04-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు భూమి పైనున్న చైతన్య నక్షత్రాలు, మీరు మొత్తం విశ్వానికి వెలుగునివ్వాలి ''
ప్రశ్న :- పిల్లలైన మీ శరీరాన్ని శివబాబా కంచనంగా(స్వర్ణిమంగా) ఎలా తయారుచేస్తారు ?
జవాబు :- బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానమనే పాలను త్రాగించి మీ శరీరాన్ని కంచనంగా చేస్తారు, అందువలన త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ,...........అని వారిని మహిమ చేస్తూ పాడ్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మా తల్లి ద్వారా జ్ఞానమనే పాలను తాగుతున్నారు, దీని ద్వారా మీ పాపమంతా సమాప్తమైపోతుంది. కాంచనంగా అవుతారు.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్త్తున్నారు - ఆకాశములోని నక్షత్రాల వలె పిల్లలైన మిమ్ములను కూడా ఈ భూమి పైనున్న నక్షత్రాలని కీర్తిస్తారు. వాటిని కూడా నక్షత్ర దేవతలని అంటారు. అవేమీ దేవతలు కావు. కావున మీరు వాటికంటే మహాశక్తివంతులు ఎందుకంటే నక్షత్రాలైన మీరు మొత్తం విశ్వానికంతా వెలుగునిస్తారు. దేవతలుగా అయ్యేవారు మీరే. మీరే ఉత్థానమవతారు, మీరే పతనమవుతారు. అవి మండపానికి(భూమికి) వెలుతురునిస్తాయి, వాటిని దేవతలని అనరు. మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వానికంతా వెలుగునిచ్చేవారు. ఇప్పుడు విశ్వమంతటా ఘోరమైన అంధకారముంది, పతితులై పడి ఉన్నారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలను దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. మనుష్యులు అందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుడిని కూడా దేవుత అని అనేస్తారు. అక్కడక్కడ సూర్యుని జెండాను కూడా పెడ్తారు. స్వయాన్ని సూర్యవంశస్థులని కూడా చెప్పుకుంటారు. వాస్తవానికి సూర్యవంశస్థులు మీరే కదా! కావున తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. భారతదేశములోనే ఘోరమైన అంధకారమైపోయింది. ఇప్పుడు భారతదేశములోనే మళ్లీ వెలుగు రావాలి. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞానములో నిద్రపోయారు, తండ్రి వచ్చి మళ్లీ మేల్కొల్పుతున్నారు. డ్రామా ప్రణాళిక అనుసారంగా కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములో మళ్లీ వస్తానని తండ్రి అంటారు. ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి ఏ శాస్త్రాలలోనూ లేదు. ఈ యుగమును పిల్లలైన మీరే ఇప్పుడు తెలుసుకున్నారు, నక్షత్రాలుగా ఉన్న మీరే దేవతలుగా అవుతారు. నక్షత్ర దేవతాయ నమ: అని మిమ్ములనే అంటారు. మీరిప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. అక్కడ మీరు పూజ్యులుగా అవుతారు. ఇది కూడా అర్థము చేసుకోవాల్సిన విషయము కదా. దీనిని ఆత్మిక చదువు అని అంటారు. ఇక్కడ ఎప్పుడూ ఎవ్వరికీ యుద్ధము జరగదు. టీచరు సాధారణంగా చదివిస్తారు, పిల్లలు కూడా సాధారణంగా చదువుకుంటారు. ఇక్కడ ఎప్పటికీ కొట్లాట అనే విషయమే ఉండదు. ఇతడు నేను భగవంతుడను అని చెప్పడు! చదివించేవారు నిరాకార శివబాబా అని పిల్లలైన మీకు కూడా తెలుసు. వారికి తమదే అయిన శరీరము లేదు. నేను ఈ రథమును అప్పుగా తీసుకుంటానని అంటారు. భగీరథుడని కూడా ఎందుకు అంటారు? ఎందుకంటే ఇతడు అత్యంత భాగ్యశాలి రథము. ఇతడే మళ్లీ విశ్వానికి అధికారిగా అవుతాడు. కనుక ఇతడు భగీరథుడే కదా. కావున ఇవన్నీ అర్థము చేసుకోవాలి కదా. ఇది అన్నింటికంటే గొప్ప చదువు. ప్రపంచములో ఎక్కడ చూసినా అసత్యమే అసత్యముంది కదా. సత్యమైన నావ ఊగుతుంది...... కాని మునగదు(సచ్ కీ నయ్యా డోలే,........) అనే నానుడి కూడా ఉంది కదా. ఈ రోజుల్లో అనేక రకాలైన భగవంతులు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతుడనని పిలిపించుకునే విషయాన్ని వదిలేయండి. రాయి - రప్పలను కూడా భగవంతుడని అనేశారు. భగవంతుని ఎంతగా భ్రమింపజేశారు! లౌకిక తండ్రి పిల్లలకు అర్థం చేయించిన విధంగా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కాని లౌకికములో ఆ తండ్రి తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా తానే ఉండడు. మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు, తర్వాత కొద్దిగా పెరిగితే చదివించేందుకు టీచరు కావాలి. 60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే ఒక్కరే తండ్రి, టీచరు, సద్గురువుగా కూడా ఉన్నారు. నేను ఆత్మలైన మీకు తండ్రినని అంటారు. చదువుకునేది కూడా ఆత్మనే. ఆత్మను ఆత్మ అనే అంటారు. ఇక శరీరాలకైతే అనేక పేర్లున్నాయి. ఇది బేహద్ నాటకమని గుర్తుంచుకోండి. తయారు చేయబడి, తయారవుతూ ఉంది,........... క్రొత్తదేమీ కాదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా, తిరుగుతూనే ఉంటుంది. ఆత్మలు పాత్రధారులు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మన ఇల్లైన పరంధామములో ఉండేవారము, మళ్లీ బేహద్ పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తామని చెప్తారు. తండ్రి అయితే సదా అక్కడే ఉంటారు. వారు పునర్జన్మలలోకి రారు. మీకిప్పుడు రచయిత అయిన తండ్రి, తమ పరిచయాన్ని మరియు రచన యొక్క సారమంతా వినిపిస్తారు. మిమ్ములను స్వదర్శన చక్రధారీ పిల్లలని అంటారు. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వారు విష్ణువును ' స్వదర్శన చక్రధారి ' అని భావిస్తారు. మరి మానవులను అలా ఎందుకు అంటారని అనుకుంటారు. ఇది మీకు తెలుసు. శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మానవులే, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయినా మానవులుగానే ఉన్నారు, మళ్లీ దేవతలుగా అయినప్పుడు కూడా మనుష్యులుగానే ఉంటారు. కాని గుణాలు మారిపోతాయి. రావణుడు వస్తే మీ గుణాలు ఎంతగానో చెడిపోతాయి. సత్యయుగములో ఈ వికారాలు ఉండనే ఉండవు.
ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమరకథను వినిపిస్తున్నారు. భక్తిమార్గములో మీరు ఎన్ని కథలు విని ఉంటారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించాడని అంటారు. ఇప్పుడు వారికి శంకరుడు వినిపిస్తాడు కదా. శివుడు ఎలా వినిపిస్తాడు? వినేందుకు అనేకమంది మనుష్యులు వెళ్తారు. భక్తిమార్గములోని ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. భక్తి చెడ్డదని తండ్రి చెప్పరు, అనాదిగా ఉన్న డ్రామాను అర్థం చేయించడం జరుగుతుంది. మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయము. భగవానువాచ - 'మన్మనాభవ.' దీని అర్థమేమిటి? దీనిని తండ్రి వచ్చి ఇతని నోటి ద్వారా వినిపిస్తున్నారు. కనుక ఇది గోముఖము. త్వమేవ మాతాశ్చ పిత,.......... అని వారినే అంటారని కూడా అర్థం చేయించారు. కావున ఈ మాత ద్వారా మిమ్ములనందరినీ దత్తు తీసుకున్నారు. ఇతని నోటి ద్వారా పిల్లలైన మీకు జ్ఞానమనే పాలను తాపించినప్పుడు మీ పాపాలన్నీ భస్మమై మీ ఆత్మ కాంచనంగా అవుతుందని శివబాబా చెప్తున్నారు. కనుక శరీరము కూడా కాంచనమైనది లభిస్తుంది. ఆత్మలు పూర్తి స్వచ్ఛంగా, పవిత్రంగా, కాంచనంగా అవుతాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా మెటికలు దిగుతారు. ఆత్మలైన మనము కూడా కాంచనంగా ఉండేవారమని, శరీరాలు కూడా కాంచనంగా ఉండేవని, తర్వాత మళ్లీ మనము డ్రామానుసారము 84 జన్మల చక్రములో వచ్చామని మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు కాంచనంగా లేరు. ఇప్పుడైతే కేవలం 9 క్యారెట్ల బంగారని అంటారు. కొద్ది శాతము మాత్రమే మిగిలి ఉంది. ఒకేసారి ప్రాయ: లోపమవ్వదు. ఎంతో కొంత శాంతి ఉంటుంది. తండ్రి దీని గుర్తును కూడా తెలిపించారు. లక్ష్మీనారాయణులది నంబర్ వన్ చిత్రము. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది. తండ్రి పరిచయము కూడా వచ్చేసింది. భలే ఇప్పుడు మీ ఆత్మ పూర్తి కాంచనంగా అవ్వకపోయినా తండ్రి పరిచయం అయితే బుద్ధిలో ఉంది కదా. కంచనంగా అయ్యే యుక్తిని తెలుపుతారు. ఆత్మలో చేరిన మురికిని ఎలా తొలగించాలి? దాని కొరకు స్మృతియాత్ర చేయాలి. దీనిని యుద్ధ మైదానమని అంటారు. ప్రతి ఒక్కరూ యుద్ధ మైదానములో స్వతంత్ర సిపాయిలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత కావాలో అంత పురుషార్థం చెయ్యండి. పురుషార్థం చేయడం విద్యార్థుల పని. ఎక్కడకు వెళ్లినా 'మన్మనాభవ' అని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉండండి. 'శివబాబా స్మృతి ఉందా?' అని ఒకరికొకరు సూచన ఇచ్చుకోవాలి. తండ్రి చెప్పే చదువు సైగలతో కూడినది, అందుకే శరీరము క్షణములో కంచనమైపోతుందని, విశ్వానికి అధికారులుగా తయారుచేస్తానని తండ్రి అంటారు. తండ్రికి పిల్లలుగా అయినారంటే విశ్వానికి అధికారులుగా అయినట్లే. తర్వాత విశ్వములో చక్రవర్తులుగా ఉంటారు. అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. పోతే క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది. ఇది యధార్థము కదా. పురుషార్థం చేయడం ప్రతి ఒక్కరి పైన ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది. సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఎన్నిసార్లు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యారు! ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతము కాదు. తండ్రి వచ్చి ఎంత బాగా అర్థం చేయిస్తారు! నేను కల్ప-కల్పము వస్తాను. పిల్లలైన మీరే నన్ను ఈ ఛీ - ఛీ ప్రపంచములోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఏమని ఆహ్వానిస్తారు? మేము పతితమైపోయాము, మీరు వచ్చి పావనంగా చేయండి అని ఆహ్వానిస్తారు. ఆహా! ఏమి మీ ఆహ్వానము! మమ్ములను శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లండి అని అంటారు. కావున నేను మీకు విధేయుడైన సేవాధారిని. ఇది కూడా డ్రామా ఆట. మనము కల్ప-కల్పము అదే చదువు చదువుకుంటామని, పాత్ర చేస్తున్నామని మీకు తెలుసు. ఆత్మయే పాత్ర చేస్తుంది. ఇక్కడ కూర్చుని ఉన్నా తండ్రి ఆత్మలనే చూస్తారు, నక్షత్రాలను చూస్తారు. ఆత్మ ఎంత చిన్నదిగా ఉంది! నక్షత్రాల వలె మినుకు మినుకుమని మెరుస్తూ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు చాలా మెరుస్తూ ఉంటాయి. కొన్ని తక్కువగా మెరుస్తాయి. కొన్ని చంద్రునికి దగ్గరగా ఉంటాయి. మీరు కూడా యోగబలము ద్వారా బాగా పవిత్రంగా అయితే మెరుస్తూ ఉంటారు. పిల్లలలో మంచి నక్షత్రాలుగా ఉన్నవారికి పూలను ఇవ్వండి అని బాబా కూడా చెప్తారు. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. కొందరు చాలా చురుకుగా ఉంటారు. కొందరు చాలా ఢీలాగా ఉంటారు. ఈ నక్షత్రాలను దేవతలని అనజాలరు. మీరు కూడా మానవులే కానీ మీ ఆత్మను తండ్రి పవిత్రంగా చేసి విశ్వాధికారులుగా చేస్తారు. తండ్రి వారసత్వంగా ఎంతటి శక్తినిస్తారు! తండ్రి సర్వశక్తివంతులు కదా. పిల్లలైన మీకు ఎంత శక్తినిస్తానని తండ్రి చెప్తారు. శివబాబా, మీరు మమ్ములను చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారని పాడ్తారు కదా. వాహ్! ఈ విధంగా ఎవ్వరూ తయారు చేయరు. చదువు సంపాదనకు ఆధారము కదా. ఆకాశము మరియు భూమి అంతా మనదైపోతుంది. ఎవ్వరూ దోచుకోలేరు. దానిని స్థిరమైన రాజ్యమని అంటారు. ఎవ్వరూ ఖండించలేరు, ఎవ్వరూ కాల్చలేరు. అలాంటి తండ్రి శ్రీమతమును అనుసరించాలి కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము చేయాలి.
పిల్లలు మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తారు - ఈ చిత్రాలు మొదలైనవాటి ద్వారా తోటివారికి అర్థం చేయించాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు - ఏ చిత్రాలు కావాలంటే అవి భలే తయారు చేయండి. అందరి బుద్ధి పని చేస్తుంది. మానవుల కళ్యాణము కొరకే ఇవి తయారు చేయబడ్తాయి. సేవాకేంద్రానికి ఎప్పుడైనా ఎవరైనా వస్తూనే ఉంటారని మీకు తెలుసు, వారంతట వారే వచ్చి ఈ మిఠాయిని తీసుకునే యుక్తిని ఆలోచించండి. మిఠాయి బాగుంటే అడ్వర్‌టైజ్ అయిపోతుంది. అందుకు ఒకరికొకరు ఫలానా దుకాణానికి వెళ్లండని చెప్పుకుంటారు. ఇది చాలా మంచి నంబర్‌వన్ మిఠాయి. ఇలాంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకరు చూసి వెళ్తే ఇతరులకు కూడా వినిపిస్తారు. మొత్తం భారతదేశమంతా బంగారు యుగానికి ఎలా రావాలని ఆలోచిస్తారు. దాని కొరకు ఎన్నో విధాలుగా అర్థం చేయిస్తారు! కాని రాతి బుద్ధి గలవారైనందున కష్టపడవలసి ఉంటుంది కదా. వేటాడటము కూడా నేర్చుకోవలసి వస్తుంది కదా. మొదట చిన్న వేటను నేర్చుకుంటారు. పెద్ద వేటను వేటాడేందుకు శక్తి కావాలి కదా. ఎంత గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు ఉన్నారు! వేద శాస్త్రాలు మొదలైనవెన్నో చదువుకున్నారు. తమను తాము ఎంత గొప్ప అథారిటీగా భావిస్తారు! బనారస్‌లో వారికి ఎంత పెద్ద పెద్ద బిరుదులు లభిస్తాయి! అందుకే బాబా మొదట బనారస్‌ను ముట్టడించే సేవా ప్రణాళికను తయారుచేయండని అంటారు. గొప్పవారు చెప్పినప్పుడే ఎవరైనా వింటారు. చిన్నవారి మాటలను ఎవ్వరూ వినరు. స్వయాన్ని శాస్త్రాల అథారిటీ అనుకునే పెద్ద పులులకు అర్థం చేయించాలి. ఎంత పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు. శివబాబాకు కూడా ఇన్ని బిరుదులు లేవు. ఇప్పుడిది భక్తిమార్గపు రాజ్యము కదా. తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యముగా అవుతుంది. జ్ఞాన మార్గములో భక్తి ఉండదు. భక్తిలో జ్ఞానము అస్సలు ఉండదు. ఇక్కడ నక్షత్రాలు కూర్చున్నారని తండ్రి భావిస్తారు, చూస్తారు కూడా. దేహ స్మృతిని వదిలేయాలి. పైన ఏ విధంగా నక్షత్రాలు మినుకు మినుకుమంటాయో, అలా ఇక్కడ కూడా వెలుగుతున్నాయి. కొందరు చాలా ప్రకాశవంతమైన వెలుగు గలవారిగా అయ్యారు. కొందరు వీరిని భువి పై గల తారలని, దేవతలని అంటారు. ఇది ఎంత పెద్ద బేహద్ రంగ స్థలము. అది హద్దు రాత్రి మరియు హద్దు పగలు. ఇది అర్ధకల్పపు బేహద్ రాత్రి, బేహద్ పగలు అని తండ్రి అర్థం చేయిస్తారు. పగలు సుఖమే సుఖము. ఎక్కడా ఎదురుదెబ్బలు తినే అవసరమే లేదు. జ్ఞానములో సుఖముంది, భక్తిలో దు:ఖముంది. సత్యయుగములో దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. అక్కడ మృత్యువు ఉండదు. మీరు మృత్యువు పై విజయము పొందుతారు. అక్కడ మృత్యువు అను పేరు కూడా ఉండదు. అది అమరలోకము, అమరలోకానికి వెళ్లేందుకు మనకు తండ్రి అమరకథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు, ఆది నుండి సృష్టి చక్రమంతా బుద్ధిలో ఉంది. ఆత్మలైన మన ఇల్లు బ్రహ్మలోకము అని మీకు తెలుసు. అక్కడి నుండి పాత్ర చేసేందుకు ఇక్కడకు నంబర్‌వారుగా వస్తారు. చాలామంది ఆత్మలున్నారు, ఒక్కొక్కరికి కూర్చుని తెలుపరు, సంక్షిప్తంగా తెలుపుతారు. ఎన్ని కొమ్మ-రెమ్మలున్నాయి! కొమ్మలన్నీ వెలువడుతూ వృక్షము వృద్ధి చెందుతుంది. చాలామందికి తమ ధర్మము గురించి కూడా తెలియదు. మీరు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కానీ ఇప్పుడు ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయ్యారని తండ్రి వచ్చి తెలుపుచున్నారు.
మొదట మనము శాంతిధామములో ఉండేవారము, తర్వాత పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఒకప్పుడు ఉండేది, వీరి వంశమే ఉండేది, ఇప్పుడు మళ్లీ సంగమ యుగములో ఉన్నాము. మీరు సూర్య వంశస్థులుగా ఉండేవారు తర్వాత మళ్లీ చంద్ర వంశస్థులుగా అయ్యారని తండ్రి తెలిపించారు. మిగిలినవన్నీ ప్రక్క దృశ్యాలు. ఇది బేహద్ ఆట. ఇది ఎంత చిన్న వృక్షము, బ్రాహ్మణ కులము. తర్వాత ఎంతగా పెరిగిపోతుందంటే అందరినీ కలిపి చూడను కూడా చూడలేరు. అన్ని స్థానాలను చుట్టుముడుతూ వెళ్తారు. ఢిల్లీని, బనారస్‌ను చుట్టముట్టండి అని తండ్రి చెప్తున్నారు. తర్వాత మీరు పూర్తి ప్రపంచాన్ని ముట్టడిస్తారు. మీరు యోగబలము ద్వారా ప్రపంచమంతటా ఒకే రాజ్యమును స్థాపన చేస్తారు. ఎంత ఖుషీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ మాటలు ఎవ్వరూ వినరు. గొప్ప-గొప్పవారు వచ్చి వార్తాపత్రికలలో ప్రచురించినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న వేటలు మాత్రమే జరుగుచున్నాయి. పెద్ద పెద్ద షాహుకార్లు మా కొరకు స్వర్గము ఇక్కడే ఉందని భావిస్తారు. పేదవారే వచ్చి వారసత్వము తీసుకుంటారు. బాబా మీరు తప్ప మాకు మరెవ్వరూ లేరని అంటారు. కాని ప్రపంచమంతటి పై మోహ-మమకారాలు కూడా తొలగిపోవాలి కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఆత్మను కాంచనంగా(స్వర్ణిమము, పవిత్రంగా) చేసుకునేందుకు సావధానపరచుకోవాలి. 'మన్మనాభవ' యొక్క సూచనను ఇవ్వాలి. యోగబలము ద్వారా పవిత్రమై మెరిసే నక్షత్రాలుగా అవ్వాలి.
2. ఈ బేహద్‌గా తయారైన నాటకమును బాగా అర్థం చేసుకొని స్వదర్శన చక్రధారులుగా తయారవ్వాలి. జ్ఞాన అంజనమునిచ్చి మానవులను అజ్ఞానమనే ఘోరాంధకారము నుండి వెలుపలికి తీయాలి.
వరదానము :- '' మీ ప్రాక్టికల్ జీవితము ద్వారా సైలెన్స్ శక్తి యొక్క శబ్ధాన్ని వ్యాపింపజేసే విశేష సేవాధారి భవ ''
ప్రతి ఒక్కరికి సైలెన్స్ శక్తిని అనుభవం చేయించాలి - ఇది విశేషమైన సేవ. ఎలాగైతే సైన్సు శక్తి ప్రసిద్ధి చెందిందో, అలా సైలెన్స్ శక్తి ప్రసిద్ధమవ్వాలి. అందరి నోటి నుండి సైలెన్స్ శక్తి, సైన్స్ శక్తి కంటే గొప్పదనే మాట వెలువడాలి. ఆ రోజు కూడా వస్తుంది. సైలెన్స్ శక్తి ప్రత్యక్షమవ్వడమంటే తండ్రి ప్రత్యక్షమవ్వడం. సైలెన్స్ శక్తికి ప్రాక్టికల్ ఋజువు మీ జీవితమే. ప్రతి ఒక్కరు నడుస్తూ - తిరుగుతున్న శాంతి మాడల్‌గా కనిపించాలి. అప్పుడు సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి పైకి వస్తుంది. ఇటువంటి సేవ చేస్తే విశేష సేవాధారులని అంటారు.
స్లోగన్ :- '' సేవ మరియు స్థితుల బ్యాలన్స్ ఉంచితే, సర్వుల బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) లభిస్తూ ఉంటాయి.''
No comments:
Post a Comment