Tuesday, September 17, 2019

Telugu Murli 05/09/2019

05-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీతో మీరే మాట్లాడుకుంటూ పావనంగా అవ్వడమే మీ కర్తవ్యము. ఇతరుల గురించి చింత చేస్తూ మీ సమయాన్ని వృథా చేయకండి''
ప్రశ్న :- ఏ విషయము బుద్ధిలోకి వస్తే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి ?
జవాబు :- మేము బేహద్‌ తండ్రి సంతానము కనుక విశ్వానికి అధిపతులము, మేము దేవతలుగా అవ్వాలి - ఈ విషయము బుద్ధిలోకి వస్తే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి. మీరు చెప్పినా, చెప్పక పోయినా తమంతట తామే వదిలేస్తారు. అపవిత్ర ఆహార పానీయాలు, సారాయి మొదలైనవాటిని తమంతకు తామే వదిలేస్తారు. అందరూ వాహ్‌! అని అంటారు. మేము ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలి, 21 జన్మల రాజ్య భాగ్యము లభిస్తూ ఉంటే ఎందుకు పవిత్రంగా ఉండము! అని అంటారు.

ఓంశాంతి. తండ్రి స్మృతిలో ఉన్నారా? బుద్ధి వేరే వైపు వెళ్లడం లేదు కదా! అని క్షణ-క్షణం తండ్రి పిల్లలకు గమనమిప్పిస్తూ ఉంటారు. బాబా, మీరు వచ్చి మమ్ములను పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. పావనంగా అయితే తప్పకుండా తయారవ్వాలి. మీరు జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించగలరు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో, ఎవరికి అర్థం చేయించినా వారు వెంటనే అర్థం చేసుకుంటారు. పవిత్రంగా లేకున్నా జ్ఞానమునైతే చదువుకుంటారు. ఇది పెద్ద విషయమేమీ కాదు. 84 జన్మల చక్రము. ప్రతి యుగానికి ఇంత ఆయువు, ఇన్ని జన్మలు తీసుకుంటారు. ఎంత సహజంగా ఉంది. దీనికి స్మృతికి సంబంధము లేదు, ఇది చదువు. తండ్రి యధార్థమైన విషయాలనే తెలుపుతారు. మిగిలింది సతోప్రధానంగా అయ్యే విషయము. అది స్మృతి ద్వారా జరుగుతుంది. ఒకవేళ స్మృతి చేయకుంటే చాలా చిన్న పదవి పొందుతారు. ఇంత ఉన్నత పదవి పొందలేరు. అందువలన గమనమివ్వమని(అటెన్షన్‌) బాబా చెప్తారు. బుద్ధి యోగము తండ్రి జతలో ఉండాలి. దీనినే ప్రాచీన యోగమని అంటారు. టీచరుతో యోగము ప్రతి ఒక్కరికీ ఉండనే ఉంటుంది. స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. స్మృతి యాత్ర ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి మరియు సతోప్రధానంగా అయ్యి వాపస్‌ ఇంటికి వెళ్లాలి. ఇక చదువు అతిసహజమైనది. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. స్మృతిలోనే మాయతో యుద్ధము జరుగుతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మాయ మళ్లీ తనవైపు లాక్కొని మరిపింపజేస్తుంది. నాలోనే శివబాబా కూర్చున్నారు, నేనే శివుడిని అని అనరు. 'నేను ఆత్మను' శివబాబాను స్మృతి చేయాలి. నాలో శివబాబా ప్రవేశించారని అనేందుకు వీలు లేదు. నేను ఎవ్వరిలోనూ ప్రవేశించనని తండ్రి చెప్తారు. నేను ఈ రథములో విరాజమానమై పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. కొంతమంది మందబుద్ధి గల పిల్లలుంటారు, మంచి జిజ్ఞాసువులు వచ్చినప్పుడు వారికి సర్వీసు చేసేందుకు నేను ఆ పిల్లలలో ప్రవేశించి దృష్టినివ్వగలను. సదా అలా కూర్చుండిపోను. బహురూపాలను ధరించి ఎవరి కళ్యాణమునైనా చేయగలను. అంతేకాని నాలో శివబాబా ప్రవేశించారు, శివబాబా నాకు ఇది చెప్తున్నారని ఎవ్వరూ చెప్పలేరు. శివబాబా తన పిల్లలకే అర్థం చేయిస్తారు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. వారే పావన ప్రపంచానికి వెళ్లగలరు. 84 జన్మల చక్రమును చాలా సహజంగా అర్థం చేయిస్తారు. చిత్రాలు ఎదురుగానే ఉన్నాయి. తండ్రి తప్ప ఇంత జ్ఞానమునెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మకే జ్ఞానము లభిస్తుంది. దానినే జ్ఞాన మూడవ నేత్రము అని అంటారు. ఆత్మయే సుఖ-దు:ఖాలను అనుభవిస్తుంది, దానికి ఈ శరీరముంది కదా. ఆత్మయే దేవతగా అవుతుంది. వ్యాపారిగా, న్యాయవాదిగా అయ్యేది ఆత్మయే. కావున తండ్రి కూర్చుని ఆత్మలతో మాట్లాడ్తారు, తమ పరిచయమునిస్తారు. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మనుష్యులుగానే ఉండేవారు, అయితే పవిత్రమైన ఆత్మలుగా ఉండేవారు. ఇప్పుడు మీరు పవిత్రంగా లేరు. కావున మిమ్ములను దేవతలని అనరు. ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అందుకు తండ్రిని స్మృతి చేయాలి. తరచుగా బాబా, దేహాభిమానానికి వశమై మా నుండి తప్పు జరిగిపోయిందని పిల్లలు అంటారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - తప్పకుండా పావనంగా అవ్వాలి. ఏ వికర్మలు చేయకండి. మీరు సర్వ గుణ సంపన్నులుగా ఇక్కడనే తయారవ్వాలి. పావనంగా అయితే ముక్తిధామానికి వెళ్లిపోతారు. మరే ప్రశ్న అడిగే అవసరమే లేదు. మీతో మీరే మాట్లాడుకోండి, ఇతర ఆత్మల గురించి చింత చేయకండి. యుద్ధములో 2 కోట్ల మంది చనిపోయారని చెప్తారు. ఇన్ని ఆత్మలు ఎక్కడకెళ్లాయి! అరే! వారు ఎక్కడికైనా వెళ్లనీ, మీకేం నష్టము. మీరెందుకు సమయాన్ని వృథా చేస్తారు? ఏ ఇతర విషయాన్ని గురించి అడిగే అవసరమే లేదు. పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వడమే మీ కర్తవ్యము. ఇతర విషయాలలోకి వెళ్తే తికమకపడిపోతారు. పూర్తి సమాధానము లభించకపోతే కొందరు సంశయపడ్తారు.
తండ్రి చెప్తున్నారు - మన్మనాభవ, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి, మీరు నా వద్దకే రావాలి. మానవులు చనిపోతే వారిని శ్మశానానికి తీసుకెళ్తారు. అప్పుడు ముఖమును ఇటువైపు, కాళ్లను శ్మశానము వైపు ఉంచుతారు. తర్వాత మళ్లీ శ్మశానము వద్దకు వెళ్లినప్పుడు పాదాలను ఇటువైపు, ముఖమును శ్మశానము వైపు తిప్పుతారు. మీ ఇల్లు కూడా పైన ఉంది కదా. పతితులెవ్వరూ పైకి వెళ్లలేరు. పావనంగా అయ్యేందుకు బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. తండ్రి వద్దకు ముక్తిధామానికి వెళ్లాలి. పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయండి, విముక్తి చేయండి అని నన్ను పిలుస్తారు. కావున ఇప్పుడు పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. తండ్రి ఏ భాషలో అర్థం చేయిస్తారో కల్ప-కల్పము అదే భాషలో అర్థం చేయిస్తారు. ఇతని(బ్రహ్మ) భాష ఏదో ఆ భాషలోనే అర్థం చేయిస్తారు కదా. ఈ రోజుల్లో హిందీ చాలా ఎక్కువ వాడుకలో ఉంది. భాష ఏమీ మారదు. సంస్కృతము మొదలైనవి దేవతల భాషలేమీ కాదు. హిందూ ధర్మము వారి భాష సంస్కృతము కాదు. హిందీయే ఉండాలి. మరి సంస్కృతమును ఎందుకు తీసుకుంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి. ఇక ఏ ఇతర విషయాలలోకి వెళ్లరాదని తండ్రి చెప్తారు. ఇన్ని దోమలు పుడ్తున్నాయి, అవన్నీ ఎక్కడికెళ్తాయి. భూకంపము వచ్చినప్పుడు చాలామంది అక్కడిక్కడే మరణిస్తారు. అప్పుడు ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఈ విషయాలను గురించి మీకెందుకు? ఎక్కడికిపోతే మీకేమి? మీ ఉన్నతి కొరకు పురుషార్థము చేయండి. ఇతరుల గురించి చింత చేయకండి అని మీకు తండ్రి శ్రీమతమునిచ్చారు. అయితే అనేక విషయాల గురించి చింతన జరుగుతుంది. నన్ను స్మృతి చేయండి చాలు, దేని కొరకు పిలిచారో దాని అనుసారము నడుచుకోండి. మీరు తండ్రి ద్వారా వారసత్వమును తీసుకోవాలి, ఇతర విషయాలలోకి వెళ్లరాదు. అందుకే బాబా పదే పదే అటెన్షన్‌ అని అంటారు. బుద్ధి ఎక్కడకూ వెళ్లలేదు కదా! భగవంతుని శ్రీమతమును అంగీకరించాలి. కదా. ఇతర ఏ విషయాల వలన లాభము లేదు. ముఖ్యమైన విషయము పావనంగా అవ్వడం. మన బాబా తండ్రి, టీచరు, సద్గురువు అని పక్కాగా గుర్తుంచుకోండి. వారు మన తండ్రి మరియు మనలను చదివిస్తున్నారు, యోగమును నేర్పిస్తున్నారని మనసులో తప్ప గుర్తుంచుకోవాలి. టీచరు చదివిస్తారు కనుక బుద్ధియోగము టీచరు పౖెెకి, చదువు పైకి కూడా వెళ్తుంది. తండ్రి కూడా ఇదే చెప్తున్నారు - మీరు పిల్లలుగా ఏమో అయ్యారు కనుకనే ఇక్కడ కూర్చున్నారు. టీచరు ద్వారా చదువుకుంటున్నారు. ఎక్కడున్నా తండ్రివారిగానే ఉంటారు, చదువు పై గమనమివ్వాలి. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, మీరు సతోప్రధానంగా అవుతారు. ఈ జ్ఞానాన్ని మరెవ్వరూ ఇవ్వలేరు. మనుష్యులు ఘోర అంధకారములో ఉన్నారు కదా! జ్ఞానములో ఎంత శక్తి ఉందో చూడండి. శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి ద్వారా శక్తి లభిస్తుంది, దీని ద్వారా మీరు పావనంగా అవుతారు. చదువు కూడా సింపుల్‌దే(సాధారణమైనది). ఆ చదువులో అయితే చాలా నెలలు పడ్తుంది. ఇక్కడైతే కోర్సు 7 రోజులే. 7 రోజులలో అంతా అర్థం చేసుకుంటారు. కానీ బుద్ధి పై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ సమయము పడ్తుంది. కొందరైతే 2-3 రోజులలోనే బాగా అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడం, పవిత్రంగా అవ్వడం ముఖ్యమైనది. కాని ఇందులోనే కష్టమవుతుంది. ఇక చదువు అయితే చాలా సాధారణమైనది(సులభము). స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఒక రోజు ఇచ్చే కోర్సులో కూడా అంతా అర్థం చేసుకోవచ్చు. మనము ఆత్మలము, అనంతమైన తండ్రి పిల్లలము కావున తప్పకుండా మనము విశ్వాధికారులము. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. దేవతలుగా అవ్వాలంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలో ఉంటాయో, వారు వెంటనే పాత అలవాట్లన్నీ వదిలేస్తారు. మీరు చెప్పినా చెప్పకపోయినా వారే వదిలేస్తారు. అపవిత్ర ఆహార పానీయాలు, మత్తు పానీయాలు, సారాయి మొదలైనవాటిని వారంతకు వారే వదిలేస్తారు. ఓహో! నేను ఈ విధంగా తయారవ్వాలి. 21 జన్మలకు రాజ్యము లభిస్తూ ఉంటే పవిత్రంగా ఎందుకు ఉండము? అని అంటారు. హత్తుకొని పోవాలి. స్మృతియాత్ర ముఖ్యమైనది. 84 జన్మల జ్ఞానమైతే ఒక్క సెకండులో లభిస్తుంది. చూడగానే అర్థం చేసుకుంటారు. కొత్త వృక్షము తప్పకుండా చిన్నదిగానే ఉంటుంది. ఇప్పుడైతే ఎంత పెద్ద వృక్షమై తమోప్రధానమైపోయింది! మళ్లీ రేపు కొత్తదిగా, చిన్నదిగా అయిపోతుంది. ఈ జ్ఞానము ఎప్పుడూ, ఎక్కడా లభించదని మీకు తెలుసు. ఇది చదువు. మొదట తండ్రిని స్మృతి చేయాలనే ముఖ్యమైన శిక్షణ కూడా లభిస్తుంది. తండ్రి చదివిస్తున్నారని నిశ్చయము చేసుకోండి. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇలా ఏ మనిషీ చెప్పలేడు. టీచరు చదివిస్తున్నప్పుడు టీచరును తప్పకుండా స్మృతి చేస్తారు కదా. అనంతమైన తండ్రి కూడా ఉన్నారు. తండ్రి మనలను స్వర్గాధికారులుగా చేస్తారు కానీ ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుందో ఎవ్వరూ తెలుపలేరు. స్వయాన్ని భగవంతుడని లేక ఏమని చెప్పుకున్నా పావనంగా చేయలేరు. ఈ రోజుల్లో చాలామంది భగవంతులైపోయారు. మనుష్యులు తికమకపడిపోతున్నారు. అనేక ధర్మాలు వెలువడుతున్నాయి. సరైనది ఏదో ఎలా తెలుస్తుందని అంటారు. మీ ప్రదర్శిని లేక మ్యూజియమ్‌ మొదలైన వాటిని ప్రారంభము చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. వాస్తవానికి ప్రారంభమయ్యే ఉంది. మొదట పునాది వేస్తారు, తర్వాత ఇల్లు పూర్తిగా తయారైపోయినప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది. పునాది వేసేందుకు కూడా పిలుస్తారు, కావున దీనిని కూడా తండ్రి స్థాపించేశారు. ఇక కొత్త ప్రపంచము ఉద్ఘాటన జరగాల్సిందే. అక్కడ ఎవ్వరూ ఉద్ఘాటన చేసే అవసరముండదు. స్వతహాగానే ఉద్ఘాటన జరిగిపోతుంది. ఇక్కడ చదువుకున్న తర్వాత మనము నూతన ప్రపంచములోకి వెళ్లిపోతాము.
మనమిప్పుడు స్థాపన కొరకే శ్రమ పడవలసి ఉంటుందని మీకు తెలుసు. వినాశనము జరిగిన తర్వాత ఈ ప్రపంచమే మారిపోతుంది. మళ్లీ కొత్త ప్రపంచములో రాజ్య పాలన చేసేందుకు మీరు వస్తారు. సత్యయుగమును తండ్రియే స్థాపించారు. తర్వాత మీరు వస్తే స్వర్గ రాజధాని లభిస్తుంది. ఇక ప్రారంభోత్సవము ఎవరు చేస్తారు? తండ్రి అయితే స్వర్గములోకి రారు. స్వర్గములో ఏమేమి జరుగుతాయో వెళ్లి చూడండి. చివరిలో ఏమవుతుందో మున్ముందు తెలుసుకుంటారు. పవిత్రత లేకుండా గౌరవపూర్వకంగా మనము స్వర్గానికి వెళ్లలేమని మీకు తెలుసు. పెద్ద పదవిని కూడా పొందలేము అందువలన బాగా పురుషార్థం చేయండి అని తండ్రి చెప్తారు. వ్యాపార-ఉద్యోగాలు కూడా భలే చేయండి కానీ ఎక్కువ ధనము ఏమి చేసుకుంటారు? తినలేరు కదా! మీ పిల్లలు, మనవళ్లు మొదలైనవారు కూడా తినలేరు. అంతా మట్టిలో కలిసిపోతుంది. అందువలన యుక్తిగా కొద్దిగా స్టాక్‌ ఉంచుకోండి. మిగిలినదంతా అక్కడకు బదిలీ చేయండి. అందరూ ట్రాన్స్‌ఫర్‌ చేయలేరు. పేదలు త్వరగా ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. భక్తిమార్గంలో కూడా మరు జన్మ కొరకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు కానీ అది పరోక్షము, ఇది ప్రత్యక్షము. పతిత మానవులు పతితులతోనే ఇచ్చి పుచ్చుకుంటారు. ఇప్పుడైతే తండ్రి వచ్చారు కావున మీరు పతితులతో ఇచ్చి పుచ్చుకోలేరు. మీరు బ్రాహ్మణులు, బ్రాహ్మణులకే సహాయం చేయాలి. సర్వీసు చేస్తున్నవారికి సహయోగము అవసరముండదు. ఇక్కడకు పేదవారు, షాహుకార్లు అందరూ వస్తారు. ఇక కోటీశ్వరులు అతికష్టముతో వస్తారు. నేను పేదల పెన్నిధినని తండ్రి చెప్తారు. భారతదేశము చాలా పేద ఖండము. నేను భారతదేశములోనే వస్తానని తండ్రి చెప్తారు. అందులో కూడా ఈ ఆబూ సర్వ శ్రేష్ఠ తీర్థ స్థానము. తండ్రి ఇక్కడికే వచ్చి విశ్వమంతటికీ సద్గతినిస్తారు. ఇది నరకము. నరకము మళ్లీ స్వర్గంగా ఎలా అవుతుందో మీకు తెలుసు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. పావనంగా అయ్యేందుకు తండ్రి తెలిపే యుక్తి ద్వారా అందరికీ కళ్యాణము జరుగుతుంది. సత్యయుగములో అకళ్యాణమను మాటే ఉండదు. విలపించడము, బాదుకోవడము మొదలైనవేవీ ఉండవు. జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు అని ఇప్పుడు తండ్రికి ఉన్న మహిమ మీకు కూడా ఉంది. మీరు కూడా ఆనంద సాగరులుగా అవుతారు, చాలామందికి సుఖమునిస్తారు. తర్వాత మీ ఆత్మ సంస్కారాన్ని తీసుకొని కొత్త ప్రపంచానికి వెళ్లినప్పుడు మీ మహిమ మారిపోతుంది. అక్కడ మిమ్ములను సర్వ గుణ సంపన్నులు,.......... అని అంటారు. ఇప్పుడు మీరు నరకములో ఉన్నారు, దీనిని ముళ్ల అడవి అని అంటారు. తండ్రినే తోట యజమాని, నావికుడు అని అంటారు. మా నావను తీరానికి చేర్చమని కూడా పాడ్తారు ఎందుంటే ఆత్మ దు:ఖములో ఉంది. అందుకే వేడుకుంటుంది. మహిమ చేస్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. నోటికి ఏది వస్తే అది అంటూ ఉంటారు. సర్వ శ్రేష్ఠ భగవంతుని నిందిస్తూ ఉంటారు. మేము ఆస్తికులము, అందరి సద్గతిదాత అయిన తండ్రిని మేము తెలుసుకున్నామని మీరు చెప్తారు. తండ్రియే స్వయంగా తమ పరిచయమునిచ్చారు. మీరు భక్తి చేయరు కావున మిమ్ములను చాలా ఇబ్బంది పెడ్తారు. వారు ఎక్కువ మంది ఉన్నారు, మీరు తక్కువ మంది ఉన్నారు. తర్వాత మీరు ఎక్కువగా అయినప్పుడు వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. బుద్ధి తాళము తెరచుకుంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తమ ఉన్నతి గురించే చింతన చేయాలి. ఇతర ఏ విషయాలలోకి వెళ్లరాదు. చదువు మరియు స్మృతి పై పూర్తిగా గమనమివ్వాలి. బుద్ధిని భ్రమింప చేయరాదు.
2. ఇప్పుడు తండ్రి ప్రత్యక్షంగా వచ్చారు కనుక తమకున్నదంతా యుక్తిగా ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. పతిత ఆత్మలతో ఇచ్చి పుచ్చుకోరాదు. గౌరవపూర్వకంగా స్వర్గములోకి వెళ్లాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.

వరదానము :- '' యోగం ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే డబల్‌ లైట్‌ ఫరిస్తా భవ ''
హఠయోగులు శరీరాన్ని పైకి ఎత్తుతారు(గాలిలో పైకి లేపుతారు). మీరు ఎక్కడ ఉంటున్నా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందువలన యోగులు ఉన్నతంగా శ్రేష్ఠంగా ఉంటారని అంటారు. మీ మానసిక స్థితి ఉన్నతమైన స్థానములో (పరంధామం, సూక్ష్మలోకం) ఉంటుంది. ఎందుకంటే డబల్‌ లైట్‌గా అయ్యారు. లౌకికంలో కూడా ఫరిస్తాల పాదాలు భూమి పై ఉండవని అంటారు. ఫరిస్తాలనగా వారి బుద్ధి రూపి పాదము భూమి పై ఉండరాదు, దేహ భావములో ఉండరాదు, పాత ప్రపంచము పై ఎలాంటి ఆకర్షణ ఉండరాదు.

స్లోగన్‌ :- '' ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను సంపన్నము చేసుకుంటే మీ (జడ) చిత్రాల ద్వారా అందరికి అనేక జన్మలు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి.''

No comments:

Post a Comment