19-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చేయండి. ఈ సాధన ద్వారానే మీరు పుణ్యాత్మలుగా అవ్వగలరు ''
ప్రశ్న :- ఏ ఒక్క జ్ఞాన పాయింటు కారణంగా పిల్లలైన మీరు సదా హర్షితంగా ఉంటారు?
జవాబు :- ఇది చాలా అద్భుతంగా తయారైన నాటకము. ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది. అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారనే జ్ఞానము మీకు లభించింది. ఈ జ్ఞాన పాయింటు కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు.
ప్రశ్న :- ఇతరుల వద్ద లేని ఏ ఒకే ఒక్క నైపుణ్యము కేవలం బాబా వద్ద మాత్రమే ఉంది ?
జవాబు :- ఆత్మాభిమానులుగా తయారు చేసే నైపుణ్యము ఒక్క బాబా వద్ద మాత్రమే ఉంది. ఎందుకంటే వారు స్వయం సదా దేహీ(ఆత్మ)గా ఉన్నారు. సుప్రీమ్‌గా ఉన్నారు. ఈ నైపుణ్యము ఏ మనుష్యులకూ రాదు.
ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మ అని అర్థము చేసుకోవాలి కదా. మొట్టమొదట నేను ఆత్మను, శరీరము కాదు అని సాధన చేయండని తండ్రి పిల్లలకు వినిపించారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడు పరమపిత పరమపితను స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మ అని భావించకుంటే తప్పకుండా లౌకిక సంబంధాలు వ్యవహారాలు మొదలైనవే జ్ఞాపకము వస్తుంటాయి. కనుక మొట్టమొదట నేను ఆత్మను అని సాధన చెయ్యాలి. అప్పుడు ఆత్మిక తండ్రి స్మృతి బుద్ధిలో నిలుస్తుంది. స్వయాన్ని దేహమని అనుకోకండి అని తండ్రి శిక్షణనిస్తున్నారు. ఈ జ్ఞానమును తండ్రి పూర్తి కల్పములో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానము లభిస్తుంది. స్వయాన్ని ఆత్మ అని భావిస్తే తండ్రి కూడా గుర్తుకొస్తారు. అర్ధకల్పము మీరు స్వయాన్ని దేహమని భావించారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించాలి. మీరు ఎలాగైతే ఆత్మలో అలా నేను కూడా ఆత్మనే. కానీ నేను సుప్రీమ్‌ను(సర్వ శ్రేష్ఠమైన ఆత్మను). నేను ఆత్మనే అయిన కారణంగా నాకు ఏ దేహము కూడా గుర్తుకు రాదు. ఈ దాదా శరీరధారి కదా. ఆ తండ్రి నిరాకారి. ఈ ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరము గలవాడు. శివబాబా అసలు పేరు శివ. వారు కూడా ఆత్మయే. అయితే సర్వోన్నతమైనవారు అనగా సుప్రీమ్ ఆత్మ. కేవలం ఈ సమయములో మాత్రము వచ్చి ఈ శరీరములో ప్రవేశిస్తారు. వారెప్పుడూ దేహాభిమానులుగా అవ్వరు. సాకార మనుష్యులు దేహాభిమానులుగా ఉంటారు. వారు సదా నిరాకారులు. వారు వచ్చి ఈ సాధన చేయిస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. నేను ఆత్మను, ఆత్మను,.......... ఈ పాఠమును కూర్చుని చదవండి. నేను ఆత్మ, శివబాబా సంతానాన్ని,.......... ప్రతి విషయములో సాధన చేయాలి కదా. తండ్రి ఏమీ కొత్త విషయాన్ని తెలియజేయడం లేదు. మీరు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని పక్కాగా తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి కూడా బుద్ధిలో పక్కాగా కూర్చుంటుంది. దేహాభిమానములో ఉంటే తండ్రిని స్మృతి చేయలేరు. అర్ధకల్పము మీకు దేహాభిమానము ఉంటుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. ఈ విధంగా సత్యయుగములో స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ నేర్పించరు. శరీరానికి పేరు ఉండనే ఉంటుంది. లేకుంటే ఒకరినొకరు ఎలా పిలుచుకోగలరు? ఇక్కడ మీరు తండ్రి నుండి ఏ ప్రాలబ్ధమును పొందుకుంటారో, అక్కడ అదే పొందుతారు. కానీ పిలవడము మాత్రము పేరుతోనే పిలుస్తారు కదా. కృష్ణుడు అనేది కూడా శరీరము పేరే కదా. పేరు లేకుండా కార్య వ్యవహారాలు మొదలైనవి జరగవు. అక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండని ఎవ్వరూ చెప్పరు. అక్కడ స్వతహాగా ఆత్మాభిమానులుగా ఉంటారు. ఈ సాధన ఇప్పుడు మీతో చేయించబడ్తుంది. ఎందుకంటే పాప భారము చాలా ఉంది. నెమ్మది నెమ్మదిగా, కొద్ది కొద్దిగా పాపము పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు పూర్తి పాపాత్మలుగా అయ్యారు. అర్ధకల్పము కొరకు ఏమి చేశారో అది సమాప్తము కూడా అవుతుంది కదా. నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. సత్యయుగములో మీరు సతోప్రధానంగా ఉండేవారు. త్రేతాలో సతో సామాన్యంగా అవుతారు. వారసత్వము ఇప్పుడే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఆత్మాభిమానులుగా అయ్యే ఈ శిక్షణను తండ్రి ఇప్పుడే ఇస్తారు. సత్యయుగములో ఈ శిక్షణ లభించదు. తమ తమ పేర్లతోనే వ్యవహరిస్తారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు స్మృతి (యోగ) బలము ద్వారానే పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవ్వాలి. సత్యయుగములో ఈ శిక్షణ అవసరము లేనే లేదు. ఈ శిక్షణ మీరు అక్కడకు తీసుకెళ్ళరు కూడా! అక్కడ ఈ జ్ఞానమును గానీ, యోగమును గానీ తీసుకెళ్ళరు. మీరు పతితుల నుండి పావనంగా ఇప్పుడే అవ్వాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి. చంద్రుని కళలు తగ్గుతూ తగ్గుతూ చివరికి ఒక చిన్న గీత మాత్రమే మిగులుతుంది కదా. కనుక ఇందులో తికమక పడకండి. ఏదైనా అర్థము కాకుంటే అడగండి.
మేము ఆత్మలము అని మొట్టమొదట పక్కాగా నిశ్చయము చేసుకోండి. మీ ఆత్మనే ఇప్పుడు తమోప్రధానమయ్యింది. మొదట సతోప్రధానంగా ఉండేది. తర్వాత రోజు రోజుకు కళలు తగ్గుతూ వచ్చాయి. నేను ఆత్మనని పక్కా కాని కారణంగా మీరు తండ్రిని మర్చిపోతారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఇదే. ఆత్మాభిమానులవ్వడం వలన తండ్రి స్మృతి కలుగుతుంది. కనుక ఆస్తి కూడా స్మృతికి వస్తుంది. అన్నీ జ్ఞాపకము వచ్చినందున పవిత్రంగా కూడా ఉంటారు. దైవీగుణాలు కూడా ఉంటాయి. ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది కదా. ఇది ఈశ్వరీయ విద్యాలయము. భగవంతుడు చదివిస్తున్నారు. ఆత్మాభిమానులుగా కూడా వారే చేయగలరు. ఇతరులెవ్వరికీ ఈ కళ తెలియనే తెలియదు. ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఈ దాదా కూడా పురుషార్థము చేస్తారు. తండ్రి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థము చేయుటకు వారు ఎప్పుడూ శరీరమునే తీసుకోరు. వారు మిమ్ములను ఆత్మాభిమానులుగా చేసేందుకు ఈ సమయములోనే వస్తారు. ఎవరికి బాధ్యత ఉంటుందో వారు ఎలా నిద్రిస్తారు........ అనే సామెత కూడా ఉంది. చాలా వ్యవహారాలు మొదలైనవి ఎక్కువగా ఉంటే సమయము దొరకదు. ఎవరికి సమయము ఉంటుందో వారు పురుషార్థము చేసేందుకు బాబా వద్దకు వస్తారు. కొందరు కొత్తవారు కూడా వస్తారు. ఈ జ్ఞానము చాలా బాగుందని భావిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మీ వికర్మలు వినాశనమౌతాయని గీతలో కూడా చెప్పబడింది. ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఎవ్వరినీ దోషులుగా చేయడం లేదు. మీరు పావనుల నుండి పతితులుగా అవ్వాలని, నేను వచ్చి పతితులను పావనంగా తప్పకుండా చేయాలని తెలుసు. ఇది తయారైన డ్రామా. ఇందులో ఎవ్వరినీ నిందించేది ఉండదు. పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరికీ ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు. కనుక అనాథలుగా, నాస్తికులుగా పిలువబడ్తున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్ములను ఎంత వివేకవంతులుగా చేస్తారు! టీచరు రూపములో శిక్షణ ఇస్తారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనే ఈ శిక్షణ లభించడం వలన మీరు కూడా పరివర్తన అవుతారు. శివాలయంగా ఉండే భారతదేశము ఇప్పుడు వేశ్యాలయంగా అయ్యింది కదా. ఇందులో గ్లాని చేసే మాటేమీ లేదు. ఇది ఆట. దీనిని గురించే తండ్రి వినిపిస్తున్నారు. మీరు దేవతల నుండి అసురులుగా ఎలా అయ్యారో అర్థం చేయిస్తారు. ఎలా అయ్యారు? అని అడగరు. పిల్లలను తన పరిచయాన్ని ఇచ్చేందుకు, సృష్టి చక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానమిచ్చేందుకే తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు తెలుసుకుని మళ్లీ దేవతలుగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువు తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. ఇక్కడ అందరూ మనుష్యులే. టీచరై చదివించేందుకు దేవతలు ఈ సృష్టిలోకి రాలేరు. చదివించే తండ్రి చదివించేందుకు ఎలా వస్తారో చూడండి. పరమపిత పరమాత్మ ఏదైనా రథములో వస్తారని కూడా గాయనముంది. కానీ రథాన్ని ఎలా తీసుకుంటారో పూర్తిగా వ్రాయలేదు. త్రిమూర్తి రహస్యము కూడా ఎవ్వరికీ తెలియదు. పరమపిత అనగా పరమ ఆత్మ. వారు ఎలా ఉన్నారో అలా తమ పరిచయాన్ని తామే ఇస్తారు కదా. అహంకారము ఏ మాత్రమూ లేదు. అర్థము చేసుకోనందున వారికి అహంకారముందని అంటారు. నేను పరమాత్మను అని ఈ బ్రహ్మ చెప్పరు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. ఇది తండ్రి పలికిన మహావాక్యము - సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే. ఇతనిని దాదా అని అంటారు. ఇతను భాగ్యశాలి రథము కదా. బ్రాహ్మణుడు కావాలి కదా కనుకనే బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆది దేవుడు ప్రజాపిత బ్రహ్మ. ప్రజలందరి పిత. అయితే ఏ ప్రజలకు? ప్రజాపిత బ్రహ్మ శరీరధారి కనుక దత్తు తీసుకున్నారు కదా. నేను దత్తు తీసుకోనని శివబాబా పిల్లలకు తెలియజేస్తారు. ఆత్మలైన మీరంతా సదా నా పిల్లలే. నేను మిమ్ములను తయారు చేయను. నేను ఆత్మలైన మీకు అనాది తండ్రిని. తండ్రి ఎంత బాగా అర్థము చేయిస్తారు. అయినా స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మీరు పూర్తి పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. ఈ ప్రపంచము నుండి అందరూ వాపసు వెళ్తారని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. అలాగని సన్యసించి అడవులకు పోవాలని కాదు. పూర్తి ప్రపంచాన్ని సన్యసించి మనము మన ఇంటికి వెళ్ళిపోతాము. అందువలన ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువూ జ్ఞాపకము రాకూడదు. అరవై సంవత్సరాల వయసు వచ్చిందంటే శబ్ధానికి అతీతంగా వానప్రస్థములోకి వెళ్లి పురుషార్థము చేయాలి. వానప్రస్థము అను మాట ఇప్పటిదే. భక్తిమార్గములో వానప్రస్థము గురించి ఎవ్వరికీ తెలియదు. వానప్రస్థానికి అర్థము ఎవ్వరూ చెప్పలేరు. శబ్ధానికి అతీతమని మూలవతనాన్ని అంటారు. ఆత్మలన్నీ అక్కడ నివసిస్తాయి. కనుక అందరిదీ వానప్రస్థ స్థితియే. అందరూ ఇంటికి వెళ్లాలి.
ఆత్మ భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని శాస్త్రాలలో చూపిస్తారు. కొందరు ఆత్మ అంగుష్టాకారములో ఉంటుందని అంటారు. అంగుష్టాకారమునే స్మృతి చేస్తారు. నక్షత్రాన్ని ఎలా స్మృతి చేయాలి? ఎలా పూజించాలి? మీరెప్పుడు దేహాభిమానులుగా అవుతారో అప్పుడు పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి సమయము ప్రారంభమవుతుంది. దానిని భక్తి సంప్రదాయమని అంటారు. జ్ఞాన సంప్రదాయము వేరు. జ్ఞానము - భక్తి కలిసి ఉండవు. రాత్రి పగలు కలిసి ఉండలేవు కదా. పగలు అని సుఖాన్ని, రాత్రి అని దు:ఖమును అంటారు. ప్రజాపిత బ్రహ్మ పగలు, రాత్రి అని అంటారు. కనుక ప్రజలు, బ్రహ్మ ఇరువురూ తప్పకుండా కలిసి ఉంటారు కదా. బ్రాహ్మణులైన మనమే అర్ధకల్పము సుఖాన్ని అనుభవిస్తాము. తర్వాత అర్ధకల్పము దు:ఖముంటుందని మీరు అర్థం చేసుకున్నారు. ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. అందరూ బాబాను స్మృతి చేయలేరని మీకు తెలుసు. అయినా మిమ్ములను ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. మీరు పావనంగా అవుతారని తండ్రి స్వయంగా చెప్తారు. ఈ సందేశాన్ని అందరికీ అందించాలి. సర్వీసు చేయాలి. ఎవరు సర్వీసు చేయరో వారు పుష్పాలుగా అవ్వరు. యజమాని తోటలోకి వచ్చినప్పుడు సేవాధారులుగా అయ్యి అనేకమందికి ఎవరు కళ్యాణము చేస్తారో అలాంటి పుష్పాలే వారి ఎదురుగా ఉండాలి. ఎవరికి దేహాభిమానము ఉంటుందో వారు మేము పుష్పాలుగా అవ్వలేమని స్వయం అర్థం చేసుకుంటారు. బాబా ఎదురుగా మంచి మంచి పుష్పాలు కూర్చుని ఉంటారు. కనుక తండ్రి దృష్టి వారి పై పడ్తుంది. నృత్యము కూడా బాగా నడుస్తుంది. (నృత్యము చేసే అమ్మాయి వలె) మొదటి నెంబరు ఎవరు, రెండవ, మూడవ నెంబరులో ఎవరు అని పాఠశాలలో టీచరుకు కూడా తెలుసు కదా. తండ్రి గమనము కూడా సర్వీసు చేసే పిల్లల వైపుకే పోతుంది. వారు తండ్రి హృదయములో కూడా ఉంటారు. డిస్‌సర్వీస్ చేసేవారు హృదయములో ఉండరు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. అప్పుడు తండ్రి స్మృతి ఉంటుంది అను మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దేహాభిమానముంటే తండ్రి స్మృతి ఉండదు. లౌకిక సంబంధీకుల వైపు, వ్యవహారాల వైపుకు బుద్ధి వెళ్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం వలన పారలౌకిక తండ్రి స్మృతి వస్తుంది. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించుటలోనే శ్రమ ఉంది. ఏకాంతము అవసరము. 7 రోజుల భట్టి కోర్సు చాలా కఠినమైనది. ఎవ్వరి స్మృతీ రాకూడదు. ఎవరికీ జాబులు కూడా వ్రాయరాదు. ఇటువంటి భట్టీ మీరు ప్రారంభములో చేసేవారు. ఇక్కడ అందరినీ ఉంచుకునేందుకు సాధ్యము కాదు. అందువలన ఇంటిలో ఉండి సాధన చేయండని చెప్తారు. భక్తులు కూడా భక్తి కొరకు వేరే గదిని తయారు చేసుకుంటారు. ఆ గదిలో కూర్చుని మాలను తిప్పుతూ ఉంటారు. ఈ స్మృతి యాత్రలో కూడా ఏకాంతము అవసరము. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో మాట్లాడే పని లేదు. ఈ స్మృతి అభ్యాసానికి సమయము చాలా అవసరము.
లౌకిక తండ్రి హద్దులోని సృష్టికర్త. వీరు అనంతమైనవారని మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ అనంతమైనవారు కదా. పిల్లలను దత్తు తీసుకుంటారు. శివబాబా తీసుకోరు. వారికి ఆత్మలందరూ సదా పిల్లలే. మేము ఆత్మలము, శివబాబాకు అనాది పిల్లలమని మీరు చెప్తారు. బ్రహ్మ మిమ్ములను దత్తు తీసుకున్నారు. ప్రతి విషయాన్ని బాగా క్షుణ్ణంగా అర్థము చేసుకోవాలి. తండ్రి పిల్లలకు ప్రతిరోజూ అర్థం చేయిస్తారు. కానీ బాబా! స్మృతి ఉండదు అని పిల్లలంటారు. తండ్రి చెప్తారు - దానికి కొంత సమయము కేటాయించాలి. బొత్తిగా సమయమే ఇవ్వనివారు కూడా కొందరు ఉంటారు. బుద్ధిలో చాలా పనులు ఉంటాయి. స్మృతియాత్ర ఎలా జరుగుతుంది! తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయము ఏమంటే - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని. ఇదే కదా 'మన్మనాభవ!' ఇందులో శ్రమ అవసరము. ఆశీర్వాదాల మాటేమీ లేదు. ఇది చదువు. ఇందులో కృప - ఆశీర్వాదాల మాటే ఉండదు. నేను ఎప్పుడైనా మీ పై చెయ్యి ఉంచి ఆశీర్వదిస్తానా! బేహద్ తండ్రి నుండి బేహద్ ఆస్తి తీసుకుంటున్నామని మీకు తెలుసు. అమరభవ, ఆయుష్మాన్ భవ........ ఇందులో అన్నీ వచ్చేస్తాయి. మీరు సంపూర్ణ ఆయువును పొందుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఈ ఆస్తిని ఏ సాధు సన్యాసులు మొదలైనవారు ఇవ్వలేరు. వారు పుత్రవాన్ భవ!.......... అని ఆశీర్వదిస్తారు. కనుక వీరి కృప వల్లనే సంతానము కలిగిందని మనుష్యులు భావిస్తారు. అంతే. ఎవరికి సంతానము లేదో వారు వెళ్లి సాధు, సన్యాసులకు శిష్యులుగా అవుతారు. జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇది అవ్యభిచారి జ్ఞానము. దీని ప్రాలబ్ధము అర్ధకల్పము కొనసాగుతుంది. తర్వాత అజ్ఞానము. భక్తిని అజ్ఞానమని అంటారు. ప్రతి ఒక్క విషయము ఎంత బాగా అర్థం చేయించబడ్తుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇది వానప్రస్థ స్థితి కనుక బుద్ధి ద్వారా సర్వమూ సన్యసించి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. నేను ఆత్మను......... ఆత్మను,.......... అని ఏకాంతములో కూర్చుని అభ్యాసము చేయాలి.
2. సేవాధారి పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానానికి వశమై డిస్‌సర్వీసు జరిగే ఏ కర్మా చేయరాదు. అనేమంది కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. స్మృతి కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి.
వరదానము :- '' '' పవిత్రత '' అనే వరదానాన్ని నిజీ (స్వంత) సంస్కారంగా చేసుకొని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునే మెహనత ్ ముక్త్ భవ ( శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి ).''
చాలామంది పిల్లలకు పవిత్రతలో కష్టమనిపిస్తుంది. దీని వలన వరదాత అయిన తండ్రి నుండి జన్మతోనే లభించే వరదానాన్ని తీసుకోలేదని ఋజువవుతుంది. వరదానంలో కష్టముండదు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మతో లభించే మొదటి వరదానం ''పవిత్ర భవ, యోగీ భవ.'' ఎలాగైతే జన్మతో వచ్చిన సంస్కారము చాలా పక్కాగా ఉంటుందో, అలా పవిత్రత బ్రాహ్మణుల ఆది సంస్కారము, నిజీ సంస్కారము - ఈ స్మృతి ద్వారా పవిత్రమైన జీవితాన్ని తయారు చేసుకోండి, శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి.
స్లోగన్ :- '' ఎవరిలో అయితే సేవ పై శుద్ధమైన భావన ఉంటుందో, వారే ట్రస్టీలు ''
No comments:
Post a Comment