25-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మాయను వశం చేసుకునే మంత్రం - 'మన్మనాభవ,' ఈ మంత్రంలోనే అన్ని గొప్పతనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మంత్రమే మిమ్ములను పవిత్రంగా చేసేస్తుంది ''
ప్రశ్న :- ఆత్మకు నంబర్ వన్ సేఫ్టీ(భద్రత) సాధనం ఏది? ఎలా?
జవాబు :- స్మృతియాత్రయే నంబర్ వన్ సేఫ్టీ సాధనం, ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావము (క్యారెక్టర్) సంస్కరింపబడుతుంది, మీరు మాయ పై మీరు విజయం పొందుతారు. స్మృతితో పతితమైన కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. స్మృతితోనే బలం వస్తుంది. జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును కావాలి. స్మృతితోనే సతోప్రధానంగా అవుతారు. ఎవ్వరి పై కోపగించరు. అందుకే స్మృతియాత్రలో బలహీనంగా అవ్వరాదు. మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నామని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి.
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రతి రోజూ అప్రమత్తం(హెచ్చరిక) చేయాల్సి ఉంటుంది. ఏ హెచ్చరిక? సేఫ్టీ ఫస్ట్(మొదట భద్రత) ఎటువంటి సేఫ్టీ ? స్మృతియాత్ర ద్వారా మీరు చాలా చాలా సేఫ్(భద్రం)గా ఉంటారు. పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఇదే. తండ్రి అర్థం చేయించారు - పిల్లలైన మీరు స్మృతియాత్రలో ఎంతగా తత్పరులై ఉంటారో, అంత సంతోషము కూడా ఉంటుంది. పావనంగా అవ్వాలి కనుక నడవడిక(మ్యానర్స్) కూడా సరిగ్గా ఉంటుంది. స్వభావమును కూడా సరిదిద్దుకోవాలి. తమను తాము బాగా పరిశీలించుకోవాలి - '' నా స్వభావము (క్యారెక్టర్) ఎవ్వరినీ దు:ఖపరిచేదిగా లేదు కదా! నాకు ఎలాంటి దేహాభిమానమైతే రావడం లేదు కదా? '' ఈ విధంగా బాగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటారు, ఇతరులను చదివిస్తారు కూడా. అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు, మిగిలిన వారందరూ దేహధారులు. ఇందులో మొత్తం ప్రపంచం అంతా వచ్చేస్తుంది. ఒక్క తండ్రి మాత్రమే విదేహి. వారు పిల్లలైన మీరు కూడా విదేహులుగా అవ్వాలని చెప్తున్నారు. మిమ్ములను విదేహిగా చేసేందుకే నేను వచ్చాను. పవిత్రంగా అయితేనే అక్కడికి వెళ్తారు. ఛీ - ఛీ(అపవిత్రం)గా ఉన్నవారిని వెంట తీసుకెళ్లరు. అందుకే మొట్టమొదట ఈ మంత్రమే ఇస్తారు. ఈ మంత్రము మాయను వశం చేసుకునేది. ఇది పవిత్రంగా అయ్యే మంత్రము. ఈ మంత్రంలో చాలా గొప్పతనాలు నిండి ఉన్నాయి. దీనితోనే పవిత్రంగా అవ్వాలి. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము. అందుకే తండ్రి చెప్తున్నారు - మీకు సేఫ్టీ కావాలన్నా, బలవంతులై మహావీరులుగా అవ్వాలన్నా ఈ పురుషార్థం చేయండి. తండ్రి ఏమో శిక్షణను ఇస్తూ ఉంటారు. భలే! డ్రామా అని కూడా చెప్తూ ఉంటారు. డ్రామా అనుసారం పూర్తి ఖచ్చితంగా నడుస్తోంది. ఇంకా భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. స్మృతియాత్రలో బలహీనం అవ్వరాదు. వెలుపల బంధనాలలో ఉండే గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఎదుట ఉండేవారు కూడా స్మృతి చేయరు. ఎందుకంటే వారికి శివబాబాను కలవాలన్న తపన ఉంటుంది. కలిసినవారికి కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందగలరు. మంచి-మంచి, పెద్ద పెద్ద సెంటర్లు సంభాళించే ముఖ్యమైనవారు కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉండటం గమనించబడింది. స్మృతి పదును చాలా బాగుండాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి పదును లేనందునే ఎవ్వరికీ బాణం(గురి) తగలడమే లేదు. పూర్తిగా మరణించటం లేదు. జ్ఞాన బాణం వేసి, తండ్రివారిగా లేక మరజీవగా తయారు చేసేందుకు పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరణించరు అనగా తప్పకుండా జ్ఞాన ఖడ్గంలో ఏదో గడబిడ ఉంది. డ్రామా పూర్తి ఆక్యురేట్‌గా నడుస్తోంది అని బాబాకు భలే తెలుసు. కానీ జరగబోయేదాని గురించి ఏమి చేయాలో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కదా! ప్రతి ఒక్కరూ మేము ఎంత స్మృతి చేస్తున్నామని తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. స్మృతి ద్వారానే బలం వస్తుంది. అందుకే జ్ఞాన ఖడ్గానికి పదును ఉండాలని అంటారు. జ్ఞానమైతే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు.
ఎంతెంత స్మృతిలో ఉంటారో, అంత మధురంగా అవుతూ ఉంటారు. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. మీ స్వభావము కూడా చాలా మధురంగా ఉండాలి. ఎప్పుడూ కోపపడరాదు. ఇతరులు అసంతుష్టంగా అయ్యే వాతావరణం ఉండరాదు. ఈ ఈశ్వరీయ కాలేజిని స్థాపన చేయు సేవ చాలా ఉన్నతమైనది కనుక అందుకు ప్రయత్నం చేయాలి. విశ్వ విద్యాలయాలైతే భారతదేశంలో చాలా కీర్తించబడ్తున్నాయి. వాస్తవానికి అవి విశ్వవిద్యలయాలే కాదు. విశ్వ విద్యాలయం అయితే ఒక్కటే ఉంటుంది. తండ్రి వచ్చి అందరికి ముక్తి-జీవన్ముక్తులనిస్తారు. మొత్తం ప్రపంచములో ఉన్న మనుష్యులందరూ సమాప్తమవుతారని తండ్రికి తెలుసు. ఛీ-ఛీ ప్రపంచాన్ని సమాప్తం చేసి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేయమనే తండ్రిని పిలిచారు. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు కూడా తెలుసు. మాయ ఆడంబరం(డాంబికం) ఇప్పుడు ఎంతగా ఉంది! ఫాల్ ఆఫ్ పాంపియా(ఖీaశ్రీశ్రీ ూట ూశీఎజూ) అను ఒక ఆటను కూడా చూపిస్తారు. పెద్ద పెద్ద గృహాలు మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇదే ఆడంబరం(అట్టహాసము). సత్యయుగంలో ఇన్ని అంతస్థుల భవనాలు నిర్మించరు. ఉండేందుకు స్థలం తక్కువగా ఉంది కనుక ఇక్కడ నిర్మిస్తారు. వినాశన సమయంలో పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి. ఇంతకుముందు ఇంతింత పెద్ద భవనాలు నిర్మించేవారు కాదు. బాంబులు వేశారంటే భవనాలు పేకముక్కల వలె కూలిపోతాయి. దీని అర్థం ఆ భవనాల్లో ఉండేవారే మరణిస్తారు, మిగిలినవారు అలాగే ఉంటారని కాదు. సముద్రంలో ఉన్నా, భూమి పై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పర్వతాల పై ఉన్నా, ఎగురుతూ ఉన్నా,............ ఎక్కడ ఉన్నవారైనా సమాప్తమైపోతారు. ఇది పాత ప్రపంచం కదా! 84 లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. అక్కడి నూతన ప్రపంచములో ఇవేవీ జరగవు. ఇంతమంది మనుష్యులూ ఉండరు, దోమలు, జీవ జంతువులు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడైతే లెక్కలేనన్ని ఉన్నాయి! ఇప్పుడు పిల్లలైన మీరు కూడా దేవతలుగా అయితే, అక్కడ ప్రతి వస్తువూ సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ కూడా గొప్పవారి ఇళ్లకు వెళ్తే అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు. గొప్ప మనుష్యులు అని కూడా అనరు, మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు. ఇది క్రొత్త విషయమేమీ కాదు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీరు నంబరువారీగా ఇలా అయ్యారు. ఇక్కడ ఉన్నంత చెత్త మొదలైనవేవీ అక్కడ ఉండవు. మనము కూడా చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతామని పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. ఒక్క తండ్రియే మనలను చదివించి చాలా ఉన్నతంగా చేస్తారు. చదువులో నంబరువారీ పొజిషన్ వారు ఎప్పుడూ ఉంటారు. కొంతమంది తక్కువగా చదువుతారు, కొంతమంది ఎక్కువగా(బాగా) చదువుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగము కూడా మహిమ చేయబడింది. ముఖ్యంగా విదేశీయులకు రాజయోగం నేర్చుకోవాలని చాలా ఉత్సుకత ఉంటుంది. భారతవాసులదైతే తమోప్రధాన బుద్ధి. వారిది తమో బుద్ధి అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. భారతదేశ ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి గాంచింది. దాని ద్వారానే భారతదేశము స్వర్గముగా అయ్యింది. పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే వస్తారు. స్వర్గం, హెవెన్ ఏదైతే ఒకప్పుడు ఉండి పోయిందో అది మళ్లీ తప్పకుండా వస్తుంది. హెవెన్ అంటే ప్యారడైజ్. అది ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప అద్భుతము. స్వర్గం అను పేరు ఎంత ప్రసిద్ధి గాంచింది! స్వర్గము-నరకము, శివాలయం - వేశ్యాలయం. పిల్లలకు మనం ఇప్పుడు శివాలయానికి వెళ్లాలని నంబరువారిగా గుర్తుంది. అక్కడకు వెళ్లేందుకు శివబాబాను స్మృతి చేయాలి. వారే అందరినీ తీసుకొని వెళ్లే మార్గదర్శకులు. భక్తిని రాత్రి అని అంటారు. జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది అనంతమైన విషయం. క్రొత్త వస్తువుకు, పాత వస్తువుకు చాలా తేడా ఉంటుంది. ఇంత ఉన్నతాతి ఉన్నతమైన చదువును, ఉన్నతమైన భవనాల్లో మనం చదివిస్తే గొప్ప గొప్పవారు వస్తారని పిల్లల మనసులో ఉంటుంది(ఇష్టపడ్తారు). కూర్చొని ఒక్కొక్కరికి అర్థం చేయించాల్సి ఉంటుంది. వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు స్థానము ఏకాంతములో ఉంటుంది. బ్రహ్మ జ్ఞానుల ఆశ్రమాలు కూడా పట్టణాల నుండి దూరంగా క్రిందే ఉంటాయి. ఇంత పై అంతస్థులలో ఉండవు. ఇప్పుడైతే తమోప్రధానంగా అవ్వడంతో పట్టణాలలోకి చొచ్చుకొని వచ్చేశారు. ఆ బలం సమాప్తమైపోయింది. ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీ అయ్యింది. ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి - ఈ తండ్రి తప్ప ఇంకెవ్వరూ బ్యాటరీని చార్జ్ చేయలేరు. బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటేనే పిల్లలకు బలం వస్తుంది. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి. స్మృతిలోనే మాయ విఘ్నాలు వస్తాయి. కొంతమంది సర్జన్‌కు సత్యం చెప్తారు. కొంతమంది దాచుకుంటారు. లోపల ఉన్న లోపాలు తండ్రికి తెలుపవలసి ఉంటుంది. ఈ జన్మలో చేసిన పాపం ఆ అవినాశీ సర్జన్‌కు వర్ణించి చెప్పాలి. లేకపోతే అది మనసును తింటూ ఉంటుంది. వినిపించిన తర్వాత ఇక తినేయదు. లోపల ఉంచుకోవడం - ఇది కూడా నష్టము కలిగిస్తుంది. సత్యమైన పిల్లలు, ఈ జన్మలో ఈ ఈ ఈ పాపాలు చేశామని అన్ని విషయాలు తండ్రికి తెలిపేస్తారు. ఇది మీ అంతిమ జన్మ అని ప్రతి రోజూ తండ్రి నొక్కి చెప్తూ ఉంటారు. తమోప్రధానత ద్వారా పాపాలు తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా!
తండ్రి చెప్తున్నారు - చాలా జన్మల అంతిమంలో నంబర్‌వన్ పతితంగా అయిన వారిలోనే నేను ప్రవేశిస్తాను. ఎందుకంటే అతనే మళ్లీ నంబర్‌వన్‌లోకి వెళ్లాలి. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో కూడా చాలా పాపాలు జరిగాయి కదా! తాము ఏమి చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. నిజం చెప్పరు. కొంతమంది నిజం చెప్పేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! కర్మాతీత అవస్థ తయారైనప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. మనుష్యులు వృద్ధులుగా అయినప్పుడు కర్మేంద్రియాలు ఆటోమేటిక్‌గా శాంతమైపోయినట్లు శాంతమైపోతాయి. ఇందులో అయితే చిన్నతనంలోనే అన్నీ శాంతంగా అయిపోవాలి. యోగబలం బాగా ఉంటే ఈ విషయాలన్ని అంతమైపోతాయి. అక్కడ ఇటువంటి మురికి రోగాలు, చెత్త మొదలైనవి ఏవీ ఉండవు. మనుష్యులు చాలా శుభ్రంగా, శుద్ధంగా ఉంటారు. అక్కడ ఉండేదే రామ రాజ్యం. ఇది రావణ రాజ్యం. అందుకే అనేక రకాల అశుద్ధమైన రోగాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగంలో ఇవేవీ ఉండవు. ఎంత బాగుంటుందో వర్ణించలేము. పేరు ఎంత ఫస్ట్‌క్లాస్‌గా ఉంది! - స్వర్గము, కొత్త ప్రపంచము. చాలా శుభ్రత ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు ఈ విషయాలన్నీ వింటారు. నిన్న వినలేదు. నిన్న మృత్యులోకానికి అధిపతులు, ఈ రోజు అమరలోకానికిి యజమానులుగా అవుతారు. నిన్న మృత్యులోకంలో ఉండేవారమని, ఇప్పుడు సంగమ యుగంలోకిి రావడంతో అమరలోకంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారని నిశ్చయమైపోయింది. చదివించేవారు కూడా ఇప్పుడు లభించారు. బాగా చదువుకుంటే ధనము మొదలైనవి కూడా బాగా సంపాదిస్తారు. బలిహారము చదువుదే అని అంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ చదువుతో చాలా ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు కూడా మాటి మాటికీ మర్చిపోతారు, పాత ప్రపంచములోకి వెళ్లిపోతారు. మర్చిపోవడం అనగా పాత ప్రపంచంలోకి వెళ్లిపోవడం.
ఇప్పుడు మేము కలియుగంలో లేమని సంగమయుగ బ్రాహ్మణులైన మీకు తెలుసు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని సదా గుర్తుంచుకోవాలి. తండ్రి మమ్ములను నూతన ప్రపంచానికి తీసుకెళ్లేందుకే చదివిస్తున్నారు. ఇది శుద్ధమైన అహంకారం. అది అశుద్ధమైన అహంకారం. పిల్లలైన మీకు ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలు రాకూడదు. పురుషార్థం చేయగా చేయగా ఆఖరికి చివర్లో రిజల్టు వెలువడ్తుంది. ఈ సమయం వరకు అందరూ పురుషార్థులేనని తండ్రి అర్థం చేయిస్తారు. పరీక్షలు జరిగినప్పుడు నంబరువారీగా పాస్ అయ్యి ట్రాన్స్‌ఫర్ అయిపోతారు. మీది అనంతమైన చదువు. దాని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు ఎంతగా అర్థం చేయిస్తారు! కొత్త కొత్త వారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వస్తూ ఉంటారు. భలే! దూరంగా ఉంటారు, అయినా వింటూ వింటూ ఇటువంటి బాబా సన్ముఖంలోకి వెళ్లాలని నిశ్చయబుద్ధి గలవారిగా అవుతారు. ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో, అటువంటి తండ్రిని సన్ముఖంలో తప్పకుండా కలవాలని భావించే ఇక్కడకు వస్తారు. ఎవరికైనా అర్థం తెలియకపోయినా ఇక్కడికి రావడంతో అర్థమైపోతుంది. మనసులో ఏ విషయం ఉన్నా, అర్థం కాకపోయినా భలే అడగండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఆయస్కాంతం కదా! ఎవరి అదృష్టంలో ఉందో వారు బాగా పట్టుకోగలరు. అదృష్టంలో లేకుంటే సమాప్తమైపోతారు. విని విననట్లు వదిలేస్తారు. ఇక్కడ ఎవరు కూర్చుని చదివిస్తున్నారు? భగవంతుడు. వారి పేరు శివ. శివబాబాయే మనకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు. మరి ఏ చదువు మంచిది? శివబాబా మమ్ములను చదివించే చదువుతో 21 జన్మల చక్రవర్తి పదవి లభిస్తుందని మీరు అంటారు. ఇలా ఇలా అర్థం చేయిస్తూ చేయిస్తూ తీసుకెళ్తారు. కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా అంత సేవ చేయలేరు. బంధనాల సంకెళ్ళలో చిక్కుకొని ఉంటారు. ప్రారంభంలో అయితే మీ సంకెళ్లను ఎలా మీరు విడిపించుకొని వచ్చారు! మత్తెక్కిన వారి వలె వచ్చేశారు. ఇలా ఆకర్షితులవ్వడం కూడా డ్రామాలో ఉంది. డ్రామాలో భట్టీ తయారవ్వాల్సి ఉంది. జీవిస్తూ మరణించారు, మళ్లీ కొంతమంది మాయ వైపుకు వెళ్లిపోయారు. యుద్ధం అయితే జరుగుతుంది కదా! వీరు చాలా ధైర్యం చూపించారు మరి పక్కాగా ఉన్నారా? లేదా? అని నేను కూడా తట్టి(దెబ్బ వేసి) చూస్తానని మాయ గమనిస్తూ ఉంటుంది. పిల్లలను చాలా సంభాళన చేశారు. అన్నీ నేర్పించేవారు. పిల్లలైన మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తూ ఉంటారు కానీ కేవలం చిత్రాలు చూచినందున అర్థం చేసుకోలేరు. భట్టీలో ఎలా ఉండేవారో, ఏమేమి జరిగాయో ఎవరెవరు ఎలా వచ్చారో ఎవరైనా కూర్చుని అర్థం చేయించాలి. రూపాయలు ముద్రించేటప్పుడు కూడా కొన్ని కొన్ని చెడిపోతుంటాయి కదా. ఇది కూడా ఈశ్వరీయ మిషనరీ. ఈశ్వరుడు కూర్చుని ధర్మ స్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. తండ్రిని కూడా పిలుస్తారు కానీ వేడి పెనం వలె ఏమీ అర్థం చేసుకోరు. ఇది ఎలా జరుగుతుంది అని అంటారు. మాయా రావణుడు వారిని అలా తయారు చేస్తాడు. శివబాబాను కూడా పూజిస్తూ ఉంటారు మళ్లీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. శివబాబా అని పిలుస్తుంటారు, మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు! లింగ పూజ చేస్తుంటారు, ఆ లింగాన్నే శివుడని పిలుస్తారు. లింగములో శివుడు కూర్చున్నారని అనరు. ఇప్పుడు రాయి-రప్పలలో భగవంతుడున్నారని చెప్పడం...... మరి వీరందరూ భగవంతులేనా! భగవంతుడు అనంతముగా(అన్‌లిమిటెడ్‌గా) అయితే ఉండరు కదా. కల్పక్రితము కూడా ఇలాగే అర్థం చేయించానని తండ్రి తెలిపిస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎటువంటి మధురమైన వాతావరణం తయారుచేయాలంటే, అందులో ఎవ్వరూ కోపగించుకోరాదు. తండ్రి సమానం విదేహీగా అయ్యే పురుషార్థం చేయాలి. స్మృతి బలంతో తమ స్వభావాన్ని మధురంగా, కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి.
2. ఇది సంగమ యుగము, కలియుగము కాదు, తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారనే నషాలో సదా ఉండాలి. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసెయ్యాలి.
వరదానము :- '' శ్రేష్ఠ సంకల్ప శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ ''
మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లల సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే, ఏ సమయంలో ఏం కావాలంటే అది చేయగలరు, చేయించగలరు కూడా. ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్ఠంగా, కళ్యాణకారిగా ఉంటాయి. శ్రేష్ఠమైన కళ్యాణకారి సంకల్పము ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధమౌతుంది. మనసు సదా ఏకాగ్రం అనగా ఒక స్థిరమైన స్థానము పై స్థితమై ఉంటుంది, భ్రమించదు. ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ స్థితం చేయగలరు. దీని ద్వారా స్వతహాగా సిద్ధి స్వరూపులుగా అవుతారు.
స్లోగన్ :- '' పరిస్థితుల ఆందోళనకర ప్రభావము నుండి రక్షించుకోవాలంటే, విదేహి స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. ''
No comments:
Post a Comment