటారు. వారు తండ్రిని ఇంకా గ్లాని చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు భారతదేశములో గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రి అంటారు. భారతీయులైన వారితోనే తండ్రి మాట్లాడ్తారు. యదా యదాహి ధర్మస్య...... భారతదేశములోనే తండ్రి వస్తారు. మరే స్థానములోనూ రారు. భారతదేశమే అవినాశీ ఖండము. తండ్రి కూడా అవినాశి. వారెప్పటికీ జనన-మరణాలలోకి రారు. అవినాశి ఆత్మలకే తండ్రి కూర్చుని వినిపిస్తారు. ఈ శరీరమైతే వినాశి. మీరిప్పుడు శరీర భావము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడం ప్రారంభించారు. హోలీ నాడు పిడకలను కాలుస్తారు. ఆ సమయములో పిడకలన్నీ కాలిపోతాయి కాని వాటికి చుట్టిన దారము మాత్రము కాలదు. అలాగే ఆత్మ ఎప్పటికీ వినాశనమవ్వదు. దీని గురించే ఈ ఉదాహరణ ఉంది. ఆత్మ అవినాశి అని మానవ మాత్రులెవ్వరికీ తెలియదు. వారైతే ఆత్మ నిర్లేపి అని అంటారు. తండ్రి చెప్తారు - అలా కాదు, ఆత్మయే మంచి - చెడు కర్మలను ఈ శరీరము ద్వారా చేస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకొని కర్మభోగమును అనుభవిస్తుంది. కావున అది లెక్కాచారాన్ని తీసుకొని వచ్చినట్లే కదా. అందువలన ఆసురీ ప్రపంచములో మనుష్యులు అపారమైన దు:ఖమును అనుభవిస్తారు. ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. కానీ మానవులు ఈ దు:ఖమును కూడా సుఖము అని భావించి ఉన్నారు. నిర్వికారులుగా అవ్వండి అని పిల్లలైన మీరెంతగా చెప్పినా విషము లేకుండా మేము ఉండలేము అని అంటారు. ఎందుకంటే శూద్ర సంప్రదాయులు కదా. క్షుద్రబుద్ధి గలవారిగా ఉన్నారు. మీరు శిఖ అయిన బ్రాహ్మణులుగా అయ్యారు. పిలక అన్నిటికంటే పైన ఉంటుంది. దేవతల స్థానము కంటే(ముఖము కంటే) ఉన్నతమైన స్థానములో ఉంది. మీరిప్పుడు దేవతల కంటే ఉన్నతమైనవారు. ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు. తండ్రి ఈ సమయములో మిమ్ములను చదివిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు విధేయులైన సేవకులు(ూపవసఱవఅ్‌ ూవతీఙaఅ్‌)గా అయ్యారు కదా. తండ్రి పిల్లలకు విధేయుడైన సేవకునిగా ఉంటాడు కదా. పిల్లలకు జన్మనిచ్చి, సంభాళించి, చదివించి, పెద్ద చేసిన తర్వాత వృద్ధులైనప్పుడు ఆస్తినంతటిని పిల్లలకిచ్చి స్వయం గురువుల దగ్గరకు వెళ్లి వానప్రస్థులై కూర్చుంటారు. ముక్తిధామానికి వెళ్లేందుకు గురువులను ఆశ్రయిస్తారు. కాని వారు ముక్తిధామానికి వెళ్లలేరు. కావున తల్లిదండ్రులు పిల్లల సంభాళన చేస్తారు. తల్లి జబ్బుపడినప్పుడు పిల్లలు మురికి చేస్తే(మల విసర్జన చేస్తే) తండ్రి శుభ్రము చేయవలసి వస్తుంది కదా. కావున తల్లిదండ్రులు పిల్లలకు సేవకులైనట్లే కదా. ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేస్తారు. బేహద్‌ తండ్రి కూడా చెప్తున్నారు - నేను చిన్న పిల్లల వద్దకు రాను. మీరు పెద్దవారే కదా. కూర్చొని మీకు శిక్షణనిస్తాను. మీరు శివబాబాకు పిల్లలుగా అవుతారు కనుక బి.కె లని పిలువబడ్తారు. ఇంతకుముందు శూద్రకుమార్‌ - కుమారీలుగా వేశ్యాలయములో ఉండేవారు. మీరిప్పుడు వేశ్యాలయములో లేరు. ఇక్కడ వికారులు ఎవ్వరూ ఉండలేరు. అనుమతి లేదు. మీరు బి.కెలు. ఇది బ్రహ్మకుమారీలు ఉండే స్థానము. పతితమైన వికారాలలో వెళ్లేవారిని శూద్రులంటారని చాలా అమాయకులైన(తెలివి తక్కువ) కొందరికి అర్థమే కాదు. వారు ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు, వారు రాలేరు. ఇది ఇంద్రసభ కదా. ఇది ఇంద్రసభ. ఇక్కడ జ్ఞాన వర్షము కురుస్తూ ఉంటుంది. బ్రహ్మకుమారీలెవరైనా అపవిత్రులను రహస్యంగా సభలో కూర్చోబెడితే ఇరువురికీ రాతిబుద్ధి గలవారిగా అయిపొమ్మని శాపము లభిస్తుంది. ఇది సత్యమైన ఇంద్రప్రస్థం కదా. ఇది శూద్రకుమార్‌-కుమారీల సత్సంగము కాదు. దేవతలు పవిత్రంగా ఉంటారు. శూద్రులు పతితంగా ఉంటారు. తండ్రి వచ్చి పతితులను పావన దేవతలుగా చేస్తారు. పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవుతున్నారు. కావున ఇది ఇంద్రసభ. ఒకవేళ అడగకుండా ఎవరైనా వికారులను తీసుకొస్త్తే చాలా శిక్షలు లభిస్తాయి, రాతిబుద్ధి గలవారిగా అయిపోతారు. ఇక్కడ పారసబుద్ధి గలవారిగా అవుతున్నారు కదా. కావున వారిని పిలుచుకొని వచ్చినవారికి కూడా శాపము లభిస్తుంది. మీరు వికారులను దాచిపెట్టి ఎందుకు పిలుచుకొని వచ్చారు ? ఇంద్రుని(తండ్రితో) అడగనే లేదు. కావున చాలా శిక్షలు లభిస్తాయి. ఇవి గుప్తమైన విషయాలు. మీరిప్పుడు దేవతలుగా అవుతున్నారు. నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. స్థితియే దిగజారిపోతుంది. ఒకేసారి రాతిబుద్ధి గలవారిగా అయిపోతారు. ఉండేదే రాతి బుద్ధి. పారసబుద్ధి గలవారిగా అయ్యేందుకు పురుషార్థమే చేయరు. ఈ గుప్తమైన విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. ఇక్కడ బి.కె.లు ఉంటారు, వారిని దేవతలుగా అనగా రాతి బుద్ధి గలవారి నుండి పారసబుద్ధి గలవారిగా తండ్రి తయారు చేస్తున్నారు.
తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఏ నియమాన్ని ఉల్లంఘించరాదు. లేకపోతే వారిని పంచ భూతాలు పట్టుకుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము - ఈ 5 అర్ధకల్పపు పెద్ద పెద్ద భూతాలు. మీరిక్కడకు భూతాలను తరిమేసేందుకు వచ్చారు. ఆత్మ శుద్ధంగా, పవిత్రంగా ఉండేది. అది అపవిత్రంగా, అశుద్ధంగా, దు:ఖీగా, రోగిగా అయ్యింది. ఈ ప్రపంచములో అపారమైన దు:ఖముంది. తండ్రి వచ్చి జ్ఞాన వర్షము కురిపిస్తున్నారు, పిల్లలైన మీ ద్వారానే కురిపిస్తారు. మీ కొరకు స్వర్గాన్ని రచిస్తారు. మీరే యోగబలము ద్వారా దేవతలుగా అవుతారు. తండ్రి అలా అవ్వరు. తండ్రి సేవకుడు. టీచరు కూడా విద్యార్థికి సేవకునిగా ఉంటాడు. సేవ చేసి చదివిస్తాడు. నేను మీకు చాలా విధేయుడనైన సేవకుడను అని టీచరు అంటాడు. కొందరిని న్యాయవాదులుగా, కొందరిని ఇంజనీర్లు మొదలైనవారిగా చేస్తారు. కనుక సేవకుడైనట్లే కదా. అదే విధంగా గురువులు కూడా మార్గాన్ని తెలుపుతారు. సేవకులై ముక్తిధామానికి తీసుకెళ్లే సేవ చేస్తారు. కానీ ఈ రోజులలో ఏ గురువులూ తీసుకెళ్లలేరు. ఎందుకంటే వారు కూడా పతితులే. ఒక్క సద్గురువు మాత్రమే సదా పవిత్రులు. మిగిలిన గురువులందరూ పతితులు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. సత్యయుగమును మాత్రమే సంపూర్ణ స్వర్గమని అంటారు. త్రేతాలో రెండు కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకొని ధారణ చేస్తారు. ప్రపంచములోని మానవులకైతే ఏమీ తెలియదు. ప్రపంచములోని వారందరూ స్వర్గములోకి వెళ్తారని కాదు. కల్పక్రితము వెళ్లిన భారతవాసులే మళ్లీ వస్తారు, సత్య, త్రేతా యుగాలలో దేవతలుగా అవుతారు. వారే మళ్లీ ద్వాపర యుగము నుండి తమను హిందువులమని చెప్పుకుంటారు. ఈనాటి వరకు ఉన్న హిందూ ధర్మములో ఏ ఆత్మలైతే పై నుండి దిగి వస్తారో వారు కూడా స్వయాన్ని హిందువులమనే చెప్పుకుంటారు. కాని వారైతే దేవతలుగా అవ్వరు, స్వర్గములోకి రారు. వారు మళ్లీ ద్వాపర యుగము తర్వాత తమ సమయానుసారంగా పై నుండి దిగుతారు. స్వయాన్ని హిందువులమనే చెప్పుకుంటారు. ఆది నుండి అంత్యము వరకు పాత్ర ఉన్న మీరు మాత్రమే దేవతలుగా అవుతారు. డ్రామాలో ఇది చాలా పెద్ద యుక్తి. చాలా మంది బుద్ధిలో కూర్చోదు. అందువలన ఉన్నత పదవిని కూడా పొందలేరు.
ఇది సత్యనారాయణు కథ. వారైతే అసత్య కథలను వినిపిస్తారు, దాని ద్వారా లక్ష్మీనారాయణులుగా ఎవ్వరూ అవ్వరు. ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా అవుతారు. కలియుగములో ఉన్నదంతా అసత్యమే. అసత్య మాయ,........... రావణ రాజ్యమే అసత్యమైనది. సత్యమైన ఖండమును తండ్రి తయారు చేస్తారు. ఇది కూడా బ్రాహ్మణులైన మీకు మాత్రమే నెంబరువారు పురుషార్థానుసారం తెలుసు. ఎందుకంటే ఇది చదువు. చదువును తక్కువగా చదువుకుంటే ఫెయిల్‌ అయిపోతారు. ఈ చదువు ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చదవడమే కష్టమైపోతుంది. ప్రారంభములో చదువుకొని ఎవరైతే శరీరము వదిలి వెళ్లారో వారు అవే సంస్కారాలను తీసుకెళ్లారు. వారు మళ్లీ వచ్చి చదువుకుంటారు. నామ-రూపాలైతే మారిపోతాయి. ఆత్మకే 84 జన్మల పాత్ర లభించింది. అది భిన్న - భిన్న నామ, రూప, దేశ, కాలాలలో పాత్ర చేస్తుంది. ఇంత చిన్న ఆత్మకు ఎంత పెద్ద శరీరము లభిస్తుంది! ఆత్మ అయితే అందరిలో, అన్నిటిలో ఉంటుంది కదా. ఇంత చిన్న ఆత్మ చిన్న దోమలో కూడా ఉంది. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థము చేసుకోవలసిన విషయాలు. బాగా అర్థము చేసుకున్న పిల్లలే మాలలో మణిగా అవుతారు. మిగిలినవారు వెళ్లి పైసా(చాలా చిన్న) పదవిని పొందుకుంటారు. మీ పూల తోట ఇప్పుడు తయారవుతూ ఉంది. మొదట మీరు ముళ్లుగా ఉండేవారు. కామ వికారమనే ముల్లు చాలా చెడ్డదని తండ్రి చెప్తారు. ఇది ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. కామమే దు:ఖానికి మూల కారణము. కామమును జయిస్తేనే జగత్‌జీతులుగా అవుతారు. ఇదే కష్టమని చాలామంది అనుకుంటారు. చాలా కష్టంగా పవిత్రమవుతారు. ఎవరైతే కల్పక్రితము తయారయ్యారో వారే ఇప్పుడు తయారవుతారు. పురుషార్థము చేసి ఉన్నతాతి ఉన్నతమైన దేవతలుగా ఎవరు తయారవుతారో తెలుపబడుతుంది. నరుల నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మీగా తయారవుతారు కదా. కొత్త ప్రపంచములో స్త్రీ - పురుషులు ఇరువురూ పావనంగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇక్కడ ఇరువురూ పురుషార్థము చేయాలి. ఈ జ్ఞానాన్ని సన్యాసులు ఇవ్వలేరు. వారి నివృత్తి మార్గ ధర్మమే వేరు. ఇక్కడ భగవంతుడు స్త్రీ - పురుషులిరువురినీ చదివిస్తారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులైన తర్వాత మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవ్వాలని ఇరువురికీ చెప్తారు. అందరూ అవ్వరు. లక్ష్మీ నారాయణులకు కూడా వంశముంటుంది. వారు రాజ్యమునెలా తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగములో వీరి రాజ్యముండేదని కూడా భావిస్తారు. కానీ సత్యయుగానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. కావున ఇది అజ్ఞానమే కదా. తండ్రి చెప్తున్నారు - ఇది ముళ్ళ అడవి, అది పూల తోట. మీరిక్కడకు రాకముందు మీరు అసురులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. అలా ఎవరు తయారు చేస్తారు? బేహద్‌ తండ్రి. దేవతల రాజ్యమున్నప్పుడు ఇతర ధర్మములేవీ ఉండేవి కావు. ఇది కూడా మీరు అర్థము చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వారిని పతితులని అంటారు. ఇది బ్రహ్మకుమార - కుమారీల సభ. ఒకవేళ ఎవరైనా చెడు పని చేస్తే స్వయానికి శాపమునిచ్చుకుంటారు, రాతిబుద్ధి గలవారిగా అవుతారు. నరుని నుండి నారాయణునిగా తయారయ్యే బంగారు బుద్ధి ఉండదు. ఇది ఋజువవుతుంది. వారు మూడవ శ్రేణికి చెందిన దాస-దాసీలుగా అవుతారు. ఇప్పుడు కూడా రాజుల వద్ద దాస-దాసీలు ఉన్నారు. కొందరి ధనము మట్టిలో కలిసిపోతుంది,.............. అని కూడా గాయనముంది. అగ్ని గుండ్లు కూడా వస్తాయి. విషపు గోళీలు కూడా వస్తాయి. మృత్యువైతే తప్పకుండా వస్తుంది. మానవుల లేక అస్త్ర-శస్త్రములు మొదలైన వాటి అవసరమే లేకుండా ఉండే బాంబులను తయారు చేస్తున్నారు. బాంబుల గాలి అంతటా వ్యాపించి వెంటనే సమాప్తము చేయు విధంగా బాంబులు వదుల్తారు. ఇన్ని కోట్ల మానవులు వినాశనమవ్వాలి. ఇది చిన్న మాటనా! సత్యయుగములో ఎంత కొద్దిమంది ఉంటారు! మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్తారు. అక్కడే ఆత్మలమైన మనమందరము ఉంటాము. సుఖధామములో స్వర్గము, దు:ఖధామములో ఈ నరకముంది. ఈ చమ్రు తిరుగుతూనే ఉంటుంది. పతితంగా అయినప్పుడు దు:ఖధామంగా అవుతుంది. మళ్లీ తండ్రి సుఖధామానికి తీసుకెళ్తారు. పరమపిత పరమాత్మ ఇప్పుడు సర్వులకు సద్గతినిస్తారు. కావున ఖుషీగా ఉండాలి కదా. మనుష్యులు భయపడ్తారు. మృత్యువు ద్వారానే గతి-సద్గతి అవ్వనున్నదని అర్థము చేసుకోరు. మంచిది!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. పూలతోటలోకి వెళ్లేందుకు లోపల ఉన్న కామ, క్రోధములనే ముళ్లను తీసేయాలి. శాపము లభించే పనులేవీ చేయరాదు.
2. సత్య ఖండానికి అధికారులుగా అయ్యేందుకు సత్యనారాయణుని సత్యమైన కథను వినాలి. ఇతరులకు వినిపించాలి. ఈ అసత్యమైన ప్రపంచము నుండి అతీతంగా దూరమైపోవాలి.

వరదానము :- '' స్వదర్శన చక్రము ద్వారా మాయ చక్రములన్నిటిని సమాప్తము చేసే మాయాజీత్‌ భవ ''
స్వయాన్ని తెలుసుకోవడమంటే స్వదర్శనమగుట, చక్ర జ్ఞానాన్ని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారులుగా అవుతారో అనేక మాయ చక్రాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. దేహ భావ చక్రము, సంబంధాల చక్రము, సమస్యల చక్రము - మాయకు అనేక చక్రాలున్నాయి. 63 జన్మలు ఈ అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవ్వడం వలన మాయాజీతులుగా అయ్యారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వడం అనగా జ్ఞాన-యోగాలనే రెక్కలతో ఎగిరేకళలోకి వెళ్లడం.

స్లోగన్‌ :- '' విదేహీ స్థితిలో ఉన్నారంటే, పరిస్థితులు సహజంగా వెళ్లిపోతాయి ''

No comments:

Post a Comment