24-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - యోగబలము ద్వారా చెడు సంస్కారాలను పరివర్తన చేసి స్వయంలో మంచి సంస్కారాలను నింపుకోండి. జ్ఞానము మరియు పవిత్రతా సంస్కారాలు మంచి సంస్కారాలు. ''
ప్రశ్న :- పిల్లలైన మీ జన్మ సిద్ధ అధికారము ఏది ? మీకిప్పుడు ఏ ఫీలింగు(ఆలోచన) వస్తుంది ?
జవాబు :- ముక్తి-జీవన్ముక్తి మీ జన్మ సిద్ధ అధికారాలు. తండ్రితో పాటు మనము వాపసు ఇంటికి వెళ్లాలనే ఫీలింగ్ మీకిప్పుడు వస్తుంది. భక్తి ఫలితమైన ముక్తి, జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్లాలి. అందరూ తమ ఇంటిని సాక్షాత్కారము చేసుకోవాలి.
ఓంశాంతి. మానవులు(సిక్కులు) తండ్రిని సత్యమైన ఆధ్యాత్మిక చక్రవర్తి(పాత్‌షాహ్) అని కూడా అంటారు. ఆంగ్లములో అలా అనరు. అందులో కేవలం సత్యమైన ఫాదర్ అని అంటారు. గాడ్‌ఫాదర్ ఈజ్ ట్రూత్ అని అంటారు. భారతదేశములోనే సత్యమైన ఆధ్యాత్మిక పాత్‌షాహ్(చక్రవర్తి) అని అంటారు. ఆ రెండిటికీ చాలా తేడా ఉంది. వారు కేవలం సత్యమే చెప్తారు. సత్యమును నేర్పిస్తున్నారు, సత్యంగా తయారుచేస్తారు. ఇక్కడ సత్యమైన పాత్‌షాహ్ అని అంటారు. సత్యంగానూ చేస్తారు, సత్యఖండానికి చక్రవర్తిగా కూడా చేస్తారు. ముక్తినీ ఇస్తారు, జీవన్ముక్తిని కూడా ఇస్తారు. దీనిని భక్తి ఫలితమని అంటారు. లిబరేషన్(ముక్తి), ఫ్రూషన్(/జీవన్ముక్తి) - భక్తికిి ఫలమును ఇస్తారు, ముక్తులుగానూ చేస్తారు. మనకు రెండూ ఇస్తారని పిల్లలకు తెలుసు. ముక్తినైతే అందరికీ ఇస్తారు. ఫలమును(జీవన్ముక్తిని) మీకు మాత్రమే ఇస్తారు. లిబరేషన్ మరియు ఫ్రూషన్ - ఈ భాష కూడా తయారు చేయబడింది కదా. భాషలైతే చాలా ఉన్నాయి. భక్తిలో శివబాబాకు కూడా చాలా పేర్లు పెట్టేస్తారు. వారి పేరు శివబాబా అని ఎవరికైనా చెప్తే, వారిని మేమైతే మాలిక్(యజమాని) అనే అంటామని కొందరు అంటారు. మాలిక్ అని అనడం బాగానే ఉంది కానీ వారికి కూడా పేరుండాలి కదా. నామ-రూపాలకు అతీతంగా ఏ వస్తువూ ఉండదు. మాలిక్ కూడా ఏదో ఒక వస్తువుకు అధికారిగా అవుతారు కదా, నామ-రూపాలైతే తప్పకుండా ఉంటాయి. తండ్రి తప్పకుండా విడుదల కూడా చేస్తారు, తర్వాత అందరూ శాంతిధామానికి తప్పకుండా వెళ్లాలని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. తమ ఇంటిని అందరూ సాక్షాత్కారము చేసుకోవాలి. ఇంటి నుండి వచ్చారు కనుక మొదట ఇంటిని సాక్షాత్కారము చేసుకుంటారు. దానిని గతి-సద్గతి అని అంటారు. వారు గతి-సద్గతి అని అంటారు కానీ అర్థ రహితంగా అంటారు. మనము మన ఇంటికి వెళ్తాము, ఫలితము కూడా లభిస్తుందని పిల్లలైన మీరు ఫీల్ అవుతారు. మీకు నంబరువారుగా లభిస్తుంది. తర్వాత ఇతర ధర్మాల వారికి కూడా సమయానుసారంగా లభిస్తుంది. మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా? అని ప్రశ్నించే ఈ కరపత్రము చాలా బాగుందని తండ్రి తెలియజేశారు. ఈ ముక్తి-జీవన్ముక్తి రెండూ తండ్రి ఇచ్చే జన్మ సిద్ధ అధికారమని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు వ్రాయగలరు కూడా. తండ్రి ద్వారా పిల్లలైన మీకు ఈ జన్మ సిద్ధ అధికారము లభిస్తుంది. తండ్రి వారిగా అవ్వడము వలన ఈ రెండూ ప్రాప్తిస్తాయి. అది రావణుని జన్మ సిద్ధ అధికారము, ఇది పరమపిత పరమాత్ముని జన్మ సిద్ధ అధికారము. ఇది భగవంతుని జన్మ సిద్ధ అధికారము, ఇది సైతాన్(మాయ) జన్మ సిద్ధ అధికారము. అర్థము చేసుకునే విధంగా వ్రాయాలి. పిల్లలైన మీరిప్పుడు స్వర్గమును స్థాపించాలి. ఎంత పని చేయాలి! ఇప్పుడైతే పసి పిల్లల వలె(బేబీస్ వలె) ఉన్నారు. ఎలాగైతే మానవులు కలియుగము గురించి చెప్పునప్పుడు ఇది చిన్న బాలుని వలె ఉందని అంటారో అలా సత్యయుగ స్థాపనలో చిన్న బాలుని వలె ఉందని తండ్రి చెప్తారు. పిల్లలైన మీకిప్పుడు వారసత్వము లభిస్తోంది. రావణుని వారసత్వము అని అనరు. భగవంతుడైన తండ్రి ద్వారా అయితే వారసత్వము లభిస్తుంది. రావణుడు తండ్రి కాదు. రావణుని 5 వికారాలను సైతాన్ అని అంటారు. సైతాన్ నుండి వారసత్వముగా ఏం లభిస్తుంది? - పంచ వికారాలు లభిస్తాయి. వాటిని ప్రదర్శిస్తారు కూడా, తమోప్రధానంగా అవుతారు. ఇప్పుడు దశరాను ఎంతగా జరుపుకుంటారు. వేడుకగా జరుపుకుంటారు. చాలా ఖర్చు చేస్తారు. విదేశాల నుండి కూడా ఆహ్వానిస్తారు. అన్నింటికంటే దశరాను మైసూరులో బాగా జరుపుతారు. ధనవంతులు కూడా చాలామంది ఉన్నారు. రావణ రాజ్యములో ధనము లభిస్తే బుద్ధి పాడైపోతుంది. తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు. దీని పేరే రావణ రాజ్యము. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు. రామరాజ్యమని అనడం కూడా తప్పు. గాంధీగారు రామరాజ్యాన్ని కోరుకునేవారు. గాంధీగారు కూడా అవతరించారని(అవతార పురుషుడని) మనుష్యులు భావిస్తారు. వారికి ఎంత ధనము ఇస్తూ ఉండేవారు. వారిని భారతదేశ బాపూజి(జాతిపిత) అని పిలిచేవారు. ఇప్పుడు వీరు(శివబాబా) విశ్వానికంతా బాపూజీగా ఉన్నారు. ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు. జీవాత్మలు ఎంతమంది ఉంటారో తెలుసు. జీవమైతే(శరీరము) వినాశనమవుతుంది, ఆత్మ అవినాశి. ఆత్మలైతే చాలా ఉన్నాయి. పైన నక్షత్రాలు ఉన్న విధంగా ఆత్మలు ఉన్నాయి. నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయా లేక ఆత్మలు ఎక్కువగా ఉన్నాయా? ఎందుకంటే మీరు భూమి పై ఉన్న నక్షత్రాలు, అవి ఆకాశములోని నక్షత్రాలు. మిమ్ములను దేవతలని అంటారు. వారైతే వాటిని కూడా దేవతలని అంటారు. మిమ్ములను అదృష్ట నక్షత్రాలని అంటారు కదా.
మంచిది, దీని గురించి తర్వాత పరస్పరములో చర్చించండి. బాబా ఈ విషయమును ఇప్పుడే ప్రస్తావించరు. సర్వాత్మల తండ్రి ఒక్కరే అని తండ్రి అర్థం చేయించారు. ఇతని బుద్ధిలో అయితే జ్ఞానమంతా ఉంది. మానవ మాత్రులందరికీ వారు తండ్రి. మొత్తం సృష్టి అంతా సముద్రము పై నిలబడి ఉందని అందరికీ తెలుసు. ఈ విషయము కూడా కొందరికి తెలియదు. సృష్టి అంతటా రావణ రాజ్యముందని తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యము సాగర తీరములో లేదు. సముద్రమైతే నలువైపులా ఉంది. క్రింద ఎద్దు ఉంది, దాని కొమ్ముల పైన సృష్టి నిల్చొని ఉందని అంటారు కదా. అది అలసిపోయినప్పుడు కొమ్మును మార్చుకుంటుంది, అప్పుడు పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచము స్థాపనవుతుంది - శాస్త్రాలలో అయితే ఇలాంటి చాలా విషయాలను కట్టుకథలుగా వ్రాసేశారు. ఇక్కడ ఆత్మలన్నీ శరీరాలతో పాటు ఉన్నాయని పిల్లలు అర్థం చేసుకున్నారు. వీరిని జీవాత్మలని అంటారని పిల్లలకు తెలుసు. అది ఆత్మలందరి ఇల్లు. అక్కడ శరీరాలు ఉండవు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. జీవమునకు ఆకారమున్నందున సాకారమని అంటారు. నిరాకారునికి శరీరముండదు. ఇది సాకార సృష్టి, అది నిరాకార ఆత్మల ప్రపంచము. దీనిని సృష్టి అని అంటారు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. ఆత్మ శరీరములోకి వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి(చుర్‌పుర్ చల్తీ హై). ఆత్మ లేకపోతే శరీరము దేనికీ పనికి రాదు. కావున దానిని నిరాకార ప్రపంచమని అంటారు. ఉన్న ఆత్మలందరూ చివర్లో రావాలి. అందువలన దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. ఆత్మలందరూ ఇక్కడకు వచ్చినప్పుడు అక్కడ ఒక్కరు కూడా ఉండరు. అక్కడ పూర్తి ఖాళీ అయినప్పుడు అందరూ వాపస్ వెళ్తారు. మీరు నంబరువారు పురుషార్థానుసారము ఈ సంస్కారాన్ని తీసుకెళ్తారు. కొందరు జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు, కొందరు పవిత్ర సంస్కారాన్ని తీసుకెళ్తారు. మళ్లీ ఇక్కడికే రావాలి. కానీ మొదట ఇంటికి వెళ్లాలి. అక్కడ మంచి సంస్కారము ఉంటుంది. ఇక్కడ చెడు సంస్కారముంది. మంచి సంస్కారము మారి చెడు సంస్కారంగా అవుతుంది. యోగబలము ద్వారా చెడు సంస్కారము మళ్లీ మంచిగా అవుతుంది. మంచి సంస్కారాన్ని మళ్లీ అక్కడికి తీసుకెళ్తారు. తండ్రిలో కూడా చదివించే సంస్కారముంది కదా. అందువలన వారు వచ్చి చదివిస్తారు(అర్థం చేయిస్తారు). రచయిత, రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బీజము గురించి కూడా అర్థం చేయిస్తారు. అలాగే వృక్షమంతటి జ్ఞానము కూడా అర్థం చేయిస్తారు. బీజము జ్ఞానము, వృక్షము భక్తి. భక్తిలో చాలా వివరాలు ఉంటాయి కదా. బీజమును స్మృతి చేయడం సహజము. అక్కడికే వెళ్లిపోవాలి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు కొద్ది సమయమే పడ్తుంది. మళ్లీ సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యేందుకు ఖచ్ఛితంగా 5 వేల సంవత్సరాలు పడ్తుంది. ఇది చాలా ఖచ్ఛితంగా తయారైన చక్రము. అది పునరావృతమౌతూ ఉంటుంది. ఇతరులెవ్వరూ ఈ విషయాలు తెలుపలేరు. మీరు తెలుపగలరు. అర్ధము-అర్ధము చేయబడ్తుంది. అర్ధము స్వర్గము, అర్ధము నరకము. తర్వాత వాటి వివరాలను కూడా తెలుపుతారు. స్వర్గములో తక్కువ జన్మలు, ఎక్కువ ఆయువు ఉంటుంది. నరకములో ఎక్కువ జన్మలు, ఆయువు తక్కువగా ఉంటుంది. అక్కడ యోగులుగా ఉంటారు, ఇక్కడ భోగులుగా ఉన్నారు. అందువలన ఇక్కడ చాలా జన్మలు ఉంటాయి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. మనుష్యులకు కొంచెం కూడా తెలియదు. దేవతలు ఎప్పుడు ఉండేవారో, వారు ఎలా తయారయ్యారో, ఎంత తెలివిగలవారిగా అయ్యారో ఈ విషయాలన్నీ మీకు తెలుసు. తండ్రి ఈ సమయములో పిల్లలను చదివించి 21 జన్మల కొరకు వారసత్వము ఇస్తారు. ఆ తర్వాత ఈ సంస్కారము ఉండదు. తర్వాత దు:ఖ సంస్కారాలుంటాయి. రాజ్య సంస్కారమున్నప్పుడు ఈ జ్ఞానమును చదువుకునే సంస్కారము పూర్తి అవుతుంది. ఈ సంస్కారము పూర్తి అయితే నంబరువారు పురుషార్థానుసారము రుద్రమాలలో కూర్చబడ్తారు. మళ్లీ పాత్ర చేసేందుకు నంబరువారుగా వస్తారు. ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారో వారు మొదట వస్తారు. వారి పేరు కూడా తెలుపుతారు. కృష్ణుడైతే స్వర్గానికి మొదటి రాకుమారుడు. రాజ్యములో కేవలం ఒక్కరే ఉండరని మీకు తెలుసు. రాజధాని అంతా ఉంటుంది కదా. రాజుతో పాటు ప్రజలు కూడా ఉండాలి. ఒకరి ద్వారా మరొకరు జన్మిస్తూ ఉంటారు. ఒకవేళ 8 మంది కలిసి వస్తారని చెప్పినా శ్రీ కృష్ణుడైతే మొదటి నంబరులో వస్తాడు కదా. 8 మంది కలిసి వస్తే కృష్ణునికి అంత మహిమ ఎందుకుంటుంది? ఈ విషయాలన్నీ పోను పోను అర్థము చేయిస్తాను. ఈ రోజు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తానని అంటారు కదా. అనగా ఏదో కొంత మిగిలి ఉందని కదా! సర్వీసు చేస్తున్న సమయములో ఎవరికైనా అర్థము కాకుంటే మా పెద్ద అక్కయ్య సమాధానము ఇవ్వగలరని లేక ఇంతవరకు తండ్రి ఇంకా అర్థం చేయించలేదని యుక్తిగా చెప్పండి. రోజురోజుకు అతిగుహ్యమైన విషయాలను వినిపిస్తారు. ఇలా చెప్పడంలో సిగ్గుపడే విషయమేదీ లేదు. గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపించినప్పుడు మీరు విని చాలా సంతోషిస్తారు. చివర్లో మన్మనాభవ, మధ్యాజీభవ అని అనేస్తారు. ఈ పదాలను కూడా శాస్త్రాలను తయారు చేయువారే వ్రాశారు. ఇందులో తికమకపడే అవసరము లేదు. కొడుకు తండ్రివానిగా అవ్వడంతోనే బేహద్ సుఖము లభించింది. ఇందులో మనసా, వాచా, కర్మణా పవిత్రత అవసరము. లక్ష్మినారాయణులకు తండ్రి వారసత్వం లభించింది కదా. వీరు మొదటి నంబరులో ఉన్నారు, వీరికే పూజలు జరుగుతాయి. మాలో ఇలాంటి గుణాలున్నాయా? అని స్వయాన్ని చూసుకోండి. ఇప్పుడైతే గుణహీనులుగా ఉన్నారు కదా. తమలో ఉన్న అవగుణాలను గురించి ఎవ్వరికీ తెలియదు.
మీరిప్పుడు తండ్రివారిగా అయ్యారు కనుక తప్పకుండా పరివర్తనవ్వాలి. తండ్రి బుద్ధి తాళమును తెరిచారు. బ్రహ్మ, విష్ణువుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇతను పతితుడు, అతను పావనుడు. ఈ సంగమ యుగములోనే దత్తత తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడే దత్తు తీసుకుంటారు. సత్యయుగములో దత్తత ఉండదు. ఇక్కడ కూడా ఎవరికైనా పిల్లలు లేకుంటే దత్తత తీసుకుంటారు. ప్రజాపితకు కూడా బ్రాహ్మణ పిల్లలు తప్పకుండా కావాలి. వీరు ముఖవంశావళి, వారు కుఖవంశావళి. బ్రహ్మ అయితే చాలా ప్రసిద్ధి చెందారు. ఇతని ఇంటి పేరే బేహద్‌గా ఉంది. ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడని, అతడిని ఆంగ్లములో గ్రేట్ గ్రేట్ గ్రాండ్‌ఫాదర్ అని అంటారని అందరికీ తెలుసు. ఇది బేహద్ ఇంటి పేరు. అవన్నీ హద్దుగా ఉన్న ఇంటి పేర్లు. అందువలన భారతదేశము చాలా గొప్ప తీర్థ స్థానమని, ఇక్కడ బేహద్ తండ్రి వచ్చారనే విషయము అందరికీ తప్పకుండా తెలియాలని తండ్రి చెప్తున్నారు. అలాగని మొత్తం భారతదేశములో విరాజమానమయ్యారని కాదు. శాస్త్రాలలో మగధ దేశమని వ్రాశారు. కానీ జ్ఞానాన్ని ఎక్కడ నేర్పించారు? ఆబూలో ఎలా వచ్చారు? దిల్వాడా మందిరములో కూడా జ్ఞాపక చిహ్నము పూర్తిగా ఉంది. తయారుచేసిన వారి బుద్ధికి ఏది వస్తే దానిని కూర్చుని తయారు చేయించారు. ఖచ్ఛితమైన నమూనానైతే తయారు చేయలేరు. తండ్రి ఇక్కడనే వచ్చి అందరికి సద్గతినిస్తారు. మగధ దేశములో కాదు. అది పాకిస్తాన్, ఇది పాక్(పవిత్రమైన) స్థానము. వాస్తవానికి పవిత్రమైన స్థానమును స్వర్గమని అంటారు. పవిత్రత, అపవిత్రత గురించే ఈ మొత్తం డ్రామా అంతా తయారు చేయబడింది.
కావున మధురాతి మధురమైన తప్పిపోయి దొరికిన పిల్లలారా! - ఆత్మలు, పరమాత్మ చాలాకాలంగా వేరుగా ఉన్నారని,............ (ఆత్మాయే పరమాత్మా అలగ్ రహే బహుకాల్.........) మీరు అర్థం చేసుకున్నారు. ఎంత కాలము తర్వాత కలుసుకున్నారు? మళ్లీ ఎప్పుడు కలుసుకుంటారు? సద్గురువు దళారి రూపములో లభించినప్పుడు సుందర కలయిక చేశారు. గురువులైతే చాలామంది ఉన్నారు కదా. అందువలన సద్గురువని అంటారు. స్త్రీకి కంకణము కట్టినప్పుడు - ఇతను నీకు పతి, గురువు, ఈశ్వరుడని కూడా చెప్తారు. కానీ ఆ పతియే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు. నేటి ప్రపంచములో చాలా అశుద్ధత, మురికి ఉంది. పిల్లలైన మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి. పిల్లలైన మీకు తండ్రి చాలా పక్కాగా కంకణమును కడ్తారు.
మీకు శివజయంతితో పాటే రక్షాబంధనము కూడా జరుగుతుంది. గీతాజయంతి కూడా జరగాలి. కృష్ణ జయంతి తర్వాత కాస్త ఆలస్యంగా కొత్త ప్రపంచములో జరిగింది. ఇక పండుగలన్నీ ఈ సమయములోనివే. రామనవమి ఎప్పుడు జరిగిందో ఎవరికైనా తెలుసా? కొత్త ప్రపంచములో 1250 సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుందని మీరంటారు. శివజయంతి, కృష్ణ జయంతి, రామ జయంతి,............ ఎప్పుడు జరిగిందో ఎవ్వరూ తెలుపలేరు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఖచ్ఛితంగా తెలుపగలరు. అనగా ప్రపంచమంతటి జీవిత కథను మీరు తెలుపగలరు. లక్షల సంవత్సరాల విషయాన్ని తెలుపలేరు. బేహద్ చదువును తండ్రి ఎంత బాగా చదివిస్తున్నారు! ఒకేసారి మీరు 21 జన్మల వరకు నగ్నంగా అవ్వడం నుండి సురక్షితమవుతారు. మీరిప్పుడు పంచ వికారాలనే రావణుని పరాయి రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు 84 జన్మల చక్రమంతా మీ స్మృతిలోకి వచ్చింది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బేహద్(అనంతమైన) సుఖమును పొందేందుకు మనసా, వాచా, కర్మణా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. యోగబలము ద్వారా మంచి సంస్కారాన్ని ధారణ చేయాలి. స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి.
2. సదా సంతోషంగా ఉండేందుకు తండ్రి ప్రతిరోజు వినిపించే గుహ్యమైన విషయాలను వినాలి, ఇతరులకు వినిపించాలి. ఏ విషయములోనూ తికమక పడరాదు. యుక్తిగా సమాధానము చెప్పాలి. సిగ్గుపడరాదు.
వరదానము :- '' స్వమానమనే సీటు పై స్థితమై ఉండి శక్తులను ఆజ్ఞానుసారము నడిపించే విశాల బుద్ధి భవ ''
మీ విశాల బుద్ధి ద్వారా సర్వ శక్తుల రూపి సేవాధారులను సమయానికి కార్యములో ఉపయోగించండి. పరమాత్మ ద్వారా డైరక్టుగా లభించిన ఏ టైటిల్స్ అయితే ఉన్నాయో వాటి నశాలో ఉండండి. స్వమాన స్థితి రూపి సీటు పై స్థితమై ( సెట్ అయ్యి ) ఉంటే సర్వ శక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నాయని అనుభవమవుతుంది. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాయి. కనుక వరదానము మరియు వారసత్వాలను కార్యములో ఉపయోగించండి. యజమానిగా, యోగయుక్తముగా అయ్యి యుక్తియుక్తముగా సేవాధారుల నుండి సేవ తీసుకుంటే సదా రాజీగా(సంతోషంగా) ఉంటారు, పదే పదే అర్జీలు వేయకండి.
స్లోగన్ :- '' ఏ కార్యాన్ని అయినా ప్రారంభించేందుకు ముందు విశేషంగా '' సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మ అయిన నా జన్మ సిద్ధ అధికారము '' అనే స్మృతిని ఎమర్జ్ చేయండి. ''
No comments:
Post a Comment