Tuesday, September 17, 2019

Telugu Murli 07/09/2019

07-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మీకు తమ పరిచయమునిస్తారు. మీరు కూడా అందరికీ తండ్రి యథార్థ పరిచయమునివ్వాలి ''

ప్రశ్న :- పిల్లలు అడిగే ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు ?
జవాబు :- బాబా మీ పరిచయమివ్వడం చాలా కష్టము, మేము మీ పరిచయమును ఎలా ఇవ్వాలి? అని అడిగినప్పుడు ఈ ప్రశ్న విని తండ్రికి కూడా ఆశ్చర్యము కలుగుతుంది. మీకు తండ్రి తమ పరిచయమిచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఇందులో కష్టమనే మాటే లేదు. ఇది చాలా సులభము. ఆత్మలమైన మనమందరము నిరాకారులము కనుక ఆత్మల తండ్రి కూడా తప్పకుండా నిరాకారునిగానే ఉంటారు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని భావిస్తారు. అనంతమైన తండ్రి ఈ రథములోనే వస్తారని కూడా పిల్లలకు తెలుసు. బాప్‌దాదా అని అన్నప్పుడు, శివబాబా ఈ రథములో కూర్చుని తన పరిచయమును ఇస్తున్నారని తెలిసే ఉంటుంది. వారు తండ్రి అని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తే పాపము భస్మమవుతుందని తండ్రి మతమునిస్తారు. దీనినే యోగాగ్ని అని అంటారని పిల్లలకు తెలుసు. మీరిప్పుడు తండ్రినైతే గుర్తించారు. కనుక తండ్రి పరిచయమును ఇతరులకు ఎలా తెలపాలని ఎప్పుడూ అనలేరు. మీకు కూడా బేహద్‌ తండ్రి పరిచయముంది కావున తప్పకుండా ఇతరులకు కూడా ఇవ్వగలరు. పరిచయమును ఎలా ఇవ్వాలి? అను ప్రశ్నే రాజాలదు. మీరు తెలుసుకున్న విధంగానే, ఆత్మలైన మనందరికి తండ్రి ఒక్కరే ఉన్నారని చెప్పగలరు. ఇందులో తికమక పడే అవసరమే లేదు. బాబా, మీ పరిచయమునివ్వడము చాలా కష్టమవుతుందని కొందరు అంటారు. అరే! తండ్రి పరిచయమివ్వడంలో కష్టమేమీ లేదు. జంతువులు కూడా నేను ఫలానావారి బిడ్డనని సూచనతోనే అర్థము చేసుకుంటాయి. ఆత్మలైన మనందరికి వారు తండ్రి అని మీకు కూడా తెలుసు. ఆత్మలమైన మనమిప్పుడు ఈ శరీరములో ప్రవేశించి ఉన్నాము. ఆత్మ అకాలమూర్తి అని తండ్రి అర్థం చేయించారు. అలాగని దానికి ఏ రూపమూ లేదని కాదు. చాలా సహజమైన(సింపుల్‌) విషయమని పిల్లలు గుర్తించారు. ఆత్మలందరికీ నిరాకారుడైన తండ్రి ఒక్కరే. ఆత్మలమైన మనందరము పరస్పరములో సోదరులము(భాయి-భాయి). ఒకే తండ్రి సంతానము. తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుంది. తండ్రిని గురించి, వారి రచనను గురించి తెలియని పిల్లలు ఈ ప్రపంచములో ఎవ్వరూ ఉండరని కూడా తెలుసు. తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో కూడా అందరికీ తెలుసు. ఇది ఆత్మ-పరమాత్మల మేళా. ఇది కళ్యాణకారి మేళా (ఉత్సవము). తండ్రియే కళ్యాణకారి. చాలా కళ్యాణము చేస్తారు. తండ్రిని గుర్తిస్తే, అనంతమైన తండ్రి ద్వారా మనకు అనంతమైన వారసత్వము లభిస్తుందని అర్థం చేసుకున్నారు. సన్యాసులైన గురువుల వారసత్వము గురించి వారి శిష్యులెవ్వరికీ తెలియదు. గురువు దగ్గర ఉన్న ఆస్తిని ఎవరో కొంత మంది శిష్యులు మాత్రమే చాలా కష్టంగా తెలుసుకుంటారు. వారు శివబాబా అని, వారి వద్ద ఆస్తి కూడా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్యమైన స్వర్గముందని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియవు. లౌకిక తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో వారి పిల్లలకు మాత్రమే తెలుసు. మేము జీవించి ఉండే పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయినామని మీరు అంటారు. వారి ద్వారా ఏమి లభిస్తుందో కూడా తెలుసు. మనము మొదట శూద్ర కులములో ఉండేవారము. ఇప్పుడు బ్రాహ్మణ కులములోకి వచ్చేశాము. బాబా ఈ బ్రహ్మ తనువులో వస్తారని, వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారనే జ్ఞానము ఉంది. వారు(శివ) సర్వాత్మలకు తండ్రి. ఇతడిని(ప్రజాపిత బ్రహ్మను) గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌ అని అంటారు. మనమిప్పుడు వీరి పిల్లలుగా అయ్యాము. వారు శివబాబా గురించి సర్వత్రా ఉన్నారని సర్వజ్ఞులని అంటారు. వారు ఎలా రచన యొక్క ఆదిమధ్యాంత జ్ఞానమును తెలుపుతారో కూడా మీకిప్పుడు తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. వారిని నామ-రూపాలకు అతీతులని చెప్పడము అసత్యము. వారి నామ-రూపాలు కూడా గుర్తున్నాయి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. జయంతి అంటే మానవులది. శివబాబా జయంతిని రాత్రి అని అంటారు. రాత్రి అని దేనిని అంటారో పిల్లలకు తెలుసు. రాత్రిలో ఘోరాంధకారముంటుంది. అజ్ఞానము అంధకారము కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానాంధకారము వినాశనమయ్యిందని ఇప్పుడు కూడా పాడ్తారు. కానీ ఏమీ అర్థము చేసుకోరు. ఏ సూర్యుడు, ఎప్పుడు ఉదయించినారో ఏమీ అర్థము చేసుకోరు. జ్ఞాన సూర్యుని జ్ఞానసాగరుడని కూడా అంటారని తండ్రి అర్థం చేయిస్తారు. బేహద్‌ తండ్రి జ్ఞాన సాగరులు. సన్యాసులు, గురువులు, సాధువులు మొదలైనవారు స్వయాన్ని శాస్త్రాలకు అథారిటీ అని భావిస్తారు. అదంతా భక్తిమార్గము. చాలా వేదశాస్త్రాలు చదువుకొని విద్వాంసులుగా అవుతారు. కనుక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు - ఇది ఆత్మ-పరమాత్మల మేళా అని అర్థం చేయిస్తారు. తండ్రి ఈ రథములో వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ కలయికనే ఉత్సవమని అంటారు. మనము ఇంటికి వెళ్లడము కూడా మేళాయే. ఇక్కడ స్వయంగా తండ్రి కూర్చొని చదివిస్తారు. వారు తండ్రే కాక టీచరు కూడా. ఒక్క పాయింటునే బాగా ధారణ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు తండ్రి నిరాకారులు. వారికి తమ శరీరము లేదు. కావున తప్పకుండా తీసుకోవలసి వచ్చింది. అందువలన నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని తండ్రియే అంటారు. లేకుంటే ఎలా మాట్లాడాలి? శరీరము లేకుండా మాట్లాడలేరు. కావున తండ్రి ఈ తనువులో వస్తారు. వీరికి బ్రహ్మ అని పేరు పెట్టారు. మనము కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. కనుక పేరు మార్చుకోవలసిందే. మీకు పేర్లు పెట్టాము. కాని వారిలో కూడా చాలామంది ఇప్పుడు లేనే లేరు. అందువలన బ్రాహ్మణుల మాల ఉండదు. భక్తుల మాల రుద్రమాల అని గాయనముంది. బ్రాహ్మణుల మాల ఉండదు. విష్ణు మాల ఏమో కొనసాగుతూ వచ్చింది. మాలలో మొదటి నంబరు పూస ఎవరు? జంట అని చెప్తారు. అందువలన సూక్ష్మ లోకములో కూడా జంటను చూపించారు. విష్ణువును కూడా నాలుగు భుజాలు కలిగినవారిగా చూపించారు. రెండు భుజాలు లక్ష్మివి, రెండు భుజాలు నారాయణునివి.
నేను చాకలినని తండ్రి అర్థం చేయిస్తారు. నేను యోగబలము ద్వారా ఆత్మలైన మిమ్ములను శుద్ధంగా చేసినా మళ్లీ మీరు వికారాలలోకి వెళ్లి తమ అలంకారమునంతా పోగొట్టుకుంటారు. అందరినీ శుద్ధంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆత్మలకు నేర్పించాలంటే నేర్పించేవారు తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా. బాబా, మీరు వచ్చి పావనంగా చేయమని వేడుకుంటారు. దుస్తులు కూడా మురికి పట్టిపోతే వాటిని ఉతికి శుభ్రము చేస్తారు. ఓ పతితపావనా! బాబా, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని మీరు కూడా వేడుకుంటారు. ఆత్మ పావనంగా అయితే శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. తండ్రి పరిచయమివ్వడం ముఖ్యమైన విషయము. తండ్రి పరిచయమును ఎలా ఇవ్వాలని ప్రశ్నించలేరు. మీకు కూడా తండ్రి తమ పరిచయమును ఇచ్చారు. అందుకే కదా మీరు రాగలిగారు. తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి ఎక్కడున్నారు? ఈ రథములో. ఇది అవినాశి సింహాసనము(అకాలతక్త్‌). ఆత్మలైన మీరు కూడా అకాలమూర్తులే. ఇవన్నీ మీ సింహాసనాలు. వీటి పై ఆత్మలైన మీరు విరాజమానమై ఉన్నారు. ఆ అకాల సింహాసనము(సిక్కు మందిరములోనిది) జడమైనది కదా. నేను అకాలమూర్తిని అనగా నిరాకారుడను, నాకు సాకార రూపము లేదని మీకు తెలుసు. నేను ఆత్మను అవినాశిని, ఎప్పటికీ నాశనమవ్వను. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరము తీసుకుంటాను. ఆత్మనైన నా పాత్ర అవినాశిగా రచింపబడింది. ఇప్పటి నుండి 5 వేల సంవత్సరాల క్రితము కూడా మన పాత్ర ఇలాగే ప్రారంభమయ్యింది. ఒకటి-ఒకటి-ఒకటి(01-01-01) నుండి ఇక్కడ పాత్ర చేసేందుకు ఇంటి నుండి వస్తాము. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. కావున తక్కువ సంవత్సరాల గురించి ఆలోచించరు. పిల్లలు తండ్రి పరిచయమును ఎవరికి ఎలా ఇవ్వాలని ఎప్పటికీ అడగలేరు. ఇలాంటి ప్రశ్నలడిగితే విచిత్రమనిపిస్తుంది. అరే! మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. మరి తండ్రి పరిచయమును ఎందుకు ఇవ్వలేరు! మనమంతా ఆత్మలము. వారు మన తండ్రి. సర్వులకు సద్గతినిస్తారు. సద్గతిని ఎప్పుడిస్తారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమ యుగములో వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. వారు ఇప్పుడింకా 40 వేల సంవత్సరములుందని, నామ-రూపాలకు అతీతంగా ఉన్నానని మొదటి నుండే చెప్పేస్తారు. నామ-రూపాలకు అతీతంగా ఏ వస్తువూ ఉండదు. రాయి-రప్పకు కూడా పేరుంది కదా! కావున తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! మీరు బేహద్‌ తండ్రి వద్దకు వచ్చారు. అనేకమంది పిల్లలున్నారని తండ్రికి కూడా తెలుసు. పిల్లలు ఇప్పుడు హద్దు, బేహద్‌ నుండి కూడా అతీతమవ్వాలి. పిల్లలందరినీ చూస్తారు. అందరినీ తీసుకెళ్లేందుకు నేను వచ్చానని పిల్లలకు తెలుసు. సత్యయుగములో అయితే చాలా కొద్ది మందే ఉంటారు. ఎంత స్పష్టంగా ఉంది! అందువలన చిత్ర్రాలు చూపి వాటి గురించి అర్థం చేయిస్తారు. జ్ఞానమైతే చాలా సులభము. ఇక స్మృతి యాత్రలోనే సమయము పడ్తుంది. ఇలాంటి తండ్రిని ఎప్పటికీి మర్చిపోరాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి చెప్తారు. పతితులను పావనంగా చేసేందుకే నేను వస్తాను. మీరు అకాలమూర్తులైన ఆత్మలందరూ తమ తమ సింహాసనాల పై విరాజమానమై ఉన్నారు. బాబా కూడా ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకున్నారు. ఈ భాగ్యశాలి రథములో తండ్రి ప్రవేశిస్తారు. కొందరు పరమాత్మకు నామ-రూపాలు లేవని అంటారు. ఈ విధంగా ఉండేందుకు వీలే లేదు. వారిని వేడుకుంటున్నారు, మహిమ చేస్తున్నారు. కావున తప్పకుండా ఉంటారు కదా. తమోప్రధానమైనందువలన కొంచెం కూడా అర్థము చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! 84 లక్షల యోనులేమీ లేవు. 84 జన్మలే ఉన్నాయి. అందరూ పునర్జన్మలు కూడా తీసుకుంటారు. బ్రహ్మములోకి వెళ్లి లీనమైపోరు లేక మోక్షమును పొందలేరు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఒక్కరు కూడా పెరగరు, తరగరు. ఈ అనాది అవినాశి డ్రామా ఆధారంగానే చిన్న చిన్న డ్రామాలు లేక నాటకాలు తయారు చేస్తారు. అవి వినాశి. ఇప్పుడు మీరు బేహద్‌లో నిల్చొని ఉన్నారు. 84 జన్మలు ఎలా తీసుకుంటామనే జ్ఞానము పిల్లలైన మీకిప్పుడు లభించింది. ఇప్పుడు తండ్రి తెలిపించారు. ఇంతకుముందు ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు కూడా మాకు తెలియదని చెప్పేవారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు సంగమ యుగములోనే తండ్రి వస్తారు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని మళ్లీ స్థాపిస్తారు. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఏమీ గుర్తుకు రాదు. మహాప్రళయము కూడా జరగదు. తండ్రి రాజయోగమును నేర్పిస్తారు. మళ్లీ మీరు రాజ్యము పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు. మొట్టమొదట తండ్రి ప్రియమైనవారు తర్వాత శ్రీకృష్ణుడు ప్రియమైనవారు. శ్రీకృష్ణుడు స్వర్గములోని ప్రప్రథమ రాకుమారుడని మీకు తెలుసు. అతడే తర్వాత 84 జన్మలు తీసుకుంటాడు. అతని అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవ్వాలి. తండ్రియే పతితపావనులు. నీటి నదులు పావనంగా చేయలేవు! ఈ నదులైతే సత్యయుగములో కూడా ఉంటాయి. అక్కడైతే నీరు చాలా శుద్ధంగా ఉంటుంది. మురికి మొదలైనవి ఏమీ ఉండదు. ఇక్కడ ఎంత మురికి పడుతూ ఉంటుందో జ్ఞానములేనప్పుడు ఈ బాబా చూశారు. నీరు పావనంగా ఎలా చేస్తుందని ఇప్పుడు ఆశ్చర్యపోతారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా! తండ్రిని ఎలా స్మృతి చేయాలని ఎప్పుడూ తికమక పడరాదు. అరే! మీరు తండ్రిని స్మృతి చేయలేరా! వారు గర్భజనిత సంతానము. మీరు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఏ తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని దత్తు పిల్లలు మర్చిపోగలరా? బేహద్‌ తండ్రి ద్వారా బేహద్‌ ఆస్తి లభిస్తుంటే వారిని మర్చిపోరాదు. లౌకిక పిల్లలు తండ్రిని మర్చిపోతారా! కానీ ఇక్కడ మాయ వ్యతిరేకిస్తుంది. మాయ మీతో యుద్ధము చేస్తుంది. ప్రపంచమంతా కర్మక్షేత్రము. ఆత్మ ఈ శరీరములో ప్రవేశించి ఇక్కడ కర్మ చేస్తుంది. తండ్రి కర్మ-అకర్మ-వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ రావణ రాజ్యములో కర్మ వికర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున కర్మ అకర్మగా ఉంటుంది. వికర్మలేవీ జరగవు. ఇది చాలా సహజమైన విషయము. ఇక్కడ రావణ రాజ్యములో కర్మ వికర్మగా అవుతుంది అందువలన వికర్మల దండన అనుభవించవలసి ఉంటుంది. రావణుడు అనాదిగా ఉన్నాడని అనరు. అర్ధకల్పము రావణ రాజ్యము, అర్ధకల్పము రామరాజ్యము. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీ కర్మలు అకర్మలుగా ఉండేవి. ఇది జ్ఞానము. పిల్లలుగా అయినందున చదువును కూడా చదువుకోవాలి. మరే ఇతర వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచించరాదు. కాని గృహస్థ వ్యవహారములో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి చేసుకోవాలి కనుక కమలపుష్ప సమానంగా ఉండాలని తండ్రి చెప్తారు. ఇటువంటి దేవతలుగా మీరు అవ్వబోతున్నారు. వారు ఈ చిహ్నాన్ని విష్ణువుకు ఇచ్చేశారు. ఎందుకంటే మీకు శోభించదు, వారికి శోభిస్తుంది. వారే విష్ణువు. రెండు రూపాలైన లక్ష్మీనారాయణులుగా కాబోతారు. అది అహింసా పరమో ధర్మమైన దేవీ దేవతా ధర్మము. వికారాల ఖడ్గమూ ఉండదు. జగడాలు మొదలైనవి కూడా జరగవు. మీరు డబల్‌ అహింసకులుగా అవుతారు. సత్యయుగములో అధికారులుగా ఉండేవారు. దాని పేరే స్వర్ణిమ యుగము, బంగారు ప్రపంచము. ఆత్మ మరియు శరీరము రెండూ కంచనము(స్వర్ణము)గా అవుతాయి. కంచన కాయాన్ని ఎవరు తయారు చేస్తారు? తండ్రి. ఇప్పుడైతే ఇది ఇనుప యుగము కదా. సత్యయుగము గడిచిపోయిందని మీరు చెప్తారు. నిన్న సత్యయుగము ఉండేది కదా! మీరు రాజ్యమును పాలించేవారు. మీరు జ్ఞానసాగరులుగా అవుతూ ఉంటారు. అందరూ ఒకే విధంగా తయారవ్వరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నేను ఆత్మ నాశనము లేని సింహాసనానికి అధికారిననే స్మృతిలో ఉండాలి. హద్దు - బేహద్దులకు దూరంగా వెళ్లాలి. అందువలన హద్దు విషయాలలో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు.
2. బేహద్‌ తండ్రి ద్వారా బేహద్‌ ఆస్తి లభిస్తుందనే నషాలో ఉండాలి. కర్మ-అకర్మ-వికర్మల గతిని తెలుసుకొని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే సమయములో వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి నుండి బుద్ధిని తొలగించాలి.

వరదానము :- '' సేవలో ' స్నేహము మరియు సత్యత ' ల బ్యాలన్స్‌ యొక్క అథారిటి ద్వారా సఫలతామూర్త్‌ భవ ''
ఈ అసత్య ఖండములో బ్రహ్మబాబాను సత్యత అథారిటీకి ప్రత్యక్ష స్వరూపంగా చూశారు. అథారిటి గల వారి మాటలు ఎప్పుడూ అహంకార భావమునివ్వలేదు. వారి అథారిటి గల మాటలలో స్నేహము ఇమిడి ఉంది. అథారిటి గల మాటలు కేవలం పవిత్రంగా(సత్యంగా) ఉండవు, ప్రభావశాలిగా ఉంటాయి. కనుక తండ్రిని అనుసరించండి. స్నేహము మరియు అథారిటి, నిరహంకారత మరియు మహానత రెండూ జత జతలో కనిపించాలి. వర్తమాన సమయంలో సేవ చేయునప్పుడు ఈ బ్యాలన్స్‌ను అండర్‌లైన్‌ చేసుకుంటే సఫలతామూర్తులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' 'నాది' ని 'నీది' లోకి పరివర్తన చేయడం అనగా భాగ్యానికి అధికారము తీసుకోవడం ''

No comments:

Post a Comment