30-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - సదా శ్రీమతం పై నడవాలి - ఇదే శ్రేష్ఠమైన పురుషార్థం, శ్రీమతం పై నడవడం ద్వారా ఆత్మ దీపం వెలుగుతుంది ''
ప్రశ్న :- పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది ?
జవాబు :- ఎవరి పూర్తి అటెన్షన్ లేక బుద్ధి యోగము ఒక్కరితోనే ఉంటుందో, వారు పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నిటికంటే ఉన్నతమైన పురుషార్థము తండ్రి పై పూర్తి పూర్తి బలి అవ్వడం. బలి అయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు.
ప్రశ్న :- సత్య-సత్యమైన దీపావళి జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహానిస్తారు?
జవాబు :- పిల్లలూ, అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇటువంటి పురుషార్థం చేస్తారో అప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజ్యంలోకి వెళ్ళగలరు అనగా సత్య-సత్యమైన దీపావళి లేక కారొనేషన్ డే (రాజ్యపట్టాభిషేకం) జరుపుకోగలరు.
ఓంశాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ తిరుగుతూ లేదా ఇక్కడ కూర్చొని-కూర్చొని జన్మ-జన్మాంతరాలుగా తల పై ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. మనము ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పాపాలు నశించిపోతాయి అని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిగా అర్థం చేయించారు - భలే, ఇక్కడ కూర్చొని ఉన్నా ఎవరైతే శ్రీమతం పై నడుస్తారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన పవిత్రంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి సలహా లభిస్తోంది, ఇక్కడకు మీరు అనంతమైన పవిత్రంగా అయ్యేందుకు వచ్చారు, కనుక స్మృతి యాత్ర్రతోనే పవిత్రంగా అవుతారు. కొందరైతే బొత్తిగా స్మృతి చేయలేరు, మరికొందరు తమ స్మృతి యాత్రతోనే తమ పాపాలు కట్ అవుతున్నాయి అనగా తమ కళ్యాణము చేసుకుంటున్నట్లుగా భావిస్తారు. బయటి వారికి ఈ విషయాలు తెలియవు. మీకు మాత్రమే తండ్రి దొరికారు, మీరు తండ్రి వద్దే ఉంటారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యామని, ముందు ఆసురీ సంతానంగా ఉండేవారమని తెలిసింది. ఇప్పుడు మన సాంగత్యము ఈశ్వరీయ సంతానంతో ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది అని గాయనం కూడా ఉంది కదా! మనము ఈశ్వరీయ సంతానం కనుక మనము ఈశ్వరుని మతం పైనే నడవాలి, మన్మతము పై కాదు అని పిల్లలు ఘడియ-ఘడియకు మర్చిపోతారు. మన్మతమని మనుష్య మతాన్నంటారు. మనుష్య మతము ఆసురీ మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణం కావాలనుకుంటారో వారు సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సతోప్రధానానికి మహిమ కూడా ఉంది. మనము సుఖధామానికి నంబరువారీ అధిపతులుగా అవుతామని తెలుసు. ఎంతెంత శ్రీమతము పై నడుస్తామో, అంత ఉన్నత పదవి పొందుతాము, ఎంతగా తమ మతము పై నడుస్తామో అంత పదభ్రష్టులైపోతాము. తమ కళ్యాణము చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్ అయితే లభిస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతగా స్మృతి చేస్తే వారి పాపాలు కూడా అంతగా నశిస్తాయి, ఇది కూడా పురుషార్థమే అని తండ్రి అర్థం చేయించారు. స్మృతి యాత్ర చేయకుండా పవిత్రంగా అవ్వలేరు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ ఇదే చింత ఉండాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాల నుండి శిక్షణ లభించింది! అయినా మేము చాలా దూరంగానే ఉన్నామని భావిస్తారు. ఇంతగా తండ్రిని స్మృతి చేయలేరు. సతోప్రధానంగా అయ్యేందుకు చాలా టైమ్ పడ్తుంది. మధ్యలో శరీరం వదిలేస్తే కల్ప-కల్పాంతరాలకు పదవి తక్కువైపోతుంది. ఈశ్వరునికి చెందినవారుగా అయ్యారంటే వారి నుండి పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చెయ్యాలి. బుద్ధి ఒక్కవైపే ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తోంది. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారి మతం అనుసారంగా నడవకపోతే చాలా మోసపోతారు. నడుస్తారా నడవరా, అదైతే మీకే తెలియాలి, శివబాబాబాకు తెలియాలి. మీచే పురుషార్థం చేయించేవారు ఆ శివబాబా. దేహధారులందరు పురుషార్థం చేస్తారు. ఇతడు కూడా దేహధారియే, ఇతనిచే పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం చేయాల్సింది పిల్లలే. అసలైన విషయం పతితులను పావనంగా చెయ్యడం. ప్రపంచంలో పావనంగా చాలామంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఒక్క జన్మకు పావనంగా అవుతారు. ఈ జన్మలో పావనంగా ఉండే బాలబ్రహ్మచారులు కూడా చాలామంది ఉన్నారు. వారెవ్వరు ప్రపంచానికి పవిత్రతా సహాయాన్ని ఇవ్వలేరు, శ్రీమతం పై పావనంగా అయ్యి ప్రపంచాన్ని పావనంగా చేసినప్పుడే సహాయం జరుగుతుంది.
ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది. జన్మ-జన్మాంతరాలుగా మీరు ఆసురీ మతాన్ని అనుసరించారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతోందని మీకు తెలుసు. మనము శ్రీమతం పై ఎంతగా పురుషార్థము చేస్తామో అంత ఉన్నత పదవి పొందుతాము. ఇది బ్రహ్మ మతం కాదు, ఇతడు పురుషార్థి. ఇతడి పురుషార్థం తప్పకుండా ఇంత ఉన్నతంగా ఉంది కనుకనే లక్ష్మీ-నారాయణగా అవుతారు. అయితే పిల్లలు ఇది ఫాలో చెయ్యాలి. శ్రీమతం పై నడవాల్సి ఉంటుంది, మన్మతం పై కాదు. తమ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తోంది, సత్యయుగంలో దీపావళి ఉండదు. కేవలం కారొనేషన్(పట్టాభిషేకం) జరుగుతుంది. పోతే ఆత్మలైతే సతోప్రధానంగానే ఉంటాయి. ఇక్కడ దీపమాల ఏదైతే జరుపుతారో ఇది అసత్యమైనది. బయట దీపాలు వెలిగిస్తారు, అక్కడైతే ఇంటింటా దీపం వెలిగి ఉంటుంది అనగా అందరి ఆత్మ దీపము సతోప్రధానంగా ఉంటుంది. 21 జన్మలకు జ్ఞానమనే నెయ్యి పడ్తుంది. మెల్ల-మెల్లగా తగ్గిపోతూ-తగ్గిపోతూ మొత్తం ప్రపంచ జ్యోతి కొడిగట్టిపోయింది. అందునా విశేషించి భారతవాసులది, సామాన్య ప్రపంచంది. ఇప్పుడు అందరు పాపాత్మలుగా ఉన్నారు, ఇది అందరి అంతిమ(ప్రళయ) సమయం, అందరూ లెక్కాచారం సమాప్తం(చుక్త్) చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చెయ్యాలి, శ్రీమతం పై నడిస్తేనే పొందుతారు. రావణ రాజ్యంలో అయితే శివబాబా ఆజ్ఞను చాలా ఉల్లఘించారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞ పై నడవకపోతే చాలా మోసపోతారు. వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని వారినే పిలిచారు. కనుక ఇప్పుడు తమ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతం పై నడవాల్సి ఉంటుంది, లేకుంటే చాలా అకళ్యాణం అవుతుంది. శివబాబా స్మృతి లేకుండా మనము సంపూర్ణ పావనంగా అవ్వలేమని కూడా మధురమైన పిల్లలకకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీకు ఎందుకు జ్ఞాన ధారణ అవ్వడం లేదు, బంగారు పాత్రలోనే ధారణ అవుతుంది. కొత్త-కొత్త పిల్లలు ఎంత సర్వీసబుల్‌గా (సేవారతులుగా) అవుతారు! ఎంత వ్యత్యాసం (తేడా) ఉందో చూడండి. క్రొత్త పిల్లలు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో అంతగా పాత-పాత పిల్లలు ఉండరు. చాలామంది మంచి శివబాబా గారాబు పిల్లలు వస్తారు, వారు ఎంత సర్వీస్ చేస్తారు! ఎలాగైతే శివబాబా చివరి ఆత్మను త్యాగం చేసేశారు. త్యాగం చేయడంతో మళ్లీ సర్వీస్ కూడా ఎంత చేస్తారు! తండ్రికి సహాయం చేస్తూనే స్మృతి యాత్రలో ఉండడంతో ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు! తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వచ్చి నన్ను పావనంగా చేయండి అని పిలిచారు, ఇప్పుడు తండ్రి చెప్తారు నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నీ త్యాగం చెయ్యాల్సి వస్తుంది. ఒక్క తండ్రి స్మ్పృతి తప్ప బంధు-మిత్రులు మొదలైనవారెవ్వరూ గుర్తుండరాదు, అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. ఇది బాప్‌దాదా కూడా అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త-కొత్తవారు వస్తారు, రోజు - రోజుకూ సంస్కరింపబడ్తున్నామని అర్థం చేసుకుంటారు. శ్రీమతం పై నడిస్తేనే బాగుపడ్తారు. క్రోధం పై కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ గెలుపు పొందుతారు. అయితే తండ్రి కూడా అర్థం చేయిస్తారు - చెడును తీసేస్తూ ఉండండి. క్రోధం కూడా చాలా చెడ్డది. తమను లోలోపల కాల్చేస్తుంది, ఇతరులను కూడా కాలుస్తుంది. దానిని కూడా తీసేయాలి. పిల్లలు తండ్రి శ్రీమతం పై నడవకపోతే పదవి తక్కువైపోతుంది. జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది.
అది దేహ సంబంధమైన చదువు, ఇది ఆత్మిక చదువు దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. అన్ని విధాల సంభాళన కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వికారి ఇక్కడ లోపలికి (మధుబన్‌లోకి) రాలేరు. జబ్బు మొదలైనవి వచ్చినప్పుడు వికారి బంధుమిత్రులు వచ్చినా, అది మంచిది కాదు. మనం ఇష్టపడరాదు. లేకుంటే అంతకాలంలో ఆ బంధు-మిత్రులే గుర్తుకొస్తారు. వారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అయితే ఎవ్వరూ గుర్తు రాకుండా పురుషార్థం చేయిస్తారు, మేము జబ్బు పడ్డాము కాబట్టి బంధు-మిత్రులు మొదలైనవారు చూసేందుకు వస్తారని కాదు, వారిని పిలవడం నియమం కాదు. నియమానుసారంగా నడిస్తేనే సద్గతి కలుగుతుంది. లేకుంటే ఊరకే స్వయానికి నష్టం కలగజేసుకుంటారు, కాని ఇది తమోప్రధాన బుద్ధి అర్థం చేసుకోదు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడరు. చాలా అప్రమత్తంగా నడవాల్సి ఉంటుంది. ఇది పవిత్రాతి పవిత్రమైన (అతి పవిత్రమైన) స్థానము, ఇక్కడ పతితులు నిలవలేరు. బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తొచ్చారంటే మరణించే సమయంలో తప్పకుండా వారు గుర్తొస్తారు. దేహ-అభిమానంలోకి రావడంతో తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తమవుతారు. శ్రీమతం పై నడవకపోతే చాలా దుర్గతి కలుగుతుంది. సేవకు తగినవారిగా అవ్వలేరు. ఎంత తల బాదుకున్నా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధిగలవారుగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులు క్రింద పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి అని తండ్రి చెప్తారు లేకపోతే పదభ్రష్టులైపోతారు. లౌకిక తండ్రికి కూడా నలుగురు - ఐదుగురు పిల్లలుంటారు, కాని వారిలో ఆజ్ఞాకారులైన పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులు కాదో వారైతే దు:ఖమునే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇద్దరు తండ్రులూ చాలా గొప్పవారు లభించారు. వారి ఆజ్ఞను తిరస్కరించరాదు. తిరస్కరిస్తే జన్మ-జన్మాంతరాలకు, కల్ప- కల్పాంతరాలకు చాలా తక్కువ పదవి పొందుతారు. పురుషార్థం ఎలా చెయ్యాలంటే అంతములో ఒక్క శివబాబాయే గుర్తు రావాలి. తండ్రి చెప్తారు - ప్రతి ఒక్కరు ఏం పురుషార్థం చేస్తారో నేను తెలుకోగలను. కొందరు చాలా కొద్దిగా స్మృతి చేస్తారు, మిగిలినవారు తమ బంధు-మిత్రులనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు అంత సంతోషంగా ఉండలేరు, ఉన్నత పదవి పొందలేరు.
మీకైతే రోజూ సద్గురువారమే. బృహస్పతివారం నాడు కాలేజిలో చేరతారు. అది శరీర సంబంధమైన విద్య, ఇదైతే ఆత్మిక విద్య. శివబాబా మన తండ్రి, టీచర్, సద్గురువు అని మీకు తెలుసు. కనుక వారి డైరెక్షన్ అనుసారం నడవాలి అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి లోలోపల చాలా సంతోషం ఉంటుంది, అడగనే వద్దు, సంతోషం ఉంటే ఇతరులను కూడా సంతోషపర్చే పురుషార్థం చేస్తారు. అమ్మాయిలు రాత్రి-పగలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారో చూడండి, ఎందుకంటే ఇది వండర్‌ఫుల్(అద్భుతమైన) జ్ఞానం కదా! చాలామంది పిల్లలు తెలివి తక్కువతనంతో ఎంత నష్టపోతారు! బాప్‌దాదాకు జాలేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చి లోపల చాలా మండిపోతూ ఉంటారు. క్రోధం వచ్చినప్పుడు మనుష్యులు తామ్రం(రాగి) వలె ఎఱ్ఱగా అయిపోతారు. క్రోధం మనుష్యలను కాల్చేస్తుంది, కామం నల్లగా తయారు చేస్తుంది. లోభము, మోహములో అంతగా కాలరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధ భూతము చాలామందిలో ఉంది. ఎంత పోట్లాడ్తారు! పోట్లాడడంతో తమకే నష్టం కలగజేసుకుంటారు. నిరాకారుని, సాకారుని ఇరువురి ఆజ్ఞను తిరస్కరిస్తారు. తండ్రి ఇటువంటి వారిని కుపుత్రులని భావిస్తారు. శ్రమ చేస్తే ఉన్నత పదవి పొందుతారు. అయితే తమ కళ్యాణం కొరకు సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఎవ్వరినీ గుర్తు చేయరాదు. ఇంట్లో ఉంటూ సంబంధీకులను చూస్తున్నా శివబాబాను స్మృతి చేయాలి. మీరు సంగమ యుగంలో ఉన్నారు, ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి.
ఇది అనంతమైన చదువు కదా! ఇందులో పిల్లలకే లాభం ఉంది అని తండ్రి శిక్షణనిస్తున్నారు. చాలామంది పిల్లలు తమ పద్ధతి లేని నడవడికతో ఊరకే తమకు నష్టం కలగజేసుకుంటారు. విశ్వమహారాజు పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు కానీ మాయా మార్జాలం(పిల్లి) చెవి కొరికేస్తుంది. జన్మించారు, మేము ఈ పదవి పొందుతామని భావిస్తారు, కాని మాయ పిల్లి పొందనీయడం లేదని అంటారు, కనుక పదవి భ్రష్టమైపోతుంది. మాయ చాలా బలంగా దాడి చేస్తుంది. మీరు ఇక్కడకు రాజ్యం పొందేందుకు వచ్చారు, కాని మాయ కలవరపరుస్తుంది. పాపం...! ఉన్నత పదవి పొందితే బాగుంటుంది కదా! అని తండ్రికి జాలి కలుగుతుంది. నన్ను నిందింపజేసేవారిగా అవ్వకండి. సద్గురు నిందకులు సత్యయుగంలో స్థానం పొందరు, ఎవరి నింద? శివాబాబాది. తండ్రిని నిందపరిచే ఇటువంటి నడత నడవరాదు, ఇందులో అహంకారం మాట లేదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తమ కళ్యాణము కొరకు దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి, వాటి పై ప్రీతి ఉంచుకోరాదు. ఈశ్వరుని మతం పైనే నడవాలి, తమ మతము పై కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి, ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి.
2. క్రోధము చాలా చెడ్డది, స్వయాన్ని కాలుస్తుంది, క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించరాదు. సంతోషంగా ఉండాలి, అంతేకాక అందరిని సంతోషపరిచే పురుషార్థం చేయాలి.
వరదానము :- '' హృదయానుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే స్వ పరివర్తక భవ! ''
స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు సత్యమైన హృదయంతో రెండు విషయాల అనుభూతి అవసరం - 1. తమ బలహీనతల అనుభూతి 2. ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తంగా అవుతారో వారి ఇచ్ఛ మరియు వారి మనోభావనల అనుభూతి. పరిస్థితుల పేపర్‌కు కారణాన్ని తెలుసుకొని స్వయం పాస్ అవుతాననే శ్రేష్ఠ స్వరూప అనుభూతి ఉండాలి. నా స్వస్థితి శ్రేష్ఠంగా ఉంది, పరిస్థితి ఒక పేపరు - ఈ అనుభూతి సహజంగా పరివర్తన చేయిస్తుంది, సత్యమైన హృదయంతో అనుభూతి చేసినట్లయితే హృదయాభిరాముని ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి.
స్లోగన్ :- ''ఎవరైతే ఎవర్‌రెడీ అయి ్య ప్రతి కార్యంలో హజూర్ హాజిర్ (చిత్తం ప్రభూ) అని అంటారో, వారే వారసులు.''
No comments:
Post a Comment