23-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రిని ఎంతెంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి, పాపం సమాప్తమౌతూ పోతుంది ''
ప్రశ్న :- ఏ ధర్మములో స్థితమగుటకు తండ్రి తన పిల్లలకు మతమును(సలహాను) ఇస్తారు?
జవాబు :- బాబా అంటున్నారు - పిల్లలూ, మీరు చిత్రము(శరీరము) లేని విచిత్రులు(ఆత్మలు). ఆత్మిక ధర్మములో స్థితమవ్వండి, శరీర ధర్మములో స్థితులవ్వకండి. తండ్రి ఎలాగైతే విచిత్రులో, అలాగే పిల్లలు కూడా విచిత్రులే మళ్లీ ఇక్కడ చిత్రము(శరీరము)లోకి వస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ! విచిత్రులవ్వండి. మీ స్వధర్మములో స్థితమవ్వండి. దేహాభిమానములోనికి రాకండి.
ప్రశ్న :- భగవంతుడు కూడా డ్రామానుసారము ఏ మాటకు కట్టుబడి ఉన్నారు?
జవాబు :- డామ్రానుసారము పిల్లలను పతితుల నుండి పావనంగా చేసేందుకు తండి కట్టుబడి ఉన్నారు. వారు పురుషోత్తమ సంగమ యుగములో తప్పకుండా రావాల్సిందే.
ఓంశాంతి. తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఓంశాంతి అంటూనే ఆత్మకు తన స్వధర్మ పరిచయము ఇవ్వబడ్తుంది. అందువలన తండ్రి కూడా స్వతహాగా గుర్తుకు వస్తారు. ఎందుకంటే ప్రతి మనిషి భగవంతుడినే స్మృతి చేస్తారు. కేవలం భగవంతుని పూర్తి పరిచయము లేదు. భగవంతుడు తమ పరిచయాన్ని, ఆత్మ పరిచయాన్ని ఇచ్చేందుకే వస్తారు. పతితపావనుడని భగవంతుడినే అంటారు. పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా డామ్రానుసారం కట్టుబడి ఉన్నారు. వారు కూడా పురుషోత్తమ సంగమ యుగములోనే రావాలి. సంగమయుగ జ్ఞానము కూడా ఇస్తారు. పాత ప్రపంచము, నూతన ప్రపంచాల మధ్యలోనే ఆ తండ్రి వస్తారు. పాత ప్రపంచమును మృత్యులోకమని, నూతన ప్రపంచమును అమరలోకమని అంటారు. మృత్యులోకములో ఆయువు తక్కువని కూడా మీకు తెలుసు. అకాలమృత్యువు జరుగుతూ ఉంటుంది. అది అమరలోకము. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఎందుకంటే అది పవిత్రమైనది. అపవిత్రత వలన వ్యభిచారులుగా అవుతారు, ఆయువు కూడా తగ్గిపోతుంది, శక్తి కూడా క్షీణిస్తుంది. సత్యయుగములో పవిత్రంగా ఉన్నందున అవ్యభిచారులుగా ఉంటారు. బలము కూడా ఎక్కువగా ఉంటుంది. బలము లేకుంటే రాజ్యమెలా ప్రాప్తి చేసుకుంటారు? వారు తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకునే ఉంటారు. తండి సర్వ శక్తివంతులు. వారి నుండి ఆశీర్వాదాలు ఎలా తీసుకొని ఉంటారు? నన్ను స్మృతి చేయండి అని తండి చెప్తున్నారు. కనుక ఎవరైతే ఎక్కువగా స్మృతి చేశారో వారే ఆశీర్వాదాలు తీసుకొని ఉంటారు. ఆశీర్వాదాలు అడిగితే లభించేవి కావు. శమ్రిస్తే లభిస్తాయి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి అనగా ఉన్నత పదవి లభిస్తుంది. స్మృతే చేయకుంటే ఆశీర్వాదాలు కూడా లభించవు. లౌకిక తండ్రి తన పిల్లలకు నన్ను స్మృతి చేయమని ఎప్పుడూ చెప్పరు. చిన్న వయస్సు నుండి తనంతకు తానే అమ్మ, నాన్న అని పిలుస్తూ ఉంటాడు. అవయవాలు చిన్నవిగా ఉంటాయి. పెద్ద పిల్లలు అమ్మా-అమ్మా, నాన్న-నాన్న అని అంటూ ఉండరు. వీరు మా తల్లి-తండ్రి అని, వీరి ద్వారా ఈ వారసత్వము లభిస్తుందని వారి బుద్ధిలో ఉంటుంది. నోటితో చెప్పే పని లేదు, స్మృతి చేసే పని లేదు. ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు - నన్ను వారసత్వమును స్మృతి చేయండి. హద్దు సంబంధాలను వదిలి ఇప్పుడు బేహద్ సంబంధాన్ని స్మృతి చేయండి. మానవులంతా ఈ సమయములో ముక్తిని కోరుకుంటున్నారు గతి అనగా ముక్తిధామము మళ్లీ సుఖధామానికి వచ్చుటను సద్గతి అని అంటారు. ప్రారంభములో ఎవరు వచ్చినా వారు తప్పకుండా సుఖమే పొందుతారు. తండి సుఖమిచ్చేందుకే వస్తారు. ఇందులో ఏదో కొంత కష్టముంది. అందుకే దీనిని ఉన్నతమైన చదువు అని అంటారు. ఎంత ఉన్నత చదువో అంత కష్టంగా కూడా ఉంటుంది. అందరూ పాస్ అవ్వలేరు. పెద్ద-పెద్ద పరీక్షలలో చాలా కొద్దిమంది మాత్రమే పాస్ అవుతారు. ఎందుకంటే పెద్ద పరీక్షలు పాస్ అయితే ప్రభుత్వము వారు ఉద్యోగము కూడా పెద్దదే ఇవ్వాల్సి వస్తుంది కదా. కొంతమంది విద్యార్థులు పెద్ద పరీక్షలు పాస్ అయినా ఉద్యోగము లేక ఊరకే కూర్చుని ఉంటారు. పెద్ద జీతములిచ్చేందుకు ప్రభుత్వము వారి వద్ద తగినంత ధనము లేదు. కానీ ఇక్కడ ఎంత బాగా చదువుతారో అంత ఉన్నత పదవి పొందుతారని తండి చెప్తున్నారు. అలాగని అందరూ రాజులవుతారని లేక ధనవంతులవుతారని కాదు. ఆధారమంతా చదువు పైనే ఉంది. భక్తిని చదువు అని అనరు. ఈ ఆత్మిక జ్ఞానమును ఆత్మిక తండ్రి చదివిస్తారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. తండ్రిని స్మృతి చేయనందున పిల్లలకు కష్టమనిపిస్తుంది. నడవడిక కూడా చక్కబడదు. బాగా స్మృతి చేయువారి నడవడిక కూడా బాగుపడ్తూ ఉంటుంది. చాలా చాలా మధురంగా సేవ చేసేవారిగా తయారవుతూ ఉంటారు. గుణగణాలు బాగా లేకుంటే ఎవ్వరికీ వారంటే ఇష్టము కూడా ఉండదు. ఎవరు పాస్ అవ్వరో వారి నడవడికలో తప్పకుండా ఏదో లోపము, గడబిడ ఉంటుంది. శ్రీలక్ష్మీనారాయణుల నడవడికలు చాలా బాగుంటాయి. రామునికి రెండు కళలు తక్కువగా ఉంటాయి. భారతదేశము రావణ రాజ్యములో అసత్య ఖండంగా అయిపోతుంది. సత్య ఖండములో ఏ మాత్రము అసత్యముండదు. రావణరాజ్యములో అంతా అసత్యమే అసత్యముంది. అసత్య మానవులను దైవీగుణాల వారని అనరు. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఇటువంటి అసత్య మాటలు వినండి, వినిపించండి. ఒక్క ఈశ్వరుని మతమును మాత్రమే లీగల్(న్యాయ సమ్మత) మతమని అంటారు. మానవ మతమును ఇల్లీగల్(న్యాయ విరుద్ధమైన) మతము అని అంటారు. లీగల్ మతము ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు. కానీ అందరూ నడవలేరు. కనుక ఇల్లీగల్‌గా అవుతారు. చాలామంది తండ్రితో ప్రతిజ్ఞ కూడా చేస్తారు - ''బాబా ఇంతకాలము మేము ఇల్లీగల్(అన్యాయ) పనులు చేశాము, ఇక మీదట చేయము.'' అన్నిటికంటే ఇల్లీగల్ కార్యము కామ వికార భూతము. దేహాభిమాన భూతమైతే అందరిలో ఉండనే ఉంది. మాయావి పురుషునిలో దేహాభిమానమే ఉంటుంది. ఆ తండి విదేహులు, విచితుల్రు. అందువలన పిల్లలు కూడా విచితుల్రే. ఇది అర్థము చేసుకునే విషయము. ఆత్మలమైన మనము విచితుల్రము, ఇక్కడ శరీరము తీసుకుంటాము. ఇప్పుడు మళ్లీ విచితుల్రుగా అవ్వండని తండి చెప్తున్నారు. మీ స్వధర్మములో నిలిచిపోండి. చిత(శరీర) ధర్మములో నిలవకండి. విచిత(విదేహ) ధర్మములో ఉండండి. దేహాభిమానములోకి రాకండి. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు - ఇందులో చాలా అవసరమైనది స్మృతి. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా, పవిత్రంగా అవుతారు. అపవిత్రమైతే చాలా శిక్షలు పడ్తాయి. తండివ్రారిగా అయిన పిదప ఏదైనా తప్పు జరిగితే - సద్గురువును నిందలపాలు చేసినవారికి స్థానముండదు అని గాయనముంది. మీరు నా మతమును అనుసరించి పవితంగా అవ్వకుంటే నూరు రెట్లు శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. ఇందులో వివేకాన్ని ఉపయోగించాలి. మనము స్మృతి చేయకుంటే ఇంత ఉన్నత పదవి కూడా పొందలేము. పురుషార్థము కొరకు సమయాన్ని కూడా ఇవ్వాలి. ఋజువును ఇవ్వమని మిమ్ములను అడుగుతారు. అప్పుడు వారికి ఇలా చెప్పండి - ఏ శరీరములో అయితే వస్తున్నారో అది ప్రజాపిత బ్రహ్మ శరీరము. అతను మనిషి కదా. మానవుల శరీరాలకు పేర్లుంటాయి. శివబాబా మానవుడు కాదు, దేవత కూడా కాదు. వారిని సుప్రీమ్ ఆత్మ అని అంటారు. వారు పతితులుగా గానీ, పావనంగా గానీ అవ్వరు. వారు అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఆ తండ్రే కూర్చుని తెలిపిస్తున్నారు - మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. మళ్లీ సతోప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి. ఈ దేవతల యోగ్యతలెలా ఉన్నాయో చూడండి. ఆ దేవతలను దయ చూపండి అని వేడుకునేవారిని కూడా చూడండి. ఆశ్చర్యమౌతుంది కదా - మనమెలా ఉండేవారము, 84 జన్మలలో ఎంతగా క్రిందకు దిగజారి పూర్తిగా నష్టపడిపోయాము!
తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! మీరు దైవీ కుటుంబాలకు చెందినవారు. ఇప్పుడు మీ నడవడికలను పరిశీలించుకోండి - ఈ విధంగా(దేవీ దేవతలు) తయారవ్వగలరా? అందరూ లక్ష్మీనారాయణులుగా అవుతారని కాదు. అలాగైతే ప్రపంచమంతా పుష్పాలతోట అయిపోతుంది. శివబాబాకు కేవలం గులాబి పుష్పాలే సమర్పించాలా? అలా కాదు, గులాబీ పుష్పాలే కాదు, జిల్లేడు పూలు కూడా సమర్పిస్తారు. ఆ తండ్రి పిల్లలు అన్ని రకాల పుష్పాలుగా అవుతారు. పాస్ అవుతారు, ఫెయిల్ కూడా అవుతారు. రాజుగా అవ్వలేమని స్వయం కూడా అర్థము చేసుకుంటారు. తమ సమానంగా తయారు చేయకుంటే షాహుకార్లుగా ఎలా అవుతారు? ఎవరెవరు ఎలా అవుతారో తండ్రికి తెలుసు. పోను పోను పిల్లలైన మీరు కూడా - ఫలానావారు తండ్రికి ఎటువంటి సహాయకారులో తెలుసుకోగలరు. కల్ప-కల్పం ఎవరు ఏం చేశారో, అదే చేస్తారు. దానిలో వ్యత్యాసముండదు. తండ్రిని స్మృతి చేసేందుకు వారు పాయింట్లు ఇస్తూనే ఉంటారు. మార్పు కూడా చేయాలి. భక్తిమార్గములో ఈశ్వరార్పణంగా చేస్తారు. కానీ ఈశ్వరుని గురించి తెలియదు. అత్యంత ఉన్నతులు భగవంతుడు అని మాత్రము తెలుసు. అత్యంత ఉన్నతమైన నామ-రూపాల వారు కాదు. వారు నిరాకారులు. ఆ తర్వాత అత్యంత ఉన్నత సాకారులు ఇక్కడ ఉంటారు. బహ్మ్ర-విష్ణు-శంకరులను దేవతలని అంటారు. బహ్మ్ర దేవతాయ నమ:, విష్ణు దేవతాయ నమ:, కానీ శివ పరమాత్మాయ నమ: అని అంటారు అనగా పరమాత్మ పెద్ద కదా. బహ్మ్ర-విష్ణు-శంకరులను పరమాత్మ అని అనరు. నోటితో శివపరమాత్మాయ నమ: అని కూడా అంటారు. అందువలన పరమాత్మ ఒక్కరే అయ్యారు కదా. దేవతలకు నమస్కరిస్తారు. మానవ లోకములోని వారిని మానవులని అంటారు. అటువంటి వారిని పరమాత్మాయ నమ: అనడం పూర్తిగా అజ్ఞానము. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అందరి బుద్ధిలో ఉంది. ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అని పిల్లలైన మీకు తెలుసు. వారినే పతితపావనుడని అంటారు. అందరినీ పావనంగా చేయడం భగవంతుని కర్తవ్యము. ఏ మనిషి కూడా జగద్గురువుగా అవ్వలేరు. గురువులు పావనంగా ఉంటారు కదా. కానీ ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మించినవారే. జ్ఞానాన్ని అమృతమని అంటారు. భక్తిని అమృతమని అనరు. భక్తిమార్గములో భక్తి మాత్రమే నడుస్తుంది. మానవులంతా భక్తి మార్గములోనే ఉన్నారు. జ్ఞానసాగరులు, జగద్గురువు అని ఒక్కరిని మాత్రమే అంటారు. తండ్రి వచ్చి ఏం చేస్తారో ఇప్పుడు మీకు తెలుసు. తత్వాలను కూడా పవిత్రంగా చేస్తారు. డ్రామాలో వారికి పాత్ర ఉంది. తండ్రి నిమిత్తంగా అవుతారు. సర్వులకు వారు సద్గతిదాత. ఇది అందరికీ ఎలా తెలపాలి? చాలా మంది వస్తారు. ఉద్ఘాటన చేసేందుకు వచ్చినప్పుడు జరగబోయే వినాశనానికి ముందు అనంతమైన తండ్రిని తెలుసుకొని వారి ద్వారానే వారసత్వము తీసుకోండి అని వారికి ఒక టెలిగ్రామ్ ఇవ్వండి. వీరు ఆత్మిక తండ్రి. మానవ మాత్రులంతా తండ్రి అని అంటారు. సృష్టికర్త అయితే వారి ద్వారా జరిగిన సృష్టికి అనగా వారి సంతానానికి వారసత్వము తప్పకుండా లభిస్తుంది. అనంతమైన తండ్రి ఉన్నతాతి ఉన్నతులు. వారు హద్దు వారసత్వమునివ్వరు కదా. లౌకిక తండ్రి ఉన్నా అనంతమైన తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రిని మర్చిపోవడం కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అనంతమైన తండ్రి ఉన్నతాతి ఉన్నతులు. వారు హద్దు వారసత్వమునివ్వరు కదా. లౌకిక తండ్రి ఉన్నా అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. సత్యయుగములోని వారెవ్వరూ వారిని స్మృతి చేయరు. ఎందుకంటే అనంతమైన సుఖ వారసత్వము లభించింది. ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మనే స్మృతి చేస్తుంది. ఆ తర్వాత ఆత్మలు స్వయాన్ని, తండ్రిని, డ్రామాను మర్చిపోతారు. మాయ నీడ పడ్తుంది. సతోప్రధాన బుద్ధి, తమోప్రధాన బుద్ధిగా తప్పకుండా అవ్వాల్సిందే. నూతన ప్రపంచములో దేవీ దేవతలు సతోప్రధానంగా ఉండేవారని స్మృతిలోకి వస్తుంది. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచమే సతోప్రధానంగా, బంగారు యుగంగా అవుతుంది. దానిని నూతన ప్రపంచమని అంటారు. ఇది ఇనుప యుగము. ఈ విషయాలన్నీ తండ్రే స్వయంగా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కల్ప-కల్పము మీరు తీసుకునే వారసత్వము, మీరు చేయు పురుషార్థానుసారము మళ్లీ మీకు అదే వారసత్వము లభిస్తుంది. మనమిలా ఉన్నతంగా ఉండేవారమని, ఇప్పుడిలా నీచంగా అయ్యామని మీకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆ తండ్రియే మళ్లీ ఇలా జరుగుతుందని మనకు తెలుపుతున్నారు. ఎంత పయ్రత్నించినా స్మృతి నిలవడం లేదని కొంతమంది అంటారు. దానికి టీచరు గానీ, తండి గానీ ఏం చేస్తారు ? ఎవరైనా చదవకపోతే టీచరేం చేస్తారు? టీచరు ఆశీర్వాదాలిస్తే అందరూ పాస్ అయిపోతారా ? చదవడంలో చాలా తేడాలుంటాయి. ఇది పూర్తిగా నూతనమైన చదువు. ఇక్కడ మీ వద్దకు తరచుగా ఎక్కువమంది పేదలు, దు:ఖములో ఉన్నవారే వస్తారు, షాహుకార్లు రారు. దు:ఖము కలిగినప్పుడే వస్తారు. మేము స్వర్గములో ఉన్నామని ధనవంతులు భావిస్తారు. వారి అదృష్టములో లేదు. అదృష్టములో ఉంటే వారికి వెంటనే నిశ్చయము కలుగుతుంది. నిశ్చయము, సంశయాలలో ఆలస్యముండదు. మాయ వెంటనే మరిపిస్తుంది. సమయం పడ్తుంది కదా. ఇందులో తికమక పడవలసిన అవసరము లేదు. మీ పై మీరు దయ చూపుకోవాలి. శ్రీమతమేమో లభిస్తూనే ఉంటుంది. తండి అతి సులభంగా అర్థం చేయిస్తున్నారు - కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి.
ఇది మృత్యులోకమని మీకు బాగా తెలుసు. అది అమరలోకము. అక్కడ అకాలమృత్యువు ఉండదు. తరగతిలో విద్యార్థులు నెంబరువారుగా కూర్చుంటారు కదా. ఇది కూడా పాఠశాల కదా. మీ వద్ద నెంబరువారుగా తెలివిగల పిల్లలెవరు? అని తండ్రి బ్రాహ్మణిని అడుగుతారు. బాగా చదివేవారు కుడివైపు ఉండాలి. కుడిచేయికి మహత్వముంటుంది కదా. పూజలు మొదలైనవి కుడి చేతితోనే చేస్తారు. సత్యయుగములో ఏమేముంటాయో ఆలోచిస్తూ ఉండండి. సత్యయుగము గుర్తుకొస్తే సత్యమైన తండ్రి కూడా గుర్తుకొస్తారు. బాబా మనలను సత్యయుగానికి అధికారులుగా చేస్తారు. కానీ ఆ చక్రవర్తి పదవి ఎలా లభించిందో అక్కడ జ్ఞాపకముండదు. అందుకే ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానము లేదని బాబా అంటారు. ఆ తండి పత్రి చిన్న మాటనూ బాగా వివరించి తెలుపుతున్నారు. కల్ప కిత్రము ఎవరు అర్థము చేసుకున్నారో వారే మళ్లీ అర్థము చేసుకుంటారు. అయినా పురుషార్థము చేసే తీరాలి కదా. తండి చదివించేందుకే వస్తారు. ఇది చదువు. ఇందులో చాలా తెలివి కావాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఇది మృత్యులోకమని మీకు బాగా తెలుసు. అది అమరలోకము. అక్కడ అకాలమృత్యువు ఉండదు. తరగతిలో విద్యార్థులు నెంబరువారుగా కూర్చుంటారు కదా. ఇది కూడా పాఠశాల కదా. మీ వద్ద నెంబరువారుగా తెలివిగల పిల్లలెవరు? అని తండ్రి బ్రాహ్మణిని అడుగుతారు. బాగా చదివేవారు కుడివైపు ఉండాలి. కుడిచేయికి మహత్వముంటుంది కదా. పూజలు మొదలైనవి కుడి చేతితోనే చేస్తారు. సత్యయుగములో ఏమేముంటాయో ఆలోచిస్తూ ఉండండి. సత్యయుగము గుర్తుకొస్తే సత్యమైన తండ్రి కూడా గుర్తుకొస్తారు. బాబా మనలను సత్యయుగానికి అధికారులుగా చేస్తారు. కానీ ఆ చక్రవర్తి పదవి ఎలా లభించిందో అక్కడ జ్ఞాపకముండదు. అందుకే ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానము లేదని బాబా అంటారు. ఆ తండి పత్రి చిన్న మాటనూ బాగా వివరించి తెలుపుతున్నారు. కల్ప కిత్రము ఎవరు అర్థము చేసుకున్నారో వారే మళ్లీ అర్థము చేసుకుంటారు. అయినా పురుషార్థము చేసే తీరాలి కదా. తండి చదివించేందుకే వస్తారు. ఇది చదువు. ఇందులో చాలా తెలివి కావాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ ఆత్మిక చదువు చాలా శ్రేష్ఠమైనది, కష్టమైనది. ఇందులో ఉత్తీర్ణులయ్యేందుకు తండ్రి స్మృతి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవాలి, మీ నడవడికలను సరిదిద్దుకోవాలి.
2. ఇక మీదట ఇల్లీగల్(శ్రీమతమునకు వ్యతిరేక) కర్మలేవీ చేయరాదు. విచిత్రులై(అశరీరులై) స్వధర్మములో స్థితమవ్వాలి. అశరీరి తండ్రి లీగల్ మతమును అనుసరించాలి.
వరదానము :- '' పరమాత్మ ప్రేమలో లీనమయ్యే లేక మిలనంలోమగ్నమై ఉండే సత్యమైన స్నేహీ భవ ''
స్నేహానికి (ప్రేమకు) గుర్తు - ఇరువురిగా ఉన్నా, ఇరువురిగా కాదు, కలిసి ఒక్కరిగా అయిపోవాలి. దీనికే ఇమిడిపోవడం అనే మహిమ(గాయనం) ఉంది. భక్తులు ఈ స్నేహ స్థితినే ఇమిడిపోవడం లేక లీనమైపోవడమని అనేశారు. ప్రేమలో లీనమవ్వడమనేది ఒక స్థితి. కానీ వారు దీనిని స్థితికి బదులు ఆత్మ అస్తిత్వాన్ని సదా కొరకు సమాప్తమవ్వడంగా భావించారు. పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రి లేక ఆత్మిక ప్రియుని మిలనంలో మగ్నమైపోతారో అప్పుడు సమానమైపోతారు.
స్లోగన్ :- '' ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనసును మౌనంగా ఉంచుతారో, వారే అంతర్ముఖులు ''
No comments:
Post a Comment