Thursday, October 31, 2019

Telugu Murli 01/11/2019

01-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ పై మీరు పూర్తి గమనముంచండి, నియమ విరుద్ధంగా నడుచుకోకండి. శ్రీమతమును ఉల్లంఘిస్తే క్రింద పడిపోతారు ''

ప్రశ్న :- పదమాపదమ్‌ పతిగా అయ్యేందుకు ఏ జాగ్రత్తలు వహించాలి ?
జవాబు :- '' మనమెలాంటి కర్మలు చేస్తామో, మనలను చూచి ఇతరులు కూడా చేస్తారు'' అని సదా గమనముంచుకోవాలి. ఏ విషయములోనూ మిథ్యా(అసత్యమైన) అహంకారము రాకూడదు. మురళి ఎప్పుడూ మిస్‌ చేయరాదు. మనసా-వాచా-కర్మణా స్వయాన్ని సంభాళన చేసుకోండి(అదుపులో ఉంచుకోండి). ఈ కనులు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు. దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ పిల్లలైన మీరు తప్పనిసరిగా ఈ ఆలోచనతో కూర్చోవాలి - '' వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు-సద్గురువు కూడా అయ్యారు'' బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై పవిత్రధామానికి చేరుకుంటామని కూడా మీరు అనుభవము చేస్తారు. మీరు పవిత్రధామము నుండే క్రిందకు దిగారని తండ్రి అర్థం చేయించారు. దాని పేరే పవిత్రధామము. సతోప్రధానము నుండి మళ్లీ సతో, రజో, తమోలోకి వచ్చి ఇప్పుడు క్రిందపడి ఉన్నామని అనగా వేశ్యాలయంలో ఉన్నామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. భలే మీరు సంగమ యుగంలో ఉన్నారు కానీ జ్ఞానము ద్వారా మేము అతీతంగా, వేరుగా ఉన్నామని అర్థం చేసుకున్నారు. అయినా మనం శివబాబా స్మృతిలో ఉంటే శివాలయము దూరంగా లేదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. శివబాబాను స్మృతి చేయకుంటే శివాలయము చాలా దూరంగా ఉంటుంది. శిక్షలను అనుభవించవలసి వస్తే చాలా దూరమైపోతుంది. కనుక తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టమునివ్వడం లేదు. ఒకటేమో మనసా-వాచా-కర్మణా పవిత్రంగా అవ్వాలని పదే పదే చెప్తున్నారు. ఈ కనులు కూడా చాలా మోసము చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాళన చేసుకుంటూ నడుచుకోవాలి. ధ్యానము, యోగము రెండూ పూర్తిగా వేరని తండ్రి అర్థము చేయించారు. యోగమనగా తలంపు. కనులు తెరచుకొని కూడా మీరు బాగా స్మృతి చేయవచ్చు. ధ్యానమును యోగమని అనరు. భోగ్‌ తీసుకెళ్లినా ఆదేశానుసారమే తీసుకెళ్లాలి. ఇందులో మాయ కూడా చాలా ప్రవేశిస్తుంది. మాయ ఎలాంటిదంటే ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఎలాగైతే తండ్రి శక్తివంతులో అలా మాయ కూడా చాలా బలమైనదే. ఎంత బలమైనదంటే మొత్తం ప్రపంచాన్నంతా వేశ్యాలయంలోకి తోసేసింది. కావున ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రి తెలిపిన నియమానుసారము స్మృతి ఉండాలి. నియమ విరుద్ధంగా ఏ పని చేసినా మాయ ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. ధ్యానములోకి వెళ్లాలని మొదలైన కోరికలేవీ ఉంచుకోరాదు. ఇచ్ఛా మాత్రమ్‌ అవిద్య..........అంటే కోరికలంటే ఏమో తెలియనట్లుండాలి. తండి ఆజ్ఞాపించినట్లు నడుస్తే, మీ సర్వ మనోకామనలను అడగకుండానే పూర్తి చేస్తారు. తండ్రి ఆజ్ఞను పాటించక వ్యతిరేక మార్గములో నడిస్తే, స్వర్గానికి బదులు నరకములోనే పడిపోవచ్చు. ఏనుగును మొసలి తినేసినట్ల్లు గాయనము కూడా ఉంది. అనేమంది ఇతరులకు జ్ఞానము తెలిపినవారు, భోగ్‌ తీసుకెళ్లేవారు ఈ రోజు లేనే లేరు. ఎందుకంటే నియమ విరుద్ధంగా నడుచుకున్నందున పూర్తి మాయావిగా అయిపోతారు. దేవతలుగా అవుతూ అవుతూ రాక్షసులుగా అయిపోయారు. దేవతలుగా తయారయ్యే చాలా మంచి పురుషార్థులు కూడా అసురులుగా అయ్యి అసురుల జతలో ఉన్నారని తండ్రికి తెలుసు. విద్రోహులై(ట్రైటర్‌) పోతారు. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్లీ మాయకు వశమయ్యేవారిని విద్రోహులు అని అంటారు. స్వయం పై గమనముంచుకోవాలి. శ్రీమతమును ఉల్లంఘిస్తే క్రిందపడేది కూడా తెలియనే తెలియదు. రసాతలము(పాతాళము)లోకి చేరే నడవడికలు కలిగి ఉండరాదని తండ్రి పిల్లలకు గమనమిప్పిస్తున్నారు.
చాలామంది గోపులు(అన్నయ్యలు) ఉన్నారని తండ్రి నిన్న కూడా అర్థం చేయించారు. వారు పరస్పరము కమిటీలు మొదలైనవి తయారు చేసుకొని ఏం చేసినా, శ్రీమతము ఆధారంగా చెయ్యకుంటే డిస్‌ సర్వీసు చేసినట్లే అవుతుంది. శ్రీమతము లేకుండా చేస్తే క్రిందపడుతూనే ఉంటారు. బాబా ప్రారంభములో కమిటీని తయారు చేసినప్పుడు మాతల కమిటీనే నిమిత్తంగా చేశారు. ఎందుకంటే కలశము మాతలకే లభిస్తుంది. వందేమాతరం అని గాయనముంది కదా. ఒకవేళ గోపుల కమిటీని చేస్తే వందే గోపులనే గాయనము లేనే లేదు కదా. శ్రీమతమును అనుసరించకపోతే మాయా జాలములో చిక్కుకుంటారు. బాబా మాతల కమిటీని ఏర్పాటు చేసి సర్వస్వము వారికి అర్పించేశారు. పురుషులు తరచుగా దివాలా(ఖాళీ అవ్వడము) తీస్తారు. స్త్రీలు అలా దివాలా తీయరు. అందుకే తండ్రి కూడా కలశము మాతల పై ఉంచారు. ఈ జ్ఞానమార్గములో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అయ్యేవారు కూడా మాయతో ఓడిపోయి దీవాలా తీయవచ్చు. ఇందులో స్త్రీలు - పురుషులు ఇరువురూ దివాలా తీయవచ్చు, తీస్తారు కూడా. ఎంతోమంది ఓటమి చెంది వెళ్లిపోయారు అనగా దివాలా తీశారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారతవాసులైతే పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంతో శక్తివంతమైనది. మనము ఎలా ఉండేవారము, ఎంత పైన నుండి ఒక్కసారిగా క్రిందపడ్డామో కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా ఉన్నతమవుతూ అవుతూ శ్రీమతమును మరచి సొంత మతమును అనుసరిస్తే దివాలా తీస్తారు. ప్రపంచములోని వారు దివాలా తీసినా, 5-6 సంవత్సరాల తర్వాత మళ్లీ నిలదొక్కుకుంటారు. ఇక్కడైతే 84 జన్మలకు దివాలా తీస్తారు. ఉన్నతపదవిని పొందలేరు. దివాలా తీస్తూనే ఉంటారు. బాబా వారి వద్ద ఫోటో ఉంటే చూపిస్తారు. బాబా చాలా కరెక్టుగా చెప్తారని మీరంటారు. చాలామందిని జాగృతము చేసిన మహారథులు ఈ రోజు లేనే లేరు. దివాలాలో ఉన్నారు. బాబా పదే పదే పిల్లలను అప్రమత్తము చేస్తూ ఉంటారు. మీ ఇష్టానుసారము కమిటీలు చేయడం వలన ఏ లాభమూ లేదు. పరస్పరములో కలిసినప్పుడు వారు అలా చేశారు, వీరు ఇలా చేశారు,.... అని లోకాభిరామాయణముతోనే రోజంతా గడిపేస్తారు. తండ్రితో బుద్ధియోగమును జోడించినప్పుడు మాత్రమే సతోప్రధానంగా అవుతారు. తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రిని స్మృతి చేయకుంటే మాటిమాటికి క్రింద పడ్తూనే ఉంటారు. సంబంధము(కనెక్షన్‌) తెగిపోతుంది. లింక్‌(సంబంధము) తెగిపోయినా భయపడరాదు. మాయ మనలను ఇంతగా ఎందుకు విసిగిస్తుంది. ప్రయత్నించి తండ్రితో మీరు మళ్లీ లింకు ఏర్పరుచుకోవాలి లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్‌ అవుతుంది? వికర్మలు చేసినందున బ్యాటరీ డిస్‌ఛార్జ్‌ అయిపోతుంది. ప్రారంభములో అనేకమంది బాబా వద్దకు వచ్చి బాబాకు చెందినవారిగా అయ్యారు. భట్టీలో వచ్చారు కానీ వారు ఈ రోజు లేనే లేరు. పాత ప్రపంచము గుర్తు వచ్చినందున వారు క్రింద పడిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీకు అనంతమైన వైరాగ్యము కలిగిస్తున్నాను. ఈ పాత ప్రపంచము వైపుకు మీ మనసు పోనీయరాదు. మనస్సును స్వర్గముతో జోడించండి. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలంటే శ్రమించవలసి వస్తుంది. బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచము పై వైరాగ్యము రావాలి. సుఖధామము, శాంతిధామాలను స్మృతి చేయండి. వీలైనంత ఎక్కువగా లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సులభము. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని అందరికీ అర్థం చేయించాలి. ఎందుకంటే ఇప్పుడిక తిరుగు ప్రయాణము(రిటర్న్‌ జర్ని) జరుగుతుంది. ప్రపంచ భూగోళము - చరిత్ర(హిస్టరి, జాగ్రఫి) పునరావృతమవుతుంది అనగా నరకము నుండి స్వర్గము మళ్లీ స్వర్గము నుండి నరకము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది.
తండ్రి చెప్తున్నారు - ఇక్కడ స్వదర్శన చక్రధారులై కూర్చోండి. మనము ఎన్నోసార్లు చక్రములో తిరిగాము ఇప్పుడు మళ్లీ మనము దేవతలుగా అవుతున్నాము. ప్రపంచములోని వారెవ్వరికీ ఈ రహస్యము తెలియదు. ఈ జ్ఞానము దేవతలకు లేనే లేదు. ఎందుకంటే వారు పవిత్రులు. శంఖును పూరించేందుకు వారిలో జ్ఞానమే లేదు. వారు పవిత్రులు. వారికి ఆ అలంకారాలు ఇచ్చే అవసరమే లేదు. ఇరువురూ(స్త్రీ - పురుషులు) కలిసి ఉన్నప్పుడే ఈ గుర్తులుంటాయి. మీకు కూడా ఈ గుర్తులు లేవు. ఎందుకంటే ఈ రోజు దేవతలుగా అవుతూ రేపటి రోజు అసురులుగా అవుతారు. తండ్రి దేవతలుగా చేస్తారు. మాయ అసురులుగా చేస్తుంది. తండ్రి అర్థము చేయించినప్పుడు మా స్థితి నిజంగా దిగజారి పోయిందని అర్థమవుతుంది. పాపం ఎంతోమంది తెలియక శివబాబా ఖజానాలో జమ చేసుకుంటూ వాటిని మళ్లీ వాపస్‌ అడిగి అసురులుగా అయిపోతారు. ఇందుకు కారణము యోగము తక్కువగా ఉండడమే. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ''ఓ బాబా! రండి, మేము స్వర్గములోకి వెళ్లగల్గుటకు మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. పావనంగా అయ్యి ఉన్నతపదవి పొందేందుకే స్మృతియాత్ర చేయాలి. కానీ కొంతమంది నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. అలా మరణించినవారు కూడా ఈ జ్ఞానాన్ని కొద్దిగా విని ఉండినా శివాలయములోకి తప్పకుండా వస్తారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. ఒక్కసారి స్మృతి చేసినా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కానీ ఉన్నతపదవిని పొందలేరు. స్వర్గము పేరు విని సంతోషించాలి. ఫెయిల్‌ అయ్యి చిన్న పదవిని పొందుకోవడంలో సంతోషపడరాదు. అలా నేను నౌకరుననే ఫీలింగ్‌ వస్తుంది కదా. చివరిలో స్వర్గములో ఏ పదవి పొందుతారో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మాకీ దుస్థితి కలిగినందుకు మేము ఏ వికర్మలు చేశాము? నేను మహారాణిగా ఎందుకు కారాదు? అడుగడుగునా అప్రమత్తంగా నడుచుకుంటేనే మీరు పదమాపదమ్‌ పతులుగా అవ్వగలరు. మందిరాలలో దేవతలకు పద్మములను గుర్తుగా చూపిస్తారు. పదవులలో, హోదాలలో తేడా వస్తుంది. ఈ రోజు రాజులకు ఎంత ఆడంబరము (ప్రభావము, పలుకుబడి) ఉంది! అది అల్పకాలికమైనదే. సదా కాలానికి రాజులుగా అవ్వలేరు. అందువలన మీరు లక్ష్మినారాయణులుగా అవ్వాలంటే పురుషార్థము కూడా అలా చెయ్యాలని తండ్రి చెప్తున్నారు. మేము ఎంతమందికి కళ్యాణము చేస్తున్నాము? అంతర్ముఖులై ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాము? ఇప్పుడు మనము మన మధురమైన ఇంటికి వెళ్తున్నాము మళ్లీ సుఖధామములోకి వస్తాము. ఈ విధమైన జ్ఞాన మథనము లోలోపల జరుగుతూ ఉండాలి. తండ్రిలో జ్ఞానము, యోగము రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా మమ్ములను చదివిస్తున్నారని గుర్తుంచుకుంటే జ్ఞాన-యోగాలు రెండూ జరుగుతాయి. జ్ఞాన-యోగాలు రెండూ జత జతలో నడుస్తాయి. అంతేగాని యోగములో తండ్రిని స్మృతి చేస్తూ జ్ఞానము మర్చిపోరాదు. తండ్రి యోగమును నేర్పిస్తే జ్ఞానమును మర్చిపోతారా? మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంది. పిల్లలైన మీలో కూడా జ్ఞానముండాలి, చదువుకోవాలి. నేనెలాంటి కర్మలు చేస్తానో నన్ను చూచి ఇతరులు కూడా అలాంటి కర్మలు చేస్తారు. నేను మురళి చదవకుంటే ఇతరులు కూడా చదవరు. మిథ్యా అహంకారము వస్తే వెంటనే మాయ యుద్ధము చేస్తుంది. అడుగడుగునా తండ్రి నుండి శ్రీమతము తీసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి తండ్రికి వినిపించరు. దీని వలన సర్వనాశనమౌతారు. నిర్లక్ష్యము చేసినందున మాయ చెంపదెబ్బ వేస్తుంది. పైసకు కొరగాకుండా (వర్త్‌ నాట్‌ ఎ పెన్నీగా) చేసేస్తుంది. అహంకారములోకి వచ్చినందున మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. పురుషుల కమిటీలు తయారు చేయమని బాబా ఏమైనా చెప్పారా? కమిటీలో ఒకరిద్దరు తెలివైన అక్కయ్యలు తప్పనిసరిగా ఉండాలి. వారి సలహా ప్రకారమే పని జరగాలి. కలశము లక్ష్మి పైనే ఉంచుతారు కదా. అమృతము త్రాగిస్తున్నా యజ్ఞములో విఘ్నాలు వేస్తూ ఉంటారనే గాయనముంది. అనేక ప్రకారాల విఘ్నాలు కలుగజేసే వారుంటారు. రోజంతా లోకాభి రామాయణము(వ్యర్థ చింతన, పరచింతన) మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయముంటే తండ్రికి రిపోర్టు(ఫిర్యాదు) ఇవ్వాలి. తండ్రి ఒక్కరు మాత్రమే సరిదిద్దగలరు అనగా బాగు చేయగలరు. మీరు మీ చేతులలోకి చట్టము తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయమిస్తూ ఉంటే ఇలా తయారవుతారు. మాయ చాలా కఠినమైనది, ఎవ్వరినీ వదిలిపెట్టదు. సదా తండ్రికి సమాచారము తెలుపుతూ ఉండండి. ఆదేశాలు తీసుకుంటూ ఉండాలి. ఆదేశాలు సదా లభిస్తూనే ఉంటాయి. బాబాయే స్వయంగా ఈ విషయాన్ని అర్థం చేయించారు, కావున బాబా అంతర్యామి అని పిల్లలు అనుకుంటారు. కానీ అలా నేను అంతర్యామిని కాను. నేను జ్ఞానాన్ని మాత్రమే చదివిస్తానని బాబా అంటున్నారు. ఇందులో అంతర్యామి మాటే లేదు అని బాబా అంటారు. కానీ మీరంతా నా పిల్లలే అని నాకు తెలుసు. ప్రతి శరీరములో నా పిల్లలున్నారు. అంతేకాని అందరిలో తండ్రి విరాజమానమై లేరు. మానవులంతా ఉల్టాగానే అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు - అందరి(భృకుటి) సింహాసనాల పై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది చాలా సహజమైన విషయం. చైతన్యమైన ఆత్మలన్నీ వాటి వాటి సింహాసనాల పై కూర్చొని ఉన్నాయి. కానీ పరమాత్ముడు సర్వవ్యాపి అని మనుష్యులంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు(ఏకజ్‌ భూల్‌). ఈ కారణంగానే భారతదేశము ఎంతో దిగజారిపోయింది. తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను చాలా గ్లాని చేశారు, నిందించారు. విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని మీరు నిందించారు. అందుకే యదా యదాహి,.......... అని తండ్రి చెప్చున్నారు. విదేశీయులు భారతీయుల నుండే ఈ సర్వవ్యాపి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎలాగైతే భారతవాసులు వారి నుండి హునర్‌(నైపుణ్యము/టెక్నిక్‌) నేర్చుకుంటారో అలా వారు మన నుండి ఉల్టా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అంతేకాక తండ్రి పరిచయమును కూడా అందరికీ ఇవ్వాలి. మీరు గ్రుడ్డివారికి ఊతకర్రలాంటి వారు. ఊతకర్ర ద్వారానే మార్గదర్శనము చేస్తారు కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ప్రతి కార్యము తండ్రి ఆజ్ఞానుసారము చేయాలి. ఎప్పుడూ శ్రీమతమును ఉల్లంఘించరాదు. అప్పుడే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తి అవుతాయి. ధ్యానము, సాక్షాత్కారములు కావాలనే కోరికనుంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్యాగా(కోరికంటే తెలియనివారుగా) అవ్వాలి.
2. పరస్పరము కలిసి పరచింతన చేయరాదు. అంతర్ముఖులై - ''ఎంత సమయము బాబా స్మృతిలో ఉన్నాము? లోలోపల జ్ఞాన మథనము జరుగుతోందా?'' అని స్వయాన్ని పరిశీలించుకోవాలి.

వరదానము :- '' బిందు రూపంలో స్థితమై ఉండి, ఇతరులకు కూడా డ్రామా బిందువనే స్మృతినిప్పించే ' విఘ్నవినాశక్‌ ' భవ ''
ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ ప్రశ్నార్థకముంచరో, సదా బిందు రూపంలో స్థితమై ఉండి ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువనే స్మృతినిప్పిస్తారో - వారినే విఘ్నవినాశకులని అంటారు. వారు ఇతరులను కూడా సమర్థంగా చేసి సఫలతా గమ్యానికి చేరువగా(సమీపంగా) తీసుకొస్తారు. వారు హద్దు సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషపడరు. వారు అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు. సదా ఏకరసంగా, ఒక శ్రేష్ఠమైన స్థితిలో స్థితులై ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వ స్థితి ద్వారా అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు.

స్లోగన్‌ :- '' ఆశీర్వాదాలిస్తూ, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే త్వరగా మాయాజీతులుగా అవుతారు ''

No comments:

Post a Comment