07-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - సదా ఖుషీగా( సంతోషంగా ) ఉంటే, స్మృతి యాత్ర సహజమైపోతుంది. స్మృతి ద్వారానే 21 జన్మలకు పుణ్యాత్మలుగా అవుతారు. ''
ప్రశ్న :- మీకు అందరికంటే మంచి సేవకులు లేక నౌకర్లు(బానిసలు) ఎవరు ?
జవాబు :- ప్రకృతి బీభత్సాలు లేక సైన్స్ కనుగొనే నూతన ఆవిష్కారాలు. వీటి ద్వారా విశ్వములోని మురికి అంతా శుభ్రమైపోతుంది. ఇవి మీకు అందరికంటే మంచి సేవకులు లేక బానిసలు, శుభ్రము చేయడంలో సహాయపడ్తాయి. ప్రకృతి అంతా మీ అధీనములో ఉంటుంది.
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? యుద్ధ మైదానములో నిలబడి ఉన్నారు. నిజానికి నిలబడిలేరు. మీరు కూర్చుని ఉన్నారు కదా. మీది ఎంతో మంచి సైన్యము. ఈ సైన్యాన్ని ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక సైన్యమని అంటారు. ఆత్మిక తండ్రితో యోగము చేయించి రావణుని పై విజయము పొందేందుకు ఎంతో సులభమైన పురుషార్థము చేయిస్తారు. మిమ్ములను గుప్త సైనికులని, గుప్త మహావీరులని అంటారు. పంచ వికారాల పై మీరు విజయము పొందుతారు. అందులో కూడా మొదటిది దేహాభిమానము. ఈ విశ్వమంతటి పై విజయము పొందేందుకు, విశ్వములో శాంతి స్థాపన చేసేందుకు తండ్రి మీకు ఎంతో సులభమైన యుక్తి తెలిపిస్తున్నారు. ఇది పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు విశ్వములో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దు:ఖము, రోగాలకు నామ-రూపాలు కూడా ఉండవు. ఈ చదువు మిమ్ములను నూతన ప్రపంచానికి అధికారులుగా చేస్తుంది. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, కామము పై విజయము పొందితే మీరు 21 జన్మలకు జగత్‌జీత్‌లుగా అవుతారు. ఇది చాలా సులభము. మీరు శివబాబాగారి ఆత్మిక సైన్యము. రాముని విషయము, కృష్ణుని విషయము కాదు. పరమపిత పరమాత్మను రాముడని అంటారు. వారు చూపించే రాముని సైన్యము మొదలైనవన్నీ తప్పు(రాంగ్). జ్ఞానసూర్యుడు ప్రకటమవుతూనే అజ్ఞానాంధకారము వినాశమవుతుందని మహిమ కూడా ఉంది. కలియుగము గాఢాంధకారము. ఇక్కడ ఎన్నో కొట్లాటలు, జగడాలు, గలాటాలు, కుమ్ములాటలు జరుగుతాయి. సత్యయుగములో ఇవేవీ ఉండవు. మీరు మీ రాజ్యమునెలా స్థాపన చేస్తున్నారో గమనించండి. ఇందులో మీరు చేతులు, కాళ్ళు కదిలించే పనే లేదు. ఇందులో ముఖ్యంగా దేహ భావమును వదిలేయాలి. ఇంట్లో ఉన్నా ఇది గుర్తుంచుకోండి - నేను ఆత్మను, దేహము కాదు. ఆత్మలైన మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని, లీపు యుగమని అంటారు. శిఖరము చిన్నదిగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల శిఖ(పిలక) ప్రసిద్ధి చెందింది. తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్య ప్రాప్తి కొరకు తండ్రి ద్వారా ఈ చదువు చదువుకుంటున్నారు. లక్ష్యము కూడా మీ ముందే ఉంది. శివబాబా ద్వారా మనము ఇలా (లక్ష్మినారాయణులు) తయారవ్వాలి. అవును పిల్లలారా, ఎందుకు అవ్వరు ? కేవలం దేహాభిమానము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. ఈ జన్మలో పావనమైనందున 21 జన్మలు పూణ్యాత్మలుగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత క్రిందికి దిగడం ప్రారంభమౌతుంది. 84 జన్మల చక్రము మనదేనని కూడా మీకు తెలుసు. ప్రపంచములోని వారందరూ ఇందులోకి రారు. 84 జన్మల చక్రమువారు, ఈ ధర్మానికి చెందినవారు మాత్రమే వస్తారు. సత్య, త్రేతా యుగాలను ఆ తండ్రే వచ్చి స్థాపన చేస్తారు. వారు ఇప్పుడు ఈ కర్తవ్యము చేస్తున్నారు. తర్వాత ద్వాపర, కలియుగాలు రావణుడు స్థాపించేవి. రావణుని చిత్రాలు కూడా ఉన్నాయి కదా. రావణుని కిరీటము పై భాగాన గాడిద తల చూపిస్తారు. వికారాల గాడిదగా అవుతారు. మనమెలా ఉండేవారమో ఇప్పుడు మీకు కూడా అర్థమయింది. ఇది పాపాత్మల ప్రపంచము. పాపాత్మల ప్రపంచములో కోట్ల కొలది మనుష్యులున్నారు. పుణ్యాత్మల ప్రపంచ ప్రారంభములో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు మీరు విశ్వమంతటికీ అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు కదా. స్వర్గ చక్రవర్తి పదవినిచ్చేది తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తున్నారు - మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇది మృత్యులోకములోని అంతిమ జన్మ, ఇందులోనే పవిత్రంగా అవ్వాలి. ఈ పాత ప్రపంచ వినాశనము మీ ముందే తయారుగా ఉంది. ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారంటే, ఇంట్లో కూర్చునే సమాప్తము చేసేస్తారు. ఇంట్లో కూర్చునే పాత ప్రపంచాన్ని వినాశనము చేస్తామని అంటారు కూడా. ఇంట్లో కూర్చునే బాంబులు మొదలైనవి ఎలా వదులుతారంటే ప్రపంచమంతా సమాప్తము చేసేస్తారు. పిల్లలైన మీరు ఇంట్లో కూర్చుని యోగబలము ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతారు. మీరు యోగబలముతో శాంతిస్థాపన చేస్తారు. వారు సైన్సు బలముతో ప్రపంచమంతటినీ సమాప్తము చేసేస్తారు. వారు మీ సేవకులు, మీకు సేవ చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని సమాప్తము చేసేస్తారు. ప్రకృతి భీభత్సాలు మొదలైనవన్నీ మీకు బానిసలుగా అవుతాయి. ప్రకృతి అంతా మీకు దాసిగా అవుతుంది. మీరు కేవలం తండ్రితో యోగము చేస్తారు. అందువలన పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? ఈ భారతదేశమే శివాలయంగా ఉండేది. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులుండేవారు. ఇక్కడ అందరూ వికారులే. ఇప్పుడు మీకు స్మృతి కలుగుతూ ఉంది. తండ్రి మనకు ''చెడు వినకు.........'' అని చెప్తారు. చెడు మాటలు వినరాదు, నోటితో కూడా మాట్లాడరాదు అని చెప్తున్నారు. తండ్రి చెప్తున్నారు - మీరెంత మురికివారైపోయారు! మీ వద్ద అపారమైన ధనరాసులుండేవి. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గానికి బదులు నరకానికి అధికారులుగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పిల్లలను నేను రౌరవ నరకము నుండి వెలుపలికి తీసి స్వర్గములోకి తీసుకెళ్తాను. ఆత్మిక పిల్లలూ! మీరు నా మాట వినరా? పరమాత్మ అంటున్నారు - మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అయితే కాలేనిది ఏముంది?
వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఈ యోగబలము ద్వారానే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. అయితే జన్మ-జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు సమయం పడ్తుంది. ప్రారంభము నుండి వచ్చిన పిల్లలు 10 శాతము కూడా యోగము చేయరు. అందుకే పాపాలు నశించవు. కొత్త-కొత్త పిల్లలు వెంటనే యోగులుగా అవుతారు. అందువలన వారి పాపాలు తొలగిపోతాయి. అంతేకాక సేవలో నిమగ్నమౌతారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనము వాపస్ వెళ్లాలి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. పాపాత్మలు శాంతిధామము, సుఖధామానికి వెళ్లలేరు. వారు దు:ఖధామములోనే ఉంటారు. అందుకే బాబా చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. అరే పిల్లలూ! సుగంధభరిత పుష్పాలుగా అవ్వండి. దైవీ కులానికి కళంకము తీసుకు రాకండి. మీరు వికారులైన కారణంగా ఎంతో దు:ఖమును అనుభవిస్తున్నారు. ఇది కూడా తయారైన డ్రామా. పవిత్రంగా అవ్వకుంటే పవిత్ర ప్రపంచమైన స్వర్గములోకి రాలేరు. భారతదేశము స్వర్గంగా ఉండేది, కృష్ణపురములో ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. పిల్లలైన మీరు సంతోషంగా వికారాలను వదలాలి. విషమును తాగడం వెంటనే వదిలేయాలి. విషాన్ని త్రాగుతూ మీరు వైకుంఠానికి వెళ్లలేరు. ఇప్పుడు మీరు ఇలా(లక్ష్మీనారాయణులుగా) అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. వీరు రాజ్యమును ఎలా ప్రాప్తి చేసుకున్నారో మీరు అర్థము చేసుకోగలరు. రాజయోగము ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఇది చదువు కదా. బ్యారిష్టర్ యోగము, సర్జన్ యోగమెలాగో ఇది కూడా అలాంటిదే. అయితే ఇది రాజయోగము. సర్జన్‌తో యోగము(సంబంధము) ఉంటే సర్జన్‌గా అవుతారు. ఇదైతే భగవానువాచ. రథములో ఎలా ప్రవేశిస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో ఇతనిలో కూర్చుని, పిల్లలైన మీకు ఈ జ్ఞానమునిస్తాను. వీరు విశ్వ మాలికులుగా, పవిత్రంగా ఉండేవారని, ఇప్పుడు పతితులుగా, భికారులుగా అయ్యారని మళ్లీ వీరే మొదటి నంబరులో వెళ్తారని నాకు తెలుసు. వీరిలోనే ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. అనంతమైన తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! పవిత్రంగా అయితే మీరు సదా సుఖంగా ఉంటారు. సత్యయుగము అమరలోకము, ద్వాపర-కలియుగాలు మృత్యులోకము. పిల్లలకు ఎంతో బాగా అర్థము చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మాభిమానులుగా అవుతారు. మళ్లీ దేహాభిమానములోకి వచ్చి మాయతో పరాజయము పొందుతారు. ఒక్కసారిగా మురికి కాల్వలో పడునట్లు మాయ ఫిరంగి గుండు తగుల్తుంది. తండ్రి చెప్తున్నారు - ఇది మురికి కాల్వ. ఇది సుఖము కానే కాదు. స్వర్గమంటే ఏది? ఈ దేవతల జీవన పద్ధతి ఎలా ఉందో చూడండి. దాని పేరే స్వర్గము. తండ్రి మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు. ఇంత చెప్తున్నా మళ్లీ విషమును తాగుతామని అంటారు. అందువలన స్వర్గములోకి రాలేరు. శిక్షలు కూడా అనుభవిస్తారు. పిల్లలైన మీకు మాయతో యుద్ధము జరుగుతుంది. దేహాభిమానములోకి వచ్చి చాలా ఛీ-ఛీ(పాడు) పనులు చేస్తూ ఎవ్వరూ చూడలేదనుకుంటారు. క్రోధము, లోభము గుప్తంగా ఉండవు. కామకలాపాలు రహస్యంగా జరుపుతారు. ముఖము నల్లగా చేసుకుంటారు, అలా అవుతూ అవుతూ పవిత్రంగా ఉన్నవారు అపవిత్రంగా అయినందున ప్రపంచము కూడా మిమ్ములనే అనుసరించి మీ వెనుకే వచ్చేసింది. ఇటువంటి పతిత ప్రపంచాన్ని తప్పకుండా పరివర్తన చేయాలి. మీకు సిగ్గు లేదా? ఈ ఒక్క జన్మకు పవిత్రంగా అవ్వలేరా? అని తండ్రి అడుగుతున్నారు.
భగవానువాచ - కామము మహాశత్రువు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవారు. ఎంత ధనవంతులో చెప్పలేము. బాబా! మా నగరానికి రండి అని పిల్లలు అడుగుతారు. ముళ్ల అడవిలో కోతులను చూచేందుకు రమ్మంటారా! పిల్లలైన మీరు డ్రామానుసారము సేవ చేయనే చేయాలి. తండ్రి, కొడుకును ప్రత్యక్షము చేశారనే గాయనముంది. పిల్లలే వెళ్లి అందరి కళ్యాణము చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు యుద్ధ మైదానములో ఉన్నారని మర్చిపోకండి. మీ యుద్ధము 5 వికారాలతో జరుగుతుంది. ఈ జ్ఞానమార్గము పూర్తిగా భిన్నమయ్యింది. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను 21 జన్మలకు స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మళ్లీ మిమ్ములను నరకవాసులుగా ఎవరు చేస్తారు? రావణుడు తేడా అయితే గమనిస్తున్నారు కదా. జన్మ-జన్మాంతరాలు మీరు భక్తిమార్గములో గురువులను ఆశ్రయించారు. ఏమీ లభించలేదు. వీరిని సద్గురువు అని అంటారు. సిక్కులు సద్గురువు అకాలమూర్తి అని అంటారు కదా. వారిని ఎప్పుడూ మృత్యువు కబళించదు. ఆ సద్గురువు కాలులకు కాలుడు. తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీ అందరినీ కాలుని పంజా నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యయుగములో కాలుడు రానే రాడు. దానిని అమరలోకమని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతముననుసరించి అమరలోకమైన, సత్యయుగానికి అధికారులుగా అవుతున్నారు. మీ యుద్ధము ఎటువంటిదో చూస్తున్నారు కదా. ప్రపంచములోని వారంతా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ, జగడాలాడుకుంటూ ఉంటారు. కానీ మీది పంచ వికారాల రావణునితో యుద్ధము. రావణుని పై విజయము పొందుతారు. ఇది అంతిమ జన్మ.
తండ్రి చెప్తున్నారు - నేను పేదల పెన్నిధిని. ఇక్కడకు వచ్చేదే పేదవారు. ధనవంతులకైతే ఇది వారి అదృష్టములోనే లేదు. ధనము నషాలో గర్వముతో ఉంటారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. డ్రామా ప్లాను కదా. వారు తయారుచేసిన బాంబులు మొదలైనవి తప్పకుండా ఉపయోగిస్తారు. పూర్వము యుద్ధాలలో బాణాలు, కత్తులు, తుపాకులు మొదలైనవి ఉపయోగించేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సమాప్తము చేయగల బాంబులు కనుగొన్నారు. ఊరికే ఉంచుకునేందుకు ఇవి తయారు చేయలేదు. ఎన్ని రోజులుంచుకుంటారు. తండ్రి వచ్చారు కనుక వినాశము తప్పకుండా అవ్వాల్సిందే. డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యము తప్పకుండా స్థాపించబడ్తుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడూ యుద్ధము చేయరు. సురాసురుల(అసురుల, దేవతల) యుద్ధము జరిగినట్లు శాస్త్రాలలో చూపించారు. కానీ వారు సత్యయుగములోనివారు, వీరు ఆసురీ కలియుగములోని వారు. యుద్ధము జరిగేందుకు వారు కలిసేదెలా? ఇప్పుడు మనము 5 వికారాలతో యుద్ధము చేస్తున్నామని మీరు తెలుసుకున్నారు. వీటి పై విజయము పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి నిర్వికారి ప్రపంచానికి అధికారులుగా అవుతారు. లేస్తూ, కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయండి. దైవీగుణాలు ధారణ చేయండి. ఇది తయారైన డ్రామా. కొంతమంది అదృష్టములో స్వర్గము లేనే లేదు. యోగబలము ఉంటేనే వికర్మలు వినాశమౌతాయి. సంపూర్ణులుగా అవుతే, సంపూర్ణ ప్రపంచములోకి రాగలరు. తండ్రి కూడా శంఖధ్వని చేస్తూ ఉంటారు. అయితే వారు మళ్లీ భక్తిమార్గములో కూర్చుని శంఖము, మురళి (పిల్లనగ్రోవి) మొదలైనవి తయారు చేశారు. తండ్రి ఈ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఈ చదువును రాజయోగమని అంటారు. ఇది చాలా సులభమైన చదువు. తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించి రాజ్యపదవి తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు బేహద్ సన్యాసులు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తమౌతుందని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో కేవలం భారతదేశము మాత్రమే ఉండేది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ దైవీ కులానికి కళంకము తీసుకొని రారాదు. సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. అనేకాత్మల కళ్యాణము చేసే సేవ చేసి తండ్రిని ప్రత్యక్షము చేయాలి.
2. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు మలిన మాటలు వినరాదు, నోటితో మాట్లాడరాదు. చెడు వినకు, చెడు మాట్లాడకు........ (హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్) దేహాభిమానానికి వశమై ఎలాంటి ఛీ-ఛీ పనులు చేయరాదు.
వరదానము :- '' వైరాగ్య వృత్తి ద్వారా ఈ సారములేని ప్రపంచము నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ ''
రాజఋషులంటే రాజ్యమున్నా అనంతమైన వైరాగ్యము గలవారు. వారికి దేహము, దేహ పాత ప్రపంచములో కొంచెము కూడా లగావ్(ఆకర్షణ) ఉండదు. ఎందుకంటే ఈ పాత ప్రపంచము సారహీన ప్రపంచమని, ఇందులో ఎలాంటి సారము లేదని వారికి తెలుసు. సారహీనమైన ప్రపంచంలో బ్రాహ్మణుల శ్రేష్ఠమైన ప్రపంచము లభించింది. అందువలన ఆ ప్రపంచము పై అనంతమైన వైరాగ్యము అనగా ఎలాంటి ఆకర్షణ ఉండరాదు. ఎవరికైతే దేని పైనా లగావ్, ఝుకావ్ ఉండదో వారిని రాజఋషులని లేక తపస్వీలని అంటారు.
స్లోగన్ :- '' యుక్తియుక్తమైన మాటలంటే మధురంగా, శుభ భావనా సంపన్నంగా ఉండాలి ''
No comments:
Post a Comment