Sunday, October 13, 2019

Telugu Murli 14/10/2019

14-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీకు శక్తి ఇచ్చేందుకు సర్వ శక్తివంతుడైన తండ్రి వచ్చారు. ఎంత స్మృతిలో ఉంటారో అంత శక్తి లభిస్తూ ఉంటుంది.''

ప్రశ్న :- ఈ డ్రామాలో అందరికంటే చాలా మంచి పాత్ర మీది - ఎలా ?
జవాబు :- పిల్లలైన మీరే అనంతమైన తండ్రి వారిగా అవుతారు. భగవంతుడు టీచరై మిమ్ములనే చదివిస్తారు. కనుక మీరు భాగ్యశాలురయ్యారు కదా. విశ్వానికి యజమాని మీ అతిథిగా వచ్చారు. వారు మీ సహయోగముతో విశ్వకళ్యాణము చేస్తారు. పిల్లలైన మీరు పిలిచారు, తండ్రి వచ్చారు.... ఇదే రెండు చేతులతో చప్పట్లు. ఇప్పుడు తండ్రి ద్వారా మీకు పూర్తి విశ్వము పై రాజ్యము చేసే శక్తి లభిస్తుంది.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ముందు కూర్చొని ఉన్నారు. శిక్షకుని ఎదుట కూడా కూర్చుని ఉన్నారు. అంతేకాక ఈ బాబా పిల్లలైన మనలను తీసుకెళ్లేందుకు గురువు రూపములో వచ్చారని కూడా మీకు తెలుసు. తండ్రి కూడా చెప్తారు - ఓ ఆత్మిక పిల్లలారా! నేను మిమ్ములను ఇక్కడి నుండి తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇది పాత ప్రపంచము, ఛీ-ఛీ ప్రపంచమని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా ఛీ-ఛీ గా అయిపోయారు. ఓ పతిత పావన తండ్రీ! మీరు వచ్చి పతితులైన మమ్ములను ఈ దు:ఖధామము నుండి శాంతిధామానికి తీసుకెళ్లండని మీ అంతకు మీరే అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇది మనసులోకి రావాలి. తండ్రి కూడా చెప్తున్నారు - నేను మీరు పిలవడము వలన, మీ ఆహ్వానము పై వచ్చాను. ''రండి! అని మీరు పిలిచేవారు కదా!'' అని తండ్రి గుర్తు చేయిస్తున్నారు. మేము పిలిచామని ఇప్పుడు మీకు జ్ఞాపకము వచ్చింది. డ్రామానుసారము కల్పక్రితము వలె బాబా వచ్చి ఉన్నారు. ప్రపంచములోని వారు ప్రణాళికలు తయారు చేస్తారు కదా. ఇది కూడా శివబాబా ప్రణాళిక. ఈ సమయములో అందరికీ వారి వారి ప్రణాళికలున్నాయి కదా. ఫలానా - ఫలానివి చేస్తామని పంచ వర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. మాటలు చూడండి ఎలా కలుస్తాయో! మొదట ఈ ప్రణాళికలు మొదలైనవి తయారు చేసేవారు కాదు. ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటారు. ఇది మా బాబా ప్రణాళిక అని పిల్లలైన మీకు తెలుసు. డ్రామాప్లాను అనుసారము 5 వేల సంవత్సరాల క్రితము నేను ఈ ప్లాన్‌ తయారు చేశాను. మధుర సంతానమైన మీరు ఇక్కడ చాలా దు:ఖములో ఉన్నారు. వేశ్యాలయములో పడి ఉన్నారు. ఇప్పుడు మిమ్ములను శివాలయములోకి తీసుకెళ్ళేందుకు నేను వచ్చాను. శాంతిధామము నిరాకార శివాలయము. సుఖధామము సాకార శివాలయము. ఈ సమయములో పిల్లలైన మిమ్ములను తండ్రి రిఫ్రెష్‌(తాజా) చేస్తున్నారు. మీరు తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నారు కదా. శివబాబా వచ్చి ఉన్నారని మీ బుద్ధిలో నిశ్చయముంది. బాబా అను శబ్ధము చాలా మధురమైనది. ఆత్మలమైన మనము ఆ తండ్రి సంతానమని మళ్ళీ పాత్రాభినయనము చేసేందుకు ఈ బాబా వారిగా అవుతామని కూడా మీకు తెలుసు. ఎంత సమయము మీకు లౌకిక తండ్రులు లభించారు? సత్యయుగము నుండి సుఖ, దు:ఖముల పాత్రను అభినయించారు. ఇప్పుడు దు:ఖ పాత్ర పూర్తి అవుతుందని, సుఖాల పాత్ర కూడా పూర్తి 21 జన్మలు అభినయించామని మీకు తెలుసు. తర్వాత అర్ధకల్పము దు:ఖ పాత్రను అభినయించాము. బాబా మీకు ఇదంతా స్మృతి తెప్పించి, సరిగ్గా ఇలాగే జరిగింది కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు మళ్లీ అర్ధకల్పము సుఖ పాత్రను అభినయించాలి. ఈ జ్ఞానముతో మీ ఆత్మ సంపన్నంగా అవుతుంది. మళ్లీ ఖాళీ అయిపోతుంది. తండ్రి మళ్లీ సంపన్నంగా(నిండుగా) చేస్తారు. విజయమాల మీ కంఠములో పడి ఉంది. కంఠములో జ్ఞాన మాల ఉంది. మనము ఇలా చక్రములో తిరుగుతూ ఉంటాము. సత్యయుగము, త్రేతా, ద్వాపర, కలియుగాల తర్వాత ఈ మధురమైన సంగమ యుగానికి వస్తాము. దీనిని మధురమైనదని అంటాము. శాంతిధామము మధురమైనదని కాదు. అన్నింటికంటే మధురమైనది పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగము. డ్రామాలో మీది కూడా చాలా మంచి పాత్ర. మీరు ఎంతటి అదృష్టవంతులు! మీరు బేహద్‌ తండ్రివారిగా అవుతారు. వారు వచ్చి పిల్లలైన మిమ్ములను చదివిస్తారు. ఎంత శ్రేష్ఠమైన సహజమైన చదువు! మీరు ఎంత ధనవంతులుగా అవుతారు! ఇందులో శ్రమ చేయవలసిన పని ఏదీ లేదు. డాక్టరు, ఇంజనీరు మొదలైనవారు ఎంత కష్టపడ్తారు. మీకైతే ఆస్తి లభిస్తుంది. తండ్రి సంపాదన పై పిల్లలకు హక్కు ఉంటుంది కదా! మీరు ఇది చదివి 21 జన్మలకు సత్య-సత్యమైన సంపాదన చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసేందుకు అక్కడ మీకు ఏ నష్టమూ కలగదు. దీనినే నిరంతర జపము(అజపాజపము) అని అంటారు.
బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. నేను వచ్చానని తండ్రి కూడా చెప్తున్నారు. రెండు చేతులతో చప్పట్లు మ్రోగుతాయి కదా. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. 5 వికారాల రావణుడు మిమ్ములను పాపాత్మలుగా చేశాడు. మళ్లీ పుణ్యాత్మలుగా కూడా అవ్వాలి. మేము బాబా స్మృతి ద్వారా పవిత్రమై బాబా జతలో ఇంటికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. మళ్లీ ఈ చదువు ద్వారా మనకు శక్తి లభిస్తుంది. ధర్మమే శక్తి అని దేవీ దేవతా ధర్మానికే చెప్తారు. తండ్రి సర్వశక్తివంతులు. కనుక తండ్రి ద్వారా మనకు విశ్వములో శాంతి స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ సామ్రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ తీసుకోలేరు. అంతటి శక్తి లభిస్తుంది. రాజులకు ఎంతటి శక్తి లభిస్తుందో చూడండి. వారికి ఎంతగానో భయపడ్తారు. ఒక రాజుకు అనేకమంది ప్రజలు, సైన్యము మొదలైనవి ఉంటాయి. కానీ అవన్నీ అల్పకాలిక శక్తులు, అయితే ఇక్కడ 21 జన్మల శక్తి. మనకు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా విశ్వము పై రాజ్యపాలన చేసే శక్తి లభిస్తుందని మీకు తెలుసు. ప్రేమ అయితే ఉంటుంది కదా. వాస్తవంలో ఇప్పుడు దేవతలు లేరు. అయినా వారి పై ఎంత ప్రేమ ఉంది! వారు సన్ముఖములో ఉన్నప్పుడు వారి పై ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుంది! స్మృతి యాత్ర ద్వారా ఈ శక్తినంతా తీసుకుంటున్నారు. ఈ మాటలను మర్చిపోండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు చాలా శక్తివంతులుగా అవుతారు. సర్వశక్తివంతులని ఇతరులెవ్వరినీ అనరు. అందరికీ శక్తి లభిస్తుంది. ఈ సయములో ఎవ్వరిలోనూ శక్తి లేదు. అందరూ తమోప్రధానమైపోయారు. మళ్ళీ ఆత్మలందరికీ ఒక్కరి నుండే శక్తి లభిస్తుంది, మళ్లీ తమ రాజధానిలోనికి వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తారు. తమ లెక్కాచారాలను పూర్తి చేసుకొని మళ్లీ ఇలాగే నెంబరువారుగా శక్తివంతులుగా అవుతారు. శక్తివంతులలో మొదటి నంబరువారు ఈ దేవతలు. ఈ లక్ష్మీనారాయణులు పూర్తి విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది. ఎలాగైతే మీ ఆత్మలో ఈ జ్ఞానముందో అలా బాబా ఆత్మలో కూడా పూర్తి జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్నిస్తున్నారు. డ్రామాలో పాత్ర నిండి ఉంది. అది పునరావృతమౌతూ ఉంటుంది. మళ్లీ ఆ పాత్ర 5 వేల సంవత్సరాల తర్వాత పునరావృతమౌతుంది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు సత్యయుగములో రాజ్యము చేస్తారు. అప్పుడు తండ్రి విశ్రాంతి జీవితము(రిటైర్డ్‌ లైఫ్‌)లో ఉంటారు. మళ్లీ స్టేజి పైకి ఎప్పుడు వస్తారు? మీరు దు:ఖములో ఉన్నప్పుడు బాబా రంగ మంటపము పైకి వస్తారు. వారిలో పూర్తి రికార్డు నిండి ఉందని మీకు తెలుసు. ఎంత చిన్న ఆత్మ! దానిలో ఎంత వివేకము ఉంటుంది. తండ్రి వచ్చి ఎంత వివేకాన్నిస్తారు! మళ్లీ అక్కడ సత్యయుగములో ఇదంతా మర్చిపోతారు. సత్యయుగములో మీకు ఈ జ్ఞానము ఉండదు. అక్కడ మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సత్యయుగములో మనమే దేవతలుగా సుఖాన్ని అనుభవిస్తామని కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులమైన మనమే మళ్లీ దేవతలుగా అవుతున్నాము. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఎవరికైనా అర్థము చేయించడంలో చాలా సంతోషముంటుంది కదా. మీరు వారికి ప్రాణ దానాన్నిస్తున్నట్లే అవుతుంది. మృత్యువు వచ్చి అందరినీ తీసుకెళ్తుందని చెప్తారు కదా. మృత్యువు మొదలైనవేవీ లేవు. ఇది తయారైన డ్రామా. నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్లిపోతాను. మళ్లీ రెండవ దానిని తీసుకుంటాను. నన్ను ఏ మృత్యువు కబళించదు అని ఆత్మ చెప్తుంది. ఆత్మకు అనుభవము అవుతుంది కదా. ఆత్మ గర్భములో ఉన్నప్పుడు సాక్షాత్కారాలై దు:ఖాన్ని అనుభవిస్తుంది. లోపల శిక్షలను అనుభవిస్తుంది. కనుకనే దానిని గర్భజైలు అని అంటారు. ఎంత అద్భుతముగా ఈ డ్రామా తయారయ్యింది. గర్భజైలులో శిక్షలను అనుభవిస్తూ తమ సాక్షాత్కారాన్ని చేసుకుంటూ ఉంటారు. శిక్ష ఎందుకు లభిస్తుంది? సాక్షాత్కారము చేయిస్తారు కదా - నియమ విరుద్ధమైన ఈ పనులు చేశావు. ఫలానావారికి దు:ఖాన్నిచ్చావు మొదలైనవన్నీ అక్కడ సాక్షాత్కారమవుతాయి. అయినా వెలుపలికి వచ్చి పాపాత్మలుగా అవుతారు. పాపాలన్నీ ఎలా భస్మమవుతాయి? స్మృతి యాత్ర ద్వారా. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుట ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయని పిల్లలకు తెలియజేయబడింది. మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారీ పిల్లలారా! - మీరు 84 జన్మల ఈ స్వదర్శన చక్రాన్ని త్రిప్పినట్లైతే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయి. చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. ఎవరైతే ఈ జ్ఞానాన్నిచ్చారో వారిని కూడా స్మృతి చేయాలి. బాబా మనలను స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు. తయారు చేస్తారు కానీ ప్రతిరోజూ క్రొత్తవారు వస్తారు కనుక వారిని కూడా రిఫ్రెష్‌ చేయవలసి ఉంటుంది. మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. మనము ఇక్కడికి పాత్ర చేసేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల చక్రములో తిరిగాము. ఇప్పుడు మళ్లీ వాపస్‌ వెళ్లాలి. ఇలా చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారా? పిల్లలు చాలా మర్చిపోతారని బాబాకు తెలుసు. చక్రాన్ని త్రిప్పడంలో ఏ కష్టమూ లేదు. సమయము(ఫుర్సత్‌) చాలా లభిస్తుంది. అంతిమంలో మీకు ఈ స్వదర్శన చక్రధారి స్థితి ఉంటుంది. మీరు ఇలా తయారవ్వాలి. సన్యాసులు ఈ శిక్షణను ఇవ్వలేరు. స్వదర్శన చక్రము గురించి స్వయం గురువులకు కూడా తెలియదు. వారు కేవలం గంగా తీరానికి నడవండి అని చెప్తారు. ఎన్ని స్నానాలు చేస్తారు! చాలా మంది స్నానాలు చేయడం వలన గురువులకు సంపాదన అవుతుంది. క్షణ-క్షణము యాత్రకు వెళ్తారు. ఇప్పుడు ఆ యాత్రకు ఈ యాత్రకు ఎంత వ్యతాసముందో చూడండి. ఈ యాత్ర, ఆ యాత్రలన్నిటిని విడిపించేస్తుంది. ఈ యాత్ర ఎంత సహజమైనది! చక్రాన్ని కూడా త్రిప్పండి. నాలుగు వైపులా తిరిగాము. కానీ ఎల్లప్పుడూ దూరంగానే ఉన్నామని, పాట కూడా ఉంది కదా. బేహద్‌ తండ్రి నుండి దూరంగా ఉండినారు. ఇది మీకు అనుభవమవుతుంది. వారికి ఈ అర్థము తెలియదు. చాలా తిరుగుతూ ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఈ తిరగడం నుండి మీరు ముక్తులైపోయారు. తిరగడం వలన ఎవ్వరూ దగ్గరకు రాలేదు. ఇంకా దూరమవుతూ పోయారు.
ఇప్పుడు డ్రామా ప్లాను అనుసారము అందరినీ జతలో తీసుకెళ్లేందుకు తండ్రే రావలసి ఉంటుంది. మీరు తప్పకుండా నా మతానుసారము నడచుకోవాలి. పవిత్రంగా అవ్వాలని బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడనట్లు ఉండాలి. క్రొత్త ఇల్లు నిర్మాణము పూర్తి అయ్యే వరకు పాత ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. వారసత్వమును ఇచ్చేందుకు తండ్రి సంగమ యుగములోనే వస్తారు. బేహద్‌ తండ్రిది బేహద్‌ ఆస్తి. తండ్రి ఆస్తి మాదేనని పిల్లలకు తెలుసు. ఆ ఖుషీలో ఉంటారు. వారు కూడా సంపాదన చేసుకుంటారు. తండ్రి ఆస్తి కూడా లభిస్తుంది. మీకు వారసత్వమే లభిస్తుంది. అక్కడ మీకు ఈ స్వర్గ వారసత్వము ఎలా లభించిందో తెలియదు. అక్కడ మీ జీవితము చాలా సుఖముగా ఉంటుంది. ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేసి శక్తి తీసుకుంటారు. పాపాలను సమాప్తము చేసే పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని స్మృతి చేయడం వలన, స్వదర్శన చక్రాన్ని త్రిప్పడము వలన మాత్రమే మీ పాపాలు సమాప్తమవుతాయి. దీనిని బాగా గుర్తుంచుకోండి. దీనిని అర్థము చేయిస్తే చాలు. ముందు ముందు మీరు ఎక్కువగా వాదవివాదము చేసే అవసరమే ఉండదు. ఒక్క సంకేతమే చాలు - బేహద్‌ తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మీగా అయ్యేందుకు వస్తారు. ఇది జ్ఞాపకముంది కదా! వేరెవ్వరి బుద్ధికి ఈ విషయాలు తోచవు. మీరు ఇక్కడకు వస్తారు. మేము బాప్‌దాదా వద్దకు కొత్త ప్రపంచము అనగా స్వర్గ వారసత్వమును తీసుకునేందుకు వెళ్తామని మీ బుద్ధిలో ఉంటుంది.
తండ్రి చెప్తున్నారు - '' స్వదర్శన చక్రధారులవ్వడం వలన మీ వికర్మలు వినాశనమైపోతాయి.'' ఇప్పుడు మీ జీవితాన్ని వజ్ర తుల్యముగా ఎవరు చేస్తున్నారో వారిని చూడండి. ఇందులో చూడవలసిన విషయాలేవీ లేవని కూడా మీకు తెలుసు. దీనిని మీరు దివ్యదృష్టి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మయే ఈ శరీరము ద్వారా చదువుతుంది. ఈ జ్ఞానము ఇప్పుడే లభించింది. మనము ఏ కర్మ చేస్తామో అది ఆత్మయే శరీరము తీసుకొని చేస్తుంది. బాబా కూడా చదివించాల్సిందే. వారి పేరు ఎల్లప్పుడూ శివుడే. శరీరము పేర్లు మారిపోతాయి. ఈ శరీరము నాది కాదు. ఇది ఇతని(బ్రహ్మ) ఆస్తి. శరీరము ఆత్మకు ఆస్తి కదా. దీని ద్వారానే పాత్ర చేస్తుంది. ఇది పూర్తి సహజంగా అర్థమయ్యే విషయము. ఆత్మ అందరిలోనూ ఉంది. అందరి శరీరాల పేర్లు వేరు వేరుగా ఉంటాయి. వీరు పరమాత్మ. సుప్రీమ్‌ ఆత్మ, ఉన్నతాతి ఉన్నతమైన వారు. భగవంతుడొక్కడే సృష్టికర్త అని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలినవారంతా పాత్రను అభినయించే రచన. ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు. మొట్టమొదట ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము. ఆత్మలు కొద్దిమంది మాత్రమే ఉంటారు. మళ్లీ సత్యయుగములో ప్రారంభములోనే వచ్చేందుకు చివర్లో యోగ్యులుగా అవుతారు. ఈ సృష్టిచక్రము మాల వంటిది. తిరుగుతూనే ఉంటుంది. మాలను మీరు త్రిప్పినవారు అన్ని మణులు చక్రములో తిరుగుతాయి కదా. సత్యయుగములో భక్తి కొద్దిగా కూడా ఉండదు. తండ్రి అర్థము చేయించారు - హే ఆత్మల్లారా! నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. (మామేకమ్‌ యాద్‌ కరో) మీరు ఇంటికి తప్పకుండా రావాలి. వినాశనము సమీపములోనే ఉంది. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. శిక్షలు అనుభవించడం ద్వారా కూడా ముక్తులైపోతారు. మంచి పదవి కూడా లభిస్తుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. నేను పిల్లలైన మీకు చాలా మంచి, ముఖ్యమైన అతిథిని. నేను పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తాను. పాత విశ్వాన్ని క్రొత్తదిగా చేస్తాను. తండ్రి కల్ప-కల్పము వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని క్రొత్తదిగా చేస్తారని మీకు కూడా తెలుసు. ఈ విశ్వము కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తదిగా అవుతుంది కదా. మీరు ఈ సమయములో చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారు. తండ్రి బుద్ధిలో జ్ఞానముంది. చక్రము ఎలా తిరుగుతుందో వారు వర్ణన చేస్తారు. మీ బుద్ధిలో కూడా చక్రమెలా తిరుగుతుందో ఆ జ్ఞానముంది. బాబా వచ్చి ఉన్నారని, వారి శ్రీమతానుసారము మనము పావనంగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు, తర్వాత ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థము చేయించడము కూడా తప్పనిసరి. పురుషార్థము చేయించేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేయిస్తారు. ఎవరైతే వస్తారో వారికి మీరు 84 జన్మల చక్రము చూపించి అర్థము చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. మంచిది!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసి అనేక ఆత్మలకు ప్రాణ దానమివ్వాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.
2. ఈ మధురమైన సంగమ యుగములో మీ సంపాదనతో పాటు తండ్రి శ్రీమతానుసారము నడిచి వారి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. మీ జీవితాన్ని సదా సుఖమయంగా చేసుకోవాలి.

వరదానము :- '' సంఘటనలో ఉంటూ అందరి స్నేహీలుగా అవుతూ తండ్రిని బుద్ధికి ఆధారంగా చేసుకునే కర్మయోగి భవ ''
కొంతమంది పిల్లలు సంఘటనలో(సమూహంలో) స్నేహీలుగా అయ్యేందుకు బదులు అతీతంగా అయిపోతారు. ఎక్కడైనా ఇరుక్కుపోతామేమో అని భయపడ్తారు, దూరంగా ఉండడమే మంచిదని భావిస్తారు. కానీ అలా కాదు, 21 జన్మలు పరివారంలో ఉండాలి. ఒకవేళ భయపడి దూరంగా ఉంటే ఇది కూడా కర్మ సన్యాసుల సంస్కారమవుతుంది. కర్మయోగులుగా అవ్వాలి, కర్మ సన్యాసులుగా కాదు. సంఘటనలో ఉండండి, అందరి స్నేహీలుగా అవ్వండి, కానీ బుద్ధికి ఆధారంగా ఒక్క తండ్రియే ఉండాలి, ఇతరులెవ్వరూ కాదు. బుద్ధిని ఏ ఇతర ఆత్మ గుణాలు గానీ, విశేషతలు గానీ ఆకర్షించరాదు. అప్పుడు వారిని కర్మయోగి పవిత్ర ఆత్మలని అంటారు.

స్లోగన్‌ :- '' బాప్‌దాదాకు కుడి భుజంగా అవ్వండి, ఎడమ భుజంగా కాదు ''

No comments:

Post a Comment