14-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు నెంబరువార్ సతోప్రధానంగా అయినప్పుడు ప్రకృతి ప్రకోపాలు లేక వినాశనాల ఫోర్సు పెరుగుతుంది, ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ''
ప్రశ్న :- ఏ పురుషార్థము చేసేవారికి తండ్రి వారసత్వము పూర్తిగా ప్రాప్తిస్తుంది ?
జవాబు :- 1. వారసత్వమును పూర్తిగా తీసుకోవాలంటే మొదట తండ్రిని తమ వారసునిగా చేసుకోండి. అనగా మీ వద్ద ఉన్న దానినంతా తండ్రికి అర్పించండి. తండ్రిని తమ పుత్రునిగా చేసుకుంటే పూర్తి వారసత్వాలకు అధికారులుగా అవుతారు. 2. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు పూర్తి వారసత్వము లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శ్షిలు తిని కొద్దిగా రెట్టె(చిన్న పదవి) లభిస్తుంది.
ఓంశాంతి. పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోరాదు. ముగ్గురి స్మృతిలో కూర్చోవాలి. భలే వారు ఒక్కరే కానీ వారే తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. మనందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు. ఈ కొత్త విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. భక్తి నేర్పించేవారు, శాస్త్రాలను వినిపించే వారందరూ మనుష్యులని మీకు తెలుసు. వీరినైతే మనిషి అని అనరు కదా. వీరు నిరాకారులు. కూర్చుని నిరాకార ఆత్మలను చదివిస్తారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. మీరిప్పుడు బేహద్ తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఆత్మిక పిల్లలారా! మీరు నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయని బేహద్ తండ్రి చెప్పారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ లేవు. తండ్రి మనకు రాజయోగము నేర్పిస్తున్నారని మీకు తెలుసు. ఎంత ఉన్నతాతి ఉన్నతమైన గొప్ప టీచరు. కావున పదవిని కూడా ఉన్నతోన్నతమైనదే ప్రాప్తి చేయిస్తారు. మీరు నెంబరువారు పురుషార్థానుసారము సతోప్రధానంగా అవుతారో అప్పుడు మళ్లీ యుద్ధము జరుగుతుంది. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. స్మృతి కూడా తప్పకుండా చేయాలి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. క్రొత్త ప్రపంచము కొరకు ఈ జ్ఞానాన్ని పురుషోత్తమ సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేయిస్త్తారు. చిన్న పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. మీరైతే వివేకవంతులు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక తండ్రి ద్వారా ఉన్నత పదవి పొందుతామని మీకు తెలుసు. కొత్త ప్రపంచములో ఈ లక్ష్మీనారాయణులు పొందిన పదవి శివబాబా ద్వారానే పొందారని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులే మళ్లీ 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు బ్రహ్మ-సరస్వతిగా అయ్యారు. వీరే మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. మీరిప్పుడు మూఢ నమ్మకముతో దేవతల ఎదుటకు వెళ్లి తల వంచరు. మనుష్యులు దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వ గుణ సంపన్నులు. మేము పాపులము, వికారులము. మాలో ఏ గుణమూ లేదు అని అంటారు. మీరు ఎవరినైతే మహిమ చేశారో, అలాంటివారిగా ఇప్పుడు మీరే తయారవుతున్నారు. బాబా, ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? అని అడుగుతారు. రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి అని తండ్రి చెప్తారు. ఇవన్నీ భక్తిమార్గములోని సామగ్రి. మీరిక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ధారణ అవ్వాలి. ఈ సంస్కారాన్ని ఆత్మ తీసుకెళ్తుంది. భక్తి సంస్కారము వెళ్లదు. భక్తి సంస్కారము కలిగినవారు పాత ప్రపంచములో మనుష్యుల వద్దనే జన్మ తీసుకుంటారు. ఇది కూడా తప్పనిసరి. మీ బుద్ధిలో మొత్తం ఈ జ్ఞాన చక్రమంతా తిరుగుతూ ఉండాలి. దీనితో పాటు బాబాను కూడా స్మృతి చేయాలి. బాబా మనకు తండ్రి కూడా అయినారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి మనకు టీచరు కూడా అయినారు. కావున చదువంతా బుద్ధిలోకి వస్తుంది. సృష్టి చక్ర జ్ఞానము బుద్ధిలో ఉంది. దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. (స్మృతియాత్ర జరుగుతోంది).
ఓంశాంతి. భక్తి మరియు జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు. వారికి భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తి అవుతుందో భక్తిలోని సారమంతా తెలుసు, మనుష్యులకు తెలియదు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యయుగములో మీరు దేవీ దేవతలుగా, విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అక్కడ భక్తి అనే పేరు కూడా ఉండదు. ఒక్క మందిరము కూడా ఉండేది కాదు. అందరూ దేవీ దేవతలే ఉండేవారు. తర్వాత ప్రపంచము సగము పాతదైనప్పుడు లేక 2500 సంవత్సరాలు పూర్తయినప్పుడు లేక త్రేతా, ద్వాపర యుగముల సంగమ సమయములో రావణడు వస్తాడు. సంగమమైతే తప్పకుండా ఉండాలి. త్రేతా యుగము, ద్వాపర యుగాల సంగమములో దేవీ దేవతలు వామమార్గములో క్రింద పడిపోయినప్పుడు రావణుడు వస్తాడు. ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తండ్రి కూడా కలియుగాంతము మరియు సత్యయుగాదుల సంగమములో వస్తారు. రావణుడు త్రేతా, ద్పాపర యుగముల సంగమములో వస్తాడు. ఇప్పుడు ఈ సంగమమును కళ్యాణకారి అని అనరు. దానిని అకళ్యాణకారి అనే అంటారు. తండ్రి పేరే కళ్యాణకారి. ద్వాపర యుగము నుండి అకళ్యాణకారి యుగము ప్రారంభమవుతుంది. తండ్రి అయితే చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంది. ఆ బీజము కూడా చైతన్యంగా ఉంటే, నా ద్వారా ఈ వృక్షము ఇలా వెలువడిందని అది కూడా తెలుపుతుంది. కానీ జడమైనందు వలన ఏమీ తెలుపలేదు. బీజము వేయడం వలన వ్షృము మొదట చిన్నదిగా వస్తుందని మనకు తెలుసు. పెరిగిన తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చైతన్యంగా ఉన్నవారే అన్నిటినీ తెలుపగలరు. ప్రపంచములో అయితే మానవులు ఏమేమో చేస్తూ ఉంటారు. కొత్త కొత్తవి ఆవిష్కరిస్తూ ఉంటారు. చంద్రుని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరిప్పుడు వింటున్నారు. చంద్రుడు ఎలా ఉంటాడో చూసి పరిశీలించేందుకు ఎన్ని లక్షల మైళ్ళ దూరము వరకు వెళ్తారు! సముద్రాన్ని పరిశీలించేందుకు ఎంత దూరము వెళ్తారు! పరిశీలిస్తారు. కానీ చివరి దశను(అంత్యమును) చేరుకోలేరు. ఎక్కడ చూసినా నీరే ఉంటుంది. విమానములో పైకి వెళ్తారు. అందులో తిరిగి వచ్చేవరకు కూడా పెట్రోలు ఉండే విధంగా నింపాలి. ఆకాశము అనంతమైనది కదా. సాగరము కూడా అనంతమే. ఇక్కడ బేహద్ జ్ఞానసాగరులున్న విధంగా అక్కడ నీటి బేహద్ సాగరముంది. ఆకాశతత్వము కూడా బేహద్‌గా ఉంది. భూమి కూడా బేహద్‌గా ఉంది. వెళ్తూ ఉండండి. సాగరము క్రింద మళ్లీ భూమి ఉంది. కొండ దేని పై నిలబడి ఉంది? భూమి పై. భూమిని తవ్వుతూ ఉంటే కొండలు వస్తాయి. దాని క్రింద మళ్లీ నీరు కూడా వస్తుంది. సముద్రము కూడా భూమి పైనే ఉంది. ఎంతవరకు నీరుందో, ఎంతవరకు భూమి ఉందో వాటి అంత్యాన్ని ఎవ్వరూ చేరుకోలేరు. పరమపిత పరమాత్మ అనంతమైన తండ్రి. వారిని అనంతుడని అనరు. మనుష్యులు భలే ఈశ్వరుడు అనంతుడని, మాయ కూడా అనంతము అని అంటారు. కాని ఈశ్వరుడు అనంతముగా ఉండజాలరని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ఆకాశము మాత్రము అనంతమైనది. ఇవి పంచ తత్వాలు, ఆకాశము, వాయువు................ ఈ పంచ తత్వాలు తమోప్రధానమైపోతాయి. ఆత్మ కూడా తమోప్రధానమైనప్పుడు మళ్లీ తండ్రి వచ్చి సతోప్రధానంగా చేస్తారు. ఎంత చిన్న ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది నాటకము. ఇది అంతమవ్వదు. ఇది పారంపర్యము నుండి వస్తూ ఉంది. ఎప్పటి నుండి ప్రారంభమైనదో చెప్తే అంతము కూడా జరగాలి. కొత్త ప్రపంచము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో అర్థం చేయించాలి. అది మళ్లీ పాతదవుతుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. ఇది తిరుగుతూనే ఉంటుందని మీకిప్పుడు తెలుసు. వారైతే కేవలం కోతలు కోస్తూ వచ్చారు. శాస్త్రాలలో సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కావున మనుష్యులు వింటూ వింటూ అదే సత్యమని భావించారు. భగవంతుడు వచ్చి తమ పరిచయమును ఎప్పుడు ఇస్తారో తెలియనందున కలియుగము ఆయువు ఇంకా 40 వేల సంవత్సరాలుందని అనేస్తారు. మీరు అర్థం చేయించినంత వరకు వారికి తెలియదు. కల్పము ఆయువు 5 వేల సవంత్సరాలే అని, లక్షల సంవత్సరాలు కాదని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తవంగా ఉన్నారు.
భక్తిమార్గపు సామాగ్రి ఎంత ఉంది! మనుష్యుల వద్ద ధనముంటే ఖర్చు చేస్తారు. నేను మీకు ఎంత ధనము ఇచ్చి వెళ్లాను! అని తండ్రి అంటారు. బేహద్ తండ్రి కనుక బేహద్ వారసత్వమునే ఇస్తారు. దీని ద్వారా సుఖము కూడా లభిస్తుంది. ఆయువు కూడా పెరుగుతుంది. తండ్రి పిల్లలకు చెప్తారు - ''నా ప్రియమైన పిల్లలారా! ఆయుష్మాన్ భవ!'' అక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. మృత్యువు ఎప్పుడూ కబళించజాలదు. తండ్రి మీకు వరమునిస్తారు. మిమ్ములను ఆయుష్మంతులుగా చేస్తారు. మీరు అమరులుగా అవుతారు. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యువు జరగదు. అక్కడ మీరు చాలా సుఖంగా ఉంటారు. అందువలన దానిని సుఖధామమని అంటారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ధనము కూడా చాలా లభిస్తుంది. చాలా సుఖవంతులుగా కూడా ఉంటారు. నిరుపేదలుగా ఉన్నవారు కిరీటధారులుగా అవుతారు. దేవీ దేవతా ధర్మము స్థాపించేందుకు తండ్రి వస్తారని మీ బుద్ధిలో ఉంది. అప్పుడు వ్షృము చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉంటుంది. విశ్వమంతటా శాంతి ఉందని అంటారు. మొత్తం విశ్వమంతటా పాత్రధారులుగా మనమే ఉంటామని ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మనము ఎప్పటి నుండి పాత్ర చేస్తున్నామో తెలపాలి. పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా ద్వారా లభించింది, మరెవ్వరి ద్వారా లభించదని గీతలో కూడా ఉంది కదా. మొత్తం భూమి, ఆకాశాన్ని విశ్వరాజధానిగా ఇచ్చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికంతా అధికారులుగా ఉండేవారు. తర్వాత ఉన్న రాజులు భారతదేశానికి చెందినవారు. బాబా ఇచ్చేది మరెవ్వరూ ఇవ్వలేరని గాయనము కూడా ఉంది. తండ్రే వచ్చి ప్రాప్తి చేయిస్తారు. కావున ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. దానిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. అర్థము చేసుకోవలసింది చాలా ఉంది. ఇప్పుడు ఎవరు అర్థం చేయించగలరో తెలిసిందా? బంధనముక్తులు. తండ్రి వద్దకు ఎవరైనా వస్తే ఎంతమంది పిల్లలున్నారని బాబా అడుగుతారు. అప్పుడు 5 మంది పిల్లలున్నారు, 6వ బిడ్డ శివబాబా అని అంటారు. కనుక అందరికంటే పెద్ద కొడుకు అయినారు కదా. మనము శివబాబాకు చెందినవారిగా అయితే శివబాబా మళ్లీ తమ సంతానంగా చేసుకొని విశ్వానికి అధికారులుగా చేసేస్తారు. పిల్లలు వారసులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు శివబాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివబాబాకు తమదంతా ఇచ్చేశారు కావున వారసత్వము తప్పకుండా పిల్లలకు లభించాలి. నన్ను వారసునిగా చేసుకోండి, ఇంకెవ్వరూ ఉండరాదని బాబా చెప్పారు. బాబా, ఇదంతా మీదే, మీదంతా మళ్లీ మాదే అని అంటారు. మీరు మాకు మొత్తం విశ్వరాజ్యమునంతా వారసత్వంగా ఇస్తారు. ఎందుకంటే మా వద్ద ఏముందో దానినంతా మీకు ఇచ్చేశాము. డ్రామాలో రచింపబడింది కదా. అర్జునునికి వినాశనాన్ని చూపించారు, చతుర్భుజుని కూడా చూపించారు. అర్జునుడు మరెవరో కాదు. ఇతనికి సాక్షాత్కారమయ్యింది. రాజ్యము లభించేటప్పుడు శివబాబాను ఎందుకు వారసునిగా చేసుకోరాదు? అని అనుకున్నారు. వారు మళ్లీ నన్ను వారసునిగా చేసుకుంటారు. ఇది చాలా మంచి వ్యాపారము. ఎప్పుడూ ఎవ్వరినీ ఏమీ అడగలేదు. అంతా గుప్తంగా ఇచ్చేశారు. దీనిని గుప్త దానమని అంటారు. ఇతనికి ఏమయ్యిందో ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఇతనికి వైరాగ్యము కలిగింది. బహుశా సన్యాసిగా అయిపోయాడని కొందరనుకున్నారు. కావున పిల్లలు కూడా ఇలా అంటారు - 5 మంది పిల్లలు ఉన్నారు, ఇక ఒక కొడుకుగా మేము శివబాబాను చేసుకుంటాము. ఇతను(బ్రహ్మ) కూడా తనదంతా బాబా ఎదురుగా ఉంచేశాడు. తద్వారా చాలా మందికి సర్వీసు జరిగింది. (బ్రహ్మ)బాబాను చూసి ఇంటిని వదిలి వెళ్లిపోవాలనే ఆలోచన అందరికీ కలిగింది. అందరూ ఇల్లు-వాకిలి వదిలి పరుగెత్తి వచ్చారు. అప్పటి నుండే హంగామా ప్రారంభమయ్యింది. ఇప్పటి ఇంటిని వదిలి పెట్టే ధైర్యమును వారు చూపించారు. భట్టీ జరిగిందని శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది. ఎందుకంటే వారికి ఏకాంతము తప్పకుండా కావాలి. తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రారాదు. బంధు-మిత్రులు మొదలైనవారు ఎవ్వరూ గుర్తు ఉండరాదు. ఎందుకంటే ఏదైతే పతితంగా అయ్యిందో దానిని తప్పకుండా పావనంగా చేయాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. ఇందులోనే సమస్యలు, కష్టాలు వస్తాయి. ఇది స్త్రీ-పురుషుల మధ్యలో కొట్లాట పెట్టే జ్ఞానమని అనేవారు. ఎందుకంటే ఒకరు పవిత్రంగా ఉంటూ మరొకరు లేకుంటే అల్లకల్లోలము(గొడవ) జరిగింది. వీరందరూ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా కొత్త విషయము జరిగింది కదా. ఇంతమంది పారిపోతున్నారు ఏమయ్యిందని అందరూ ఆశ్చర్యపడేవారు. మానవులకు తెలివైతే లేదు. ఏదో శక్తి ఉందని మాత్రము అనేవారు. తమ ఇంటిని వదిలి పారిపోయే విధంగా ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాది. కొందరు ఖాళీ చేతులతోనే పరుగెత్తి వచ్చారు. ఇది కూడా ఆట. ఇంటినీ అందరినీ వదిలి వచ్చేశారు. ఏమీ గుర్తు లేదు. కేవలం ఇది శరీరము, దీనితో పని చేయాలి, ఆత్మను కూడా స్మృతియాత్ర ద్వారా పవిత్రంగా చేయాలి. అప్పుడే పవిత్రమైన ఆత్మలు వాపస్ వెళ్లగలరు. అపవిత్రమైన ఆత్మ స్వర్గానికి వెళ్లలేదు. ఆ నియమము లేదు. ముక్తిధామములో పవిత్రమైనవారే ఉండాలి. పవిత్రంగా అవ్వడంలోనే ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇంతకుముందు ఇతర సత్సంగాలకు వెళ్లేందుకు ఆపేవారు కాదు. ఎక్కడికైనా వెళ్తుండేవారు. ఇక్కడ పవిత్రతా నియమము ఉన్నందున విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకపోతే వాపస్ ఇంటికి వెళ్లలేరని అర్థము చేసుకుంటారు. ధర్మరాజు ద్వారా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అప్పుడు చిన్న పదవి లభిస్తుంది. శిక్షలను అనుభవించకుంటే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. తండ్రి అంటారు - మధురమైన పిల్లలారా! మీరు నా వద్దకు రావాలి. ఈ పాత శరీరాన్ని వదిలి పవిత్ర ఆత్మగా అయ్యి రావాలి. మళ్లీ పంచ తత్వాలు సతోప్రధానంగా తయారైనప్పుడు సతోప్రధానమైన కొత్త శరీరము మీకు లభిస్తుంది. అంతా అతాలాకుతలమై కొత్తదిగా తయారవుతుంది. బాబా ఇతనిలో వచ్చి ప్రవేశించిన విధంగా ఆత్మ కూడా ఏ కష్టమూ లేకుండా గర్భమహలులోకి వెళ్లి కూర్చుంటుంది. మళ్లీ సమయము వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు లైటు వలె వెలుగుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఇవన్నీ డ్రామాలో రచింపబడ్డాయి. మంచిది!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఆత్మను పావనంగా చేసుకునేందుకు ఏకాంత భట్టిలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప మరే బంధు-మిత్రులెవ్వరూ గుర్తు రాకూడదు.
2. బుద్ధిలో జ్ఞానమంతా ఉంచుకొని, బంధనముక్తులుగా అయ్యి ఇతరులకు సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తండ్రి ఎలాగైతే అన్నీ గుప్తంగా చేశారో, అలా గుప్తదానము చేయాలి.
వరదానము :- '' నిమిత్త భావము మరియు నిర్మాన (నిరహంకార) భావముతో సేవ చేసే శ్రేష్ఠ సఫలతామూర్త్ భవ ''
సేవాధారి అనగా సదా తండ్రి సమానంగా నిమిత్తంగా ఉండి, నిరహంకారిగా ఉండేవారు. నిర్మానతయే శ్రేష్ఠ సఫలత కొరకు సాధనము. ఏ సేవలో అయినా సఫలత ప్రాప్తి చేసుకునేందుకు నమ్రతా భావము మరియు నిమిత్త భావాన్ని ధారణ చేయండి. దీని ద్వారా సేవలో సదా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవం చేస్తారు, సేవలో ఎప్పుడూ అలసట అనుభవమవ్వదు. ఏ సేవ లభించినా ఈ రెండు విశేషతల ద్వారా సఫలతను పొంది సఫలతా స్వరూపులుగా అవుతారు.
స్లోగన్ :- '' సెకండులో విదేహిగా అయ్యే అభ్యాసముంటే, సూర్య వంశములోకి వచ్చేస్తారు. ''
No comments:
Post a Comment